Arvind Krishna
-
భయం ఎందుకు?
హీరోయిన్ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫియర్’. ఈట హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటుడు అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి, ‘‘పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.. సినిమా విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.‘‘వైవిధ్యమైన సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన చిత్రం ‘ఫియర్’. చీకటి గదిలో భయపడుతూ చూస్తున్న వేదిక స్టిల్‌తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 60కి పైగా అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్ సృష్టించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ. -
గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో ఫిల్మ్ ఇది: అరవింద్ కృష్
అరవింద్ కృష్ణ, మనీష్ గిలాడ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ఆర్తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏ మాస్టర్ పీస్’ మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది. నేను సినిమాలు వదిలేసిన సమయంలో నాలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలని, నన్ను సినిమాలు చేయమని ప్రోత్సహించిన సుకుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఓ సూపర్ హీరో క్యారెక్టర్‌కు మన పురాణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయవచ్చనే ఆలోచనతో ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాను ప్రారంభించాం. కథలో మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నాను. క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నా భార్య జ్యోతి పూర్వజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది’’ అన్నారు సుకు పూర్వజ్. ‘‘ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాను’’ అన్నారు నటుడు–నిర్మాత మనీష్ గిలాడ. హీరోయిన్ జ్యోతి పూర్వజ్, సినిమాటోగ్రాఫర్ శివరామ్ చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాధవ్ మాట్లాడారు. -
మాస్టర్ పీస్
అరవింద్ కృష్ణ, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’. సుకు పూర్వజ్ దర్శకత్వంలో సినిమా బండి ప్రొడక్షన్స్ పై శ్రీకాంత్ కండ్రేగుల నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి విలన్ పాత్రధారి మనీష్ గిలాడా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్. ‘‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ఎ మాస్టర్ పీస్’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: శివరామ్ చరణ్, సంగీతం: ఆశీర్వాద్. -
‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు టెక్ కంపెనీల వార్నింగ్!
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో పలు టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోం) ఉద్యోగుల భవిష్యత్‌కు ప్రమాదకరమని అన్నారు. సీఈవో అరవింద్ కృష్ణ వ్యాఖ్యలపై ఆ సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్పందించారు. ఉద్యోగులు ఆఫీస్ రావాలని తాము పిలవలేదని, రిమోట్ వర్క్ వారి కెరియర్ను మరింత కఠినతరం చేస్తుందని మాత్రమే అన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా మేనేజర్ స్థాయి ఉద్యోగులపై వర్క్ ఫ్రమ్ హోం ప్రతికూల ప్రభావం చూపుతుందని సూచించారు. ‘మీరు రిమోట్ వర్క్ చేస్తే మేనేజర్ బాధ్యతలకు న్యాయం చేయలేరు. ఎందుకంటే మీరు వ్యక్తులను మేనేజ్ చేయోచ్చు. కానీ సిబ్బంది ఏం వర్క్ చేస్తున్నారో చూడాలి. కానీ అది అసాధ్యం కాదు. ఉద్యోగులు వారు ఏం వర్క్ చేస్తున్నారో పర్యవేక్షించాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారు. చదవండి👉 వరల్డ్ వైడ్‌గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా? ప్రతి నిమిషం ఉద్యోగులు ఏం చేస్తున్నారో చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ‘అందరూ నేను చెప్పినట్లే చేయాలి. నా కిందే మీరంతా’ అనే ఈ తరహా నియమాల కింద పనిచేయాల్సిన అవసరం లేదని అరవింద్ కృష్ణ అన్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తిపలికి ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చిన టెక్ కంపెనీల్లో ఐబీఏం మాత్రమే కాదు. గతంలో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తమ సహోద్యోగులతో కలిసి పని చేయడానికి మరిన్ని అవకాశాలను గుర్తించాలే ప్రోత్సహించాలి. ఇంట్లో ఉండి పనిచేసే వారికంటే ఆఫీస్‌కి (మెటా) వచ్చి పనిచేస్తున్న వారే మెరుగైన పనితీరును కనబరుస్తున్నారు. ఇదే అంశం కంపెనీ పనితీరుపై తయారు చేసిన డేటా చూపిస్తోందని జుకర్‌బర్గ్ నొక్కిచెప్పారు. సంస్థలోని ఇంజనీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచర ఉద్యోగులతో కలిసి పనిచేనప్పుడు సగటున మెరుగైన పనితీరు కనబరుస్తారని కూడా ఈ విశ్లేషణ చూపిస్తుందని’ జుకర్ బర్గ్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో ప్రస్తావించారు. చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
వేలాది ఉద్యోగాలకు ఏఐ ముప్పు: ఐబీఎం షాకింగ్ న్యూస్
న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఉద్యోగాలకు ముప్పు తెస్తుందన్న ఆందోళనల మధ్య ఉద్యోగాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.దాదాపు 7,800 ఉద్యోగాలనుఏఐతో భర్తీ చేసే అంశాన్నిపరిశీలిస్తున్నట్లు ప్రకటించింది. ఏఐ బాట్ ద్వారా నిర్వహించవచ్చని భావిస్తున్న ఉద్యోగాల్లో కంపెనీ హైరింగ్‌ను నిలిపి వేయనుందని ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరవింద్ కృష్ణ ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇదీ చదవండి: మెట్‌గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు! బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, హెచ్ఆర్ వంటి బ్యాక్-ఆఫీస్ ఫంక్షన్లలో నియామకాల్లోమందగమనం చూడవచ్చని ఐబీఎం సీఈవో చెప్పారు. అత్యంత వేగంగా పెరుగుతున్న ఏఐలో రాబోయే ఐదేళ్ల కాలంలో కంపెనీలోని చాలావరకు ఉద్యోగాలకు బదులుగా ఏఐని వాడాలని కంపెనీ భావిస్తోంది. అరవింద్ కృష్ణ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాబోయే ఐదేళ్లలో 30 శాతం మంది శ్రామిక శక్తిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ ద్వారా భర్తీ చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఆయా సంబంధిత ఉద్యోగాల నియామకాలను నిలిపివేయనుంది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) ముఖ్యంగా ఆర్థికమాంద్యం, ఖర్చుల నియంత్రణలో భాగంగా ఈ ఏడాది జనవరిలో 4 వేల ఉద్యోగాలను, కొన్ని వ్యాపార విభాగాలను తొలగించింది. మరోవైపు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 7 వేల మంది కొత్త నియామకాలు కూడా ఉన్నాయని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐబీఎంలో దాదాపు 2.6 లక్షల మంది ఉద్యోగులున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్) -
భారతీయ టెక్కీలకు గుడ్‌న్యూస్..!
న్యూఢిల్లీ: అమెరికన్ టెక్ దిగ్గజం ఐబీఎం..కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటైజేషన్ ప్రక్రియలో భాగం కావాలని భావిస్తోంది. భారత్‌లో మరిన్ని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. కంపెనీ చైర్మన్ అరవింద్ కృష్ణ ఈ విషయాలు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా కృష్ణ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్లతో ఆయన భేటీ అయ్యారు. ప్రభుత్వంతో కలిసి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. త్వరలో మరిన్ని రానున్నాయని వివరించారు. చదవండి: దేశీయంగా యాపిల్ విస్తరణ..10 లక్షల ఉద్యోగాలు టార్గెట్ -
ఇక రెండుగా ఐబీఎం..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఐబీఎం తన వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించనుంది. ఇందులో భాగంగా మేనేజ్డ్ ఇన్ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఇకపై ఐబీఎం పూర్తిగా హైబ్రీడ్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వ్యాపారాలపై దృష్టి పెట్టనుండగా, రెండో సంస్థ సర్వీస్ డెలివరీ, ఆటోమేషన్ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 2021 ఆఖరు నాటికి పూర్తి కావచ్చని అంచనా. తాత్కాలికంగా ’న్యూకో’ పేరుతో వ్యవహరిస్తున్న ఇన్ఫ్రా సేవల విభాగానికి భారత్‌లోని ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని బదలాయించనున్నట్లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. 2019 ఆఖరు నాటికి ఐబీఎంలో మొత్తం 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశాలవారీగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ.. భారత్‌లో సుమారు 1 లక్ష పైచిలుకు సిబ్బంది ఉంటారని అంచనా. -
యవ్వనం ప్రమాదమే..!
యవ్వనం...చాలా కలలు, కోరికలు మనసులో అల్లుకునే దశ. ఈ దశలో జీవితం గాడి తప్పితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో తెలిపే చిత్రం ‘యవ్వనం ఒక ఫ్యాంటసీ’. అరవింద్‌కృష్ణ, సుబ్ర అయ్యప్ప జంటగా ప్రసాద్ నీలమ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవన్ థామస్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని దర్శకుడు వీరశంకర్ ఆవిష్కరించారు. అరవింద్ కృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రసాద్ గారు తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే సినిమాగా తీస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా మంది జీవితాలకు కనెక్ట్ అయ్యే చిత్రం ఇది’’ అని చెప్పారు. ‘‘ఓ మంచి సినిమాను తీయాలన్న కోరికతో ఈ సినిమా తీశాను. రెండున్నర గంటల సేపు కుటుంబంతో హాయిగా చూడచ్చు’’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని, రాజ్ కందుకూరి, శుబ్ర అయ్యప్ప, ముకుంద్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
మన కుర్రాళ్ళే మూవీ స్టిల్స్
-
ప్రతి ప్రయత్నం కొత్తగానే...
‘‘సగటు ప్రేక్షకునికి చేరువయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించాను. సందేశంతో కూడిన సమస్యాత్మక కథాంశమిది’’ అని దర్శకుడు వీరశంకర్ అన్నారు. ఆయన దర్శకత్వంలో అరవింద్ కృష్ణ, రాజ్కల్యాణ్, రచన మల్హోత్రా, శ్రుతీరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. బీవీఎస్ శ్రీనివాస్, హరూన్ హెచ్.ఎస్ ఈ చిత్రానికి నిర్మాతలు. రాజ్, గురుకిరణ్, జి.కె, మనోమూర్తి, శివ కాకాని, మోహన్ జోహ్న, బీమ్స్, పవన్‌కుమార్, సాయిరామ్ మద్దూరి కలిసి స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బిగ్ సీడీని దర్శకుడు మారుతి, పాటల సీడీని నటుడు కృష్ణుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీరశంకర్ మాట్లాడుతూ,‘‘సమాజంలో ఎదురవుతున్న సంఘటనలు, ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నేపథ్యంలో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది. చిన్న సినిమాల్లో పెద్ద సినిమా ఇది. ఎందుకంటే... కథకు తగ్గట్టు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. నేటి సమాజంలో ఇలాంటి సినిమా రావాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ, వీరశంకర్ చేసే ప్రతి ప్రయత్నం కొత్తగానే ఉంటుందనీ అతిథిగా విచ్చేసిన దర్శకుడు శివనాగేశ్వరరావు చెప్పారు. యువతకు వినోదంతో పాటు సందేశాన్ని కూడా అందించే సినిమా ఇదని మారుతి అన్నారు. యూనిట్ సభ్యులతో పాటు దర్శకులు రామ్‌ప్రసాద్, దేవీప్రసాద్, వీఎన్ ఆదిత్య, సాయి రాజేశ్, విమర్శకులు మహేశ్ కత్తి, మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
అడవి కాచిన వెన్నెల మూవీ పోస్టర్స్
-
హాలీవుడ్ తరహాలో...
అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్, బేబి అక్కి ముఖ్య తారలుగా మూన్లైట్ డ్రీమ్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాథరెడ్డి రూపొందించిన చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రం కొత్త జానర్లో ఉంటుందని విశ్వనాథరెడ్డి తెలిపారు. వచ్చే నెల ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత మాట్లాడుతూ- ‘‘కొత్త కథ, కథనంతో రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా టైటిల్ వినగానే అదో తరహా సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇది పాజిటివ్ సినిమా. క్లయిమాక్స్ కూడా పాజిటివ్‌గానే ఉంటుంది. ఆద్యంతం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయాలనే లక్ష్యంతో చేశాం. కథ, కథనం, మాటలు, పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అరవింద్‌కృష్ణ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే హాలీవుడ్ సినిమాల తరహాలో సాగే అచ్చ తెలుగు సినిమా’’ అన్నారు. -
అడవి కాచిన వెన్నెల మూవీ స్టిల్స్
-
సమాజానికి పనికొచ్చే సినిమా ఇది
‘‘మన చుట్టూ ఉన్న సమాజం, అక్కడ జరుగుతున్న సంఘటనలు, ప్రజల కష్టాల నేపథ్యంలో సినిమా తీయాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది. సమాజానికి పనికొచ్చే సినిమా ఇది. ప్రేక్షకులు ప్రభావితమయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు వీరశంకర్ చెప్పారు. అరవింద్ కృష్ణ, రాజ్కల్యాణ్, కృష్ణుడు, వెంకట్, రచనా మల్హోత్ర ముఖ్యతారలుగా బీవీఎస్ శ్రీనివాస్, హరూన్.హెచ్ఎస్ నిర్మించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు. వెబ్‌సైట్‌ను ఎస్.పి.రామ్మోహన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను దర్శకుడు శివనాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ -‘‘వీరశంకర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలి’’ అని ఆకాంక్షించారు. సొంత ఊరి కోసం కొంతమంది కుర్రాళ్లు ఏం చేశారన్నదే ఈ సినిమా అని శివనాగేశ్వరరావు చెప్పారు. టైటిల్ చాలా బావుందని దేవీప్రసాద్ పేర్కొన్నారు. ముజీర్ కెమెరా పనితనం, వికర్ణ సంభాషణలు ప్లస్ అవుతాయని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి, రామ్‌ప్రసాద్, త్రిపురనేని చిట్టి, రాంబాబు తదితరులు మాట్లాడారు. -
అచ్చతెనుగు ‘అడవి కాచిన వెన్నెల’
అరవింద్‌కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ ముఖ్య తారలుగా స్వీయదర్శకత్వంలో అక్కి విశ్వనాధరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘అడవి కాచిన వెన్నెల’. ఆదివారం ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఎ.రమేష్‌ప్రసాద్ ఆవిష్కరించి, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందజేశారు. విశ్వనాధరెడ్డి మాట్లాడుతూ - ‘‘టైటిల్ వినగానే ఇది అదో తరహా సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ, ఇది నెగటివ్ సినిమా కాదు. పాజిటివ్‌గా సాగడంతో పాటు క్లయిమాక్స్ కూడా పాజిటివ్‌గా ఉంటుంది. కొత్త కథ, కథనంతో రూపొందిస్తున్నాం. జనవరిలో సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. హాలీవుడ్ చిత్రంలో నటించినట్లపించిందని మీనాక్షి అన్నారు. హౌస్‌వైఫ్‌గా నటించానని పూజా చెప్పారు. అరవింద్‌కృష్ణ చెబుతూ-‘‘దర్శకుడు చెప్పిన కథ అద్భుతం అనిపించింది. ఇందులో గొప్ప డైలాగులున్నాయి. అచ్చ తెలుగు టైటిల్‌తో రూపొందిన అసలు సిసలైన తెలుగు సినిమా ఇది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ రోడ్రిగ్యుజ్, డా. జోశ్యభట్ల, పాటలు: సిరివెన్నెల. -
బిస్కెట్ ఎవరు వేశారు?
‘‘ఒక దర్శకుడికి దర్శకత్వంతో పాటు సంగీతం మీద కూడా అవగాహన ఉండటం విశేషం. పాటలన్నీ బాగున్నాయి’’ అన్నారు రాష్ట్ర మంత్రి డీకే అరుణ అన్నారు. అరవింద్ కృష్ణ, డింపుల్‌చోపడే జంటగా గోదావరి ప్రొడక్షన్స్, డ్రీమ్స్ దీపక్‌రాజ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బిస్కెట్’. రాజ్, స్రవంతి నిర్మాతలు. అనిల్ గోపీరెడ్డి దర్శకత్వం వహించి, పాటలు స్వరపరిచారు. ఆడియో సీడీని డీకే అరుణ విడుదల చేసి, దర్శకుడు వీరభద్రంకు ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని ‘దిల్’ రాజు ఆవిష్కరించారు. ఈ వేడుకలో బసిరెడ్డి కూడా పాల్గొన్నారు. అరవింద్‌కృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో బిస్కెట్ వేస్తుంటారు. లేకపోతే ఇతరులు వేసే బిస్కెట్‌కి పడిపోతుంటారు. ఈ చిత్రంలో ఎవరు ఎవరికి బిస్కెట్ వేశారన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. -
అరవింద్‌కృష్ణ యాక్షన్.
అరవింద్‌కృష్ణ కథానాయకునిగా ఓ చిత్రం రూపొందుతోంది. అవంతిక, జాహ్నవి కథానాయికలు. భార్గవ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఎం.రంగారావు నిర్మాత. ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి రమణరాజు కెమెరా స్విచాన్ చేయగా, నిర్మాత రంగారావు క్లాప్ ఇచ్చారు. కాశీ విశ్వనాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటివరకూ చేయని మాస్ పాత్రను ఇందులో చేస్తున్నానని, కళాశాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అరవింద్‌కృష్ణ చెప్పారు. ‘‘నాగరాజు సాహిత్యం ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ నెల 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మూడు షెడ్యూళ్లను హైదరాబాద్ పరిసరాల్లో 45 రోజుల్లో పూర్తి చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మధునందన్, బెనర్జీ, రవిబాబు, కాశీవిశ్వనాథ్, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, కార్తీక్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: రాజ్ ఉండ్రమట్ల, సంగీతం: మైఖేల్ మక్కల్, కూర్పు: ధర్మేంద్ర, కళ: రాము.