అంచనా విలువ తగ్గింపుతో షేరు పతనం
న్యూఢిల్లీ: టెలికం రంగ కంపెనీ వొడాఫోన్ ఐడియా మార్కెట్ వాటా రానున్న 3–4 ఏళ్ల కాలంలో తగ్గుతూనే ఉంటుందని బ్రోకరేజీ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ తాజాగా అభిప్రాయపడింది. వొడాఫోన్ ఐడియా ఇటీవల చేపట్టిన మూలధన సమీకరణ సానుకూల అంశమే అయినప్పటికీ మార్కెట్ వాటా కోల్పోవడాన్ని అరికట్టబోదని గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది. రానున్న 3–4 ఏళ్లలో 300 బేసిస్ పాయింట్ల(3 శాతం)మేర మార్కెట్ వాటాకు కోత పడనున్నట్లు అంచనా వేసింది.
ఈ సందర్భంగా పెట్టుబడి వ్యయాలు, ఆదాయ మార్కెట్ వాటా మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ప్రస్తావించింది. వొడాఫోన్ ఐడియాతో పోలిస్తే ప్రత్యర్ధి కంపెనీలు 50 శాతం అధికంగా పెట్టుబడులను వెచి్చస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల నిధులను సమీకరించడం ఈ టెలికం కంపెనీకి సానుకూల అంశమేనని, అయితే మార్కెట్ వాటా బలహీనపడటాన్ని నివారించలేదని విదేశీ బ్రోకింగ్ సంస్థ వ్యాఖ్యానించింది.
వెరసి సానుకూల ధోరణితో చూస్తే షేరు అంచనా విలువను రూ. 19గా పేర్కొంది. ప్రస్తుత రేటు(గురువారం ముగింపు)తో పోలిస్తే 26 శాతం అధికమైనప్పటికీ బేస్‌కేసుగా చేసిన మదింపుతో చూస్తే మాత్రం 83 శాతం పతనంకావచ్చని తెలియజేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26) నుంచి వొడాఫోన్‌కు సర్దుబాటుచేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్) స్పెక్ట్రమ్ సంబంధ చెల్లింపులు ప్రారంభంకానున్నట్లు తెలియజేసింది.
వీటిలో కొంతమేర బకాయిలను ఈక్విటీగా మార్చుకునేందుకు ప్రభుత్వానికి అవకాశమున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే ఫ్రీక్యా‹Ùఫ్లో స్థితికి చేరేందుకు ఏఆర్‌పీయూ రూ. 200–270కు జంప్‌చేయవలసి ఉన్నట్లు అంచనా వేసింది. సమీపకాలంలో ఇది జరిగేందుకు అవకాశాలు తక్కువేనని అభిప్రాయపడింది. టారిఫ్‌ల పెంపు, పెట్టుబడుల సమీకరణ నేపథ్యంలోనూ 2025 మార్చికల్లా నికర రుణభారం– నిర్వహణ లాభం(ఇబిటా) నిష్పత్తి మెరుగుపడకపోవచ్చని వివరించింది.
ఈ నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేరు బీఎస్‌ఈలో 11.5% పతనమై రూ. 13.36 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment