కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమయిన తరుణంలో అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ గోల్డ్‌మెన్ శాక్స్ దేశానికి షాకిచ్చే విషయాన్ని వెల్లడించింది. భారత్ అమలు చేస్తున్న లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి తీవ్ర ఆర్థిక మాంధ్యాన్ని ఎదుర్కొవచ్చని సంస్థ అభిప్రాయపడింది. గతంలో ఎన్నడు జరగని విధంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోనుందని తెలిపింది. గతంలో దేశ వృద్ధి రేటు 20శాతం తగ్గుదల ఉంటుందని భావించిన సంస్థ కరోనా వ్యాప్తి వల్ల 45శాతం తగ్గుదల ఉంటుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 20లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని పేర్కొంది. గత కొద్ది రోజులుగా వివిద రంగాలను గాడిలో పెట్టే విధంగా నిర్మాణాత్మక సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపింది. దేశంలో అమలు కాబోతున్న ఆర్థిక సంస్కరణలను విశ్లేషిస్తామని గోల్డ్‌మెన్ సంస్థకు చెందిన పలువురు ఆర్థిక వేత్తలు విశ్లేషించారు.
చదవండి: రూ 38 కోట్లు ముంచిన ఉద్యోగిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment