
ఆర్థిక కార్యకలాపాలకు దెబ్బే..
• స్వల్పకాలంలో వృద్ధి దెబ్బతింటుంది
• నోట్ల రద్దుపై గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడి
ముంబై: బ్లాక్ మనీని అడ్డుకోవటానికి ఇప్పటిదాకా చలామణిలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం చేసిన ప్రకటన వల్ల ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ స్పష్టంచేసింది. ‘‘కేంద్రం చర్యతో బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెరుగుతుంది. అది మంచిదే. కానీ రాబోయే రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు మందగిస్తారుు. ఆర్థిక వ్యవస్థకిది ప్రతికూలం’’ అని సంస్థ ఒక నివేదికలో స్పష్టంచేసింది. ‘‘ఆర్థిక కోణంలో చూసినపుడు నగదు సరఫరాపై, వినియోగ వ్యయంపై, ద్రవ్య విధానాలపై... ద్రవ్యోల్బణంపై దీని ప్రభావం చాలావరకూ ఉంటుంది’’ అని సంస్థ పేర్కొంది.
వ్యక్తులు తమ నగదును బ్యాంకు ఖాతాల్లో వేస్తారు కనక వచ్చే నెలలో ఆర్థిక కలాపాలు మందగిస్తాయని నివేదిక అభిప్రాయపడింది. వ్యక్తుల ఆర్థిక ఆస్తుల్లో దాదాపు 10 శాతం నగదు రూపంలోనే ఉన్నాయని, డిబెంచర్లు- ఈక్విటీల్లో ఉన్నదానికన్నా ఇది అధికమని వెల్లడించింది. ‘‘ఈ సంస్కరణ మధ్య కాలానికి సానకూలమైనదే. ఎందుకంటే దీనివల్ల పారదర్శకత, జవాబుదారీ తనం పెరుగుతారుు. ఎలక్టాన్రిక్, బ్యాంకింగ్ వ్యవస్థద్వారా లావాదేవీలు అధికమవుతారుు. అప్రకటిత ధనాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే పన్ను అధికారులు గమనిస్తూనే ఉంటారు కనక ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. దీంతో 2016-17లో అంచనావేసిన 3.5 శాతం ద్రవ్యలోటు కన్నా తక్కువగా 2017-18లో లోటు 3 శాతమే ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది.
అరుుతే స్వల్ప కాలానికి చూస్తే నగదుపై ఆధారపడిన జ్యుయలరీ, రెస్టారెంట్లు, ఫుడ్-బెవరేజెస్, రవాణా వంటి రంగాలు బాగా దెబ్బతింటాయని... పలు ఇళ్లలో వీటిపై పెడుతున్న ఖర్చు 50 శాతందాకా ఉంది కనక ఈ రంగంపై ఆధారపడిన వారిమీద కూడా ఈ ప్రభావం ఉంటుందని గోల్డ్‌మన్ శాక్స్ వెల్లడించింది.