![Bride Family Cancels Marriage For Groom Poor CIBIL Score In Maharashtra](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/marriage-cacel.jpg.webp?itok=H_HvlL2M)
సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ క్యాన్సిల్ చేసే బ్యాంక్స్ గురించి విని ఉంటారు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటన గురించి ఎక్కడైనా విన్నారా? అయితే ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే..
ఒకప్పుడు పెళ్లి చేయాలంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు కాలం మారింది. అబ్బాయి ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి చూస్తున్నారు. అయితే తాజాగా వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌లో ఒక వధువు కుటుంబం ఏకంగా వివాహాన్నే రద్దు చేసింది.
మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన యువతికి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిర్చయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ పెళ్ళి జరగటానికి కొన్ని రోజుల ముందు, వధువు మేనమామ.. వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయాలని పట్టుబట్టాడు. ఇక చేసేదేమీ లేక సిబిల్ స్కోర్ చేసారు.
సిబిల్ స్కోర్ చెక్ చేస్తే.. ఆ యువకుడు అనేక బ్యాంకుల నుంచో లోన్స్ తీసుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అతని సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉందని గుర్తించారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో యువకుడు.. అమ్మాయికి ఆర్ధిక భద్రతను ఎలా కల్పిస్తాడు? అనే ప్రశ్న లేవనెత్తారు. చివరకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/cibil.jpg)
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇలా అయితే ఇక అబ్బాయిలకు పెళ్లి అయినట్టే అని చెబుతుంటే.. ఇంకొందరు అమ్మాయి కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. ఆ మాత్రం జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?
సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు.
ఇదీ చదవండి: ఐఆర్‌సీటీసీ టికెట్ ధరలలో తేడా: రైల్వే మంత్రి సమాధానమిదే..
సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment