Tata Steel
-
ప్రముఖ కంపెనీలో 1600 ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ తమ నెదర్లాండ్స్ ప్లాంటు కార్యకలాపాలను క్రమబదీ్ధకరించుకునే క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటోంది. మేనేజ్మెంట్, సపోర్ట్ విధులకు సంబంధించి 1,600 ఉద్యోగాల్లో కోత విధించనున్నట్లు సంస్థ తెలిపింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని, మార్జిన్లను మెరుగుపర్చుకోవడానికి, వ్యయాలు తగ్గించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వివరించింది.స్థానిక మేనేజ్మెంట్ బోర్డులో కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ విషయాలను సెంట్రల్ వర్క్స్ కౌన్సిల్‌తో పాటు ట్రేడ్ యూనియన్లకు కూడా తెలియజేసినట్లు కంపెనీ వివరించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో నెదర్లాండ్స్ ప్లాంటు 6.75 మిలియన్ టన్నుల లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి చేసింది.భౌగోళిక.. రాజకీయ పరిణామాల వల్ల యూరప్‌లో డిమాండ్ నెమ్మదించడం, వాణిజ్యం.. సరఫరా వ్యవస్థల్లో అవాంతరాలు ఏర్పడటం తదితర అంశాలు నిర్వహణ వ్యయాలపైనా, అంతిమంగా ఆర్థిక పనితీరుపైనా ప్రభావం చూపాయి. నెదర్లాండ్స్ ప్లాంటులో హరిత టెక్నాలజీలను అమల్లోకి తేవడానికి కట్టుబడి ఉన్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. ఇందులో భాగంగా ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌ల స్థానంలో అధునాతన పర్యావరణహిత ఫర్నేస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు, దీనితో ఏటా 5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గనున్నట్లు వివరించారు. -
టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు. -
దేశ ఉక్కు సంకల్పం.. టాటా
టాటా గ్రూప్ లో భాగమైన టాటా స్టీల్ లిమిటెడ్ భౌగోళికంగా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యభరితమైన ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటి. 1907లో జంషెడ్జీ నుస్సెర్వాన్‌జీ టాటా చేత టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ (టిస్కో) గా స్థాపితమైన ఈ సంస్థ ఉక్కు పరిశ్రమలో గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. మహారాష్ట్రలోని ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న టాటా స్టీల్ భారత్, నెదర్లాండ్స్, యునైటెడ్ కింగ్ డమ్ లలో కీలక కార్యకలాపాలతో 26 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.జేఎన్ టాటా జయంతిటాటా స్టీల్ దార్శనిక వ్యవస్థాపకుడు, క్లుప్తంగా జెఎన్ టాటా అని పిలిచే జంషెడ్జీ నుస్సెర్వాన్‌జీ టాటా జయంతి మార్చి 3న. ఈసారి 186వ జయంతిని ఆ సంస్థ సగర్వంగా జరుపుకుంటోంది. దేశ అత్యంత ఐకానిక్ కంపెనీలలో ఒకదానికి పునాది వేసిన మార్గదర్శక స్ఫూర్తి, పారిశ్రామిక ఔన్నత్యానికి అచంచలమైన నిబద్ధత ఉన్న వ్యక్తికి నివాళిగా ఆయన జయంతిని ఫౌండర్ డేగా నిర్వహిస్తున్నారు.దూరదృష్టి గల నాయకుడు1839 మార్చి 3న గుజరాత్ లో జన్మించిన జేఎన్ టాటా భారత పారిశ్రామిక ముఖచిత్రాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన దార్శనిక పారిశ్రామికవేత్త. 1870 లలో మధ్య భారతదేశంలో ఒక వస్త్ర మిల్లుతో ఆయన వ్యవస్థాపక ప్రయాణం ప్రారంభమైంది. అయితే, ఆయన దార్శనికత వస్త్ర వ్యాపారాన్ని దాటి విస్తరించింది. భారత్ ను పారిశ్రామిక దేశాల సరసన నిలిపే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలన్నది జేఎన్ టాటా కల. 1907లో టాటా స్టీల్ స్థాపనతో ఈ కల సాకారమైంది. ఇది భారతదేశ ఉక్కు పరిశ్రమకు నాంది పలికింది.టాటా స్టీల్ ఘనతలు● 2024 మార్చి 31 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రూప్ దాదాపు 27.7 బిలియన్ డాలర్ల ఏకీకృత టర్నోవర్‌ను నమోదు చేసింది.● గ్రేట్ ప్లేస్ టు వర్క్ సంస్థగా గుర్తింపు పొందిన టాటా స్టీల్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, అసోసియేట్లు, జాయింట్ వెంచర్లతో కలిసి, 78,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులతో ఐదు ఖండాలలో విస్తరించి ఉంది.● టాటా స్టీల్ 2045 నాటికి నికర జీరోతో సహా దాని ప్రధాన స్థిరత్వ లక్ష్యాలను ప్రకటించింది.● కంపెనీ తన జంషెడ్పూర్, కళింగనగర్ , ఐజేముదీన్ ప్లాంట్లకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ లైట్‌హౌస్ గుర్తింపును అందుకుంది. టాటా స్టీల్‌ను ఎకనామిక్ టైమ్స్ సీఐఓ 'డిజిటల్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ఇండియా - స్టీల్' అవార్డు 2024తో గుర్తించింది.● ఈ కంపెనీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ డైవర్సిటీ ఈక్విటీ & ఇంక్లూజన్ లైట్‌హౌస్ 2023తో గుర్తింపు పొందింది.● ఈ కంపెనీ 2012 నుండి డీజేఎస్ఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భాగంగా ఉంది. 2016 నుండి డీజేఎస్ఐ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్లో టాప్ 10 స్టీల్ కంపెనీలలో స్థిరంగా స్థానం సంపాదించుకుంది.● టాటా స్టీల్ జంషెడ్పూర్ ప్లాంట్ భారతదేశంలో రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫికేషన్ పొందిన మొట్టమొదటి సైట్. తదనంతరం కళింగనగర్, మెరామండలి ప్లాంట్లు కూడా సర్టిఫికేషన్ పొందాయి దేశంలో, టాటా స్టీల్ ఇప్పుడు దాని ఉక్కు ఉత్పత్తిలో 90% కంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ స్టీల్ సర్టిఫైడ్ సైట్ల నుండి కలిగి ఉంది.● 2016-17 సంవత్సరానికి ఉత్తమ పనితీరు కనబరిచిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా ప్రైమ్ మినిస్టర్స్ ట్రోపీ, 2024లో వరల్డ్ స్టీల్ నుంచి వరుసగా ఏడు సంవత్సరాలు స్టీల్ సస్టైనబిలిటీ ఛాంపియన్ గుర్తింపు, సీడీపీ ద్వారా 2023 క్లైమేట్ చేంజ్ లీడర్షిప్ అవార్డు, 2022లో డన్ & బ్రాడ్‌స్ట్రీట్ టాప్ 500 కంపెనీలలో అగ్రగామి, బ్రాండ్ ఫైనాన్స్ ద్వారా దేశంలో 2024 అత్యంత విలువైన మైనింగ్ అండ్ మెటల్స్ బ్రాండ్‌గా ర్యాంక్, ఎథిస్పియర్ ఇన్స్టిట్యూట్ నుండి 2021లో 'మోస్ట్ ఎథికల్ కంపెనీ' అవార్డు, స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్స్ 2024లో 'బెస్ట్ కార్పొరేట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పోర్ట్స్' గుర్తింపును పొందింది.● 2023 గ్లోబల్ ఈఆర్ఎం (ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్) అవార్డు ఆఫ్ డిస్టింక్షన్, వరుసగా ఎనిమిదవ సంవత్సరం 'మాస్టర్స్ ఆఫ్ రిస్క్' - మెటల్స్ & మైనింగ్ సెక్టార్ గుర్తింపు, ఐసీఎస్ఐ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ అవార్డు 2023 అందుకుంది. -
ఉక్కు రంగానికి దిగుమతుల సెగ: టాటా స్టీల్ సీఈవో
న్యూఢిల్లీ: చౌక ఉక్కు దిగుమతులు వెల్లువెత్తుతుండటం దేశీయంగా పరిశ్రమను దెబ్బతీస్తోందని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. మిగతా మార్కెట్లలో అవకాశాల్లేక పలు దేశాల నుంచి స్టీల్ భారత్‌కు మళ్లుతోందని ఆయన చెప్పారు. దీనితో దేశీయంగా ధరలు పడిపోయి, ఉక్కు కంపెనీలు సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు.భవిష్యత్తులో ఉక్కు పరిశ్రమ పెట్టుబడులపై కూడా ఇది ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని నరేంద్రన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే చౌక దిగుమతులను కట్టడి చేయాలంటూ ప్రభుత్వానికి పరిశ్రమ విజ్ఞప్తి చేసినట్లు ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ 69వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.కేంద్రం తగు చర్యలు తీసుకుంటుందని పరిశ్రమ ఎదురు చూస్తోందని ఆయన పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా అత్యధికంగా ఇన్వెస్ట్ చేస్తున్న ప్రైవేట్ రంగాల్లో ఉక్కు పరిశ్రమ కూడా ఉందని నరేంద్రన్ చెప్పారు. ప్రస్తుతం ఒక విడత విస్తరణ ప్రణాళికలు పూర్తయినట్లు వివరించారు. అధికారిక గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య కాలంలో భారత ఉక్కు ఎగుమతులు సుమారు 29 శాతం క్షీణించి 3.99 మిలియన్ టన్నులకు పరిమితయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఎగుమతులు 5.61 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. మరోవైపు, ఏప్రిల్–జనవరి మధ్య వ్యవధిలో దిగుమతులు 20 శాతం పెరిగి 8.29 మిలియన్ టన్నులకు చేరాయి. -
ఒంటరిగా ఆధిక్యంలో గుకేశ్
విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో పదో రౌండ్ తర్వాత భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్(D Gukesh ) 7.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో ఉన్నాడు. మాక్స్ వార్మెర్డామ్ (నెదర్లాండ్స్)తో బుధవారం జరిగిన పదో రౌండ్ గేమ్‌లో గుకేశ్ 34 ఎత్తుల్లో గెలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత గుకేశ్‌కు ఇదే మొదటి టోర్నమెంట్ కావడం గమనార్హం. మరోవైపు ఉజ్బెకిస్తాన్ గ్రాండ్‌మాస్టర్ నోడిర్బెక్ అబ్దుసత్తోరోవ్ 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. రష్యాకు చెందిన అలెక్సీ సరానాను నోడిర్బెక్ ఓడించాడు. ఇక భారత్‌కే చెందిన గ్రాండ్‌మాస్టర్లు ప్రజ్ఞానంద 6.5 పాయింట్లతో మూడో స్థానంలో, ఇరిగేశి అర్జున్ 3 పాయింట్లతో 13వ స్థానంలో ఉన్నారు. 14 మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరుగుతోంది.చదవండి: జనాయ్ భోంస్లే కాదు.. సిరాజ్ డేటింగ్లో ఉన్నది ఆమెతోనే? -
‘ఉక్కు’ మహిళలు!
ప్రముఖ స్టీల్ తయారీ కంపెనీ టాటా స్టీల్ మైనింగ్ కార్యకాలాపాలను పూర్తిగా మహిళలతోనే నిర్వహించి రికార్డు నెలకొల్పింది. పురుషులకు ధీటుగా మైనింగ్ పనుల్లో పూర్తి మహిళలతో స్టీల్‌ను ఉత్పత్తి చేస్తుంది. దేశంలో మొట్టమొదటిసారి ఇలా మహిళలతో మైనింగ్ పనులు చేయిస్తున్న కంపెనీగా టాటా గుర్తింపు పొందింది.ఇదీ చదవండి: విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్జార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని నోముండి ఇనుప గనిలో టాటా స్టీల్ మహిళాషిఫ్ట్ను ప్రారంభించింది. భారీ మెషినరీ, పారలు, లోడర్లు, డ్రిల్స్, డోజర్లు, షిఫ్ట్ పర్యవేక్షణతో సహా అన్ని మైనింగ్ కార్యకలాపాలను మహిళా ఉద్యోగులతోనే నిర్వహిస్తోంది. మహిళలు దేనిలో తక్కువకాదని చెప్పడంతోపాటు వారు సమాజంలో మరింత ధీమాగా ఉండేలా కంపెనీ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో స్థానికులను భాగస్వామ్యం చేసేందుకు ప్రత్యేకంగా ‘తేజస్విని’ పేరుతో నియామకాలు, శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
టాటా స్టీల్, గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్‌కు లాభాలు
టాటా స్టీల్ సెప్టెంబర్ త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.759 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.6,511 కోట్ల నష్టం ఎదురుకావడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.55,910 కోట్ల నుంచి రూ.54,503 కోట్లకు తగ్గింది. కంపెనీ వ్యయాలను గణనీయంగా తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో వ్యయాలు రూ.55,853 కోట్లుగా ఉంటే, సమీక్షా త్రైమాసికంలో రూ.52,331 కోట్లకు పరిమితమయ్యాయి.సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.4,806 కోట్ల మూలధన వ్యయాలను వెచ్చించింది. కంపెనీ నికర రుణభారం రూ.88,817 కోట్లుగా ఉంది. కంపెనీ వద్ద రూ.26,028 కోట్ల లిక్విడిటీ ఉంది. టాటా స్టీల్ యూకే ఆదాయం 600 మిలియన్ పౌండ్లుగా ఉంటే, 147 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నష్టం నమోదైంది. నెదర్లాండ్ కార్యకలాపాల నుంచి 1,300 మిలియన్ పౌండ్ల ఆదాయం రాగా, 22 మిలియన్ పౌండ్ల ఎబిట్డా నమోదైంది. దేశంలోనే అతిపెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ కళింగనగర్ ప్లాంట్ ప్రారంభమైనట్టు సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా నిర్వహణ వాతావరణం ఎంతో సంక్లిష్టంగా ఉన్నట్టు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కొన్ని కీలక ప్రాంతాల్లో వృద్ధి స్దబ్దుగా ఉన్నట్టు అంగీకరించారు. యూకే ప్రభుత్వంతో నిధులపై ఒప్పందాన్ని చేసుకున్నామని, గ్రీన్ స్టీల్‌కు మళ్లే దిశగా పురోగతిలో ఉన్నట్టు చెప్పారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేరు ధర ఒక శాతం లాభపడి రూ.154 వద్ద స్థిరపడింది.ఇదీ చదవండి: ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్.. ఫర్వాలేదుగల్ప్ ఆయిల్ లూబ్రికెంట్స్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో సానుకూల వృద్ధిని నమోదు చేసింది. నికర లాభం 15 శాతం వృద్ధితో రూ.84 కోట్లకు, ఆదాయం 6 శాతం పెరిగి రూ.849 కోట్లకు చేరాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో లాభం రూ.74 కోట్లు, ఆదాయం రూ.802 కోట్లుగా ఉండడం గమనార్హం. అనిశి్చత మార్కెట్ పరిస్థితుల్లో మంచి పనితీరు చూపించినట్టు కంపెనీ ప్రకటించింది. మార్జిన్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టామని, దీంతో స్థూల మార్జిన్లలో మెరుగుదల నమోదైనట్టు కంపెనీ సీఎఫ్‌వో మనీష్ గంగ్వాల్ తెలిపారు. లాభదాయకత పెంచుకోవడం ద్వారా వాటాదారులకు మరింత విలువ సమకూర్చుతామని ప్రకటించారు. డిమాండ్‌పై సానుకూల అంచనాలతో ఉన్నామని, మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి భారత లూబ్రికెంట్ల రంగంపై విశ్వాసంతో ఉన్నట్టు చెప్పారు. పటిష్ట ఫలితాలతో బీఎస్ఈలో కంపెనీ షేరు ధర 6 శాతం ఎగసి రూ.1,263 వద్ద ముగిసింది. -
ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..
రతన్ టాటా తన 86వ ఏట అక్టోబర్ 9న ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనేక గొప్ప విజయాలు, దాతృత్వ కార్యక్రమాలతో నిండిన ఈయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. టాటా స్టీల్ కంపెనీ కోసం ఒక అమెరికన్ సంస్థలో జాబ్ ఆఫర్‌ను సైతం రతన్ టాటా అవలీలగా వదులుకున్న సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం..ఐబీఎమ్ కంపెనీ ఆఫర్1961లో రతన్ టాటాకు అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా టాటా స్టీల్దశాబ్దాల చరిత్ర కలిగిన టాటా స్టీల్ కంపెనీను జంషెడ్జీ టాటా 1907లో ప్రారంభించారు. ఇదే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్టీల్ కంపెనీగా అవతరించింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు, ఆ తరువాత ఈ సంస్థ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అభివృద్ధి పనుల కోసం దేశానికి ఉక్కు చాలా అవసరం అయినప్పుడు, టాటా స్టీల్ దేశాభివృద్ధికి భుజం భుజం కలిపి నిలబడింది. ఈ కంపెనీ దేశ ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచింది.ప్రస్తుతం టాటా స్టీల్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ షేరు ప్రస్తుత విలువ రూ.159. అయితే రతన్ టాటా జాబ్ ఆఫర్ వద్దనుకున్న కంపెనీ.. ఐబీఎమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 18 లక్షల కోట్లుగా ఉంది. ఇది టాటా స్టీల్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దది.ఇదీ చదవండి: వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలుటాటా స్టీల్‌తో రతన్ టాటా సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ కంపెనీ ఆయన కెరీర్‌ను ప్రారంభించడమే కాకుండా.. నాయకత్వ నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ వంటి విలువైన పాఠాలను కూడా నేర్పింది. టాటా స్టీల్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. దేశాభివృద్ధికి మాత్రమే.. సమాజ శ్రేయస్సును మెరుగుపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. -
టాటా స్టీల్.. 2,800 ఉద్యోగాలు కోత
టాటా స్టీల్ తన ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తామన్న ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేసింది. బ్రిటన్ తయారీ యూనిట్‌లోని ‘కార్బన్ ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్’ మూసివేత ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పింది. ఈమేరకు టాటా స్టీల్ గ్లోబల్ సీఈఓ టీవీ నరేంద్రన్ రాయిటర్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్రిటన్‌లోని టాటా స్టీల్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగులు కోత ఉండబోతుందని గతంలోనే ప్రకటించాం. ఆ ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులేదు. ఇప్పటికే ఒక కార్బన్-ఇంటెన్సివ్ బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసివేస్తున్నట్లు చెప్పాం. ఆమేరకు చర్యలు ప్రారంభమయ్యాయి. స్టీల్ ముడిసరుకుగా ఉన్న ఐరన్‌ఓర్ ధరలు భారీగా పెరిగాయి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడం లేదు. యూకే ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు అవసరమని ప్రతిపాదనలు పంపించాం. తయారీ యూనిట్‌లోని మరో బ్లాస్ట్ ఫర్నేస్‌ను సెప్టెంబర్‌లో మూసివేసేలా చర్చలు జరుగుతున్నాయి. రెండు ఫర్నేస్‌లు మూతపడడంతో సౌత్ వేల్స్‌లోని పోర్ట్ టాల్బోట్ యూనిట్లో 2,800 వరకు ఉద్యోగాలు కోల్పోనున్నారు. ఉద్యోగులు తొలగింపు అంశం యూనియన్లు, కంపెనీ, ప్రభుత్వం సమష్టి బాధ్యత. కేవలం కంపెనీ నిర్ణయాలే వాటిని ప్రభావితం చేయవు’ అని చెప్పారు.ఇదీ చదవండి: జులైలో పెరిగిన జీఎస్టీ వసూళ్లుబ్రిటన్ వాణిజ్య మంత్రి జోనాథన్ రేనాల్డ్స్ జులైలో మాట్లాడుతూ..కొత్త ప్రభుత్వం టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చించి ఉద్యోగులు కోతను నివారించేలా చర్యలు చేపడుతుందన్నారు. ప్లాంట్ నుంచి తక్కువ కార్బన్ విడుదలయ్యేలా అవసరమయ్యే సాంకేతిక సహాయం అందిస్తుందని చెప్పారు. ‘లోకార్బన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్’ను నిర్మించడంలో సహాయం చేయడానికి గత ప్రభుత్వం టాటా స్టీల్‌తో చేసుకున్న 500 మిలియన్ పౌండ్ (రూ.5,318 కోట్లు) ఒప్పంద ప్యాకేజీపై కొత్త ప్రభుత్వం సంతకం చేయాల్సి ఉంది. -
టాటా స్టీల్ కీలక నిర్ణయం.. 2500 ఉద్యోగాల కోత
గ్లోబల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ఉత్పత్తులు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో యూకేలోని టాటా స్టీల్ తన సిబ్బందిలో 2500 మందిని తొలగించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ తెలిపారు.యూకే టాటా స్టీల్ సంస్థలో ఉద్యోగాలు పోతాయనే భయంతో కార్మికుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేఖిస్తూ.. నిరసనలు కూడా తెలియజేస్తున్నాయి. యూకే ప్రభుత్వం సాయంతో డీకార్బనైజేషన్ ప్లాన్‌లో భాగంగా.. కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించి, ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేస్ ప్రక్రియకు మారుతోంది. కాబట్టి రాబోయే మూడేళ్ళలో కర్బన ఆధారిత తయారీ పూర్తిగా నిలిపిఈవేస్తున్నట్లు సమాచారం.టాటా స్టీల్ సంస్థ యూకేలో ఎలక్ట్రిక్ ఉత్పత్తులను పెంచనుంది. తద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించనుంది. భారత్ కేంద్రంగా పనిచేస్తున్న టాటా స్టీల్ యూకేలో అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థగా కీర్తి గడించింది. ఇక్కడ సుమారు 8000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూకే కంపెనీ ఏడాదికి 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సుమారు 2500 మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.సెప్టెంబర్ 2023లో టాటా స్టీల్ అండ్ యూకే ప్రభుత్వం బ్రిటన్‌లోని పోర్ట్ టాల్బోట్ స్టీల్ తయారీ సదుపాయంలో డీకార్బనైజేషన్ ప్లాన్లను అమలు చేయడానికి 1.25 బిలియన్ పౌండ్ల ఉమ్మడి పెట్టుబడి ప్రణాళికపై అంగీకరించాయి. ఇందులో 500 మిలియన్ పౌండ్లు యూకే ప్రభుత్వం అందించింది. -
టాటా స్టీల్ సరికొత్త రికార్డ్‌లు
స్టీల్ ఉత్పత్తుల్లో టాటా స్టీల్ సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. టాటా స్టీల్‌కు రిటైల్, ఆటోమోటివ్, రైల్వే విభాగాల నుండి భారీ ఆర్డర్లు రావడంతో ఉత్పత్తుల్ని పెంచేస్తుంది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2024లో మొత్తం స్టీల్ డెలివరీలలో 6 శాతం వృద్ధిని 19.90 మిలియన్ టన్నులని నివేదించింది. మునుపటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో 18.85 మిలియన్ టన్నుల (ఎంటీ) ఉక్కును ఉత్పత్తి చేసినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఆటోమోటివ్, ప్రత్యేక ఉత్పత్తుల సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో 2.9 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ఫలితంగా ఆర్ధిక సంవత్సరం 2023 మునుపటి రికార్డును అధిగమించింది. బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్ డెలివరీలు ఫైనాన్షియల్ ఇయర్ 2024లో డెలివరీలు 11 శాతం పెరిగి 6.5 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. పారిశ్రామిక ఉత్పత్తులు & ప్రాజెక్టుల సెగ్మెంట్ డెలివరీలు 6 శాతం పెరిగి 7.7 మిలియన్ టన్నులకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది. ఇంగ్లిష్‌లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్‌లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే.. 2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్‌లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది. -
T V Narendren: రానున్న మూడు దశాబ్దాలు భారత్‌కు కీలకం
జంషెడ్పూర్: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్‌కు రాబోయే మూడు దశాబ్దాలు అభివృద్ధి విషయంలో కీలకమైనవని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత 30–40 ఏళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందిందని, ఇక ఇదే విధమైన వృద్ధి తీరును భారత్ కొనసాగించే సమయం ఆసన్నమైందని ఇక్కడ సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సీసీఐ) సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ► ప్రస్తుతం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి చేసే దేశం. భారత్ రెండవ స్థానంలో ఉంది. ఉక్కు రంగం ఎదుర్కొంటున్న ప్రపంచ సవాళ్లను, ధరలను దృష్టిలో ఉంచుకుని మనం విధాన కల్పనలో ముందుకుసాగాలి. ► భారత్‌లో గత రెండు, మూడేళ్లలో మౌలిక సదుపాయాల రంగం ఊపందుకుంది. దీని ఫలితంగా ప్రైవేట్ స్టీల్ దిగ్గజ సంస్థల ద్వారా సరఫరా పెరిగింది. ► టాటా స్టీల్‌కు చెందిన జంషెడ్పూర్ ప్లాంట్ జనసాంద్రత కలిగిన ప్రాంతంలో ఉన్నందున, ఇక్కడి ప్లాంట్‌ను మరింత విస్తరించే అవకాశం లేదు. ► సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీతో టాటా స్టీల్ సంబంధాలు నిరంతరం బలపడుతున్నాయి. ఇది మరింత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుంది. ► కంపెనీ వృద్ధిలో కారి్మకులు చేసిన త్యాగాలు చిరస్మరణీయం. టాటా స్టీల్ ఒక ‘‘బహుళ తరం కంపెనీ’’. టాటా స్టీల్– టాటా వర్కర్స్ యూనియన్ల మధ్య ఉన్న సత్సంబంధాలు కంపెనీని ముందుకు నడిపించాయి. ప్రపంచ ఆర్థిక, ఫైనాన్షియల్ పరిస్థితులు అనిశి్చతిగా ఉన్నప్పటికీ కంపెనీ విజయాలు గర్వకారణం. ► ఎకానమీ, పరిశ్రమల పురోగతిలో సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కీలకం. ఎంఎస్ఎంఈ నాణ్యమైన ఉత్పత్తులపై ఆధారపడే పెద్ద పరిశ్రమలు పురోగమిస్తాయి. పెద్ద పరిశ్రమలకు ఎంఎస్ఎంఈలే వెన్నెముక. టాటా స్టీల్ ఒక పెద్ద కంపెనీ. దాని వెన్నెముక కూడా ఎంఎస్ఎంఈ యూనిట్లే. ఎంఎస్ఎంఈలకు సంబంధించినంత వరకు జంషెడ్పూర్ ఒక ముఖ్యమైన ప్రదేశం. సంస్థ పురోగతి హర్షణీయం: ఆనంద్ మూన్కా కాగా, సింగ్భూమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ విజయ్ ఆనంద్ మూన్కా తన స్వాగత ప్రసంగంలో నరేంద్రన్ అద్భుత నాయకత్వంలో టాటా స్టీల్ నిరంతరం అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. జంషెడ్పూర్ పరిసరాల్లో విమానాశ్రయం అభివృద్ధికి టాటా స్టీల్ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
3000 మంది ఉద్యోగులకు 'టాటా' బైబై..!
ఈ ఏడాది ప్రారంభం నుంచే గూగుల్, అమెజాన్ కంపెనీలు లేఆప్స్ ప్రారంభించాయి. ఈ జాబితాలోకి తాజాగా టాటా స్టీల్ చేరనున్నట్లు సమాచారం. ఈ కంపెనీ వేల్స్‌లోని ప్లాంట్‌లో సుమారు 3,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిసింది. పోర్ట్ టాల్బోట్ స్టీల్వర్క్స్లోని రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను కంపెనీ మూసివేసినట్లు.. ఇదే జరిగితే సుమారు మూడు వేలమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ధ్రువీకరించలేదు. లేఆప్స్ గురించి కూడా ప్రస్తావించలేదు. టాటా స్టీల్ తన రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లను మూసివేయాలని నిర్ణయించే ముందు వర్కర్స్ యూనియన్‌తో సమావేశం నిర్వహించినట్లు, గ్రీన్ మెటల్ ఉత్పత్తికి నిధులు సమకూర్చడానికి ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఇప్పుడు పరిస్థితులు కొంత తీవ్రతరం కావడంతో ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా.. జర భద్రం! పోర్ట్ టాల్బోట్ స్టీల్‌వర్క్స్ అనేది యూకేలోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి. కంపెనీ ఇబ్బందులను ఎదుర్కుంటున్న సమయంలో బ్రిటన్ ప్రభుత్వం గత ఏడాది చివర్లో సంస్థకు 500 మిలియన్స్ ఫౌండ్స్ (రూ. 5300 కోట్లు) సహాయం చేసింది. ఆ సమయంలోనే కంపెనీ నష్టాలు ఉద్యోగులపైన ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. -
ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కోల్‌కతా అనుమతుల నేపథ్యంలో ఎస్‌అండ్‌టీ మైనింగ్ విలీనాన్ని పూర్తి చేసినట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజా గా వెల్లడించింది. డిసెంబర్1 నుంచి విలీనం అమలులోకి వచి్చనట్లు తెలియజేసింది. విలీన పథకంలో భాగంగా ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను మూసివేయకుండా కంపెనీలో కలిపేసుకున్న ట్లు వివరించింది. టాటా స్టీల్ ఇటీవల కొంతకాలంగా అనుబంధ సంస్థలను విలీనం చేసుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లోఅనుబంధ సంస్థల విలీనం పూర్తికానున్నట్లు ఇంతక్రితం కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించిన విషయం తెలిసిందే. -
ఉద్యోగులకు టాటా స్టీల్ భారీ షాక్.. 800 మంది తొలగింపు
న్యూఢిల్లీ: నిర్మాణాత్మక పోటీతత్వం, లాభదాయకతలో భాగంగా టాటా స్టీల్ కీలక నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్స్‌లో 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది. వీరిలో 300 మంది తాత్కాలిక సిబ్బంది ఉన్నారు. టాటా స్టీల్ యూరప్ నుండి రెండు స్వతంత్ర కంపెనీలుగా టాటా స్టీల్ యూకే, టాటా స్టీల్ నెదర్లాండ్స్‌ను వేరు చేసే ప్రక్రియను 2021 అక్టోబరులో టాటా స్టీల్ పూర్తి చేసింది. నెదర్లాండ్స్‌లో కంపెనీకి ఏటా ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంగల తయారీ ప్లాంట్ ఉంది. -
టాటా స్టీల్ ఇండియా చెస్ చాంప్ దివ్య
కోల్‌కతా: టాటా స్టీల్ ఇండియా చెస్ మహిళల ర్యాపిడ్ టోర్నమెంట్లో ఫేవరెట్స్‌ను బోల్తా కొట్టిస్తూ భారత యువతార దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా అవతరించింది. మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల దివ్య నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత ఏడు పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. శనివారం జరిగిన చివరి మూడు గేముల్లో దివ్యకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అనా ఉషెనినా (ఉక్రెయిన్)తో జరిగిన ఏడో గేమ్‌ను దివ్య 30 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. పొలీనా షువలోవా (రష్యా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌లో దివ్య 41 ఎత్తుల్లో ఓడిపోయింది. చివరిదైన తొమ్మిదో గేమ్‌లో దివ్య 51 ఎత్తుల్లో భారత స్టార్ కోనేరు హంపిపై సంచలన విజయం సాధించి టైటిల్‌ను ఖరారు చేసుకుంది. జు వెన్జున్ (చైనా; 6.5 పాయింట్లు) రన్నరప్‌గా, షువలోవా 5.5 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కే చెందిన ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, వంతిక అగర్వాల్ ఐదో స్థానంలో, కోనేరు హంపి ఆరో స్థానంలో, సవితాశ్రీ ఎనిమిదో స్థానంలో నిలిచారు. ఇదే వేదికపై నేడు, రేపు బ్లిట్జ్ ఫార్మాట్లో టోర్నీ జరుగుతుంది. -
ఆ ఆలోచనే లేదు.. టాటా స్టీల్ సీఈవో కీలక ప్రకటన
న్యూఢిల్లీ: కొత్తగా ఏ ఇతర కంపెనీలనూ కొనుగోలు చేసే యోచనలో లేమని ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల స్టీల్, స్టీల్ తయారీ ముడిసరుకుల తయారీ బిజినెస్‌ల నిర్వహణపై బిలియనీర్ అనిల్ అగర్వాల్ గ్రూప్ కంపెనీ వేదాంతా.. సమీక్షను చేపట్టిన నేపథ్యంలో నరేంద్రన్ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది. స్టీల్ బిజినెస్‌పై పునఃసమీక్షతోపాటు, విలువ మదింపును చేపట్టినట్లు జూన్‌లో వేదాంతా ప్రకటించింది. తద్వారా విడిగా లేదా పూర్తి స్టీల్ సంబంధ విభాగాల వ్యూహాత్మక విక్రయానికి తెరతీసే వీలున్నట్లు వెల్లడించింది. అయితే ఈ అంశంపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ నరేంద్రన్ కొత్తగా ఇతర కంపెనీల కొనుగోళ్లపై అంతగా ఆసక్తి లేదని స్పష్టం చేశారు. కంపెనీ సొంత బిజినెస్‌ల విషయంలో ఇంకా చేయవలసినది చాలా ఉన్నట్లు పేర్కొన్నారు. స్టీల్ తయారీలో 2030కల్లా దేశీయంగా 4 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని అందుకోవలసి ఉన్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ ప్రస్తుతం 2.2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని కలిగి ఉన్న విషయం విదితమే. కాగా.. దివాలా పరిష్కారంలో భాగంగా 2018 జూన్‌లో వేదాంతా.. జార్ఖండ్‌లోని ఈఎస్ఎల్ స్టీల్ లిమిటెడ్‌ను సొంతం చేసుకుంది. తదుపరి 2.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో కొత్త ప్లాంటును ఏర్పాటు చేసింది. -
కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం
Tata Steel CFO Koushik Chatterjee: కొడితో కొట్టాలి..సిక్స్ కొట్టాలి... అన్నట్టు ఏదైనా టాప్ కంపెనీలో జాబ్ కొట్టాలి. లక్షల్లో ప్యాకేజీ అందుకోవాలి..ఇదేగా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ప్రతీవారి కల. కానీ కంపెనీలో టాప్ పొజిషన్ కాకపోయినా, టాప్ శాలరీ అందుకోవడం విశేషం కదా మరి. అలా రతన్ టాటా నేతృత్వంలోని టాటా గ్రూపు ఉద్యోగి ఒకరు రోజుకు ఏకంగా లక్షల్లో సంపాదిస్తున్నారు. టాటా స్టీల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సీఎఫ్‌వో కౌశిక్ ఛటర్జీ. టాటా గ్రూప్‌లో అత్యధిక వేతనం పొందుతున్న చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లలో కౌశిక్ ఒకరు. రూ. 1,43,175 కోట్ల మార్కెట్ క్యాప్ ఫ్లాగ్షిప్ కంపెనీకి ఆర్థిక వ్యవహారాల విభాగానికి ఇన్చార్జ్గా ఉన్నాడు.టాటా స్టీల్ వార్షిక నివేదిక ప్రకారం ఛటర్జీ ఇప్పటికీ రూ. 14,21,18,000 (రూ. 14.21 కోట్లు) తీసుకున్నారు. అంటే రోజుకు రూ.3.89 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అయితే ఇటీవల టాటా మోటార్స్‌కు చెందిన పీబీ బజాలీ, ఛటర్జీని అధిగమించారు. గత ఏడాదితో పోల్చితే వేతనంలో ఈ ఏడాది స్వల్పంగా తగ్గినప్పటకీ 15,17,18,000 (రూ. 15.17 కోట్లు) అందుకున్నారు. అలాగే 2023లో ఛటర్జీతో పోలిస్తే టాటా స్టీల్‌లో రూ. 18.66 కోట్లతో సీఈఓ టీవీ నరేంద్రన్‌కు మాత్రమే ఎక్కువ వేతనం అందుకోవడం గమనార్హం. (మళ్లీ పరుగందుకున్న పసిడి, వెండి అయితే ఏకంగా) టాటా గ్రూప్‌లో పని చేయడానికి ముందు, కౌశిక్ బ్రిటానియా ఇండస్ట్రీస్, ఆడిట్ కంపెనీ ఎస్బీ బిల్లిమోరియా కంపెనీల్లో పనిచేశారు. కేవలం 36 సంవత్సరాల వయస్సులో, కౌశిక్ 2006లో టాటా స్టీల్‌లో VP ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. అతను 2012 నుండి సీఎఫ్‌వోగా ఉన్నారు. ఛటర్జీ జనవరి 1, 2023 నుండి 3 సంవత్సరాల కాలానికి IFRS ఫౌండేషన్ ఆరు కొత్త ట్రస్టీలలో ఒకరిగా నియమితులయ్యారు. అతను సలహా సభ్యునిగా కూడా ఉన్నారు. భారీ సంపాదన ఉన్నప్పటికీ చాలా నిడాడంబరమైన జీవిన శైలితో కౌశిక్ ఛటర్జీ కూల్ అండ్ కంపోజ్డ్ పర్సన్ అని సహోద్యోగులు భావిస్తారు. కౌశిక్ పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లోని సెయింట్ పాట్రిక్స్ పాఠశాల నుండి పాఠశాల విద్యను, కోలకతాలో బీకాం డిగ్రీని సాధించారు. ఆ తరువాత చార్టర్డ్ అకౌంటెంట్ గా పనిచేశారు. -
టాటా స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ లీక్: కార్మికులకు గాయాలు
ఒడిశాలోని మేరమండలిలోని టాటా స్టీల్ లిమిటెడ్ ప్లాంట్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కొంతమంది కార్మికుల తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గ్యాస్ లీక్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. దాదాపు 19 మంది గాయపడగా, ఆరుగురికి 40శాతం కంటే ఎక్కువ గాలిన గాయాలైనట్టు సమాచారం. BFPP2 పవర్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిందని ధృవీకరించిన సంస్థ అత్యవసర సేవలందిస్తున్నామని తెలిపింది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలకు ప్రమాదం సంభవించిందని, గాయపడిన కార్మికులకు ప్రాథమిక చికిత్స అనంతరం ముందు జాగ్రత్త చర్యగా తదుపరి చికిత్స కోసం కటక్‌కు తరలించినట్టు కంపెనీ తెలిసింది. Tata Steel Statement on Accident at BFPP2 Power Plant, Tata Steel Meramandali pic.twitter.com/sISjI2Wlaa — Tata Steel (@TataSteelLtd) June 13, 2023 అలాగే బాధిత ఉద్యోగుల కుటుంబ సభ్యులను సంప్రదించామని, వారికి తగిన సాయం అందిస్తున్నామని, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంది. #WATCH | Gas leak in Odisha's Tata Steel plant: A total of 19 patients from Tata Steel's Meramandali plant in Dhenkanal were brought here. They have all suffered burns. Out of the 19 patients, 2 patients have also sustained fractures, and 6 of them are burnt above 40%. One… pic.twitter.com/LCKV9PU39i — ANI (@ANI) June 13, 2023 -
దివాళా తీసిన మరో ఎయిర్ లైన్స్ లాభాల్లో టాటా స్టిల్స్
-
టాటా స్టీల్ రూ. 2,502 కోట్ల నష్టాలు
న్యూఢిల్లీ: టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఏకంగా రూ. 2,502 కోట్ల నష్టాన్ని (కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన) ప్రకటించింది. వ్యయాలు గణనీయంగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 9,598 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక తాజాగా ఆదాయం రూ. 60,843 కోట్ల నుంచి రూ. 57,354 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 48,666 కోట్ల నుంచి రూ. 57,172 కోట్లకు పెరిగాయి. కంపెనీ రుణ భారం ప్రస్తుతం రూ. 71,706 కోట్లుగా ఉంది. సమీక్షా కాలంలో రూ. 3,632 కోట్ల మొత్తాన్ని కంపెనీ పెట్టుబడి వ్యయాలపై వెచ్చించింది. ఉక్కుఉత్పత్తి 7.76 మిలియన్ టన్నుల (ఎంటీ) నుంచి 7.56 ఎంటీకి తగ్గింది. ఒడిదుడుకుల పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా అమ్మకాల్లో స్థిర వృద్ధి సాధించగలిగామని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ తెలిపారు. వ్యయాల నియంత్రణ, నిర్వహణను మెరుగుపర్చుకోవడంపై మరింతగా దృష్టి పెట్టుకోనున్నట్లు పేర్కొన్నారు. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
ఇది అసలు ఊహించలేదు.. షాక్‌లో టాటా స్టీల్!
న్యూఢిల్లీ: భారీగా పెరిగిన వ్యయాల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ షాకిచ్చాయి. ఈ సారి నికర లాభం (కన్సాలిడేటెడ్) ఏకంగా 90 శాతం క్షీణించి, రూ. 1,297 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇది రూ. 12,548 కోట్లు. తాజాగా జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 60,658 కోట్ల నుంచి రూ. 60,207 కోట్లకు తగ్గింది. వ్యయాలు రూ. 47,240 కోట్ల నుంచి రూ. 57,684 కోట్లకు పెరిగాయి. కీలక ఎకానమీల్లో మందగమన భయాలు, సీజనల్ అంశాలతో పాటు భౌగోళికరాజకీయ అనిశ్చితి తదితర అంశాలు వ్యాపార నిర్వహణలో ఒడిదుడుకులకు కారణమయ్యా యని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ చెప్పారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కంపెనీ దేశీ అమ్మకాలు అత్యుత్తమంగా నమోదయ్యాయని పేర్కొన్నారు. అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి సరుకుల నిల్వలను ఉపయోగించుకోవాల్సి రావడం వల్ల మార్జిన్లు తగ్గాయని టాటా స్టీల్ ఈడీ కౌశిక్ ఛటర్జీ చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్ కోలుకుంటూ ఉండటం, ముడి సరుకుల రేట్లు సానుకూలంగా మారుతుండటం వంటి అంశాలతో మార్జిన్లు మళ్లీ మెరుగుపడగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: సామాన్యులకు శుభవార్త.. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు -
స్టీల్ మ్యాన్, టాటా స్టీల్ మాజీ ఎండీ జేజే ఇరానీ ఇక లేరు
సాక్షి, ముంబై: భారత స్టీల్ మ్యాన్, టాటా స్టీల్ మాజీ ఎండీ జేజే ఇరానీ (86) ఇకలేరు. భారత ఉక్కు మనిషిగా పేరొందిన ఇరానీ సోమవారం అర్థరాత్రి జంషెడ్‌పూర్‌లో టాటా హాస్పిటల్లో మరణించారని టాటా స్టీల్ తెలిపింది. భారతదేశపు ఉక్కు మనిషి పద్మభూషణ్ డాక్టర్ జంషెడ్ జె ఇరానీ కన్నుమూతపై టాటా స్టీల్ ప్రగాఢ సంతాపం తెలుపుతూ టాటా స్టీల్ ఒక ప్రకటన జారీ చేసింది. 1990ల ప్రారంభంలో భారతదేశ ఆర్థిక సరళీకరణ సమయంలో టాటా స్టీల్‌ను ముందంజలో నడిపించడమే కాకుండా, భారతదేశంలో ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి ఎనలేని సేవ చేసిన దార్శనికుడిని ఎన్నటికీ మరువలేమంటూ టాటా స్టీల్ తెలిపింది. ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుండి పదవీ విరమణ చేశారు, 43 సంవత్సరాలపాటు విశిష్ట సేవలందించి పలువురి ప్రశంసలందుకున్నారు. తద్వారా కంపెనీకి కూడా అంతర్జాతీయ ఖ్యాతి, ప్రశంసలు, లభించాయి. 1979లో టాటా స్టీల్‌కు జనరల్ మేనేజర్‌గా, 1985లో ప్రెసిడెంట్‌గా పనిచేశారు. 1988లో టాటా స్టీల్‌కు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, 1992లో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసి 2001లో పదవీ విరమణ చేశారు. జూన్ 2, 1936న నాగ్‌పూర్‌లో జన్మించిన డాక్టర్ ఇరానీ 1956లో నాగ్‌పూర్‌లోని సైన్స్ కాలేజీ నుండి బీఎస్ఈ, 1958లో నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి జియాలజీలో ఎంఎస్సీ పూర్తి చేసారు.యూకేలోని షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి జేఎన్ టాటా స్కాలర్‌గా వెళ్ళారు. అక్కడ 1960లో మెటలర్జీలో మాస్టర్స్ 1963లో మెటలర్జీలో పీహెచ్డీ పట్టా పొందారు. 1968లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ప్రస్తుత టాటా స్టీల్)లో చేరడానికి భారతదేశానికి తిరిగి వచ్చారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్‌కు అసిస్టెంట్‌గా పనిచేశారు. 1981లో బోర్డ్ ఆఫ్ టాటా స్టీల్‌లో చేరిన తరువాత 2001 నుండి ఒక దశాబ్దం పాటు నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. టాటా స్టీల్, టాటా సన్స్‌తో పాటు, డాక్టర్ ఇరానీ టాటా మోటార్స్ , టాటా టెలిసర్వీసెస్‌తో సహా పలు టాటా గ్రూప్ కంపెనీలకు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 1963లో షెఫీల్డ్‌లోని బ్రిటీష్ ఐరన్ అండ్ స్టీల్ రీసెర్చ్ అసోసియేషన్‌తో కరియర్ ప్రారంభించారు. పరిశ్రమకు ఆయన సేవలకుగాను 2007లో విశిష్ట పురస్కారం పద్మభూషణ్ వరించింది. డాక్టర్ ఇరానీ మెటలర్జీ రంగంలో తన సేవలకు గుర్తింపుగా 2008లో భారత ప్రభుత్వంచే లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. 1992-93కి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అతను డాక్టర్ ఇరానీకి భార్య డైసీ ఇరానీ, అతని ముగ్గురు పిల్లలు జుబిన్, నీలోఫర్, తనాజ్ ఉన్నారు. -
మెటల్ దిగ్గజంగా టాటా స్టీల్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ భారీ విలీనానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌లోని 7 మెటల్ అనుబంధ కంపెనీలను విలీనం చేసుకునే ప్రణాళికలు అమలు చేయనుంది. ఇందుకు వీలుగా గతంలో ప్రతిపాదించిన టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ విలీనాన్ని విరమించుకుంది. వెరసి తాజాగా ఈ రెండు సంస్థలతోపాటు.. టిన్‌ప్లేట్ కంపెనీ ఆఫ్ ఇండియా, టీఆర్ఎఫ్ లిమిటెడ్, ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్‌ను విలీనం చేసుకోనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ఈ విలీనంతో సామర్థ్యాల పెంపు, వ్యయాల తగ్గింపునకు బాటలు వేసుకోనుంది. ఇందుకు షేర్ల మార్పిడి(స్వాప్) విధానాన్ని అవలంబించనుంది. ఈ ప్రతిపాదనను బోర్డు అనుమతించినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. విలీనమిలా.. గ్రూప్‌లోని మెటల్ కంపెనీల విలీనానికి టాటా స్టీల్ షేర్ల మార్పిడి నిష్పత్తులను ప్రకటించింది. వీటి ప్రకారం ఆయా కంపెనీల వాటాదారుల వద్దగల ప్రతీ 10 షేర్లకుగాను టాటా స్టీల్ షేర్లను ఇలా కేటాయించనుంది. టీఆర్ఎఫ్ వాటాదారులకు 17, టీఎస్‌పీఎల్‌కు 67, టిన్ప్లేట్కు 33, టాటా మెటాలిక్స్కు 79 చొప్పున షేర్లను జారీ చేయనుంది. ఇండియన్ స్టీల్ – వైర్ ప్రొడక్ట్స్‌లో టాటా స్టీల్‌కు 95 శాతం వాటా ఉంది. టాటా స్టీల్ మైనింగ్, ఎస్‌అండ్‌టీ మైనింగ్ పూర్తి అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. మిగిలిన మూడు కంపెనీలలో 75–60 శాతం మధ్య వాటాలను కలిగి ఉండగా.. టీఆర్ఎఫ్లో వాటా 34.11 శాతం మాత్రమే. అవకాశాలపై దృష్టి అనుబంధ సంస్థల శక్తిసామర్థ్యాలను ఏకీకృతం చేయడం ద్వారా వాటాదారుల విలువ పెంపునకు అవకాశాలను సృష్టించుకోనున్నట్లు విలీనంపై టాటా స్టీల్ స్పందించింది. కంపెనీలన్నిటి మధ్య సమన్వయం ద్వారా ఒక సంస్థ సౌకర్యాలను మరొక కంపెనీ వినియోగించుకునేందుకు వీలుంటుందని తెలియజేసింది. ఇది మరింత సమర్థవంత వినియోగానికి దారి చూపుతుందని వివరించింది. అంతేకాకుండా మార్కెటింగ్, పంపిణీ నెట్వర్క్ సైతం పరస్పరం సహకరించుకోనున్నట్లు తెలియజేసింది. కాగా.. చంద్రశేఖరన్ అధ్యక్షతన గ్రూప్‌లోని కంపెనీలు బిజినెస్‌లను ఒక్కటిగా చేయడం ద్వారా పరస్పర లబ్దిని పొందనున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే టాటా గ్రూప్ పేర్కొంది. ఈ బాటలో టాటా కన్జూమర్, టాటా కాఫీ విలీనాన్ని ప్రకటించింది. ఇదే విధంగా 2024కల్లా ఎయిరేషియా, విస్తారాలను ఎయిరిండియా బ్రాండుకిందకు తీసుకురానున్నట్లు తెలియజేసింది. 2019 నుంచి టాటా స్టీల్ వివిధ రకాలుగా 116 సహచర కంపెనీల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం. -
75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.74,620 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. మేకిన్ ఒడిశా చొరవలో భాగంగా వీటికి ఒడిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 24వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన 10 పారిశ్రామిక ప్రాజెక్టులలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, మెటల్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. అలాగే టాటా గ్రూప్, అదానీ గ్రూప్ , ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పెద్ద పెట్టుబడిదారులుగా ఉన్నాయి. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ 7,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే రూ. 41,653 కోట్ల పెట్టుబడితో కాశీపూర్‌లో 4.0 MTPA అల్యూమినా రిఫైనరీ, 175 MW CPP ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది. టాటా స్టీల్ పారాదీప్‌లో రూ.2,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ (20 కేటీపీఏ), గ్రీన్ అమ్మోనియా (100 కేటీపీఏ) ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ల వల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్లాంట్లు రాష్ట్రంలోని ఉక్కు, ఎరువుల రంగాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని ఒడిశా సర్కార్ ప్రకటించింది. "విజన్ 2030’’ కి ఊతమిచ్చేలా మెటల్ సెక్టార్లో డౌన్‌స్ట్రీమ్ యూనిట్ల అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తున్నట్టు తెలిపింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో 60,000 MT పారిశ్రామిక నిర్మాణం, 6,000 MT స్టీల్ ప్లాంట్ పరికరాల సౌకర్యాల ఏర్పాటుకు టాటా స్టీల్ ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,451 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జగత్సింగ్పూర్, రాయగడ, జాజ్‌పూర్, భద్రక్, కెందుఝర్, కటక్ , మయూర్‌భంజ్‌లలో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. కళింగలో 2.5 MTPA స్టీల్ ప్లాంట్, 370 MW CPP ప్లాంట్‌ను కూడా ఒరిస్సా అల్లాయ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 8,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి 5,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది .డాల్కీలో 6 MTPA బెనిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రతిపాదనను ,1,490 కోట్ల రూపాయల పెట్టుబడితో డాల్కీలోని డబునా స్లరీ పంపింగ్ స్టేషన్ యూనిట్‌కు ప్రతిపాదిత ప్లాంట్ నుండి 12 MTPA స్లర్రీ పైప్‌లైన్‌ను కూడా కమిటీ ఆమోదించింది. దీని 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోంపురి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 MTPA పెల్లెట్ ప్లాంట్ మరియు 6 MTPA ఫిల్టర్ కేక్, ఆర్తి స్టీల్స్ ద్వారా స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడా ప్రభుత్వం ఆమోదించిన కొన్ని ఇతర ప్రాజెక్టులుగా ఉండనున్నాయి. అయితే అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఆమోదం పొందిందని వార్తలు వెలువడ్డాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ వేగంగా విస్తరిస్తున్న తన సామ్రాజ్యానికి మరో ప్రాజెక్టును చేర్చనున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఒడిశాలో అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేయడానికి 5.2 బిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని పలు ఊహాగానాలొచ్చాయి. The High-Level Clearance Authority under the chairmanship of CM @Naveen_Odisha approved 10 industrial projects worth ₹74,620 Cr with an employment potential of 24,047. The approved projects include Metal & Metal Downstream, Green Hydrogen, Green Ammonia & Industrial Structure. pic.twitter.com/WdAY3RguP9 — CMO Odisha (@CMO_Odisha) August 10, 2022 -
వ్యయాల సెగ.. అందుకే టాటా స్టీల్ ఫలితాలు ఇలా!
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 7,714 కోట్ల లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 9,768 కోట్లతో పోలిస్తే ఇది 21 శాతం తక్కువ. వ్యయాలు పెరగడమే క్యూ1లో లాభాలు తగ్గడానికి కారణమయ్యాయి. సమీక్షాకాలంలో కంపెనీ ఆదాయం రూ. 53,628 కోట్లకు పెరిగింది. ముడి వస్తువుల ఖర్చులతో పాటు వడ్డీలు తదితర వ్యయాలు కూడా కలిపి రూ. 41,491 కోట్ల నుంచి రూ. 51,912 కోట్లకు పెరిగాయి. దేశీయంగా టాప్ 4 ఉక్కు సంస్థల్లో టాటా స్టీల్ కూడా ఒకటి. మొత్తం ఉక్కు ఉత్పత్తిలో కంపెనీ వాటా దాదాపు 18 శాతంగా ఉంటుంది. -
భారత్, యూరప్‌లలో టాటా స్టీల్ వేల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్, యూరప్ కార్యకలాపాలపై దాదాపు రూ.12,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ వెల్లడించారు. భారత్‌లో రూ.8,500 కోట్లు, యూరప్‌లో రూ.3,500 కోట్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికలు ఉన్నట్లు వివరించారు. భారత్‌లో ప్రధానంగా కళింగనగర్ ప్రాజెక్టు విస్తరణ, మైనింగ్ కార్యకలాపాలపై దృష్టి పెట్టనున్నట్లు నరేంద్రన్ చెప్పారు. ఒరిస్సాలోని కళింగనగర్ ప్లాంటు సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నుల నుంచి 8 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు వివరించారు. మరోవైపు, ఈ పెట్టుబడులకు అదనంగా నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్) కొనుగోలు కోసం రూ. 12,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు నరేంద్రన్ పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో భౌగోళిక–రాజకీయ పరిస్థితులు మారిపోయాయని, ఉక్కు పరిశ్రమపైనా ప్రభావం పడిందని ఆయన చెప్పారు. వ్యయ నియంత్రణలతో పాటు సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరాన్ని కూడా కోవిడ్–19 మహమ్మారి తెలియజేసిందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో యుద్ధ పరిణామాలు, చైనాలో కోవిడ్‌పరమైన షట్డౌన్లు, భారత్‌లో ఉక్కు ఎగుమతులపై సుంకాల విధింపు వంటి అంశాలు ఉక్కు రంగంపై ప్రభావం చూపుతాయని నరేంద్రన్ పేర్కొన్నారు. అయితే, మౌలిక సదుపాయాల కల్పన ఊపందుకుంటున్న నేపథ్యంలో ఉక్కుకు డిమాండ్ పెరిగి ద్వితీయార్ధంలో పరిశ్రమ పరిస్థితి సానుకూలంగా ఉండగలదని ఆశిస్తున్నట్లు వివరించారు. ఎగుమతి సుంకాల ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని ఉక్కు ధరలు కూడా ఒక స్థాయిలో స్థిరపడవచ్చని, కోవిడ్ షట్‌డౌన్‌లపరమైన ఆర్థిక నష్టాల నుంచి చైనా కోలుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు నరేంద్రన్ చెప్పారు. -
నష్టాల్లోకి టాటా స్టీల్ లాంగ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ కంపెనీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 331 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్‌కు అనుబంధ సంస్థ అయిన కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 332 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు రెట్టింపునకు పెరిగిన వ్యయాలు కారణమయ్యాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,727 కోట్ల నుంచి రూ. 2,155 కోట్లకు జంప్ చేసింది. క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 1,283 కోట్ల నుంచి రూ. 2,490 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ లాంగ్ షేరు బీఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 603 వద్ద ముగిసింది. -
నీలాచల్‌కు విస్తరణ స్పీడ్
న్యూఢిల్లీ: ఇటీవల సొంతం చేసుకున్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్)ను పునఃప్రారంభించనున్నట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా సామర్థ్య విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేసింది. రానున్న కొన్నేళ్లలో వార్షికంగా 4.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) లాంగ్ ప్రొడక్టుల తయారీకి కంపెనీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా 10 మిలియన్ టన్నులకు స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్చనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వేగంగా, సమర్థంగా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించింది. అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) ద్వారా ఎన్ఐఎన్ఎల్ను కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రైవేటైజేషన్ పూర్తి: ఆర్థిక శాఖ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రైవేటైజేషన్ పూర్తయినట్లు ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. కంపెనీ యాజమాన్య నిర్వహణను టాటా గ్రూప్‌నకు సంపూర్ణంగా బదలాయించినట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత ప్రభుత్వం రెండో కంపెనీని విజయవంతంగా ప్రైవేటైజ్ చేసినట్లు తెలియజేసింది. ప్రైవేటైజేషన్ జాబితాలోని తొలి సంస్థ విమానయాన రంగ దిగ్గజం ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం విదితమే. ఎన్ఐఎన్ఎల్ కొనుగోలుకి ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) వేసిన రూ. 12,100 కోట్ల విలువైన బిడ్ గెలుపొందింది. కాగా.. కంపెనీలో ప్రమోటర్లు, భాగస్వామ్య సంస్థలకుగల మొత్తం 93.71 శాతం వాటాను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్‌కు పూర్తిగా బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. నిరవధిక నష్టాల నేపథ్యంలో ఒడిశాలోని కళింగనగర్లోగల 1.1 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంటును ఎన్ఐఎన్ఎల్ 2020 మార్చిలో మూసివేసింది. -
టాటా చేతికి ఎన్ఐఎన్ఎల్, మా లక్ష్యం అదే!
న్యూఢిల్లీ: నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఎన్ఐఎన్ఎల్)ను స్వాదీనం చేసుకున్న తర్వాత వార్షిక తయారీ సామర్థ్యాన్ని ఏడాదిలోనే 1.1 మిలియన్ టన్నులకు చేరుస్తామని టాటా స్టీల్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఇది ఆధారపడి ఉంటుందన్నారు. టాటా స్టీల్ 115వ వార్షిక సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి చంద్రశేఖరన్ మాట్లాడారు. జిందాల్ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ తదతర సంస్థలతో పోటీపడి ఎన్ఐఎన్ఎల్ను టాటా స్టీల్‌కు చెందిన టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ దక్కించుకోవడం తెలిసిందే. ఎన్ఐఎన్ఎల్లో 93.71 శాతం వాటాకు టాటా స్టీల్ వేసిన రూ.12,100 కోట్ల బిడ్ అర్హత సాధించింది. లాంగ్ ప్రొడక్ట్స్, మైనింగ్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ విభాగంలో గణనీయమైన కొనుగోళ్లు చేసినట్టు చంద్రశేఖరన్ చెప్పారు. తమ కళింగనగర్ ప్లాంట్‌కు ఎన్ఐఎన్ఎల్ సమీపంలో ఉండడం తమకు ఎంతో కీలకమైనదంటూ.. అందుకే కొనుగోలు చేసినట్టు తెలిపారు. సమీప భవిష్యత్తులో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి ఇది కేంద్రంగా నిలుస్తుందన్నారు. -
దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్!
ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పోరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్‌బై చెప్పింది. రష్యాతో కట్ టాటా గ్రూపు ఆధ్వర్యంలో టాటా స్టీలు పరిశ్రమలు ఉన్నాయి. స్టీలు తయారీలో పల్వ్రైజ్డ్ బొగ్గును వినియోగిస్తారు. ఇంత కాలం ఈ బొగ్గును రష్యా నుంచి టాటా స్టీల్స్ దిగుమతి చేసుకునేది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిరసిస్తూ ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతి చేసుకోరాదని టాటాస్టీల్స్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రష్యా నుంచి 75 వేల టన్నుల బొగ్గు రష్యా నుంచి టాటా స్టీల్‌కు సరఫరా అయ్యింది. దీంతో రష్యా యుద్ధం నేపథ్యంలో టాటా స్టీల్స్ గతంలో చేసిన ప్రకటన కేవలం ప్రచార ఆర్భాటం తప్పతే ఆచరణలో అమలు అయ్యేది కాదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన టాటా స్టీల్స్, రష్యా నుంచి బొగ్గు దిగుమతికి సంబంధించి వివరణ ఇచ్చింది. అది మా బాధ్యత ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఫిబ్రవరి 24న మొదలైందని, అయితే అప్పటికే బొగ్గు దిగుమతికి సంబంధించి రష్యాతో సంప్రదింపులు జరుగుతున్నాయని టాటా స్టీల్స్ చెప్పింది. వీటికి సంబంధించిన ఒప్పందాలు మార్చిలో తుది దశకు చేరుకున్నాయంది. ఒక బాధ్యత కలిగిన కార్పోరేట్ కంపెనీగా ఒప్పందాలను గౌరవించడం తమ బాధ్యతని టాటా తెలిపింది. అందుకే మార్చితో కుదిరిన అగ్రిమెంట్‌కి సంబంధించిన బొగ్గు మేలో దిగుమతి అయ్యిందని తెలిపింది. ప్రత్యామ్నాయం యుద్దాన్ని ఖండిస్తూ బొగ్గు దిగుమతికి సంబంధించి ఏప్రిల్ నుంచి రష్యాతో ఎటువంటి అగ్రిమెంట్లు చేసుకోలేదని టాటా స్టీల్స్ చెప్పింది. రష్యా ప్రత్యామ్నాయంగా యూకే, నెదర్లాండ్స్ నుంచి బొగ్గు దిగుమతి చేసుకోబోతున్నట్లు టాటా స్టీల్స్ వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఏకపక్ష దండయాత్రను నిరసిస్తూ పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. అమెరికా అయితే రష్యాను ఏకాకి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. రష్యాతో ఉన్న పూర్వ సంబంధాల నేపథ్యంలో ఈ అంశంపై భారత ప్రభుత్వం ఆచీతూచీ వ్యవహరించింది. చదవండి: ఎయిర్‌ఫోర్స్‌కు 100వ లాంచర్..అందించిన టీఏఎస్ఎల్, ఎల్అండ్టీ! -
క్యూ4 ఫలితాలు విడుదల, లాభాల్లో టాటా స్టీల్!
న్యూఢిల్లీ: టాటా స్టీల్ గత ఆర్థిక సంవత్సరం (2021–22) మార్చితో అంతమైన త్రైమాసికానికి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం 37 శాతం వృద్ధి చెందిన రూ.9,835 కోట్లుగా నమోదైంది. ఆదాయం సైతం 40 శాతం వరకు పెరిగి రూ.69,616 కోట్లకు చేరింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2020–21) చివరి త్రైమాసికంలో లాభం రూ.7,162 కోట్లు, ఆదాయం రూ.50,300 కోట్లుగా ఉండడం గమనార్హం. వ్యయాలు సైతం రూ.40,103 కోట్ల నుంచి రూ.57,636 కోట్లకు ఎగిశాయి. కరోనా, భౌగోళిక ఉద్రిక్తతల వాతావరణంలోనూ టాటా స్టీల్ బలమైన పనితీరు చూపించినట్టు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కస్టమర్లతో సంబంధాలు, పంపిణీ నెట్‌వర్క్‌పై దృష్టి సారించడంతో భారత్‌లో వ్యాపారం అన్ని రకాలుగా వృద్ధిని చూసినట్టు తెలిపారు. యూరోప్ వ్యాపారం కూడా బలమైన పనితీరునే ప్రదర్శించినట్టు చెప్పారు. భారత వ్యాపారం ఎబిట్డా రూ.28,863 కోట్లుగా ఉంటే, యూరోప్ వ్యాపారం ఎబిట్డా రూ.12,164 కోట్లుగా ఉందని టాటా స్టీల్ ఈడీ, సీఎఫ్‌వో కౌషిక్ ఛటర్జీ వెల్లడించారు. ఒక్కో షేరుకు రికార్డు స్థాయిలో రూ.51 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. అలాగే, రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరును రూ.1 ముఖ విలువ కలిగిన 10 షేర్లుగా విభజించాలని నిర్ణయించింది. -
రష్యా-ఉక్రెయిన్ వార్..టాటా సంచలన నిర్ణయం..!
న్యూఢిల్లీ: రష్యాతో వ్యాపార కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. ‘‘టాటా స్టీల్‌కు రష్యాలో ఎటువంటి కార్యకలాపాలు కానీ, ఉద్యోగులు కానీ లేరు. దీంతో రష్యాతో వ్యాపారం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం’’ అంటూ టాటా స్టీల్ ప్రకటన విడుదల చేసింది. భారత్, బ్రిటన్, నెదర్లాండ్స్‌లోని ప్లాంట్లకు ముడి సరుకుల కోసం రష్యాపై ఆధారపకుండా ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలిపింది. గతంలో రష్యా నుంచి కొంత మేర బొగ్గును టాటా స్టీల్ సమకూర్చుకోవడం గమనార్హం. చదవండి: కీలక ఆదేశాలు..చిత్రా అప్పీలుపై శాట్ విచారణ -
టాటా స్టీల్ షేర్ల విభజన!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ షేర్ల ముఖ విలువను విభజించనుంది. వచ్చే నెల(మే) 3న నిర్వహించనున్న బోర్డు సమావేశంలో షేర్ల విభజన అంశాన్ని బోర్డు పరిశీలించనున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. గతేడాది(2021–22) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఆర్థిక ఫలితాలపై నిర్వహించనున్న సమావేశంలో బోర్డు రూ. 10 ముఖ విలువగల షేర్ల విభజనపై నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వివరించింది. అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాటాదారులకు డివిడెండును సైతం ప్రకటించే వీలున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం బలపడి రూ. 1,340 వద్ద ముగిసింది. తొలుత ఒక దశలో రూ. 1,358 వరకూ ఎగసింది. -
క్యూ3 ఫలితాల్లో టాటా స్టీల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 9,598 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 4,011 కోట్లతో పోలిస్తే ఇది 139 శాతం వృద్ధి. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 45 శాతం జంప్ చేసి రూ.60,843 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో కేవలం రూ. 42,153 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 36,495 కోట్ల నుంచి రూ. 48,666 కోట్లకు పెరిగాయి. క్యాష్‌ఫ్లో తీరిలా: తాజా సమీక్షా కాలంలో రూ. 2,045 కోట్లమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగినప్పటికీ టాటా స్టీల్ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 6,338 కోట్లకు చేరింది. కోవిడ్–19 మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దీంతో స్టీల్‌కు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా 0.7 శాతం బలపడి రూ. 1,174 వద్ద ముగిసింది. -
ఐరన్ మైన్‌లో చరిత్ర సృష్టించనున్న మహిళలు..
Allwomen team to take over operations of iron mine in Jharkhand: బహుశా,అంత ఖరీదైన కార్యాలయాన్ని వారిలో చాలామంది తొలిసారిగా చూసి ఉండవచ్చు. కాస్త భయం కూడా వేసి ఉండవచ్చు. ఖరీదైన దుస్తుల్లో, గంభీరంగా తమ ఎదురుగా కనిపిస్తున్న పెద్ద అధికారులను చూస్తూ కాస్తో కూస్తో బెరుకుగా మాట్లాడి ఉండవచ్చు. కొన్ని సమయాల్లో మాటల కోసం వెదుక్కొని ఉండవచ్చు. అయితే వారి కళ్లు మాత్రం నిండు ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతున్నాయి. అప్పుడప్పుడు కళ్లు మాట్లాడకుండానే మాట్లాడతాయి....ఇది కవిత్వం కాదు. యథార్థ జీవిత దృశ్యం! టాటా స్టీల్స్ నౌముండి (ఝార్ఖండ్) ఐరన్ మైన్‌లో తొలిసారిగా 30 మందితో కూడిన ‘ఆల్వుమెన్ టీమ్’ డ్రిల్లింగ్, డంపింగ్, షవెల్ ఆపరేషన్...మొదలైన పనుల్లో విధులు చేపట్టడానికి రెడీ అవుతుంది. మొత్తం 350 మంది అభ్యర్థుల నుంచి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ప్రక్రియల ద్వారా 30 మంది మహిళలను ఎంపిక చేశారు. ఇందులో చుట్టుప్రక్కల గిరిజన గ్రామాల నుంచి వచ్చిన పేదమహిళలే ఎక్కువగా ఉన్నారు. ఇలా ఎంపికైన వారిలో ఒకరు...రేబుతి పర్టీ. ఇద్దరు పిల్లల తల్లి రేవతి. ‘ఏదో ఉత్సాహంతో వచ్చానుగానీ నేను చేయగలనా!’ అని మొదట్లో చాలా భయపడింది రేవతి. పైగా చుట్టాలు, పక్కాలు భయపెట్టేలా మాట్లాడిన మాటలు కూడా పదేపదే గుర్తుకు వస్తున్నాయి. ‘మైనింగ్ పని చేయడానికి మగాళ్లే భయపడతారు. నీలాంటి వాళ్లు చేయడం చాలా కష్టం. ఎలా వెళ్లావో అలా తిరిగొస్తావు చూడు’ ‘ఏ పెళ్లికో పేరంటానికో పక్క ఊరుకు వెళ్లడం తప్ప...పెద్దగా ఎక్కడికి వెళ్లింది లేదు. ఇప్పుడు ఊరు కాని ఊరు వచ్చాను. ఎవరూ తెలిసిన వాళ్లు లేరు. బెంగతో జ్వరం వచ్చినట్లు కూడా అయింది’ అని ఆరోజును గుర్తు చేసుకుంది నౌముండి బ్లాక్‌లోని జంపని అనే గ్రామానికి చెందిన రేవతి. మరో గిరిజన గ్రామం నుంచి వచ్చిన తార పరిస్థితి కూడా అంతే. ‘ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోతున్నావేమో, పనిచేయించడానికి అక్కడ నానా కష్టాలు పెడతారు. ఎంతోమంది మధ్యలోనే పారిపోతుంటారట...’ ఎదురింటి చుట్టం భయపెట్టిన మాటలు పదేపదే గుర్తుకు వచ్చాయి తారకు. ఒక దశలో ఆమె ఎవరికీ చెప్పకుండా ఇంటికి వెళ్లిపోవడానికి రెడీ అయింది. రేవతి, తార మాత్రమే కాదు...ఇంకా చాలామంది, ఒక్కరు కూడా వెనక్కి పోలేదు! ‘యస్...ఈ పని మేము తప్పకుండా చేయగలం’ అని గట్టి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. దీనికి కారణం... ఉద్యోగానికి ఎంపికైన మహిళలకు మొదట సాంకేతిక శిక్షణ ఇవ్వలేదు. కొన్నిరోజుల పాటు వారిలో ధైర్యం నింపే తరగతులు నిర్వహించారు. ఇవి మంచి ఫలితాన్ని ఇచ్చాయి. ‘ట్రైనింగ్ కోర్సు పూర్తయిన తరువాత బాగా ధైర్యం వచ్చింది. ఏ షిప్ట్‌లో పనిచేయడానికైనా రెడీగా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఉద్యోగంలో చేరుతానా అని ఉత్సాహంగా ఉంది’ అంటుంది రేవతి. రేవతి మాత్రమే కాదు..ఎప్పుడూ చిన్న స్కూటర్ నడపని మహిళలు కూడా ఇప్పుడు...భారీ విదేశి యంత్రాలను సులభంగా ఆపరేట్ చేస్తున్నారు. ఐరన్మైన్లో తొలిసారిగా ‘ఆల్వుమెన్ టీమ్’ ను తీసుకోవడం యాదృచ్ఛికం కాదు. ‘2025లోపు ఐరన్మైన్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచాలి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది టాటా స్టీల్స్. దీనికి ‘తేజస్విని 2.0’ అనే నామకరణం కూడా చేసింది. వారి లక్ష్యం సంపూర్ణంగా సిద్ధించాలని ఆశిద్దాం. చదవండి: Health Tips In Telugu: జీడిపప్పు, బాదం పప్పు, వాల్ నట్స్ రోజూ తింటే -
టాటా సంచలన నిర్ణయం, సర్వత్రా హర్షం
Tata Steel Hires 14 Transgender People: అనితర సాధ్యుడు..ఓటమి ఎరుగని ధీరుడు..రతన్ టాటా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాదు విలువలు, దాతృత్వానికి మారు పేరు. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి మానవత్వం ప్రదర్శించడంలో రతన్ టాటాను మించిన వారెవరూ ఉండరేమో. అలాంటి లివింగ్ లెజెండ్ రతన్ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల భవిష్యత్తును తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలోని పశ్చిమ బొకారో డివిజన్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్లుగా 14 మంది ట్రాన్స్జెండర్లను నియమించారు. ప్రస్తుతం ఈ 14మంది శిక్షణలో ఉన్నారని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మైనింగ్ కార్యకలాపాల్లో విధులు నిర్వహిస్తారని టాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, అంతకుముందు కంపెనీ 17మంది మహిళలను హెచ్ఇఎమ్ఎమ్ ఆపరేటర్లుగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆత్రయీ సన్యాల్ మాట్లాడుతూ..ఇదే మాడ్యూల్లో పనిచేసేందుకు ఆన్‌బోర్డ్‌లో ఉన్న ట్రాన్స్జెండర్లు గనులలో పనిచేయడానికి ముందే సంవత్సరం పాటు శిక్షణ పొందుతారని తెలిపారు. అంతేకాదు ట్రాన్స్జెండర్ల వర్క్ ఫోర్స్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు, 2025 నాటికి 25 శాతం ట్రాన్స్జెండర్లను ఉద్యోగులుగా నియమించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అత్రయీ సన్యాల్ చెప్పారు. ఇదిలా ఉంటే, రతన్ టాటా నిర్ణయం పై నెటిజన్లు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ఆపత్కాలంలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశం కల్పించడం గొప్ప విషయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్ టాటా -
క్యూ2లో టాటా స్టీల్ జోరు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 12,548 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,665 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 39,158 కోట్ల నుంచి రూ. 60,554 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 37,000 కోట్ల నుంచి రూ. 47,135 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 7.25 మిలియన్ టన్ను(ఎంటీ)ల నుంచి 7.77 ఎంటీకి పుంజుకుంది. విక్రయాలు మాత్రం 7.93 ఎంటీ నుంచి 7.39 ఎంటీకి వెనకడుగు వేశాయి. కాగా.. స్టాండెలోన్ నికర లాభం రూ. 2,539 కోట్ల నుంచి రూ. 8,707 కోట్లకు ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 21,820 కోట్ల నుంచి రూ. 32,964 కోట్లకు జంప్‌చేసింది. నాట్‌స్టీల్ విక్రయం..: సింగపూర్ అనుబంధ సంస్థ నాట్‌స్టీల్ హోల్డింగ్స్‌లో 100 శాతం వాటా విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. దేశీ బిజినెస్‌తోపాటు.. యూరోపియన్ కార్యకలాపాలు సైతం పటిష్ట ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. అయితే బొగ్గు ధరలు, ఇంధన వ్యయాల కారణంగా భవిష్యత్‌లో మార్జిన్లపై ఒత్తిడి పెరిగే వీలున్నట్లు తెలియజేశారు. 5 ఎంటీ వార్షిక సామర్థ్యంతో చేపట్టిన కళింగనగర్ రెండో దశ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలియజేశారు. టాటా స్టీల్ బీఎస్ఎల్ విలీనాన్ని త్వరలో పూర్తిచేయనున్నట్లు వివరించారు. కంపెనీ ఇటీవలే అధిక నాణ్యతగల గంధల్పాడ ఇనుపఖనిజ గనులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా.. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రూ. 11,424 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు బీఎస్ఈలో యథాతథంగా రూ. 1,299 వద్ద ముగిసింది. రూ. 1,324 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు.. ..
మీరు చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగ వేటలో ఉన్నారా ! అయితే మీకో గుడ్‌న్యూస్. పలు దిగ్గజ ఎంఎన్సీ కంపెనీలు ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్,పీడబ్ల్యూసీ,టాటా కన్సల్టెన్సీ సర్వీస్,బైజూస్,టాటా స్టీల్,ఇన్ఫోసిస్ కంపెనీలు ఆఫ్ క్యాంపస్‌లో భారీ ఎత్తున ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ ఓ రిపోర్ట్ ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం..ఈ ఏడాది సుమారు 30వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన కాగ్నిజెంట్ 2022( వచ్చే ఏడాదికి ) గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకున్న విద్యార్ధులకు 45 వేలు ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇన్ఫోసిస్ సైతం గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాదిలో ఇంకా 24,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించనుంది. 2021-22 ఆర్థిక ఆర్ధిక సంవత్సరంలో ఇండియాకు చెందిన టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్,విప్రోలు సుమారు లక్షా 20 వేల మంది గ్రాడ్యుయేట్లను నియమించనున్నట్లు ఎకనమిక్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా కాగ్నిజెంట్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శంతను మాట్లాడుతూ.. ఫుల్ స్టాక్ ఇంజనీర్లు, డేటా సైంటిస్ట్,ఏల్/ఎంఎల్ డెవలపర్లు, సైబర్ సెక్యూరిటీ కోసం అధునాతన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు కలిగిన విద్యార్థులను పెద్ద సంఖ్యలో నియమించుకోవడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్షియల్ దిగ్గజం గోల్డ్ మన్ సాక్స్ సైతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి),నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటి) నుండి ఇంజనీరింగ్ విద్యార్ధుల్ని ఎంపిక చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా 'ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్ ప్రోగ్రామ్' పేరిట క్యాంపస్ ఇంటర్వ్యూలను ఏర్పాటు చేయనుంది. ఉద్యోగుల నియమాకం కోసం ఇండియాలో మొత్తం 600 ఇంజనీరింగ్ క్యాంపస్‌లలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హ్యూమన్ కేపిటల్ మేనేజ్మెంట్ అధికారిణి దీపికా బెనర్జీ చెప్పారు. ఈ నియామకాల్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజనీర్ ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి.కాగా, స్టార్టప్‌లు,ఐటీ/ టెక్నాలజీ ఔట్సోర్సింగ్స్ సంస్థలు,స్టార్టప్‌లు, సాఫ్ట్వేర్ కంపెనీలు, బ్యాంకులు, కన్సల్టెన్సీలలో డిమాండ్ పెరగడంతో తాజాగా గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ విద్యార్ధులను నియమించుకునేందుకు ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి. చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో! -
టాటా స్టీల్ కంపెనీ ఉద్యోగులకు తీపికబురు
టాటా గ్రూప్ కు చెందిన టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. టాటా స్టీల్ అన్నీ యూనిట్లలో 2020-2021 సంవత్సరానికి అర్హత కలిగిన ఉద్యోగులకు వార్షిక బోనస్ కింద ₹270.28 కోట్లను చెల్లిస్తున్నట్లు పేర్కొంది. భారతదేశంలోని ప్రముఖ ఉక్కు తయారీ సంస్థలలో ఒకటిగా టాటా స్టీల్ ప్రసిద్ది చెందింది. 2020-2021 వార్షిక బోనస్ చెల్లింపు కోసం టాటా స్టీల్, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక మెమోరాండం ఆఫ్ సెటిల్ మెంట్ పై సంతకాలు జరిగినట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) టివి నరేంద్రన్(సీఈఓ & ఎండి), అట్రేయి సన్యాల్, వైస్ ప్రెసిడెంట్(హెచ్ఆర్ఎం), ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజ్ మెంట్ తరఫున సంతకం చేయగా టాటా వర్కర్స్ యూనియన్ తరుపున అధ్యక్షుడు సంజీవ్ కుమార్ చౌదరి, టాటా వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రెసిడెంట్ శైలేష్ కుమార్ సింగ్, టాటా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ సింగ్ ఇతర ఆఫీస్ బేరర్లు సంతకం చేశారు. అలాగే, స్టీల్ కంపెనీ & ఇండియన్ నేషనల్ మెటల్ వర్కర్స్ ఫెడరేషన్(ఐఎన్ ఎండబ్ల్యుఎఫ్), రాష్ట్రీయ కాలరీ మజ్దూర్ సంఘ్(ఆర్ సీఎంఎస్) మధ్య కూడా ఒక మెమోరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై సంతకాలు జరిగాయి. జార్ఖండ్ లోని జంషెడ్ పూర్ లో టాటా స్టీల్ సంస్థకు ప్రపంచ స్థాయి కర్మాగారం ఉంది. 2021 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో భారతదేశపు ప్రముఖ స్టీల్ మేకర్ ఏకీకృత నికర లాభం ₹9,768 కోట్లు. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) -
విశాఖ ఉక్కుపై టాటా స్టీల్ కన్ను
న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్) కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రోడక్ట్‌ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతంలో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు, ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని నరేంద్రన్ వివరించారు. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కులో 100 శాతం వాటాల విక్రయానికి ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కేబినెట్ కమిటీ (సీసీఈఏ) జనవరి 27న సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రస్తుతం లావాదేవీ సలహాదారుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు ఒడిశా కేంద్రంగా ఉన్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ (ఎన్ఐఎన్ఎల్) కొనుగోలు కోసం కూడా టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ లాంగ్ ప్రోడక్ట్స్ ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈవోఐ) దాఖలు చేసినట్లు నరేంద్రన్ చెప్పారు. -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 9,768 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 4,648 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 25,662 కోట్ల నుంచి రూ. 53,534 కోట్లకు జంప్‌చేసింది. అయితే క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 29,116 కోట్ల నుంచి రూ. 41,397 కోట్లకు పెరిగాయి. స్టీల్ ఉత్పత్తి 5.54 మిలియన్ టన్నుల నుంచి 7.88 ఎంటీకి ఎగసింది. విక్రయాలు 5.34 ఎంటీ నుంచి 7.11 ఎంటీకి వృద్ధి చూపాయి. ఈ కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 16,185 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించినట్లు టాటా స్టీల్ సీఎఫ్‌వో కౌశిక్ చటర్జీ వెల్లడించారు. రూ. 3,500 కోట్ల క్యాష్ ఫ్లోను సాధించడంతోపాటు.. రూ. 5,894 కోట్లమేర రుణ చెల్లింపులను చేపట్టినట్లు తెలియజేశారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.5 శాతం పుంజుకుని రూ. 1,434 వద్ద ముగిసింది. -
విదేశాల్లో భారత కంపెనీల పెట్టుబడులు రెట్టింపు
ముంబై: దేశీ కంపెనీలు ఈ ఏడాది జూన్‌లో విదేశాల్లో ప్రత్యక్షంగా పెట్టిన పెట్టుబడులు 2.80 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది జూన్ నాటి 1.39 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు. అయితే, వార్షికంగా పెరిగినప్పటికీ నెలవారీగా చూసినప్పుడు ఈ ఏడాది మేలో నమోదైన 6.71 బిలియన్ డాలర్ల కన్నా జూన్‌లో పెట్టుబడులు సుమారు 58 శాతం తక్కువ కావడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం మొత్తం పెట్టుబడుల్లో 1.17 బిలియన్ డాలర్లు పూచీకత్తు రూపంలో, 1.21 బిలియన్ డాలర్లు రుణంగాను, మరో 427 మిలియన్ డాలర్లు ఈక్విటీ పెట్టుబడి రూపంలోను నమోదైంది. భారీ పెట్టుబడుల్లో టాటా స్టీల్ .. సింగపూర్‌లోని తమ అనుబంధ సంస్థలో 1 బిలియన్ డాలర్లు, విప్రో తమ అమెరికా విభాగంలో 787 మిలియన్ డాలర్లు, టాటా పవర్ .. మారిషస్‌లోని యూనిట్లో 131 మిలియన్ డాలర్లు మొదలైన డీల్స్ ఉన్నాయి. డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, ఓఎన్జీసీ విదేశ్, పహార్పూర్ కూలింగ్ టవర్స్, టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలైనవి విదేశాల్లో ఇన్వెస్ట్ చేసిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. ఇవి 45 మిలియన్ డాలర్ల నుంచి 56 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. ఇది ప్రాథమిక డేటా మాత్రమేనని, అధీకృత డీలర్ బ్యాంకుల నివేదికలను బట్టి మారవచ్చని ఆర్బీఐ పేర్కొంది. -
స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లు... ఈ విషయాలపై కన్నేయండి
ముంబై: కార్పొరేట్ ఫలితాలు, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త రకం కరోనా వేరియంట్లు, రుతుపవనాల కదలికలు కూడా కీలకంగా మారొచ్చని భావిస్తున్నారు. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, డాలర్‌తో రూపాయి మారకం, ముడిచమురు కదలికల అంశాలు సైతం ట్రేడింగ్ ప్రభావితం చేయగలవని విశ్లేషిస్తున్నారు. గత వారంలో సెన్సెక్స్ 98 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. ఐటీ, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడం ఇందుకు కారణమైంది. ‘‘స్టాక్ మార్కెట్లో స్థిరీకరణ కొనసాగవచ్చు. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. పతనమైన ప్రతిసారి కొనుగోలు తరహా విధానం నడుస్తోంది. కావున కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్లు మద్దతు లభిస్తోంది. సాంకేతికంగా నిఫ్టీ 15,600 వద్ద తక్షణ మద్దతు స్థాయిని కలిగి ఉంది. ఎగువస్థాయిలో 15,800 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది’’ రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా విశ్లేషిస్తే.. ఆర్థిక గణాంకాల విడుదలతో అప్రమత్తత కేంద్రం గణాంకాల శాఖ జులై 12న సోమవారం మే నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలను మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడించనుంది. ఇవాళే జూన్ నెలకు సంబంధించిన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ప్రకటించనుంది. ఇక టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు జులై 14న (బుధవారం)వస్తాయి. జూన్ నెల వాణిజ్య లోటు గణాంకాలు గురువారం విడుదల అవుతాయి. ఆర్బీఐ జూన్ 2తో ముగిసిన వారపు డిపాజిట్లు, బ్యాంక్ రుణ వృద్ధి గణాంకాలను శుక్రవారం విడుదల చేయనుంది. అదే రోజున జూన్ 9వ తేదితో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటాను విడుదల చేయనుంది. కీలక స్థూల గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉంది. దీంతో స్టాక్ మార్కెట్ ఒకింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని అంచనా. ఈ వారం త్రైమాసిక ఫలితాలు... ఐటీ దిగ్గజం టీసీఎస్ గత వారంలో క్యూ1 ఆర్థిక గణాంకాలను ప్రకటించి కార్పొరేట్ రంగంలో ఫలితాల సందడిని షురూ చేసింది. ఈ వారంలో ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఎల్అండ్టీతో సహా 75కు పైగా కంపెనీలు తమ తొలి త్రైమాసికపు ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. రెండో దశ కోవిడ్ కట్టడికి స్థానిక ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్లు, కర్ఫ్యూలతో కంపెనీల పనితీరు అంతంత మాత్రంగానే ఉండొచ్చు. అయితే ఫలితాల ప్రకటన సందర్భంగా యాజమాన్యం చేసే అవుట్‌లుక్ వ్యాఖ్యలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. దొడ్ల డైయిరీ, హెచ్ఎఫ్సీఎల్, హెచ్ఎంటీ, డెక్కన్ హెల్త్ కేర్, టాటా మోటాలిక్స్, 5పైసా క్యాపిటల్, క్రాఫ్ట్‌మెన్ ఆటోమెషన్, ఎస్సార్ సెక్యూరిటీస్, హట్సన్ ఆగ్రో ప్రాడెక్ట్స్, ఏంజిల్ బ్రోకింగ్, ఆదిత్య బిర్లా మనీ, సియెంట్, మంగళం టింబర్ ప్రాడెక్ట్స్, టాటా ఎలక్సీ, టాటా స్టీల్, డెన్ నెట్వర్క్స్ తదితర కంపెనీలు ఇదే వారంలో క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. డెల్టా వేరియంట్ ఆందోళనలు... పలు దేశాల్లో కొత్త రకం కరోనా డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తోంది. ఈ తాజా పరిణామం జాతీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లను భయపెడుతోంది. వైరస్ శరవేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంటుందనే అంశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తున్నారు. మన దేశంలో గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు అనూహ్యంగా పుంజుకుంటుండటంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎఫ్ఐఐలు అమ్మేస్తున్నారు బెంచ్‌మార్క్ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) లాభా ల స్వీకరణకు మొగ్గుచూపారు. ఈ జూలై తొలి ఏడురోజుల్లో ఎఫ్ఐఐలు రూ.2,249 కోట్ల విలువైన షేర్లను అమ్మినట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘ఇతర కరెన్సీ విలువల్లో యూఎస్ డాలర్ బలపడుతోంది. ఒపెక్ దేశాలు ఉత్పత్తికి ఆసక్తి చూపకపోవడంతో క్రూడాయిల్ ధరలు నిరంతరంగా పెరుగుతున్నాయి. తర్వలో వడ్డీరేట్లను పెంచుతామని యూఎస్ ఫెడ్ కమిటీ తెలిపింది. ఈ పరిణామాల దృష్ట్యా రానున్న రోజుల్లో భారత మార్కెట్లోకి విదేశీ పెట్టుబడులు రాక పరిమితంగా ఉండొచ్చు’’ అని కోటక్ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. -
సీఐఐ ప్రెసిడెంట్‌గా నరేంద్రన్
న్యూఢిల్లీ: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నూతన ప్రెసిడెంట్‌గా 2021–22 సంవత్సరానికిగాను టాటా స్టీల్ సీఈవో, ఎండీ టి.వి.నరేంద్రన్ నియమితులయ్యారు. 2016–17లో సీఐఐ తూర్పు ప్రాంత చైర్మన్‌గా ఆయన వ్యవహరించారు. వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్‌గా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ వైస్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. సీఐఐ ప్రెసిడెంట్ డెసిగ్నేట్గా బజాజ్ ఫిన్సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్ ఎన్నికయ్యారు. అలాగే సీఐఐ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ బాధ్యతలు చేపట్టారు. -
కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులు, వారి కుటుంబాలకు కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. వైరస్ బారినపడ్డ సిబ్బందికి టెలి హెల్త్‌కేర్, వ్యాక్సినేషన్, వైద్యానికయ్యే ఖర్చుల చెల్లింపు, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతోపాటు కోవిడ్–19 కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఒక అడుగు ముందుకేశాయి. కోవిడ్–19తో ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి మేమున్నామంటూ పెద్ద మనసుతో ముందుకొస్తున్నాయి. ఆర్థిక సాయం, వేతనం చెల్లించడంతోపాటు కుటుంబ సభ్యులకు కొన్నేళ్లపాటు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాయి. ఆధారపడ్డ పిల్లల చదువు పూర్తి అయ్యే వరకు ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నాయి. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కంపెనీలు ఎలాంటి సాయం చేస్తున్నాయంటే.. టాటా స్టీల్: బాధిత కుటుంబం/నామినీకి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వేతనం, వైద్యం, హౌజింగ్ సౌకర్యం. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు సాయం. సన్ ఫార్మా: రెండేళ్ల వేతనం, పిల్లల గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఆర్థిక తోడ్పాటు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా. ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తాన్ని కుటుంబానికి చెల్లింపు. ఒక ఏడాదికి సమానమైన వేతనం. అమెజాన్: వైరస్ బారినపడ్డ ఫ్రంట్‌లైన్ బృంద సభ్యుడు హోం క్వారంటైన్లో ఉంటే రూ.30,600ల గ్రాంట్. బీమా కవరేజ్ మించి ఆసుపత్రి బిల్లు అయితే అదనంగా రూ.1.9 లక్షల వరకు రీఇంబర్స్. బజాజ్ ఆటో: మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండేళ్ల వరకు ఆర్థిక మద్దతు. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు సాయం. కుటుంబ సభ్యులందరికీ అయిదేళ్లపాటు ఆరోగ్య బీమా. టెక్ మహీంద్రా: కోవిడ్ సపోర్ట్ పాలసీ కింద అదనపు ప్రయోజనాలు. అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు. నైపుణ్య శిక్షణ. 12వ తరగతి వరకు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తారు. బజాజ్ అలియాంజ్: బీమాకు అదనంగా రూ.1 కోటి వరకు ఆర్థిక సాయం. గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఇద్దరు పిల్లలకు ఏటా రూ.2 లక్షల వరకు చెల్లింపు. అయిదేళ్ల వరకు ఆరోగ్య బీమా. సీమెన్స్: రూ.25 లక్షల ఆర్థిక సాయం. ఒక ఏడాది వేతనం. ఆరోగ్య బీమా, పిల్లల చదువుకు తోడ్పాటు. మహీంద్రా అండ్ మహీంద్రా: అయిదేళ్లపాటు వేతనం. రెండింతల వార్షిక పరిహారం. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏటా చెరి రూ.2 లక్షల వరకు చెల్లింపు. టీవీఎస్ మోటార్: గరిష్టంగా మూడింతల వార్షిక స్థూల వేతనం చెల్లింపు. ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ అదనం. మూడేళ్లపాటు ఆరోగ్య బీమా. ఇద్దరు పిల్లలకు అండర్ గ్రాడ్యుయేషన్ వరకు విద్య. ఓయో: ఎనమిది నెలల వేతనం, మూడేళ్ల వార్షిక వేతనానికి సమానమైన టెర్మ్ ఇన్సూరెన్స్. అయిదేళ్లపాటు పిల్లల చదువు. అయిదేళ్లపాటు రూ.3 లక్షల వరకు ఆరోగ్య బీమా. బోరోసిల్: రెండేళ్లపాటు వేతనం, పిల్లల చదువుకు తోడ్పాటు. ముతూట్ ఫైనాన్స్: మూడేళ్లకుపైగా పనిచేసిన ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రెండేళ్ల వేతనం చెల్లిస్తారు. మూడేళ్లలోపు ఉంటే ఒప్పంద ఉద్యోగులకూ ఒక ఏడాది వేతనం ఇస్తారు. అదనంగా వన్ టైం చెల్లింపు సైతం ఉంది. సొనాలికా: డీలర్లు, వారి ఉద్యోగుల కోవిడ్–19 చికిత్స కోసం రూ.25,000 వరకు వైద్య ఖర్చులు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.50 వేల వార్షిక వైద్య, విద్య ఖర్చులకు ఇది అదనం. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.2 లక్షల సాయం. చదవండి: అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్‌లు నింపాల్సిందే -
కోవిడ్‌తో ఉద్యోగి మరణించినా జీతం ఇస్తూనే ఉంటాం!
ముంబై: పెద్ద మనసు చాటుకోవడంలో టాటా గ్రూపు ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. మొదటి దశలో భాగంగా కరోనా వైరస్ దేశాన్ని కుదిపేస్తున్న తరుణంలో 1500 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో... తాజాగా కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో తమ ఉద్యోగుల ప్రాణాలకు నష్టం వాటిల్లినట్లయితే, వారి కుటుంబాలకు తాము అండగా నిలబడతామని టాటా స్టీల్ ప్రకటించింది. సోషల్ సెక్యూరిటీ స్కీమ్ ద్వారా వారికి ఆర్థిక సహాయం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు... ‘‘టాటా స్టీల్... తమ ఉద్యోగుల కుటుంబాలకు, వారు మెరుగైన జీవనం సాగించేందుకు తన వంతు సహాయం చేస్తుంది. ఒకవేళ మా ఉద్యోగి కోవిడ్ కారణంగా మరణిస్తే, సదరు వ్యక్తి కుటుంబానికి జీతం అందజేస్తాం. ఉద్యోగి మరణించే నాటికి ఎంత మొత్తమైతే వేతనంగా పొందుతున్నారో, అంతే మొత్తాన్ని ఆ వ్యక్తికి 60 ఏళ్లు నిండేంత వరకు వారి ఫ్యామిలీకి పంపిస్తాం. వైద్య, గృహపరమైన లబ్ది పొందేలా చూసుకుంటాం. అంతేగాక, ఒకవేళ విధుల్లో భాగంగా కరోనా సోకి మృత్యువాత పడితే, పూర్తి స్థాయి జీతంతో పాటు సదరు ఉద్యోగి పిల్లలు గ్రాడ్యుయేషన్(ఇండియాలో) పూర్తి చేసేంత వరకు ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తాం’’ అని సోషల్ మీడియా వేదికగా ఆదివారం వెల్లడించింది. తమ ఉద్యోగుల కుటుంబాలకు రక్షణ కవచంలా నిలుస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో టాటా స్టీలు కంపెనీ యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా... టాటా ట్రస్టు చైర్మన్ రతన్ టాటా దాతృత్వాన్ని గుర్తు చేస్తూ నెటిజన్లు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. #TataSteel has taken the path of #AgilityWithCare by extending social security schemes to the family members of the employees affected by #COVID19. While we do our bit, we urge everyone to help others around them in any capacity possible to get through these tough times. pic.twitter.com/AK3TDHyf0H — Tata Steel (@TataSteelLtd) May 23, 2021 చదవండి: స్టీల్ కంపెనీలకు సీఎం జగన్ కృతజ్ఞతలు టాటా స్టీల్ టర్న్అరౌండ్ -
టాటా స్టీల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ టాటా గ్రూప్ దిగ్గజం టాటా స్టీల్ గతేడాది(2020–21) చివరి క్వార్టర్లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. క్యూ4(జనవరి–మార్చి)లో టర్న్అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 7,162 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2019–20) ఇదే కాలంలో రూ. 1,615 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 37,323 కోట్ల నుంచి రూ. 50,250 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 35,432 కోట్ల నుంచి రూ. 40,052 కోట్లకు పెరిగాయి. కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 25 చొప్పున డివిడెండ్‌ను ప్రకటించింది. రికార్డ్ ఇబిటా: తొలి అర్ధభాగంలో కోవిడ్–19 ప్రభావం చూపినప్పటికీ ద్వితీయార్థం నుంచి దేశీయంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతోపాటు.. ఆర్థిక రికవరీ ప్రారంభంకావడంతో స్టీల్ వినియోగం పెరిగినట్లు టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. దీంతో పటిష్ట ఫలితాలను సాధించగలిగినట్లు తెలియజేశారు. క్యూ4లో ముడిస్టీల్ ఉత్పత్తి 4.75 మిలియన్ టన్నులకు చేరి రికార్డును సృష్టించగా.. అమ్మకాలు 16 శాతం పెరిగి 4.67 మిలియన్ టన్నులను తాకినట్లు టాటా స్టీల్ పేర్కొంది. క్యూ4లో ఇబిటా 40 శాతం వృద్ధితో రూ. 12,295 కోట్లను తాకింది. కంపెనీ చరిత్రలోనే ఇది అత్యధికంకాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 14,290 కోట్ల ఇబిటాను సాధించినట్లు వెల్లడించింది. మార్జిన్లు 40.9 శాతంగా నమోదయ్యాయి. పెట్టుబడి వ్యయాల తదుపరి రూ. 8,800 కోట్ల ఫ్రీక్యాష్ ఫ్లోను సాధించినట్లు నరేంద్రన్ తెలియజేశారు. పూర్తి ఏడాదికి క్యాష్‌ఫ్లో రూ. 24,000 కోట్లకు చేరగా.. రూ. 28,000 కోట్లమేర రుణ భారాన్ని తగ్గించుకున్నట్లు వెల్లడించారు. వెరసి మొత్తం రుణ భారం 28 శాతం తగ్గి రూ. 75,389 కోట్లకు దిగివచ్చినట్లు వివరించారు. టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో 0.7 శాతం బలపడి రూ. 1,071 వద్ద ముగిసింది. -
అతిపెద్ద ఆర్డర్- ఎల్అండ్టీ జూమ్
ముంబై, సాక్షి: మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ నుంచి అతిపెద్ద ఆర్డర్ లభించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. కాంట్రాక్టులో భాగంగా నిర్మాణం, మైనింగ్ సంబంధ ఎక్విప్మెంట్ను సపఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్‌కు ఒడిషా, జార్ఖండ్లోగల మైన్స్‌కు మొత్తం 46 యూనిట్ల పరికరాలను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఆర్డర్లో భాగంగా 100 టన్నుల కోమత్సు డంప్ ట్రక్కులు 41తోపాటు.. 3 వీల్ లోడర్లు, 2 క్రాలర్ డోజర్లు అందించవలసి ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ఆర్డర్ విలువను వెల్లడించనప్పటికీ కంపెనీ చరిత్రలో లభించిన అతిపెద్ద ఆర్డర్లలో ఇది ఒకటని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్‌చేసి రూ. 1154ను తాకింది. -
భారత్ డైనమిక్స్- టాటా స్టీల్ మెరుపులు
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఓవైపు పీఎస్‌యూ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కౌంటర్ వెలుగులోకిరాగా.. మరోపక్క నికర నష్టాలు ప్రకటించినప్పటికీ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ కౌంటర్‌కూ డిమాండ్ కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం హుషారుగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 167 పాయింట్లు బలపడి 35,129కు చేరగా.. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకుని 10,382 వద్ద ట్రేడవుతోంది. కాగా.. ఫలితాల నేపథ్యంలో భారత్ డైనమిక్స్, టాటా స్టీల్ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం భారత్ డైనమిక్స్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ నికర లాభందాదాపు 150 శాతం దూసుకెళ్లి రూ. 310 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 57 శాతం పెరిగి రూ. 1468 కోట్లను తాకింది. వాటాదారులకు షేరుకి రూ. 2.55 చొప్పున తుది డివిడెండ్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ డైనమిక్స్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 15 శాతం జంప్‌చేసింది. రూ. 348 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 354 వరకూ ఎగసింది. టాటా స్టీల్ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్ రూ. 1096 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2018-19) క్యూ4లో రూ. 2431 కోట్ల నికర లాభంఆర్జించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 20 శాతం క్షీణించి రూ. 33,770 కోట్లను తాకింది. ఇబిటా 38 శాతం వెనకడుగుతో రూ. 4647 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసింది. రూ. 336 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 338 వరకూ ఎగసింది. -
టాటా స్టీల్ నష్టాలు 1,096 కోట్లు
న్యూఢిల్లీ: ఉక్కు రంగ దిగ్గజ కంపెనీ, టాటా స్టీల్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,096 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.2,431 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.42,914 కోట్ల నుంచి రూ.35,086 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ప్రకటించింది. ► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.38,729 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు గత క్యూ4లో రూ.33,272 కోట్లకు తగ్గాయి. ►ఉక్కు ఉత్పత్తి(కన్సాలిడేటెడ్) సీక్వెన్షియల్‌గా 7 శాతం ఎగసి 7.37 మిలియన్ టన్నులకు చేరింది. భారత్‌లో ఉక్కు ఉత్పత్తి 6 శాతం వృద్ధితో 4.73 మిలియన్ టన్నులకు చేరింది. ►కరోనా వైరస్ కల్లోలం కారణంగా భారత్‌తో పాటు యూరప్, ఆగ్నేయాసియా, కెనడా ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి. ►గత క్యూ4లో యూరప్ విభాగం నిర్వహణ లాభం రూ.65 కోట్లుగా ఉంది. అంతక్రితం క్యూ4 లో రూ.956 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. ►పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 74 శాతం తగ్గి రూ.2,720 కోట్లకు, ఆదాయం 11 శాతం తగ్గి రూ.1,39,817 కోట్లకు చేరాయి. ►భారత విభాగం ఉక్కు ఉత్పత్తి 8% పెరిగింది. ►ఈ ఏడాది మార్చి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.17,745 కోట్ల మేర ఉన్నాయి. ►ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.321 వద్ద ముగిసింది. -
3 వేల ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ కూడా ఉద్యోగాలను తీసివేసే పనిలో పడింది. సంస్థ పునర్నిర్మాణంతోపాటు, ఖర్చులను తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూరోపియన్ యూనిట్లలో భారీగా ఉద్యోగులను తొలగించనుంది. బలహీన డిమాండ్, అధిక వ్యయాలతో కుస్తీలు పడుతున్న సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. టాటా యూరోపియన్ వ్యాపారంలో ఉద్యోగ కోతలను ప్రకటించబోతున్నట్లు యూరోపియన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెన్రిక్ ఆడమ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీన్ని ధృవీకరించిన టాటా స్టీల్ తీవ్రమైన మార్కెట్ ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని, కార్బన్-న్యూట్రల్ స్టీల్ మేకింగ్ వైపు ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ఈ మార్పులు అవసరమని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సుమారు 3 వేలమందికి పైగా ఉద్యోగాలకు ఉద్వాసన పలకనుంది. ఐరోపాలో ఉక్కు తయారీ అంతర్జాతీయ పోటీ, అధిక ఇంధన వ్యయాల ఒత్తిడి నేపథ్యంలో భారీ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగులకు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు. మొత్తం తాజా కోతలో మూడింట రెండు వంతుల మంది వైట్ కాలర్ ఉద్యోగాలంటాయని అంచనా. యూరోపియన్ వ్యాపారంలో మొత్తం 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
టాటా స్టీల్ లాభం 3,302 కోట్లు
న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో(క్యూ2) రూ.3,302 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఆర్జించిన నికర లాభం రూ.3,116 కోట్లతో పోల్చితే 6 శాతం వృద్ధి సాధించామని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.41,258 కోట్ల నుంచి రూ.34,763 కోట్లకు తగ్గిందని పేర్కొంది. భారత్‌లోనూ, విదేశాల్లోనూ వ్యాపార వాతావరణం చాలా సమస్యాత్మకంగా ఉందని, ఉక్కు ధరలపై తీవ్ర ప్రభావం పడిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ టీవీ నరేంద్రన్ వ్యాఖ్యానించారు. వర్షాలు ముగియడం, పండుగల డిమాండ్ కారణంగా వినియోగం ఊపందుకొని, ఉక్కుకు డిమాండ్ పెరగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.., 100 డాలర్ల మేర తగ్గిన ఉక్కు ధరలు... కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు కారణంగా కంపెనీకి రూ.4,233 కోట్ల పన్ను వ్యయాలు(దేశీ, విదేశీ అనుబంధ కంపెనీలను కలుపుకొని) తగ్గాయి. వ్యాపార పరిస్థితులు గడ్డుగా ఉండటంతో ఉక్కు ధరలు ప్రపంచవ్యాప్తంగా టన్నుకు వంద డాలర్లు తగ్గాయి. కంపెనీ కన్సాలిడేటెడ్ నిర్వహణ లాభం రూ.4,018 కోట్లుగా ఉంది. భారత కార్యకలాపాల విషయానికొస్తే, నిర్వహణ లాభం 57 శాతం పతనమై రూ.3,817 కోట్లకు చేరింది. నిర్వహణ లాభ మార్జిన్ 18.9 శాతంగా నమోదైంది. పెరిగిన రుణ భారం... వర్కింగ్ క్యాపిటల్ పెరగడంతో కంపెనీ స్థూల రుణభారం మరింతగా పెరిగింది. ఈ క్యూ2లో విదేశాల్లో 52.5 కోట్ల డాలర్ల రుణాలను సమీకరించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రూ. 4,596 కోట్ల నగదు నిల్వలు, రూ.7,262 కోట్ల బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయి. టాటా స్టీల్ బీఎస్ఎల్(గతంలో భూషణ్ స్టీల్) విలీన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా ఈ విలీనం పూర్తి కానున్నది. మందగమనం ఉన్నప్పటికీ, బ్రాండెడ్ ఉత్పత్తులు, రిటైల్ సెగ్మెంట్, పారిశ్రామిక, ప్రాజెక్ట్ సెగ్మెంట్లలో మంచి అమ్మకాలనే సాధించామని కంపెనీ సంతృప్తి వ్యక్తం చేసింది. వాహన రంగం మందగమనం ప్రభావాన్ని ఎగుమతులు పెరగడం సర్దుబాటు చేయగలిగిందని కంపెనీ పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ స్వల్ప లాభంతో రూ.404 వద్ద ముగిసింది. -
యూకేలోని టాటా ప్లాంట్‌లో భారీ పేలుడు
లండన్ : టాటా స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం తెల్లవారుజామున (భారత కాలమానప్రకారం) భారీ పేలుడు చోటుచేసుకుంది. పోర్ట్ టాల్బెట్లోని టాటా స్టీల్ వర్క్స్‌లో పేలుడు కారణంగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఇద్దరికి గాయాలైనట్టు సౌత్ వేల్స్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. -
ఆ భూములు రైతులకు అప్పగింత
రాయ్‌పూర్ : ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా చత్తీస్‌గఢ్‌లో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు రుణాల మాఫీ ప్రకటించగా, ఇతర హామీల అమలుపైనా కసరత్తు సాగిస్తోంది. టాటా స్టీల్ ప్రాజెక్టు కోసం బస్తర్‌లో గిరిజన రైతుల నుంచి సేకరించిన భూములను తిరిగి వారికి అప్పగించే ప్రక్రియను ప్రారంభించాలని సీఎం భూపేష్ బాగేల్ యోచిస్తున్నారు. భూసేకరణ జరిగిన ఐదేళ్లలోగా ప్రాజెక్టులు ప్రారంభించని చోట ఆయా భూములను తిరిగి సొంతదారులకు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌గఢ్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. ఈ క్రమంలో టాటా స్టీల్ ప్రాజెక్టు సైతం ముందుకు కదలకపోవడంతో ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను ఆయా రైతులకు అప్పగించే ప్రక్రియను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందించి తదుపరి కేబినెట్ సమావేశంలోగా తనకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని ముఖ్యమంత్రి భూపేష్ బాగేల్ అధికారులకు సూచించినట్టు సమాచారం. 2005లో అప్పటి బీజేపీ ప్రభుత్వం బస్తర్ జిల్లాలోని లోహన్దిగుడ ప్రాంతంలో రూ 19,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం టాటా స్టీల్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. ప్రాజెక్టు కోసం గిరిజనుల నుంచి భూ సేకరణ ప్రక్రియ 2008లో ప్రారంభమైంది. మొత్తం పదిగ్రామాల నుంచి 1764 హెక్టార్ల భూమిని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం సేకరించింది. ఇక భూసేకరణపై వివాదం నెలకొనడంతో 1707 మంది రైతులకు గాను 1165 మంది రైతులు తమకు ప్రభుత్వం చెల్లించే పరిహారాన్ని అంగీకరించారు. మిగిలిన రైతుల పరిహారాన్ని రెవిన్యూ డిపాజిట్ ఫండ్ వద్ద ప్రభుత్వం జమ చేసింది. ఇక 2016లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోకముందే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. భూసేకరణలో జాప్యం, మావోయిస్టుల బెదిరింపులు వంటి పలు కారణాలు చూపుతూ ప్రాజెక్టు నుంచి విరమించుకుంటున్నట్టు ఆ కంపెనీ పేర్కొంది. కాగా సేకరించిన భూమిని తిరిగి సొంతదారులకు అప్పగించాలని అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
టాటా స్టీల్ లాభం మూడింతలు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్ కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో మూడు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.1,018 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,116 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్ తెలిపింది. ఇక ఆదాయం రూ.32,676 కోట్ల నుంచి రూ.43,899 కోట్లకు ఎగసిందని టాటా స్టీల్ సీఈఓ, ఎమ్డీ టీవీ నరేంద్రన్ తెలిపారు. గత క్యూ2లో రూ.4,720 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ2లో 89 శాతం పెరిగి రూ.8,920 కోట్లకు పెరిగిందని తెలిపారు. నిర్వహణ మార్జిన్ 14.5 శాతం నుంచి 20.5 శాతానికి ఎగసిందని వివరించారు. ఒక్కో టన్నుకు ఎబిటా రూ.19,244గా ఉందని వివరించారు. భారత కార్యకలాపాలకు సంబంధించి ఈ క్వార్టర్లో అత్యుత్తమమైన ఎబిటా మార్జిన్‌ను సాధించామని, ఆరేళ్లలో ఇదే అత్యధిక త్రైమాసిక ఎబిటా అని వివరించారు. భూషణ్ స్టీల్ టేకోవర్ కలసివచ్చిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, ఫలితంగా పనితీరు కూడా మెరుగుపడిందని వ్యాఖ్యానించారు. ఈ క్యూ2లోనే ఉషా మార్జిన్ కంపెనీని రూ.4,700 కోట్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. పటిష్టంగా ఆర్థిక ఫలితాలు.... టాటా స్టీల్ గ్రూప్ వద్ద రూ.14,478 కోట్ల నగదు, నగదుకు సమానమైన నిల్వలున్నాయని, మొత్తం నిధులు రూ.26,470 కోట్లుగా ఉన్నాయని నరేంద్రన్ వివరించారు. స్థూల రుణభారం రూ.2,065 కోట్లు పెరిగిందని, నికర రుణభారం రూ.1,04,202 కోట్లుగా ఉందని తెలిపారు. ఈ క్యూ2లో పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించామని భారత్‌లో వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉండటం, నిర్వహణ పనితీరు జోరుగా ఉండటం దీనికి ప్రధాన కారణాలని వివరించారు. సీజనల్‌గా ఈ క్యూ2 బలహీనమైనదని, అయినప్పటికీ, టాటా స్టీల్(స్టాండ్ అలోన్), భూషణ్ స్టీల్‌లు 4.32 మిలియన్ టన్నుల స్టీల్‌ను విక్రయించాయని వివరించారు. భారత సంస్థల జోరును పెంచే వ్యూహాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఉషా మార్టిన్ కంపెనీకి చెందిన ఒక మిలియన్ టన్ను వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌ను కొనుగోలు చేశామని వివరించారు. అంతర్జాతీయంగా చూస్తే, టీఎస్ఈ థిసన్క్రప్ జాయింట్ వెంచర్ విషయంలో మంచి పురోగతి సాధిస్తున్నామని పేర్కొన్నారు. రెండో దశ సమీక్ష విషయమై యూరోపియన్ కమిషన్‌తో చర్చలు జరుపుతున్నామని, దీనికి 90 రోజులు పడుతుందని వివరించారు. ఉక్కు డిమాండ్ సానుకూలంగానే ఉండొచ్చని, అయితే వాణిజ్య ఉద్రిక్తతలు, పెరుగుతున్న దిగుమతులు ప్రతికూల ప్రభావం చూపించనున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్ భారత్‌లో అడుగిడటం మన దేశ ఉక్కు రంగానికి ప్రయోజనకరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఇప్పటికే యూరప్‌లో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీతో పోటీపడుతున్నామని, భారత్‌లో తమకు ఇది సమస్య కాదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ కంపెనీ షేర్ 1 శాతం లాభంతో రూ.589 వద్ద ముగిసింది. -
క్యూ2లో అదరగొట్టిన టాటా స్టీల్
సాక్షి, ముంబై: దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ క్యూ2 ఫలితాల్లో అదరగొట్టింది. ఎనలిస్టుల అంచనాలను బీట్ చేస్తూ మూడురెట్ల లాభాలను సాధించింది. 269.31 శాతం ఎగిసి 3,604 కోట్ల నికర లాభాలను సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో 975 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. రెండవ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ .43,544 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి రూ.32,464 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఎబిటా మార్జిన్లు 84 జంప్ చేశాయి. దేశంలో అనుకూలమైన వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో టాటా స్టీల్ గ్రూప్ ఈ త్రైమాసికంలో మంచి ఫలితాలను సాధించామని టాటా స్టీల్ సీఎండీ టీఎల్ నరేంద్రన్ చెప్పారు. -
టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ దారుణ హత్య
ఫరీదాబాద్: టాటా స్టీల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్నిదం పాల్ (35) దారుణ హత్యకు గురయ్యారు. కంపెనీ గిడ్డంగిలోనే నవంబర్ 9వ తేదీ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సంస్థ మాజీ ఉద్యోగే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మాజీ ఉద్యోగి విశ్వాష్ పాండే(32) ఆఫీసు మెయిన్ గేటునుంచి ఆఫీసులోకి ఎంటర్ అయ్యి, నేరుగా సీనియర్ మేనేజర్ పాల్ క్యాబిన్లోకి చొరబడ్డాడు. అతిసమీపం నుంచి పొట్టలో ఐదుసార్లు కాల్పులు జరిపి మరోగేటు నుంచి ఉడాయించాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న పాండేను దగ్గరిలోని ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. కోలకతాకు చెందిన పాల్‌కు భార్య, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు ఇంకా పరారీలోఉన్నాడు. మరోవైపు నిందితుడు 2015లో టాటాస్టీల్ ప్రోసెసింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీఎస్‌పీఎస్‌డీఎల్)లో ఉద్యోగంలో చేరాడు. అతనిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2018, ఆగష్టులో తొలగించినట్టు టీఎస్‌పీఎస్‌డీఎల్ వెల్లడించింది. మృతుని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నిందితుడు పాండే దూకుడుగా ఉండేవాడనీ, సహచరులు, ఇతర సీనియర్లతో తరచూ గొడవలు పడుతూ వుండేవాడని కంపెనీ ఇతర ఉద్యోగుల కథనం. మరోవైపు హతుడు ఇచ్చిన రిపోర్టు ఆధారంగానే సంస్థ అతడిని ఉద్యోగంనుంచి తీసివేసినట్టు తెలుస్తోంది. దీంతో కక్ష పెంచుకున్న పాండే ఈ దారుణానికి పాల్పడినట్టు సమాచారం. -
టాటా స్టీల్‌కి చేతికి ఉషా మార్టిన్ ఉక్కు వ్యాపారం
సాక్షి, ముంబై: దేశీయ స్టీల్ దిగ్గజం టాటా స్టీల మరో కంపెనీని కొనుగోలు చేసింది. ఉషామార్టిన్కుచెందిన స్టీల్వ్యాపారాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ డీల్ విలువ రూ. 4,300-4,700 కోట్లుగా ఉంది. ఈ ఒప్పందం 6-9 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. యూఎంఎల్ ఉక్కు వ్యాపారాన్ని కొనుగోలు చేయాలనే నిశ్చయాత్మక ఒప్పందాన్ని అమలు చేస్తున్నట్లు టాటా స్టీల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఉషా మార్టిన్ శనివారం స్టాక్ ఎక్స్చేంజ్ కుఅందించిన సమాచారం అందించింది. తద్వారా తన అప్పులను గణనీయంగా తగ్గించుకునేందుకు సహాయపడుతుందని తెలిపింది. -
కార్పొ బ్రీఫ్స్...
ఎల్ అండ్ టీ: కంపెనీ ఆస్తులు, ఉద్యోగుల సంక్షేమ నిధి పరంగా నిర్వహణ లోపం చోటు చేసుకుందంటూ ఉదయ్ దీక్షిత్ అనే మాజీ ఉద్యోగి ఎన్సీఎల్టీని ఆశ్రయించారు. ఈ అంశంపై కంపె నీ స్పందించింది. పిటిషనర్ వాదన నిరాధారమైనదని వ్యాఖ్యానించింది. ల్యాంకో ఇన్ఫ్రాటెక్: లిక్విడేషన్ నేపథ్యంలో కంపెనీ షేర్ల ట్రేడింగ్‌ను సెప్టెంబరు 14 నుంచి నిలిపివేస్తున్నట్టు బీఎస్ఈ ప్రకటించింది. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్: బెంగళూరుకు చెందిన గ్రాఫిన్ సెమి కండక్టర్ సర్వీసెస్ కంపెనీలో వంద శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ.93 కోట్లని, ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఈ డీల్ పూర్తవుతుందని ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ పేర్కొంది. బజాజ్ ఆటో: క్వాడ్రిసైకిల్, మూడు చక్రాల వాహనాల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 10 లక్షలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలకు పర్మిట్ మినహాయింపులిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. సీఏఐటీ: వాల్‌మార్ట్– ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న ట్రేడర్స్ సంఘం – సీఏఐటీ (ఆల్ ఇండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్) ఈ నెల 28న దేశవ్యాప్తంగా ఒక రోజు బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ‘భారత్ ట్రేడ్ బంద్’కు దాదాపు 7 కోట్ల మంది వర్తకులు మద్దతిచ్చినట్లు తెలిపింది. పాలసీబజార్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.700 కోట్ల ఆదాయాన్ని అంచనావేస్తున్నట్లు ఆన్లైన్ బీమా సర్వీసుల సంస్థ పాలసీబజార్ డాట్ కామ్ వెల్లడించింది. ఎల్ఐసీ కొనుగోలు సైతం తమ ప్లాట్‌ఫామ్ నుంచి జోరందుకున్న నేపథ్యంలో ఈ సారి ఆదాయంలో రెట్టింపు వృద్ధిని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్: పర్యావరణానికి మేలు చేసే నూతన స్టీల్ ఉత్పత్తి టెక్నాలజీని ఆవిష్కరించింది. నెదర్లాండ్స్‌లో పరీక్షలు పూర్తిచేసుకున్న ఈ టెక్నాలజీతో కార్బన్ డయాక్సైడ్ విడుదల సగానికి తగ్గిపోతుందని వెల్లడించింది. విస్తారా: బ్రిటిష్ ఎయిర్‌వేస్‌తో కోడ్ షేరింగ్ ఒప్పందం కుదిరినట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌లోని పలు ప్రాంతాలలో బ్రిటీష్ ఎయిర్వేస్ సేవలను తమ సంస్థ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. ఎస్బీఐ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టరుగా అన్షులా కాంత్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఎస్బీఐలో డిప్యూటీ ఎండీగా విధులు నిర్వర్తించారు. పీఎన్బీ: నాన్– సీటీఎస్ (చెక్ టర్న్కేషన్ సిస్టమ్) చెక్కులను వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ప్రొసెస్ చేయబోమని ప్రకటించింది. గడువు తేదీలోపుగా పాత చెక్కులను బ్యాంకుకు సమర్చించి, నూతన చెక్ బుక్‌లను పొందాల్సిందిగా కస్టమర్లకు తెలియజేసింది. -
టాటా స్టీల్ లాభం... రూ.1,934 కోట్లు
న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌నకు చెందిన టాటా స్టీల్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,934 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో వచ్చిన నికర లాభం, రూ.921 కోట్లతో పోలిస్తే రెండు రెట్ల వృద్ధి సాధించామని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.29,657 కోట్ల నుంచి 28 శాతం వృద్ధితో రూ.37,833 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్ సీఈఓ, ఎమ్డీ, టి.వి.నరేంద్రన్ చెప్పారు. గత క్యూ1లో రూ.6,579 కోట్లుగా ఉన్న ఎబిటా ఈ క్యూ1లో రూ.6,559 కోట్లకు తగ్గిందని, అయితే ఎబిటా మార్జిన్ 30 బేసిస్ పాయింట్లు పెరిగి 17.1 శాతానికి పెరిగిందని పేర్కొన్నారు. ఉక్కుకు డిమాండ్ బాగా ఉండటంతో ఈ క్యూ1లో మంచి పనితీరు సాధించామని చెప్పారు. అన్ని విభాగాలు మంచి వృద్ధిని నమోదు చేశాయని పేర్కొన్నారు. టాటా స్టీల్ యూరప్ పనితీరు కూడా బావుందని సంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో భారత్‌లో ఉక్కుకు డిమాండ్ పటిష్టంగా ఉంటుందని ఆయన అంచనా వేశారు. అయితే, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులు ప్రతికూల ప్రభావం చూపించవచ్చని పేర్కొన్నారు. ఈ కంపెనీ రూ.35,856 కోట్ల ఆదాయంపై రూ.2,587 కోట్ల నికర లాభం, రూ.6,830 కోట్ల ఎబిటా, 19 శాతం ఎబిటా మార్జిన్ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. స్టాండలోన్ లాభం 358% అప్...: స్టాండలోన్ పరంగా చూస్తే, నికర లాభం 358 శాతం వృద్ధితో రూ.2,318 కోట్లకు, ఆదాయం 26 శాతం వృద్ధితో రూ.16,406 కోట్లకు పెరిగాయని నరేంద్రన్ తెలిపారు. ఎబిటా 76 శాతం పెరిగి రూ.5,118 కోట్లకు పెరిగిందని, మార్జిన్ 8.8 శాతం పెరిగి 31.2 శాతానికి చేరిందని తెలిపారు. ఎబిటా (భారత్) టన్నుకు రూ.17,252కు వృద్ధి చెందిందని తెలిపారు. టాటా స్టీల్ దేశీయ ఆదాయం 14% వృద్ధితో రూ.16,405 కోట్లకు ఎగసిందని పేర్కొన్నారు. టాటా స్టీల్ యూరప్ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.16,429 కోట్లకు పెరిగిందని, ఎబిటా 33 శాతం వృద్ధితో రూ.1,666 కోట్లకు చేరిందని తెలిపారు. వ్యయాలు రూ.28,844 కోట్ల నుంచి రూ.34,041 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. పుష్కలంగా నగదు నిల్వలు... కంపెనీ వద్ద నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని నరేంద్రన్ తెలిపారు. రూ.13,086 కోట్ల నగదు, నగదు సమాన నిల్వలున్నాయని, బ్యాంక్ ఖాతాల్లో రూ.11,899 కోట్లు ఉన్నాయని మొత్తం మీద రూ.24,984 కోట్ల నగదు నిల్వలున్నాయని తెలిపారు. ఈ జూన్ క్వార్టర్లో రూ.1,931 కోట్ల మేర మూలధన పెట్టుబడులు పెట్టామని పేర్కొన్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ 1.1 శాతం నష్టంతో రూ.569 వద్ద ముగిసింది. -
ఆగ్నేయాసియాకు టాటా స్టీల్ గుడ్‌బై!
ముంబై: లాభసాటిగా లేని వ్యాపారం నుంచి తప్పుకోవాలనే వ్యూహంలో భాగంగా ఆగ్నేయాసియా వ్యాపారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. ఇదే సమయంలో దేశీ వ్యాపారంపై ఫోకస్ పెంచినట్లు చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. వాటాదారులకు దీర్ఘకాలంలో లబ్ధి చేకూర్చే ప్రాజెక్టుల్లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఎన్సీఎల్టీ ప్రక్రియలో ఉన్న భూషణ్ స్టీల్‌ను సొంతం చేసుకోవడం కూడా ఇందులో భాగమేనన్నారు. ‘‘ఈ కొనుగోలుతో మా ఉత్పత్తి సామర్థ్యం పెరిగి మార్కెట్లో గట్టిపోటీ ఇస్తాం. దీనికోసం కోర్టు ప్రక్రియ పూర్తయ్యేవరకు వేచి ఉంటాం. యూరోపియన్ కార్యకలాపాల పరంగా యాంటీ–ట్రస్ట్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నాం. ఈ డీల్‌ను పూర్తిచేస్తామనే నమ్మకం ఉంది. బ్రిటిష్ స్టీల్ పెన్షన్ పథకం పునర్వ్యవస్థీకరణను విజయవంతంగా పూర్తిచేశాం’’ అని వివరించారాయన. గతనెలలో జర్మనీ స్టీల్ కంపెనీ థిస్సెన్క్రప్తో కుదిరిన జాయింట్ వెంచర్ ద్వారా యూరప్‌లో వ్యయ సమన్వయం, టెక్నాలజీపై దృష్టిసారించినట్లు తెలిపారు. -
బ్యాంకులకు ‘భూషణ’ం
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా తీసిన భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్బీ) లబ్ధి చేకూరుతుందని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్ చెప్పారు. ఈ లావాదేవీతో పీఎస్‌బీల మొండిబాకీలు (ఎన్పీఏ) సుమారు రూ. 35,000 కోట్ల మేర తగ్గుతాయని ఆయన తెలియజేశారు. ఒక్కో పీఎస్బీ ఎన్పీఏలు సుమారు రూ.500 కోట్ల నుంచి రూ. 10,000 కోట్ల దాకా తగ్గగలవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఆయన తెలిపారు. అలాగే, పీఎస్బీలకు 6 కోట్ల పైగా షేర్లు కూడా దాఖలుపడతాయని, ఇది కూడా ప్రయోజనకరమైన విషయమేనని ఆయన పేర్కొన్నారు. టాటా స్టీల్ తన అనుబంధ సంస్థ ద్వారా భూషణ్ స్టీల్‌లో 72.65 శాతం వాటాలను వేలంలో రూ.36,400 కోట్లు వెచ్చించి దక్కించుకున్న సంగతి తెలిసిందే. విక్రయంపై స్టేకి ఎన్సీఎల్ఏటీ నిరాకరణ.. భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్ కొనుగోలు చేయడంపై స్టే విధించేందుకు నేషనల్ కంపెనీ లా అïప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. దివాలా పరిష్కార ప్రక్రియ యథాప్రకారం కొనసాగుతుందని పేర్కొంది. అయితే కేసు తుది ఉత్తర్వులకు లోబడి దివాలా పరిష్కార ప్రక్రియ ముగింపు ఉంటుందని తెలిపింది. భూషణ్ స్టీల్‌తో లాభమే: టాటా స్టీల్ ఉక్కు ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలంటే సుదీర్ఘ కాలం పట్టేసే నేపథ్యంలో.. భూషణ్ స్టీల్‌ను కొనుగోలు చేయడం తమకు ప్రయోజనకరమేనని టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ చెప్పారు. టేకోవర్ విషయంలో నిబంధనల ప్రకారమే తాము నడుచుకున్నామన్నారు. -
టాటా స్టీల్ గూటికి భూషణ్ స్టీల్
న్యూఢిల్లీ: దివాలా తీసిన భూషణ్ స్టీల్‌ను (బీఎస్ఎల్) కొనుగోలు చేసే ప్రక్రియ పూర్తయినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. వేలంలో తమ అనుబంధ సంస్థ బామ్నిపాల్ స్టీల్ (బీఎన్‌పీఎల్) ద్వారా భూషణ్ స్టీల్‌లో 72.65 శాతం వాటాలు కొన్నట్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భూషణ్ స్టీల్ రుణ దాతలకు రూ. 35,200 కోట్ల చెల్లింపు ప్రక్రియను.. ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తామని టాటా స్టీల్ వివరించింది. నిర్వహణపరమైన రుణదాతలకు వచ్చే ఏడాది వ్యవధిలో రూ.1,200 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ఈ కొనుగోలు కోసం ఈక్విటీ రూపంలో రూ. 159 కోట్లు, అంతర్–కార్పొరేట్ రుణం కింద రూ.34,974 కోట్లు సమకూర్చుకున్నట్లు టాటా స్టీల్ తెలిపింది. పరిష్కార ప్రణాళిక ప్రకారం బీఎస్ఎల్ డైరెక్టర్ల బోర్డులో బీఎన్‌పీఎల్ నామినీలను నియమించినట్లు వివరించింది. -
టాటా స్టీల్‌కు ‘అసాధారణ’ లాభం !
న్యూఢిల్లీ: టాటా స్టీల్ మార్చితో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.14,668 కోట్ల లాభాన్ని ఆర్జించింది. బ్రిటన్ వ్యాపార పునర్వ్యవస్థీకరణలో భాగంగా వచ్చిన రూ.11,376 కోట్ల వన్‌టైమ్ ఆదాయం ఈ స్థాయిలో లాభం పెరగడానికి కారణమైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.1,168 కోట్ల నష్టం రావడం గమనార్హం. ఈ మేరకు జనవరి–మార్చి త్రైమాసిక ఫలితాలను బీఎస్ఈకి కంపెనీ తెలియజేసింది. కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.36,407 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.35,457 కోట్లతో పోలిస్తే 2 శాతానికి పైగా పెరిగినట్టు తెలుస్తోంది. దేశీయంగా ఉత్పత్తి ఈ క్వార్టర్లో 3 మిలియన్ టన్నుల మేర తగ్గింది. క్రితం ఏడాది ఇదే కాలంలో పోలిస్తే వ్యయాలు రూ.31,132 కోట్ల నుంచి రూ.32,626 కోట్లకు పెరిగిపోయాయి. 2017–18లో కంపెనీ పనితీరు చాలా మెరుగ్గా ఉందని ఎండీ, సీఈవో టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కంపెనీ బలమైన నిర్వహణ విధానానికి అంతర్జాతీయ సానుకూల డిమాండ్ మద్దతుగా నిలిచిందన్నారు. అన్ని విభాగాల్లోనూ మంచి పనితీరు సాధ్యమైందని తెలిపారు. ‘‘బ్రిటన్ పెన్షన్ పథకం పునరుద్ధరణ ప్రక్రియ పూర్తయింది. థిస్సెంక్రప్తో 50:50 భాగస్వామ్యం చక్కగా నడుస్తోంది. బలమైన యూరోప్ పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం’’ అని నరేంద్రన్ వివరించారు. దేశీ విస్తరణ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. కళింగనగర్ ఫేస్–2 విస్తరణ చక్కగా కొనసాగుతోందని, ఇది తమ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 13 మిలియన్ టన్నుల నుంచి 18 మిలియన్ టన్నులకు తీసుకెళుతుందన్నారు. భూషణ్ స్టీల్‌కు సంబంధించి తమ పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ, సీసీఐ ఆమోదాలు లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్ !
న్యూఢిల్లీ: దివాళా ప్రక్రియలో ఉన్న భూషణ్ స్టీల్ కంపెనీని బిడ్డింగ్‌లో దక్కించుకున్నామని టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ తెలిపింది. ఎంత ధరకు ఈ కంపెనీని చేజిక్కించుకున్న వివరాలను టాటా స్టీల్ వెల్లడించలేదు. అయితే రూ.35,000 కోట్లకు (అంతా నగదులోనే )భూషణ్ స్టీల్ టాటా స్టీల్ పరం కానున్నదని పరిశ్రమ వర్గాలంటున్నాయి. భూషణ్ స్టీల్ విజయవంతమైన రిజల్యూషన్ అప్లికెంట్‌గా రుణదాతల కమిటీ తమను నిర్ణయించిందని టాటా స్టీల్ పేర్కొంది. భూషణ్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) వంటి సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని వివరించింది. రూ.48,100 కోట్ల రుణాల చెల్లింపుల్లో విఫలమైనందుకు రుణ దాతల కమిటీ భూషణ్ స్టీల్‌పై ఎన్సీఎల్టీలో దివాలా ప్రక్రియను ప్రారంభించింది. భూషణ్ స్టీల్ కొనుగోలుకు ఆసక్తి గల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. టాటా స్టీల్‌తో పాటు జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఒక ప్రైవేట్ ఈక్విటీ సంస్థతో కలసి భూషణ్ స్టీల్ ఉద్యోగులు బిడ్లు దాఖలు చేశారు. చివరకు విజయవంతమైన బిడ్డర్‌గా టాటా స్టీల్ నిలిచింది. భూషణ్ స్టీల్ చేరికతో టాటా స్టీల్ భారత్‌లోనే అతి పెద్ద ఉక్కు కంపెనీగా అవతరించనున్నది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ను తోసిరాజని టాటా స్టీల్ ఈ స్థానానికి ఎగబాకుతుంది. -
టాటా స్టీల్ చేతికి భూషణ్ స్టీల్
సాక్షి, ముంబై: మొత్తానికి భూషణ్ స్టీల్ విక్రయానికి మార్గం సుగమమైంది. సుమారు రూ.50వేల కోట్ల రుణభారంతో సతమతమవుతూ.. దివాలా చట్ట పరిధిలోకి చేరిన భూషణ్ స్టీల్ కొనుగోలుకి వేసిన బిడ్ గెలుపొందినట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో టాటా స్టీల్ తాజాగా తెలియజేసింది. ఈ మేరకు మార్చి 22న భూషణ్ స్టీల్ లిమిటెడ్ (బీఎస్ఎల్) కు చెందిన క్రెడిట్ కమిటీల (కోసీ) నిర్ణయం తీసుకుందని టాటాస్టీల్ పేర్కొంది. అయితే ఈ డీల్ రెగ్యులేషన్ కమిటీ ఆమోదానికి లోబడి ఉంటుందని తెలిపింది. జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తదితర నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించాల్సి ఉందని టాటాస్టీల్ పేర్కొంది. రుణ చెల్లింపుల్లో విఫలంకావడంతో భూషణ్ స్టీల్‌పై బ్యాంకులు దివాలా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో వార్షికంగా 5.6 మిలియన్ టన్నుల సామర్థ్యమున్న భూషణ్ స్టీల్ కొనుగోలుకి పలు సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే అనూహ్యంగా టాటా గ్రూప్ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ రూ. 35వేల కోట్ల బిడ్‌తో ఒక్కసారిగా ముందుకొచ్చింది. తద్వారా ఈ బిడ్‌లో ముందంజలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (బిడ్ వాల్యూరూ. 29,700 కోట్లు) వెనక్కి నెట్టేసింది. కాగా.. ప్రస్తుతం టాటా స్టీల్, భూషణ్ స్టీల్ షేర్లు నష్టాల్లోకదులుతున్నాయి. -
దేశానికి రెక్కలిచ్చినవాడు
1920 నాటి మాట. లూయీ బ్లీరియో ఫ్రాన్స్‌లోనే ప్రఖ్యాత పైలట్. ఇంగ్లిష్ చానెల్ మీది గగనతలంలో మొదటిసారి విమానం నడిపి చరిత్ర ప్రసిద్ధుడైన వ్యక్తి ఆయనే. ఆయన నివాసం దగ్గరే ఉండేది ఫ్రెంచ్ దేశపు కోటీశ్వరులలో ఒకరి ఇల్లు. ఆ కుటుంబానికి చెందిన పదిహేనేళ్ల కుర్రాడు బ్లీరియోను ఆరాధనాపూర్వకంగా చూస్తూ ఉండేవాడు. పైగా వేసవి, ఇతర సెలవుల సందర్భంలో ఆ కోటీశ్వరుల కుటుంబంతో గడిపేవాడు. తను కూడా ఎప్పటికైనా విమానాలు నడపాలని ఆ పిల్ల కోటీశ్వరుడు కోరుకునేవాడు. అలాంటి సమయంలోనే బ్లీరియో కో–పైలట్ ఆ కుర్రవాడిని తనతో పాటు విమానంలో తిప్పాడు. తరువాత నిజంగానే అతడు పైలట్ అయ్యాడు. ఒక దేశపు గగనయాత్రా చరిత్రకు ఆద్యుడిగా నిలిచాడు. నిజం చెప్పాలంటే ఆ దేశానికి సొంత రెక్కలు ఇవ్వాలని కలగన్నాడు. తర్వాతి కాలంలో దానిని నిజం చేశాడు. ఇదంతా భారతదేశం బ్రిటిష్ వలసగా ఉన్న కాలంలో జరిగింది. ఆ పైలట్ పేరు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ టాటా. రెండు దేశాల అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఘనుడు. ఫ్రాన్స్ ఇచ్చే అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ ఆనర్, భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న కూడా ఆయన స్వీకరించారు. జేఆర్డీ తండ్రి బొంబాయి పార్సీ. తల్లి ఫ్రెంచ్ జాతీయురాలు. ఆయన బాల్యం ఫ్రాన్స్‌లోనే ఎక్కువగా గడిచింది. 1932లో జేఆర్డీ టాటా(జూలై 29, 1904– నవంబర్ 29, 1983) టాటా ఎయిర్‌లైన్స్‌ను స్థాపించారు. ఇండియాలో ఆరంభమైన తొలి వాణిజ్య, పౌర విమానయాన సంస్థ అదే. అప్పటికి గగనతలం విమానాలతో రద్దీగా మారిపోలేదు. బ్రిటిష్ పాలనలో ఉన్న భారత్ వంటి దేశానికి విమానయానం అంటే అక్షరాలా గగనకుసుమమే. అలాంటి సమయంలో సాహసించి జేఆర్డీ విమానయాన సంస్థను నెలకొల్పారు. మద్రాసు– కరాచీ మధ్య మొదటి సర్వీసు తిరిగింది. కేవలం గాగుల్స్‌తో ఎలాంటి ప్రత్యేక దుస్తులు లేకుండా ఆ తొలి విమానాన్ని ఓ పైలట్ నడిపారు. అంత సాహసం చేసినవారు ఎవరో కాదు, జేఆర్డీ. ఈ విమానయాన సంస్థ తొలి ఏటి లాభం రూ.60వేలు. బ్రిటిష్ జాతీయులు దేశానికి స్వాతంత్య్రం ఇచ్చి తిరిగి వెళ్లిపోయిన సమయంలో కొన్ని రంగాలకు అద్భుతమైన వ్యక్తుల నాయకత్వం లభించింది. పారిశ్రామిక రంగం వరకు అలాంటి వ్యక్తి జేఆర్డీ. టాటా ఎయిర్‌లైన్స్, టాటా స్టీల్ వంటి కీలక పరిశ్రమలను స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే అభివృద్ధి చేసి దేశానికి ఆధునికతను అద్దిన వ్యక్తి జేఆర్డీ. టాటా కుటుంబంలో స్ఫూర్తిమంతమైన సాహసం ఉంటుందని చెప్పేవారు britishగాంధీజీ. అలాంటి ఖ్యాతిని కుటుంబానికి తెచ్చినవారు జేఆర్డీ అయి ఉండాలి. పాతికేళ్ల వయసులో ఆయనను తండ్రి ఇండియాకు పిలిపించారు. 14 కంపెనీలతో కూడా టాటా అండ్ సన్స్ సామ్రాజ్యాన్ని ఆయనకు అప్పగించారు. జేఆర్డీలో మొదటి అక్షరం జహంగీర్‌ను సూచిస్తుంది. జహంగీర్ అంటే విశ్వ విజేత. టాటాల పారిశ్రామిక సామ్రాజ్యాన్ని జేఆర్డీ 14 కంపెనీల నుంచి ఆ 95 కంపెనీలకు విస్తరింపచేశారు. భారతదేశ పారిశ్రామికరంగ చరిత్రలోనే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగంలోనే జేఆర్డీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. విలువలు ఉన్న పారిశ్రామికవేత్త కావడమే ఇందుకు ప్రధాన కారణం. ఆయన వృత్తికి పారిశ్రామికవేత్త. కానీ ఆయనలో ఒక ద్రష్ట ఉన్నాడు. సామాన్యుల జీవితాలలోకి తొంగి చూసిన శ్రేయోభిలాషి కూడా ఉన్నాడు. కార్మికుల సంక్షేమంతోనే పారిశ్రామక ప్రగతి ఆధారపడి ఉందని విశ్వసించినవారు జేఆర్డీ. సంపాదన, సంతోషం వేర్వేరు స్థితులని గ్రహించి చెప్పినవారాయన. పారిశ్రామిక రంగాన్ని తాత్విక దృష్టితో చూసినవారు జేఆర్డీ. అప్పటికి దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ఐదు దశాబ్దాల పాటు నిర్వహించారాయన. ‘నీవు నాయకుడివి కావాలంటే మానవులను ప్రేమతో నడిపించాలి’ అన్నారాయన. సంస్థ నిర్వహణలో, విస్తరణలో జేఆర్డీ అనుసరించిన ఒక పద్ధతి ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు స్థాపనలో గాని, కాలానికి అనుగుణమైన ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకోవడంలో గానీ, మళ్లీ తన కుటుంబ గతం నుంచే ఆయన ప్రేరణ పొందేవారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు హౌస్ ఆఫ్ టాటాస్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటానే ఆయన ఆదర్శంగా తీసుకునేవారు. తనకు ప్రేరణ అవసరమైతే జంషెడ్జీ జీవిత చరిత్రనే కొద్దిసేపు చదువుకునేవారు. ప్రజలే కాదు, పరిశ్రమలు కూడా ముందంజ వేయాలంటే గతంతో లంకె అత్యవసరమని నిరూపించారాయన. తమ పారిశ్రామిక సామ్రాజ్యంలో సైనికులు, అంటే కార్మికుల సంక్షేమం కోసం జేఆర్డీ తీసుకున్న చర్యలు కూడా జంషెడ్జీ నుంచి పొందిన ప్రేరణతో అమలు చేసినవే.1880–1890 మధ్య అత్యధిక పెట్టుబడులు పెట్టి బొంబాయిలో పరిశ్రమలను విస్తరించిన జంషెడ్జీ ఆ కాలంలోనే ప్రమాద బీమా అమలు చేశారు. పింఛను నిధిని ఏర్పాటు చేశారు. పనిచేసే చోట వాతావరణం ఆరోగ్యంగా ఉండేలా చేశారు. జేఆర్డీ మరో అడుగు ముందుకు వేశారు. దేశంలో తొలిసారిగా సిబ్బంది వ్యవహారాల శాఖను ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. బోనస్‌గా లాభాలలో వాటా ఇవ్వడం, సంయుక్త సలహా మండలి ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. తమ సంక్షేమం, భద్రతల గురించిన విధానాల రూపకల్పనలో కార్మికులకు తప్పనిసరిగా భాగస్వామ్యం ఉండాలన్నది కూడా జేఆర్డీ నిశ్చితాభిప్రాయం. పరిశ్రమలను స్థాపించడానికి పట్టణాలు, నగరాలే తగినవన్న భావన సరికాదని 1969లో ఇచ్చిన ఒక ఉపన్యాసంలోనే జేఆర్డీ చెప్పారు. గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేయడానికి అన్ని రంగాల నిపుణులు కూడా – ఇంజనీర్లు, డాక్టర్లు, సాంకేతిక నిపుణులు, మేనేజర్లు అంతా గ్రామాలకు వెళ్లి అక్కడి బాగోగులు చూడవలసిన అవసరం ఉందని చెప్పిన వారు జేఆర్డీ. గ్రామాలూ, పట్టణాలూ మధ్య పెరిగి పోతున్న అంతరాలు, ఉద్యోగావకాశాలు, ఆర్థిక ప్రయోజనాల విషయంలో పెరిగిపోతున్న ఆగాధం గురించి జేఆర్డీ ఆలోచించారన్నమాట. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సయోధ్య అనివార్యమన్నదే జేఆర్డీ సిద్ధాంతం. దీని గురించి ఈ దేశంలో నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. టాటా ఎయిర్‌లైన్స్‌ను ఇదే సిద్ధాంతం మేరకు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ (1946 నుంచి) పేరుతో నిర్మించారు కూడా. ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రయోగంతో నడిచిన మొదటి విజయం, ఆఖరి విజయం కూడా ఎయిర్ ఇండియా ప్రయోగమేనని చెబుతారు. ఆయన ప్రభుత్వం దగ్గరకు ఎప్పుడు వెళ్లినా భారత పారిశ్రామిక రంగ ప్రతినిధిగానే వెళ్లారని ఎందరో రాశారు. అంతే తప్ప టాటా కంపెనీ ప్రతినిధిగా ఆయన వెళ్లలేదు. తన సంస్థల కోసం ప్రత్యేక రాయితీలు అడిగినవారు కాదు జేఆర్డీ. పన్ను ఎగవేతకు ఏనాడూ పాల్పడలేదు. అలాగే రాజకీయ పార్టీలకు చాటుగా విరాళాలు ఇవ్వలేదు. జేఆర్డీ వాణిజ్యం జాతిహితాన్నీ, సామాజిక ప్రయోజనాన్నీ ఆశించడంతో పాటు, విశాల దృష్టిని కూడా కలిగి ఉందని ఒక సందర్భంలో పీవీ నరసింహారావు అన్నారు. ఒక దేశం లేదా సమాజం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోలేని, లేదా వారి అవసరాలకు అక్కరకు రాని ఏ ఆవిష్కరణ అయినా, పరిశ్రమ అయినా విజయాన్ని సాధించడం సాధ్యం కాదని ఒక సభలో జేఆర్డీ చెప్పారు. ఒక ప్రాంతంలో పెట్టే పరిశ్రమ స్థానికులకు ఉపయోగపడక పోతే ఎదరయ్యే ప్రతిస్పందన ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా గమనిస్తూనే ఉన్నాం. పారిశ్రామికవేత్త అయినప్పటికీ పర్యావరణ కాలుష్యంలో పరిశ్రమల వాటాను జేఆర్డీ నిజాయితీగానే గమనించారు. ‘ది క్రియేషన్ ఆఫ్ వెల్త్’ అన్న పుస్తకానికి ముందుమాటలో ఆ విషయం ఉంది. ‘‘ప్రస్తుతం పారిశ్రామికవేత్తల బాధ్యత ప్రజల శ్రేయస్సు అనే పరిధిని దాటాలి, పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ విషయాన్ని తగినంతగా గుర్తించినా, మన సేవలు మనుషుల పరిధి దాటి నింగీనేల, అడవులకు, నీటి రక్షణకి, భూమ్మీద ఉండే జంతుకోటికి కూడా విస్తరించాలి’’ అని రాశారాయన. ప్రఖ్యాత ఐటీ నిపుణుడు, పారిశ్రామికవేత్త ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి తన జీవితంలో జరిగిన ఒక గొప్ప అనుభవాన్ని ఒక సందర్భంలో వివరించారు. మొదట ఆమె టాటా సంస్థలలో పనిచేసేవారు. ఒకసారి ఆమె ఒక్కరే కార్యాలయం ఆవరణలో కనిపించారు. ఆమెను చూస్తే ఎవరి కోసమో ఎదురు చూస్తున్న సంగతి అర్థమవుతోంది కూడా. అప్పటికే చీకట్లు పడుతున్నాయి. అంతా ఖాళీ అవుతోంది. అప్పుడు ఒక కారు వచ్చి ఆమె దగ్గర ఆగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి సాక్షాత్తు జేఆర్డీ. సుధామూర్తి కొంచెం కంగారు పడ్డారు. చీకటి పడుతుండగా ఇంకా ఇక్కడ ఎందుకు ఉన్నారని జేఆర్డీ టాటా అడిగారు. తన భర్త వస్తారని (అప్పటికి ఇన్ఫోసిస్ ఆవిర్భవించలేదు) చెప్పింది. నిమిషాలు గడుస్తున్నాయి. ఆయన నిలబడే ఉండిపోయారు. అది మరింత ఇబ్బందిగా అనిపించిందామెకు. చెప్పిన సమయం కంటే కొంచెం ఆలస్యంగానే నారాయణమూర్తి వచ్చారు. అప్పుడు జేఆర్డీ తిరిగి కారు ఎక్కుతూ, ‘‘భార్యకు వేచి ఉండే పరిస్థితి ఇంకెప్పుడు కల్పించనని నీ భర్త దగ్గర హామీ తీసుకో’ అని వెళ్లిపోయారు. ఒక ఉద్యోగి, అందునా మహిళా ఉద్యోగి పట్ల ఆయన చూపిన బాధ్యతాయుతమైన ధోరణి నిజంగా అసాధారణమే. సుధామూర్తి పెద్ద చదువులు చదివిన ఇంజనీరు. ఆమె విషయంలోనే కాదు, తన కారు డ్రైవర్ విషయంలో కూడా జేఆర్డీ మానవతా దృక్పథంతో ఉండేవారు. ఒకసారి ఒక సమావేశంలో పాల్గొన్న జేఆర్డీ తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు దాటిపోయింది. డ్రైవర్ని భోజనం చేశావా అని అడిగారాయన. లేదని చెప్పాడతడు. కొంచెం నొచ్చుకున్నారు జేఆర్డీ. తరువాత మళ్లీ ఒకసారి ఆయన కారు దిగి లోపలికి వెళ్లిన వారే వెనక్కి వచ్చి, కారు డ్రైవర్‌ను పిలిచి, ‘ఇవాళ నాకు ఆలస్యమవుతుంది. నీవు వెళ్లి భోజనం చేసి వచ్చేయ్’ అని చెప్పి మళ్లీ లోపలికి వెళ్లారు. 1992లో భారత ప్రభుత్వం టాటాను భారతరత్నతో సత్కరించింది. ఆ సమయంలో ఆయనను టాటా కంపెనీల ఉద్యోగులు సత్కరించారు. ఆ సమయంలో అన్నమాట చాలా గొప్పది. ‘అమెరికా ఆర్థిక నిపుణుడు భవిష్యత్తులో భారతదేశం ఆర్థిక సూపర్‌పవర్ అవుతుందని జోస్యం చెప్పాడు. కానీ నేను భారతదేశం సుఖసంతోషాలతో వర్ధిల్లే దేశంగా ఉండాలని అనుకుంటాను’ అన్నారు. జేఆర్డీ భారత గగనయాన సేవలకు పితామహుడని పేరు. కానీ ఆయన ఆకాశానికే పరిమితం కాలేదు. నేల మీద మాత్రమే నడవగలిగేవారి గురించి కూడా ఆలోచించారు. - డా. గోపరాజు నారాయణరావు -
భూషణ్ స్టీల్ రేసులో టాటా స్టీల్ !
న్యూఢిల్లీ: రుణభారంతో కుదేలైన భూషణ్ స్టీల్‌ను చేజిక్కించుకోవడానికి టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లు బిడ్లు సమర్పించాయి. వీటితో పాటు భూషణ్ స్టీల్‌కంపెనీ సొంత ఉద్యోగుల కన్సార్షియమ్ కూడా బిడ్‌ను సమర్పించిందని భూషణ్ స్టీల్ కంపెనీ బీఎస్ఈకి నివేదించింది. జేఎస్‌డబ్ల్యూ, పిరమళ్ ఎంటర్‌ప్రైజెస్‌లు కలిసి జాయింట్ వెంచర్‌గా ఏర్పడి జేఎస్‌డబ్ల్యూ లివింగ్ ప్రైవేట్‌గా బిడ్‌ను దాఖలు చేశాయని పేర్కొంది. ఈ కంపెనీల రిజల్యూషన్ ప్లాన్ల వివరాలకు సంబంధించిన ఒక సవివరమైన నివేదికను ఆర్పీ(రిజల్యూషన్ ప్రొఫెషనల్) రుణదాతల కమిటీ (కమిటీ ఆఫ్ క్రెడిటర్స్)కు ఇటీవలే∙సమర్పించారని భూషణ్ స్టీల్ తెలిపింది. ఎన్సీఎల్టీకి ఆర్బీఐ నివేదించిన 12 మొండి బకాయిల ఖాతాల్లో భూషణ్ స్టీల్ ఒకటి. ఈ కంపెనీ బ్యాంక్‌లకు రూ.44,478 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం బీఎస్ఈలో భూషణ్ స్టీల్ షేర్ 20% అప్పర్ సర్క్యూట్ తాకి, రూ.53.80 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.202 కోట్లు పెరిగి రూ.1,219 కోట్లకు ఎగసింది. కాగా భూషణ్ స్టీల్ కొనుగోలు కోసం అన్ని కంపెనీల కన్నా అధికంగా టాటా స్టీల్ రూ.36,000 కోట్లు కోట్ చేసిందని, రెండో స్థానంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ స్టీల్ బిడ్ కన్నా టాటా స్టీల్ బిడ్ రూ.10,000 కోట్లు అధికమని మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో టాటా స్టీల్ షేర్ 5.8 శాతం నష్టపోయి, రూ.648 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 9 శాతం పతనమైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,834 కోట్లు ఆవిరైంది. -
టాటా స్టీల్ లాభం 5 రెట్లు అప్
న్యూఢిల్లీ: టాటా స్టీల్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఐదు రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.232 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.1,136 కోట్లకు పెరిగినట్లు టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.29,255 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో రూ.33,672 కోట్లకు చేరిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ టీవీ. నరేంద్రన్ తెలిపారు. ఇబిటా 57 శాతం వృద్ధితో రూ.5,697 కోట్లకు పెరిగిందని, ఇబిటా మార్జిన్ 3.9 శాతం పెరిగి 17 శాతానికి చేరిందని చెప్పారాయన. ఇతర ఆదాయం 74 శాతం వృద్ధితో రూ.226 కోట్లకు పెరిగింది. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.12,800 కోట్లకు మించకుండా నిధుల సమీకరణకు డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని నరేంద్రన్ వెల్లడించారు. రైట్స్ ఇష్యూ ఈ నెల 14న మొదలై 28న ముగుస్తుంది. ఇదే జోరు కొనసాగుతుంది...! గత తొమ్మిది నెలల్లో తాము కార్యకలాపాలు నిర్వహిస్తున్న దేశాల్లో మంచి పనితీరు సాధించామని నరేంద్రన్ పేర్కొన్నారు. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉండటంతో ఇదే జోరు కొనసాగుతుందనే అంచనాలున్నాయన్నారు. చైనాలో వాణిజ్య పరిస్థితులు మెరుగుపడటంతో అంతర్జాతీయంగా ఉక్కు ధరలు జోరుగా ఉన్నాయని, భారత్‌లో వివిధ రకాల ఉక్కు ఉత్పత్తుల విక్రయాలు పెరిగాయని తెలియజేశారు. కళింగనగర్ ప్లాంట్‌ను విస్తరిస్తున్నామని, వేరే కంపెనీల ప్లాంట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కళింగనగర్ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ టన్నులకు పెంచుతున్నామని, ఈ ప్రాజెక్ట్ కోసం రూ.23,500 కోట్లు పెట్టుబడులు పెడుతున్నామని, ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్లలో పూర్తవుతుందని వివరించారు. రూ. 22,544 కోట్ల నగదు నిల్వలు.. ఈ క్యూ3లో కంపెనీ స్థూల రుణ భారం రూ.1,658 కోట్లు తగ్గిందని కంపెనీ సీఎఫ్ఓ కౌశిక్ చటర్జీ చెప్పారు. భారత్‌లో అమ్మకాలు పుంజుకోవడం, కమోడిటీ ధరలు పెరగడంతో వివిధ దేశాల్లో రియలైజేషన్లు మెరుగుపడడం, విదేశీ మారక ద్రవ్య ప్రభావం దీనికి కారణమన్నారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.22,544 కోట్లుగా ఉన్నాయన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ 1.8 శాతం లాభంతో రూ.684 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ లాభం రూ. 1,018 కోట్లు
ముంబై: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.1,018 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నష్టం రూ.49 కోట్లు. రెండో త్రైమాసికంలో ఆదాయం 20 శాతం వృద్ధి చెంది రూ. 27,120 కోట్ల నుంచి రూ. 32,464 కోట్లకు పెరిగింది. క్యూ2లో ఉక్కు ఉత్పత్తి సైతం 5.94 మిలియన్ టన్నుల (ఎంటీ) నుంచి 6.24 ఎంటీకి పెరిగింది. దేశీయంగా కార్యకలాపాల విషయానికొస్తే.. డెలివరీలు పెరిగి, రాబడులు మెరుగుపడటంతో 33 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షాకాలంలో నిర్మాణ కార్యకలాపాలు, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండు, వినియోగదారుల సెంటిమెంటు బలహీనంగా ఉన్నప్పటికీ.. విక్రయాలపరంగా మెరుగైన పనితీరే కనపర్చగలిగామని టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్ చెప్పారు. కొంగొత్త వాహన మోడల్స్ రాకతో పాటు కొత్త గ్రేడ్‌ను అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో తమ ఆటోమోటివ్ విభాగం 34% వృద్ధి నమోదు చేసినట్లు ఆయన వివరించారు. 27 కొత్త ఉత్పత్తులు.. సమీక్షాకాలంలో వివిధ కస్టమర్ల విభాగాల్లో 27 కొత్త ఉత్పత్తులు రూపొందించినట్లు నరేంద్రన్ వివరించారు. మరోవైపు దక్షిణాసియా వ్యాపార కార్యకలాపాలు సైతం నిర్వహణపరంగా పటిష్టమైన పనితీరు కనపర్చాయని ఆయన చెప్పారు. వివిధ మార్కెట్లలో అమ్మకాలు పెరగడంతో సీక్వెన్షియల్ ప్రాతిపదికన గ్రూప్ ఆదాయాలు 9 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కౌశిక్ చటర్జీ వివరించారు. అయితే, సీజనల్ అంశాలతో యూరోపియన్ కార్యకలాపాలు బలహీనంగా ఉండటంతో సీక్వెన్షియల్‌గా స్థూలలాభం కొంత క్షీణించిందన్నారు. అటు నిర్వహణ మూలధన అవసరాలు, ఫారెక్స్ ప్రభావాలతో స్థూల రుణభారం రూ. 2,450 కోట్ల మేర పెరిగిందని చటర్జీ పేర్కొన్నారు. కంపెనీ వద్ద నగదు, తత్సమాన నిల్వలు రూ. 19,800 కోట్ల మేర ఉన్నాయి. -
ఎస్సార్ స్టీల్ కొనుగోలు రేసులో టాటా, ఆర్సెలర్ మిట్టల్
న్యూఢిల్లీ: రుణ బకాయిలు చెల్లించలేక దివాలా కోరల్లో చిక్కుకున్న ఎస్సార్ స్టీల్‌ను కొనుగోలు చేసేందుకు దేశీ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి. ప్రధానంగా టాటా స్టీల్, ఆర్సెలర్ మిట్టల్‌తో పాటు ఎస్సార్ గ్రూప్ కూడా బిడ్లు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్సార్ స్టీల్ ఇండియాకు రుణాలిచ్చిన బ్యాంకులు ఇప్పటికే దివాలా చట్టం ప్రకారం కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రక్రియను(సీఐఆర్‌పీ) మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ కంపెనీని విక్రయించడం కోసం అక్టోబర్ 23న కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) బిడ్లను ఆహ్వానించారు. తాము కూడా ఈఓఐను సమర్పించామని, పరిష్కార ప్రణాళికను నిర్దేశిత కాలవ్యవధిలోపే సమర్పిస్తామని ఎస్సార్ గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు. కాగా, బిడ్డింగ్‌లో పాల్గొనడం ఎంతవరకూ సబబు అన్న ప్రశ్నకు... దివాలా చట్టం ప్రకారం ప్రమోటర్లు(ఎస్సార్ గ్రూప్) కూడా దివాలా ప్రక్రియలో ఉన్న తమ సొంత కంపెనీ బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్సీఎల్టీ(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) చేపడుతున్న ఈ దివాలా ప్రక్రియలో తమను నిలువరించేలా ఎలాంటి పరిమితులూ లేవని... అమెరికా, బ్రిటన్‌తో సహా అనేక అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల్లో సైతం ఇదే విధానం అమల్లో ఉందని వివరించారు. మరోపక్క, బిడ్‌కు జతగా రష్యా ఆర్థిక సంస్థ వీటీబీ క్యాపిటల్ నుంచి నిధుల హామీ పత్రాన్ని కూడా ఎస్సార్ గ్రూప్ సమర్పించినట్లు సమాచారం. వీటీబీ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఇది. అంతర్జాతీయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న వీటీబీ బ్యాంక్‌లో రష్యా ప్రభుత్వానికి మెజారిటీ (60.9 శాతం) వాటా ఉంది. కాగా, ఎస్సార్ స్టీల్ కొనుగోలుకు ఆసక్తి లేదని వేదాంత ప్రతినిధి స్పష్టం చేశారు. అప్పులు రూ.45 వేల కోట్లు... ఎస్సార్ స్టీల్ ఇండియాకు దేశంలో వార్షికంగా కోటి టన్నుల ద్రవ ఉక్కును ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నం, ఒడిశాలోని పారదీప్‌లలో 2 కోట్ల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన బెనిఫికేషన్, పెల్లెట్ తయారీ ప్లాంట్లు ఉన్నాయి. ఇప్పటివరకూ తాము రూ.5 వేల కోట్లమేర పెట్టుబడులు పెట్టామని ఎస్సార్ స్టీల్ చెబుతోంది. ఇన్వెస్టర్ల నుంచి ఇప్పటివరకూ రూ.16,000 కోట్లను సమీకరించినట్లు తెలిపింది. ప్రత్యక్షంగా 5 వేల మంది, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధిని కల్పిస్తోంది. రూయాలకు చెందిన ఎస్సార్ గ్రూప్ ప్రమోట్ చేసిన మరో కంపెనీ ఎస్సార్ ఆయిల్‌ను రష్యాకు చెందిన రాస్‌నెఫ్ట్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కాగా, దివాలా ప్రక్రియను ఆమలు చేయాలంటూ ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశించిన 12 కంపెనీల తొలి జాబితాలో ఎస్సార్ స్టీల్ కూడా ఒకటి. దివాలా చట్టం ప్రకారం ఎస్సార్ స్టీల్, భూషణ్ స్టీల్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్‌పై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం బకాయిల వసూలు కోసం ఎన్సీఎల్టీలో దివాలా పిటిషన్‌ను దాఖలు చేశాయి. బ్యాంకులకు ఎస్సార్ స్టీల్ చెల్లించాల్సిన రుణ బకాయిలు దాదాపు రూ.45,000 కోట్లుగా అంచనా. -
టాటా స్టీల్... ఫ్యూచర్స్ సిగ్నల్స్
యూరప్ వ్యాపారాన్ని జాయింట్ వెంచర్‌గా మార్పుచేసిన నేపథ్యంలో టాటా స్టీల్ 1.6 శాతం ర్యాలీ జరిపి రూ. 687.60 వద్ద ముగిసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 14.68 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ 2.42 కోట్ల షేర్లకు పెరిగింది. స్పాట్ ధరతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం రూ.2.50 నుంచి రూ.1కి తగ్గింది. స్పాట్ కొనుగోళ్లకు రక్షణగా జరిగిన షార్టింగ్ కార్యకలాపాల్ని ఈ యాక్టివిటీ సూచిస్తున్నది. ఆప్షన్స్ విభాగంలో రూ. 680 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్, పుట్ రైటింగ్ జరిగాయి. ఈ కాల్ ఆప్షన్ నుంచి 1.04 లక్షల షేర్లు కట్‌కాగా, పుట్ ఆప్షన్లో 2.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 13.68 లక్షల షేర్ల కాల్ బిల్డప్, 11.88 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. రూ. 690, రూ. 700 స్ట్రయిక్స్ వద్ద తాజా కాల్ రైటింగ్ కారణంగా 1.96 లక్షలు, 1.34 లక్షల చొప్పున షేర్లు యాడ్ అయ్యాయి. ఈ స్ట్రయిక్స్ వద్ద మొత్తం కాల్ బిల్డప్ వరుసగా 12.82 లక్షలు, 26.46 లక్షలకు చేరింది. రూ.670 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ కారణంగా 2.28 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇక్కడ 11.30 లక్షల షేర్ల పుట్ బిల్డప్ వుంది. సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 680పైన స్థిరపడితే క్రమేపీ రూ. 700 స్థాయిని చేరవచ్చని, రూ. 680 స్థాయిని కోల్పోతే రూ. 670 వరకూ క్షీణించవచ్చని ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. -
థిసెన్క్రప్తో టాటా స్టీల్ జట్టు
►యూరప్‌లో ఉక్కు కార్యకలాపాలు విలీనానికి ఎంవోయూ ►50:50 నిష్పత్తిలో జేవీ ఏర్పాటుకు నిర్ణయం ►డీల్ పూర్తయితే యూరప్‌లో ఉక్కు ఉత్పత్తిలో నంబర్ 2 స్థానం ముంబై: పారిశ్రామిక దిగ్గజాలు టాటా స్టీల్, థిసెన్‌క్రప్.. యూరప్‌లోని తమ ఉక్కు ఉత్పత్తి విభాగాలను విలీనం చేసేందుకు ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 50:50 నిష్పత్తిలో థిసెన్‌క్రప్ టాటా స్టీల్ పేరిట జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. ఇది నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డ్యామ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది. ఈ డీల్ సాకారమైతే ఆర్సెలర్ మిట్టల్ తర్వాత యూరప్‌లో రెండో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థగా థిసెన్‌క్రప్ టాటా స్టీల్ నిలుస్తుంది. తాజా ఒప్పందం.. టాటా స్టీల్ ఇండియా ఖాతాలను పటిష్టపర్చగలదని, మెరుగైన ఉత్పత్తుల తయారీకి, వృద్ధిపై దృష్టి సారించేందుకు దోహదపడగలదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి సామర్ధ్యం రెట్టింపు కాగలదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కళింగనగర్ (ఒడిషా), జంషెడ్‌పూర్‌లోని రెండు ప్లాంట్లలో వార్షికంగా 13 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. స్వంతంగా ఎదగడంతో పాటు ఇతర సంస్థలను కూడా కొనుగోలు చేయడం తదితర కార్యకలాపాల ద్వారా వృద్ధి సాధనపై దృష్టి సారించనున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. ఈ డీల్‌తో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి సామర్థ్యాలు కూడా మెరుగుపడగలవని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి మదింపు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని, డిసెంబర్ ఆఖరు నాటికి లేదా 2019 తొలినాళ్లలో గానీ నియంత్రణ సంస్థల అనుమతి లభించగలదని ఆశిస్తున్నట్లు టాటా స్టీల్ గ్రూప్ ఈడీ కౌశిక్ చటర్జీ తెలిపారు. బ్రిటన్, నెదర్లాండ్స్‌లోని ప్లాంట్ల మూసివేతగానీ ఉద్యోగుల తొలగింపుగానీ జరగదని ఆయన చెప్పారు. ‘ప్రతిపాదిత జాయింట్ వెంచర్ ద్వారా థిసెన్‌క్రప్, టాటా స్టీల్ యూరప్ విభాగాల పటిష్టమైన భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. యూరప్ ఉక్కు పరిశ్రమలో వ్యవస్థీకృత సవాళ్లను ఎదుర్కొంటూ పటిష్టంగా నంబర్ 2 స్థానం దక్కించుకుంటాం‘ అని థిసెన్‌క్రప్ సీఈవో హెయిన్రిచ్ హైసింగర్ పేర్కొన్నారు. 2.5 బిలియన్ యూరోల రుణ బదలాయింపు.. టాటా స్టీల్‌కి దాదాపు రూ. 77,000 కోట్ల రుణభారం ఉండగా.. ఇందులో సుమారు 2.5 బిలియన్ యూరోల మేర (దాదాపు రూ. 19,250 కోట్లు) భారం జాయింట్ వెంచర్‌కి బదలాయిస్తారు. మిగతా రుణం టాటా స్టీల్ ఇండియా ఖాతాల్లో విదేశీ రుణంగా ప్రతిఫలిస్తుంది. జేవీ సంస్థ ఆదాయాలు 15.9 బిలియన్ యూరోలుగాను, స్థూల లాభం 1.56 బిలియన్ యూరోలుగాను ఉండనుంది. థిసెన్క్రప్కి సంబంధించి 3.6 బిలియన్ యూరోల మేర పింఛన్లపరమైన భారం కూడా జేవీకి బదలాయించడం జరుగుతుంది. టాటా స్టీల్ యూరప్‌లో 18,000 మంది, థిసెన్క్రప్లో 30,000 మంది సిబ్బంది ఉన్నారు. కొత్త సంస్థకు అంతర్జాతీయంగా 34 ప్రాంతాల్లో 48,000 మంది సిబ్బంది ఉంటారు. ఆమ్స్టర్డ్యామ్ కేంద్రంగా కార్యకలాపాలు ... ఎంవోయూ ప్రకారం.. యూరప్‌లో ఇరు కంపెనీల ఫ్లాట్ స్టీల్ వ్యాపారాలు, థిసెన్క్రప్కి చెందిన స్టీల్ మిల్లు సేవలు జాయింట్ వెంచర్‌కి వెళ్తాయి. ప్రతిపాదిత జేవీ.. థిసెన్‌క్రప్ టాటా స్టీల్ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డ్యామ్లో ఉంటుంది. ప్రీమియం, వైవిధ్యమైన ఉత్పత్తులు సరఫరా చేస్తుంది. వార్షికంగా 21 మిలియన్ టన్నుల ఫ్లాట్ స్టీల్ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. రెండు కంపెనీల కలయికతో 400–600 మిలియన్ యూరోల ప్రయోజనం చేకూరనుంది. నగదుయేతర విధానం ద్వారా ఈ లావాదేవీ జరగనున్నట్లు కౌశిక్ చటర్జీ తెలిపారు. -
దూసుకుపోతున్న టాటా స్టీల్
సాక్షి, ముంబై: లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్మార్కెట్లో మంగళవారం టాటా స్టీల్ ఆకర్షణగా నిలిచింది. బ్రిటిష్ స్టీల్ పెన్షన్ పథకానికి(బీఎస్పీఎస్)కు యూకే పెన్షన్ నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించిన వార్తలతో టాటా స్టీల్ షేర్ భారీ లాభాలను నమోదు చేసింది. బ్రిటిష్ పెన్షన్ రెగ్యులేటరీ నుంచి ఆమోదం లభించిందని టాటాస్టీల్ ఒక ప్రకటనలో ధృవీకరించింది. యూకే అనుబంధ సంస్థ టాటా స్టీల్, తదితర అనుబంధ సంస్థల నుంచి బీఎస్పీఎస్ను విడదీసేందుకు యూకే పెన్షన్ రెగ్యులేటర్ అనుమతించినట్లు దేశీ దిగ్గజం టాటా స్టీల్ పేర్కొంది టాటాస్టీల్ (యూకే) ద్వారా (బబీఎస్పీఎస్) 550 మిలియన్ పౌండ్లను చెల్లించినట్టు తెలిపింది. ఇది కంపెనీలోని 33 శాతం వాటాకి సమానమైన భాగాన్ని బీఎస్పీఎస్ ట్రస్టీకి జారీ చేశామని ఉక్కు దిగ్గజం తెలిపింది. మరోవైపు ఈ నెలలోనే టాటా స్టీల్‌తో యూరోపియన్ స్టీల్ బిజినెస్ విలీనానికి థిస్సెన్‌క్రుప్ ముందస్తు ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఈ వార్తలతో టాటా స్టీల్ కౌంటర్లో కొనుగోళ్ళ జోరునెలకొంది. 3శాతంపైగా లాభాలతో ఆరేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. -
టాటా స్టీల్ టర్న్ అరౌండ్
నికర లాభం రూ.921 కోట్లు గతంతో పోలిస్తే 4 రెట్ల పెరుగుదల న్యూఢిల్లీ: టాటా గ్రూప్ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ టర్న్ అరౌండ్ అయ్యింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది జూన్ క్వార్టర్లో రూ. 3,183 కోట్ల భారీ నష్టాన్ని ప్రకటించిన టాటా స్టీల్, తాజా త్రైమాసికంలో రూ. 921.09 కోట్ల నికరలాభాన్ని కనపర్చింది. కంపెనీ మొత్తం ఆదాయం 19 శాతం వృద్ధిచెంది రూ. 25,970 కోట్ల నుంచి రూ. 30,973 కోట్లకు చేరింది. అయితే గతేడాది ఏప్రిల్–జూన్ మధ్యకాలంలో కంపెనీ యూరప్‌లో కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపివేసిన పనితీరును పరిగణనలోకి తీసుకుని భారీ నష్టాన్ని వెల్లడించగా, కొనసాగించిన కార్యకలాపాల ప్రకారం మాత్రం అప్పట్లో రూ. 209 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. ఈ లాభాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే (కొనసాగిన కార్యకలాపాల ప్రకారం) 2017 జూన్ క్వార్టర్లో కంపెనీ నికరలాభం రూ. 209 కోట్ల నుంచి నాలుగింతలై రూ. 933 కోట్లకు చేరింది. ఇండియాలోనూ, యూరప్‌లోనూ తమ ఉక్కు వ్యాపారం పటిష్టమైన పనితీరును కనపర్చిందని, ఆగ్నేయాసియాలో మాత్రం కార్యకలాపాలు దెబ్బతిన్నట్లు కంపెనీ ఎక్సే్ఛంజీలకు తెలిపింది. ఆగ్నేయాసియాలో మైనింగ్ లిటిగేషన్ల కోసం రూ. 617 కోట్లు కేటాయింపులు జరిపామని, దీనిని మినహాయిస్తే తమ నికరలాభం రూ. 1,550 కోట్లకు చేరినట్లవుతుందని కంపెనీ వివరించింది. ఇండియాలో.... ఇండియాలో కళింగనగర్ ప్లాంటు విస్తరణతో తమ ప్లాంట్ల నుంచి 27.5 లక్షల టన్నుల ఉక్కు సరఫరా జరిగిందని, ఇది గతేడాది జూన్ క్వార్టర్‌తో పోలిస్తే 28 శాతం అధికమని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్‌తో పోలిస్తే సరఫరాలు 14 శాతం తగ్గాయని, ఇందుకు సీజన్, జీఎస్టీ కారణమని కంపెనీ తెలిపింది. ఇండియా కార్యకలాపాల ద్వారా ఆపరేటింగ్ లాభం 2016 జూన్ క్వార్టర్‌కంటే 31 శాతం పెరుగుదలతో రూ. 2,922 కోట్లకు చేరింది. కానీ నికరలాభం 12 శాతం క్షీణించి రూ. 506 కోట్లకు తగ్గింది. యూరప్‌లో.... యూరప్‌లో మార్కెట్ పరిస్థితులు మెరుగుపడుతున్నందున, అక్కడి కార్యకలాపాల ఆదాయం 28 శాతం వృద్ధితో 170.3 కోట్ల పౌండ్లకు పెరిగినట్లు టాటా స్టీల్ వెల్లడించింది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడగా... సోమవారం టాటా స్టీల్ షేరు ధర బీఎస్ఈలో 4.26 శాతం పెరుగుదలతో రూ. 600 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టాటా స్టీల్ క్యూ 1 ఫలితాలు
ముంబై: స్టీల్ దిగ్గజం టాటా స్టీల్ లిమిటెడ్ బాగా తేరుకుంది. అంచాలనకనుగుణంగానే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలనుంచి కోలుకొని లాభాలను నమోదు చేసింది. సంవత్సరం క్రితం నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లి రూ.921 కోట్ల నికర లాభాలను సాధించింది. సోమవారం టాటా స్టీల్ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి క్యూ 1 ఫలితాలను ప్రకటించింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో స్టీల్ మేకర్ నికర లాభం 921 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,183 కోట్లు నష్టపోయింది. ముఖ్యంగా కళింగ నగర్ ప్లాంట్ ద్వారా అమ్మకాలు సంస్థ లాభాలకు మంచి బూస్ట్నుఅందించాయి. ఈ త్రైమాసికంలో స్థూల ఋణం రూ .4,798 కోట్లు పెరగడంతో ఫారెక్స్ ప్రభావం పెరిగింది. మరోవైపు ఫలితాలు మెరుగ్గా ఉండనున్నాయనే నేపథ్యంలో సోమవారం బిఎస్ఇలో టాటా స్టీల్ కౌంటర్ 4 శాతం ఎగిసి 600 రూపాయలకు చేరుకుంది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు వస్తుండటంతో సోమవారం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 10,100 మార్కును చేధించడానికి చూస్తోంది. ప్రస్తుతం 20.60 పాయింట్ల లాభంతో 10,087 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 53.66 పాయింట్ల లాభంలో 32,379 వద్ద కొనసాగుతోంది. క్యూ1 ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ 2 శాతం మేర లాభాలు గడిస్తోంది. యూకేలో జేఎల్ఆర్ అమ్మకాలు బలహీనంగా ఉన్నప్పటికీ టాటా మోటార్స్ 1 శాతం మేర జంప్ చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.5 శాతం పైకి ఎగిసింది. అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనా వేసిన దానికంటే మెరుగ్గా రావడంతో ఆసియా మార్కెట్లు మంచిగా ట్రేడవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు బలపడి 63.68 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 176 రూపాయల నష్టంలో 28,400 రూపాయలుగా కొనసాగుతున్నాయి. -
దిగ్గజ కంపెనీల ఫలితాలపై చూపు
♦ టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ ఫలితాలు ఈ వారంలోనే ♦ 11న పారిశ్రామికోత్పత్తి గణాంకాల రాక ♦ మార్కెట్ సెంటిమెంట్‌ను నిర్ణయించేవి ఇవే న్యూఢిల్లీ: ఈ వారం దేశీయంగా వెలువడే పారిశ్రామికోత్పత్తి, బ్లూచిప్ కంపెనీలైన టాటా స్టీల్, టాటామోటార్స్, ఎస్బీఐ, అరబిందో ఫార్మా, బీహెచ్ఈఎల్, గెయిల్ ఫలితాలపై మార్కెట్లు ప్రధానంగా దృష్టి సారించనున్నాయి. వీటితోపాటు రుతుపవనాల విస్తరణ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలు, డాలర్‌తో రూపాయి మారకం.. తదితర అంశాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపేవేనని విశ్లేషకులంటున్నారు. అయితే, అమెరికా బలమైన ఉద్యోగ గణాంకాలు గత శుక్రవారం వెలువడగా సోమవారం మార్కెట్లు వీటికి స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కంపెనీల ఆర్థిక ఫలితాలను మార్కెట్లు గమనించనున్నాయని, స్టాక్ వారీగా కదలికలు ఉంటాయని కోటక్ సెక్యూరిటీస్ పీసీజీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ టీనా విర్మాని పేర్కొన్నారు. ఆద్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్‌హెడ్ అబ్నీష్ కుమార్ సుదాన్షు కూడా ఇదే విధమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వారం మార్కెట్ల గమనం ప్రధానంగా కంపెనీల ఫలితాలు, ఐఐపీ డేటా ఆధారంగానే ఉంటుందన్నారు. అయితే, మార్కెట్లు అధిక వ్యాల్యేషన్ల కారణంగా స్వల్ప కాలానికి తాము అప్రమత్త ధోరణితోనే కొనసాగుతామని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. గత వారం బీఎస్ఈ కేవలం 15 పాయింట్ల లాభపడగా, నిఫ్టీ 52 పాయింట్ల పెరుగుదలతో సూచీలు వరుసగా ఐదో వారం లాభాల్లో కొనసాగినట్టయింది. టాటా స్టీల్ ఫలితాలు నేడే: సోమవారం టాటా స్టీల్, బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. మంగళవారం (ఈ నెల 8న) థెర్మాక్స్ కంపెనీ, ఈ నెల 9న(బుధవారం) టాటా మోటార్స్, అరబిందో ఫార్మా, ఐషర్ మోటార్స్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్ఎండీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా కంపెనీలు, గురువారం (ఈ నెల 10న) భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, గెయిల్ ఇండియా, ఎంఓఐఎల్ కంపెనీలు, శుక్రవారం (11న) బీపీసీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సిప్లా, హిందాల్కో కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఆర్థిక గణాంకాల విషయానికొస్తే, జూన్ నెలకు సంబంధించి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 11న (శుక్రవారం) మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడతాయి. అంతర్జాతీయ అంశాల పరంగా చూస్తే... సోమవారం జపాన్ వాణిజ్య గణాంకాలు, మంగళవారం (ఈ నెల 8న) చైనా జూలై ట్రేడ్ బ్యాలెన్స్ డేటా, శుక్రవారం (ఈ నెల 11న) చైనా ఎఫ్‌డీఐ గణాంకాలు వెల్లడవుతాయి. రాబడుల్లో వ్యాల్యూ ఫండ్స్ వెనుకంజ: వ్యాల్యూ ఫండ్స్ గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువను పెంచడంలో వెనుకపడ్డాయి. వీటికంటే సూచీలే మెరుగైన రాబడులు ఇచ్చాయి. ప్రభుత్వ నిబంధనలు, పన్నుల్లో మార్పులు ఇలా ఎన్నో రకాల అంశాలతో పెరగాల్సినంత పెరగని షేర్లలో, మార్కెట్లు పట్టించుకోని సరసమైన విలువలతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం వ్యాల్యూ ఫండ్స్ చేసే పని. ఈ విధానమే తక్కువ రాబడులు ఇవ్వడానికి కారణం. ఎందుకంటే ఈ ఫండ్స్ ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టాయి. గత ఏడాదిగా ఈ రంగాలకు చెందిన షేర్లు పెద్దగా పెరగకపోగా, కొన్ని ఇంకా తగ్గాయి. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 31.25 పాయింట్ల లాభంలో 31,302 వద్ద, నిఫ్టీ 7.95 పాయింట్ల లాభంలో 9,671 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ స్టాక్స్ అన్నింటిల్లో టాటా స్టీల్ లో భారీగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో ఈ కంపెనీ స్టాక్ 4 శాతం మైన పైకి ఎగిసింది. టాటా స్టీల్ తో పాటు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ, టాటా మోటార్స్, లుపిన్, అరబిందో ఫార్మా, హిందాల్కో లు లాభాలను పండిస్తున్నాయి. టీసీఎస్, గెయిల్, ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్, టాటా పవర్, భారతీ ఇన్ ఫ్రాటెల్ ఒత్తిడితో కొనసాగుతున్నాయి. రిజర్వు బ్యాంకు బుధవారం ప్రకటించిన పాలసీలో బ్యాంకులకు సానుకూలంగా ఎస్ఎల్ఆర్ రేటును తగ్గించడంతో నేటి ట్రేడింగ్ లో బ్యాంకు నిఫ్టీ సరికొత్త స్థాయిలను తాకుతోంది. బ్యాంకింగ్ తో పాటు, మెటల్ స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు బలహీనపడి, 64.40 వద్ద ప్రారంభమైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు 151 రూపాయల నష్టంతో 29,416 వద్ద ట్రేడవుతోంది. -
నష్టాలను తగ్గించుకున్న టాటా స్టీల్
ముంబై: ప్రముఖ స్టీల్ మేకర్ టాటా స్టీల్ విశ్లేషకుల అంచనాలను బీట్ చేసి క్యూ4 ఫలితాలను ప్రకటించింది. నాలుగవ త్రైమాసికంలో నికర నష్టాలను తగ్గించుకుంది. గత ఏడాది ఇదేక్వార్టర్లో రూ.3042కోట్ల నికర నష్టాలతో పోలిస్తే భారీగా పుంజుకుంది. గత ఏడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.1,168 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. ఆదాయం 30.42 శాతం పెరిగి రూ.35,305 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో రూ.27,071 కోట్లు. అయితే ఆదాయం రూ .31,618.40 కోట్లగా ఉండనుందని 14 మంది విశ్లేషకులు అంచనా వేశారు. ఈ త్రైమాసికంలో కంపెనీకి భారత వ్యాపారంలో రూ .17,113.13 కోట్లు నష్టపోగా ఐరోపా వ్యాపారం నుంచి వచ్చిన ఆదాయం రూ .15,243.52 కోట్లు. ఈ త్రైమాసికంలో స్టీల్ సరఫరా 22శాతం పుంజుకోవడంతో ఆదాయంలో 25శాతం పెరుగుదలకు దారితీసిందని సంస్థ తెలిపింది. టాటాస్టీల్ నికర డెట్ రూ .77518 కోట్లుగా ఉంది. -
100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్
ఈక్విటీ బెంచ్ మార్కు సూచీలు సోమవారం మంచి లాభాలతో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 136.91 పాయింట్ల లాభంలో 30,325 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 9400 మార్కుకు పైన, 31.60 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. ఐసీఐసీఐ బ్యాంకు, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలార్జించగా.. సిప్లా, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్ప్, విప్రో, భారతీ ఎయిర్ టెల్, బీపీసీఎల్, భారతీ ఇన్ ఫ్రాటెల్ నష్టాలు గడించాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 18 పైసలు బలపడి 64.12 వద్ద ప్రారంభమైంది. ప్రస్తుతం 32 పైసలు బలపడి, 64.06గా ఉంది. అంచనాలను తాకలేక అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా నమోదుకావడం, నార్త్ కొరియా మరో క్షిపణి పరీక్ష డాలర్ ఇండెక్స్ ను పడగొడుతున్నాయి. మేజర్ కరెన్సీలకు వ్యతిరేకంగా డాలర్ విలువ పడిపోతుంది. మరోవైపు ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా 4 రూపాయల లాభంతో 28,008గా ట్రేడవుతున్నాయి. -
భారీ నిధుల సమీకరణ దిశగా టాటా స్టీల్
ముంబై: ప్రముఖ దేశీయ స్టీల్ సంస్థ టాటా స్టీల్ భారీ నిధుల సమీకరణపై దృష్టిపెట్టింది. ఫండ్ రైజింగ్ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఈ వారంలో భేటీ నిర్వహించనున్నట్లు టాటా స్టీల్ సోమవారం ప్రకటించింది. ఏప్రిల్ 20 న గురువారం జరుగనున్న కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో నిధుల పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నట్టు సంస్థ బిఎస్ఇకి తెలిపింది. 28 మిలియన్ టన్నుల స్టీల్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అంతర్జాతీయ స్టీల్ కంపెనీల్లో టాప్ కంపెనీల్లో ఒకటిగా టాటా స్టీల్ కొనసాగుతోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో టాటా స్టీల్ వార్షిక టర్నోవర్ 17.69 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో రెండవ అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారుగా ఉన్న టాటాస్టీల్ 26 దేశాలలో కార్యకలాపాలను, 50 పైగా దేశాలలో వాణిజ్యకార్యకలాపాలను నిర్వహిస్తోంది. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : బలహీనంగా ఉన్న అంతర్జాతీయ సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లో స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 63.65 పాయింట్ల నష్టంలో 29,579 వద్ద, నిఫ్టీ 22.40 పాయింట్ల నష్టంలో 9181 వద్ద ట్రేడవుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, సిప్లా, సన్ ఫార్మా, బజాజ్ ఆటో, గెయిల్, ఇండియాబుల్స్ హౌసింగ్, అరబిందో ఫార్మా టాప్ గెయినర్లుగా లాభాలు పండిస్తుండగా.. అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టోబ్రో, టాటా మోటార్స్, హిందాల్కో నష్టాలు గడిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో ఇన్ఫోసిస్ ఫలితాలు ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 2.35 శాతం నష్టాల్లో 947.90 వద్ద కంపెనీ షేర్లు నడుస్తున్నాయి. నేడు ప్రకటించిన నాలుగో త్రైమాసికంలో ఇన్ఫీ లాభాలు 3 శాతం పడిపోయి రూ.3603 కోట్లగా నమోదయ్యాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 24 పైసల లాభంతో 64.44 వద్ద ప్రారంభమైంది. -
నీతివంతమైన కంపెనీల్లో టాటాస్టీల్, విప్రో
అమెరికా సంస్థ జాబితాలో చోటు న్యూఢిల్లీ: ప్రపంచంలో నైతికంగా నడుచుకునే అత్యుత్తమ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలకు చోటు లభించింది. అవి ఉక్కు కంపెనీ టాటా స్టీల్, ఐటీ కంపెనీ విప్రో. అమెరికాకు చెందిన ఎతిస్పియర్ సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలకు చెందిన 124 కంపెనీలకు ఈ జాబితాలో చోటు దక్కింది. ఈ కంపెనీలు సమాజంపై ప్రభావం చూపడంతోపాటు వ్యాపార వర్గాల్లో, సమాజంలో సానుకూల మార్పులకు దోహదపడినవిగా ఎతిస్పియర్ గుర్తించింది. కంపెనీలు తమ ఉద్యోగులు, వాటాదారులు, కస్టమర్లు, ఇతర బాగస్వాములపై తమ చర్యల ద్వారా చూపించిన ప్రభావం, పరపతి విలువలు, నైతిక సంస్కృతిని పరిగణనలోకి తీసుకున్నట్టు ఎతిస్పియర్ వెల్లడించింది. ఈ జాబితాలోని 124 కంపెనీల్లో 98 అమెరికాకు చెందినవే కావడం గమనార్హం. వీటిలో 13 కంపెనీలు వరుసగా 13వ సారి ఈ జాబితాకెక్కగా, 8 కంపెనీలకు తొలిసారి చోటు దక్కింది. -
టాటా’ స్పెషాలిటీ స్టీల్స్ లిబర్టీ హౌస్‌కు
100 మిలియన్ పౌండ్ల విక్రయానికి ఒప్పందం న్యూఢిల్లీ: టాటా స్టీల్ యూకే తనకు చెందిన స్పెషాలిటీ స్టీల్స్‌ను లిబర్టీ హౌస్ గ్రూపునకు 100 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.840 కోట్లు)కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టాటా స్టీల్ స్పెషాలిటీ స్టీల్ విభాగంలో 1,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమోటివ్, ఆయిల్, గ్యాస్, ఏరోస్పేస్ రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను ఇది అందిస్తోంది. విక్రయ ఒప్పందంలో భాగంగా టాటా స్టీల్ యూకేకు చెందిన సౌత్ యార్క్‌షైర్‌లోని ఆస్తులు, రోతర్హామ్లోని బార్ మిల్, ఎలక్ట్రిక్ ఆర్క్స్టీల్, స్టాక్స్బ్రిడ్జ్లోని స్టీల్ శుద్ధి కేంద్రం, బ్రిన్స్వర్త్లోని మిల్లు, బోల్టన్, వెన్స్బరీ, బ్రిటన్, చైనాలోని సుజూ, గ్జియాన్‌లో ఉన్న సేవా కేంద్రాలు లిబర్టీ హౌస్ గ్రూపు సొంతం అవుతాయి. నియంత్రణపరమైన అనుమతులకు లోబడి లావాదేవీ పూర్తి కావడం ఆధారపడి ఉంటుందని టాటా స్టీల్ తెలిపింది. ఇది టాటా స్టీల్‌కు, స్పెషాలిటీ స్టీల్స్‌కు సైతం సానుకూలమైన చర్యగా టాటా స్టీల్ యూకే విభాగం సీఈవో బిమ్లేంద్రజా అభివర్ణించారు. స్పెషాలిటీ స్టీల్స్ పనితీరును మెరుగుపరిచేందుకు కార్మిక సంఘాలు, ఉద్యోగులు, యాజమాన్యం ఎంతో కష్టించి పనిచేశాయని, ప్రస్తుతం ఈ వ్యాపారం మెరుగైన స్థితిలోకి వచ్చిందన్నారు. పలు ప్రతిపాదనలపై చర్చ నిర్మాణాత్మక సమస్యలను తగ్గించుకుని, యూకే వ్యాపారానికి మరింత సుస్థిరమైన భవిష్యత్‌ను తీసుకొచ్చేందుకు పలు ప్రతిపాదనలపై ఉద్యోగులతో చర్చిస్తున్నట్టు టాటా స్టీల్ యూకే తెలిపింది. మరోవైపు యూకే వ్యాపారానికి, స్థిరమైన భవిష్యత్తు కోసం తీసుకునే చర్యలకు తమ మద్దతు కొనసాగుతుందని టాటా స్టీల్ సైతం వెల్లడించింది. 2007లో కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత యూకేలో స్టీల్ వ్యాపారంపై 1.5 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.12,600 కోట్లు)ను పెట్టుబడులుగా పెట్టినట్టు వెల్లడించింది. -
లాభాల బాటలో టాటా స్టీల్...
ఈ క్యూ3లో రూ.231కోట్ల లాభం న్యూఢిల్లీ: టాటా స్టీల్ మళ్లీ లాభాల బాట పట్టింది. అమ్మకాలు మెరుగుపడడం, ఉక్కు ఉత్పత్తుల ధరలు అధికంగా ఉండడం, తదితర కారణాలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.231 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జిం చింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.2,748 కోట్ల నికర నష్టాలు వచ్చాయని టాటా స్టీల్ తెలిపింది. స్థూల అమ్మకాలు రూ.25,662 కోట్ల నుంచి రూ.29,279 కోట్లకు పెరిగాయని టాటా స్టీల్ ఎండీ(ఇండియా, సౌత్ ఈస్ట్ ఏషియా) టి. వి. నరేంద్రన్ చెప్పారు. వివిధ విభాగాల దన్నుతో, పెద్ద కరెన్సీ నోట్ల రద్దు వంటి సమస్యలున్నప్పటికీ పటిష్టమైన అమ్మకాలను సాధించామని చెప్పారు. అయితే గ్రామీణ మార్కెట్లో అమ్మకాలు తక్కువగా ఉండడం, వినియోగదారుల సెంటిమెంట్ ప్రతికూలంగా ఉండడం కొంత ప్రభావం చూపాయని అంగీకరించారు. వ్యయ నియంత్రణ పద్ధతులు, సమగ్రంగా కార్యకలాపాలు నిర్వహించడం వంటి కారణాల వల్ల ముడి పదార్ధాల ధరలు పెరిగిన ప్రభావాన్ని తట్టుకున్నామని నరేంద్రన్ వివరించారు. కళింగనగర్ ప్లాంట్ పునర్వ్యస్థీకరణ పనులు సజావుగానే జరుగుతున్నాయని చెప్పారు. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి స్థూల రుణ భారం రూ.84,752 కోట్లుగా, నికర రుణ భారం రూ.76,680 కోట్లుగా ఉందని తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.15,000 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. టాటా స్టీల్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్ర శేఖరన్ టాటా స్టీల్ బోర్డ్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన టీసీఎస్ సీఈఓగా, ఎండీగాగా ఉన్నారు. చైర్మన్‌గా ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నానని. వినమ్రంగా ఆ బాధ్యతను స్వీకరిస్తున్నానని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. మిస్త్రీ తొలగింపు తర్వాత గత నెల 13న చంద్రశేఖరన్ టాటా స్టీల్ డైరెక్టర్‌గా వచ్చారు. -
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై : గ్లోబల్‌గా మిక్స్డ్ సంకేతాలు వస్తుండటంతో ఈక్విటీ బెంచ్మార్కులు బుధవారం ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 21.98 పాయింట్ల లాభంతో 27257.64 వద్ద , నిఫ్టీ 19 పాయింట్ల లాభంలో 8417 వద్ద క్లోజ్ అయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల గరిష్టంలో నమోదైన ఆసియన్ స్టాక్ మార్కెట్లు నిలకడగా ట్రేడ్ అయ్యాయి. దీంతో దేశీయ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, మహింద్రా అండ్ మహింద్రా లాభాల్లో కొనసాగగా.. ఎన్టీపీసీ, గెయిల్, హీరో మోటోకార్పొ, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ నష్టాలు గడించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.5 శాతం, స్మాల్ క్యాప్ సూచీ 0.6 శాతం పెరిగాయి. రెండు నెలల కాలంలో బుధవారం ఇంట్రాడేలో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 0.5 శాతం పైకి ఎగిసింది. ఎస్ బ్యాంకు, కెనరా బ్యాంకు మంచి లాభాలను పండించాయి. సెన్సెక్స్‌లో మెటల్ టాప్ సెక్టోరల్ గెయినర్‌గా నిలిచింది. నాల్కో, హిందాల్కో, వెదంతా, జేఎస్పీఎల్, టాటా స్టీల్ లాభాలతో మెటల్ షేర్లు 2 శాతం పెరిగాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.09 పైసలు పడిపోయి, 68.05గా ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 18 రూపాయలు పడిపోయి 28,720గా నమోదైంది. -
ట్రంప్ ప్రెస్ మీట్: జోష్‌లో మార్కెట్లు
ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేపథ్యంలో ఆసియన్ షేర్లు రెండు నెలల గరిష్టంలోకి ఎగబాకడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లూ మస్త్ జోష్‌తో ఎంట్రీ ఇచ్చాయి. నిఫ్టీ 8300 మార్కును అధిగమించేసింది. సెన్సెక్స్ 150 పాయింట్లు ఎగబాకింది. ప్రస్తుతం సెన్సెక్స్ 170.05 పాయింట్ల లాభంలో 27,069 వద్ద, నిఫ్టీ 55.50 పాయింట్ల లాభంలో 8,344గా వద్ద ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన ట్రంప్ నేడు తొలి మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో పన్ను విధానాలు, ఆర్థిక వ్యయం, అంతర్జాతీయ వాణిజ్యం, కరెన్సీల గురించి ఆయన పలు సంకేతాలు ఇవ్వనున్నారని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. ఈ మేరకు మార్కెట్లు సైతం జోష్‌గా కదలాడుతున్నాయి. టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులు సెన్సెక్స్‌లో లాభాలు పండిస్తున్నాయి. అయితే డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసల నష్టంతో 68.23వద్ద ప్రారంభమైంది. అటు బంగారం కూడా 99 రూపాయల లాభంలో 28,150గా ట్రేడ్ అవుతోంది. -
వచ్చే త్రైమాసికానికి సాధారణ స్థితి: టాటా స్టీల్
నవంబర్ కంటే డిసెంబర్లో పరిస్థితులు మెరుగు జంషెడ్పూర్: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన ప్రతికూలతల నుంచి వచ్చే త్రైమాసికం నాటికి సాధారణ స్థితికి చేరుకుంటామని టాటా స్టీల్ ఆశాభావం వ్యక్తం చేసింది. నవంబర్ 8న కేంద్రం డీమానిటైజేషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో విక్రయాలు మెరుగ్గా ఉన్నాయని టాటా స్టీల్ ఎండీ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. గత రెండేళ్ల కాలంలో దేశీయంగా స్టీల్ రంగం క్లిష్ట పరిస్థితులను చవి చూసిందన్నారు. చైనా సహా, ఇతర దేశాల నుంచి దేశంలోకి భారీ ఎత్తున స్టీల్ దిగుమతి అవుతున్న తరుణంలో కేంద్రం జోక్యం చేసుకుని దేశీయ స్టీల్ పరిశ్రమకు మద్దతుగా నిలిచిందని పేర్కొన్నారు. గత పదేళ్ల కాలంలో ఈ రంగంలో రూ.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం జరిగిందని... దేశ అభివృద్ధిలో ఈ రంగం కీలక పాత్ర పోషించిందన్నారు. దేశీయ స్టీల్ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని నరేంద్రన్ అభినందించారు. 2016 ప్రారంభం నుంచి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయని వివరించారు. అయితే, గత మూడు, నాలుగు నెలల కాలంగా స్టీల్ ముడి సరుకైన ఐరన్ ఓర్, బొగ్గు ధరలు పెరిగిపోవడంతో ఒత్తిడి నెలకొందని, ఇక డీమానిటైజేషన్ రావడం తమ కంపెనీ పనితీరును దెబ్బతీసినట్టు చెప్పారు. -
టాటా స్టీల్‌కు డీమోనిటైజేషన్ సెగ
జంషెడ్పూర్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం తమ వ్యాపార కార్యకలాపాలపై గణనీయంగానే ఉందని టాటా స్టీల్ వెల్లడించింది. అయితే, ఇది తాత్కాలికమే కాగలదని.. పరిస్థితులు త్వరలోనే మెరుగుపడగలవని సంస్థ ఎండీ (భారత్, ఆగ్నేయాసియా) టీవీ నరేంద్రన్ తెలిపారు. డీమోనిటైజేషన్ ప్రభావాలు ఎలా ఉన్నప్పటికీ.. జంషెడ్పూర్, కళింగనగర్లలోని తమ ప్లాంట్లలో ఉత్పత్తి యథాప్రకారమే కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. నగదు ఆధారిత గ్రామీణ మార్కెట్లలో డీమోనిటైజేషన్ సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం తలపెట్టిన నగదు రహిత లావాదేవీల ప్రతిపాదనకు తోడ్పాటునిచ్చేలా గ్రామీణ ప్రాంతాల్లో 10,000 పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్), క్రెడిట్, డెబిట్ కార్డు స్వైపింగ్ మెషీన్లను ఇన్స్టాల్ చేస్తున్నట్లు నరేంద్రన్ వివరించారు. -
పెల్లెట్ కంపెనీ బీఆర్‌పీఎల్ టాటాస్టీల్ చేతికి...
రూ.900 కోట్లకు ఒప్పందం న్యూఢిల్లీ: ఒడిశా కేంద్రంగా పనిచేసే ఐరన్‌ఓర్ పెల్లెట్ తయారీ కంపెనీ బీఆర్‌పీఎల్‌ను రూ.900 కోట్లతో కొనుగోలు చేస్తున్నట్టు టాటా స్టీల్ ప్రకటించింది. మెటాలిక్ అవసరాలు తీర్చుకునేందుకు, కళింగ్‌నగర్ స్టీల్ ప్లాంట్, జంషెడ్పూర్ స్టీల్ ప్లాంట్లకు ముడి పదార్థాల అవసరాలను తీర్చేందుకు ఈ కొనుగోలు వీలు కల్పిస్తుందని టాటా స్టీల్ తెలిపింది. నాలుగు నెలల్లో డీల్ పూర్తయ్యే అవకాశం ఉంది. బీఆర్పీఎల్లో 100 శాతం ఈక్విటీ కొనుగోలును ఆర్యా మైనింగ్ అండ్ ట్రేడింగ్ కార్ప్ (ఏఎంటీసీ), ఇతర కంపెనీల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేసే ఒప్పందాలను కదుర్చుకున్నట్టు తెలిపింది. బ్రాహ్మణి రివర్ పెల్లెట్స్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్)కు ఒడిశాలోని బార్డిల్లో 4.7 మిలియన్ టన్నుల ఐరన్‌ఓర్ బెనిఫికేషన్ ప్లాంట్‌తోపాటు జైపూర్‌లో వార్షికంగా 4 మిలియన్ టన్నుల పెల్లెట్ తయారీ సామర్థ్యంగల ప్లాంట్ ఉంది. ఐరన్, స్టీల్ పరిశ్రమలకు అవసరమైన పెల్లెట్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. -
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
-
నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై
టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా తప్పించిన సైరస్ మిస్త్రీకి మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త నస్లీ వాడియాకు టాటా స్టీల్ గుడ్ బై చెప్పింది. బుధవారం జరిగిన అసాధారణ సర్వసభ్య సమావేశంలో స్వతంత్ర డైరెక్టర్‌గా ఆయనకు ఉద్వాసన పలుకుతున్నట్టు టాటా స్టీల్ వెల్లడించింది. నస్లీ వాడియాకు వ్యతిరేకంగా 90 శాతం ఓటింగ్ నమోదైనట్టు తెలిసింది. చాలామంది షేర్ హోల్డర్స్ వాడియాను తొలగించడానికే మొగ్గుచూపినట్టు బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ రెగ్యులేటరీకి టాటా స్టీల్ పేర్కొంది. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఓటింగ్‌లో నస్లీ వాడియా పాల్గొన్నలేదు. 37 ఏళ్లుగా నస్లీ వాడియా టాటా స్టీల్ స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్నారు. చైర్మన్‌గా గ్రూప్ కంపెనీల నుంచి బయటికి గెంటివేయబడ్డ సైరస్ మిస్త్రీకి నస్లీ వాడియా మద్దతుగా నిలవడంతో పాటు టాటా గ్రూప్‌పై పలు విమర్శలు సంధించారు. దీంతో ఆగ్రహించిన టాటా సన్స్ , గ్రూపు కంపెనీల నుంచి స్వతంత్ర డైరెక్టర్ నస్లీ వాడియాను సాగనంపే ప్రక్రియను ప్రారంభించింది. స్వతంత్ర డైరెక్టర్ అయిన తనను ఈ సమావేశాల ద్వారా తొలగించే సత్తా టాటా సన్స్‌కు ఉందా? అంటూ ప్రశ్నలను సైతం ఆయన సంధించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జరిగిన ఈజీఎంలో టాటా స్టీల్ నస్లి వాడియాను కంపెనీ స్వతంత్ర డైరెక్టర్‌గా తప్పిస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. టాటా మోటార్స్, టాటా కెమెకిల్స్ కూడా ఈ వారంలో వాడియాను డైరెక్టర్‌గా తొలగించేందుకు ఈజీఎంలు నిర్వహించనున్నాయి. అయితే కంపెనీల స్వతంత్ర డైరెక్టర్‌గా తనను తొలగిస్తుండటం వివరణ కోరిన అనంతరం రతన్ టాటా, టాటా సన్స్, కొంతమంది డైరెక్టర్లపై నుస్లీ వాడియా రూ.3000 కోట్ల పరువు నష్టం దావా కూడా వేశారు. దీంతో ఇక ఆయన టాటా గ్రూప్ సంస్థల్లో ఉండటం ఏ మాత్రం మంచిది కాదని టాటా సన్స్ నిర్ణయించింది. తొలగింపుపై నస్లి వాడియా స్పందన: తనకు అప్పగించిన పనుల్లో స్వతంత్ర అభిప్రాయాలు తీసుకుని పనిచేస్తున్నందునే తనపై వేటు వేశారని నుస్లి వాడియా ఆరోపించారు. తన తొలగింపుపై టాటా సన్స్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవిగా ఉన్నాయని వాడియా పేర్కొన్నారు. నానో మూతను జాప్యం చేయడం కంపెనీని మరింత ఆర్థిక నష్టాల్లోకి నెడుతున్నారని ఆరోపించారు. ఇది కంపెనీ పీవీబీపై మరింత నెగిటివ్ ప్రభావాన్ని చూపుతుందన్నారు. -
లాభనష్టాల ఊగిసలాటలో మార్కెట్లు
ముంబై: అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. కానీ వెంటనే లాభాలను తగ్గించుకొని ఫ్లాట్ గా మారిపోయినా మళ్లీ పుంజుకున్నాయి. సెంచరీ లాభాలతో మొదలైన సెన్సెక్స్ ప్రస్తుతం 58 పాయింట్ల లాభంతో 26408వద్ద నిప్టీ 4 పాయింట్ల లాభంతో 8131 వద్ద ట్రేడ్ అవుతూ లాభ నష్టాల ఊగిసలాడుతున్నాయి. నిఫ్టీ 81 వందలకు పైన స్థిరంగా ఉంది. మెటల్ మిడ్ క్యాప్ షేర్లు స్వల్ప లాభాలతో్ ఉన్నాయి. కోల్ ఇండియా, ఐషర్ మోటార్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. కాగా సోమవారం నాటిమార్కెట్ లో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాల విలువ రూ.1436 కోట్లుగా నమోదైంది. మరోవైపు నిన్న మార్కెట్ ముగిసినతరువాత టాటా స్టీల్ చేసిన ఒప్పంద ప్రకటన నేపథ్యంలో మదుపర్లు ఈ షేర్ పై దృష్టి పెట్టే అవకాశం ఉంది. -
గతవారం బిజినెస్
టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఔట్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్చేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక చైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం వరకూ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. మూడోసారి వేలానికి ’కింగ్‌ఫిషర్’ భవనం కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు భారీగా అప్పులిచ్చి పీకల్లోతు ఇరుక్కుపోరుున 17 బ్యాంకుల కన్సార్టియమ్, ఆ సంస్థకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయ భవనాన్ని మూడోసారి వేలానికి పెడుతోంది. ఈ సారి రిజర్వ్ ధరను 15% తగ్గించి రూ.115 కోట్లుగా నిర్ణరుుంచారు.ముంబైలోని విమానాశ్రయం సమీపంలో ప్లష్ విలేపార్లేలో ఇది ఉంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం వేలం వచ్చే నెల 19న జరగనుంది. రికార్డు కనిష్టానికి రూపారుు డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రా డేలో డాలర్‌తో పోలిస్తే రూపారుు మారకం విలువ 68.86 స్థారుుకి పడిపోరుుంది. ఇప్పటిదాకా 2013 ఆగస్టు 28 ఇంట్రాడేలో నమోదైన 68.85 స్థాయే ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. ఆ రోజున దేశీ కరెన్సీ 68.80 వద్ద ముగిసింది. ఇటు పెద్ద నోట్ల రద్దు, అటు సమీప భవిష్యత్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తదితర పరిణామాలు రూపారుు పతనానికి దారి తీస్తున్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. భారత్‌లో సంపద అసమానత్వం అధికం భారత్‌లో సంపద విషయమై అసమానత్వం అధికంగా ఉందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్-2016 తెలిపింది. మొత్తం జనాభాలో ఒక్క శాతం మంది దగ్గరే మొత్తం సంపదలో 60 శాతం ఉందని క్రెడిట్ సూచీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో సంపన్న పేదరికం ఉందని వివరించింది. జనాభాలో 96 శాతం మందికి పైగా పదివేల డాలర్లు (రూ.6,80,000)లోపు సంపద ఉన్నవారేనని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో సంపద విషయంలో అసమానత్వం అధికంగా ఉన్న రెండో దేశం భారత్ అని వివరించింది. భారత్‌లో సంపద పెరుగుతున్నా, ఈ వృద్ధిలో అందరికి భాగస్వామ్యం ఉండడం లేదని పేర్కొంది. జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2%! దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు. మొబైల్ తయారీ యూనిట్లు గత రెండేళ్లలో 38,300 ఉద్యోగాలను అందించినట్టు పేర్కొంది. 2014 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్య కాలంలో టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ఎస్బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు 1.9% తగ్గింపు బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను 6 శాతం నుంచి 4.25 శాతానికి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు షురూ! టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్‌టెల్ అవుట్లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్‌టెల్ అవుట్లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్‌డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది. ⇔ 2,071 మంది.. 3.89 లక్షల కోట్లు బకారుులు దేశంలో 2,071 మంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ.3,88,919 కోట్ల రుణాలు వసూలు కాని మొండి బకారుులు (ఎన్పీఏ)గా మారినట్టు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు మంగళవారం వెల్లడించారు. ఈ పారిశ్రామిక పెద్దలు ఒక్కొక్కరు రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నవారేనని తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.50 కోట్లకు మించిన ఎన్పీఏ ఖాతాలు 2,071గా ఉన్నాయని పేర్కొన్నారు. డీల్స్.. ⇔ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ⇔ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్టైన్మెంట్ టీవీ చానళ్లలో 100% వాటాతో పాటు రిలయన్స రెడియో వ్యాపారంలో 49% వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,900 కోట్లు. ⇔ దేశీ ఫార్మా అగ్రగామి సన్ ఫార్మా.. రష్మా కంపెనీ జేఎస్సీ బయోసింటెజ్‌ను కొనుగోలు చేసింది. బయోసింటెజ్‌లో 85.1% వాటాను చేజిక్కించుకుంటున్నామని.. ఇందుకోసం 2.4 కోట్ల డాలర్లను చెల్లిస్తున్నట్లు సన్ ఫార్మా తెలిపింది. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన 3.6 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిప్రకారం చూస్తే... మొత్తం డీల్ విలువ 6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.400 కోట్లు)గా లెక్కతేలుతోంది. -
టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ తొలగింపు
న్యూఢిల్లీ: చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక ఛైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం (ఈజీఎం) వరకూ ఈ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. కంపెనీ డెరైక్టర్ల పదవుల నుంచి సైరస్ మిస్త్రీని, నుస్లీ వాడియాని తొలగించేందుకు ఉద్దేశించిన ఈజీఎం డిసెంబర్ 21న జరుగుతుంది. టాటా స్టీల్‌లో ప్రధాన ప్రమోటరైన టాటా సన్సకు 29.75 శాతం వాటా వుంది. -
టాటా స్టీల్ నుంచీ మిస్త్రీ ఔట్!
టాటా పవర్, టాటా కెమెకిల్స్ అనంతరం టాటా స్టీల్ కూడా టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై వేటు వేసింది. శుక్రవారం ఏర్పాటుచేసిన అత్యవసర బోర్డు సమావేశంలో టాటా స్టీల్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని తొలగిస్తున్నట్టు వెల్లడించింది. స్వతంత్ర డైరెక్టర్‌గా ఉన్న ఓపీ భట్‌ను డిసెంబర్ 21 వరకు తాత్కాలిక చైర్మన్‌గా వ్యవహరించనున్నట్టు టాటా స్టీల్ బోర్డు పేర్కొంది. చైర్మన్ పదవితో కంపెనీ బోర్డు డైరెక్టర్‌గా కూడా ఆయనకు ఉద్వాసన పలుకనున్నట్టు బోర్డు ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆయనతో పాటు మిస్త్రీకి వంత పాడుతున్న నుస్లీ ఎన్ వాడియాను కూడా కంపెనీ బోర్డు డైరెక్టర్లుగా తొలగించేందుకు బోర్డు నిర్ణయించింది. దీనికోసం డిసెంబర్ 21న అసాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్టు బోర్డు పేర్కొంది. ఈ సమావేశంలోనే బోర్డు చైర్మన్‌ను నియమించనున్నారు. మెజారిటీ బోర్డు మెంబర్లు మిస్త్రీని చైర్మన్‌గా తొలగించేందుకు మొగ్గుచూపినట్టు టాటాస్టీల్ పేర్కొంది. అయితే టాటా గ్రూప్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న మిస్త్రీని గ్రూప్‌లోని మిగతా కంపెనీల చైర్మన్‌గా కూడా తొలగించాలని నిర్ణయించిన టాటా సన్స్, ఈ మేరకు కంపెనీలు బోర్డు సమావేశాల్లో ఆయనపై వేటు వేయాలని ఆదేశిస్తూ ఓ నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు టాటా పవర్, టాటా కెమెకిల్స్ ఇప్పటికే మిస్త్రీని చైర్మన్‌గా తొలగించాయి. -
చిన్న స్టీల్ కంపెనీలపై ప్రభావం: టాటా స్టీల్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో స్టీల్ డిమాండ్‌పై తాత్కాలిక ప్రభావం చూపుతుందని టాటా స్టీల్ తెలిపింది. అలాగే, ద్వితీయ శ్రేణి స్టీల్ కంపెనీలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొంది. చిన్న మిల్లులు, రోలింగ్ పరిశ్రమలు చేసే వ్యాపారంలో అధిక భాగం నగదు ఆధారితమేనని పేర్కొంది. 60-70 శాతం పొడవైన స్టీల్ ఉత్పత్తుల (లాంగ్ ప్రొడక్ట్స్) వ్యాపార నిర్వహణ ఈ కంపెనీల ఆధ్వర్యంలోనే ఉన్నట్టు పేర్కొంది. కనుక నోట్ల రద్దు నిర్ణయం ఇంటిగ్రేటెడ్, పెద్ద స్థారుు కంపెనీల లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారంపై సానుకూల ప్రభావం చూపుతుందని టాటా స్టీల్ ఇండియా (దక్షిణాసియా విభాగం) ఎండీ టీవీ నరేంద్రన్ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయం సంఘటిత రంగం వైపు వ్యాపారం మళ్లేలా చేస్తుందన్నారు. పెద్ద కంపెనీలు గత కొన్నేళ్లలో లాంగ్ ప్రొడక్ట్స్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించాయని, వీటికి సానుకూలమని పేర్కొన్నారు. అధికంగా నగదు లావాదేవీలపై ఆధారపడిన గ్రామీణ డిమాండ్‌పై తాత్కాలిక ప్రభావం ఉంటుందని, అరుుతే ఇది దీర్ఘకాలం పాటు కొనసాగే పెద్ద అంశమని భావించడం లేదని, డిమాండ్ వేగంగా పుంజుకుంటుందని నరేంద్రన్ చెప్పారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై నోట్ల రద్దు ప్రభావం ఏ మేర ఉంటుందన్నదాన్ని ఆసక్తిగా గమనిస్తున్నట్టు తెలిపారు. -
ఈజీఎంను ఏర్పాటు చేయండి...
టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్‌కి టాటా సన్స్ ఆదేశం న్యూఢిల్లీ: టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ కంపెనీల బోర్డుల నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడానికి టాటా సన్స సిద్ధమౌతోంది. ఆయా కంపెనీల బోర్డుల నుంచి మిస్త్రీ, నుస్లి వాడియాలను తొలగించడానికి ఎక్స్ట్రా-ఆర్డినరీ జనరల్ మీటింగ్ (ఈజీఎం) ఏర్పాటు చేయాలని ఆయా కంపెనీలకు టాటా సన్స తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయాన్ని ఆయా కంపెనీలు వేర్వేరుగా శుక్రవారం బీఎస్ఈకి నివేదించారుు. టాటా మోటార్స్, టాటా కెమికల్స్, టాటా స్టీల్ కంపెనీలకు టాటా సన్స హోల్డింగ్ కంపెనీ. టాటా సన్సకి టాటా మోటార్స్‌లో 26.51 శాతం, టాటా కెమికల్స్‌లో 19.35 శాతం, టాటా స్టీల్‌లో 29.75 శాతం వాటాలు ఉన్నారుు. ఇండియన్ హోటల్స్ తర్వాత టాటా కెమికల్స్ స్వతంత్ర డెరైక్టర్లు మిస్త్రీకి బాసగటా నిలుస్తున్నారు. వాడియా కూడా ఇందులో ఉన్నారు. -
మార్కెట్లకు టాటా గ్రూప్ దెబ్బ
ఓ వైపు టాటా గ్రూప్ దెబ్బ.. మరోవైపు ఎఫ్ఎమ్సీజీ, ఐటీ స్టాక్స్‌ల ఒత్తిడి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 87.66 పాయింట్ల నష్టంతో 28,091.42 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 8700 దిగువన 8691.30 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పేయింట్స్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు టాటా గెయినర్లుగా లాభాలు పండించగా, మహింద్రా అండ్ మహింద్రా, టాటా స్టీల్, గెయిల్, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీలు నష్టాలను గడించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తప్పిస్తూ టాటా సన్స్ ఊహించని నిర్ణయం తీసుకోవడం, టాటా గ్రూప్ స్టాక్స్‌పై, స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. టాటా గ్రూప్ అన్ని కంపెనీల్లో టాటా స్టీల్ ఎక్కువగా నష్టాలను చవిచూసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీలో ఈ కంపెనీ షేర్లు దాదాపు 3 శాతం కిందకి దిగజారాయి. ఇతర కంపెనీలు టాటా పవర్, టాటా కన్సల్టెన్సీ సర్వీసు, టాటా మోటార్స్ 1-2శాతం నష్టాల్లో ముగిశాయి. ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో పెట్టుబడిదారులు టాటా స్టాక్స్‌లో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారని, దీర్ఘకాలికంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ఆసియన్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా ముగిశాయి. మూడో క్వార్టర్లో దక్షిణ కొరియా ఆర్థిక వృద్ధి నెమ్మదించిందని డేటా వెలువడగానే, ఆ దేశ షేర్ మార్కెట్లు పడిపోయాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.84గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.63 లాభంతో 29,826గా నమోదైంది. -
టాటా స్టీల్ ఉద్యోగులకు శుభవార్త!
జంషెడ్ పూర్: ప్రయివేట్ స్టీల్ మేజర్ టాటా స్టీల్ కంపెనీ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బోనస్ చెల్లించడానికి నిర్ణయించింది. అర్హులైన ఉద్యోగులందరికీ బోనస్ గా రూ.130 కోట్లు చెల్లించడానికి అంగీకరించింది. ఈ మేరకు కంపెనీ, టాటా వర్కర్స్ యూనియన్ మధ్య ఒక అంగీకారం కుదిరింది. దీనికి సంబంధించిన మెమోరాండంపై ఇరువర్గాలు సోమవారం సంతకం చేసినట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో జంషెడ్ పూర్ లోని ట్యూబ్స్ డివిజన్ కు చెందిన 15,575 ఉద్యోగులకు రూ 75.77 కోట్లు పంపిణీ చేయబడుతుందనీ, అలాగే కనీసంగా రూ.16,800లు, గరిష్టంగా రూ.12,1365 లను ఆయా ఉద్యోగులకు చెల్లించనున్నట్టు వెల్లడించింది. 1965 బోనస్ యాక్ట్ ప్రకారం పరిమితికి మించి అధిక వేతనాలు తీసుకుంటున్నప్పటికీ అందరికీ బోనస్ చెల్లిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఒప్పంద పత్రంపై టీవీ నరేంద్రన్, టాటా స్టీల్ మేనేజింగ్ డైరెక్టర్, (భారతదేశం, దక్షిణ తూర్పుఆసియా), ఆనంద్ సేన్ అధ్యక్షుడు, త్రిపాఠ్ వైస్ ప్రెసిడెంట్ ఇతర సీనియర్ అధికారులు, వర్కర్స్ యూనియన్ తరపున,బీకే దిండా,రవి ప్రసాద్, సంజీవ్ కె చౌదరి తదితరులు సంతకాలు చేశారు. -
5,500 మంది మహిళలకు టాటా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : మహిళల పట్ల ఎల్లప్పుడూ ఉదారత భావం కలిగి ఉండే టాటా స్టీల్, మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే అతిపెద్ద స్టీల్ తయారీసంస్థగా పేరుగాంచిన ఈ సంస్థ, 2020 వరకు 5,500 ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీలో 2,000 మంది మహిళా ఉద్యోగులున్నారు. అంటే 35వేల మంది మొత్తం ఉద్యోగులుల్లో వీరు 6 శాతం కంటే తక్కువ. మహిళా ఉద్యోగులను మరింత పెంచడానికి కంపెనీ 5,500 మందిని రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. ఈ నిర్ణయం కంపెనీలో లింగ వైవిధ్యాన్ని మెరుగుపరుస్తుందని టాటా సంస్థ భావిస్తోంది. అదేవిధంగా అంగవికలాంగులను ఉద్యోగులుగా మరింత మందిని చేర్చుకోవడానికి కంపెనీ కృషిచేస్తోంది. ప్రతేడాది 100 మంది అంగవికలాంగులను ఉద్యోగులుగా చేర్చుకోవాలని టాటా స్టీల్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం 106 మంది అంగవికలాంగులు టాటాస్టీల్‌లో ఉద్యోగులుగా ఉన్నారు. కంపెనీ రిక్రూట్ చేసుకునే 5,500 మంది మహిళా ఉద్యోగుల్లో 1,400 మందిని మేనేజర్ స్థానాల్లో నియమించుకోనుంది. ప్రస్తుతం 660 మంది మహిళలు టాటా స్టీల్ కంపెనీలో మేనేజర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజా మహిళా ఉద్యోగుల నియామకం ఎక్కువగా పురుషులు ఉద్యోగులుగా వ్యవహరిస్తున్న స్థానాల్లోనే భర్తిచేయనున్నట్టు టాటాస్టీల్ చీఫ్ డైవర్సిటీ ఆఫీసర్ ఆత్రేయి సర్కార్ తెలిపారు. కొన్ని ఉద్యోగాలను మహిళల కోసం ప్రత్యేకంగా సృష్టించనున్నట్టు తెలిపారు. -
టాటా స్టీల్ నష్టం రూ.3,183 కోట్లు
ఆదాయం 6 శాతం తగ్గుదల న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నష్టాలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన(యూరప్ ఇతరత్రా కార్యకలాపాలు కలిపి) రూ.3,183 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం రూ.316 కోట్లతో పోలిస్తే దాదాపు 10 రెట్లు పెరిగింది. కాగా, క్యూ1లో కంపెనీ మొత్తం ఆదాయం 6 శాతం దిగజారి రూ.26,406 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఆదాయం రూ.28,025 కోట్లు. ప్రధానంగా లాంగ్స్టీల్ యూకే లిమిటెడ్‌ను రూ.3,296 కోట్ల నష్టానికి గ్రేబుల్ క్యాపిటల్ ఎల్ఎల్పీకి విక్రయించడం, దీన్ని తొలి త్రైమాసికంలో నమోదుచేయడం కారణంగా భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. దీన్ని మినహాయించి ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకుంటే టాటా స్టీల్ గ్రూప్ ఈ ఏడాది క్యూ1లో రూ.172 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని, చాలా త్రైమాసికాల తర్వాత తొలిసారి మెరుగైన పనితీరును సాధించినట్లు కంపెనీ వెల్లడించింది. కాగా, భారత్, ఆగ్నేయాసియా యూరప్ కార్యకలాపాల పనితీరు మెరుగుపడటంతో నిర్వహణ లాభం క్యూ1లో 21 శాతం పెరిగింది. మరోపక్క, కంపెనీ మొత్తం వ్యయాలు రూ.26,680 కోట్ల నుంచి రూ.24,406 కోట్లకు దిగిరావడం గమనార్హం. ఎగబాకిన రుణ భారం: టాటా స్టీల్ స్థూల రుణ భారం క్యూ1లో రూ.85,475 కోట్లకు ఎగబాకింది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో ఇది రూ.81,975 కోట్లు. ఇక నికర రుణ భారం రూ.4,171 కోట్లు పెరిగి రూ.75,259 కోట్లకు చేరింది. భారత్‌లో కొత్తగా చేపట్టిన రుణ సమీకరణ(బాండ్ల జారీ రూపంలో), అంతర్జాతీయంగా కొనుగోళ్లు(ప్రొక్యూర్మెంట్) వంటివి రుణ భారం పెరిగేందుకు దారితీసింది. కాగా, ప్రస్తుతం తమ వద్ద రూ.12,746 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది. ఇక ఈ ఏడాది ఏప్రిల్-జూన్ కాలంలో 5.41 మిలియన్ టన్నుల స్టీల్ అమ్మకాలను నమోదు చేసినట్లు తెలిపింది. జూన్ క్వార్టర్లో కంపెనీ మొత్తం రూ.2,442 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు రూ.1,118 కోట్లను వెచ్చించింది. యూరప్ యూనిట్ల అమ్మకంపై దృష్టి: స్పెషాలిటీ స్టీల్ వ్యాపారంతోపాటు హార్టెల్పూల్లో ఉన్న పైప్ మిల్స్‌ను విక్రయించే ప్రక్రియ కొనసాగుతోందని టాటా స్టీల్ వివరించింది. ఇక టాటా స్టీల్ యూరప్ విభాగం కూడా జాయింట్ వెంచర్ లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇది ఒక కొలిక్కివస్తుందని పేర్కొంది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వైదొలగిన నేపథ్యంలో బ్రిటన్ వృద్ధి రేటుపై కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చని.. ఈ నేపథ్యంలో ఇక్కడి తమ కార్యకలాపాలు గాడిలోపడేందుకు వ్యవధి పడుతుందని టాటా స్టీల్ అంచనా వేసింది. ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు ధర సోమవారం బీఎస్ఈలో 5.3 శాతం దిగజారి రూ.373.60 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.36,285 కోట్లకు తగ్గింది. -
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల విక్రయానికి బ్రేక్!
దీర్ఘకాల పరిష్కారం కోసం చర్చలు జరపనున్న బ్రిటన్ వ్యాపార మంత్రి లండన్ : టాటా స్టీల్.. యూకేలోని స్టీల్ ప్లాంట్ల విక్రయాలను వాయిదావేసే అవకాశాలున్నాయి. వేల్స్‌లోని భారీ ప్లాంట్ పోర్ట్ తాల్బొట్ ప్లాంట్ విక్రయంతో సహా యూకేలోని ఇతర ప్లాంట్ల విక్రయాన్ని టాటా స్టీల్ తాత్కాలికంగా ఆపివేసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ వెల్లడించింది. టాటా స్టీల్ యూకే ప్లాంట్ల సమస్యలకు సంబంధించి దీర్ఘకాల పరిష్కారం నిమిత్తం బ్రిటన్ వ్యాపార మంత్రి సాజిద్ జావీద్ టాటా స్టీల్ ప్రతినిధులతో చర్చలు జరపడానికి ముంబై రానుండడం దీనికి ప్రధాన కారణమని బీబీసీ వివరించింది. బీబీసీ కథనం ప్రకారం.., శుక్రవారం జరగబోయే నెలవారీ బోర్డ్ మీటింగ్‌లో యూకే స్టీల్ ప్లాంట్ల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించే అవకాశాలున్నాయి.. ప్రత్యేక ఉక్కు ఉత్పత్తుల వ్యాపారానికి సంబంధించిన హర్టెపూల్, రోటర్‌డామ్, స్టాక్స్బ్రిడ్జ్ ప్లాంట్ల విక్రయాలను టాటా స్టీల్ విక్రయించవచ్చు. ఇతర ప్లాంట్ల విక్రయాన్ని టాటా స్టీల్ అటకెక్కించవచ్చు. స్టీల్ ధరలు పెరగడం, యూరోపియన్ యూనియన్ నుంచి ఇంగ్లాండ్ వైదొలగడంపై అనిశ్చితి, చర్చల కోసం యూకే వ్యాపార మంత్రి సాజిద్ జావీద్ ముంబై వచ్చి, టాటా చైర్మన్ సైరస్ మిస్త్రీతో చర్చలు జరపనుండడం.. తదితర అంశాలు దీనికి కారణాలు. అయితే టాటా స్టీల్ యూకే ప్లాంట్లను కొనుగోలు చేయడానికి భారత సంతతి వ్యాపార వేత్త సంజీవ్ గుప్తాకు చెందిన లిబర్టీ హౌస్ ముందంజలో ఉందని ఐటీవీ న్యూస్ వెల్లడించింది. కాగా ఈ పరిణామాలపై టాటా స్టీల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. జాతీయం చేసే అవకాశాలు...! బ్రెగ్జిట్ తదనంతరం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, టాటా స్టీల్ యూకే ప్లాంట్లు అమ్ముడయ్యే అవకాశాలున్నాయని యూకే చిన్న వ్యాపారాల మంత్రి అన్నా సొబ్రి గత వారం పేర్కొన్నారు. అయితే ఈ స్టీల్ ప్లాంట్లను జాతీయం చేసే ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని వివరించారు. యూరోపియన్ యూనియన్‌లో సభ్యదేశంగా ఇంగ్లండ్‌కు ఉక్కు పరిశ్రమను జాతీయకరణ చేసే వీలు లేదనే ప్రచారం పూర్తిగా అపోహమాత్రమేనని ఆమె వివరించారు. టాటా స్టీల్ కంపెనీకి యూకేలోని పోర్ట్ తాల్బొట్, రోటర్‌డామ్, కోర్బి, షాటన్, టీసైడ్ ప్లాంట్లలలో దాదాపు 15 వేలమంది కార్మికులు పనిచేస్తున్నారు. చైనా స్టీల్ ఉత్పత్తుల వెల్లువ కారణంగా టాటా స్టీల్ యూకే వ్యాపారానికి రోజుకు 10 లక్షల పౌండ్ల నష్టం వస్తోంది. దీంతో యూకేలోని ప్లాంట్లను విక్రయించాలని టాటా స్టీల్ నిర్ణయించింది. బిడ్లను ఆహ్వానించింది. సంబంధిత ప్రక్రియ కొనసాగుతోంది. కోరస్ నుంచి ఈ ప్లాంట్లను చేజిక్కించుకున్నపుపడు సంక్రమించిన బ్రిటిష్ స్టీల్ పెన్షన్ ఫండ్ టాటా స్టీల్ కంపెనీకి గుదిబండగా మారింది. స్టీల్ ప్లాంట్ల విక్రయానికి ఈ ఫండ్ ఒక అడ్డంకిగా మారింది. ఈ ఫండ్‌లో 1,30,000 మంది సభ్యులుండగా, 70 కోట్ల పౌండ్ల లోటు ఉంది. యూకే ప్లాంట్ల విక్ర యం వాయిదా నేపథ్యంలో టాటా స్టీల్ షేర్ బీఎస్ఈలో 5% క్షీణించి రూ.318 వద్ద ముగిసింది. -
దండ దండగ యాత్రా?
భారత కంపెనీలకు కలసిరాని విదేశీ టేకోవర్లు టాటా స్టీల్ నుంచి రిలయన్స్ దాకా ఇదే తీరు కలిసొచ్చిన కాస్త కంపెనీలక్కూడా బ్రెగ్జిట్ దెబ్బ టాటా మోటార్స్, మదర్సన్ సుమీ... అన్నిటిదీ ఇదే తీరు యూరప్‌లో ఎక్కువ వ్యాపారం ఉండటమే కారణం ఇవి రాజులు... రాజ్యాల కథలు కావు. కంపెనీలు... దేశాల కథలు. మన కంపెనీలకు కాలం కలిసొచ్చి... విదేశీ కంపెనీల్ని కొన్నాయి. కలిపేసుకున్నాయి. కాకపోతే కాలం తిరగబడింది. కొన్న కంపెనీల నుంచి ఆదాయం లేక... మరింత పెట్టుబడి పెట్టలేక... అమ్మకానికి పెట్టాయి. కొన్న ధరకన్నా తక్కువకే అమ్మేస్తున్నాయి. టాటామోటార్స్, మదర్సన్ సుమీ వంటి కంపెనీల పరిస్థితి మాత్రం వేరు. వాటికి కొనుగోళ్లు కలిసొచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వెళ్లిపోతుండటం ఈ కాస్త విజయాల్ని కూడా కమ్మేసే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వీటి వ్యాపారాలు... లాభాలు అత్యధికం యూరప్ నుంచే వస్తున్నాయి. బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వె ళితే... ఆయా కంపెనీలు బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అనుమతులు క్లిష్టమవుతాయి. ఖర్చులు పెరిగి... ఆ ప్రభావం అమ్మకాలు, లాభాలపై పడుతుంది. దీంతో కలిసొచ్చిన దండయాత్రలు కూడా దండగయాత్రలుగా మారే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఏ కంపెనీ టేకోవర్ ఎలా మారిందనే విశ్లేషణే... ఈ వారం ‘ఫోకస్’ -సాక్షి, బిజినెస్ విభాగం 1 టాటా స్టీల్-కోరస్ ఫార్చ్యూన్-500 నుంచి రూ.20వేల కోట్ల నష్టాల్లోకి 2007లో ఆంగ్లో-డచ్ ఉక్కు దిగ్గజం కోరస్‌ను టాటా స్టీల్ సంస్థ కొనుగోలు చేసింది. అలా... టాటా గ్రూప్ బిటన్ ఉక్కు రంగంలోకి అడుగుపెట్టింది. నిజానికప్పుడు అదో సంచలనం. బ్రిటిష్ సంస్థను టాటాలు కొనుగోలు చేయటంతో దేశంలో భావోద్వేగ పూరిత శుభాభినందనలు కూడా వెల్లువెత్తాయి. దీనికోసం టాటా స్టీల్ నెలల తరబడి బ్రెజిల్‌కు చెందిన సీఎస్ఎన్ సంస్థతో హోరాహోరీగా పోటీ పడింది. 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. చివరికి... సీఎస్ఎన్ కన్నా కేవలం 5 పెన్స్లకన్నా తక్కువకు బిడ్ వేయగలిగింది. అంటే మన కరెన్సీలో కేవలం ఐదు రూపాయలు. అలా కోరస్‌ను టేకోవర్ చేసింది. 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రపంచంలోనే 5వ అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా ఆవిర్భవించింది. ఫార్చ్యూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ సంస్థగా నిలిచింది. కానీ ఈ 5 పెన్స్‌ల విజయమిచ్చిన సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2007లో టన్నుకు 550-575 డాలర్లున్న ఉక్కు రేటు (హాట్ రోల్డ్ కాయిల్స్) 2016లో 380 డాలర్లకు పడిపోయింది. కోరస్ కొనుగోలు కోసం సమీకరించిన భారీ రుణాలు ఒకవైపు.. కంపెనీ నష్టాలు మరోవైపు టాటా స్టీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. కోరస్‌ను కొన్నాక అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు దిగజారాయి. డిమాండ్ క్షీణించి, ధర పడిపోవటంతో గత ఐదేళ్లలో టాటా గ్రూప్ 2 బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.20వేల కోట్లు) నష్టపోయింది. మరిన్ని పెట్టుబడులు పెట్టలేక... అమ్మేయాలని నిర్ణయించుకుంది. డిమాండ్ లేక కొనుగోలుదారులూ పెద్దగా ముందుకు రాలేదు. చివరకు లాంగ్ స్టీల్ వ్యాపారాన్ని, సంబంధిత ప్లాంటును మాత్రం విక్రయించగలిగింది. మిగిలిన వ్యాపారాన్ని తానే నిర్వహించాలని చూస్తున్నా... తాజా బ్రెగ్జిట్ దెబ్బ మరింత కుంగదీసే ప్రమాదం కనిపిస్తోంది. బ్రిటిష్ కంపెనీ కోరస్‌ను టాటా స్టీల్ టేకోవర్ చేయటం ఓ సంచలనం. హోరాహోరీ పోరులో కేవలం 5 పెన్స్‌ల తేడాతో దీన్ని చేజిక్కించుకుంది. కానీ భారీ నష్టాలతో యూకే ఆస్తుల్నిపుడు విక్రయిస్తోంది. 2 మిట్టల్ స్టీల్ - ఆర్సెలర్ నెంబర్-1 మిట్టల్.. అమ్మకాల పరంపర భారతదేశం నుంచి వలస వెళ్లి బ్రిటన్‌లో ఉక్కు వ్యాపారిగా ఎదగటమే లక్ష్మీ నివాస్ మిట్టల్ సాధించిన తొలి విజయం. నెదర్లాండ్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మిట్టల్ స్టీల్స్... 2006లో లగ్జెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్ స్టీల్‌ను ఏకంగా 32 బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దాంతో ప్రపంచంలోనే నెంబర్-1 ఉక్కు కంపెనీగా నిలిచింది. మరి ఈ సమాచారం ఇండియాను ఎంత సంబరపరచిందో ఊహించటం కష్టమా!. కాకపోతే 2008 నుంచి మొదలైన మంద గమన ప్రభావం ఆర్సెలర్ మిట్టల్‌పై ఎక్కువే పడింది. ఉక్కుకు డిమాండ్ పడిపోయింది. దీంతో సంస్థకున్న 25 బ్లాస్ట్ ఫర్నేస్‌లలో తొమ్మిదింట ఉత్పత్తిని నిలిపేసింది. ఫ్రాన్స్‌లో రెండు ఫర్నేస్‌లను మూసేసింది. అదే ఏడాది తన యూరోపియన్ వ్యాపారం తాలూకు మొత్తం విలువను ఏకంగా 4.3 బిలియన్ డాలర్ల మేర తగ్గించి చూపించింది. రెండేళ్ల కిందట గ్రూప్‌లోని ఒక కంపెనీలో వాటాల్ని 770 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. రెండునెలల కిందట మార్చిలో సెంట్రల్ ట్రినిడాడ్ ప్లాంటును మూసి వేయటంతో పాటు... అమెరికాలోని రెండు ప్లాంట్లను అమ్మేయాలని కూడా నిర్ణయించింది. ఈ కథలు వేరు. భారీగా వెచ్చించి... టేకోవర్ చేసినా... తరవాత దాన్నుంచి లాభాలు రాబట్టలేక వెనక్కి తిరిగిన కథలు కావివి. విదేశీ కంపెనీని కొనుగోలు చేయటమే కాక... అందరి అంచనాలనూ తల్ల కిందులు చేస్తూ దాని రాతను మార్చేసిన భారతీయ కంపెనీల కథలివి. అయితే చరిత్రను తిరగరాసిన ఈ కంపెనీల్లో కొన్ని తాజా బ్రెగ్జిట్ దెబ్బకు తల్లకిందులయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే వాటి విజయమే కాక... కార్యకలాపాలు కూడా యూరప్మీదే ఆధారపడ్డాయి మరి. ఎస్సార్ గ్లోబల్ - స్టాన్‌లో రిఫైనరీ రిఫైనరీ జాతకం మారింది... ఎస్సార్ గ్లోబల్‌లో ఎస్సార్ ఆయిల్ యూకే... 2011లో బ్రిటన్‌కు చెందిన స్టాన్‌లో రిఫైనరీని కొనుగోలు చేసింది. అప్పటిదాకా ఆ రిఫైనరీ షెల్ కంపెనీ యాజమాన్యంలో ఉండేది. ఇందుకోసం ఎస్సార్ సంస్థ 350 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఎస్సార్ ఆయిల్ ఇప్పటిదాకా ఆ రిఫైనరీపై దాదాపు 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. అప్పట్లో దుర్భరమైన స్థితిలో ఉన్న పాత ప్లాంటు... ప్రస్తుతం బ్రిటన్‌లోని వ్యూహాత్మక రిఫైనరీల్లో ఒకటిగా ఎదిగింది. దేశంలో రవాణాకు ఉపయోగించే ఇంధనాల్లో 16% వాటాను ఇదే సరఫరా చేస్తోంది. (4.4 బిలియన్ లీటర్ల డీజిలు, 3 బిలియన్ లీటర్ల పెట్రోలు, 2 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం). 3 హావెల్స్- సిల్వేనియా అద్భుతంగా ఎదిగినా... విదేశీ డీల్ ముంచింది... హావెల్స్. రాజస్థాన్ కేంద్రంగా విదేశాలకు సైతం విస్తరించిన దేశీ దిగ్గజం. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన హావెల్స్ ఇండియా... 2007లో తనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదైన యూరోపియన్ కంపెనీ సిల్వేనియాను 300 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. కాకపోతే ఆ డీల్ సంస్థకు ప్రాణాంతకమైంది. 2000లో రూ.100 కోట్ల నుంచి 2006లో రూ.1,600 కోట్ల స్థాయికి ఎగిసిన హావెల్స్... అప్పట్లో 60-70 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కంపెనీలను కొందామని పలు ప్రయత్నాలు చేసింది. అయినా కుదరలేదు. అదే సమయంలో దానికి ఐదారు రెట్ల విలువైన సిల్వేనియా ఆఫర్ వచ్చింది. దీంతో 300 మిలియన్ డాలర్లు వెచ్చించడానికి కూడా సై అంటూ ముందడుగు వేసేసింది. అప్పటి కరెన్సీ మారక విలువ ప్రకారం దాదాపు రూ. 2,000 కోట్లు వెచ్చించిన హావెల్స్, ఆ తర్వాత దాదాపు మరో రూ.1,000 కోట్లు కుమ్మరించింది. కానీ కంపెనీ అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు కలిసి రాకపోవడంతో ఇటీవలే 80 శాతం వాటాలను షాంఘై ఫెయిలో అకౌస్టిక్స్‌కు రూ. 1,340 కోట్లకు అమ్మేసింది. 4 శ్రీ రేణుకా షుగర్స్- డూబ్రెసిల్ కర్ణాటకలో హవా... బ్రెజిల్ దివాలా శ్రీరేణుకా షుగర్స్ అంటేనే సంచలనం. కర్ణాటకలో రైతులందరినీ ఒక్కటి చేసి... వారికి వాటాలిచ్చి మరీ ఆరంభించిన ఈ సంస్థ అతి త్వరగా అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. చక్కెర తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల జాబితాలో ఉన్న ఈ సంస్థ... 2010లో రూ.1,312 కోట్లతో బ్రెజిల్‌కు చెందిన రేణుక డూ బ్రెసిల్‌ను కొనుగోలు చేసింది. ఒక భారతీయ చక్కెర కంపెనీ... విదేశీ సంస్థను కొనుగోలు చేయడం అదే ప్రథమం. కానీ, సరిగ్గా ఏడాది తర్వాత 2011లో ఒకసారి, ఆపైన 2014లో మరోసారి బ్రెజిల్లో ఏర్పడ్డ కరవు పరిస్థితులు కంపెనీని దెబ్బతీశాయి. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, చక్కెర ధరలు పడిపోవడం దీనికి తోడయ్యింది. ఈ పరిణామాలతో రేణుకా బ్రెసిల్ దివాలా పిటిషన్ వేయాల్సి వచ్చింది. 5 ఎయిర్టెల్- జయిన్ రీఛార్జ్ చేయించలేక.. ఎయిర్టెల్ ఆఫ్రికా కాల్ కట్ దేశీ టెలికం రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎయిర్టెల్ సంస్థ... విదేశాల్లో విస్తరణకు అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆఫ్రికన్ టెలికం సంస్థ ఎంటీఎన్‌ను కొనేందుకు ప్రయత్నించినా కుదరలేదు. తరవాత కువైట్ టెలికం కంపెనీ ‘జయిన్’ రూపంలో అవకాశం వచ్చింది. ఆఫ్రికాలోని 17 దేశాల్లో తమ టెలికం వ్యాపారాన్ని విక్రయిస్తామని ఆ సంస్థ ముందుకొచ్చింది. అవకాశం కోసం చూస్తున్న ఎయిర్టెల్... 2010లో ఏకంగా 10.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 73,211 కోట్లు) కొనేసింది. కొంత కసరత్తుతో భారీ లాభాలొస్తాయనుకున్న ఎయిర్‌టెల్‌కు మెల్లగా పరిస్థితి అర్థమయింది. ఒకవైపు లాభాలు లేవు. మరోవంక ఆఫ్రికాలో పాతుకుపోయిన ఎంటీఎన్‌ను అందుకోవడం తేలిక కాదని తెలిసింది. 2012 నుంచీ తమ నెట్‌వర్క్‌లు, ఐటీ కార్యకలాపాలను అవుట్సోర్సింగ్కు ఇచ్చి ఆర్థిక భారాన్ని తగ్గించుకుంది. 2015 డిసెంబర్ క్వార్టర్లో ఆఫ్రికా యూనిట్ 74 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.506 కోట్లు) నష్టాన్ని ప్రకటించింది. తట్టుకోలేక 2016 జనవరిలో సియెరా లియోన్, బుర్కినా ఫాసో దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని ఫ్రాన్స్‌కి చెందిన టె లికం సంస్థ ఆరెంజ్‌కు ఎయిర్టెల్ విక్రయించింది. 2015 అక్టోబర్‌లో ఆఫ్రికాలోని 8,300 మొబైల్ టవర్లను 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 11,000 కోట్లు) అమ్మేసింది. తాగాగా మిగిలిన 3,700 టవర్లను కూడా విక్రయించడానికి ఒప్పందం చేసుకుని... టవర్ల వ్యాపారం నుంచి బయటపడింది. వ్యాపారం మొత్తాన్ని అమ్మేసే పరిస్థితి లేకపోవడంతో పార్టు పార్టుగా అమ్మాల్సి వస్తోందనేది నిపుణుల మాట. ఇండియా వేరు. ఆఫ్రికా వేరని ఎయిర్‌టెల్‌కు ఇప్పుడు తెలిసొచ్చింది. 10.7 బిలియన్ డాలర్లు పెట్టి గల్ఫ్ కంపెనీ జయిన్కు చెందిన ఆఫ్రికా వ్యాపారాన్ని టేకోవర్ చేసింది. ఇపుడు వదిలించుకుంటోంది. జీవీకే టు అదానీ... ⇒మన కంపెనీల విదేశీ వేటలో... అటు కలిసిరాక, ఇటు రద్దవక అలా ఊగిసలాడుతున్న డీల్స్ చాలానే ఉన్నాయి. ళీ జీవీకే -హ్యాంకాక్ సంస్థలు కలిసి ఆస్ట్రేలి యాలోని గెలీలీ బేసిన్లో భారీ బొగ్గు గనులను అభివృద్ధి చేస్తున్నాయి. అయితే రకరకాల ఇబ్బందులతో ఇది ముందుకు సాగటం లేదు. రుణభారం పెరుగుతోంది. ⇒ఆస్ట్రేలియాలోని కోలీలో బొగ్గు వెలికితీతకు గ్రిఫిన్ కోల్ మైన్స్‌తో ల్యాంకో ఒప్పందం చేసుకుంది. గ్రిఫిన్ కోసం ల్యాంకో 600 మి. డాలర్లు వెచ్చించింది. రూ.37వేల కోట్ల రుణ భారమున్న ల్యాంకోకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. వడ్డీల భారం పెరుగుతోంది. ⇒ఆస్ట్రేలియాలోని అబాట్ పాయింట్ పోర్టు లో అదానీ గ్రూప్ దాదాపు మూడు బిలియన్ డాలర్ల దాకా వెచ్చించింది. మరో 10 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రణాళికలు వేసుకుంది. కాకపోతే అక్కడి ప్రాజెక్టులకు పర్యావరణపరమైన అనుమ తులు రావటం లేదు. న్యాయ వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. 6 రిలయన్స్- ఈగిల్ఫోర్డ్ షేల్ గ్యాస్ షేల్‌గ్యాస్‌లో వేలుపెట్టి ఊపిరాడని రిలయన్స్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలో నెంబర్-1 పెట్రో కెమికల్స్ కంపెనీ. చేతిలో డబ్బులుండటంతో వ్యాపార విస్తరణకున్న అవకాశాలన్నిటినీ అన్వేషించింది. అప్పుడప్పుడే షేల్ గ్యాస్‌కు బాగా ప్రాచుర్యం రావటంతో... అందులో పెట్టుబడి బంగారాన్ని పండిస్తుందని అంచనా వేసింది. అప్పట్లో ముడి చమురు ధరలు అంతకంతకూ పెరగటమూ రిలయన్స్ ఆలోచనకు ఒక కారణం. దీంతో 2010లో అమెరికాలోని ఈగిల్ ఫోర్డ్ షేల్ గ్యాస్ ప్రాజెక్టులో 1.31 బిలియన్ డాలర్లు వెచ్చించి 45 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ వెంటనే పయోనీర్ సంస్థ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్లో దాదాపు 3.91 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. మొత్తమ్మీద 3 కంపెనీలతో మూడు జాయింట్ వెంచర్ల ద్వారా (అట్లాస్ ఎనర్జీ, కారిజో ఆయిల్ అండ్ గ్యాస్, పయోనీర్ నేచురల్ రిసోర్సెస్) అమెరికా షేల్ గ్యాస్ మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ కాలుపెట్టింది. ఆర్థిక మాంద్యంతో ఇంధన వాడకం తగ్గింది. కానీ ప్రపంచవ్యాప్తంగా వాటిని ఉత్పత్తి చేస్తున్న దేశాలు తమ ఉత్పత్తిని మాత్రం తగ్గించలేదు. ఫలితం... డిమాండ్ తగ్గి, అమ్మకం రేటుకంటే ఉత్పత్తి వ్యయం పెరిగిపోయింది. సాధారణంగా షేల్ గ్యాస్‌పై పెట్టే భారీ పెట్టుబడులపై లాభం రావాలంటే చమురు రేటు బ్యారెల్‌కు కనీసం 60 డాలర్లయినా ఉండాలి. సంప్రదాయ విధానాల్లో ఉత్పత్తి చేసే మధ్యప్రాచ్య దేశాలకు బ్యారెల్ 25 డాలర్లున్నా లాభాలే. ఒకప్పుడు 147 డాలర్లకు వెళ్లిన క్రూడాయిల్ ధర కొన్నాళ్లుగా 40-45 డాలర్ల దగ్గరే తిరుగుతోంది. నష్టాల్ని తట్టుకోలేని రిలయన్స్... ఈగిల్ ఫోర్డ్ పైప్‌లైన్ అసెట్స్‌ను 2015లో 1.07 బి. డాలర్లకు విక్రయించేసింది. టాటా మోటార్స్- జేఎల్ఆర్ లక్షకారే కాదు.. కోట్లకారూ మాదే టాటా మోటార్స్‌ది ఆది నుంచీ భారీ వాహనాల వ్యాపారమే. 1998లో తొలిసారి కార్లలోకి దిగింది. ఇండికాను మార్కెట్లోకి తెచ్చింది. మొదట్లో దానికొచ్చిన స్పందన అంతంతే. కార్ల వ్యాపారాన్ని అమ్మేస్తే మంచిదన్నారు కొందరు. అది తెలిసి ఫోర్డ్ అధికారులు కొందరు ముంబయిలోని టాటా కార్యాలయానికి వచ్చారు. చర్చల అనంతరం... డెట్రాయిట్ రావాలని పిలిచారు. 1999లో ఓ బృందం వెళ్లింది. అక్కడ ఎదురైన అనుభవమేంటో తెలుసా? ‘‘అయినా అనుభవం లేకుండా ఈ బిజినెస్‌లోకి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీకు ఉపకారం చేయడానికి మీ వ్యాపారాన్ని కొనాలా?’’ అంటూ అవమానించారు. ఆ అధికారులు న్యూయార్క్‌కు తిరిగి వచ్చారు. రతన్‌టాటాకు విషయం చెప్పారు. సరిగ్గా తొమ్మిదేళ్ల తరవాత... 2009లో అదే ఫోర్డ్‌కు చెందిన జాగ్వార్, ల్యాండరోవర్ బ్రాండ్లను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం సందర్భంగా ఫోర్డ్ మోటార్స్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ఏమన్నారో తెలుసా? ‘‘మా జేఎల్ఆర్ను కొని మాకు పెద్ద ఉపకారం చేశారు’’ అని. అలా... టాటామోటార్స్ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. నిజానికి ప్రపంచానికి ఇష్టమైన లగ్జరీ బ్రాండ్ జేఎల్ఆర్ను కొనటానికి టాటా ముందుకెళ్లినపుడు కూడా విపరీతమైన అవమానకర వ్యాఖ్యలు వినపడ్డాయి.‘‘ఏదో లక్ష రూపాయల నానో కారు తయారు చేసుకునే కంపెనీ..! అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లను నిర్వహించటం ఎలా కుదురుతుంది? ఫోర్డ్ వల్లే కానిది టాటా వల్ల ఏమవుతుంది?’’ అంటూ బోలెడన్ని విమర్శలు. పెదవి విరుపులు. కానీ రతన్ టాటా పట్టు వదల్లేదు. 2008లో జేఎల్ఆర్ బ్రాండ్లను సొంతం చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు. వాటిని టర్న్ అరౌండ్ చేశారు. అమ్మకాలు పెంచారు. విమర్శించిన వాళ్లే తరవాత నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం టాటా మోటార్స్‌కి బిలియన్ల కొద్దీ పౌండ్ల లాభాలను ఆర్జించి పెడుతోంది జేఎల్ఆర్. లక్ష కారే కాదు... లక్ష డాలర్ల కారునూ తామే తయారు చేస్తామని నిరూపించారు. కాకపోతే బ్రెగ్జిట్ పెద్దదెబ్బే కొట్టింది. వ్యూహం ఎలా మార్చుకుంటారో చూడాల్సిందే!!. మదర్సన్ సుమి-పెగ్యుఫామ్ కస్టమర్ల సూచన.. కంపెనీకి కలిసొచ్చింది మదర్సన్ సుమి సిస్టమ్స్. పాసింజర్ కార్ల అద్దాలు, వైరింగ్‌కు సంబంధించి హార్నెస్‌లను (హోల్డర్), ప్లాస్టిక్ ఉపకరణాలను తయారు చేసే ఈ సంస్థ దేశంలో ఈ తరహా ఉత్పత్తుల్లో తనకంటూ ప్రత్యేకతను సంపాదించింది. విదేశీ దిగ్గజాలు ఫోక్స్ వ్యాగన్, దైమ్లర్ వంటివి ఈ కంపెనీకి కస్టమర్లే. అలాంటి మదర్సన్ సుమీ... 2008లో యూకేకు చెందిన విజియోకార్ప్ను కొనుగోలు చేసింది. దీన్ని కొనుగోలు చేస్తే పనికొస్తుందని మదర్సన్కు సలహా ఇచ్చింది వేరెవరో కాదు. దాని కస్టమర్ దైమ్లర్. తననుంచీ కాంట్రాక్టులొస్తాయని దైమ్లర్ చెప్పింది. ఇక 2011లో జర్మనీకి చెందిన పెగ్యుఫామ్ గ్రూప్‌లో 80 శాతం వాటాలను మదర్సన్ కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.890 కోట్లు వెచ్చించింది. అప్పటికి అంతంతమాత్రం పనితీరుతో ఉన్న పెగ్యుఫామ్ను... 2014లో అమెరికన్ కంపెనీ స్టోన్ రిడ్జ్కు చెందిన వైరింగ్ విభాగాన్ని కొనుగోలు చేసింది. ఈ మూడూ కొన్నపుడు సమస్యల్లోనే ఉన్నాయి. ఆ తరవాత పనితీరు మెరుగుపడి మదర్సన్ ఆదాయలు పెంచి... అంతర్జాతీయ కంపెనీగా మార్చాయి. అతిగా యూరప్పైన, యూకేపైన ఆధారపడటం వల్ల ఇది మున్ముందు పెను సవాళ్లు ఎదుర్కోక తప్పేట్టు లేదు. 2006లో టాటా స్టీల్ కోరస్ గ్రూప్ కొనుగోలుకు వెచ్చించిన మొత్తం 12,780 మి.డాలర్లు. 2010లో భారతీ ఎయిర్టెల్ జయిన్ ఆఫ్రికా కార్యకలాపాల టేకోవర్‌కు పెట్టిన మొత్తం 10,700 మి.డాలర్లు. 2007లో నోవెలిస్కు హిందాల్కో పెట్టిన మొత్తం 5,706 మి.డాలర్లు. 2008లో జేఎల్ఆర్కు టాటా వెచ్చించిన మొత్తం 2,300 మి.డాలర్లు. ఎస్సార్ స్టీల్ అల్గోమా కోసం ఎస్సార్ గ్లోబల్ 1,421 మి.డాలర్లు పెట్టింది. శ్రీరేణుకా షుగర్స్‌ను దెబ్బతీసింది మాంద్యం కాదు... కరువు. బ్రెజిల్ చక్కెర కంపెనీని టేకోవర్ చేసినా... అక్కడొచ్చిన రెండు కరువులు కంపెనీని దెబ్బతీశాయి. విజయాలకు గానీ, పరాజయాలకు గానీ కీలకమైన కారణాలు ఒకటి- టైమింగ్. రెండోది - కొనుగోలు వ్యయం. టైమింగ్ విషయానికొస్తే... 2008 వరకూ అంతర్జాతీయంగా కంపెనీలకు మహర్దశ నడిచింది. 2009 తరవాత విలువలు క్షీణించాయి. 2011 తరవాత ఘోరంగా తగ్గాయి. ఆర్సెలర్‌ను మిట్టల్ 2006లో... కోరస్‌ను టాటా 2007లో... సిల్వేనియాను హావెల్స్ 2007లో కొన్నాయి. అప్పట్లో వాటి ధరలు గరిష్ఠంగా ఉన్నాయి. ఇక కొనుగోళ్లకు భారీ అప్పులు చేసిన కంపెనీలు కూడా తట్టుకోలేకపోయాయి. -
యూరప్ ‘లాంగ్ స్టీల్’కు ‘టాటా’
గ్రేబుల్ క్యాపిటల్ చేతికి వ్యాపారం లండన్: యూరప్‌లో తమకున్న ‘లాంగ్ ప్రొడక్ట్స్’ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. దీన్ని గ్రేబుల్ క్యాపిటల్ ఎల్ఎల్పీకి విక్రయించినట్లు తెలియజేసింది. ఆస్తుల పోర్ట్‌ఫోలియో పునర్వ్యవస్థీకరణతో సహా... గడిచిన ఏడాది కాలంలో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి సంబంధించి సమూల మార్పిడి ప్రణాళికను పూర్తి రూపాంతర ప్రణాళిక ఈ విక్రయానికి కాఉక్కు వ్యాపారానికి సంబంధించి ‘లాంగ్ ప్రొడక్ట్స్’ బిజినెస్ విక్రయాన్ని పూర్తి చేసినట్లు టాటా స్టీల్ ప్రకటించింది. ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్లు సహకరించటంతోనే ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. ‘‘స్కంథోర్ప్ స్టీల్‌వర్క్స్, టీసైడ్లోని రెండు మిల్లులు, వర్కింగ్టన్లోని ఇంజనీరింగ్ వర్క్‌షాప్, యార్క్‌లో డిజైన్ కన్సల్టెన్సీ, వీటిని అనుబంధంగా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలు, నార్తర్న్ ఫ్రాన్స్‌లోని రైల్ మిల్... ఇవన్నీ మా యూరోప్ వ్యాపారంలో భాగంగా ఉన్నాయి. ఈ రోజు నుంచీ ఇవి బ్రిటిష్ స్టీల్ పేరిట కార్యకలాపాలు సాగిస్తాయి. మొత్తంగా ఈ వ్యాపారంలో యూకేలో 4,400 మంది, ఫ్రాన్స్‌లో 400 మంది ఉద్యోగులున్నారు’’ అని టాటా స్టీల్ యూకే ప్రకటించింది. -
టాటా స్టీల్ నష్టం... రూ.3,214 కోట్లు
12 శాతం తగ్గిన ఆదాయం * ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ సంస్థ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.3,214 కోట్ల నికర నష్టాల్ని ప్రకటించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే క్వార్టర్లో వచ్చిన నష్టాలు రూ.5,702 కోట్లతో పోలిస్తే ఈ క్యూ4లో నష్టాలు తగ్గినట్లే. అయితే గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక నష్టాలు రూ.2,127 కోట్లతో పోలిస్తే 4వ త్రైమాసికంలో నష్టాలు పెరిగాయి. మొత్తం ఆదాయం రూ.33,666 కోట్ల నుంచి 12 శాతం క్షీణించి రూ.29,508 కోట్లకు తగ్గినట్లు టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ తెలిపారు. ఉక్కు డెలివరీలు 7.06 మిలియన్ టన్నుల నుంచి 6.94 మిలియన్ టన్నులకు తగ్గాయని చెప్పారు. ఒక్కో షేర్‌కు రూ.8 డివిడెండ్‌ను ప్రకటిస్తూ... కళింగనగర్ స్టీల్ ప్లాంట్ వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిందన్నారు. రూ.20,514 కోట్ల నగదు నిల్వలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.11,486 కోట్ల మూలధన పెట్టుబడుల్లో కళింగనగర్ ప్లాంట్‌పై రూ.3,695 కోట్లు వెచ్చించినట్లు చటర్జీ తెలిపారు. నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.20,514 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. కీలకం కాని ఆస్తుల విక్రయాన్ని కొనసాగించామని, ఇలాంటి ఆస్తుల విక్రయం ద్వారా రూ.4,478 కోట్లు సమీకరించామని చెప్పారాయన. యూరప్ కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పలు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇక, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,926 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.3,049 కోట్లకు తగ్గాయని తెలిపారు. మొత్తం ఆదాయం రూ.1.40 లక్షల కోట్ల నుంచి రూ.1.17 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. -
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేస్‌లో జేఎస్‌డబ్ల్యూ స్టీల్
ఏడు ఈఓఐలు వచ్చాయి: టాటా స్టీల్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల రేసులో జేఎస్‌డబ్ల్యూ స్టీల్ చేరింది. టాటా స్టీల్ విక్రయించనున్న యునెటైడ్ కింగ్‌డమ్‌లోని ప్లాంట్ల కోసం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ బిడ్ దాఖలు చేసింది. వృద్ధి వ్యూహం లో భాగంగా పలు అవకాశాలను పరిశీలిస్తున్నామని, దీంట్లో భాగంగానే టాటాస్టీల్ యూకే ప్లాంట్ల కోసం బిడ్ దాఖలు చేశామని సజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం ఇంతకు మించి ఏమీ చెప్పలేమని వివరించింది. మరోవైపు తమ యూకే ప్లాంట్ల కొనుగోళ్ల కోసం ఇప్పటివరకూ ఏడు ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)బిడ్స్ వచ్చాయని, విక్రయ ప్రక్రియ తదుపరి దశపై దృష్టి సారిస్తున్నామని టాటా స్టీల్ పేర్కొంది. దక్షిణ వేల్స్‌లోని పోర్ట్ తాల్బొట్, న్యూపోర్ట్, రో దర్హమ్ ప్లాంట్లను టాటా స్టీల్ విక్రయిం చనున్నది. ఇక జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌కు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌కు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో స్టీల్ ప్లాంట్లున్నాయి. సజ్జన్ జిందాల్‌కే చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ కంపెనీ, నవీన్ జిందాల్‌కు చెందిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీకి చెందిన విద్యుత్ ప్లాంట్‌ను కొనుగోలు చేయనున్నామని ఇటీవలే వెల్లడించింది. -
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేసులో ‘లిబర్టీ’...
లండన్: టాటా స్టీల్‌కు చెందిన యూకే వ్యాపారాలను భారత సంతతి వ్యాపార వేత్త సంజీవ్ గుప్తా లిబర్టీ హౌస్‌కు దాదాపు దక్కనున్నాయి. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కోసం నేడు(మంగళవారం) లిబర్టీ హౌస్ బిడ్ దాఖలు చేయనున్నది. ఈ విషయాన్ని కమోడిటీ ట్రేడింగ్ సంస్థ లిబర్టీ హౌస్ ధ్రువీకరించిందని ద ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కొనుగోలు విషయంలో సంజీవ్ గుప్తాకు జాన్ బోల్టన్ వంటి టాటా స్టీల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సలహాలు ఇస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. స్కాట్లాండ్లోని లిబర్టీ హౌస్ స్టీల్ వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూడ్డం కోసం గత నెలలో బోల్టన్ టాటా స్టీల్ నుంచివైదొలగి లిబర్టీ హౌస్‌లో చేరారు. ఇంగ్లాండ్‌లోని టాటా స్టీల్ ప్లాంట్లను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే నిధులను లిబర్టీ హౌస్‌కు అందించడానికి మాక్వెరీ క్యాపిటల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థతో పాటు ఎస్బీఐ, డెలాయిట్, గ్రాంట్ థార్న్టన్ తదితర సంస్థలతో లిబర్టీ హౌస్ సంప్రదింపులు జరపుతోంది. ఇక షెఫీల్డ్‌లో ఉన్న టాటా స్పెషాల్టీ స్టీల్స్ యూనిట్‌ను టోనీ పెడ్డర్ నేతృత్వంలోని అల్బియన్ స్టీల్ కంపెనీ బిడ్ చేయనున్నదని సమాచారం. -
టాటా స్టీల్ యూకేలో 25% వాటా తీసుకుంటాం
బ్రిటన్ ప్రభుత్వం వెల్లడి లండన్: సంక్షోభంలో చిక్కుకున్న టాటా స్టీల్ యూకేను గట్టెక్కించే ప్రయత్నాల్లో భాగంగా అవసరమైతే 25 శాతం మేర వాటాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావిద్ తెలిపారు. కార్యకలాపాల కొనుగోలుకు ముందుకొచ్చే సంస్థలకు వందల మిలియన్ల కొద్దీ పౌండ్ల మేర రుణపరమైన ఉపశమనం కలిగించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ఆర్థిక ప్యాకేజీపై బ్రిటన్, వెల్ష్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. విశ్వసనీయమైన కొనుగోలుదారును అన్వేషించే ప్రక్రియలో టాటా స్టీల్ యూకే సంస్థతో కలసి బ్రిటన్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి వివరించారు. అయితే, ఉక్కు రంగాన్ని జాతీయం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్యలను భావించరాదని ప్రధాని డేవిడ్ కామెరాన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. -
ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబై: మంగళవారం సెలవు దినం అనంతరం ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీలు ఊగిసలాటలో నడుస్తున్నాయి. మొదట్లో 26 వేల మార్కుకు దగ్గర్లో ట్రేడ్ అయిన బీఎస్ఈ సెన్సెక్స్, క్రమేపీ నష్టాల్లోకి జారుకుంది. 100 పైగా లాభంతో దూసుకెళ్లిన సెన్సెక్స్, అదేవిధంగా నిఫ్టీ సైతం 8 వేల మార్కు చేరువదాకా వెళ్లినా మళ్లీ ఎనిమిది వేల దిగువకు జారుకుంది. ఇంట్రా డే లో క్రిసీల్ షేర్లు 13 శాతం కంటే ఎక్కువ లాభాలను నమోదుచేయడంతో, ప్రారంభంలో నిఫ్టీలో షేర్లు పుంజుకున్నాయి. జనవరి, మార్చి త్రైమాసికంలో ఇవే ఎక్కువ లాభాలన్నీ క్రిసిల్ ప్రకటించింది. టాటా స్టీల్, హిందాల్కో, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా సెన్సెక్స్ లో లాభాల బాటలో నడుస్తుండగా... టీసీఎస్, మహింద్రా అండ్ మహింద్రా, మారుతీ, సన్ ఫార్మా, భారతీ నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే దాదాపు 30 షేర్లు 100 పాయింట్లకు పైగా లాభాలను నమోదుచేశాయి. అదేవిధంగా విప్రో కంపెనీ సైతం నాలుగో త్రైమాసిక ఫలితాలు ఈ సాయంత్రం విడుదలచేయనున్న నేపథ్యంలో దాని షేర్లు ఒక శాతం ఎక్కువ లాభాలను నమోదుచేశాయి. అయితే ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ నమోదుచేస్తున్న నష్టాలు మార్కెట్లో కొంత ప్రభావం చూపనుందని నిపుణులు అంచనావేస్తున్నారు. ఓ వైపు క్రూడ్ ఆయిల్ షేర్లు పడిపోతుండగా, మరోవైపు బంగారం, వెండి ధరలు పుంజుకుంటున్నాయి. -
గతవారం బిజినెస్
యూరప్ యూనిట్‌ను విక్రయిస్తున్న టాటా స్టీల్ యూరప్‌లో టాటా స్టీల్‌కున్న యూని ట్లలో ఒకదానిని ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌కు నామమాత్ర మొత్తానికి విక్రయించనున్నది. ఎంత మొత్తానికి అమ్ముతున్నదీ వెల్లడికాలేదు. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టీల్ లాంగ్ ప్రాడక్ట్స్ తయారుచేసే యూనిట్‌ను ఆస్తులు, అప్పులతో సహా 40 మిలియన్ పౌండ్ల ప్యాకేజీని గ్రేబుల్ టేకోవర్ చేస్తుంది. కేపీఆర్ ఆగ్రోకెమ్ ఐపీఓకు సెబీ ఓకే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేపీఆర్ ఆగ్రోకెమ్ ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం లభించింది. ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ కనీసం రూ.180 కోట్లు సమీకరించనున్నది. ఈ ఐపీఓలో రూ.180 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ప్రస్తుత వాటాదారుల 50 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ విధానంలో జారీ చేస్తారు. బిర్లా లైఫ్‌లో అదనపు వాటా విక్రయం పూర్తి బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో విదేశీ భాగస్వామి, కెనడాకు చెందిన సన్‌లైఫ్ ఫైనాన్షియల్ సంస్థ వాటా 26 శాతం నుంచి 49 శాతానికి పెరిగింది. ఈ అదనపు 23 శాతం వాటా విక్రయాన్ని సన్ లైఫ్ ఫైనాన్షియల్ సంస్థకు రూ.1,664 కోట్లకు విక్రయించడం పూర్తయిందని ఆదిత్య బిర్లా నువో బీఎస్ఈకి నివేదించింది. ఫండ్స్ నుంచి రూ.73,000 కోట్ల ఉపసంహరణ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) స్కీమ్స్ నుంచి గత నెలలో రూ.73,000 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. ముఖ్యంగా లిక్విడ్ ఫండ్స్ నుంచి నిధుల ఉపసంహరణ అధికంగా జరిగింది. ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు లిక్విడ్ ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటాయని, ఇది ప్రతి ఏటా జరిగేదేనని నిపుణులు వివరించారు. 49 శాతం తగ్గిన క్విప్ నిధుల సమీకరణ భారత కంపెనీలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) విధానంలో గత ఆర్థిక సంవత్సరానికి రూ.14,358 కోట్ల నిధులు సమీకరించాయి. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో సమీకరించిన నిధులు(రూ.28,429 కోట్లు)తో పోల్చితే దాదాపు 50 శాతం తగ్గుదల నమోదైంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 51 కంపెనీలు క్విప్ ద్వారా నిధులు సమీకరించగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో 20 కంపెనీలు మాత్రమే క్విప్‌కు వచ్చాయి. ఎయిర్టెల్ ఎం-కామర్స్ పేమెంట్ బ్యాంక్! దేశీ టెలికం దిగ్గజ సంస్థ ‘భారతీ ఎయిర్టెల్’ మొబైల్ కామర్స్ అనుబంధ కంపెనీ ‘ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ (ఏఎంఎస్ఎల్)కు ఆర్బీఐ నుంచి పేమెంట్ బ్యాంక్ లెసైన్స్ లభించింది. ఈ విషయాన్ని ఎయిర్టెల్ సంస్థ బీఎస్ఈకి నివేదించింది. ద్రవ్యోల్బణం తగ్గింది.. పారిశ్రామికోత్పత్తి పెరిగింది.. మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్టానికి పడిపోవడం, మూడు నెలల క్షీణత తర్వాత ఫిబ్రవరిలో పారిశ్రామికోత్పత్తి 2 శాతం వృద్ధి సాధించడం... భారత ఆర్థిక వ్యవస్థకు మంగళకరమైనవని నిపుణులంటున్నారు. ఫిబ్రవరిలో 5.26 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 4.83 శాతానికి, ఆహార ద్రవ్యోల్బణం 5.3 శాతం నుంచి 5.21 శాతానికి తగ్గినట్లు కేంద్ర గణాంకాల సంస్థ వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయిందని పేర్కొంది. 53 ఏళ్ల కనిష్టానికి డిపాజిట్ల వృద్ధి రేటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల డిపాజిట్ల వృద్ధి గత ఆర్థిక సంవత్సరంలో (2015ఏప్రిల్-16 మార్చి) కేవలం 9.9 శాతంగా నమోదయినట్లు ఎస్బీఐ నివేదిక పేర్కొంది. డిపాజిట్లు ఇంత తక్కువ శాతం వృద్ధి చెందడం 53 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని తెలిపింది. 2014 నుంచీ డిపాజిట్లు మందగమన ధోరణిలో ఉన్నట్లు వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని బ్యాంకింగ్ వడ్డీరేట్లతో పోల్చితే... వాస్తవిక వడ్డీరేట్లు (బాండ్ల రేట్లకు సంబంధించి) అధికంగా ఉండడం డిపాజిట్లు తగ్గడానికి కారణమని వివరించింది. 18 నుంచి డా.రెడ్డీస్ షేర్ల బైబ్యాక్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ (డీఆర్ఎల్) ఏప్రిల్ 18 నుంచి షేర్ల బైబ్యాక్ చేపట్టనున్నట్లు తెలిపింది. గరిష్టంగా షేరు ఒక్కింటికి రూ. 3,500 వెచ్చించనున్నట్లు వివరించింది. ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో మంగళవారం నాటి కంపెనీ షేరు ప్రారంభ ధర రూ. 3,079తో పోలిస్తే 14 శాతం అధికం. డీమెర్జర్ దిశగా ఎమ్మార్ ఎంజీఎఫ్ ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ నుంచి దుబాయ్ సంస్థ వైదొలగనున్నట్లు సమాచారం. భవిష్యత్ వృద్ధి, విస్తరణ నిమిత్తం డీమెర్జర్ స్కీమ్ ద్వారా వ్యాపారాన్ని పునర్వవ్యస్థీకరిస్తున్నామని ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ బీఎస్ఈకి నివేదించింది. మరోవైపు ఈ జేవీ డీమెర్జర్ కోసం చర్యలు తీసుకోనున్నామని ఎమ్మార్ ప్రోపర్టీస్ కూడా దుబాయ్ ఫైనాన్షియల్ మార్కెట్‌కు నివేదించింది. అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్ట్‌పై మరో వివాదం అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో చేపట్టిన మైనింగ్ ప్రాజెక్ట్‌పై తాజాగా మరో న్యాయ వివాదం చోటు చేసుకుంది. అదానీ సంస్థ క్వీన్స్‌లాండ్‌లోని గలిలీ బేసిన్లో 1,200 కోట్ల డాలర్ల మైనింగ్ ప్రాజెక్ట్‌ను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ మైనింగ్ ప్రాజెక్ట్‌కు ఇచ్చిన లీజ్‌లను సవాల్ చేస్తూ, ఈ గలిలీ బేసిన్ పాత యాజమాన్య సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ వాన్గన్ అండ్ జగలిన్గావూ(డబ్ల్యూ అండ్ జే) సంస్థ ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టులో తాజాగా కేసు దాఖలు చేసింది. మాల్యా పాస్‌పోర్ట్ సస్పెన్షన్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సిఫారసులకు అనుగుణంగా భారత విదేశాంగశాఖ ‘ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు’ విజయ్‌మాల్యాపై కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆయన డిప్లమాటిక్ పాస్‌పోర్ట్‌ను నాలుగువారాలు సస్పెండ్ చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నట్లు భావిస్తున్న మాల్యా, భారత్‌కు తిరిగి వచ్చే అంశం, అలాగే పాస్‌పోర్ట్‌ను ఎందుకు రద్దు చేయకూడదన్న అంశంపై వారంలోపు స్పందించకపోతే... పాస్‌పోర్ట్ రద్దు చేస్తామని కేంద్రం హెచ్చరించింది. అదరగొట్టిన ఇన్ఫోసిస్ దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,597 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో లాభం రూ. 3,097 కోట్లతో పోలిస్తే 16.2 శాతం ఎగసింది. మొత్తం ఆదాయం రూ. 13,411 కోట్ల నుంచి రూ.16,550 కోట్లకు పెరిగింది. 23.4 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు, 285 శాతం తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించి ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు స్థాయికి చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే... 158 మిలియన్ డాలర్లు ఎగసి 360 బిలియన్ డాలర్లుకు పెరిగాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ల పరిమాణం పెరగడం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరేందుకు దోహదపడినట్లు శుక్రవారం విడుదలైన ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. జనవరికల్లా తపాలా బ్యాంకు తపాలా శాఖ త్వరలో బ్యాంకింగ్ రం గంలోకి అడుగుపెట్టనుంది. వచ్చే జనవరి నాటికి పేమెంట్స్ బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది.ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూత్ర ప్రాయంగా అంగీకారాన్ని తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది చివరికి గానీ, వచ్చే జనవరికి గానీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ప్రారంభిస్తామని చెప్పారు. డీల్స్.. * సాఫ్ట్వేర్ సంస్థ పెగాసిస్టమ్స్ తాజాగా అమెరికాకు చెందిన ఓపెన్‌స్పాన్ కంపెనీని కొనుగోలు చేసింది. అయితే, డీల్ విలువ వెల్లడి కాలేదు. * కెన్‌బ్యాంక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ చండీగఢ్‌కు చెందిన హిమ్ టెక్నోఫోర్జ్లో మైనార్టీ వాటాను రూ.30 కోట్లకు కొనుగోలు చేసింది. ఎమర్జింగ్ ఇండియా గ్రోత్ ఫండ్ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేశామని కెన్‌బ్యాంక్ వీసీ ఫండ్ పేర్కొంది. * ఒమన్‌లోని సలాలా నుంచి కొత్తగా సేవలు ప్రారంభించేందుకు మెర్క్ లైన్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కృష్ణపట్నం పోర్టు (కేపీసీఎల్) వెల్లడించింది. -
టాటా స్టీల్ యూరప్ యూనిట్.. ఒక్క పౌండే
♦ లాంగ్ ప్రాడక్ట్స్ వ్యాపారాన్ని ♦ దక్కించుకుంటున్న గ్రేబుల్ క్యాపిటల్ ముంబై: యూరప్‌లో టాటా స్టీల్‌కున్న యూనిట్లలో ఒకదానిని ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. ఈ యూనిట్‌కు భారీగా ఉన్న అప్పులను టేకోవర్ చేసినందుకుగాను కేవలం ఒక్క పౌండ్ నామమాత్ర ధరనే గ్రేబుల్ చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ తయారుచేసే యూనిట్‌ను ఆస్తులు, అప్పులతో సహా 40 మిలియన్ పౌండ్ల ప్యాకేజీని గ్రేబుల్ టేకోవర్ చేస్తుంది. ఈ వ్యాపారానికి అవసరమైన భవిష్యత్తు వర్కింగ్ క్యాపిటల్, పెట్టుబడి నిధుల్ని గ్రేబుల్ బ్యాంకుల నుంచి, తన షేర్‌హోల్డర్ల నుంచి సమీకరిస్తుంది. ఉక్కు దిగ్గజ సంస్థ కోరస్‌ను దాదాపు దశాబ్దం కింద కొని, భారీ నష్టాల్లో చిక్కుకున్న టాటా స్టీల్ ఇటీవల యూరప్ వ్యాపార విక్రయానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఈ యూనిట్లో పనిచేస్తున్న 4,400 మంది ఉద్యోగుల్లో కోతలేవీ విధించరు. కాకపోతే 3 శాతం మేర వేతనాలు తగ్గిస్తారు. లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో భాగమైన టీస్సైడ్, ఉత్తరఫ్రాన్స్ల్లో వున్న స్కంథ్రోప్ స్టీల్‌వర్క్స్, వర్కింగ్టన్లో వున్న ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌ను, యార్క్‌లో వున్న డిజైన్ కన్సల్టెన్సీని, ఇతర అనుబంధ పంపిణీ సదుపాయాల్ని గ్రేబుల్ తీసుకుంటుంది. చైనా నుంచి ముంచెత్తుతున్న దిగుమతుల కారణంగా యూరప్ ఉక్కు పరిశ్రమలో క్లిష్టపరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో టాటా స్టీల్ యూకె, గ్రేబుల్ క్యాపిటల్ మధ్య ఒప్పందం కుదురుతున్నందుకు టాటాస్టీల్ యూరప్ సీఈఓ హాన్స్ ఫిషర్ సంతోషం వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ, కీలక సరఫరాదారులతో ఒప్పందాలకు లోబడి ఈ డీల్ 8 వారాల్లో పూర్తవుతుందని గ్రేబుల్ క్యాపిటల్ ప్రకటించింది. ప్రస్తుత యాజమాన్యమే వ్యాపారాన్ని నడుపుతుందని, కంపెనీ తిరిగి లాభాలబాట పట్టేందుకు రూపొందించిన ప్రణాళికను అమలు జరుపుతుందని, ఒక శాశ్వత సీఈఓను నియమించే ప్రక్రియ మొదలుపెట్టామని గ్రేబుల్ వివరించింది. కంపెనీ యూరప్ వ్యాపారంలో లాంగ్, స్ట్రిప్ స్టీల్ యూనిట్లు యూకేలోనూ, ఫ్లాట్ ప్రొడక్టుల యూనిట్ నెదర్లాండ్స్‌లోనూ వున్నాయి. పోర్ట్ టాల్బెట్లో వున్న టాటా స్టీల్ స్ట్రిప్ యూనిట్‌ను కొనుగోలుచేయడానికి భారతీయ సంతతికి చెందిన లిబర్టీ హవుస్ వ్యవస్థాపకుడు సంజీవ్ గుప్తా ఆసక్తి చూపిస్తున్నారు. టాటా స్టీల్ యూకే వ్యాపారానికి సంబంధించి టాటా స్టీల్‌కు 4 బిలియన్ డాలర్ల రుణం వుంది. అయితే యూనిట్లవారీగా వున్న రుణాల్ని కంపెనీ వెల్లడించలేదు. కోరస్‌ను 2007లో 12.1 బిలియన్ డాలర్లకు టాటా స్టీల్ కొనుగోలు చేసింది. బలహీనమైన డిమాండ్, చౌక చైనా దిగుమతుల ఫలితంగా ఈ వ్యాపారం భారీ నష్టాల్ని చవిచూసింది. -
టాటా స్టీల్ యూకేపై బ్రిటన్ దర్యాప్తు!
ఉత్పత్తులపై సిబ్బంది తప్పుడు సర్టిఫికేట్లను జారీచేసినట్లు ఆరోపణ లండన్: బ్రిటన్‌లో నష్టాల్లో కూరుకుపోయిన తన ఉక్కు యూనిట్‌ను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న టాటా గ్రూప్ దిగ్గజ కంపెనీ టాటా స్టీల్ పనితీరుపై బ్రిటన్ క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించింది. టాటా స్టీల్ అనుబంధ కంపెనీ టాటా స్టీల్ యూకే కార్యాలయంలో పనిచేసే కొంతమంది సిబ్బంది... ఆ కంపెనీ ఉత్పత్తుల్ని విక్రయించడానికి ముందు ఆ ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు సర్టిఫికేట్లను జారీచేశారన్న ఆరోపణలపై బ్రిటన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు డెయిలీ టెలిగ్రాఫ్ ఒక కథనాన్ని వెలువరించింది. ఈ అంశంపై టాటా స్టీల్ ఉత్తర ఇంగ్లాండ్‌లో వున్న తన యార్క్‌షైర్ సైట్లో ఇంతకుముందే టాటా స్టీల్ అంతర్గత దర్యాప్తు జరిపి, సీరియన్ ఫ్రాడ్ ఆఫీసు (ఎస్ఎఫ్ఓ)కు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై పీటీఐ ప్రతినిధి ఎస్ఎఫ్ఓను సంప్రదించగా, ఈ దశలో వ్యాఖ్యానించేందుకు నిరాకరించింది. ఇది మీడియా స్పెక్యులేషన్ అంటూ టాటా స్టీల్ కూడా కొట్టివేసింది. ఈ ఉత్పత్తుల వల్ల ప్రభావితమైన బీఏఈ, రోల్స్రాయిస్లతో సహా 500 మంది ఖాతాదారులకు సంబంధించిన పత్రాల్ని పోలీసులు పరిశీలించారంటూ డెయిలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. -
టాటా మిస్త్రీతో బ్రిటన్ వాణిజ్య మంత్రి సమావేశం
ముంబై: బ్రిటన్ వాణిజ్య మంత్రి సాజిద్ జావీద్, టాటా గ్రూప్ చీఫ్ సైరస్ మిస్త్రీతో బుధవారం ముంబైలో రెండు గంటల పాటు సమావేశం జరిపారు. టాటా స్టీల్ ఇంగ్లాండ్ కార్యకలాపాల విక్రయంపై చర్చలు జరిగాయి. ఇక్కడి బాంబే హౌస్‌లో మిస్త్రీ, ఇతర ఉన్నతాధికారులతో జావీద్ చర్చలు జరిపారు. భారీగా నష్టాలు వస్తుండటంతో ఇంగ్లాండ్ కార్యకలాపాలను విక్రయించాలని టాటా స్టీల్ నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్లాంట్ల కొనుగోలుకు తగిన కంపెనీని ఎంచుకోవడం, వేలాది కార్మికులు వీధినపడకుండా చూడడం ప్రధానాంశాలుగా ఈ చర్చలు జరిగాయి. అయితే చర్చల వివరాలను టాటా గ్రూప్‌గానీ, జావీద్ గానీ వెల్లడించలేదు. జావీద్ టాటా స్టీల్ గ్రూప్ ఈడీ కౌశిక్ చటర్జీని కూడా కలిశారు. ఎలాంటి ఉద్యోగాల కోత ఉండకుండా చూడాలని టాటా కంపెనీపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. భారత్‌కు వచ్చే ముందు లిబర్టీ గ్రూప్‌కు చెందిన సంజీవ్ గుప్తాతో జావీద్ చర్చలు జరిపారు. సౌత్‌వేల్స్‌లోని టాటా స్టీల్‌కు చెందిన పోర్ట్తాల్బోట్ప్లాంట్ను కొనుగోలు చేయాలని సంజీవ్ గుప్తా యోచిస్తున్నారు. -
యూరోప్ కార్యకలాపాలపై సమీక్ష: టాటా స్టీల్
న్యూఢిల్లీ: పోర్ట్ టాల్బాట్ (బ్రిటన్)లోని అతిపెద్ద స్టీల్ కర్మాగారంసహా యూరోప్ ప్రాంతంలోని తన మొత్తం కార్యకలాపాలను సమీక్షిస్తామని టాటా స్టీల్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. బ్రిటన్‌లోని తన కర్మాగారాలు తీవ్ర ద్రవ్యపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో టాటా స్టీల్ తీసుకున్న నిర్ణయానికి ప్రాధాన్యత ఏర్పడింది. టాటా గ్రూప్‌లో కీలకమైన యూకే టాటా స్టీల్ విభాగం నుంచి పూర్తిగా లేదా కొంతవాటాలను విక్రయించాలని గత వారం టాటా స్టీల్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గడచిన 12 నెలల్లో దిగజారిన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణం. లాంగ్ ప్రొడక్ట్స్ యూకే బిజినెస్ విక్రయంపై గ్రేబుల్తో చర్చలు పురోగతిలో ఉన్నట్లు టాటా స్టీల్ ప్రతినిధి వెల్లడించారు. భారీ నష్టాల్లో కూరుకుపోయిన బ్రిట న్ వ్యాపార విభాగాన్ని విక్రయించాలన్న టాటా స్టీల్ నిర్ణయం వల్ల 15,000 మందికి పైగా ఉద్యోగాల్లో కోత పడుతుందన్న ఆందోళన నెలకొంది. -
మూతపడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం
♦ కానీ సక్సెస్ అవుతామని గ్యారంటీ లేదు ♦ టాటా స్టీల్ యూకే వ్యాపారంపై బ్రిటన్ ప్రధాని కామెరాన్ లండన్: నష్టాల్లో కూరుకుపోయిన టాటా స్టీల్ యూకే సంస్థలో పనిచేస్తున్న దాదాపు 20,000 మంది ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేస్తోందని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పారు. ‘‘మేం చేయగలిగినదంతా చేస్తున్నాం. కానీ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయనే గ్యారంటీ మాత్రం ఇవ్వలేం’’ అన్నారాయన. భారతదేశ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్... నష్టాల్లో ఉన్న తమ బ్రిటన్ వ్యాపారాన్ని విక్రయించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కామెరాన్ క్యాబినెట్ మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సమస్య పరిష్కారానికి కంపెనీని జాతీయం చేయడం పరిష్కారం కాదని, కానీ ఏ అవకాశాలనూ తోసిపుచ్చలేమని చెప్పారు. ‘‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగం కష్టాల్లో ఉంది. ధరలు పతనమయ్యాయి. సరఫరా పెరిగిపోయింది’’ అని క్యాబినెట్ సమావేశం అనంతరం కామెరాన్ విలేకరులతో వ్యాఖ్యానించారు. మరోవైపు, కొనుగోలుదారు దొరికే దాకా ప్లాంట్లను మూసివేయకుండా కొనసాగిస్తామనే హామీని టాటా స్టీల్ ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్నట్లుగా ‘బీబీసీ’ ఒక కథనం వెలువరించింది. టాటా గ్రూప్.. తమ వ్యాపారాన్ని విక్రయించడం కంటే ప్లాంట్లను మూసివేయడానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చన్న అంశం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోందని ఈ కథనంలో పేర్కొంది. ప్లాంట్లు ఎంతకాలం నడుస్తాయన్న దానిపై కంపెనీ నుంచి నిర్దిష్ట హామీని ప్రభుత్వం దక్కించుకోలేకపోయింది. దీంతో కొనుగోలుదారు ఎవరైనా ముందుకు రావడం లేదా జాతీయం చేయడం లేదా ప్లాంటును మూసివేసేందుకు అంగీకరించడం తదితర అంశాలన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని సమాచారం. అలాగే కొనేందుకు ముందుకొచ్చే సంస్థలకు రుణ హామీలు ఇచ్చే అవకాశాలు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
టాటాస్టీల్ అమ్మకాల ‘కోరస్’..!
♦ విక్రయానికి బ్రిటన్ వ్యాపారం ♦ క్షీణించిన ఆర్థిక పరిస్థితులే కారణం ♦ జాతీయం చేయాలని ఉద్యోగుల డిమాండ్ ♦ ప్రత్యామ్నాయాల పరిశీలనలో బ్రిటన్... లండన్/ముంబై: దాదాపు దశాబ్దం క్రితం బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించి మరీ బ్రిటన్‌లో దక్కించుకున్న ఉక్కు వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది దేశీ దిగ్గజం టాటా స్టీల్. ఉక్కుకు డిమాండ్ తగ్గి ధరలు పడిపోవడం, ఆర్థిక పరిస్థితులు అంతకంతకూ క్షీణిస్తుండటమే ఇందుకు కారణం. ముంబై ప్రధాన కార్యాలయంలో బోర్డు సుదీర్ఘ సమావేశం అనంతరం టాటా స్టీల్ బుధవారం ఈ మేరకు ప్రకటన చేసింది. గడిచిన ఏడాది కాలంగా అనుబంధ సంస్థ టాటా స్టీల్ యూకే ఆర్థిక పనితీరు దిగజారుతుండటంతో కంపెనీని పూర్తిగా లే దా విభాగాల వారీగా విక్రయించడం సహా ఇతర పునర్వ్యవస్థీకరణ అవకాశాలన్నింటినీ పరిశీలించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ మేరకు టాటా స్టీల్ యూరప్‌నకు తగు సూచనలు ఇచ్చినట్లు తెలిపింది. ‘అంతర్జాతీయంగా ఉక్కు సరఫరా పెరిగిపోవడం, యూరప్‌లోకి వర్థమాన దేశాల నుంచి దిగుమతులు ఎక్కువ కావడం, తయారీ వ్యయాలు భారీగా పెరగడంతో పాటు దేశీయంగా ఉక్కు డిమాండ్ తగ్గడం, కరెన్సీ హెచ్చుతగ్గులు మొదలైనవి ప్రస్తుత నిర్ణయానికి కారణం. భవిష్యత్‌లోనూ ఇవి కొనసాగే అవకాశముంది. ఇటీవలి కాలంలో పరిస్థితిని మెరుగుపర్చేందుకు యాజమాన్యం, సిబ్బంది కలసి అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది’ అని టాటా స్టీల్ పేర్కొంది. గడిచిన నాలుగు త్రైమాసికాల్లో బ్రిటన్ కార్యకలాపాల బుక్ వేల్యూ సున్నా స్థాయిలోనే ఉందని టాటా గ్రూప్ ఈడీ (ఫైనాన్స్) కౌశిక్ చటర్జీ చెప్పారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు బ్రిటన్ ప్రభుత్వంతో కలసి పనిచేస్తున్నామన్నారు. మరోవైపు, టాటా స్టీల్ యూకే వ్యాపారాన్ని అమ్మకానికి ఉం చినా.. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోలుదారులెవరూ ముందుకు రాకపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. టాటా స్టీల్ విక్రయ పరిణామాలపై చర్చించేందుకు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ గురువారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కుటుంబంతో కలసి విదేశాల్లో సెల వులు గడుపుతున్న కామెరాన్.. తన ట్రిప్‌ను మధ్యలోనే ముగించుకుని, తిరిగి రానున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరం.. తాజా పరిణామంతో టాటా స్టీల్ యూకే వ్యాపార విభాగంలో పనిచేస్తున్న వేలకొద్దీ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారనుంది. దీంతో అక్కడి కార్మిక సంఘాలు సంస్థను జాతీయం చేయాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. యూకే, ఐర్లాండ్‌లో కలిపి టాటా స్టీల్‌కు మూడు ప్లాంట్లు (పోర్ట్ టాల్బోట్, రోథర్హామ్, స్కన్‌థోర్ప్) ఉన్నాయి. వీటి వార్షికోత్పత్తి సామర్థ్యం సుమారు 11 మిలియన్ టన్నులు. బ్రిటన్‌లోని స్టీల్ ప్లాంట్లలో దాదాపు 15,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. వారి ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. తగిన కొనుగోలుదారును అన్వేషిస్తామని పేర్కొంది. వేల కొద్దీ ఉద్యోగులను కాపాడేందుకు అవసరమైతే టాటా స్టీల్ యూకేలో భాగమైన పోర్ట్ టాల్బోట్ ప్లాంటులో తాత్కాలికంగా కొన్ని వాటాలు కొనుగోలు చేయడం సహా జాతీయకరణ తదితర ప్రత్యామ్నాయ అవకాశాలన్నింటినీ పరిశీలిస్తున్నట్లు బ్రిటన్ వాణిజ్య మంత్రి ఆనా సోబ్రీ పేర్కొన్నారు. కంపెనీకి సానుకూలం: రేటింగ్ ఏజెన్సీలు బ్రిటన్ కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించుకోవాలన్న నిర్ణయం టాటా స్టీల్ రుణ పరపతి మెరుగుపడటానికి సానుకూలాంశమని రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ తెలిపింది. అయితే, పూర్తి ప్రణాళిక సిద్ధమయ్యే దాకా రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేయలేమని పేర్కొంది. బ్రిటన్ వ్యాపారం అమ్మక ప్రతిపాదన వార్తలతో బీఎస్ఈలో టాటాస్టీల్ షేరు ధర 6.75% ఎగసి రూ. 324 వద్ద ముగిసింది. కోరస్‌తో ఎంట్రీ.. 2007లో ఆంగ్లో-డచ్ స్టీల్ దిగ్గజం కోరస్‌ను కొనుగోలు చేయడం ద్వారా టాటా గ్రూప్ బ్రిటన్ ఉక్కు రంగంలో అడుగుపెట్టింది. అప్పట్లో బ్రెజిల్‌కి చెందిన సీఎస్ఎన్ సంస్థతో నెలల తరబడి హోరాహోరీగా పోటీపడి సుమారు 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించి మరీ కోరస్‌ను టేకోవర్ చేసింది. దీనికోసం సమీకరించిన భారీ రుణాలే కంపెనీని వెన్నాడుతున్నాయి. మొత్తం మీద 25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా టాటా స్టీల్ ఆవిర్భవించింది. అలాగే ఫార్చూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ కంపెనీగా నిల్చింది. ఉక్కుకు డిమాండ్ కొనసాగిన పక్షంలో కంపెనీ గట్టిగానే నిలదొక్కుకునేది. కానీ, ఆ తర్వాత ఏడాదే అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం తలెత్తడంతో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ వస్తున్నాయి. గత అయిదేళ్లలో టాటా గ్రూప్ దాదాపు 2 బిలియన్ పౌండ్ల మేర నష్టపోయింది. -
అమ్మకానికి టాటా స్టీల్ యూరప్ యూనిట్...
న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ యూకే (టీఎస్యూకే) యూరప్‌లోని తమ లాంగ్ ప్రోడక్ట్స్ వ్యాపార విభాగాన్ని విక్రయించనుంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌తో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. డీల్‌లో భాగంగా టీఎస్యూకేకి చెందిన స్కన్‌థోర్ప్ స్టీల్ వర్క్స్, వర్కింగ్టన్లోని ఇంజనీరింగ్ వర్క్‌షాప్ మొదలైనవి విక్రయించనుంది. ఉక్కు పరిశ్రమ ప్రస్తుతం అత్యంత గడ్డుకాలం ఎదుర్కొంటోందని, లాంగ్ ప్రోడక్ట్స్ యూరప్ వ్యాపార విభాగానికి ఊపిర్లూదేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని టాటా స్టీల్ యూరప్ వ్యాపార సీఈవో కార్ల్ కోహ్లర్ తెలిపారు. లాంగ్ ప్రోడక్ట్స్ యూరప్ వ్యాపారం కింద టీఎస్యూకే .. నిర్మాణం తదితర రంగాల్లో ఉపయోగపడే వైర్ రాడ్లు, సెమీ ఫినిష్డ్ స్టీల్ మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఇందులో సుమారు 4,700 మంది పైగా సిబ్బంది ఉన్నారు. -
టాటా స్టీల్ కళింగ నగర్ ప్లాంట్ ప్రారంభం
కళింగనగర్: టాటా స్టీల్ కంపెనీ ఏర్పాటు చేస్తోన్న కళింగ నగర్ స్టీల్ ప్లాంట్ ఒడిషా పారిశ్రామికీకరణకు ఇతోధికంగా తోడ్పాటునందిస్తుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. టాటా స్టీల్ కంపెనీ ఏర్పాటు చేస్తోన్న ఇక్కడి ఉక్కు ప్లాంట్‌లో మొదటి దశను జాతికి అంకితం చేసిన సందర్బంలో ఆయన మాట్లాడారు. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో టాటా స్టీల్ కంపెనీ 6 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ఈ ప్లాంట్‌ను రూ.25,000 కోట్ల పెట్టుబడులతో రెండు దశల్లో ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ ఏర్పాటును ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తుండటంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నవీన్ పట్నాయక్ మొదటి దశను ప్రారంభించారు. రూ లక్ష కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను 16 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్‌గా విస్తరించాలని యాజమాన్యం యోచి స్తోందని పట్నాయక్ పేర్కొన్నారు. ఒడిశా అభివృద్ది యాత్రలో ఈ కళింగ నగర్ ప్లాంట్ మరో మజిలి అని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చెప్పారు. వాటాదారులకు, సమాజానికి కట్టుబడి ఉందనడానికి, టాటా స్టీల్ అంకితభావానికి ఈ కళింగ నగర్ ప్లాంట్ ఒక ప్రతీక అని టాటా స్టీల్ ఎండీ టి. వి. నరేంద్రన్ చెప్పారు. ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోనే రెండో అతి పెద్ద ప్లాంట్ అని ఆయన పేర్కొన్నారు. కాగా ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్, సింటర్ ప్లాంట్లకు ఒడిశా స్టేట్ పొల్యుషన్ బోర్డ్ అనుమతులు రావాల్సి ఉంది. దీంతో ఉత్పత్తి కార్యక్రమాలు 2-3 నెలల తర్వాతనే ప్రారంభమవుతాయని అంచనా. -
టాటా స్టీల్ నికర లాభం రెండు రెట్లు
ఆదాయం 17 శాతం డౌన్ న్యూఢిల్లీ: టాటా స్టీల్ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలంలో రెండు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.337 కోట్లుగా ఉన్న తమ నికర లాభం ఈ క్యూ1లో రూ.763 కోట్లకు పెరిగిందని టాటా స్టీల్ తెలిపింది. భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు, వ్యయ నియంత్రణ పద్ధతులు, ఇతర ఆదాయం బాగా పెరగడం వల్ల భారీ స్థాయి నికర లాభం సాధించామని పేర్కొంది. మార్కెట్ పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, దిగుమతులు పెరిగినప్పటికీ మంచి పనితీరును కనబరిచామని టాటా స్టీల్ గ్రూప్ ఈడీ(ఫైనాన్స్, కార్పొరేట్) కౌశిక్ చటర్జీ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.36,427 కోట్ల నుంచి 17 శాతం క్షీణించి రూ.30,300 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. మొత్తం వ్యయాలు రూ.33,705 కోట్ల నుంచి 14 శాతం క్షీణించి రూ.28,873 కోట్లకు తగ్గాయని తెలిపింది. ధమ్ర పోర్ట్‌లో తమ వాటాను రూ.1,270 కోట్లకు విక్రయించామని, ఇది ఇతర ఆదాయంలో భారీ పెరుగుదలకు తోడ్పడిందని వివరించారు. -
మంచు ముద్దల్లా లోహ షేర్లు..!
ఆరు నెలల్లో 50% వరకూ పతనం - మూడేళ్ల గరిష్ఠ ధరతో పోలిస్తే మరీ ఘోరం - ఇక తగ్గవనుకోవటానికి వీల్లేదంటున్న నిపుణులు - ఈ బేరిష్ దశ దీర్ఘకాలం సాగుతుందంటూ సూచనలు దేశంలో అగ్రగామి ఉక్కు సంస్థల్లో ఒకటైన టాటా స్టీల్ షేరు ధర ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 400 రూపాయలు. మరిప్పుడో..? దాదాపు 250 రూపాయలు. అంటే 40%పైగా పతనమైందన్న మాట. ఇదొక్కటే కాదు. హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, వేదాంత, నాల్కో... ఇలా మెటల్ షేర్లన్నీ దారుణంగా కరిగిపోతున్నాయి. ఏకంగా 30 నుంచి 40 శాతం వరకూ పతనమవుతున్నాయి. మూడేళ్ల కిందట వీటిని చూసినవారికి... సగానికన్నా ఎక్కువ, అతిదారుణంగా పడిపోయిన తీరు స్పష్టంగానే అర్థమవుతుంది. కొన్ని కంపెనీల షేర్లయితే వాటి బుక్ వాల్యూ కన్నా తక్కువకు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ లెక్కన చూసినపుడు చాలా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, కొనుగోళ్లకు మంచి సమయమేనని కూడా కొందరు ఇన్వెస్టర్లు భావిస్తున్నాయి. అయితే నిజంగానే ఇది మంచి సమయమా? లేక ఇంకా పతనం కొనసాగుతుందా? భవిష్యత్ ఎలా ఉంటుంది? వీటిపై మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు? ఇవన్నీ తెలియజేసేదే ‘సాక్షి బిజినెస్’ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం... ఒక దేశం అభివృద్ధి చెందుతున్న తీరును తెలియజేయటానికి ఆ దేశంలో తలసరి ఉక్కు వినియోగాన్ని కూడా ప్రామాణికంగా తీసుకుంటారంటే ఉక్కు వినియోగం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే అంతర్జాతీయంగా, దేశీయంగా పలు ప్రతికూలాంశాలు ఎదురవటంతో దేశంలో ఉక్కుతో పాటు ఇతర లోహాలూ కుదేలవుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదించటం లోహ పరిశ్రమపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. ఉక్కు, రాగి, అల్యూమినియం వంటి లోహాలను అధికంగా వినియోగించే చైనాలో మందగమనం వల్ల డిమాండ్‌తో పాటు ధరలూ తగ్గాయి. పులి మీద పుట్రలా ఆస్ట్రేలియా, ఇండోనేషియాల్లో మైనింగ్‌పై నిషేధాలు తొలగడంతో ఎన్నడూ లేనంతగా సరఫరా పెరుగుతోంది. ఫలితం... డిమాండ్, తగ్గి సరఫరా పెరగటంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ముడి ఇనుము మైనింగ్‌కు సంబంధించి కర్ణాటక, గోవాల్లో నిషేధం వల్ల కంపెనీలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. దీనికి ఉత్పాదక వ్యయాలు పెరగడం, వాహన, నిర్మాణ రంగాల్లో అంతంత మాత్రపు డిమాండ్, మైనింగ్ అనుమతుల్లో జాప్యం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం ఇవన్నీ తోడవుతున్నాయి. హిందాల్కో, జిందాల్, తదితర కంపెనీలకు బొగ్గు కుంభకోణం మసి అంటుకోవడం, న్యాయ వివాదాలు వీటికి ఆజ్యం పోసేవే. ఈ షేర్లు ఆకర్షణీయమేనా? లోహ కంపెనీల షేర్ల ధరలు బాగా తగ్గుతుండటంతో ఈ షేర్ల బాటమ్ అవుట్ దగ్గరలోనే ఉందని ఇన్వెస్టర్లు చేస్తున్న ఆలోచనలతో నిపుణులు మాత్రం ఏకీభవించటం లేదు. హిందాల్కో, టాటా స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, నాల్కో కంపెనీలు తమ పుస్తక విలువల కంటే తక్కువ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. వీటి మార్కెట్ ధరకు, పుస్తక విలువకు మధ్య నిష్పత్తి ఒకటి కంటే తక్కువే ఉంది. అంతమాత్రాన ఇవి కొనుగోలుకు ఆకర్షణీయంగా ఉన్నట్లు భావించరాదనేది నిపుణుల మాట. ఈ లోహ షేర్ల రుణభారాలు బాగా పెరుగుతున్నాయని, ఇవి బే ర్ గ్రిప్‌లోకి జారిపోయాయనేది వారి అభిప్రాయం. ‘‘లోహ షేర్లు బేర్ దశలో సుదీర్ఘ కాలం ఉంటాయి. దీర్ఘకాలం రిస్క్‌ను భరించగలిగే సామర్థ్యం ఉంటేనే వీటి గురించి ఆలోచించాలి’’ అని ఓ బ్రోకింగ్ కంపెనీ నిపుణుడు అభిప్రాయపడ్డారు. పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా తమ పోర్ట్‌ఫోలియోల్లో లోహ షేర్లను వీలైనంతగా తగ్గించుకుంటున్నాయి. ఈ రంగం భవిష్యత్తు అనిశ్చితిగా ఉంటుంటమే దీనికి ప్రధాన కారణమని అవి చెబుతున్నాయి. లోహ పరిశ్రమ కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని, ఒకసారి కోలుకుంటే మాత్రం మంచి రాబడులను అందిస్తాయని మార్కెట్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. -
బ్లూచిప్ కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు
మూడో రోజూ పతన బాటలోనే... 24 మైనస్‌తో 26,813కు సెన్సెక్స్ 4 పాయింట్ల నష్టంతో 8,131కు నిఫ్టీ స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజూ నష్టాల్లోనే ముగిసింది. వాహన, లోహ షేర్ల పతనం కారణంగా గురువారం స్టాక్‌మార్కెట్ 24 పాయింట్లు నష్టపోయి 26,813 పాయింట్ల వద్ద, నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 8,131 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండడంతో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్ నష్టాలు తక్కువ స్థాయికే పరిమితమయ్యాయి. గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా యూరోప్ మార్కెట్లు పతనం కావడం, డాలర్‌తో రూపాయి మారకం 20 నెలల కనిష్ట స్థాయికి (64.25) క్షీణించడం కూడా ప్రభావం చూపాయి. లోహ, కన్సూమర్ డ్యూరబుల్స్, ఆరోగ్య సంరక్షణ, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు బలహీనంగా ట్రేడయ్యాయి. క్యాపిటల్ గూడ్స్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్తు, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. గ్రీస్ రుణ సంక్షోభంపై నేడు(శుక్రవారం) కీలకమైన ఫలితం తేలనుండటంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ మార్కెట్‌పై విశ్లేషించారు. 397 పాయింట్ల శ్రేణిలో సెన్సెక్స్ సెన్సెక్స్ 26,941 పాయింట్లతో లాభాల్లోనే ప్రారంభమైంది. గత2 సెషన్లలో బాగా నష్టపోయిన బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లతో 26,949 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. ఆ తర్వాత లాభాల స్వీకరణ కారణంగా 26,552 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ చివర్లో ఎంపిక చేసిన షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. రిలయన్స్, ఆర్థిక సేవల సంస్థల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం సెన్సెక్స్ మరీ పతనం కాకుండా అడ్డుకుంది, మొత్తం 397 పాయింట్ల రేంజ్లో కదలాడింది. టాటా స్టీల్ 2 శాతం డౌన్ మ్యాగీ వివాదంతో నెస్లే ఇండియా షేర్ 2.8% క్షీణించి రూ.6,011 వద్ద ముగిసింది. 30 సెన్సెక్స్ షేర్లలో 19 షేర్లు నష్టాల్లో, 11 షేర్లు లాభాల్లో ముగిశాయి. పెన్షన్ స్కీమ్ విషయమై కార్మిక సంఘాలు సమ్మెకు మొగ్గుచూపుతున్నాయన్న వార్తల కారణంగా టాటా స్టీల్ 2.5 శాతం క్షీణించి 308 వద్ద ముగిసింది. టర్నోవర్ బీఎస్ఈలో రూ.4,681 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.15,661 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.1,91,093 కోట్లుగా నమోదైంది. -
టాటా స్టీల్ నష్టం రూ. 5,674 కోట్లు
న్యూఢిల్లీ: ఉక్కు తయారీ దిగ్గజం టాటా స్టీల్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ. 5,674 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నగదుయేతర రైట్ డౌన్స్ తాజా నష్టాలకు కారణం. మరోవైపు తాజా క్యూ4లో ఆదాయం 21 శాతం క్షీణించి రూ. 42,428 కోట్ల నుంచి రూ. 33,666 కోట్లకు తగ్గింది. గ్రూప్‌లోని కొన్ని వ్యాపార విభాగాలు అంతగా పనితీరు ఆశించిన స్థాయిలో లేనందున వాటి విలువలను తగ్గించడం వల్ల నష్టాలు నమోదు చేయాల్సి వచ్చిందని టాటా స్టీల్ పేర్కొంది. -
మార్కెట్లో కొత్త రికార్డులు
అంతటా సానుకూల పరిణామాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 28,500 మార్కును, నిఫ్టీ 8,500 మార్కును అధిగమించాయి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న ఆశలు ఒకవైపు.. చైనా, యూరప్‌లో అదనంగా ఆర్థిక సహాయక ప్యాకేజీలు రావొచ్చన్న అంచనాలు మరోవైపు ఇందుకు దోహదపడ్డాయి. చైనా అనూహ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం మరో కారణంగా నిల్చింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్టమైన 28,541.96 స్థాయిని, నిఫ్టీ 8,534.65 పాయింట్ల స్థాయిని తాకాయి. చివరికి 164.91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,499.54 వద్ద, 52.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,530.15 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో 467 పాయింట్ల (1.66 శాతం) మేర పెరిగినట్లయింది. ‘డిజిన్వెస్ట్‌మెంట్’లో ఇన్వెస్ట్: ఎల్ఐసీ ఇదిలావుండగా... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ (వాటాల విక్రయం) మొదలెట్టిన పక్షంలో తాము మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ తెలిపారు. ఐపీవో బాటలో 13 సంస్థలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో దాదాపు డజను పైగా కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్, వీడియోకాన్ డీ2హెచ్ సహా 13 కంపెనీలు ప్రాస్పెక్టస్ ముసాయిదాను సెబీకి సమర్పించాయి. అటు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్..ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవన్నీ మే లో ఎన్నిక ఫలితాల అనంతరం సెబీకి పత్రాలు సమర్పించాయి. వీటిలో లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్, మాంటెకార్లో ఫ్యాషన్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
సెన్సెక్స్ @ 28,000
అంతర్జాతీయ స్థాయిలో మరోసారి దిగివచ్చిన ముడిచమురు ధరలు దేశీయ స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరసి ప్రధాన ఇండెక్స్‌లు మళ్లీ సరికొత్త రికార్డులను సృష్టించాయి. సెన్సెక్స్ 28,000 పాయింట్ల మైలురాయికి ఎగువన ముగియగా, ఇంట్రాడేలో నిఫ్టీ 8,400ను దాటేసింది. మార్కెట్ చరిత్రలోనే ఇవి కొత్త గరిష్టాలుకాగా, 99 పా యింట్లు లాభపడ్డ సెన్సెక్స్ తొలిసారి 28,009 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 21 పాయింట్లు పెరిగి 8,383 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 28,126ను, నిఫ్టీ 8,415 పాయింట్లను అధిగమించడం విశేషం! బ్రెంట్ చమురు 80 డాలర్లకు, నెమైక్స్ రకం 76 డాలర్లకు పడిపోవడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని విశ్లేషకులు పేర్కొన్నారు. చమురు ధర భారీగా క్షీణించడంతో దిగుమతుల బిల్లు తగ్గి ద్రవ్యలోటు కట్టడికి వీలుచిక్కుతుందన్న ఆశలు ఇందుకు దోహదపడినట్లు తెలిపారు. ఇతర విశేషాలివీ... ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు మార్కెట్లకు అండగా నిలిచాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో యాక్సిస్, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, హీరోమోటో, ఐసీఐసీఐ 3-1.5% మధ్య పుంజుకున్నాయి. మిగిలిన బ్లూచిప్స్‌లో సిప్లా, టాటా పవర్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ, సన్ ఫార్మా 3-1% మధ్య నీరసించాయి. మిడ్ క్యాప్స్‌లో గతి, బేయర్ క్రాప్, ఉషా మార్టిన్, యూఫ్లెక్స్, మహారాష్ట్ర సీమ్‌లెస్, ఏఐఏ ఇంజినీంగ్, ఎంఅండ్ఎం ఫైనాన్స్, అశోక్ లేలాండ్, జిల్లెట్, ఫినొలెక్స్ కేబుల్స్ 17-7% మధ్య పెరిగాయి. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ 12-11 1,250 1,809 -559 11-11 1,181 1,698 -517 10-11 1,435 1,750 -315 ఎఫ్ఐఐ 12-11 4,113 3,653 459 11-11 4,444 3,986 458 10-11 4,292 3,936 355 (విలువలు రూ.కోట్లలో) -
నిఫ్టీ మరో కొత్త రికార్డు
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) ప్రధాన సూచీ మరో కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. మంగళవారం ట్రేడింగ్‌లో 18 పాయింట్లు పుంజుకుని తొలిసారి 8,363 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్ 35 పాయింట్లు బలపడి 27,910 వద్ద నిలిచింది. సెన్సెక్స్ తొలుత లాభాలతో మొదలై గరిష్టంగా 27,996ను తాకింది. ఆపై అమ్మకాలు పెరిగి మిడ్‌సెషన్‌లో 27,790 వద్ద కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్‌లో ప్రధానంగా ఎంఅండ్ఎం 2.5% పుంజుకోగా, టాటా స్టీల్, గెయిల్, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎల్అండ్టీ, రిలయన్స్ 2-1% మధ్య లాభపడ్డాయి. అయితే మరోవైపు బీహెచ్ఈఎల్ 2.5% పతనంకాగా, ఐటీసీ, భారతీ, ఇన్ఫోసిస్, కోల్ ఇండియా 2-1% మధ్య నష్టపోయాయి. కాగా, రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్, ఒబెరాయ్, డీబీ, ఇండియాబుల్స్ 3.5-1.5% మధ్య పురోగమించాయి. ట్రేడైన షేర్లలో 1,579 లాభపడగా, 1,433 నష్టపోయాయి. మరిన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలు రావాలి: బీఎస్ఈ ఎండీ న్యూఢిల్లీ: దేశీ పొదుపు సొమ్మును ఉత్పత్తికారక పెట్టుబడులుగా మార్చేందుకు వీలుగా మరిన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెరలేపాలని బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ సూచించారు. క్యాపిటల్ మార్కెట్ల వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ సూచన చేశారు. క్యాపిటల్ మార్కెట్లో లావాదేవీలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ, ఎంసీఎక్స్-ఎస్ఎక్స్ ట్రేడింగ్ విభాగం తేదీ కొనుగోలు అమ్మకం నికర విలువ డీఐఐ 11-11 1,181 1,698 - 517 10-11 1,435 1,750 -315 7-11 1,818 2,011 192 ఎఫ్ఐఐ 11-11 4,444 3,986 458 10-11 4 ,292 3,936 355 7-11 8,091 5,554 2,537 (విలువలు రూ.కోట్లలో) -
మార్కెట్ మరింత ముందుకే
వివిధ సానుకూల అంశాల నేపథ్యంలో ఈ వారం కూడా మార్కెట్లు మరింత ముందుకు సాగే అవకాశమున్నదని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2(జూలై-సెప్టెంబర్) ఫలితాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఇకపై ట్రెండ్‌ను నిర్దేశించనున్నాయని తెలిపారు. అయితే సెలవుల కారణంగా ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది. మంగళవారం(4న) మొహర్రం సందర్భంగా, గురువారం(6న) గురునానక్ జయంతి కారణంగా మార్కెట్లకు సెలవు. జపాన్ సహాయ ప్యాకేజీ పెంపు, అంచనాలను మించిన అమెరికా జీడీపీ వృద్ధి, మోదీ ప్రభుత్వ సంస్కరణలు వంటి అంశాలతో గత వారం మార్కెట్లు కొత్త రికార్డులను నెలకొల్పడం తెలిసిందే. సెన్సెక్స్ 1,015 పాయింట్లు(3.5%) ఎగసి 27,866 వద్ద నిలవగా, నిఫ్టీ 8,322 వద్ద స్థిరపడింది. అక్టోబర్ నెలకు వెల్లడవుతున్న సిమెంట్, ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలు మార్కెట్లకు కీలకంగా నిలవనున్నాయి. వీటితోపాటు ఈ వారంలో హెచ్ఎస్బీసీ పీఎంఐ తయారీ రంగం, సర్వీసుల రంగ గణాంకాలు సైతం విడుదలకానున్నాయి. బ్యాంకింగ్, ఆటో హవా మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న అప్‌ట్రెండ్ మరింత విస్తరిస్తుందని నమ్ముతున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ప్రధానంగా బ్యాంకింగ్, ఆటో రంగాలు మెరుగైన పనితీరును ప్రదర్శించే అవకాశముందని పేర్కొన్నారు. ఇదే తరహా అభిప్రాయాన్ని బొనాంజా పోర్ట్‌ఫోలియో అసోసియేట్ ఫండ్ మేనేజర్ హీరేన్ ఢకన్ సైతం వెల్లడించారు. సమీప కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,900-7,950 పాయింట్ల వద్ద కీలక మద్దతు లభిస్తుందని హీరేన్ అంచనా వేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలపై ఇన్వెస్టర్లు ప్రధానంగా దృష్టినిలుపుతారని కొటక్ సెక్యూరిటీస్ ప్రయివేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్ హెడ్ దీపేన్ షా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, జీఎస్టీ, భూసంస్కరణలు వంటి అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యూరోపియన్ కేంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ 6న వడ్డీ రేట్లపై నిర్ణయాలు ప్రకటించనున్నాయి. ఎల్అండ్టీ ఫలితాలు ఈ వారం క్యూ2 ఫలితాలు ప్రకటించనున్న బ్లూచిప్, మిడ్ క్యాప్ కంపెనీలలో ఎల్అండ్టీ, ఇంజనీర్స్ ఇండియా, అరబిందో ఫార్మా, కెనరా బ్యాంక్, జెట్ ఎయిర్వేస్, జిందాల్ స్టీల్, థెర్మాక్స్, డాబర్, మ్యారికో, సిండికేట్ బ్యాంక్, హెక్సావేర్, ఎంఎంటీసీ, నోవర్టిస్, సన్ టీవీ, యూకో బ్యాంక్ ఉన్నాయి. మరోవైపు ఎఫ్ఐఐల పెట్టుబడులు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల ధోరణి, చమురు ధరలు వంటి అంశాలు కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు వివరించారు. ఎల్ఐసీ రూ. 7,700 కోట్ల షేర్ల అమ్మకాలు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్ఐసీ జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలంలో రూ. 7,700 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించింది. ఈ వాటాలు 14 బ్లూచిప్ కంపెనీలకు చెందినవి. మరోవైపు ఇదే కాలంలో సెన్సెక్స్ కంపెనీలలో రూ. 5,000 కోట్లను ఇన్వెస్ట్ చేసింది. విప్రో, గెయిల్, భెల్, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్లోగల వాటాలను మాత్రం యథాతథంగా కొనసాగించింది. గత కొన్ని క్వార్టర్లుగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్‌యూఎల్‌లో ఎలాంటి వాటానూ కొనుగోలు చేయకపోవడం గమనార్హం. సెన్సెక్స్లోకెల్లా ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీలో అత్యధికంగా 16.97% వాటా ఎల్ఐసీకి ఉంది. కాగా, టీసీఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా పవర్‌లతోపాటు ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందాల్కోలలో వాటాలను కొంతమేర విక్రయించింది. ఆర్ఐఎల్, ఇన్ఫోసిస్, బజాజ్ఆటోలో వాటాను పెంచుకుంది. -
వెలుగులో చిన్న షేర్లు
మూడు రోజులుగా బలపడ్డ సెంటిమెంట్ చిన్న షేర్లకు టానిక్‌లా పనిచేస్తోంది. గత రెండు రోజుల్లో మార్కెట్లకు మించి పరుగు తీసిన బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మరోసారి 1.4% ఎగశాయి. వెరసి ట్రేడైన షేర్లలో 1,746 లాభపడితే, 1,188 మాత్రమే నష్టపోయాయి. ఇక మరోవైపు మార్కెట్లు రోజంతా స్వల్ప ఒడిదుడుకులకులోనై చివరికి నామమాత్ర లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 11 పాయింట్లు పెరిగి 25,561 వద్ద నిలిచింది. నిఫ్టీ మరింత అధికంగా 16 పాయింట్లు పుంజుకుని 7,640 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 554 పాయింట్లు జమ చేసుకుంది. ఎఫ్‌పీఐల పెట్టుబడుల జోరు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1,912 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా, దేశీ ఫండ్స్ రూ. 1,316 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. గురువారం ట్రేడింగ్‌లో ప్రధానంగా మెటల్స్, పవర్, వినియోగవస్తు రంగాలు 2%పైగా పురోగమించాయి. మెటల్ దిగ్గజాలు హిందాల్కో, టాటా స్టీల్, కోల్ ఇండియా, జిందాల్ స్టీల్, సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పుంజుకోగా, పవర్ షేర్లు సీఈఎస్సీ, టాటా పవర్, అదానీ పవర్, పీటీసీ, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, ఎన్టీపీసీ, రిలయన్స్ పవర్ 4-2% మధ్య ఎగశాయి. సెన్సెక్స్‌లో ఎంఅండ్ఎం 3%, బజాజ్ ఆటో 2% చొప్పున క్షీణించాయి. రెండు సంస్థలుగా క్రాంప్టన్ గ్రీవ్స్ వినియోగ వస్తువుల విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా విడదీసి లిస్ట్ చేయనుండటంతో క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 13% జంప్‌చేసింది. రూ. 211 వద్ద ముగిసింది. 2.3 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. వినియోగ వస్తు విభాగాన్ని (బీటూసీ) ప్రత్యేక కంపెనీగా విడదీసేందుకు బెల్జియం మాతృసంస్థ నిర్ణయించినట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ బీఎస్ఈకి తెలిపింది. ప్రధాన కంపెనీ చేతిలో విద్యుత్, పారిశ్రామిక, ఆటోమేషన్ ఉత్పత్తుల బిజినెస్ ఉంటుందని తెలియజేసింది. -
చివర్లో లాభాల గోల్
331 పాయింట్ల హైజంప్ 25,521కు ఎగసిన సెన్సెక్స్ నిఫ్టీ 98 పాయింట్లు ప్లస్ రెండు వారాల్లో గరిష్ట లాభం ఇరాక్ యుద్ధ భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 331 పాయింట్లు ఎగసి 25,521 వద్ద నిలిచింది. ఇది గత రెండు వారాల్లోనే అత్యధిక లాభంకాగా, నిఫ్టీ కూడా 98 పాయింట్లు పుంజుకుని 7,632 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది. గత రెండు రోజుల నష్టాలను తలపిస్తూ తొలుత అమ్మకాలు కొనసాగాయి. దీంతో సెన్సెక్స్ మిడ్ సెషన్లో 25,104 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆపై నెమ్మదిగా కోలుకుంటూ వచ్చింది. మధ్యాహ్నం రెండు తరువాత అన్ని వర్గాల నుంచీ కొనుగోళ్లు పెరగడంతో భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఒక దశలో గరిష్టంగా 25,546 పాయింట్ల వరకూ ఎగసింది. చివరికి అదే స్థాయిలో స్ధిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 386 పాయింట్లు పతనమైన విషయం విదితమే. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ఆయిల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ 3-1.5% మధ్య పురోగమించాయి. ఆయిల్ షేర్ల జోష్ అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ షేర్లు ఓఎన్జీసీ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఆర్ఐఎల్ 4-2.5% మధ్య పుంజుకున్నాయి. బ్యాంకింగ్ ఓకే బ్యాంకింగ్ దిగ్గజాలు యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 4-2.5% మధ్యలో పురోగమించగా, ఫెడరల్ బ్యాంక్, బీవోఐ, పీఎన్బీ, ఇండస్ఇండ్, బీవోబీ, కెనరా, యస్ బ్యాంక్ సైతం 5-3% మధ్య ఎగశాయి. బ్లూచిప్స్ జోరు ఇతర బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, భెల్, సెసాస్టెరిలైట్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, భారతీ, మారుతీ 3-2% మధ్య లాభపడ్డాయి. ఆరు మాత్రమే : సెన్సెక్స్లోఎంఅండ్ఎం, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో 1.5-0.5% మధ్య క్షీణించగా, సిప్లా నామమాత్రంగా నష్టపోయింది. చిన్న షేర్ల దూకుడు సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2% స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 2,046 లాభపడితే, 953 మాత్రమే నష్టపోయాయి. బీఎస్ఈ-500 పరుగు బీఎస్ఈ-500లో భాగమైన జేపీ ఇన్ఫ్రా, సియట్, హెచ్ఎంటీ, వ్యాబ్కో, చంబల్, సింటెక్స్, ఆర్సీఎఫ్, స్టెరిలైట్ టెక్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, మోతీలాల్ ఓస్వాల్, ఎంటీఎన్ఎల్, జేకే లక్ష్మీ సిమెంట్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గృహ్ ఫైనాన్స్ తదితరాలు 13-7% మధ్య దూసుకెళ్లాయి. -
ఆదుకున్న ఐటీ
రోజంతా ఒడిదుడుకులు చివరికి స్వల్ప లాభాలు ఒక దశలో 25,711కు సెన్సెక్స్ 25,584 వద్ద ముగింపు తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై అధిక భాగం నష్టాలకు లోనయ్యాయి. చివర్లో తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెషన్లో 25,711 పాయింట్ల వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో అమ్మకాలు పెరగడంతో కనిష్టంగా 25,347కు చేరింది. ఈ స్థాయి నుంచి 236 పాయింట్లు కోలుకుంది. వెరసి 3 పాయింట్ల లాభంతో 25,584 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ెహ చ్చుతగ్గులను చవిచూసి చివరికి 2 పాయింట్లు పెరిగి 7,656 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, మార్కెట్లను 2% స్థాయిలో పుంజుకున్న ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు ఆదుకున్నాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 3% పతనమైంది. ఎఫ్ఐఐల పెట్టుబడులు సోమవారం రూ. 537 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 682 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 1,215 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. సెన్సెక్స్‌లో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3-2% మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3-1% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరోమోటో, సెసాస్టెరిలైట్ 2.5% స్థాయిలో డీలాపడగా, యాక్సిస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ 1.5% చొప్పున నష్టపోయాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, ఇండియాబుల్స్, ఒబెరాయ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ 6-3% మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,834 లాభపడగా, 1,272 నష్టపోయాయి. -
టాటా స్టీల్ లాభం1,036 కోట్లు
ముంబై: టాటా స్టీల్ జనవరి-మార్చి(క్యూ4) కాలానికి రూ. 1,036 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అమ్మకాలు పుంజుకోవడం, దేశీయంగా మార్జిన్లు మెరుగుపడటం ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో కంపెనీ రూ.6,529 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలానికి ఆదాయం 22%పైగా ఎగసి రూ.42,428 కోట్లను తాకింది. యూరోపియన్ కార్యకలాపాలు పుంజుకోవడంతో నిర్వహణ మార్జిన్లు 2.57% మేర మెరుగుపడినట్లు గ్రూప్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ కౌశిక్ చటర్జీ పేర్కొన్నారు. కాగా, పూర్తిఏడాదికి(2013-14) కంపెనీ రూ. 3,595 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతంలో రూ. 7,058 కోట్ల నష్టాలను నమోదు చేసుకుంది. ఈ కాలంలో నికర అమ్మకాలు రూ. 1,33,538 కోట్ల నుంచి రూ. 1,47,347 కోట్లకు పెరిగాయి. -
చిన్న షేర్లకు డిమాండ్
స్టాక్ మార్కెట్ల జోరు కొసాగుతోంది. జీడీపీపై అంచనాలతో బుధవారం హైజంప్ చేసిన మార్కెట్లు గురువారం సైతం కొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 22,792ను తాకగా, నిఫ్టీ గరిష్టంగా 6,819ను చేరింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలు కాగా, అమ్మకాల ఒత్తిడితో ఇండెక్స్‌లు చివర్లో డీలాపడ్డాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 13 పాయింట్ల లాభంతో 22,715 వద్ద నిలవగా, నిఫ్టీ యథాతథంగా 6,796 వద్దే స్థిరపడింది. కాగా, ఇటీవల జోరుమీదున్న చిన్న షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మరోసారి దూసుకెళ్లాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మార్కెట్లను మించుతూ 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,551 లాభపడ్డాయి. 1,251 షేర్లు తిరోగమించాయి. మోడీ ఎఫెక్ట్‌తో అదానీ ఎంటర్ప్రైజెస్ 22% జంప్‌చేయడం విశేషం! క్యాపిటల్ గూడ్స్, రియల్టీ ఓకే బీఎస్ఈలో పవర్ ఇండెక్స్ 2.5% పుంజుకోగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% లాభపడ్డాయి. అయితే హెల్త్‌కేర్ అదే స్థాయిలో డీలాపడింది. పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో రిలయన్స్ ఇన్ఫ్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, పుంజ్‌లాయిడ్, క్రాంప్టన్ గ్రీవ్స్, జిందాల్ సా, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భెల్, ఎన్టీపీసీ, పీటీసీ, సద్భావ్ ఇంజినీరింగ్ 9-2.5% మధ్య దూసుకెళ్లాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఇండియాబుల్స్ 5.5-3% మధ్య బలపడ్డాయి. హెల్త్‌కేర్‌లో అరబిందో, స్ట్రైడ్స్, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా 3.5-2% మధ్య నీర సించాయి. మిడ్ క్యాప్స్ జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో ఎస్బీఐ 2.5%, హెచ్‌యూఎల్ 1.5% చొప్పున లాభపడగా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ 1%పైగా నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో బీఈఎంఎల్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టెయిన్లెస్, ఎస్ఆర్ఎఫ్, ఎస్సార్ ఆయిల్, ఎన్సీసీ, ఎడిల్వీజ్, శ్రేయీ ఇన్ఫ్రా, ఎస్సార్ పోర్ట్స్ 18-7% మధ్య ఎగశాయి. బుధవారం రూ. 1,044 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 343 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
6,600 దాటేసింది!
విదేశీ సానుకూల సంకేతాలు, దేశీయంగా పుంజుకున్న సెంటిమెంట్ మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి. దీనికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు జత కలుస్తున్నాయి. వెరసి స్టాక్ ఇండెక్స్‌లు మరోసారి రికార్డులు నెలకొల్పాయి. ప్రధానంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,600 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించడ ం బుధవారం ట్రేడింగ్‌లో విశేషం. 12 పాయింట్లు లాభపడి 6,601 వద్ద నిలిచింది. ఇక మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కూడా 40 పాయింట్లు బలపడి 22,095 వద్ద ముగిసింది. ఇవి కొత్త రికార్డులు! గత రెండు రోజుల్లో రూ. 2,700 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా దాదాపు రూ. 1,005 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేయడం ఇందుకు దోహదపడింది. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 356 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,172ను తాకగా, నిఫ్టీ 6,627ను చేరింది. ఇవి మార్కెట్ చరిత్రలోనే గరిష్ట స్థాయిలు! ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్ల దూకుడుకి సహకరిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. మెటల్స్ జోరు గోవాలో మైనింగ్‌పై నిషేధం తొలగనుందన్న వార్తలతో బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 3% ఎగసింది. సెయిల్, సెసాస్టెరిలైట్, హిందాల్కో, జిందాల్ స్టీల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ 6-2% మధ్య పురోగమించాయి. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ రంగాలు 1.5% స్థాయిలో పుంజుకోగా, హెల్త్‌కేర్ మాత్రం 2% నష్టపోయింది. గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, సన్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, దివీస్ 4-2% మధ్య నీరసించాయి. ఇక మిగిలిన దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ, గెయిల్, ఆర్ఐఎల్, బజాజ్ ఆటో, భారతీ 2.7-1.2% మధ్య బలపడగా, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఐటీసీ 2-1% మధ్య డీలాపడ్డాయి. మార్కెట్లు లాభపడినప్పటికీ ట్రేడైన షేర్లలో 1,610 నష్టపోగా, 1,272 లాభపడ్డాయి. -
ఫార్చూన్ ప్రశంసనీయ కంపెనీల్లో...టాటా స్టీల్, ఓఎన్జీసీ
న్యూయార్క్: ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండు భారతీయ కంపెనీలు-టాటా స్టీల్, ఓఎన్‌జీసీలకు చోటు లభించింది. ఫార్చూన్ మ్యాగజైన్ 350 గ్లోబల్ కంపెనీలతో ఈ జాబితాను రూపొందించింది. వరుసగా ఏడో ఏడాది కూడా యాపిల్ కంపెనీయే ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. కాగా టాటా స్టీల్, ఓఎన్జీసీలు టాప్ 50లో చోటు సంపాదించలేకపోయాయి. అగ్రశ్రేణి మెటల్ కంపెనీల జాబితాలో నాలుగో స్థానంలో టాటా స్టీల్ నిలిచింది. గత ఏడాది జాబితాలో ఈ కంపెనీ ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది మైనింగ్, ముడి చమురు ఉత్పత్తి కేటగిరిలో పదో స్థానంలో నిలిచిన ఓఎన్జీసీ ఈ ఏడాది ఏడో స్థానానికి ఎగబాకింది. అంతర్జాతీయ అగ్రశ్రేణి ప్రశంసనీయ కంపెనీల జాబితాలో రెండో స్థానంలో ఆన్లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ డాట్‌కామ్ నిలిచింది. ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 3వ స్థానం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక ఆ తర్వాతి స్థానాల్లో కాఫీ దిగ్గజం స్టార్‌బక్స్ (5వ స్థానం), కోకకోలా(6)లు ఉన్నాయి. ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర కంపెనీలు, నైక్ (13వ స్థానం), ఐబీఎం(16), మైక్రోసాఫ్ట్(24), వాల్‌మార్ట్(28), జేపీ మోర్గాన్ చేజ్(30), గోల్డ్‌మాన్ శాచ్స్(34), ఫేస్బుక్(38), పెప్సికో(42వ స్థానం). -
4 రోజుల లాభాలకు బ్రేక్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. టెలికం షేర్లతోపాటు ఐటీ, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు నీరసించడంతో మార్కెట్లు నాలుగు రోజుల తరువాత మళ్లీ వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 42 పాయింట్లు నష్టపోయి 20,334 వద్ద ముగిసింది. తొలుత లాభాలతో మొదలైనప్పటికీ రోజు మొత్తం పలుమార్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఇక నిఫ్టీ కూడా 10 పాయింట్లు క్షీణించి 6,053 వద్ద నిలిచింది. ఎఫ్ఐఐల వెనకడుగు శుక్రవారం రూ. 267 కోట్ల విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 455 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 295 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. స్పెక్ట్రమ్ వేలం ధర పెరుగుతున్న నేపథ్యంలో టెలికం షేర్లలో ఒత్తిడి కనిపించింది. ఐడియా 8.5% పతనంకాగా, ఆర్‌కామ్ 4%, భారతీ 3% చొప్పున క్షీణించాయి. ఇతర దిగ్గజాలలో టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ 2-1% మధ్య నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, మారుతీ, ఎల్అండ్టీ, ఓఎన్జీసీ, ఆర్ఐఎల్ 2-1% మధ్య లాభపడ్డాయి. అమన్ రిసార్ట్స్ విక్రయ వార్తలతో డీఎల్ఎఫ్ 3% పుంజుకుంది. -
ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు
ప్రపంచ మార్కెట్ల బలహీనత, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం 94 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్టస్థాయి 20,693 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 6,162 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 477 పాయింట్లు కోల్పోయింది. ఎఫ్ఐఐలు వరుసగా రెండురోజుల పాటు విక్రయాలు జరపడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెవీవెయిట్ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గడంతో సూచీలు క్షీణించాయి. మెటల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. టాటా స్టీల్, సేసా స్టెరిలైట్, హిందాల్కోలు 2-3% తగ్గగా, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 1-2% పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో (ఎఫ్ఐఐలు) ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా వారు ఇటీవల వర్ధమాన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఎఫ్ఐఐలు మరో రూ. 567 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి అదేపనిగా అమ్మకాలు జరుపుతున్న దేశీయ సంస్థలు మాత్రం తాజాగా రూ. 59.44 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. రిలయన్స్ కౌంటర్లో పెరిగిన ఓపెన్ ఇంట్రస్ట్: ఐదు రోజుల నుంచి వరుస నష్టాలు చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) భారీగా పెరిగింది. మూడు నెలలుగా మద్దతునిస్తున్న రూ. 840 సమీపస్థాయిలోనే రిలయన్స్ ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు క్రితంరోజులానే రూ. 7 ప్రీమియంతో క్లోజయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఓఐలో 7.12 లక్షల షేర్లు యాడ్‌కాగా, మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు పెరిగింది. ఆర్ఐఎల్ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ ఇంతభారీగా పెరగడం అరుదు. రూ. 860 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరగడంతో 2.65 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.12 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 840 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్లో 83 వేల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 3.05 లక్షల షేర్లకు చేరింది. ఫ్యూచర్ కాంట్రాక్టులో గరిష్టస్థాయి ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వున్నందున, సమీప భవిష్యత్తులో ఈ షేరు ఏదో ఒకవైపు వేగంగా కదలవచ్చు. అయితే రూ. 860 స్థాయిని అధిగమించలేకపోతే రిలయన్స్ దిగువవైపుగా ప్రయాణించవచ్చని, ఆ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే ర్యాలీ జరపవచ్చని ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది. -
తొలి లాభాలు ఆవిరి
ఫెడ్ ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణపై సందిగ్దత కొనసాగడంతో స్టాక్ సూచీలు వరుసగా మూడోరోజూ నష్టాలతో ముగిసాయి. నిరుద్యోగుల సంఖ్య తగ్గినట్లు గత రాత్రి అమెరికాలో డేటా వెలువడటంతో అక్కడి మార్కెట్ ర్యాలీ జరిపిన నేపథ్యంలో శుక్రవారంనాడిక్కడ ట్రేడింగ్ తొలిదశలో సూచీలు పెరిగాయి. ఒకదశలో 159 పాయింట్లవరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ముగింపు సమయంలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొని 20,217 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 12 పాయింట్లు నష్టపోయింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ తొలుత 6,050 స్థాయివరకూ పెరిగి, చివరకు 3 పాయింట్ల నష్టంతో 5,995 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. గత మూడురోజుల్లో 673 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ నష్టాలతో ముగియడం వరుసగా ఇది మూడోవారం. ఈ వారంలో తొలి రెండురోజుల్లో ర్యాలీ జరపడంతో చివరకు అంతక్రితంవారంకంటే 182 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ మరింత పెరగకపోవొచ్చన్న అంచనాలు, మరో నాలుగురోజుల్లో నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. నెలరోజుల నుంచి అదేపనిగా పెట్టుబడులు చేస్తున్న విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) హఠాత్తుగా కొనుగోళ్లు నిలిపివేయడం కూడా క్షీణతకు కారణమని ఆ వర్గాలు వివరించాయి. క్రితం రోజు రూ. 60 కోట్లు నికర విక్రయాలు జరిపిన ఎఫ్ఐఐలు శుక్రవారం రూ. 3 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కుతీసుకున్నట్లు సెబి గణాంకాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ షేర్లు తగ్గాయి. టాటా మోటార్స్, బజాజ్ ఆటో, ఐటీసీ, ఎస్బీఐ, ఐసీఐసీఐలు 1-3% మద్య క్షీణించాయి. మెటల్ షేర్లలో సేసా స్టెరిలైట్, ఎన్‌ఎండీసీలు తగ్గగా, టాటా స్టీల్, జిందాల్ స్టీల్‌లు పెరిగాయి. 6,000 స్ట్రయిక్‌పై టార్గెట్ ఎన్ఎస్ఈ స్పాట్ నిఫ్టీ వరుసగా రెండోరోజు 6,000 స్థాయికి అటూఇటూ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైనా, దాదాపు క్రితంరోజులానే శుక్రవారం కూడా నిఫ్టీ ఆ స్థాయి దిగువన ముగిసింది. అయినా 6,000 స్థాయి టార్గెట్‌గా అటు కాల్, పుట్ ఆప్షన్ల రైటింగ్ జోరుగా సాగింది. దాంతో ఈ పుట్ ఆప్షన్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 9.03 లక్షల షేర్లు (16 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 66.44 లక్షల షేర్లకు పెరిగింది. కాల్ ఆప్షన్ ఓఐలో 10.69 లక్షల షేర్లు (33 శాతం) యాడ్‌కాగా, మొత్తం ఓఐ 42,50 లక్షల షేర్లకు చేరింది. డెరివేటివ్ మార్కెట్లో చురుగ్గా ట్రేడ్‌చేసే విదేశీ ఇన్వెస్టర్లు నిఫ్టీని ఈ స్థాయి నుంచి ఎటుతీసుకెళ్లాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఈ ఆప్షన్ డేటా వెల్లడిస్తున్నది. నవంబర్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ వచ్చే గురువారం ముగియనున్నందున, ఇదేస్థాయి వద్ద నిఫ్టీని నిలిపివుంచడం సాధ్యం కూడా కాదు. అందుచేత వచ్చే వారం ప్రధమార్థంలో నిఫ్టీ 6,000స్థాయిపైన నిలదొక్కుకుంటే వేగంగా 100 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చని, 6,000 స్థాయిని వదులుకుంటే నిలువునా పతనంకావొచ్చన్నది ఈ ఆప్షన్ బిల్డప్ అంతరార్థం. నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి మాత్రం లాంగ్ అన్‌వైండింగ్ కొనసాగింది. ఈ కాంట్రాక్టు ఓఐలో మరో 1.23 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓఐ 1.51 కోట్ల షేర్లకు తగ్గింది. నిఫ్టీ డిసెంబర్ ఫ్యూచర్లో తాజాగా 16 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 73 లక్షల షేర్లకు పెరిగింది. -
దివాలా కోరల్లో కార్పొరేట్ భారత్!
ముంబై: భారత కార్పొరేట్ కంపెనీల మెడపై దివాలా కత్తి వేలాడుతోంది. ఆర్థిక మందగమనానికి తోడు దేశీయంగా వినియోగ డిమాండ్ పడిపోవడం పారిశ్రామిక రంగాన్ని తూట్లు పొడుస్తోంది. భవిష్యత్తుపై భారీ ఆశలతో ఎడాపెడా అప్పులు చేసి విస్తరణకు పరుగులు తీసిన కంపెనీలు ఇప్పుడు చివురుటాకుల్లా వణుకుతున్నాయి. తీసుకున్న రుణాలు యమపాశాల్లా మారుతున్నాయి. ఇవేవో అల్లాటప్పా చిన్నకంపెనీలనుకుంటే పొరపాటే. దేశంలో టాప్ కంపెనీల్లో అనేకం ఇదే బాటలో నడుస్తున్నాయి. దేశంలోని అగ్రగామి కార్పొరేట్ సంస్థల్లో మూడోవంతు ఇప్పుడు ఆర్థికంగా చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(బీఎస్ఈ) 500 టాప్ కంపెనీల ఇండెక్స్‌లో 143 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(మొత్తం షేర్ల విలువ) కంటే వాటి అప్పులే అధికం కావడం గమనార్హం. నాన్-బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలు మినహా మొత్తం 406 కంపెనీల్లో మూడో వంతు కంపెనీలు(ఇప్పటిదాకా ఆర్థిక ఫలితాలను ప్రకటించినవాటిలో) తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. రుణాలు గుదిబండగా మారడంతో వడ్డీలు అధికమై కంపెనీల లాభాలు ఆవిరవుతున్నాయి. డిమాండ్ పడిపోవడం కూడా లాభదాయకతను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దీంతో షేరు ధర పాతాళానికి జారిపోయి మార్కెట్ క్యాప్ కుదేలయ్యేలా చేస్తోంది. ఇవన్నీ ఆయా కంపెనీల మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకొని మొదలుపెట్టిన ప్రాజెక్టులు ముందుకు సాగడంలేదు. షేరు ధర అట్టడుగుకు పడిపోవడంతో నిధులను సమీకరించే పరిస్థితులు లేవు. మరోపక్క, అధిక వడ్డీరేట్లు కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో అప్పులు మొండిబకాయిలుగా మారడంతో బ్యాంకులు కూడా కార్పొరేట్లకు రుణాలపై వెనుకంజ వేస్తున్నాయి. ఇన్వెస్టర్లు దూరం... ప్రాజెక్టు వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఆర్థిక వ్యవస్థ మందగమనం, అధిక వడ్డీరేట్లు వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో కంపెనీలు చేపట్టిన ప్రాజెక్టులు ఆర్థికంగా లాభదాయకం కాదని ఇన్వెస్టర్లు ఒక నిశ్చయానికి వస్తున్నారు. అప్పుల భారం, లాభదాయకంకాని ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రస్తుత ప్రతికూల ఆర్థిక వాతావరణం కారణంగా అనేకమంది ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు అవసరమయ్యే కంపెనీల షేర్లకు దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఈ 143 కంపెనీల నిర్వహణ లాభాలు బీఎస్ఈ-500(నాన్‌ఫైనాన్షియల్ సంస్థల్లో) జాబితాలోని మొత్తం కంపెనీలతో పోలిస్తే మూడో వంతు కూడా లేకపోవడం ఇన్వెస్టర్ల వెనుకంజకు కారణమనేది నిపుణుల విశ్లేషణ. ఇక మొత్తం కంపెనీల లాభాల్లో(క్యాష్) వీటి వాటా ఐదోవంతు మాత్రమే. ఇదే తరుణంలో అప్పులు మాత్రం 71 శాతం, స్థిర ఆస్తులు సగానికిపైగా ఉండటం గమనార్హం. ఇక జూలైలో స్టాక్‌మార్కెట్ మొత్తం మార్కెట్ క్యాప్‌లో వీటి వాటా కేవలం 14 శాతమే కావడం విశేషం. కాగా, ఒక్కసారి వృద్ధి పుంజుకుంటే వీటికి నగదు ప్రవాహాలు పెరుగుతాయని, రుణాల చెల్లింపులకు మార్గం సుగమం అవుతుందని ఇండియా రేటింగ్స్ డెరైక్టర్ దీప్ నారాయణ్ ముఖర్జీ అంటున్నారు. ముఖ్యంగా అత్యధికంగా కార్పొరేట్ రుణాలతో ముడిపడిన ప్రాజెక్టులు మెటల్స్, మైనింగ్, విద్యుత్, చమురు-గ్యాస్ రంగాల్లోనే ఉన్నాయి. ఇక అప్పుల భారంతో బాగా సమస్యలు ఎదుర్కొంటున్న వాటిలో రియల్టీ, రిటైల్, విద్య, నిర్మాణ రంగాలు ముందువరుసలో ఉన్నట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. అప్పుల కుప్పలు... క్యాపిటలైన్ తాజా గణాంకాల ప్రకారం ఈ ఏడాది మార్చి చివరినాటికి బీఎస్ఈ-500లోని ఈ 143 కంపెనీల మొత్తం అప్పులు రూ.13.2 లక్షల కోట్లుగా అంచనా. జూలై నాటికి వీటి సగటు మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే రుణాలు దాదాపు రెండింతలయ్యాయి. రెండేళ్ల క్రితం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. 2011 జూలైలో ఈ కంపెనీల మార్కెట్ విలువ వాటి నికర రుణాల కంటే 40 శాతం అధికంగా ఉంది. రెండేళ్లు తిరిగేసరికి అంతా తలకిందులైంది. రుణాలు 61 శాతం ఎగబాకి.. మార్కెట్ క్యాప్ 40 శాతం పడిపోయింది. దీంతో ప్రాజెక్టులకు ఈక్విటీ ఆధారిత నిధుల సమీకరణకు తలుపులు మూసుకుపోయాయి. అంతేకాదు రుణాల తిరిగి చెల్లింపుల విషయంలోనూ చేతులెత్తేసేలా సంక్షోభంలోకి కూరుకుపోయాయి. అప్పుల కుప్పలుగా తయారైన కంపెనీల జాబితాలో టాటా స్టీల్, హిందాల్కో, టాటా పవర్, ఎల్అండ్టీ, జేపీ అసోసియేట్స్, అదానీ పవర్, జీఎంఆర్ ఇన్ఫ్రా, జీవీకే పవర్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ ఇన్ఫ్రా, శ్రీరేణుకా సుగర్స్, బజాజ్ హిందుస్థాన్, సుజ్లాన్ వంటి అనేక దిగ్గజాలు ఉన్నాయి. -
మిస్త్రీని నిలదీసిన వాటాదారులు
ముంబై: టాటా స్టీల్ చైర్మన్ సైరస్ మిస్త్రీకి తొలిసారి ఆ సంస్థ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వాటాదారుల నుంచి కఠిన ప్రశ్నలు ఎదురయ్యాయి. టాప్ మేనేజ్మెంట్లో జీతాలు పెరుగుతున్నప్పటికీ వాటాదారులకు చెల్లించే డివిడెండ్ తగ్గడంపై నిరసన వ్యక్తమైంది. 2007-08లో షేరుకి రూ. 16 డివిడెండ్‌ను చెల్లించగా, ప్రస్తుతం రూ. 8కి పడిపోవడంపై ఒక వాటాదారుడు సైరస్ను నిలదీశాడు. అయితే ప్రపంచస్థాయిలో స్టీల్‌కు డిమాండ్ పడిపోయిందని, దీంతో కంపెనీ లాభాలు సైతం భారీగా క్షీణించాయని సైరస్ వివరణ ఇచ్చారు. ఇదే సమయంలో కంపెనీ విస్తరణ బాటలో ఉన్నందువల్ల కొంత డివిడెండ్‌ను తగ్గించాల్సి వచ్చిందని వివరించారు.