Goldman Sachs
-
వొడాఫోన్‌కు గోల్డ్‌మన్ శాక్స్ షాక్
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా రానున్న 3–4 ఏళ్ల కాలంలో తగ్గుతూనే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల చేపట్టిన మూలధన సమీకరణ సానుకూల అంశమే అయినప్పటికీ మార్కెట్ వాటా కోల్పోవడాన్ని అరికట్టబోదని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. రానున్న 3–4 ఏళ్లలో 300 బేసిస్ పాయింట్ల(3 శాతం)మేర మార్కెట్ వాటాకు కోత పడనున్నట్లు అంచనా వేసింది. ఈ సందర్భంగా పెట్టుబడి వ్యయాలు, ఆదాయ మార్కెట్ వాటా మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించింది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ప్రత్యర్ధి కంపెనీలు 50 శాతం అధికంగా పెట్టుబడులను వెచి్చస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నిధులను సమీకరించడం ఈ టెలికం కంపెనీకి సానుకూల అంశమేనని, అయితే మార్కెట్ వాటా బలహీనపడటాన్ని నివారించలేదని విదేశీ బ్రోకింగ్ సంస్థ వ్యాఖ్యానించింది. వెరసి సానుకూల ధోరణితో చూస్తే షేరు అంచనా విలువను రూ. 19గా పేర్కొంది. ప్రస్తుత రేటు(గురువారం ముగింపు)తో పోలిస్తే 26 శాతం అధికమైనప్పటికీ బేస్కేసుగా చేసిన మదింపుతో చూస్తే మాత్రం 83 శాతం పతనంకావచ్చని తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి వొడాఫోన్‌కు సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) స్పెక్ట్రమ్ సంబంధ చెల్లింపులు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది. వీటిలో కొంతమేర బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశమున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఫ్రీక్యా‹Ùఫ్లో స్థితికి చేరేందుకు ఏఆర్పీయూ రూ. 200–270కు జంప్చేయవలసి ఉన్నట్లు అంచనా వేసింది. సమీపకాలంలో ఇది జరిగేందుకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. టారిఫ్‌ల పెంపు, పెట్టుబడుల సమీకరణ నేపథ్యంలోనూ 2025 మార్చికల్లా నికర రుణభారం– నిర్వహణ లాభం(ఇబిటా) నిష్పత్తి మెరుగుపడకపోవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్ఈలో 11.5% పతనమై రూ. 13.36 వద్ద ముగిసింది. -
వందలాది ఉద్యోగులను వదిలించుకోనున్న ప్రముఖ బ్యాంక్
ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ రానున్న వారాల్లో కొన్ని వందల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని యోచిస్తోంది.తక్కువ-పనితీరు గల సిబ్బంది వార్షిక తొలగింపులో భాగంగా దీన్ని అమలు చేయబోతోందని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది.తాజా తొలగింపులతో కలుపుకొంటే 2024 ఏడాదిలో మొత్తంగా 3 నుంచి 4 శాతం సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు. వీటిలో చాలా చాలా వరకు ఏడాది ప్రారంభంలోనే జరినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కొత్త ప్రతిభను చేర్చుకోవడానికి వీలుగా బ్యాంక్ ఈ చర్యలకు పూనుకుంటోంది. ఉద్యోగుల పనితీరు వార్షిక సమీక్షను కోవిడ్ సమయంలో తాత్కాలికంగా నిలిపేసిన బ్యాంక్ తిరిగి అమలు చేస్తోంది.గోల్డ్‌మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఏడాది మధ్యలో 44,300 మందిని నియమించుకుంది. సిబ్బందికి సంబంధించిన బ్యాంక్ వార్షిక సమీక్ష సాధారణంగా జరిగే ప్రామాణిక ప్రక్రియ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోందని వివరించారు. -
అప్పటికల్లా 10 కోట్ల మంది ధనికులు! అంతా లగ్జరీనే..
దేశంలో ధనికుల జనాభా వేగంగా పెరగుతోంది. వచ్చే నాలుగేళ్లలో 10 కోట్లకు చేరుకుంటుందని తాజాగా విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది. వినియోగదారుల పోకడలు, సంపద గతిశీలతను పునర్నిర్మించడంలో ఇప్పటికే కీలక పాత్ర పోషించిన వీరు.. రానున్న రోజుల్లో లగ్జరీ వస్తువులు, నివాసాల కొనుగోలు, స్టాక్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతారని ఆ నివేదిక పేర్కొంటోంది. ‘ది రైజ్ ఆఫ్ అఫ్లుయెంట్ ఇండియా’ పేరుతో గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా విడుదల చేసిన నివేదిక భారత్‌లో ధనికుల జనాభా 2027 నాటికి 10 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం దేశంలో ధనికుల జనాభా 6 కోట్లుగా ఉంది. అంటే నాలుగేళ్లలో 67 శాతం పెరుగుతుందని ఈ నివేదిక పేర్కొంది. ఇలా 10 కోట్లకు పైగా ధనికులు ఉన్న దేశాలు ప్రపంచవ్యాప్తంగా 14 మాత్రమే ఉన్నాయి. ధనికులంటే.. వార్షిక ఆదాయం 10,000 డాలర్లు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.8.3 లక్షలు) అంతకంటే ఎక్కువ ఉన్నవారిని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక ధనికులుగా నిర్వచించింది. దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్నవారి జనాభాలో 10 వేల డాలర్లు సంపాదిస్తున్నవారు 4 శాతం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
యాపిల్ కార్డులు నిలిపివేయనున్న దిగ్గజ సంస్థ.. కారణం ఇదేనా?
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి యాపిల్ సంస్థ యాపిల్కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్డ్‌ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయడానికి గోల్డ్‌మన్ సాక్స్ మంతనాలు జరుపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో వారి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. యాపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి వచ్చే 12-15 నెలల్లో యాపిల్ కార్డు నిలిపేయనుంది. 2019లో ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ సేవలతోపాటు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పొదుపు ఖాతాలను యాపిల్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి నిర్వహిస్తోంది. అయితే యాపిల్కార్డును అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయాలని గోల్డ్‌మన్ సాక్స్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దాంతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేయమని కోరుతూ యాపిల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఆగస్టులో యాపిల్ తన వినియోగదారులకు అధిక ఈల్డ్ ఇచ్చే పొదుపు ఖాతాలు ప్రారంభించింది. అది యాపిల్కార్డుకు అనుసంధానం చేసింది. అందులో దాదాపు రూ. 83 వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. దానికి 4.15 శాతం ఈల్డ్ అందిస్తుంది. గోల్డ్‌మన్ సాక్స్‌తో 2029 వరకు ఈ ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఈ డీల్‌ను రద్దుచేసుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవింగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 97 శాతం మంది కస్టమర్లు రోజువారీ నగదును వారి ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు యాపిల్ తెలిపింది. ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు! యాపిల్ అమెరికాలో ‘బైనౌ..పే లేటర్’ విధానాన్ని మాస్టర్‌కార్డ్ ఇన్స్టాల్మెంట్స్ ప్రోగ్రామ్‌తో కలిసి ప్రారంభించింది. గోల్డ్‌మన్ సాక్స్ ఆ మాస్టర్‌కార్డ్ చెల్లింపుల క్రెడెన్షియల్స్‌ను జారీ చేస్తోంది. -
స్థానిక అభివృద్ధికి గోల్డ్‌మన్ సాచ్స్ తోడ్పాటు
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ అక్షరాస్యత, మహిళా ఎంట్రప్రెన్యూర్లకు చేయూత, స్థానిక విక్రేతలతో ఒప్పందాలు వంటి వాటి ద్వారా గోల్డ్‌మన్ సాచ్స్ సంస్థ స్థానిక అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కె.తారకరామారావు అన్నారు. గోల్డ్‌మన్ సాచ్స్ వంటి దిగ్గజ సంస్థల కార్యాలయాల ఏర్పాటుతో హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ సంస్థల ఏర్పాటు, భాగస్వామ్యాలకు అవకాశాలు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా పెట్టుబడులు, బ్యాంకింగ్, సెక్యూరిటీలు, పెట్టుబడుల నిర్వహణ రంగాల్లో పేరొందిన గోల్డ్‌మన్ సాచ్స్ గురువారం ఇక్కడి నాలెడ్జ్ సిటీలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయం ‘ఓపెల్’ను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ కంపెనీలు, స్టార్టప్‌ల వాతావరణం మరింత బలోపేతం కావడంతోపాటు స్థానిక నైపుణ్యానికి అంతర్జాతీయ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. తమ సంస్థ రెండు దశాబ్దాల అంతర్జాతీయ ప్రస్థానంలో హైదరాబాద్, బెంగుళూరు అంతర్భాగంగా ఉన్నాయని గోల్డ్‌మన్ సాచ్స్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిచర్డ్ నోడ్ అన్నారు. కార్యక్రమంలో గోల్డ్‌మన్ సాచ్స్ గ్లోబల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గుంజన్ సమ్తానీ, ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. నూతన కార్యాలయంలో 2,500 మందికి వసతి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కన్జూమర్ బిజినెస్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ తదితర రంగాలకు సంబంధించిన కార్యకలాపాల కోసం గోల్డ్‌మన్ సాచ్స్ 2021లో హైదరాబాద్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం 1,500 మంది నిపుణులు ఇక్కడ పనిచేస్తుండగా తాజాగా నాలెడ్జ్ సిటీలోని సలార్పురియా సత్వ నాలెడ్జ్ పార్క్‌లో 3.51 లక్షల చదరపు అడుగులలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. దీనిలో 2,500 మంది నిపుణులు కూర్చునేందుకు అనువైన ఆధునిక వసతులు ఉన్నాయి. -
హైదరాబాద్‌లో గోల్డ్‌మెన్ సాక్స్ విస్తరణ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: బ్యాంకింగ్, ఫైనాన్స్ సేవలు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగాల్లో హైదరాబాద్‌ను అత్యుత్తమ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక బ్యాంకింగ్ ఫైనాన్స్ సేవల్లో పేరొందిన మాస్ మ్యూచువల్, హెచ్ఎస్బీసీ, స్టేట్ స్ట్రీట్, బెర్కాడియా వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్ వంటి కంపెనీలు హైదరాబాద్‌లో పెద్దఎత్తున తమ కార్యకలాపాలు విస్తరించాయన్నారు. గోల్డ్‌మెన్ సాక్స్ విస్తరణ ప్రణాళికలతో బీఎఫ్ఎస్ఐ రంగంలో హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ తెలిపారు. విస్తరణ ప్రణాళికలో భాగంగా 2,500 మంది అత్యంత నైపుణ్యం కలిగిన యువకులకు ఉద్యోగాలు లభిస్తాయంటూ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్‌తో న్యూయార్క్‌లోని గోల్డ్‌మెన్ సాక్స్ కంపెనీ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్, సీఈఓ డేవిడ్ ఎం.సోలమన్ బృందంతో బుధవారం జరిగిన సమావేశం అనంతరం కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ప్రస్తుతం ఉన్న వెయ్యిమంది ఉద్యోగుల సంఖ్యను రెండు రెట్లు పెంచి మరో రెండు వేల మంది నిపుణులకు అదనంగా ఉద్యోగ అవ కాశాలు కల్పిస్తుంది. దీనికోసం సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కార్యాలయాన్ని విస్తరిస్తుంది. సంస్థ బ్యాంకింగ్ సేవలు, బిజినెస్ అనలిటిక్స్, ఇంజనీరింగ్ వంటి వివిధ రంగాల్లో గోల్డ్‌మెన్ సాక్స్ సంస్థ కార్యకలాపాల బలోపేతానికి ఈ నూతన కేంద్రం పనిచేస్తుంది. సంస్థ కార్యకలాపాలకు అనుగుణంగా కావాల్సిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ విభాగాల్లోనూ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న నూతన కార్యాలయం ప్రధానంగా దృష్టి సారిస్తుందని గోల్డ్‌మెన్‌సాక్స్ సంస్థ తెలిపింది. -
గోల్డ్‌మాన్ సాచెస్లో 125 మంది మేనేజింగ్ డైరెక్టర్ల తొలగింపు?
అంతర్జాతీయ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ కీలక నిర్ణయం తీసుంది. సంస్థలో మరోసారి ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు దఫాలుగా లేఆఫ్స్ ఇచ్చిన గోల్డ్‌మాన్ సాచెస్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయి ఉద్యోగాల్లో125 మంది ఎండీలను తొలగించాలని నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రాజెక్ట్‌లలో తిరోగమనం, అమెరికాలో దిగ్గజ బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభంతో గోల్డ్‌మాన్ సాచెస్ పొదుపు చర్యలు పాటిస్తుంది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా ఎండీ స్థాయి అధికారుల తొలగిస్తున్నట్లు తేలింది. అయితే ఆ తొలగింపులపై గోల్డ్‌మాన్ సాచెస్ అధికారికంగా స్పందించలేదు. కాగా, 125 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించే అవకాశం ఉండగా.. ఇప్పటికే ఐదు నెలల క్రితం దాదాపు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. -
10 వేల మంది మహిళలకు గోల్డ్‌మ్యాన్ చేయూత
ముంబై: గోల్డ్‌మ్యాన్ శాక్స్ భారత్‌లో 10,000 మంది మహిళలకు వ్యాపారం, మేనేజ్మెంట్ విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించినట్టు ప్రకటించింది. వీరి ద్వారా 12,000 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభించాయని, గడిచిన 18 నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. గోల్డ్‌మ్యాన్ శాక్స్ 2008లో మొదటిసారి భారత్‌లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని ఆరంభించింది. 18 నెలల క్రితం తిరిగి దీన్ని ప్రారంభించింది. ‘వుమెన్ఇనీషియేటివ్’ కింద 10,000 మంది మహిళలకు వ్యాపారం, యాజమాన్య విద్యకు కావాల్సిన నిధుల సహకారం అందించనున్నట్టు నాడు ప్రకటించింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న 10వేల మంది మహిళలల్లో 2,400 మందిపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) అధ్యయనం నిర్వహించగా, ఆ వివరాలను గోల్డ్‌మ్యాన్ శాక్స్ విడుదల చేసింది. గోల్డ్ మ్యాన్ శాక్స్ నిధుల మద్దతు పొందిన 10వేల మంది మహిళలు గత 18 నెలల్లో తమ సిబ్బంది సంఖ్యను రెట్టింపు చేసుకున్నాయి. అలాగే, ఆదాయాన్ని నాలుగు రెట్లు పెంచుకున్నాయి. తమ ఉత్పాదకతను సగటున ఐదు రెట్లు వృద్ధి చేసుకున్నాయి. వీరిలో అధిక శాతం మహిళా వ్యాపారవేత్తలు నియామకాలు పెంచుకుంటామని, ఆదాయం పెరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు. భారత్‌లో మహిళా వ్యాపారవేత్తల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉన్నట్టు గోల్డ్‌మ్యాన్ శాక్స్ ఇండియా చైర్మన్, సీఈవో సంజయ్ ఛటర్జీ పేర్కొన్నారు. నిధుల సాయం పొందేందుకు కూడా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెబుతూ.. వారి అసలు సామర్థ్యాలు వెలుగులోకి తెచ్చేందుకు ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో కేవలం 20 శాతం వ్యాపారాలే మహిళల నిర్వహణలో ఉన్నాయని, మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో వారి వాటా కేవలం 3 శాతంగానే ఉన్నట్టు చెప్పారు. -
‘నా ఉద్యోగం ఊడింది..జీవితం తలకిందులైంది’
ఆర్ధిక మాంద్యం భయాలు,మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు కారణంగా ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. తాజాగా ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ (జీఎస్) గ్రూప్ దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. వారిలో ఖరగ్ పూర్లో ఐఐటీ పూర్తి చేసి, బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న శుభం సాహు ఒకరు. అయితే తన పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత ఊహించని విధంగా గోల్డ్‌మన్ సాచ్స్ పింక్ స్లిప్‌లు జారీ చేసింది. దీంతో సాహు.. గోల్డ్ మన్ సాచ్స్‌లో జాబ్ ఎక్స్పీరియన్స్, తొలగింపులపై లింక్డిఇన్‌లో ఓ పోస్ట్ షేర్ చేశారు. అందులో.. ‘వావ్ ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకంగా ప్రారంభమైంది. సుమారు 6 నెలల క్రితం అనుకుంటా జీఎస్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా జాయిన్ అయ్యా. నా బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్న కొన్ని రోజులకే ఫైర్ చేసినట్లు తెలిసింది. ఉద్యోగం చేసింది కొద్ది కాలమే అయినా జీఎస్‌కు కృతజ్ఞతలు. నేర్చుకోవడానికి, కెరియర్లో ఎదిగేందుకు అనువైన ప్రదేశం’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్న జాబ్ పోయింది కాబట్టి.. కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించానంటూ లింక్డ్ఇన్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇలా సాహూయే కాదు.. గోల్డ్ మెన్ సాచ్స్ విధుల నుంచి తొలగించిన అనేక మంది హెచ్1 బీ వీసా హోల్డర్ ఉద్యోగులు కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తూ సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు. మన దేశానికి చెందిన శిల్పి సోనీ టెక్సాస్ ప్రాంతంలో ఉన్న జీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌గా ఏడాదిన్నర పాటు పని చేసింది. త్వరగానే జీవితం తలకిందులు అయ్యిందంటూ తన మనసులో మాట బయట పెట్టింది. ‘నా కుటుంబంలో విదేశాలలో మాస్టర్స్ పూర్తి చేసిన మొదటి వ్యక్తిగా నేను గర్వపడుతున్నారు. నేను గ్రామీణ కుటుంబం నుండి వచ్చాను. కాబట్టి సామాజిక, ఆర్థిక పరిమితులను అధిగమించి ఇక్కడకు రావడానికి ఇది ఒక రోలర్ కోస్టర్‌గా మారింది. నేను ఎక్కడ నుండి జీవితాన్ని ప్రారంభించానో.. అక్కడే ఉద్యోగం పోగొట్టుకోవడం బాధగా ఉంది. కానీ యూఎస్‌లో నా ప్రయాణం ముగిసిపోలేదు.ఇంకా ఉంది. కాబట్టి ఉద్యోగ వేటను కొనసాగిస్తా’. కొత్త ఉద్యోగ అన్వేషణలో నా పరిమిత సమయాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్లు లింక్డిఇన్ పోస్ట్‌లో చెప్పారు. చదవండి👉 ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే -
ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే
ఆర్ధిక మాంద్యం భయాల్లో ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్ భయాలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేయనుంది. అస్థిరంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా కార్పొరేట్ డీల్స్‌లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్‌మన్ సాచ్చ్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ? -
2022లో 6.9 శాతం.. 2023లో 5.9 శాతం!
ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2022, 2023లో వరుసగా 6.9 శాతం, 5.9 శాతం వృద్ధిని సాధిస్తుందని వాల్ స్ట్రీట్ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ ఒక నివేదికలో అంచనా వేసింది. 2022 భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్ ఏజెన్సీ ఇటీవలే 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన నేపథ్యంలో గోల్డ్‌మన్ శాక్స్ ఈ నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... ► వరుసగా రెండు సంవత్సరాల భారీ ర్యాలీ కొనసాగే వీలుంది. డిసెంబర్ 2023 నాటికి బెంచ్‌మార్క్ నిఫ్టీ 20,500 స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది 12 శాతం ధర రాబడిని సూచిస్తుంది. ► ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం విషయానికి వస్తే, 2022లో సగటును 6.8 శాతం, 2023లో 6.1 శాతంగా ఉండే వీలుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లక్ష్యం కన్నా ఇది అప్పటికీ ఎక్కువగానే ఉండడం గమనార్హం. ► వచ్చే డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ బ్యాంకులకు సెంట్రల్ బ్యాంక్ ఇచ్చే రుణ రేటు రెపోను 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) పెంచే వీలుంది. 2023 ఫిబ్రవరిలో మరో 35 బేసిస్ పాయింట్లు పెరిగే వీలుంది. ఈ చర్యలతో రెపో రేటు 6.75 శాతానికి చేరుతుంది. మే తర్వాత సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది. తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది. -
ఆ ఉద్యోగుల గుండెల్లో గుబులే: అతిపెద్ద కోతలకు తెర!
న్యూఢిల్లీ:గ్లోబల్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ భారీ తొలగింపులకు తెరతీసింది. మహమ్మారి ప్రారంభమై నప్పటినుండి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. వాల్ స్ట్రీట్ టైటన్ ఈ నెల (సెప్టెంబరు) నుండి అనేక వందల మందిని తొలగించాలని యోచిస్తోందట. కోవిడ్ తరువాత ఇది భారీ తొలగింపు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గోల్డ్‌మన్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సోమవారం నివేదించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు గోల్డ్‌మన్ ప్రతినిధి నిరాకరించారు. మొత్తం సంఖ్య కొన్ని మునుపటి కంటే తక్కువే అయినప్పటికీ, ఈ సెప్టెంబరు నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కోవిడ్ సంక్షోభం తరువాత ఇదే అతిపెద్ద కోత అని అంచనా. ఆదాయాలు భారీగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం బ్యాంక్ ఆదాయాలు 40శాతానికి మించి పడిపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో నియామకాలని తగ్గించడంతోపాటు, ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షించాలని సంస్థ నిర్ణయించింది. సమీక్ష అనంతరం సాధారణంగా ఫెర్ఫామెన్స్ చెత్తగా ఉన్న సిబ్బందిని తొలగించనుంది. అలాగే అట్రిషన్ కారణంగా కోల్పోయిన సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియను కూడా తగ్గిస్తున్నట్టు సంస్థ సీఎఫ్‌వో డెనిస్ కోల్మన్ ఒక సందర్బంలో వెల్లడించారు. కంపెనీ రెండో త్రైమాసికం ముగింపు నాటికి సంస్థలో 47వేల ఉద్యోగులుండగా, రెండేళ్ల క్రితం 39,100 ఉద్యోగులు ఉన్నారు. అలాగే గత 12 నెలలుగా ఎస్అండ్పీ 500 ఫైనాన్షియల్స్ ఇండెక్స్ 7.5 శాతం క్షీణతతో పోలిస్తే గోల్డ్‌మ్యాన్ షేర్లు ఈ ఏడాది 10 శాతానికిపైగా పతనం కాగా గత ఏడాది క్రితం కంటే దాదాపు 15 శాతం క్షీణించాయి. -
Goldman Sachs: 2021–22లో భారత్ జీడీపీ వృద్ధి 9.8%
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22లో 8.5 శాతంగా నమోదవుతుందని అమెరికన్ బ్రోకరేజ్ దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2022–23లో వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. మహమ్మారి ప్రతికూల ప్రభావంతో గడచిన ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ లో బేస్ ఎఫెక్ట్‌తో 2021–22లో మంచి వృద్ది రేటు నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో 9.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనా. అయితే 2022–23లో మాత్రం ఈ వృద్ధి రేటు 7.8 శాతం ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డ్‌మన్ శాక్స్ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... ► మహమ్మారి ప్రభావంగ గణనీయంగా తగ్గుముఖం పట్టింది. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృత ప్రాతిపదికన జరుగుతోంది. ఆయా అంశాలకు తోడు వినియోగం మెరుగుపడుతోంది. ఈ సానుకూల పరిస్థితులు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే అంశాలు. ► ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా భారీగా పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. అయితే ప్రైవేటు కార్పొరేట్ క్యాపిటల్ వ్యయాలు (క్యాపెక్స్) రికవరీ, హౌసింగ్ పెట్టుబడుల పునరుద్దరణ మాత్రం బలహీనంగానే ఉంది. ► బేస్ ఇయర్ ఎఫెక్ట్ తగ్గిపోయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా 9.8 శాతం వృద్ధి నమోదవుతుందన్నది అంచనా. ► వృద్ధి పురోగమిస్తుందన్న సంకేతాలతో ఆర్బీఐ తన ద్రవ్య పరపతి విధానాన్ని తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2022లోనే ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 0.75 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి. ► నాలుగు దశల్లో పాలసీ విధానాన్ని సాధారణ పరిస్థితికి తెచ్చే అవకాశం ఉంది. అదనపు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని వెనక్కు తీసుకుంటామని ఇప్పటికే ఆర్బీఐ పేర్కొనడం ఇందులో మొదటి దశగా భావించవచ్చు. ► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2021లో సగటున 5.2 శాతం, 2022లో 5.8 శాతంగా ఉండే వీలుంది. బార్క్లేస్ అంచనా 10 శాతం ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ అంచనావేసింది. అయితే 2022–23లో వృద్ధి 7.8 శాతానికి పరిమితమవుతుందని విశ్లేషించింది. ఆర్బీఐ సరళతర వడ్డీరేట్ల విధానానికి ముగింపు పలకవచ్చని కూడా బార్క్లేస్ అంచనావేసింది. డిసెంబర్లో జరిగే పాలసీ సమీక్షలో రివర్స్ రెపో రేటును పెంచే వీలుందని విశ్లేషించింది. అటు తర్వాత 2022లో రెపో రేటును కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ విధాన నిర్ణేతలు గత మూడు సంవత్సరాలుగా వృద్ధికి, ఆర్థిక మూల స్తంభాలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారని పేర్కొంది. నిజానికి భారత్ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి ప్రారంభానికి ముందే నెమ్మదించడం ప్రారంభించిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇప్పుడు ఆర్థిక స్థిరత్వంపై విధాన నిర్ణేతలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని వివరించింది. చదవండి: భారత్ జీడీపీ వృద్ధి 8.1 శాతం - ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ -
అమెరికా ‘రు(ర)ణ’ రాజకీయం!
అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దేశం అప్పులు.. వాటి చెల్లింపులను అడ్డుపెట్టుకుని ఆడుతున్న రాజకీయ నాటకం ఇంకొన్ని వారాలపాటు సాగనుంది. ఆర్థిక శాఖ మంత్రి జానెట్ ఎల్లెన్ తాజా ప్రకటనను బట్టి పరిమితిని సకాలంలో పెంచకపోతే డిసెంబరు 15వ తేదీ తరువాత అగ్రరాజ్యం అమెరికా చరిత్రలోనే తొలిసారి రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఎదుర్కోనుంది. అమెరికాకు అప్పులేంటి? చెల్లించ లేకపోవడం ఏమిటని ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంత చెట్టుకు అంత గాలి అంటారు కదా.. అలాగే ఇదీనూ. కాకపోతే ఇక్కడ సమస్య డబ్బుల్లేకపోవడం కాదు. అప్పులపై ఉన్న పరిమితిని పెంచితేగానీ ప్రభుత్వం తన మాట నిలబెట్టుకునే పరిస్థితి లేకపోవడం!! పెంచకపోతే ఏమవుతుంది? రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా తొలిసారి తాను చెల్లించాల్సిన రుణ వాయిదాలను చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్టోబరులో ఈ మొత్తం దాదాపు 28 లక్షల కోట్ల డాలర్ల వరకూ ఉంది. సకాలంలో రుణ వాయిదా చెల్లించకపోవడం ప్రతి ప్రభుత్వ కార్యక్రమంపై ప్రభావం చూపుతుంది. రాష్ట్రాలకు అందే నిధులు తగ్గుతాయి. గోల్డ్‌మ్యాన్ శాక్స్ సంస్థ అంచనా ప్రకారం సకాలంలో రుణ పరిమితి పెంచని పక్షంలో అమెరికన్ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అందే ఆర్థికసాయంలో నలభైశాతం కోత పడే అవకాశం ఉంది. రక్షణ దళాల సిబ్బందికి పూర్తిస్థాయిలో, సకాలంలో వేతనాలు, ఫింఛన్ల వంటివి చెల్లించలేమని పెంటగాన్ అక్టోబరులోనే ఒక ప్రకటన జారీ చేసింది. వాయిదా చెల్లింపులో విఫలమైతే అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా విశ్వసనీయత దెబ్బతింటుంది. వడ్డీ రేట్లు పెరిగే అవకాశమూ ఉంది. ఇవన్నీ కలగలిస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ నష్టపోతుందన్నమాట. తాత్కాలిక ఉపశమనంగా 480 బిలియన్ డాలర్ల అదనపు రుణం తెచ్చుకోవడానికి అక్టోబరులో సెనేట్ ఒకే చెప్పింది.రుణపరిమితిని పెంచుకోవడానికి, రిపబ్లికన్లను ఒప్పించడానికి బైడెన్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రతిపక్ష రిపబ్లికన్లు ఏమంటున్నారు? వివాదానికి బాధ్యత డెమొక్రాట్లదేనన్నది రిపబ్లికన్ల వాదన. తమ మద్దతు లేకుండా కొత్త అంశాలపై డబ్బులు ఖర్చు పెట్టేందుకు డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని.. దాన్ని అడ్డుకుంటూండటం వల్లనే వారు నిస్పృహకు గురవుతున్నారని ఆరోపిస్తున్నారు. డెమోక్రాట్లు ఇంకోసారి ఏకపక్షంగా పన్నులు విధించడం, ఖర్చు పెట్టడాన్ని తాము అనుమతించేది లేదని మైనార్టీ నేత మిచ్ మెక్కానెల్ స్పష్టం చేశారు. తమ ఆర్థిక విధానాలను అమలు చేసేందుకు డెమొక్రాట్లు బడ్జెట్ సమీక్షను అడ్డుగా పెట్టుకుంటున్నారని, ఇంత చేయగలిగిన వాళ్లు రుణ పరిమితి పెంపుపై కూడా ఏదో ఒక చర్య తీసుకోవాలని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ డెమొక్రాట్ల వాదనలేమిటి? రుణ పరిమితి పెంపును రిపబ్లికన్లు అడ్డుకోవడాన్ని అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్షాలవి ద్వంద్వ ప్రమాణాలని, ప్రమాదకరమైనవని, అమర్యాదకరమైనవి కూడా అని విమర్శించారు. ఆర్థిక వ్యవస్థతో ఆటలాడుకుంటున్నాయన్నారు. అమెరికన్ సెనేట్‌లో దాదాపు 50 మంది డెమొక్రాట్లు (100 సభ్యులుండే అమెరికా ఎగువసభ సెనేట్‌లో 48 మంది డెమొక్రాట్లకు ఇద్దరు స్వంత్రుల మద్దతు ఉంది. మిగతా 50 మంది రిపబ్లికన్ పార్టీ సభ్యులు) ఉండగా... రుణ పరిమితిని పెంచేందుకు కనీసం మరో పది రిపబ్లికన్ ఓట్లూ అవసరమవుతున్నాయి. మొత్తం రుణాల్లో బైడెన్ హయాంలోనివి మూడు శాతం మాత్రమేనని, మిగిలినవన్నీ గత ప్రభుత్వాలవేనని డెమొక్రాట్లు అంటున్నారు. ట్రంప్ హయాంలో తాము మూడుసార్లు రుణ పరిమితి పెంపునకు సహకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమిటీ రుణ పరిమితి కథ? అమెరికా ప్రభుత్వం వివిధ రూపాల్లో సేకరించే పన్నుల మొత్తం కంటే ఎక్కువ ఖర్చు పెడుతుంది. ఇందుకోసం అన్ని ప్రభుత్వాల మాదిరిగానే అప్పులు చేస్తుంది. ఈ వ్యవహారమంతా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా నడుస్తుంది. అప్పుల కోసం అగ్రరాజ్యం విడుదల చేసే బాండ్లు ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన పెట్టుబడులుగా భావిస్తారు. 1939లో అమెరికన్ పార్లమెంటు ప్రభుత్వం చేయగలిగే అప్పులపై ఒక పరిమితిని విధిస్తూ చట్టం చేసింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ కనీసం వందసార్లు ఈ పరిమితిని పెంచుకున్నారు. అంటే.. అవసరాన్ని బట్టి మరిన్ని అప్పులు చేసేందుకు ఎప్పటికప్పుడు అవకాశం కల్పించుకున్నారన్నమాట. అయితే ఇలా పరిమితి పెంచుకోవాలన్న ప్రతిసారి కూడా దానిపై కాంగ్రెస్‌లోని ఇరు పక్షాల మధ్య చర్చోపచర్చలు జరుగుతాయి. చివరకు ఇరుపక్షాలు కొన్ని పట్టువిడుపులతో ఏకాభిప్రాయానికి రావడం పరిమితిని పెంచుకోవడం కద్దు. అయితే ఇటీవలి కాలంలో ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంటోంది. 2013లోనూ రుణ పరిమితిని దాటేసే పరిస్థితి ఏర్పడింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యయ ప్రణాళికను రిపబ్లికన్లు పూర్తిగా అడ్డుకున్నారు. అదేమాదిరిగా ఈ సారి కూడా రిపబ్లికన్లు రుణ పరిమితి అంశాన్ని అడ్డుపెట్టుకుని ఒక వివాదాన్ని సృష్టించారు. అయితే... ఇలాంటి విషయాలు చివరి నిమిషం వరకూ సాగడం.. చివరకు రాజీమార్గాలపై తెరవెనుక మంతనాలు, పట్టువిడుపులు, కొన్ని సవరణల తరువాత ఓకే కావడం చరిత్రలో ఇప్పటివరకూ జరిగిన తంతు! -
చైనాను పట్టిపీడిస్తున్న వరుస సంక్షోభాలు...!
Goldman Sachs Cuts China's Growth Forecast: వరుస సంక్షోభాలు చైనాకు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. చైనాలో ఏదైనా సంక్షోభం తలెత్తితే ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. వరుస సంక్షోభాలతో చైనా వృద్దిరేటు మందగించేలా ఉన్నట్లు పలు ఫైనాన్షియల్ సంస్థలు గుర్తించాయి. వరుస సంక్షోభాలు..చైనాకు షాకే..! కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన రియల్టీ సంస్థ ఎవర్‌గ్రాండే దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. ఈ సంక్షోభం సమసిపోకముందే చైనాను మరో సంక్షోభం తలుపుతట్టింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్‌ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ లైట్లు సైతం వెలగడం లేదు. ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పలు దేశాలను ఈ సంక్షోభం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..? షాకిచ్చిన గోల్డ్‌మన్ సాక్స్..! అమెరికన్ ఇన్వెస్ట్బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీస్ గ్రూప్ గోల్డ్‌మన్ సాక్స్ చైనాకు షాకిచ్చింది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా వృద్ధి అంచనాను గోల్డ్‌మన్ సాక్ భారీగా తగ్గించింది. ఈ ఏడాదిగాను చైనా 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లకు, పలు దేశాల ఎకానమీకి చైనీస్ ప్రాపర్టీ భీమోత్ 'లీమన్ సంక్షోభం' గా మారగలదనే భయాల మధ్య చైనా ఇప్పటికే ఎవర్గ్రాండేను కాపాడేందుకు చర్యలను తీసుకుంటుంది. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికానికిగాను 4.8 శాతం, నాలుగో త్రైమాసికానికి 3.2 శాతం మేర వృద్ధి రేటును తగ్గించింది. మునపటితో పోలిస్తే వృద్ధి రేటు భారీగా తగ్గనుంది. వృద్దిరేటు తగ్గడం చైనాకు భారీ దెబ్బే అని గోల్డ్‌మన్ సాక్స్ అభిప్రాయపడింది. చదవండి: భారత్‌లో ఊపందుకొనున్న స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..
మీరు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్‌న్యూస్. పలు దిగ్గజ ఎంఎన్సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్,బైజూస్,టాటా స్టీల్,ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్‌లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కాగ్నిజెంట్ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్/ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) నుండి ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ క్యాంపస్‌లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. ఈ నియామకాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్‌లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్సోర్సింగ్స్ సంస్థలు,స్టార్టప్‌లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
ఐపీవోలతో స్టాక్ మార్కెట్ స్పీడు, అత్యంత సంపన్న దేశం దిశగా భారత్
ముంబై: కొద్ది నెలలుగా సందడి చేస్తున్న పబ్లిక్ ఇష్యూల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ) మరింత బలపడనున్నట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ప్రైమరీ మార్కెట్లో జోష్ కారణంగా రానున్న మూడేళ్లలో దేశీ మార్కెట్ క్యాప్‌నకు 400 బిలియన్ డాలర్లు జమకానున్నట్లు తెలియజేసింది. దీంతో 2024కల్లా మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లను తాకనున్నట్లు అంచనా వేసింది. వెరసి ప్రపంచంలో అత్యధిక మార్కెట్ క్యాపిటటైజేషన్ కలిగిన దేశాలలో 5వ ర్యాంకుకు చేరే వీలున్నట్లు అభిప్రాయపడింది. గత కొద్ది నెలలుగా ప్రైమరీ మార్కెట్లో నెలకొన్న బూమ్ నేపథ్యంలో తాజా అంచనాలను రూపొందించినట్లు యూఎస్ బ్రోకింగ్ దిగ్గజం వెల్లడించింది. ఈ ఏడాది ప్రారంభంనుంచీ చూస్తే పబ్లిక్ మార్కెట్ ద్వారా కంపెనీలు 10 బిలియన్ డాలర్లను సమీకరిస్తున్న పరిస్థితులను ఈ సందర్భంగా ప్రస్తావించింది. గత మూడేళ్లలోనే ఇది అత్యధికంకాగా.. రానున్న 12–24 నెలల్లోనూ ఇది కొనసాగనున్నట్లు అంచనా వేసింది. యూనికార్న్‌ల దన్ను నవ ఆర్థిక వ్యవస్థ నుంచి పుట్టుకొస్తున్న యూనికార్న్‌లు, ఐపీవోల ద్వారా లిస్టింగ్‌కు సిద్ధపడుతున్న కంపెనీలు మార్కెట్ క్యాప్ అంచనాలకు బలాన్నిచ్చినట్లు గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. ఇటీవల బిలియన్ డాలర్ల విలువను అందుకోడం ద్వారా యూనికార్న్ హోదాను పొందుతున్న స్టార్టప్‌లలో స్పీడ్ నెలకొన్నదని తెలియజేసింది. ఇంటర్నెట్ వృద్ధి, ప్రయివేట్ పెట్టుబడుల లభ్యత, నియంత్రణ సంస్థల తోడ్పాటు వంటి అంశాలు దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు దన్నునిస్తున్నట్లు వివరించింది. ఫలితంగా ఇటీవల 3.5 ట్రిలియన్ డాలర్లను అందుకున్న దేశీ మార్కెట్ క్యాప్ 2024కల్లా 5 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని భావిస్తున్నట్లు తెలియజేసింది. గత వారం ఫ్రాన్స్‌ను అధిగమిస్తూ దేశీ మార్కెట్ విలువ ప్రపంచంలో ఆరో ర్యాంకును అందుకున్న సంగతి తెలిసిందే. డిజిటల్ జోరు ప్రస్తుతం దేశీ ఈక్విటీ ఇండెక్సులలో పాతతరం ఆర్థిక రంగాలకు చెందిన కంపెనీలదే అధిపత్యమని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. 20 ఏళ్ల సగటు లిస్టింగ్ వయసు కారణంగా పురాతన సూచీలుగా నిలుస్తున్నట్లు వ్యాఖ్యానించింది. అయితే అతిపెద్ద డిజిటల్ ఐపీవోల ద్వారా కొత్త తరానికి చెందిన రంగాలకు ప్రాధాన్యత పెరగనున్నట్లు అంచనా వేసింది. దీంతో నవతరం ఆర్థిక, టెక్ రంగాలకు చెందిన కంపెనీలలో పెట్టుబడులు 5 శాతం నుంచి 12 శాతానికి(50 శాతం ఫ్లోట్) పెరగనున్నట్లు అభిప్రాయపడింది. ఈ బాటలో ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో జొమాటో లిస్ట్‌కాగా.. ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎమ్‌సహా పలు ఇతర కంపెనీలు పబ్లిక్ ఇష్యూకి రానున్నట్లు తెలియజేసింది. -
ఎల్ఐసీకి మర్చంట్ బ్యాంకర్లు రెడీ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పబ్లిక్ ఇష్యూ ప్రణాళికలు ఊపందుకున్నాయి. ఇష్యూ నిర్వహణకు ప్రభుత్వం తాజాగా 10 మర్చంట్ బ్యాంకర్ సంస్థలను ఎంపిక చేసింది. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, జేపీ మోర్గాన్ చేజ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, సిటీగ్రూప్, నోమురా హోల్డింగ్స్ తదితరాలను షార్ట్‌లిస్ట్ చేసింది. ఎల్ఐసీ ఐపీవో నిర్వహణకు 16 సంస్థలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ఆస్తుల నిర్వాహక సంస్థ(దీపమ్)కు దరఖాస్తు చేశాయి. చదవండి : Aadhar Link: టెక్నికల్ ఇష్యూస్‌పై యూఐడీఏఐ క్లారిటీ.. తుది తేదీలు ఇవే! -
సామాన్యుడి నెత్తిన మరో పిడుగు...!
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడి నెత్తిమీద మరో పిడుగు పడనుంది. ఈ సారి మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల రూపంలో రానుంది. పలు టెలికాం కంపెనీలు రీచార్జ్ టారిఫ్‌ల రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. టారిఫ్‌ల పెంపులతో సామాన్యుడికి మరింత భారం కానుంది. తాజాగా భారతి ఎయిర్టెల్ తన యూజర్ల కోసం బేసిక్ స్మార్ట్ ప్రీ పెయిడ్ ప్లాన్ ధరను రూ. 49 నుంచి ఏకంగా రూ. 79 పెంచేసింది. ఈ బేసిక్ ప్లాన్‌పై సుమారు 55 మిలియన్ల యూజర్లు ఆధారపడి ఉన్నారు. ఎయిర్టెల్ ఈ ప్లాన్‌లో భాగంగా అవుట్ గోయింగ్ కాల్స్‌కు సంబంధించి నాలుగు రెట్లు అధికంగా టాక్‌టైంను అందించింది. దాంతోపాటుగా డబుల్ మొబైల్ డేటాను చేసింది. తాజాగా ఎయిర్టెల్ బాటలో వోడాఫోన్-ఐడియా కూడా టారిఫ్‌లను పెంచే దారిలో పయనిస్తున్నట్లు తెలుస్తోంది. వోడాఫోన్-ఐడియా ఇప్పటికే రూ. 49 ప్లాన్‌ను విరమించుకుంది. ఈ ప్లాన్‌కు బదులుగా కొత్తగా 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 79 ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఎయిర్టెల్, వోడాఫోన్-ఐడియా బాటలోనే పలు టెలికాం కంపెనీలు ప్రయాణించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో రీచార్జ్ టారిఫ్ ప్లాన్ల ధరలను 30 శాతం మేర పెంచాలని టెలికాం కంపెనీలు భావిస్తున్నాయి. టారిఫ్‌లను పెంచడంతో యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయాన్ని (ఏఆర్పీయూ) పెంచుకోవాలని టెలికాం కంపెనీలు యోచిస్తున్నాయి. గోల్డ్‌మన్ సాచ్ ప్రకారం.. టెలికం కంపెనీలు 2021 ఆర్థిక సంవత్సరంలో ప్రీ పెయిడ్ కస్టమర్ల నుంచి 50-80 శాతం వరకు రెవెన్యూను జనరేట్ చేసుకున్నాయని పేర్కొంది. టెలికాం కంపెనీల్లో ఫ్రీ క్యాష్ ఫ్లో (ఎఫ్‌సీఎఫ్) మెరుగుపడాలంటే..కచ్చితంగా ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్‌ల పెంపు అనివార్యమని తెలిపింది. కాగా జియో నుంచి టారిఫ్‌ల పెంపు తక్కువగా ఉండే అవకాశం ఉందని గోల్డ్‌మన్ సాచ్ పేర్కొంది. -
హైదరాబాద్‌లో గోల్డ్‌మన్ శాక్స్
సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో ఉన్న యూఎస్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ హైదరాబాద్‌లో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. మాదాపూర్‌లోని సలార్పురియా సత్వ నాలెజ్డ్ సిటీలో 1,59,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రం నుంచి ఇంజనీరింగ్, ఫైనాన్స్, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్, కంన్జ్యూమర్ బ్యాంకింగ్ సపోర్ట్ కార్యకలాపాలను నిర్వహిస్తారు. ప్రస్తుతం ఇక్కడ 250 మంది పనిచేస్తున్నారు. డిసెంబరుకల్లా ఈ సంఖ్య 800లకు చేరుతుందని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా హెడ్ గుంజన్ సంతాని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. 2023 చివరినాటికి హైదరాబాద్ కేంద్రంలో 2,500 మంది ఉద్యోగులు ఉంటారని వెల్లడించారు. మహమ్మారిలోనూ పెట్టుబడులు.. కార్యాలయం ఏర్పాటు విషయమై తెలంగాణ ప్రభుత్వంతో గతేడాది గోల్డ్‌మన్ శాక్స్ బృందం చర్చించింది. హైదరాబాద్ కార్యాలయానికి 500 మందిని నియమించుకుంటామని ఆ సందర్భంగా తమకు తెలిపారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ‘2023 నాటికి 2,500 మందిని చేర్చుకోనున్నట్టు ప్రకటించారు. ఇక్కడి మానవ వనరుల సామర్థ్యంపై కంపెనీకి ఉన్న నమ్మకానికి, మెరుగైన మౌలిక వసతులకు ఇది నిదర్శనం. నిర్దేశిత సమయం కంటే ముందుగానే లక్ష్యానికి చేరుకోవడంతోపాటు కంపెనీ తదుపరి విస్తరణ చేపడుతుందన్న విశ్వాసం ఉంది. మహమ్మారిలోనూ పెట్టుబడులను ఆకర్శిస్తున్నాం. మరిన్ని కంపెనీలు రానున్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలో భాగ్యనగరిలో 1.8 లక్షల మంది పనిచేస్తున్నారు. వీ–హబ్‌తో కలిసి పనిచేయాల్సిందిగా గోల్డ్‌మన్ శాక్స్‌ను కోరుతున్నాను’ అని మంత్రి తెలిపారు. -
ఫ్రెషర్స్‌కి గోల్డ్‌మాన్ సాక్స్ గుడ్‌న్యూస్
హైదరాబాద్: గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ గోల్డ్‌మాన్ సాక్స్‌కి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్‌కి ప్రాధాన్యత పెరగనుంది. హైదరాబాద్ క్యాంపస్ ద్వారా మరిన్ని సేవలు అందించేందుకు ఆ సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు రాబోయే రెండేళ్లలో ఇక్కడ కొత్త నియమకాలు చేపడతామని ప్రకటించింది. ఫైనాన్షియల్ సెక్టార్లో గోల్డ్‌మాన్ సాక్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సంస్థ. 2021 మార్చిన హైదరాబాద్‌లో కార్యాలయం ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థలో కేవలం 250 మంది ఉద్యోగులే పని చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ కార్యాలయంలో 2,000 మంది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది చివరి నాటికి 700ల మంది ఉద్యోగులను నియమిస్తామని, ఇందులో 70 శాతం కొత్త వారికే అవకాశాలు కల్పించబోతున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. 2023 నాటికి హైదరాబాద్ ఆఫీస్‌లో 2500ల మంది ఉద్యోగులు పని చేసే విధంగా తమ కార్యకలాపాలు విస్తరిస్తామని గోల్డ్‌మాన్ సాక్స్ తెలిపింది. రాబోయే రోజుల్లో తాము నిర్వహించే అంతర్జాతీయ స్థాయి కార్యకలాపాలకి హైదరాబరాద్ ఆఫీస్ కీలకంగా మారబోతుందని గోల్డ్‌మాన్ సాక్స్ చైర్మన్ డేవిడ్ ఎం సాల్మోన్ తెలిపారు. -
హైదరాబాద్ లో గోల్డ్ మెన్ సాస్ గ్లోబల్ సెంటర్ ప్రారంభం
-
GVK Biosciences: రూ. 7,300 కోట్ల డీల్!
ముంబై: కాంట్రాక్ట్ రీసర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అయిన జీవీకే బయోసైన్సెస్‌లో గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ 33 శాతం వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్‌క్యాపిటల్ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్ ద్వారా జీవీకే బయోను రూ.7,300 కోట్లుగా విలువ కట్టారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది. ఇక కొద్ది రోజుల్లో ఈ డీల్ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. డీల్ పూర్తి అయితే గోల్డ్‌మన్ శాక్స్‌కు భారత ఫార్మా రంగంలో గడిచిన ఆరు నెలల్లో ఇది రెండవ పెట్టుబడి అవుతుంది. గోల్డ్‌మన్ శాక్స్ 2020 నవంబరులో బయోకాన్‌కు చెందిన బయోకాన్ బయాలాజిక్స్లో సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేసింది. జీవీకే బయోసైన్సెస్‌లో జీవీకే కుటుంబానికి, డీఎస్ బ్రార్ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరి 41 శాతం వాటా ఉంది. ఇదీ జీవీకే బయో నేపథ్యం.. జీవీకే బయోను జీవీకే గ్రూప్, ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్ మాజీ సీఈవో అయిన డీఎస్ బ్రార్ ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోటర్, చైర్మన్‌గా 2004లో జీవీకే బయో బోర్డులో బ్రార్ చేరారు. 2001లో ప్రారంభమైన ఈ సంస్థలో 2,500 పైచిలుకు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఔషధ ఆవిష్కరణ, రసాయన, జీవ శాస్త్రం, మాలిక్యూల్ పరిశోధన, అభివృద్ధి, రసాయనాల అభివృద్ధి, ఫార్ములేషన్, ఒప్పంద తయారీ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. 450కిపైగా క్లయింట్లు ఉన్నారు. 2019–20లో రూ.950 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎబిటా రూ.275 కోట్లుగా ఉంది. ఔషధ ఆవిష్కరణ, పరిశోధనపైనే సగం ఆదాయం సమకూరుతోంది. మిగిలినది కాంట్రాక్ట్ తయారీ విభాగం నుంచి వస్తోంది. 2014లో యూఎస్‌కు చెందిన ప్రీ–క్లినికల్ కాంట్రాక్ట్ రీసర్చ్ రంగంలో ఉన్న ఆరాజెన్ బయోసైన్సెస్‌ను కొనుగోలు చేసింది. చదవండి: Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్ ఉచితం -
భారత్ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాగుంది..
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ క్షీణ రేటు అంచనాలను అంతర్జాతీయ బ్రోకరేజ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ తగ్గించింది. 2020–21లో భారత్ ఆర్థిక వ్యవస్థ 10.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని తన తాజా నివేదికలో సంస్థ అంచనావేసింది. ఇంతక్రితం ఈ క్షీణ రేటు మైనస్ 14.8 శాతం. కఠిన లాక్డౌన్ సడలింపులతో ఆర్థిక రికవరీ అనుకున్నదానికన్నా బాగుందని అమెరికా కేంద్రం పనిచేస్తున్న ఈ సంస్థ పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే, పరిస్థితులు మరింత ఆశాజనకంగా మారతాయని అభిప్రాయపడింది. కాగా 2021–22లో భారత్ భారీగా 13 శాతం వృద్ధి సాధిస్తుందని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. చదవండి: షాపింగ్ బటన్ జోడించిన వాట్సాప్ 2020–21లో అతి తక్కువ బేస్ ఎఫెక్ట్ దీనికి ప్రధాన కారణంగా వివరించింది. అయితే ఆర్థిక వ్యవస్థలో ఇంకా అనిశ్చితి పరిస్థితులు కొనసాగుతున్నాయని గోల్డ్‌మన్ శాక్స్ నివేదిక పేర్కొంది. కోవిడ్–19 ప్రేరిత అంశాలతో క్షీణతలోకి జారిపోయిన భారత్ ఆర్థిక వ్యవస్థ తిరిగి ఊహించినదానికాన్న వేగంగా రికవరీ అయ్యే అవకాశం ఉందని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ ఇప్పటికే అంచనావేసింది. ఆర్థిక రంగానికి సంబంధించి పలు ఇండికేటర్లు ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 క్యాలెండర్ ఇయర్లో అనుకున్నదానికన్నా కొంచెం బాగుండే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ కూడా ఇటీవలే తన నివేదికలో పేర్కొంది. 2020లో క్షీణ రేటు అంచనాలు ఇంతక్రితం మూడీస్ మైనస్ 9.6% అంచనావేయగా, తాజాగా దీనిని మైనస్ 8.9 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ రెపో... 0.35 శాతం తగ్గే అవకాశం కాగా 2021 నాటికి వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2 నుంచి 6 శాతం మధ్య స్థిరీకరణ పొందే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేయడం గమనార్హం. సరఫరాల సమస్యలు తగ్గడం, తగిన వర్షపాతం, బేస్ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం ఇందుకు కారణాలని తెలిపింది. డాలర్ మారకంలో రూపాయి బలపడ్డం ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడానికి ఒక కారణంగా ఉంటుందని పేర్కొంది. ఆయా అంశాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను ఆర్బీఐ ద్రవ్య పరపతి కమిటీ (ఎంపీసీ) వచ్చే ఏడాది 0.35 శాతం తగ్గించే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్ అభిప్రాయపడింది. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. వ్యవసాయ రంగం పరిస్థితి ఆశాజనకంగా ఉండడం, ముడి చమురు ధరలు ఒక నిర్దిష్ట శ్రేణితో తిరుగుతుండడం, లాక్డౌన్ నిబంధనల సడలింపులతో సరఫరాల వ్యవస్థ మెరుగుపడుతుండడం ఆర్బీఐ అంచనాలకు ప్రధాన కారణాలు. వెరసి డిసెంబర్ త్రైమాసికంలో (క్యూ3) 5.4 శాతానికి, మార్చి త్రైమాసికంలో (క్యూ4) 4.5 శాతానికి ద్రవ్యోల్బణం దిగివస్తుందన్న అంచనాలను వెలువరించింది. క్యూ3లో 3.2–5.9 శాతం శ్రేణి ఉంటే, క్యూ4లో ఈ శ్రేణి 2.4–6.6 శాతం మధ్య ఉంటుందని ఆర్బీఐ తన పాలసీ సమీక్షలో భావించింది. ఈ అంచనాల నేపథ్యంలో వృద్ధికి దోహదపడే సరళతర ద్రవ్య విధానంవైపే ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. కాగా, ఆర్థిక వ్యవస్థ రికవరీ, కరోనా వ్యాక్సిన్ వంటి అంశాల ప్రాతిపదికన అవసరమైతే భవిష్యత్‌తో భారత్ ఈక్విటీలను వోవర్వెయిల్ కేటగిరీలోకి మార్చుతామని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. -
భారీ జరిమానా కట్టేందుకు అంగీకారం
వాషింగ్టన్: ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ కు అమెరికా చరిత్రలోనే అత్యధిక జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిని చెల్లించేందుకు సిద్ధమని గోల్డ్‌మన్ సాక్స్ ప్రకటించింది. 1 యండీబీ మలేషియన్ లంచం కుంభకోణం కేసుకు సంబంధించి అమెరికా న్యాయస్థానం ఈ సంస్థకు 2.9 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇప్పటి వరకు ఒక అవినీతి కేసులో అమెరికా న్యాయస్థానం విధించిన అత్యధిక జరిమానా ఇదే. కోర్టు విధించిన ఫైన్ చెల్లించేందుకు గోల్డ్ మన్ సాక్స్ అంగీకరించిందని యూఎస్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ సీ రాబిట్ స్వయంగా వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గోల్డ్‌మన్ సాక్స్ మోసం చేసిందని, తద్వారా కొన్ని కోట్ల రూపాయల లబ్ధిపొందిందనే ఆరోపణలు నిరూపితమయ్యాయి. ఇందుకోసం 1.6 బిలియన్ డాలర్ల లంచం ఇచ్చిందని సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. మలేషియా ప్రభుత్వ సావరిన్ వెల్త్ ఫండ్ 6.5 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించడానికి గోల్డ్ మన్ సాక్స్ సహకరించిందని, 1 ఎండీబీ ఉన్నతాధికారులు ఈ కుంభకోణంలో దాదాపు 4.5 బిలియన్ డాలర్లను కొట్టేశారనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కుంభకోణం మొత్తం 2009 నుంచి 2015 మధ్య జరిగిందని అమెరికా కోర్టు నిర్ధారించింది. ఇన్వెస్ట్ మెంట్ నిధులను కొందరు అవినీతి అధికారులు లూటీ చేశారని విచారణలో తేలింది. ఇందులో గోల్డ్ మన్ సాక్స్ మలేషియా యూనిట్‌దే ప్రధానపాత్ర. ఈ విషయాలన్నింటిని సంస్థ న్యాయమూర్తి ముందు అంగీకరించింది. తమ వల్ల జరిన నష్టానికి పరిహారం చెల్లించడానికి తాము సిద్ధంగా ఉన్నామని గోల్డ్‌మన్ సాక్స్ తెలిపింది. అయితే మొత్తం మూడున్నర సంవత్సరాల్లో నియంత్రణా సంస్థలను మాయచేస్తూ, లావాదేవీలు జరిగాయని, అందుకు మొత్తం సంస్థను బాధ్యత చేయడం తగదని కోర్టు ముందు వేడుకుంది. మొత్తానికి అమెరికా చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణం, అతి పెద్ద జరిమానా విధించిన సంస్థ గోల్డ్‌మన్ సాక్స్ నిలిచింది. చదవండి: అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!