ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ రానున్న వారాల్లో కొన్ని వందల మంది ఉద్యోగులను వదిలించుకోవాలని యోచిస్తోంది.తక్కువ-పనితీరు గల సిబ్బంది వార్షిక తొలగింపులో భాగంగా దీన్ని అమలు చేయబోతోందని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను ఉటంకిస్తూ బ్లూమ్‌బర్గ్ నివేదించింది.
తాజా తొలగింపులతో కలుపుకొంటే 2024 ఏడాదిలో మొత్తంగా 3 నుంచి 4 శాతం సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారు. వీటిలో చాలా చాలా వరకు ఏడాది ప్రారంభంలోనే జరినట్లు తెలుస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కొత్త ప్రతిభను చేర్చుకోవడానికి వీలుగా బ్యాంక్ ఈ చర్యలకు పూనుకుంటోంది. ఉద్యోగుల పనితీరు వార్షిక సమీక్షను కోవిడ్ సమయంలో తాత్కాలికంగా నిలిపేసిన బ్యాంక్ తిరిగి అమలు చేస్తోంది.
గోల్డ్‌మ్యాన్ సాచ్స్ గ్రూప్ ఏడాది మధ్యలో 44,300 మందిని నియమించుకుంది. సిబ్బందికి సంబంధించిన బ్యాంక్ వార్షిక సమీక్ష సాధారణంగా జరిగే ప్రామాణిక ప్రక్రియ అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను కలిగి ఉండాలని కంపెనీ యోచిస్తోందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment