రతన్ టాటా తన 86వ ఏట అక్టోబర్ 9న ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనేక గొప్ప విజయాలు, దాతృత్వ కార్యక్రమాలతో నిండిన ఈయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. టాటా స్టీల్ కంపెనీ కోసం ఒక అమెరికన్ సంస్థలో జాబ్ ఆఫర్‌ను సైతం రతన్ టాటా అవలీలగా వదులుకున్న సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం..
ఐబీఎమ్ కంపెనీ ఆఫర్
1961లో రతన్ టాటాకు అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.
ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా టాటా స్టీల్
దశాబ్దాల చరిత్ర కలిగిన టాటా స్టీల్ కంపెనీను జంషెడ్‌జీ టాటా 1907లో ప్రారంభించారు. ఇదే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్టీల్ కంపెనీగా అవతరించింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు, ఆ తరువాత ఈ సంస్థ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అభివృద్ధి పనుల కోసం దేశానికి ఉక్కు చాలా అవసరం అయినప్పుడు, టాటా స్టీల్ దేశాభివృద్ధికి భుజం భుజం కలిపి నిలబడింది. ఈ కంపెనీ దేశ ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచింది.
ప్రస్తుతం టాటా స్టీల్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ షేరు ప్రస్తుత విలువ రూ.159. అయితే రతన్ టాటా జాబ్ ఆఫర్ వద్దనుకున్న కంపెనీ.. ఐబీఎమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 18 లక్షల కోట్లుగా ఉంది. ఇది టాటా స్టీల్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దది.
ఇదీ చదవండి: వీటిపై జీఎస్‌టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలు
టాటా స్టీల్‌తో రతన్ టాటా సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ కంపెనీ ఆయన కెరీర్‌ను ప్రారంభించడమే కాకుండా.. నాయకత్వ నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ వంటి విలువైన పాఠాలను కూడా నేర్పింది. టాటా స్టీల్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. దేశాభివృద్ధికి మాత్రమే.. సమాజ శ్రేయస్సును మెరుగుపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment