గర్వంగా చెప్పుకునే సూపర్‌ హీరో ఫిల్మ్‌ ఇది: అరవింద్‌ కృష్ Hero Arvind Krishna about A masterpiece movie at the teaser launch event. Sakshi
Sakshi News home page

గర్వంగా చెప్పుకునే సూపర్‌ హీరో ఫిల్మ్‌ ఇది: అరవింద్‌ కృష్

Jun 8 2024 11:39 AM | Updated on Jun 8 2024 12:04 PM

Hero Arvind Krishna Talk About A Masterpiece

అరవింద్‌ కృష్ణ, మనీష్‌ గిలాడ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్‌ రోల్స్‌లో సుకు పూర్వజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్‌ పీస్‌’. ఫిల్మ్‌ ప్రొడక్షన్‌ స్టూడియో మెర్జ్‌ ఎక్స్‌ఆర్‌తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ కండ్రేగుల, మనీష్‌ గిలాడ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అరవింద్‌ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏ మాస్టర్‌ పీస్‌’ మనం గర్వంగా చెప్పుకునే సూపర్‌ హీరో మూవీ అవుతుంది. నేను సినిమాలు వదిలేసిన సమయంలో నాలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలని, నన్ను సినిమాలు చేయమని  ప్రోత్సహించిన సుకుకు థ్యాంక్స్‌’’ అన్నారు. 

‘‘ఓ సూపర్‌ హీరో క్యారెక్టర్‌కు మన పురాణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్‌ సూపర్‌ హీరో ఫిల్మ్‌ చేయవచ్చనే ఆలోచనతో ‘ఏ మాస్టర్‌ పీస్‌’ సినిమాను ప్రారంభించాం. కథలో మైథాలజీని, సైన్స్‌ ఫిక్షన్‌ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. 

ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నాను. క్లైమాక్స్‌ మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ సినిమాలో నా భార్య జ్యోతి పూర్వజ్‌ ఇంపార్టెంట్‌ రోల్‌  చేస్తోంది’’ అన్నారు సుకు పూర్వజ్‌. ‘‘ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాను’’ అన్నారు నటుడు–నిర్మాత మనీష్‌ గిలాడ. హీరోయిన్‌ జ్యోతి పూర్వజ్, సినిమాటోగ్రాఫర్‌ శివరామ్‌ చరణ్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ మాధవ్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement