ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌, లక్షకు పైగా ఉద్యోగాలకు.. .. | Goldman Sachs PwC Tata Consultancy Services Infosys hire freshers | Sakshi
Sakshi News home page

Hiring Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్‌, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..

Published Thu, Sep 23 2021 5:13 PM | Last Updated on Thu, Sep 23 2021 7:20 PM

Goldman Sachs PwC Tata Consultancy Services Infosys hire freshers - Sakshi

మీరు చదువు కంప్లీట్‌ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్‌న్యూస్‌. పలు దిగ్గజ ఎంఎన్‌సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌,బైజూస్‌,టాటా స్టీల్‌,ఇన్ఫోసిస్‌ కంపెనీలు ఆఫ్‌ క్యాంపస్‌లో భారీ ఎత్తున ఫ్రెషర్స్‌ ను రిక్రూట్‌ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఓ రిపోర్ట్‌ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన  కాగ్నిజెంట్‌ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్‌ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది.

ఇన్ఫోసిస్ సైతం  గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్‌ దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది.

ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌ శంతను మాట్లాడుతూ.. ఫుల్‌ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్‌/ఎంఎల్‌ డెవ‌ల‌ప‌ర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు.

ఫైనాన్షియల్‌ దిగ్గజం గోల్డ్‌ మన్‌ సాక్స్‌ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటి) నుండి ఇంజనీరింగ్‌ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్‌ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్‌ క్యాంపస్‌లలో క‍్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్‌ కేపిటల్‌ మేనేజ్మెంట్‌ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు.

ఈ నియామకాల్లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్‌ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్‌లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్‌సోర్సింగ్స్‌ సంస్థలు,స్టార్టప్‌లు, సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్‌ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. 

చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్‌లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement