వీవీ వినాయక్
సమాజానికి పనికొచ్చే సినిమా ఇది
Published Mon, Feb 17 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:48 AM
‘‘మన చుట్టూ ఉన్న సమాజం, అక్కడ జరుగుతున్న సంఘటనలు, ప్రజల కష్టాల నేపథ్యంలో సినిమా తీయాలన్న నా కల ఇప్పటికి నెరవేరింది. సమాజానికి పనికొచ్చే సినిమా ఇది. ప్రేక్షకులు ప్రభావితమయ్యే అంశాలు ఇందులో చాలా ఉన్నాయి’’ అని దర్శకుడు వీరశంకర్ చెప్పారు. అరవింద్ కృష్ణ, రాజ్‌కల్యాణ్, కృష్ణుడు, వెంకట్, రచనా మల్హోత్ర ముఖ్యతారలుగా బీవీఎస్ శ్రీనివాస్, హరూన్.హెచ్‌ఎస్ నిర్మించిన చిత్రం ‘మన కుర్రాళ్లే’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు వీవీ వినాయక్ ఆవిష్కరించారు.
వెబ్‌సైట్‌ను ఎస్.పి.రామ్మోహన్, ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను దర్శకుడు శివనాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ -‘‘వీరశంకర్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలి’’ అని ఆకాంక్షించారు. సొంత ఊరి కోసం కొంతమంది కుర్రాళ్లు ఏం చేశారన్నదే ఈ సినిమా అని శివనాగేశ్వరరావు చెప్పారు. టైటిల్ చాలా బావుందని దేవీప్రసాద్ పేర్కొన్నారు. ముజీర్ కెమెరా పనితనం, వికర్ణ సంభాషణలు ప్లస్ అవుతాయని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతి, రామ్‌ప్రసాద్, త్రిపురనేని చిట్టి, రాంబాబు తదితరులు మాట్లాడారు.
Advertisement