A Masterpiece movie
-
గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో ఫిల్మ్ ఇది: అరవింద్ కృష్
అరవింద్ కృష్ణ, మనీష్ గిలాడ, జ్యోతి పూర్వజ్, అషు రెడ్డి లీడ్ రోల్స్‌లో సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. ఫిల్మ్ ప్రొడక్షన్ స్టూడియో మెర్జ్ ఎక్స్ఆర్తో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘ఏ మాస్టర్ పీస్’ మనం గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది. నేను సినిమాలు వదిలేసిన సమయంలో నాలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలని, నన్ను సినిమాలు చేయమని ప్రోత్సహించిన సుకుకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘ఓ సూపర్ హీరో క్యారెక్టర్‌కు మన పురాణాల నేపథ్యాన్ని జోడిస్తే మన నేటివ్ సూపర్ హీరో ఫిల్మ్ చేయవచ్చనే ఆలోచనతో ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాను ప్రారంభించాం. కథలో మైథాలజీని, సైన్స్ ఫిక్షన్‌ను కలిపేందుకు శివుడి పాత్రను సంధానంగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నాను. క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాలో నా భార్య జ్యోతి పూర్వజ్ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది’’ అన్నారు సుకు పూర్వజ్. ‘‘ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాను’’ అన్నారు నటుడు–నిర్మాత మనీష్ గిలాడ. హీరోయిన్ జ్యోతి పూర్వజ్, సినిమాటోగ్రాఫర్ శివరామ్ చరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాధవ్ మాట్లాడారు. -
ఈ సినిమాతో టాలీవుడ్ నాకు మెట్టినిల్లు అయిపోయింది: జ్యోతి రాయ్
టాలీవుడ్ యాక్టర్ అరవింద్ కృష్ణ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'ఏ మాస్టర్ పీస్'. సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు సూపర్ హీరోగా వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫస్ట్‌లుక్ ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో అషురెడ్డి, స్నేహా గుప్త హీరోయిన్లుగా ఉన్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదలైంది. ఇందులో మరో ప్రధాన హీరోయిన్గా జ్యోతిరాయ్ ఎంట్రీ ఇస్తుంది.గుప్పెడంత మనసు సీరియల్‌తో బుల్లితెర ద్వారా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ జ్యోతిరాయ్. ఇప్పుడు ఆమె వెండితెరపై తన గ్లామర్ లుక్‌తో ఎంట్రీ ఇస్తుంది. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంపై జ్యోతి రాయ్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తన పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుందని ఆమె పేర్కొంది. డైరెక్టర్ సుకుతో తన వివాహం జరిగిందని ఆమె తెలిపింది. ఆ సమయం నుంచే టాలీవుడ్ తన మెట్టినిల్లు అయిపోయిందని ఈ కన్నడ బ్యూటీ పేర్కొంది. 'ఏ మాస్టర్ పీస్' చిత్రానికి డైరెక్టర్ కూడా సుకు పూర్వజ్ కావడం విశేషం. ఇక నుంచి తెలుగులో సినిమాలు చేయడం కొనసాగిస్తానని జ్యోతి రాయ్ తెలిపింది.భారతీయ పురణాల నేపథ్యాన్ని జోడించి ఏ మాస్టర్ పీస్ సినిమా తెరకెక్కించినట్లు డైరెక్టర్ సుకు తెలిపాడు. భాగవతంలోని జయ, విజయుల పాత్రల ఆధారంగా చేసుకుని హీరో, విలన్ పాత్రలను డిజైన్ చేసినట్లు ఆయన చెప్పాడు. చిన్న ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఏ మాస్టర్ పీస్ ఫైనల్లగా భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందినట్లు ఆయన తెలిపాడు. -
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ మూవీగా ‘ఏ మాస్టర్ పీస్’
మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సుకు పూర్వజ్. ఆయన తెరకెక్కిస్తున్న మరో చిత్రం ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్ , ఆషు రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో మెర్జ్ ఎక్స్ ఆర్ భాగస్వామి అయ్యింది. ఈ సంస్థతో కలిసి సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీకాంత్ కండ్రేగుల "ఏ మాస్టర్ పీస్" సినిమాను నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ మేకర్స్ ఈ అనౌన్స్ మెంట్ చేశారు. ఏ మాస్టర్ పీస్ సినిమా మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలిసిన ఒక న్యూ కాన్సెప్ట్ సూపర్ హీరో మూవీ ఎక్సీపిరియన్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందించబోతోంది. అద్భుతమైన విజువల్స్, భారీ మేకింగ్, విజువల్ ఎఫెక్టులతో "ఏ మాస్టర్ పీస్" సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా భారీ క్లైమాక్స్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హై స్టాండర్డ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ గా "ఏ మాస్టర్ పీస్" ఉండబోతోంది.