Goldman Sachs Cuts China's Growth Forecast: వరుస సంక్షోభాలు చైనాకు కంటికి కునుకులేకుండా చేస్తున్నాయి. చైనాలో ఏదైనా సంక్షోభం తలెత్తితే ప్రపంచదేశాలు కలవరపడుతున్నాయి. వరుస సంక్షోభాలతో చైనా వృద్దిరేటు మందగించేలా ఉన్నట్లు పలు ఫైనాన్షియల్ సంస్థలు గుర్తించాయి.
వరుస సంక్షోభాలు..చైనాకు షాకే..!
కొద్దిరోజుల క్రితం చైనాకు చెందిన రియల్టీ సంస్థ ఎవర్‌గ్రాండే దివాలా తీసే పరిస్థితికి చేరుకుంది. ఈ సంక్షోభం సమసిపోకముందే చైనాను మరో సంక్షోభం తలుపుతట్టింది. తీవ్ర విద్యుత్తు కొరత ఇప్పుడు డ్రాగన్‌ను పట్టిపీడిస్తోంది. కొన్ని ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ లైట్లు సైతం వెలగడం లేదు. ఐరోపా సహా ఆసియా దేశాలకు ప్రధాన ఎగుమతిదారుగా ఉన్న చైనాలో ఉత్పత్తి దెబ్బతినే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా పలు దేశాలను ఈ సంక్షోభం తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి: వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్‌మీ వాషింగ్‌మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?
షాకిచ్చిన గోల్డ్‌మన్ సాక్స్..!
అమెరికన్ ఇన్వెస్ట్‌బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీస్ గ్రూప్ గోల్డ్‌మన్ సాక్స్ చైనాకు షాకిచ్చింది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కల్గిన చైనా వృద్ధి అంచనాను గోల్డ్‌మన్ సాక్ భారీగా తగ్గించింది. ఈ ఏడాదిగాను చైనా 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తోందని వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లకు, పలు దేశాల ఎకానమీకి చైనీస్ ప్రాపర్టీ భీమోత్ 'లీమన్ సంక్షోభం' గా మారగలదనే భయాల మధ్య చైనా ఇప్పటికే ఎవర్‌గ్రాండేను కాపాడేందుకు చర్యలను తీసుకుంటుంది. ఈ ఏడాది చైనా ఆర్థిక వ్యవస్థ మూడో త్రైమాసికానికిగాను 4.8 శాతం, నాలుగో త్రైమాసికానికి 3.2 శాతం మేర వృద్ధి రేటును తగ్గించింది. మునపటితో పోలిస్తే వృద్ధి రేటు భారీగా తగ్గనుంది. వృద్దిరేటు తగ్గడం చైనాకు భారీ దెబ్బే అని గోల్డ్‌మన్ సాక్స్ అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment