భయం ఎందుకు? | Vedhika Suspense Thriller Fear First Look Poster Released by Star Director and Choreographer Prabhu Deva | Sakshi
Sakshi News home page

భయం ఎందుకు?

Published Sun, Sep 15 2024 12:50 AM | Last Updated on Sun, Sep 15 2024 12:50 AM

Vedhika Suspense Thriller Fear First Look Poster Released by Star Director and Choreographer Prabhu Deva

హీరోయిన్‌ వేదిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఫియర్‌’. ఈట హరిత గోగినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటుడు అరవింద్‌ కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై ఏఆర్‌ అభి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను నటుడు, డైరెక్టర్, కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా సోషల్‌ మీడియా వేదికగా రిలీజ్‌ చేసి, ‘‘పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది.. సినిమా విజయం సాధించాలి’’ అని ఆకాంక్షించారు.

‘‘వైవిధ్యమైన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రం ‘ఫియర్‌’. చీకటి గదిలో భయపడుతూ చూస్తున్న వేదిక స్టిల్‌తో డిజైన్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై 60కి పైగా అవార్డులను సొంతం చేసుకుని రికార్డ్‌ సృష్టించింది. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్‌ చేయనున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సంగీతం: అనూప్‌ రూబెన్స్, కెమెరా: ఐ ఆండ్రూ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement