గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి యాపిల్ సంస్థ యాపిల్‌కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ కార్డ్‌ని అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయడానికి గోల్డ్‌మన్ సాక్స్ మంతనాలు జరుపుతుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. దాంతో వారి భాగస్వామ్యాన్ని రద్దు చేసుకోవాలని యాపిల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు సంస్థలు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. యాపిల్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి వచ్చే 12-15 నెలల్లో యాపిల్ కార్డు నిలిపేయనుంది. 2019లో ప్రారంభించిన క్రెడిట్ కార్డ్ సేవలతోపాటు ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టిన పొదుపు ఖాతాలను యాపిల్ గోల్డ్‌మన్ సాక్స్‌తో కలిసి నిర్వహిస్తోంది. అయితే యాపిల్‌కార్డును అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌కు బదిలీ చేయాలని గోల్డ్‌మన్ సాక్స్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దాంతో తమ భాగస్వామ్యాన్ని రద్దు చేయమని కోరుతూ యాపిల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఆగస్టులో యాపిల్ తన వినియోగదారులకు అధిక ఈల్డ్ ఇచ్చే పొదుపు ఖాతాలు ప్రారంభించింది. అది యాపిల్‌కార్డుకు అనుసంధానం చేసింది. అందులో దాదాపు రూ. 83 వేల కోట్ల డిపాజిట్లను సేకరించింది. దానికి 4.15 శాతం ఈల్డ్ అందిస్తుంది. గోల్డ్‌మన్ సాక్స్‌తో 2029 వరకు ఈ ఒప్పందం ఉంది. కానీ ప్రస్తుతం నెలకొన్ని అనిశ్చిత పరిస్థితుల ద్వారా ఈ డీల్‌ను రద్దుచేసుకోవాలని యాపిల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సేవింగ్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి 97 శాతం మంది కస్టమర్‌లు రోజువారీ నగదును వారి ఖాతాల్లో జమ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు యాపిల్ తెలిపింది.
ఇదీ చదవండి: రద్దు చేసి 6 నెలలవుతున్నా ఇంకా ప్రజలవద్ద రూ.9,760 కోట్లు!
యాపిల్ అమెరికాలో ‘బైనౌ..పే లేటర్’ విధానాన్ని మాస్టర్‌కార్డ్ ఇన్‌స్టాల్‌మెంట్స్ ప్రోగ్రామ్‌తో కలిసి ప్రారంభించింది. గోల్డ్‌మన్ సాక్స్ ఆ మాస్టర్‌కార్డ్ చెల్లింపుల క్రెడెన్షియల్స్‌ను జారీ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment