టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు! | Meta Mass Layoffs Fire Over 3000 Employees | Sakshi
Sakshi News home page

టెక్ కంపెనీ భారీ లేఆఫ్స్: ఒకేసారి 3000 మంది బయటకు!

Published Sat, Feb 8 2025 6:35 PM | Last Updated on Sat, Feb 8 2025 7:34 PM

Meta Mass Layoffs Fire Over 3000 Employees

ఇన్ఫోసిస్ కంపెనీ ఫ్రెషర్లను తొలగించిన వార్తలు ఇంకా మార్చచిపోక ముందే.. టెక్ దిగ్గజం మెటా (Meta) భారీగా ఉద్యోగులను తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఇంతకీ మెటా ఎందుకు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది? ఎంతమందిని తొలగించనుంది? అనే విషయాలను వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫేస్‌బుక్ , ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీల మాతృ సంస్థ మెటా, ఫిబ్రవరి 10 (సోమవారం) నుంచి ప్రపంచవ్యాప్తంగా తొలగింపులను నిర్వహించనున్నట్లు సమాచారం. అదే రోజు అమెరికాతో సహా చాలా దేశాలలో సోమవారం స్థానిక సమయం ఉదయం 5 గంటల నుంచి ఉద్యోగాలు కోల్పోయే ఉద్యోగులకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది..

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్‌లోని ఉద్యోగులకు స్థానిక నిబంధనల కారణంగా కోతల నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే యూరప్, ఆసియా, ఆఫ్రికా అంతటా సుమారు 12 దేశాల్లో ఉద్యోగుల తొలగింపు ఉండనుంది. కంపెనీ తొలగింపు ప్రక్రియ కింది సుమారు 3600 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం.

పనితీరు సరిగ్గా లేని ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా ఇప్పటికే వెల్లడించింది. ఇప్పుడు చెప్పినట్లుగానే తొలగింపులకు శ్రీకారం చుట్టింది. అయితే కంపెనీ ఏ విభాగంలో ఎంతమంది ఉద్యోగులను తొలగించనుంది అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు: ఎక్కడో తెలుసా?

సెప్టెంబర్ 2024 నాటికి సుమారు 72,000 మందికి ఉపాధి కల్పించిన మెటా, ఉద్యోగుల తొలగింపు మొదలు పెడితే ఆ ప్రభావము 5 శాతం లేదా సుమారు 3600 మంది మీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. లేఆఫ్స్‌ కారణంతో ఉద్యోగాలు కోల్పోయేవారికి సెవెరెన్స్ ప్యాకేజీ అందిస్తామని జూకర్ బర్గ్ ఇప్పటికే హామీ ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement