ట్రాన్స్‌జెండర్లకు ప్రతిష్టాత్మక టాటా కంపెనీలో ఉద్యోగాలు రానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పలు రకాల ఉద్యోగాల కోసం ట్రాన్స్‌జెండర్ అభ్యర్థుల నుంచి టాటా స్టీల్ దరఖాస్తులు కోరుతోంది.
ఇంగ్లిష్‌లో మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేషన్ లేదా ఏఐసీటీఈ/ యూజీసీ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో, ఏదైనా విభాగంలో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 15 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి, తుది ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామని సంస్థ వెల్లడించింది.
ఇదీ చదవండి: భారత్‌లో టాప్ బిజినెస్ స్కూల్ ఇదే..
2022 ఫిబ్రవరిలో కూడా టాటా స్టీల్ 12 మంది క్రేన్ ఆపరేటర్ ట్రైనీలుగా ట్రాన్స్‌జెండర్లను ఒడిశాలోని కళింగనగర్ ప్లాంటు కోసం నియమించుకుంది. దీనికి ముందు గనుల్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ (హెచ్‌ఈఎంఎం) కార్యకలాపాల కోసం, ఝార్ఖండ్‌లోని వెస్ట్ బొకారో కోసం 14 మంది ట్రాన్స్‌జెండర్లను ఎంపిక చేసింది. 2025 నాటికి 25శాతం లింగవైవిధ్యం కలిగిన ఉద్యోగులు ఉండేలా చూడాలని టాటా స్టీల్ లక్ష్యంగా పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment