గోల్డ్‌మన్‌ శాక్స్‌..బ్యాంక్‌ షేర్ల రేటింగ్‌ | Goldman Sachs downgrades Banking sector | Sakshi
Sakshi News home page

గోల్డ్‌మన్‌ శాక్స్‌..బ్యాంక్‌ షేర్ల రేటింగ్‌

Published Fri, Jun 5 2020 11:11 AM | Last Updated on Fri, Jun 5 2020 12:12 PM

Goldman Sachs downgrades Banking sector - Sakshi

దేశీ బ్యాంకుల ఆర్జనలు సగటున 40 శాతం వరకూ తగ్గే వీలున్నదంటూ విదేశీ రీసెర్చ్‌ దిగ్గజం గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజాగా పేర్కొంది. ప్రొవిజన్లు పెరగడం, రుణ చెల్లింపుల వాయిదాలు, నిర్వహణ లాభాలు క్షీణించడం వంటి ప్రతికూలతలు బ్యాంకింగ్‌ రంగంపై ప్రభావం చూపవచ్చని అంచనా వేసింది. దీనిలో భాగంగా ప్రయివేట్‌ రంగ దిగ్గజ బ్యాంకుల రేటింగ్స్‌ను సవరించింది. యాక్సిస్‌ బ్యాంక్‌కు గోల్డ్‌మన్‌ శాక్స్‌ గతంలో ఇచ్చిన న్యూట్రల్‌ రేటింగ్‌ను తాజాగా విక్రయించవచ్చు(సెల్‌)కు సవరించింది. టార్గెట్‌ ధరను రూ. 417 నుంచి రూ. 323కు కోత పెట్టింది. రుణ నాణ్యతకు ఎదురయ్యే సవాళ్లు, నిర్వహణ లాభం నీరసించడం వంటి అంశాలు యాక్సిస్‌ను దెబ్బతీసే వీలున్నట్లు పేర్కొంది.

టార్గెట్‌ కుదింపు
మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ కౌంటర్‌కు ఇంతక్రితం ఇచ్చిన బయ్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌కు గోల్డ్‌మన్‌ శాక్స్‌ సవరించింది. ఫలితంగా ఈ షేరు టార్గెట్‌ ధరను 16 శాతం కుదించి రూ. 1625కు చేర్చింది. గృహ రుణ బిజినెస్‌ మందగించడం, బాండ్‌ మార్కెట్లో క్రెడిట్‌ స్ప్రెడ్స్‌ పెరుగుతుండటం వంటి అంశాలు కంపెనీపై ప్రభావం చూపనున్నట్లు అభిప్రాయపడింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌కు బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నప్పటికీ కవరేజీ జాబితా నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేసింది. 

ఎన్‌బీఎఫ్‌సీలు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా, బంధన్‌ బ్యాంకులకు బయ్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. అయితే ఈ కౌంటర్ల టార్గెట్‌ ధరలను స్వల్పంగా తగ్గించింది. హెచ్‌ఢీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత టార్గెట్‌ రూ. 1142కాగా.. బంధన్‌ బ్యాంక్‌కు రూ. 275ను నిర్ణయించింది. ఈ బాటలో ఎన్‌బీఎఫ్‌సీ విభాగంలో.. బజాజ్‌ ఫైనాన్స్‌, ఆవాస్‌ ఫైనాన్షియర్స్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ కంపెనీలకు ప్రాదాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. అయితే మరోవైపు ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు ‘సెల్‌’ రేటింగ్‌ను ప్రకటించింది. ఈ కంపెనీల ఫండమెంటల్స్‌ బలహీనపడుతున్నట్లు అభిప్రాయపడింది.

25-75 శాతం
ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎన్‌బీఎఫ్‌సీల లోన్‌ బుక్స్‌లో 25-75 శాతం వరకూ రుణ చెల్లింపుల మారటోరియం పరిధిలోనికి వచ్చే వీలున్నట్లు గోల్డ్‌మన్‌ శాక్స్‌  పేర్కొంది. ఇతర దేశాలలో ఇది 10 శాతంవరకూ ఉన్నట్లు తెలియజేసింది. దీంతో ఇది రిటైల్‌ రుణ నాణ్యతకు సవాళ్లు విసరవచ్చని అభిప్రాయపడింది. ప్రధానంగా రుణ వాయిదాలతో రిటైల్‌ విభాగం ప్రభావితంకావచ్చని తెలియజేసింది. 420 బిలియన్‌ డాలర్ల రిటైల్‌ రుణ విభాగంలో మూడు వంతులకు సమానమైన అంటే 268 బిలియన్‌ డాలర్ల రుణాలు రెడ్‌ జోన్లలో ఉన్నట్లు పేర్కొంది. మారటోరియం బుక్స్‌లో సగటున 20 శాతం స్లిప్పేజెస్‌ నమోదుకావచ్చని అంచనా వేస్తోంది. గత ఆరేళ్లతో పోలిస్తే ఇది 5 రెట్లు అధికమని తెలియజేసింది. నిర్వహణ లాభాలు 40 శాతం వరకూ తగ్గవచ్చని, ఫీజు ఆదాయం నీరసించవచ్చని భావిస్తోంది. దీంతో మార్జిన్లపై ఒత్తిడి ఏర్పడే వీలున్నట్లు వివరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement