యవ్వనం ప్రమాదమే..! | Shubra Aiyappa At Yavvanam Oka Fantasy Audio Launchd | Sakshi
Sakshi News home page

యవ్వనం ప్రమాదమే..!

Published Tue, Apr 14 2015 10:21 PM | Last Updated on Sun, Sep 3 2017 12:18 AM

యవ్వనం ప్రమాదమే..!

యవ్వనం ప్రమాదమే..!

యవ్వనం...చాలా కలలు, కోరికలు మనసులో అల్లుకునే దశ. ఈ దశలో జీవితం గాడి తప్పితే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో తెలిపే చిత్రం ‘యవ్వనం ఒక ఫ్యాంటసీ’. అరవింద్‌కృష్ణ, సుబ్ర అయ్యప్ప జంటగా ప్రసాద్ నీలమ్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవన్ థామస్ స్వరాలందించిన ఈ సినిమా పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని దర్శకుడు వీరశంకర్ ఆవిష్కరించారు.
 
 అరవింద్ కృష్ణ మాట్లాడుతూ -‘‘ప్రసాద్ గారు తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే సినిమాగా తీస్తున్నారని నాకు ఇప్పుడే తెలిసింది. చాలా మంది జీవితాలకు కనెక్ట్ అయ్యే చిత్రం ఇది’’ అని చెప్పారు. ‘‘ఓ మంచి సినిమాను తీయాలన్న కోరికతో ఈ సినిమా తీశాను. రెండున్నర గంటల సేపు కుటుంబంతో హాయిగా చూడచ్చు’’ అని దర్శకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ మలినేని, రాజ్ కందుకూరి, శుబ్ర అయ్యప్ప, ముకుంద్ పాండే తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement