ibm
-
ఆ కంపెనీలో జాబ్ ఆఫర్ వదులుకున్న రతన్ టాటా: ఎందుకంటే..
రతన్ టాటా తన 86వ ఏట అక్టోబర్ 9న ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. అనేక గొప్ప విజయాలు, దాతృత్వ కార్యక్రమాలతో నిండిన ఈయన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. టాటా స్టీల్ కంపెనీ కోసం ఒక అమెరికన్ సంస్థలో జాబ్ ఆఫర్‌ను సైతం రతన్ టాటా అవలీలగా వదులుకున్న సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఈ కథనంలో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా చూసేద్దాం..ఐబీఎమ్ కంపెనీ ఆఫర్1961లో రతన్ టాటాకు అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన 'ఐబీఎమ్' నుంచి జాబ్ వచ్చింది. తన ప్రతిభను వేరొక కంపెనీ వృద్ధికి ఉపయోగించడానికి రతన్ టాటా మనసు ఒప్పుకోలేదు. ఐబీఎమ్ కంపెనీలో వచ్చిన ఆఫర్ వదులుకుని టాటా స్టీల్‌కు నాయకత్వం వహించారు. ఈయన నాయకత్వంలో కంపెనీ అపారమైన వృద్ధి సాధించగలిగింది.ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా టాటా స్టీల్దశాబ్దాల చరిత్ర కలిగిన టాటా స్టీల్ కంపెనీను జంషెడ్జీ టాటా 1907లో ప్రారంభించారు. ఇదే భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ స్టీల్ కంపెనీగా అవతరించింది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు, ఆ తరువాత ఈ సంస్థ పారిశ్రామిక ప్రగతిలో కీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో అభివృద్ధి పనుల కోసం దేశానికి ఉక్కు చాలా అవసరం అయినప్పుడు, టాటా స్టీల్ దేశాభివృద్ధికి భుజం భుజం కలిపి నిలబడింది. ఈ కంపెనీ దేశ ఉక్కు ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచింది.ప్రస్తుతం టాటా స్టీల్ విలువ దాదాపు రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ కంపెనీ షేరు ప్రస్తుత విలువ రూ.159. అయితే రతన్ టాటా జాబ్ ఆఫర్ వద్దనుకున్న కంపెనీ.. ఐబీఎమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 18 లక్షల కోట్లుగా ఉంది. ఇది టాటా స్టీల్ కంటే దాదాపు తొమ్మిది రెట్లు పెద్దది.ఇదీ చదవండి: వీటిపై జీఎస్టీ తగ్గింపు.. భారీగా తగ్గనున్న ధరలుటాటా స్టీల్‌తో రతన్ టాటా సంబంధం చాలా ప్రత్యేకమైనది. ఈ కంపెనీ ఆయన కెరీర్‌ను ప్రారంభించడమే కాకుండా.. నాయకత్వ నైపుణ్యాలు, వ్యాపార నిర్వహణ వంటి విలువైన పాఠాలను కూడా నేర్పింది. టాటా స్టీల్ భారతదేశంలోని అత్యంత విశ్వసనీయ కంపెనీలలో ఒకటిగా నిలిచింది. దేశాభివృద్ధికి మాత్రమే.. సమాజ శ్రేయస్సును మెరుగుపరచడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. -
ఈ ఏఐ స్కిల్‌కి క్రేజీ డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు!
కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అన్నింటా ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక భయాలు, సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఏఐ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది.. దానికి సిద్ధంగా ఉన్నామా.. వెనుకబడిపోతామా అన్న భయంతో అవసరమైన ఏఐ నైపుణ్యం కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, దాదాపు 96 శాతం మంది కంపెనీల అధినేతలు తమ సంస్థల నిర్వహణలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. 2024 మార్చిలో స్లాక్ వర్క్‌ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది కార్యాలయ ఉద్యోగులు తాము ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయలేదని అంగీకరిస్తున్నారు.ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం మానేసే వారు కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడింట్ లిడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌ను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కర్లేదని ఆమె చెబుతున్నారు.అంత డిమాండ్ ఎందుకంటే..ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాలలో ఒకటైన చాట్‌జీపీటీని మీరు ఉపయోగించినట్లయితే, మీ ప్రాంప్ట్ లు ఎంత కచ్చితమైనవి అయితే, ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని మీరు గమనించే ఉంటారు. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కు ఇంత డిమాండ్ ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన ఎంప్లాయర్ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్‌జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ చాట్బాట్లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు. ఈ జాబ్ కోసం బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేకపోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు వంటి సరికొత్త ఉద్యోగాలకు సాంప్రదాయ డిగ్రీల కంటే టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్‌కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వివరించారు.ప్రాంప్ట్ ఇంజనీర్‌కు భారత్‌లో జీతాలు ఇలా..లింక్డ్ఇన్, జాబ్-సెర్చ్ సైట్ ఇన్డీడ్లోని లిస్టింగ్స్ ప్రకారం కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్‌కు సంవత్సరానికి రూ .93 లక్షల నుంచి రూ .16 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్‌లో 2-5 ఏళ్ల అనుభవం ఉన్న ఇంజినీర్ ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సంపాదించవచ్చు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు వార్షిక వేతనం రూ .12 లక్షలు దాటి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. -
ఏడు నిమిషాల్లో ఊడిన ఉద్యోగాలు
సాఫ్ట్వేర్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట నిత్యం ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కరోనా సమయంలో దాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని ఉద్యోగాలు తొలగించాయి. అంతర్జాతీయ యుద్ధ భయాలు, ఆర్థికమాంద్యం అంటూ ఇంకొన్ని ఉద్యోగాలు తొలగించారు. ప్రస్తుతం ఏఐ సాకు చెబుతూ మరికొంతమందిని ఇంటిబాట పట్టిస్తున్నారు. తాజాగా దిగ్గజ కంపెనీ అయిన ఐబీఎం మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్న తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఐబీఎం చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జొనాథన్ అదాషేక్ ఇటీవల సమావేశం నిర్వహించి.. మార్కెటింగ్, కమ్యూనికేషన్ విభాగాల్లో లేఆఫ్‌లు చేస్తున్నామని ప్రకటించినట్లు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే, కేవలం ఏడు నిమిషాల సమావేశంలో ఈ తొలగింపులపై ప్రకటన రావడంతో ఉద్యోగులు కంగు తిన్నారు. ఎంతమందిని తొలగించారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదు. ఇదీ చదవండి: మానవ మెదడుతో ఏదీ సరితూగదు.. ఏఐని తలదన్నే ఉద్యోగాలివే.. ఐబీఎం కార్యకలాపాల్లో భవిష్యత్తులో కృతిమ మేధను భాగం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ నిర్ణయం తీసుకున్నారు. దాంతో రానున్న రోజుల్లో కొత్త నియామకాలను నిలిపివేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీలో దాదాపు 30శాతం ఉద్యోగుల స్థానంలో ఏఐని తీసుకురానున్నామని చెప్పారు. -
‘ఇష్టంలేని పని ఇంకెన్నాళ్లు.. వెంటనే రాజీనామా చేయండి’
పెరుగుతున్న ఆర్థికమాంద్యం భయాల నేపథ్యంలో చాలా టెక్ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరిట ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అందులో కొన్ని కంపెనీలు నేరుగా ఉద్యోగులకు కొలువుల నుంచి తొలగించినట్లు మెయిల్ పంపుతున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఉద్యోగులనే వారి కొలువులకు రాజీనామా చేయాలని కోరుతున్నాయి. ఇప్పటికే కంపెనీ మారాలనుకుంటున్న వారికి ఇదో అవకాశంగా ఆ కంపెనీలు చెబుతున్నాయి. ఉద్యోగుల సంఖ్యను కుదించాలని యోచిస్తున్న ఐబీఎం ఉద్యోగులను స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరుతోంది. కంపెనీలో పనిచేయాలని కోరుకోని వారు స్వచ్ఛందంగా తప్పుకోవచ్చని ఐబీఎం చెబుతోంది. ఇష్టంలేని పని చేయకూడదని చెప్పింది. ఐబీఎం నుంచి బయటకు వెళ్లాలని కోరుకోని ఉద్యోగులను మాత్రం కంపెనీ తొలగించాలనుకోవడం లేదని ఓ వార్తా కథనం ద్వారా తెలిసింది. ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో ఐబీఎం ధోరణిలో మార్పు కనిపిస్తోంది. స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని భావించే ఉద్యోగులు ముందుకు రావాలని ఐబీఎం కోరుతోంది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించే క్రమంలో కంపెనీ చేపట్టే చర్యల్లో ఇది ఓ భాగమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఐబీఎం ఈ చర్యను రిసోర్స్ యాక్షన్‌గా అభివర్ణిస్తోంది. ఇదీ చదవండి: ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు గత నెలలో నాలుగో త్రైమాసిక ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా స్వచ్ఛంద రాజీనామాల ప్రతిపాదనకు కంపెనీ ఆమోదం తెలిపింది. కంపెనీని వీడటం ఇష్టం లేని వారిని లేఆఫ్స్‌తో తొలగించడం కంటే స్వచ్ఛందంగా తప్పుకునే ఉద్దేశం ఉన్న ఉద్యోగులను గుర్తించాలని ఐబీఎం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది. -
IBM Report: దేశీయంగా మెజారిటీ సంస్థల్లో ఏఐ వినియోగం
న్యూఢిల్లీ: దేశీయంగా చాలా మటుకు పెద్ద కంపెనీలు (1,000 మందికి పైగా ఉద్యోగులున్నవి) కృత్రిమ మేథను (ఏఐ) వినియోగిస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో పాల్గొ్న్న వాటిల్లో దాదాపు 59 శాతం సంస్థలు ఏఐని వినియోగిస్తున్నట్లు తెలిపాయి. ఐబీఎం గ్లోబల్ ఏఐ వినియోగ సూచీ 2023 ప్రకారం ఇప్పటికే ఏఐ వినియోగిస్తున్న కంపెనీల్లో 74 శాతం సంస్థలు గడిచిన 24 నెలల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు, ఉద్యోగులకు శిక్షణపై గణనీయంగా పెట్టుబడులు పెంచాయి. ఏఐ వినియోగానికి సంబంధించి సరైన నైపుణ్యాలున్న ఉద్యోగులు దొరకడం, నైతికతపరమైన అంశాలు సవాళ్లుగా ఉంటున్నాయి. వ్యాపార సంస్థలు తమ కార్యకలాపాల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించుకోవడంలో ఇవే ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. ‘భారతీయ సంస్థల్లో ఏఐ వినియోగం, దానిపై పెట్టుబడులు పెట్టడం తద్వారా సానుకూల ప్రయోజనాలు పొందుతూ ఉండటం ఒక శుభ సంకేతం. ఇప్పటికీ కాస్త సందేహిస్తున్న చాలా మటుకు వ్యాపారాలు ఇకనైనా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలి‘ అని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. కృత్రిమ మేథ ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే డేటా, ఏఐ గవర్నెన్స్ కీలకంగా ఉంటాయని పేర్కొన్నారు. గవర్నెన్స్ సాధనాలను ఉపయోగించకపోతే ఏఐ వల్ల కంపెనీలకు డేటా గోప్యత, లీగల్పరమైన సవాళ్లు, నైతికతపరమైన సందిగ్ధత వంటి సమస్యలు ఎదురు కావచ్చని సందీప్ పటేల్ వివరించారు. భారత్, ఆ్రస్టేలియా, కెనడా తదితర దేశాలకు చెందిన 8,584 మంది ఐటీ ప్రొఫెషనల్స్‌పై ఐబీఎం ఈ సర్వే నిర్వహించింది. -
పురోగతిలో భారత్.. వారికే ఉద్యోగావకాశాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో చాలామంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నప్పటికీ.. ఇందులో నైపుణ్యం కలిగిన వారికి మాత్రం బోలెడన్ని అవకాశాలు లభిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చుకుంటే.. ఏఐలో భారత్ గణనీయమైన వాటా కలిగి ఉంది. ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా అభివృద్ధి చేయడం కోసం మాత్రమే కాకుండా, నైపుణ్యాలను ఎలా పెంచుకోవాలో కూడా పరిశ్రమతో భాగస్వామ్యం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగానే కొన్ని రోజులకు ముందు కేంద్ర ఆర్ధికమంత్రి కూడా మారుతున్న టెక్నాలజీలో నైపుణ్యం పెంపొందించుకోవాలి.. లేకుంటే ఉద్యోగాలకు గ్యారెంటీ ఉండదని స్పష్టం చేశారు. ఏఐ ఆవశ్యకత గురించి ఐబీఎమ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ మాట్లాడుతూ.. ఏఐతో ఆత్మ నిర్భర్ లక్ష్యం సాధించాలంటే ప్రపంచంలో ఏఐ వినియోగం, ఆవిష్కరణలకు భారత్ కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ టెక్నాలజీలో పురోగతి సాధించాలంటే పాలసీ విధానాల రూపకల్పన, పెట్టుబడులు మాత్రమే కాకుండా స్కిల్స్ కూడా చాలా అవసరమని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించుకుంటున్నాయి. భారతదేశంలో కూడా ఈ టెక్నాలజీ మరింత విస్తృతంగా వ్యాపిస్తుంది. కొన్ని సంస్థలు కూడా ఈ టెక్నాలజీలో తమ ఉద్యోగులకు ట్రైనింగ్ వంటివి ఇవ్వడానికి సన్నద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: హ్యాండ్సమ్గా కనిపిస్తున్న ఈ కుర్రాడే.. నేడు భారత్ గర్వించదగ్గ వ్యక్తి -
ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ ఇండియా, ఐబీఎమ్‌లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది. ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు? ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్‌వేర్‌లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్ఏపీ, ఐబీఎమ్లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి. -
ఆ ఉద్యోగాలకు ముప్పే.. ఐబీఎం సీఈవో కీలక వ్యాఖ్యలు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్‌తో కొన్ని రకాల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ఐబీఎం ఛైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణ (Arvind Krishna) అన్నారు. చాట్‌జీపీటీ (ChatGPT), గూగుల్ బార్డ్ (Google Bard) వంటి జెనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఉత్పాదకతను పెంచగలవని, అయితే "బ్యాక్ ఆఫీస్, వైట్ కాలర్" ఉద్యోగాలపై వాటి ప్రభావం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎన్బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాలలో జనాభా పెరుగుదల క్షీణతను ప్రస్తావించారు. ఏఐ టెక్నాలజీలు మానవులకు నాణ్యమైన జీవనాన్ని అందించడంతో తోడ్పడగలవని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ సానుకూలతను ఉపయోగించుకోవడానికి ఐబీఎం కూడా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఐబీఎం ఇటీవల వాట్సన్‌ఎక్స్‌ను అనే జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫామ్ సూట్‌ను పరిచయం చేసింది. సాంకేతికతను సురక్షితంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు సహాయం చేయడానికి దీన్ని రూపొందించారు. ఇంతకు ముందు మేనెలలో జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలోనూ ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. తమ కంపెనీలో 30 శాతం ఉద్యోగాలను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఆటోమేషన్ టెక్నాలజీతో భర్తీ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా, వచ్చే ఐదేళ్లలో కంపెనీ 7,800 ఉద్యోగాలను తొలగిస్తుందని అంతా ఆందోళన చెందారు. తర్వాత తన వ్యాఖ్యలపై మరింత స్పష్టతనిస్తూ, కొత్త టెక్నాలజీ ఆఫీసు పనిని భర్తీ చేస్తుందని, ఐబీఎంలో కూడా ఇదే జరుగుతుందని పేర్కొన్నారు. -
‘నాకు జీతం పెంచడం లేదు సార్’, కోర్టుకెక్కిన ఉద్యోగి..కంగుతిన్న ఐబీఎం!
ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ ఐబీఎంకు భారీ షాకిచ్చాడో ఓ ఉద్యోగి. పనిచేయకుండా 15 ఏళ్ల నుంచి నెల నెలా ఠంచన్‌గా జీతం తీసుకుంటున్నాడు. పైగా సంస్థ తనకు జీతం పెంచడం లేదని, కంపెనీ తన వైకల్యం పట్ల కంపెనీ వివక్ష చూపుతుందని కోర్టు మెట్లెక్కాడు. మరి చివరికి కోర్టులో ఉద్యోగికి న్యాయం జరిగిందా? లేదంటే ఐబీఎంకు అనుకూలంగా తీర్పిచ్చిందా? ఇయాన్ క్లిఫోర్డ్ సీనియర్ ఐటీ ఉద్యోగి. అనారోగ్యం కారణంగా 2008 సెప్టెంబర్ నుంచి సిక్ లీవ్‌లో ఉన్నాడు. సహృదయంతో నిబంధనలకు అనుగుణంగా ఐబీఎం ప్రతినెల జీతాన్ని ఇయాన్ ఖాతాలో జమ చేసేది. ఈ క్రమంలో 2013లో ఐబీఎంపై ఫిర్యాదు చేశాడు. ఐదేళ్ల నుంచి తన జీతాన్ని ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించాడు. అధికారుల వద్ద మొరపెట్టుకున్నాడు. దీంతో కంగుతిన్న ఐబీఎం యాజమాన్యం అతనితో ఓ ఒప్పొందానికి వచ్చింది. సంస్థపై ఫిర్యాదు చేయకూడదు. అందుకు ప్రతిఫలంగా 8,685 పౌండ్లు (సుమారు రూ.9 లక్షలు) అదనంగా చెల్లించింది. పైగా ఉద్యోగిగానే పరిగణిస్తూ వేతన ప్యాకేజీ (72,037 పౌండ్లు)లో 75 శాతం మేర ఏటా 54,000 పౌండ్లు (సుమారు రూ.55.31 లక్షలు) 65 ఏళ్లు వచ్చే వరకు ఐబీఎం వేతనం అందిస్తూ వచ్చింది. ఈ తరుణంలో ఇయాన్ మరో సారి ఐబీఎం ఉన్నతాధికారుల్ని ఆశ్రయించాడు. పెరిగిన ఖర్చులతో పోల్చితే హెల్త్ ప్లాన్ కింద తనకు అందే వేతనం చాలా తక్కువ. కాబట్టి తన వేతనం పెంచాలని కోరారు. అందుకు సంస్థ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. దీంతో చేసేది లేక 2022 ఫిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన వైకల్యం పట్ల ఆ కంపెనీ వివక్ష చూపుతున్నదని ఆరోపించాడు. ఇయాన్ క్లిఫోర్డ్ ఆరోపణలను కోర్టు ఖంఢించింది. ‘సంస్థ వైద్యం చేయిస్తుంది, ప్రయోజనం చేకూర్చే ప్యాకేజీనీ అందిస్తుందని న్యాయమూర్తి తెలిపారు. కాకపోతే పెరిగిన నిత్యవసర వస్తుల ధరలతో ఇయాన్కు సంస్థ ఇచ్చే వేతనం సరిపోకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, సంస్థపై అతను చేసిన వివక్ష ఆరోపణల్ని, శాలరీ పెంచాలన్న అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తూ తీర్పిచ్చారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
‘ఆఫీస్‌కి వస్తారా.. లేదంటే!’, వర్క్ ప్రమ్ హోం ఉద్యోగులకు టెక్ కంపెనీల వార్నింగ్!
ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడటంతో పలు టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో మాస్ లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే ఈ తరుణంలో అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్న సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ రిమోట్ వర్క్ (వర్క్ ఫ్రమ్ హోం) ఉద్యోగుల భవిష్యత్‌కు ప్రమాదకరమని అన్నారు. సీఈవో అరవింద్ కృష్ణ వ్యాఖ్యలపై ఆ సంస్థ టాప్ ఎగ్జిక్యూటివ్స్ స్పందించారు. ఉద్యోగులు ఆఫీస్ రావాలని తాము పిలవలేదని, రిమోట్ వర్క్ వారి కెరియర్ను మరింత కఠినతరం చేస్తుందని మాత్రమే అన్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా మేనేజర్ స్థాయి ఉద్యోగులపై వర్క్ ఫ్రమ్ హోం ప్రతికూల ప్రభావం చూపుతుందని సూచించారు. ‘మీరు రిమోట్ వర్క్ చేస్తే మేనేజర్ బాధ్యతలకు న్యాయం చేయలేరు. ఎందుకంటే మీరు వ్యక్తులను మేనేజ్ చేయోచ్చు. కానీ సిబ్బంది ఏం వర్క్ చేస్తున్నారో చూడాలి. కానీ అది అసాధ్యం కాదు. ఉద్యోగులు వారు ఏం వర్క్ చేస్తున్నారో పర్యవేక్షించాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం చేయగలుగుతారు. చదవండి👉 వరల్డ్ వైడ్‌గా ‘పనిమంతులు’ ఏ దేశాల్లో ఉన్నారో తెలుసా? ప్రతి నిమిషం ఉద్యోగులు ఏం చేస్తున్నారో చూడాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు ‘అందరూ నేను చెప్పినట్లే చేయాలి. నా కిందే మీరంతా’ అనే ఈ తరహా నియమాల కింద పనిచేయాల్సిన అవసరం లేదని అరవింద్ కృష్ణ అన్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇలా ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోంకు స్వస్తిపలికి ఆఫీస్‌కు రావాలని పిలుపునిచ్చిన టెక్ కంపెనీల్లో ఐబీఏం మాత్రమే కాదు. గతంలో మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ సైతం ఇదే విధంగా వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా తమ సహోద్యోగులతో కలిసి పని చేయడానికి మరిన్ని అవకాశాలను గుర్తించాలే ప్రోత్సహించాలి. ఇంట్లో ఉండి పనిచేసే వారికంటే ఆఫీస్‌కి (మెటా) వచ్చి పనిచేస్తున్న వారే మెరుగైన పనితీరును కనబరుస్తున్నారు. ఇదే అంశం కంపెనీ పనితీరుపై తయారు చేసిన డేటా చూపిస్తోందని జుకర్‌బర్గ్ నొక్కిచెప్పారు. సంస్థలోని ఇంజనీర్లు వారంలో కనీసం మూడు రోజులు సహచర ఉద్యోగులతో కలిసి పనిచేనప్పుడు సగటున మెరుగైన పనితీరు కనబరుస్తారని కూడా ఈ విశ్లేషణ చూపిస్తుందని’ జుకర్ బర్గ్ ఉద్యోగులకు పంపిన మెయిల్లో ప్రస్తావించారు. చదవండి👉 ట్విటర్లో మస్క్ సలహా దారుడిగా భారతీయుడు, ఎవరీ శ్రీరామ్ కృష్ణన్? -
9 ఏళ్ల ‘కౌటిల్య కటారియా’కు సలాం కొడుతున్న దిగ్గజ టెక్ కంపెనీలు!
సాఫ్ట్వేర్ కొలువు అంటేనే కోడింగ్‌తో కుస్తీ పట్టాలి.. ప్రోగ్రామింగ్‌తో దోస్తీ చేయాలి. ఇదిగో ఈ చిచ్చరపిడుగు అలాగే చేశాడు. ప్రపంచంలోనే అతి పిన్న వయస్సులో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా ఎదిగాడు. వరల్డ్ వైడ్ టెక్ దిగ్గజ కంపెనీల సీఈవోలకు టెక్నాలజీ పాటాలు నేర్పిస్తూ అందరితో ఔరా అనిపిస్తున్నాడు. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ అనే పట్టణానికి చెందిన తొమ్మిదేళ్ల కౌటిల్య కటారియా టెక్నాలజీ గురించి కూడా తెలియని వయస్సుల్లో టెక్ స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. భారత్‌లోని టైర్-3 నగరం నుంచి యూకేలోని మెట్రోపాలిటన్ ప్రపంచానికి వెళ్లి.. 6 ఏళ్లకే అతి పిన్న వయస్కుడైన కోడర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు ఈ బాల మేధావి. 9 ఏళ్లకే ప్రపంచ వ్యాప్తంగా టెక్, కంప్యూటింగ్ కాన్ఫరెన్స్‌లలో స్పీకర్‌గా ప్రసంగాలతో దిగ్గజ సంస్థల సీఈవోల నుంచి ప్రశంసలందుకుంటున్నాడు. కౌటిల్య కటారియా ఎవరు? కౌటిల్య కటారియా యూకేలోని నార్తాంప్టన్ (Northampton)లోని వూటన్ పార్క్ స్కూల్లో చదువుకున్నాడు. 10, 11, 12 తరగతుల విద్యార్థులతో కలిసి జీసీఎస్ఈ మ్యాథ్స్ పరీక్షలో అత్యధిక గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించాడు. 5 సంవత్సరాల వయస్సు నుంచి బాల మేధావిగా మారడానికి అతని ప్రయాణం 5ఏళ్ల వయస్సులో ప్రారంభమైంది. అతని తండ్రి ఈశ్వర్ కటారియా..ఆ వయస్సులో కౌటిల్యకు కోడింగ్‌కు సంబంధించిన ఓ పుస్తకాన్ని కొనిచ్చారు. ఆ పుస్తకమే అతనిలో ఆసక్తిని రేకెత్తించింది. ఒక్కరోజులో పుస్తకాన్ని పూర్తి చేసి కంప్యూటింగ్ నేర్పించడం మొదలుపెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సొంతంగా సెర్చ్ ఇంజిన్, చాట్ బాట్‌ను తయారు చేసి ఐబీఎంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ పర్ట్ అక్రిడిటేషన్ పొందారు. ఐబీఎంకు చెందిన వాట్సన్ సూపర్ కంప్యూటర్‌తో స్మోక్, ఫైర్‌ను గుర్తించే ప్రోగ్రామ్‌ను రూపొందించాడు ఈ చిచ్చర పిడుగు. 9 సంవత్సరాల వయస్సులో, కంప్యూటింగ్, గణితంలో పరిధిని విస్తరించడానికి విభిన్న అభిరుచులు గల యువతను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు ది డిసిఫర్ అనే వేదికను స్థాపించాడు. భవిష్యత్తులో కొత్త రకం ఏఐని అభివృద్ధి చేయాలని అతని లక్ష్యం. ప్రస్తుతం డాక్టర్ నుంచి రాకెట్ వరకు ఇలా ఏ రంగంలోనైనా పని చేసే రోబోను తయారు చేయాలనే డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నిమగ్నమయ్యాడు. ఆల్ ది బెస్ట్ కౌటిల్య కటారియా. -
గీత దాటితే అంతే, ఉద్యోగులకు భారీ షాక్..మూన్‌లైటింగ్‌పై ఐబీఎం హెచ్చరికలు
మూన్‌లైటింగ్ అంశంపై ప్రముఖ టెక్ దిగ్గజం ఐబీఎం ఉద్యోగులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రెండేసి ఉద్యోగాలు చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మూన్‌లైటింగ్ అంశంపై ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ ఉద్యోగులకు ఇంటర్నల్‌గా ఓ మెయిల్ పంపారు. ఆ మెయిల్లో..సంస్థ విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉల్లంఘించ కూడదు. సరళంగా చెప్పాలంటే మూన్‌లైటింగ్ అంటే రెండో ఉద్యోగంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి👉 ఐటీలో అలజడి : మరో ఊహించని షాక్..తలలు పట్టుకుంటున్న ఫ్రెషర్లు! తమ ఉద్యోగులు కాంపిటీటర్ లేదా ఉపాధి లేదా వ్యాపారాల్లో పాల్గొన్నకూడదు. 7.1,7.2 సంస్థ మార్గదర్శకాలు అవే చెబుతున్నాయి. సంస్థ పనివేళల తర్వాత ఉద్యోగులకు వ్యక్తిగత జీవితం అయినప్పటికీ.. ఐబీఎంకు అవాంతరం కలిగించేలా కార్యక్రమాల్లో పాలు పంచుకోకూడదు. ‘ఐబీఎంలో మా వైఖరి స్పష్టంగా ఉంటుంది. మేం ప్రతి ఉద్యోగి ప్రొడక్టివితో పనిచేసేలా ప్రోత్సహిస్తాం. కళలు, నృత్యం, సంగీతం వంటి కల్చరల్ యాక్టివిటీస్‌లో వారిని ప్రోత్సహిస్తాం. కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా, ఐబీఎం ప్రయోజనాల్ని పణంగా పెట్టి మూన్‌లైటింగ్‌కు పాల్పడితే సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించినట్లే' అని మెయిల్లో పేర్కొన్నారు. ఐబీఎంలో పనిచేస్తున్న ఉద్యోగి ఖాళీ సమయాల్లో వ్యాపారం చేసేందుకునేందుకు అనమతిస్తే..ఆఫీస్‌లో వర్క్ ప్రొడక్టివిటీ దెబ్బ తిని విధులకు ఆటంకం కలుగుతుంది. ప్రాజెక్టులు ఇచ్చే క్లయింట్లు వారి డేటా, ఇతర ముఖ్య సమాచారం భద్రతగా ఉంచడం సంస్థ విధి. అందుకే మూన్ లైటింగ్ వంటి అంశాల్లో ఐబీఎం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని ఐబీఎం ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పాటిల్ తన నోట్లో పునరుద్ఘాటించారు. చదవండి👉 టెక్ కంపెనీల్లో.. మూన్‌లైటింగ్ పరాకాష్ఠకు ఈ సంఘటనే ఉదాహరణ.. -
కంపెనీలను మోసం చేస్తున్న ఐటీ ఉద్యోగులు, ఏరివేసే పనిలో సంస్థలు!
300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన విప్రో మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని ఆమోదించబోమంటూ స్పష్టం చేసిన అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ పేర్కొన్న టీసీఎస్. ఇలా దిగ్గజ ఐటీ కంపెనీలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఓ వైపు చర్చలు కొనసాగుతుండగా.. మరో వైపు మూన్‌లైటింగ్ పాల్పుడుతున్న ఉద్యోగుల్ని సంస్థలు విధుల నుంచి తొలగిస్తున్నాయి. నియామకాల్ని నిలిపివేసి.. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహించడం చర్చాంశనీయంగా మారింది. ఇప్పుడు ఈ అంశం ఉద్యోగులకు, ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉద్యోగం సంపాదించిన అభ్యర్ధుల్ని కలవరానికి గురి చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు జల్లెడ పడుతున్నాయి. మూన్‌లైటింగ్‌కు పాల్పడిన ఉద్యోగులను, తప్పుడు పత్రాలతో చేరిన సిబ్బందిని ఏరివేస్తున్నాయి. అభ్యర్థులకు ప్రత్యక్షంగా మరోసారి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు బ్యాంక్, ప్రావిడెంట్ ఫండ్ స్టేట్మెంట్లను ఉద్యోగుల సమక్షంలో, లైవ్‌లో తనిఖీ చేస్తున్నాయి. స్నేహితులు, సీనియర్ల సహకారంతో గతంలో ఇంటర్వ్యూలు గట్టెక్కినవారు.. ఈ ఇంటర్యూల్లో నోరెళ్లబెడుతున్నారట. కొందరు ఒకటికి మించి ఉద్యోగాలు చేస్తున్నట్టు బయటపడింది. బెంచ్ మీద ఉన్నవారిని క్లయింట్లు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండడం కొసమెరుపు. ఈ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తేనే వేతనం. లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే. నియామకాలు చేపట్టవద్దని.. మూడు నెలల నుంచే జల్లెడ పట్టే కార్యక్రమాన్ని కంపెనీలు ప్రాధాన్యతగా చేపట్టాయి. తప్పుడు అనుభవం, వేతన ధ్రువపత్రాలతో వందలాది మంది చేరినట్టు తేలిందని పరిశ్రమ వర్గాల సమాచారం. విధుల్లో మరొకరి సాయం తీసుకున్నట్టు కొందరిని గుర్తించారు. ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేంత వరకు ఫ్రెషర్ల నియామకాలు చేపట్టవద్దని కంపెనీలు నిర్ణయించుకున్నాయి. ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చినప్పటికీ చేరిక తేదీని ఐటీ సంస్థలు వాయిదా వేస్తున్నాయని స్మార్ట్‌స్టెప్స్ కో–ఫౌండర్ నానాబాల లావణ్య కుమార్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఆఫర్ లెటర్లను రద్దు చేస్తే పరిశ్రమలో తప్పుడు సంకేతం వెళుతుందన్నారు. కాగా.. విప్రో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా వంటి కంపెనీలు ఫ్రెషర్లకు ఇచ్చిన ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా బయటపడింది.. మహమ్మారి కాలంలో ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వర్తించారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానం, మరికొన్ని పూర్తిగా కార్యాలయం నుంచి విధులను అమలులోకి తెచ్చాయి. కొందరు ఆఫీస్‌కు రాలేమని పట్టుపట్టారు. సిబ్బంది ఎందుకు ఇలా చేస్తున్నారనే అంశంపై కంపెనీలు లోతుగా పరిశీలించాయి. వీరు మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నట్టు తేలింది. కంపెనీలు పట్టుపట్టడంతో అధికంగా జీతం ఇచ్చే సంస్థల్లో ఇటువంటివారు చేరారు. ఆఫీస్‌లో ప్రత్యక్షంగా పని చేయాల్సి రావడంతో తప్పుడు అనుభవంతో చేరినవారు సాంకేతిక పరిజ్ఞానం లేక చేతులెత్తేశారు. మోసపూరితంగా చేరినవారిని రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందిగా కంపెనీలు ఆదేశిస్తున్నాయి. చదవండి👉 డెలివరీ బాయ్‌లను చులకనగా చూస్తున్నారా! -
Moonlighting: మూన్‌లైటింగ్... తప్పా, ఒప్పా?
మూన్‌లైటింగ్. ఇటీవలి కాలంలో అందరి నోళ్లలోనూ బాగా నానుతున్న పేరు. విప్రో సంస్థ ఇటీవల ఏకంగా 300 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో మరోసారి ఈ పేరు బాగా తెరపైకి వచ్చింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలుంటాయంటూ మరో బడా ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులకు హెచ్చరిక మెయిల్స్ పంపింది. మూన్‌లైటింగ్ అనైతికమని, దీన్ని సుతరామూ ఆమోదించబోమని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం కూడా స్పష్టం చేసింది. స్వల్ప లాభాల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే ఉద్యోగులు కెరీర్‌నే రిస్కులో పెట్టుకుంటున్నారంటూ టీసీఎస్ కూడా పేర్కొంది. బడా ఐటీ సంస్థలను ఇంతగా ప్రభావితం చేస్తున్న మూన్‌లైటింగ్ తప్పా, ఒప్పా అంటూ ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది... అనైతికమా? ఒక సంస్థలో పర్మనెంట్ ఉద్యోగిగా ఉంటూ ఖాళీ సమయాల్లో, వారాంతాల్లో ఇతర సంస్థలకు పని చేయడాన్ని మూన్‌లైటింగ్‌గా పిలుస్తున్నారు. నిజానికి అదనపు ఆదాయం కోసం పని వేళల తర్వాత చాలామంది ఇతర పనులు చేయడం కొత్తేమీ కాదు. బడుగు జీవులు వేతనం చాలక ఇలా చేస్తే ఏమో గానీ భారీ జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు మాత్రం ఇతర సంస్థలకు, అదీ తమ ప్రత్యర్థులకు పని చేయడం అనైతికమన్నది ఐటీ సంస్థల వాదన. బెంగళూరులో ఓ ఐటీ సంస్థ ఉద్యోగికి ఏకంగా ఏడు పీఎఫ్ ఖాతాలున్నట్టు తేలడం సంచలనం సృష్టించింది. చిన్నాదా, పెద్దదా అన్నదానితో నిమిత్తం లేకుండా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా పీఎఫ్ ఖాతా తప్పనిసరి కావడం తెలిసిందే. విప్రో కూడా మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్న తమ ఉద్యోగులను పీఎఫ్ ఖాతాల ద్వారానే గుర్తించిందని స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్ రాజీవ్ మెహతా చెప్పడం సంచలనంగా మారింది. ఈ ఒరవడి మనకు కాస్త కొత్తగా అన్పించినా అమెరికాలో మాత్రం 2018లోనే బహుళ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య 7.2 శాతం పెరిగిందట. అక్కడ మహిళలు అధికంగా మూన్‌లైటింగ్ చేస్తున్నట్టు తేలింది. సమర్థకులే ఎక్కువ... మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది అనైతికమే గాక సంస్థ పట్ల పచ్చి మోసమేనంటారు విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ. టీసీఎస్ అధిపతి గణపతి సుబ్రమణ్యం దీన్ని నైతిక సమస్యగా అభివర్ణించారు. ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్‌పాయ్ మాత్రం ఇందులో మోసమేముందని ప్రశ్నస్తున్నారు. ‘‘నిర్ణీత సమయం పాటు సంస్థలో పని చేస్తానంటూ ఉద్యోగి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత అతను ఏ పని చేస్తే సంస్థకేంటి?’’ అన్నది ఆ్న ప్రశ్న. టెక్‌మహీంద్రా ఎండీ సీపీ గుర్నానీ అయితే ఓ అడుగు ముందుకేసి తమ ఉద్యోగులు పనివేళల తర్వాత ఇతర ఉద్యోగాలు చేసుకునేందుకు వీలుగా ఓ విధానమే రూపొందిస్తామని ప్రకటించారు. మూన్‌లైటింగ్‌కు అనుమతించిన తొలి సంస్థగా ఆన్లైన్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ నిలిచింది. ఫిన్‌టెక్, యూనికార్న్, క్రెడ్ సంస్థలు కూడా ఇదే బాటలో ఉన్నాయి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. మింట్ సర్వేలో 64.5 శాతం మూన్‌లైటింగ్‌ను సమర్థించారు. అనైతికమన్న వారి సంఖ్య కేవలం 23.4 శాతమే. -దొడ్డ శ్రీనివాసరెడ్డి -
మైక్రోసాఫ్ట్ భారీ షాక్, వందల మంది ఉద్యోగుల తొలగింపు!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు రష్యాలో సేవల్ని నిలిపివేశాయి. వికీపీడియా లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు వెయ్యికిపైగా కంపెనీలు రష్యాలో కార్యాకలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. ఇప్పుడు ఇందులో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ తొలగించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రష్యాలో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చేసిన మైక్రోసాఫ్ట్ ప్రకటన ఆ సంస్థలో పనిచేస్తున్న 400మంది ఉద్యోగులు రోడ్డున పడేలా చేసింది. ప్రొడక్ట్ అమ్మకాల తగ్గింపు కారణంగా తలెత్తుతున్న నష్టాలు, ఇతరాత్ర కారణాల వల్ల ఆ 400మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల్ని తొలగించినా వారికి సంస్థ సహాయ,సహకారాలు ఉంటాయని మైక్రోసాఫ్ట్ హామీ ఇచ్చినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రష్యాకు ఐబీఎం గుడ్‌బై 1980 నుంచి మైక్రోసాఫ్ట్ సంస్థ తన ఆపరేటింగ్ సిస్టంను ఐబిఎం కంప్యూటర్స్‌తో కలిసి బిల్డ్ చేస్తుంది. అయితే ఇటీవల ఉక్రెయిన్ - రష్యా పరిణామాల నేపథ్యంలో ఐబీఎం రష్యాలో కార్యకలాపాల్ని నిలిపివేసింది. ఐబీఎం తర్వాత మైక్రోసాఫ్ట్ రష్యా నుంచి వైదొలొగుతున్నట్లు ప్రకటించింన విషయం తెలిసింది. -
సైబర్ నేరం జరిగితే వెల్లడించాల్సిందే
న్యూఢిల్లీ: కంపెనీలు ఏదైనా సైబర్ దాడికి గురైతే దాన్ని ప్రభుత్వానికి వెల్లడించాలన్న చట్టాన్ని తీసుకొస్తున్నట్టు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బెంగళూరులో ఐబీఎం ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ కమాండ్ సెంటర్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 10 కోట్ల సైబర్ దాడుల ఘటనలను కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఇండియా సీఈఆర్టీ) గుర్తించినట్టు చెప్పారు. సైబర్ దాడుల పరంగా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశమని పేర్కొన్నారు. ‘‘ఇలాంటి సైబర్ దాడులు జరిగితే బయటకు వెల్లడించకుండా దాచడం కుదరదు. వీటిని వెల్లడించాల్సిన బాధ్యతను సంస్థలపై పెట్టనున్నాం. ఇందుకు సంబంధించి కొన్ని రోజుల్లో నూతన చట్టం గురించి ప్రకటన వింటారు’’అని మంత్రి ప్రకటించారు. ముప్పు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలకు పూర్తి స్పష్టత ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. సైబర్ విభాగం సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని గుర్తు చేశారు. ‘‘మనం పెద్ద ఎత్తున సామర్థ్యాల విస్తరణపై పెట్టుబడులు పెడుతున్నాం. ఇంటర్నెట్ అన్నది సురక్షితంగా ఉండాలి. స్వేచ్ఛాయుతంగా, విశ్వసనీయమైనదిగా ఉండాలి. ఇంటర్నెట్కు సంబంధించిన మధ్యవర్తులు వినియోగదారులకు జవాబుదారీగా వ్యవహరించాలి’’ అని మంత్రి చెప్పారు. ఆసియా పసిఫిక్‌లో మొదటిది బెంగళూరులో ఏర్పాటు చేసిన కేంద్రం ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే మొదటిదిగా ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ తెలిపారు. సైబర్ భద్రత విషయంలో టెక్నిక్‌లపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. ఈ కేంద్రంలోనే కొత్త సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సెక్యూరిటీ రెస్పాన్స్ సేవలను అందించనున్నట్టు తెలిపారు. -
52 ఏళ్ల తరువాత క్షమాపణ : ఆమె ఏం చేసింది?
ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న ట్రాన్స్జెండర్లకు ఆమె ఒక విజయ పతాక. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి తానెంచుకున్న రంగంలో అత్యంత ప్రతిభావంతంగా ఎదిగి ట్రాన్ప్జెండర్ సమూహానికి ప్రజలకు ఉత్సాహాన్నిచ్చిన ధీర వనిత. కానీ ఇదంతా సాధించడానికి ట్రాన్స్‌జెండర్ మహిళకు అర్ధశతాబ్దానికి పైగా పోరాటం చేయాల్సి వచ్చింది. విశేష ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం తాను ట్రాన్స్‌జెండర్ విమెన్ని అని ప్రకటించినందుకు ఉద్యోగాన్ని కోల్పోయింది. 1968 లోనే లింగమార్పిడి చేసుకున్న మహిళనని తనకు తాను ధైర్యంగా వెల్లడించింది. కానీ టెక్ దిగ్గజం ఐబీఎం ఒక యువ కంప్యూటర్ మేధావిని ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే తదనంతర కాలంలో తన అసాధారణ ప్రతిభా పాటవాలతో ఒకపుడు తనను అవమానపరిచిన సంస్థే స్వయంగా పొరపాటును గ్రహించి క్షమాపణలు చెప్పే స్థాయికి ఎదిగింది. దీనికి తోడు ఎల్జీబీటీక్యూ హక్కులపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం పెరగడంతో ఐబీఎం ఆ వైపుగా స్పందించింది. ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేసిన ఆమెకు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా ప్రపంచాన్ని మార్చిన వ్యక్తులకు ఇచ్చే అరుదైన ఐబీఎం లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ఆమె పేరే లిన్ కాన్వే (82) గత నెలలో 1,200 మందికి పైగా ఉద్యోగులు హాజరైన ఆన్లైన్ ఈవెంట్‌కు ఆహ్వానించింది. ఈ వేడుకలో ఐబీఎం ఆమెను క్షమాపణ కోరింది. ఆమె పరిశోధన తమ విజయానికి ఎంతో తోడ్పడిందని, చేయకూడని పనిచేశామంటూ ఐబీఎం హెచ్ఆర్ హెడ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డయాన్ గెర్సన్ క్షమాపణ కోరడం విశేషం. అలాగే ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఎవరీ లిన్ కాన్వే లిన్ ఆన్ కాన్వే. అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఆవిష్కర్త, ట్రాన్స్‌జెండర్ పీపుల్ కోసం పనిచేస్తున్న ఉద్యమకర్త. మిచిగాన్ విశ్వవిద్యాలయంలో అత్యంత గౌరవనీయమైన ప్రొఫెసర్‌గా కూడా పనిచేశారు. అనేక అవార్డులు, రివార్డులు ఆమె సొంతం. అంతేనా ఇవాల్టి స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, చిప్ ఆవిష్కరణలు దశాబ్దాల తరబడి ఆమె చేసిన కృషి ఫలితమే. 1938లో న్యూయార్క్ లోని మౌంట్ వెర్నాన్లో అబ్బాయిగా పుట్టారు లిన్ చిన్నతనం నుంచే చదువులో రాణిస్తూ వచ్చారు. గణితం అన్నా, సైన్స్ అన్నా ప్రాణం.155 పాయింట్ల ఐక్యూతో అసాధారణ తెలివితేటలతో రాణించాడు. కానీ చిన్న వయసు నుంచే డిస్ఫోరియా అన లింగపరమైన సమస్య వెంటాడింది. అయినా చదువులోప్రతిభ కనబరుస్తూ కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్లైడ్ సైన్స్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. 1964లో ఐబీఎం రీసెర్చ్ విభాగంలో జాయిన్ అయ్యారు. ఆర్కిటెక్చర్ బృందంలో అధునాతన సూపర్ కంప్యూటర్ రూపకల్పన చేయడంతోపాటు, గొప్ప పరిశోధకురాలిగా ఎదిగారు. 1964లో పెళ్లి చేసుకున్న లిన్‌కు (మహిళగా మారకముందు) ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. అయితే ఇంత జరుగుతున్నా ఆమెలోని జన్యుపరమైన లోపం కుదురుగా ఉండనీయలేదు. దీంతో 1967లో, మాన్హటన్కుచెందిన సెక్సాలజిస్ట్ డాక్టర్ హ్యారీ బెంజమిన్ ద్వారా లింగమార్పడి గురించి తెలుసుకున్నారు. అలా బెంజమిన్ సహాయంతో, ఆమె మగ నుండి ఆడకు శారీరకంగా పరివర్తనను ప్రారంభించారు. చివరకు 1969లో ఆపరేషన్ తరువాత పూర్తి మహిళగా అవతరించారు. దీనికి ఆమె కుటుంబం, సహచరుల మద్దతు లభించింది. కానీ ఐబీఎం మాత్రం జీర్ణించుకోలేకపోయింది. ఆమె వలన ఇతర ఉద్యోగులకు కూడా ఇబ్బంది అంటూ అప్పటి సీఈవో థామస్ జేవాట్సన్ లిన్‌ను తొలగించారు. దీంతో లిన్ కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడ్డారు. చాలా ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించడంతో కష్టపడాల్సి వచ్చిందని, ఎప్పటికి ఈ సమస్యల్ని అధిగమిస్తానో తెలియని స్థితిలో తీవ్ర నిరాశకు గురయ్యానని ఆమె చెప్పారు. అయినా దుఃఖాన్ని దిగమింగి తన పోరాటాన్ని కొనసాగించానన్నారు. చివరకు తన కొత్త అవతారాన్ని దాచి పెట్టి ఎంట్రీ లెవల్ కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా మళ్లీ ఉద్యోగంలో చేరానని ఆమె చెప్పారు. ఆ తరువాత తన ప్రతిభతో అమెరికా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీలో ఉద్యోగాన్ని సాధించారు. దాదాపు 30ఏళ్ల పాటు తాను ట్రాన్స్జెండర్ననీ ఎవరికీ చెప్పలేదు. (కొద్దిమంది సన్నిహితులు, బంధువులు, హెచ్ఆర్ సిబ్బంది, భద్రతా క్లియరెన్స్ ఏజెన్సీలు మినహా). అయితే 1999లో కంప్యూటర్ రంగంలో ఆమె ఆవిష్కరణలపై చరిత్రకారుల పరిశోధించడం ప్రారంభించినప్పుడు ఆమె తన ఉనికిని బహిరంగపర్చారు. ఐబీఎంలో ఉద్యోగం కోల్పోయిన సంఘటనతో పాటు, తన లింగ మార్పిడి ప్రస్థానాన్ని ఆన్లైన్లో బహిర్గతం చేశారు. కంప్యూటర్ సైంటిస్టుగా ప్రస్థానం, పురస్కారాలు కాంట్రాక్ట్ ప్రోగ్రామర్‌గా ఉద్యోగంలో చేరిన లిన్ ఆ తరువాత తన కరియర్లో వెనుతిరిగి చూసింది లేదు. ఆధునిక స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, సిలికాన్ వ్యాలీలోని అనేక శక్తివంతమైన కంపెనీల అభివృధ్దితో ఆధునిక కంప్యూటర్ యుగానికి బాటలు వేశారు. ఇంటర్నెట్కు, అనేక టెక్ స్టార్టప్‌ల ఆవిర్భావానికి అపూర్వ సామర్ధ్యాన్నిచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఆమెది కీలక పాత్ర. 70 ల ప్రారంభంలో ప్రసిద్ధి చెందిన జిరాక్స్ పాలో ఆల్టో రిసెర్చ్ సెంటర్లో కంప్యూటర్ చిప్ డిజైన్‌ను ఆవిష్కరించిన ఘనత ఆమె సొంతం. 1980లలో ఇ-కామర్స్, మైక్రోప్రాసెసర్ చిప్ రూపకల్పనలో ఆమె సాధించిన పురోగతి సిలికాన్ వ్యాలీ మొట్టమొదటి స్టార్టప్‌లకు శక్తినిచ్చిందని ఫోర్బ్స్ ఆమెను ప్రశంసించింది. 1983లో మెషిన్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో చేసిన కృషికి మెరిటోరియస్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. 2014లో టైమ్ మ్యాగజైన్ ఆమెను అమెరికన్ సంస్కృతిలో అత్యంత ప్రభావవంతమైన ఎల్జీబీటీక్యూ వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది. ఈ క్రమంలో ఆమె ఎల్జీబీటీ కార్యకర్తగా, రచయితగా మారారు. తమ లాంటి వాళ్లకోసం ఉద్యమిస్తూ..ఎంతో మంది ఎల్జీబీటీక్యూ హక్కుల కార్యకర్తలకు, సెలబ్రిటీలకు స్ఫూర్తిగా నిలిచారు. -
ఇక రెండుగా ఐబీఎం..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఐబీఎం తన వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించనుంది. ఇందులో భాగంగా మేనేజ్డ్ ఇన్ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఇకపై ఐబీఎం పూర్తిగా హైబ్రీడ్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వ్యాపారాలపై దృష్టి పెట్టనుండగా, రెండో సంస్థ సర్వీస్ డెలివరీ, ఆటోమేషన్ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 2021 ఆఖరు నాటికి పూర్తి కావచ్చని అంచనా. తాత్కాలికంగా ’న్యూకో’ పేరుతో వ్యవహరిస్తున్న ఇన్ఫ్రా సేవల విభాగానికి భారత్‌లోని ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని బదలాయించనున్నట్లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. 2019 ఆఖరు నాటికి ఐబీఎంలో మొత్తం 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశాలవారీగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ.. భారత్‌లో సుమారు 1 లక్ష పైచిలుకు సిబ్బంది ఉంటారని అంచనా. -
జ్యుడిషియల్ ప్రివ్యూకు ‘రాయలసీమ ఎత్తిపోతల’
‘రాయలసీమ ఎత్తిపోతల’ పథకం పనుల ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)ను రూ. 3,278.18 కోట్లుగా నిర్ధారిస్తూ టెండర్ ప్రతిపాదనలను రాష్ట్ర జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో ఈపీసీ విధానంలో టెండర్ నిర్వహించనున్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయడంతోపాటు పథకాన్ని 15 ఏళ్లపాటు కాంట్రాక్టరే నిర్వహించాలని నిబంధన విధించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదంతో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. సాక్షి, అమరావతి: దాహార్తితో అలమటిస్తున్న దుర్భిక్ష సీమ గొంతు తడపడమే లక్ష్యంగా ‘రాయలసీమ ఎత్తిపోతల’ పథకం పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకం పనుల ఐబీఎం (అంతర్గత అంచనా విలువ)ను రూ.3,278.18 కోట్లుగా నిర్ధారిస్తూ టెండర్ ప్రతిపాదనలను జలవనరుల శాఖ జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపింది. 30 నెలల్లో పూర్తి చేయాలనే షరతుతో ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో టెండర్ నిర్వహించనున్నారు. ప్రైస్ బిడ్‌లో తక్కువ ధరకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్ పేర్కొన్న ధరనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి రివర్స్ టెండరింగ్(ఈ–ఆక్షన్) నిర్వహిస్తారు. రివర్స్ టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించనున్నారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయడంతోపాటు పథకాన్ని 15 ఏళ్లపాటు కాంట్రాక్టరే నిర్వహించాలని నిబంధన విధించారు. జ్యుడిషియల్ ప్రివ్యూ ఆమోదం లభించాక టెండర్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు జలవనరుల శాఖ సన్నాహాలు చేస్తోంది. ‘రాయలసీమ ఎత్తిపోతల’ ఇదీ.. ► శ్రీశైలం జలాశయంలో సంగమేశ్వరం (+ 243 మీటర్ల) నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోసి పీహెచ్‌పీకి దిగువన ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడిగట్టు కాలువ)లో 4 కిమీ వద్దకు తరలించి రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేస్తారు. ► ఈ పనులకు రూ.3,278.18 కోట్లు ఐబీఎంగా జలవనరుల శాఖ నిర్థారించింది. ఇందులో రూ.10.32 కోట్లు ఇన్వెస్టిగేషన్, డిజైన్ల కోసం కేటాయించారు. రూ.1360.35 కోట్లను అప్రోచ్ చానల్, కాలువ పనులకు నిర్దేశించారు. లిఫ్టింగ్ సిస్టమ్, పంప్‌హౌస్, ఎలక్ట్రో మెకానికల్ పనులు, ప్రైజర్ మెయిన్, పైపులైన్ పనులకు రూ.1611.02 కోట్లను కేటాయించారు. 400 కేవీ సబ్ స్టేషన్ పనులకు రూ.217.88 కోట్లను కేటాయించగా నిర్వహణకు రూ.78.16 కోట్లు కేటాయించారు. ఇతర ఖర్చులకు రూ.44.18 లక్షలు కేటాయించారు. ► టెండర్ ప్రతిపాదన వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ తన వెబ్సైట్లో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంచింది. మన వాటా నీళ్లను వాడుకోవడానికే.. ► కృష్ణా బేసిన్(నదీ పరీవాహక ప్రాంతం)లో అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల వల్ల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే రోజులు గణనీయంగా తగ్గాయి. శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల్లో నీటిమట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ (పీహెచ్‌పీ) ద్వారా ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులను రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు తరలించవచ్చు. కానీ ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదిలో సగటున 10 నుంచి 15 రోజులు కూడా ఉండటం లేదు. ► ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచితే అదనంగా 174 టీఎంసీలను కర్ణాటక వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీశైలం జలాశయానికి వరద వచ్చే రోజులు మరింత తగ్గుతాయి. ► ఇక శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల్లో ఉంటే పీహెచ్‌పీ ద్వారా ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. నీటి మట్టం అంతకంటే తగ్గితే.. కృష్ణా బోర్డు నుంచి కేటాయింపులు ఉన్నా సరే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీళ్లందవు. ► ఈ నేపథ్యంలో శ్రీశైలంలో నీటి మట్టం + 243 మీటర్లు (800 అడుగులు) నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లోని ప్రాజెక్టులకు రోజుకు మూడు టీఎంసీల చొప్పున కృష్ణా జలాలను తరలించేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. -
‘అరవింద్’ సమేత..
న్యూయార్క్: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తరవాత... మరో అమెరికన్ ఐటీ దిగ్గజానికి సారథ్యం వహించే అవకాశం ఇంకో తెలుగు వ్యక్తికి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరవింద్ కృష్ణ (57)... ఐటీ దిగ్గజం ఐబీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (సీఈవో) నియమితులయ్యారు. 200 బిలియన్ డాలర్ల సంస్థ డైరెక్టర్ల బోర్డులోనూ ఆయనకు చోటు దక్కింది. ఏప్రిల్ 6 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ... 1990లో ఐబీఎంలో చేరారు. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ... ప్రస్తుతం సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (క్లౌడ్, కాగ్నిటివ్ సాఫ్ట్వేర్) స్థాయికి చేరారు. ‘సీఈవోగా ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. ప్రస్తుత సీఈవో వర్జీనియా రొమెటీ, బోర్డ్ నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. ఐటీ పరిశ్రమ శరవేగంగా మారిపోతున్న ఈ తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఐబీఎం సిబ్బంది, క్లయింట్లతో కలిసి పనిచేయడం చాలా బాగుంటుంది. వ్యాపారాలను మరింతగా మెరుగుపర్చుకునేలా క్లయింట్లకు తోడ్పడటానికి ఇదో అద్భుతమైన అవకాశం‘ అని కృష్ణ పేర్కొన్నారు. ఆయనతో పాటు రెడ్ హ్యాట్ సీఈవో, ఐబీఎం సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ జేమ్స్ వైట్‌హస్ట్.. ఐబీఎం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. కొత్త శకానికి.. సరైన సారథి ‘ఐబీఎం తదుపరి శకానికి కృష్ణ సరైన సారథి. క్లౌడ్, కాగ్నిటివ్ శకంలో కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సరైన వ్యక్తి. ఐబీఎం చరిత్రలోనే అత్యంత భారీ కొనుగోలు అయిన ‘రెడ్ హ్యాట్’ డీల్‌కు ఆయనే సూత్రధారి. అరవింద్ కృష్ణ అద్భుతమైన టెక్నాలజిస్టు. ఐబీఎంకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ వంటి కీలక టెక్నాలజీలను రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. విలువలకు ప్రాధాన్యమిచ్చే నాయకుడు‘ అని వర్జీనియా రొమెటీ (62) వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా ఐబీఎంలో వివిధ హోదాల్లో పనిచేసిన రొమెటీ ఇక ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతారు. ఈ ఏడాది ఆఖర్లో రిటైరవుతారు. సీఈవోగా బాధ్యతలు అప్పగించేందుకు సరైన వ్యక్తి కోసం సాగిన అన్వేషణలో.. అరవింద్ కృష్ణ ఎంపికయ్యారని ఐబీఎం లీడ్ డైరెక్టర్ మైఖేల్ ఎస్క్యూ పేర్కొన్నారు. సమోసా పార్టీ..! అరవింద్ కృష్ణ నియామకంపై దేశీ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. భారతీయుల సామర్థ్యాలకు తాజా నియామకం నిదర్శనమని మహీంద్రా ట్వీట్ చేశారు. అదే సమయంలో ఇకపై వైట్‌హౌస్ ఎప్పుడైనా టెక్ దిగ్గజాల సదస్సుల్లాంటివి ఏర్పాటు చేస్తే.. హాంబర్గర్ల స్థానంలో కచ్చితంగా భారతీయులకిష్టమైన సమోసాలుండేలా చూసుకోవాల్సి వస్తుందంటూ సరదాగా పేర్కొన్నారు. సాంబర్ వడ, మసాలా చాయ్ లాంటివి కూడా పెట్టాలంటూ నెటిజన్లు లిస్టులో మరిన్ని చేర్చారు. ప్రస్థానం ఇలా... పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ.. ఊటీలోని కూనూర్‌లో ఉన్నత పాఠశాల విద్యనభ్యసించారు. తరవాత ఐఐటీ కాన్పూర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిలో పీహెచ్డీ చేశారు. ఐఈఈఈ, ఏసీఎం జర్నల్స్‌కు ఎడిటర్‌గా వ్యవహరించడంతో పాటు 15 పేటెంట్లకు ఆయన సహ–రచయిత. 1990లో ఐబీఎంలో చేరి.. 30 ఏళ్లుగా అందులోనే కొనసాగుతున్నారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కాకముందు.. ఆయన ఐబీఎం సిస్టమ్స్‌లో జనరల్ మేనేజర్ హోదాలో పనిచేశారు. అంతకన్నా ముందు.. ఐబీఎం సాఫ్ట్వేర్, ఐబీఎం రీసెర్చ్ విభాగాల్లో టెక్నాలజిస్టుగా పనిచేశారు. సిలికాన్ వ్యాలీలో భారతీయ జెండా.. అరవింద్ కృష్ణ నియామకంతో టెక్నాలజీ రంగంలో భారతీయుల సత్తా మరోసారి చాటినట్టయింది. అమెరికా సిలికాన్ వ్యాలీలోని నాలుగు అతిపెద్ద బహుళజాతి కంపెనీలకు ఇప్పుడు భారతీయులే సీఈఓలు. ప్రధానంగా గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు. ఇతర ఎంఎన్సీల విషయానికొస్తే... మాస్టర్‌కార్డ్ సీఈఓ అజయ్ బంగాతో పాటు పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రా నూయి కూడా అత్యంత సుపరిచితులే. వారినొకసారి చూస్తే... సుందర్ పిచాయ్: తమిళనాడుకు చెందిన పిచాయ్ 2015లో గూగుల్ సీఈఓగా నియమితులయ్యారు. 47 ఏళ్ల పిచాయ్‌కు తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ బాధ్యతలు కూడా అప్పగించి కంపెనీ ప్రమోటర్లు వైదొలగడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. సత్య నాదెళ్ల: 1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాదెళ్ల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం. హైదరాబాద్‌లో హైస్కూల్ విద్యను అభ్యసించారు. 2014లో స్టీవ్‌బామర్ నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. శంతను నారాయణ్: యాపిల్‌లో కెరీర్‌ను ప్రారంభిం చిన నారాయణ్ 1998లో అడోబ్ సిస్టమ్స్‌లో వైస్–ప్రెసిడెంట్‌గా జాయిన్ అయ్యారు. 2007లో ఏకంగా ఆ కంపెనీ సీఈఓగా నియమితులయ్యారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చేశారు. జార్జ్ కురియన్: కేరళలోని కొట్టాయంకు చెందిన కురియన్... అమెరికా దిగ్గజం సిస్కో సిస్టమ్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. స్టోరేజ్ అండ్ డేటా మేనేజ్మెంట్ కంపెనీ ‘నెట్‌యాప్’కు 2015లో ప్రెసిడెంట్, సీఈఓగా నియమితులయ్యారు. -
క్లౌడ్ కంప్యూటింగ్‌లో సత్తా చాటనున్న ఐబీఎం
న్యూయార్క్ : టెక్నాలజీ దిగ్గజం ఐబిఏం క్లౌడ్ కంప్యూటింగ్‌లో అడుగుపెట్టేందుకు సాప్ట్వేర్ కంపెనీ రెడ్ హ్యట్ను 34బిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు ప్రక్రియను పూర్తిచేసినట్టు వెల్లడించింది. మెరుగైన లాభాలను ఆర్జిస్తూ వంద ఏళ్ల చరిత్ర ఉన్న రెడ్ హ్యట్ కంపెనీని గత ఏడాది ఐబిఏం కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. ఐబిఏం చీఫ్ ఎగ్జక్యూటివ్ గిన్ని రోమెట్టి సాంప్రదాయ హర్ఢ్వేర్ ఉత్పత్తులను తగ్గించి, వేగంగా అభివృద్ది చెందుతున్నసాప్ట్వేర్ సేవలపై, క్లౌడ్ కంప్యూటింగ్‌లపై దృష్టి పెట్టడంతో ఈ భారీ కొనుగోలుకు మార్గం సుగమమైంది. 63 శాతం ప్రీమియంతో రెడ్ హ్యట్ షేర్లను కొనుగోలు చేయడానికి జూన్ నెలఖారున ఈయు రెగ్యులేటర్లు, మే నెలలో యుఏస్ రెగ్యులేటర్లు ఐబిఏం ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాయి. 1993లో స్థాపించిన రెడ్ హ్యట్ సంస్థ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో ప్రత్యేకతను ఎర్పరుచుకుంది. ఇది మైక్రోసాప్ట్ కార్ప్చే తయారు చేయబడిన సాప్ట్‌వేర్‌కు కంటే భిన్నంగా ఉండి, ఓపెన్ సోర్స్ సాప్టవేర్గా లైనక్స్ అత్యంత ఆదరణ పోందింది. -
ఉద్యోగార్థుల్లో నైపుణ్యాలు అంతంతే..
ముంబై: టెక్నాలజీ రంగంలో కొంగొత్త ఉద్యోగావకాశాలు కుప్పతెప్పలుగా వస్తున్నా.. వాటికి అవసరమైన నైపుణ్యాలు ఉద్యోగార్థుల్లో ఉండటం లేదని అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఐబీఎం సీఈవో గినీ రోమెటీ చెప్పారు. విద్యాపరంగా కేవలం డిగ్రీ పట్టా సంపాదించడం మాత్రమే కాకుండా నైపుణ్యాలను పెంచుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి సారించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉందని కంపెనీ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గినీ తెలిపారు. లక్షల కొద్దీ ఇంజినీర్లు, బిజినెస్ స్కూల్ గ్రాడ్యుయేట్స్‌లో నాలుగింట మూడొంతుల మందికి ఉద్యోగనైపుణ్యాలు లేవంటూ నివేదికలు చెబుతున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 180 బిలియన్ డాలర్ల దేశీ సాఫ్ట్వేర్ రంగంలో ప్రస్తుతం సుమారు 40 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సీఎంఐఈ గణాంకాల ప్రకారం దేశీయంగా 135 కోట్ల జనాభాలో 60 శాతం మంది 35 ఏళ్ల వయస్సులోపు వారు ఉండగా.. 3.12 కోట్ల యువ జనాభా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. -
హెచ్‌సీఎల్ చేతికి ఐబీఎం ఉత్పత్తులు!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్... తాజాగా ఐటీ ఉత్పత్తుల దిగ్గజం ఐబీఎంకి చెందిన ఏడు సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1.8 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12,700 కోట్లు) వెచ్చించనుంది. పూర్తిగా నగదు రూపంలో ఉండే ఈ డీల్... నియంత్రణ సంస్థల అనుమతులన్నీ లభించాక... 2019 మధ్య నాటికి పూర్తి కాగలదని భావిస్తున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒప్పందం ప్రకారం సెక్యూరిటీ, మార్కెటింగ్ వంటి విభాగాలకు సంబంధించిన ఏడు సాఫ్ట్వేర్ ఉత్పత్తులను ఐబీఎం నుంచి హెచ్‌సీఎల్ కొనుగోలు చేస్తోంది. వీటి మార్కెట్ దాదాపు 50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని హెచ్‌సీఎల్ స్టాక్ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ‘ఐబీఎంకి చెందిన నిర్దిష్ట సాఫ్ట్వేర్ ఉత్పత్తులను 1.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం‘ అని పేర్కొంది. ఈ డీల్‌తో వివిధ దేశాల మార్కెట్లలోని పలు పరిశ్రమలకు సంబంధించి సుమారు 5,000 పైచిలుకు క్లయింట్స్ తమకు దఖలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఒప్పందంలో భాగంగా కొందరు ఐబీఎం ఉద్యోగులు కూడా తమ సంస్థకు బదిలీ అవుతారని హెచ్‌సీఎల్ టెక్ సీఎఫ్‌వో ప్రతీక్ అగర్వాల్ చెప్పారు. అయితే, సంఖ్య మాత్రం వెల్లడించలేదు. కొనుగోలుకు అవసరమైన నిధుల్లో సింహభాగాన్ని అంతర్గతంగా సమకూర్చుకుంటామని, 300 మిలియన్ డాలర్ల మేర రుణం తీసుకుంటామని వెల్లడించారు. ఐబీఎం సాఫ్ట్వేర్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన రెండో ఏడాది నుంచి అదనంగా 650 మిలియన్ డాలర్ల మేర ఆదాయం సమకూరవచ్చని ఇన్వెస్టర్లు, అనలిస్టులకు కంపెనీ వివరించింది. హెచ్‌సీఎల్‌కు భారీ కొనుగోలు.. హెచ్‌సీఎల్ టెక్ ఇప్పటిదాకా చేసిన కొనుగోళ్లలో ఇదే అతి పెద్ద డీల్ కానుంది. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారంలో విస్తరించాలన్న హెచ్‌సీఎల్ వ్యూహానికి ఇది తోడ్పడనుంది. ‘సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ వంటి వ్యూహాత్మక విభాగాలకు సంబంధించిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం. వీటిలో పలు ఉత్పత్తులు ఆయా విభాగాల్లో అగ్రస్థానంలో ఉన్నాయి’ అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో సి. విజయకుమార్ తెలియజేశారు. ఆయా ఉత్పత్తులు హెచ్‌సీఎల్ వ్యూహానికి అనుగుణంగా ఉంటాయని, వ్యాపార అభివృద్ధికి దోహదపడగలవని ఐబీఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కెల్లీ వివరించారు. ఉత్పత్తులు ఇవీ.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనుగోలు చేస్తున్న ఉత్పత్తుల్లో సురక్షితమైన యాప్‌ను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడే ‘యాప్ స్కాన్’, డివైజ్ నిర్వహణకు సంబంధించిన ‘బిగ్ ఫిక్స్’, మార్కెటింగ్ విభాగం ఆటోమేషన్‌కి ఉపయోగించే ’యూనికా’, ఈ– కామర్స్ సంబంధిత ’కామర్స్’ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. మిగతా వాటిలో ’కనెక్షన్స్’, డిజిటల్ మాధ్యమానికి సంబంధించిన ’పోర్టల్’, ఈ మెయిల్స్ సంబంధిత ’నోట్స్ అండ్ డొమినో’ ఉన్నాయి. షేరు 5 శాతం డౌన్.. ఐబీఎంతో డీల్ వార్తల నేపథ్యంలో శుక్రవారం హెచ్‌సీఎల్ షేరు దాదాపు 5 శాతం క్షీణించింది. బీఎస్ఈలో 4.98 శాతం క్షీణించి రూ. 961.55 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఏకంగా 7.6 శాతం పతనమై రూ. 935కి కూడా పడిపోయింది. అటు ఎన్ఎస్ఈలో 5 శాతం తగ్గి రూ. 961.9 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 934.45–రూ.1,000 శ్రేణిలో తిరుగాడింది. రెండు ఎక్సే్ఛంజీల్లో మొత్తం 1.10 కోట్ల షేర్లు చేతులు మారాయి. -
రెడ్ హ్యాట్‌ను కొనుగోలు చేసిన ఐబీఎమ్
శాన్ఫ్రాన్సిస్కో: ఓపెన్ సోర్స్ సొల్యూషన్స్ లీడర్ రెడ్ హ్యాట్ కంపెనీని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎమ్ కొనుగోలు చేసింది. రెడ్ హ్యాట్ కొనుగోలుతో లక్ష కోట్ల డాలర్ల హైబ్రిడ్ క్లౌడ్ మార్కెట్లో ఆధిపత్యం కోసం ఐబీఎమ్ మరో అడుగు ముందుకేసింది. ఈ డీల్ విలువ 3,400 కోట్ల డాలర్లు. ఐబీఎమ్ ఇప్పటి వరకూ ఎన్నో కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల లావాదేవీల్లో ఇదే అది పెద్దది. రెడ్ హ్యాట్‌ను కొనుగోలు చేయడం క్లౌడ్ మార్కెట్లో పెను మార్పుకు దారి తీయనున్నదని ఐబీఎమ్ చైర్మన్, ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గిన్ని రొమెట్టీ వ్యాఖ్యానించారు. హైబ్రిడ్ క్లౌడ్ సేవలందించే అతి పెద్ద ప్రపంచ సంస్థగా ఐబీఎమ్ అవతరించనున్నదని ఆమె పేర్కొన్నారు. ఈ డీల్‌లో భాగంగా ఒక్కొక్క రెడ్‌హ్యాట్ షేర్‌ను 190 డాలర్లకు ఐబీఎమ్ కొనుగోలు చేయనున్నది. క్లౌడ్ మార్కెట్లో ఐబీఎమ్ కంపెనీ. అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాప్ట్, గూగుల్ల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. రెడ్ హ్యాట్‌ను కొనుగోలు చేయడం వల్ల క్లౌడ్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫారŠమ్స్ మార్కెట్లో ఐబీఎమ్ పటిష్ట కంపెనీగా అవతరించగలదని నిపుణులు భావిస్తున్నారు. -
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : భర్త వేధింపులు భరించలేక ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనస్థలిపురానికి చెందిన జి. రేఖ(30) లంగర్‌హౌస్‌కు చెందిన ఉజ్వల్ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. అనంతరం చందానగర్‌లోని అపర్ణ గార్డినియా ప్లాట్‌నెంబర్ ఎ 801లో నివసిస్తున్నారు. దంపలిద్దరూ గచ్చిబౌలిలోని ఐబీఎం సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కొడుకు ఉన్నారు. వేసవి సెలవులు కావడంతో పిల్లలు వనస్థలిపురంలో అమ్మమ్మ, తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అంతేకాక భర్త ఎప్పుడూ అనుమానిస్తుండటం, ఆర్థిక ఇబ్బందులు ఆమెను ఒత్తిడికి గురిచేశాయి. ఫోన్లో మాట్లాడే విషయంలో భర్త ప్రవర్తన కారణంగా వారిద్దరి మధ్య అభిప్రాయభేదాలు అధికమయ్యాయి. కాగా.. శనివారం రాత్రి భార్యాభర్తలిద్దరు గచ్చిబౌలిలోని ఓ పబ్‌కు వెళ్లారు. ఇంటికి వచ్చాక గొడవపడి వేర్వేరు గదుల్లో నిద్రపోయారు. ఆదివారం ఉదయం ఉజ్వల్ లేచి చూసే సరికి రేఖ ఫ్యానుకు చీరతో వేలాడుతూ కనిపించింది. స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. భర్తపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే రేఖ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
ఐబీఎం ఫలితాలు..ప్చ్
సాక్షి, ముంబై: ప్రపంచంలో అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ ఐబీఎం (ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్) ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ ఫలితాల్లో చతికిల పడింది. గత ఏడాది వేగవంతమైన అభివృద్ధిని కనబర్చిన ఐబీఎం నిరాశజనకమైన ఫలితాలను ప్రకటించింది. మార్జిన్లు, గైడెన్స్ కోత నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలవైపు మొగ్గు చూపారు. దీంతో ఐబీఎం షేరు 6 శాతం కుప్పకూలింది. ఇటీవలి సంవత్సరాల్లో క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్ లాంటి అధిక-మార్జిన్ వ్యాపారాలపై దృష్టిని మార్చింది, కానీ వాటాదారులు ఆశించినంత వేగాన్ని అందుకోలేకపోయింది. ఐబీఎం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 5 శాతం పెరిగి 19.07 బిలియన్ డాలర్లకు చేరింది. భద్రతా సేవల నుంచి 65 శాతం వృద్ధి సాధించింది. క్లౌడ్ రెవెన్యూ 25 శాతం పెరిగింది. 2018 మార్చి 31తో ముగిసిన మొదటి త్రైమాసికంలో నికర లాభం 1.68 బిలియన్ డాలర్లు లేదా 1.81 బిలియన్ డాలర్ లకు పడిపోయింది, అంతకు ముందు సంవత్సరం 1.75 బిలియన్ డాలర్లుగా ఉంది. కంపెనీ సర్దుబాటు స్థూల లాభం ఏడాది క్రితం 44.5 శాతం నుంచి 43.7 శాతానికి పడిపోయింది. వన్ టైం చార్జీల కారణంగా లాభాలు క్షీణించాయని కంపెనీ పేర్కొంది.ఐబీఎం సీఎఫ్‌వో జేమ్స్ కవానాగ్ మాట్లాడుతూ, కంపెనీ ఖర్చులను తగ్గించి, మొదటి త్రైమాసికంలో 610 మిలియన్ డాలర్లను సాధించినట్టు చెప్పారు. అయితే వివరాలపై స్పష్టత నివ్వలేదు. మరోవైపుఈ ఫలితాల నేపథ్యంలో ఐబీఎంలో ఉద్యోగుల తొలగింపుకు దారి తీస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. -
ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధం!
కంప్యూటర్ రంగంలో సరికొత్త విప్లవానికి నాందిగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఐబీఎం 50 క్యూబిట్లతో ఓ క్వాంటమ్ కంప్యూటర్ను సిద్ధం చేసింది. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లకు కొన్ని లక్షల రెట్లు ఎక్కువ వేగంగా పనిచేస్తాయన్నది క్వాంటమ్ కంప్యూటర్‌కు మనం ఇవ్వగల సాధారణ పరిచయం. కణాల తీరును ఆధారంగా చేసుకుని ఇవి పనిచేస్తాయి. సాధారణ కంప్యూటర్లలో ఒక ట్రాన్సిస్టర్ గుండా విద్యుత్తు ప్రవహిస్తే ‘1’గా, ఆగిపోతే ‘0’గా గుర్తిస్తారని.. ఈ 1, 0లతోనే మొత్తం కంప్యూటర్ లెక్కలు ఆధారపడి ఉంటాయన్నది మనకు తెలిసిందే. ఈ రకమైన డిజిటల్ కంప్యూటర్లలో వృద్ధికి అవకాశాలు తక్కువైన నేపథ్యంలో శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ కోసం పరిశోధనలు చేస్తున్నారు. పదార్థపు సూక్ష్మ ప్రపంచాన్ని వివరించే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఒక కణం ఏకకాలంలో భిన్న స్థితుల్లో ఉండగలుగుతుంది. దీన్నే క్యూబిట్ అంటారు. ఇలాంటి కొన్ని కణాలను అనుసంధానించడం ద్వారా వాటితో లెక్కలు కట్టవచ్చునని అంచనా. ఈ నేపథ్యంలో ఐబీఎం దాదాపు 50 క్యూబిట్లతో ఒక కంప్యూటర్ను తయారు చేసినట్లు ప్రకటించింది. క్వాంటమ్ కంప్యూటర్లు అత్యంత శక్తిమంతమైనవని ముందుగానే చెప్పుకున్నాం గానీ.. దీన్ని సాధారణ ప్రజలు వాడుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోపు వీటితో కొత్త కొత్త మందుల తయారీకి పరిశోధనలు నిర్వహించవచ్చు. అంతేకాకుండా వినూత్న లక్షణాలుండే పదార్థాలను ఆవిష్కరించవచ్చు. సుదూర అంతరిక్ష శోధన కూడా సులువు అవుతుంది.! -
బిగ్ డేటా, ఎనలిస్టులకు బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ ఉద్యోగాలు సంక్షోభంలో పడిన నేపథ్యంలో భారీగా ఉద్యోగాలు రానున్నాయనే అంచనాలు ఊరట నిస్తున్నాయి. 2017 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వేల ఉద్యోగాలు రానున్నాయని ఆన్లైన్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఈ ఏడాదిలో అత్యధిక సంఖ్యలో అమెజాన్, సిటీ, హెచ్‌సీఎల్, గోల్డ్ మాన్ సాచ్స్ , ఐబిఎం లాంటి ప్రముఖ సంస్థల్లో ఈ ఎనలిటిక్స్ ఉద్యోగాలకు మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయని పేర్కొంది. ఎనలటిక్స్, బిగ్ డేటా ,డేటా సైన్స్ ప్లాట్‌ఫాం, ఎనలటిక్స్ అండ్ మ్యాగజైన్ , ఆన్లైన్ ఎనలిటిక్స్ శిక్షణా సంస్థ ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ సంయుక్తంగా ది ఎనలటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ 2017 పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. భారతదేశంలో ఎనలిస్టులు, డేటా సైన్స్, బిగ్ డేటాలో నియామకాలు పెరుగుతాయని ఈ అధ్యయనం తేల్చింది. గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో డేటా ఎనలిస్టులు ఉద్యోగాలు లభించనున్నాయిని అనలాటిక్స్ అండ్ డేటా సైన్స్ ఇండియా జాబ్స్ స్టడీ 2017 ప్రకారం తేలింది. దాదాపు 50వేల ఎనలిస్టు జాబ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఐటీలో తగ్గిన నియామకాలకారణంగా కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఆందోళనలో ఉన్నారు. తక్కువ ఐటి నియామకం ఈ 42 శాతం మంది బీఈ / బీటెక్ గ్రాడ్యుయేట్లకు కేటాయిస్తుండగా, మరో 40 శాతం ఎంబీఏ, ఎంటెక్ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హతలు కోసం చూస్తున్నారట. దీంతో ఈ ఉద్యోగ నియామకాల్లో టైర్ -బి నగరాల్లో 2016 లో 5 శాతం నుంచి ఈ ఏడాది 7 శాతం వరకు పెరిగిందిని ఈ సర్వే తెలిపింది. అమెరికా తరువాత ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణ మరియు డేటా సైన్స్ ఉద్యోగాల్లో అవకాశాలలో 12 శాతం వాటాతో ఇండియా ప్రస్తుతం ప్రపంచంలోని అతి పెద్ద విశ్లేషణ కేంద్రంగా ఉంది. వీటిల్లో అమెజాన్, సీటీ, ఐబీఎం , హెచ్‌సీఎల్ లాంటివి ఎక్కువ సంఖ్యలో ఎనలిక్స్ ఉద్యోగాలను కల్పించాయి. నగరాల పరంగా, బెంగళూరు అన్ని ఎనలిటిక్స్ ఉద్యోగాల్లో దాదాపు 25 శాతం ఉద్యోగాలతో టాప్ లోనూ, ఢిల్లీలో రెండవ స్థానంలోనూ ఉంది. ఇక ఫెషర్స్ విషయానికి వస్తే , చెన్నై మొత్తం ఓపెనింగ్స్‌లో టాప్ లోఉంది. 2-7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిలో దాదాపు 50 శాతం ఉద్యోగాలు అన్ని నగరాల్లోనూ ఉన్నారని ఈ సర్వేలో వెల్లడైంది. అంతేకాదు ఈ ఎనలిటిక్స్, డేటా సైన్స్ ఉద్యోగాల్లో సంవత్సరానికి సగటు జీతం రూ. 10.5 లక్షలు. దాదాపు 40 శాతం ఉద్యోగాల్లో సంవత్సరానికి రూ.10 లక్షల ఎక్కువ జీతం లభిస్తోంది. తద్వారా ఇది అత్యధిక వేతనం చెల్లిస్తున్న రంగాలలో ఒకటిగా నిలిచింది. వివిధ పరిశ్రమల్లో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో దేశంలో నైపుణ్యం కలిగిన విశ్లేషకుల నిపుణుల డిమాండ్ పెరిగిందని ఎనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ స్థాపకుడు, సీఈవో భాస్కర్ గుప్తా చెప్పారు. ఎడ్వాన్సెర్ ఎడ్యూవెంచర్స్ స్థాపకుడు, సీఈవో ఆతాష్ షా మాట్లాడుతూ డేటా సైన్స్, ఎనలిటిక్స్ విభాగం ఉద్యోగాల్లో దాదాపు 100 శాతం వృద్ధిని సాధించిందని చెప్పారు. ఈ బూం ను అందిపుచ్చుకోవాడానికి ఐటీ ఉద్యోగులు డేటా సైన్స్ నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. -
స్టాక్స్ వ్యూ
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ బ్రోకరేజ్ సంస్థ: ఐడీబీఐ క్యాపిటల్ ప్రస్తుత ధర: రూ.847 ; టార్గెట్ ధర: రూ.1,027 ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మంచి ఆర్థిక ఫలితాలు సాధించింది. ఆదాయం గత ఆర్థిక సంవత్సరం క్యూ3 కంటే 4% పెరిగింది. బట్లర్ అమెరికా ఏరోస్పేస్, జియోమెట్రిక్ కంపెనీల విలీనం, ఐబీఎం నుంచి లభించిన కొన్ని భాగస్వామ్య ఒప్పందాల కారణంగా ఆదాయం ఈ స్థాయిలో పెరిగింది. ఇబిటా మార్జిన్ 34 బేసిస్ పాయింట్ల వృద్ధితో 20 శాతానికి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన పోల్చితే 12 శాతం వృద్ది నమోదైంది) పెరిగింది. షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 21 శాతం వృద్ధితో రూ.16.5కు పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 10.5–12.5 శాతం రేంజ్లో పెరగగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇబిటా మార్జిన్ 19.5–20.5% రేంజ్లో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో 19గా ఉన్న 5 కోట్ల డాలర్లకు మించిన ఆదాయాన్నిచ్చే క్లయింట్ల సంఖ్య గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 25కి పెరిగింది. గతంలోలాగానే ఇతర కంపెనీలు కొనుగోలు చేయడానికి జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. డాలర్‌తో రూపాయి మారకం బలపడడడం, వివిధ కంపెనీల కొనుగోళ్లకు నగదు నిల్వలు ఖర్చవడం వంటి అంశాలు ప్రతికూల ప్రభావం చూపినప్పటికీ, నిర్వహణ సామర్థ్యం పెంపుదలతో ఈ సమస్యల నుంచి కొంత మేరకు గట్టెక్కగలిగింది. రూ.300 కోట్ల పన్ను కేటాయింపుల రివర్సల్ కారణంగా ఈపీఎస్... అంచనాలను మించి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ 1% పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. ఇక రెండేళ్లలో ఆదాయం 12%, ఈపీఎస్ 10.5% చొప్పున పెరగగలవని భావిస్తున్నాం. అలాగే ఇబిటా మార్జిన్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20.1 శాతంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండగలదని అంచనా వేస్తున్నాం. లార్జ్ క్యాప్ ఐటీ కంపెనీల్లో దీనికే అగ్ర ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎల్ అండ్ టీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.1,740 ; టార్గెట్ ధర: రూ.1,970 ఎందుకంటే: లార్సెన్ అండ్ టుబ్రో.. భారత్‌లో ఇంజినీరింగ్ అండ్ కన్స్ఠ్రక్షన్(ఈ అండ్ సీ) రంగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీల్లో ఒకటి. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో అధికంగా ప్రయోజనం పొందగలిగే కంపెనీల్లో ఇది కూడా ఒకటి.2015–16లో 12 శాతంగా ఉన్న రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ)ని 18 శాతానికి పెంచుకోవాలని కంపెనీ భావిస్తోంది. షిప్‌యార్డ్, పవర్ బీటీజీ, ఫోర్జింగ్స్ వంటి తయారీరంగ వ్యాపారాల్లో దీర్ఘకాలంలో మంచి వృద్ధిని సాధించగలిగే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్లుగా ఉన్న ఆర్డర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17 శాతం వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. ఫలితంగా కన్సాలిడేటెడ్ ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.65గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.76గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. మౌలిక, హైడ్రోకార్బన్స్, రక్షణ రంగాల నుంచి జోరుగా ఆర్డర్లను ఈ కంపెనీ సాధించగలదని భావిస్తున్నాం. ఇంజినీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈ అండ్ సీ) రంగంలో ప్రాజెక్ట్‌ల అమలు గత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో మందకొడిగా ఉంది. ఈ రంగంలో ప్రాజెక్టుల అమలు పుంజుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం ఆదాయం 15 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. ఆస్తుల విక్రయం ద్వారా రిటర్న్ ఆన్ ఈక్విటీ మెరుగుపరచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఏడాదికి రూ.1,000 కోట్ల వరకూ నష్టాలు వస్తున్న కట్టుపల్లి పోర్ట్‌తో పాటు కొన్ని రోడ్డు ప్రాజెక్ట్‌లను కూడా విక్రయించాలని యోచిస్తోంది. ఫలితంగా ఆర్ఓఈ 2 శాతం పెరుగుతుందని అంచనా. సమ్ ఆఫ్ ద పార్ట్స్(ఎస్ఓటీపీ) ప్రాతిపదికన టార్గెట్ ధరను నిర్ణయించాం. -
హెచ్ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్ చురకలు
న్యూఢిల్లీ: అమెరికా కొత్త హెచ్1 బీ పాలసీ నిబంధనలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించారు. అమెరికా తదితర దేశాల రక్షణవాద విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ట్రంప్ హెచ్ 1 బీ వీసాల కఠిన నిబంధనలతో తీసుకొచ్చిన కొత్త ఆర్డర్లపై చురకలంటించారు. పరస్పర సహకారం లేకపోతే అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవని ఆయన ప్రశ్నించారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ లో ఇండియన్ ఎకనామిక్ పాలసీస్‌పై రాజ్ సెంటర్ స్పాన్సర్ చేసిన ‘థర్డ్ కోటక్ ఫ్యామిలీ విశిష్ట ప్రసంగం’ లో సోమవారం పటేల్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాన ప్రపంచ ఆర్థికవ్యవస్థల రక్షణవాద ధోరణుల పెరుగుదలపై ప్రశ్నకు ప్రతిస్పందనగా పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఉత్పత్తులు, ప్రతిభను అందించకపోతే, ఆపిల్, సిస్కో ఐబిఎమ్ లాంటి భారీ అమెరికన్ సంస్థలు ఎక్కడ ఉండేవని ఉర్జిత్ ప్రశ్నించారు. అమెరికా సహా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కార్పోరేషన్ల విలువ గ్లోబల్ సప్లయ్ చైన్ల కారణంగానే పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంపద సృష్టికర్తలు ఇలాంటి విధానాలను అబలంబిస్తే చివరికివారే ఈ ప్రభావానికి లోను కావాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీలు, సరిహద్దు పన్ను వంటి వాణిజ్య పరికరాలను ఉపయోగించడం సమర్థవంతమైన మార్గం కాదన్నారు. వాస్తవానికి దీనికి వేరే మార్గం ఎంచుకువాల్సి ఉంటుందన్నారు. ఈక్విటీ మరియు డిస్ట్రిబ్యూషన్స్ విధానాల్లో అనుసరిస్తున్న విధానాల కొన్నింటి ప్రభావం వారికి తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ఇది వృద్ధికి తీరని నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. ఇది దేశీయ విధానాంగా ఉండాలన్నారు. దేశీయ విధాన సమస్యగా ఉండాలి. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఉర్జిత్ తెలిపారు. -
ఐబీఎంలో 2వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ : న్యూయార్క్ ఐటీ దిగ్గజం ఐబీఎం కొత్త ఉద్యోగాల జాతర ప్రకటించబోతుంది. దాదాపు 2000వేల మంది అమెరికన్ నిపుణులను కొత్తగా కంపెనీలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది. వచ్చే నాలుగేళ్లలో 25వేల మందిని నియమించుకోనున్నట్టు కంపెనీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నియామకంలో భాగంగా 2వేల మందిని ప్రస్తుతం నియమించుకోబోతున్నట్టు తెలిపింది. ఐబీఎం జాబ్స్ అందుబాటులోని వెబ్ సైట్ లో ఇప్పటికే 35 ప్రాంతాల్లో 13 కేటగిరీల్లో 3400 ఉద్యోగాలను అందుబాటులో ఉంచింది. దీనిలో 700 పైగా స్థానాలు నార్త్ కరోలినాలో ఆఫర్ చేస్తోంది. కొత్తగా సృష్టించబోయే ఉద్యోగాల్లో చాలా పొజిషన్లకు నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ అవసరం లేదని కంపెనీ తెలిపింది. వైట్ హౌస్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో జరిగిన భేటీ అనంతరం కంపెనీ ఈ ప్రకటన విడుదల చేసింది. ట్రంప్ తో జరిగిన భేటీలో జర్మన్ ఛాన్సలర్ మెర్కిల్, ఇతర బిజినెస్ లీడర్లతో పాటు కంపెనీ సీఈవో గిన్నీ రోమెట్టి కూడా పాల్గొన్నారు. సాఫ్ట్ వేర్ వాడే రక్షణ, న్యాయ సంబంధమైన పరిశ్రమల్లో తాము ఉద్యోగులకు ఉచిత ట్రైనింగ్ కూడా ఇవ్వనున్నట్టు కంపెనీ పేర్కొంది. -
కోనసీమలో ఐబీఎం ప్రతినిధులు
-పలు ప్రాంతాల్లో పర్యటన -కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల పరిశీలన అంబాజీపేట (పి.గన్నవరం) :కోనసీమలో కొబ్బరి ఆధారిత ఉత్పత్తుల అ«ధ్యయనానికి ఇంటర్నేషన్ బిజినెస్ మెషీన్(ఐబీఎం)కు చెందిన ముగ్గురు ప్రతినిధులు శనివారం కోనసీమలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ పథకంలో భాగంగా అమెరికాకు చెందిన మెర్రీలాన్, డెన్మార్క్‌కు చెందిన క్రిస్టిన్, ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్రీల బృందానికి ఇక్రిశాట్ మేనేజర్ జి.పార్థసారథి నాయకత్వం వహించారు. అంబాజీపేటలో విలేకరులతో సమావేశమయ్యారు. అయినవిల్లిలో కొబ్బరికాయల దింపు, వలుపు, కాయలను ముక్క పెట్టడం, ప్యాక్ హౌస్‌లలో నిల్వ చేయడాన్ని పరిశీలించారు. అయినవిల్లిలంకలో కొబ్బరి పీచు పరిశ్రమను సందర్శించి తాడు తయారీ, మార్కెటింగ్, కొబ్బరి తోటలలో అంతర పంటల సాగును పరిశీలించారు. అయినవిల్లికి చెందిన విళ్ళ దొరబాబు నిర్వహిస్తున్న ఎకో టూరిజంను సందర్శించి ఉద్యాన శాఖ విద్యార్థులకు ఏవిధంగా శిక్షణ ఇస్తున్నారో పరిశీలించారు. అమలాపురం రూరల్ మండలం చిందాడ గరువులో కొబ్బరి చెట్ల నుంచి కల్పరస తీసే విధానం, వర్మీ కంపోస్టు నిర్వహణ, ఒంగోలు జాతి ఆవుల సంరక్షణల గురించి నిర్వాహకుడు అడ్డాల గోపాలకృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎంట్రికోనలో కొబ్బరి కలెక్షన్ గ్రేడింగ్ సెంటర్‌ను సందర్శించారు. బండారులంకలో సమయమంతుల పండుకు పొలంలో కోప్రా డ్రైయర్, అరటి పళ్ళను సహజంగా ముగ్గపెట్టే పద్ధతిని పరిశీలించారు. అంబాజీపేటలోని కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ అధ్యక్షుడు గణపతి వీరరాఘవులుతో సమావేశమై కొబ్బరి కాయలు వలిచే యంత్రాన్ని, గణపతి బాబులుకు చెందిన మిల్లులో కొబ్బరి నూనె తీసే విధానాన్ని పరిశీలించారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు దొంగ నాగేశ్వరరావు నిర్మిస్తున్న ప్యాక్ హౌస్‌ను సందర్శించి ఆయన సాగు చేస్తున్న 24 రకాల మొక్కలను పరిశీలించారు. గత పది రోజులుగా ఈ బృందం ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్లతో కలిసి వివిధ అంశాలపై అధ్యయనం చేస్తున్నారని, ప్రభుత్వానికి నేరుగా నివేదిక సమర్పిస్తారని ఇక్రిశాట్ మేనేజర్ పార్థసారథి తెలిపారు. వీరి వెంట అమలాపురం ఏడీహెచ్ సీహెచ్ శ్రీనివాస్, బీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల జమ్మీలు, ఉపాధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు, దంగేటి గిరిధర్, ఉద్యాన శాఖ ఏఓ వెంకటేశ్వరరావు, ఎంపీఈఓ సీహెచ్ రాజేష్ ఉన్నారు. -
ట్రంప్ దెబ్బ:25వేల ఉద్యోగాల ఆఫర్
అమెరికా టెక్ దిగ్గజం ఐబీఎం అమెరికన్లకు భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో దేశంలో 25,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డోనాల్డ్ ట్రంప్ వివిధ టెక్నాలజీ దిగ్గజాలతో భేటీ కి ముందు రోజు ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుమారు 6వేల ఉద్యోగాలను 2017లో తీసుకోనున్నామని ఐబిఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గిన్నీ రోమట్టీ తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో సంస్థ కార్యకలాపాలు చేపట్టిన పునర్నిర్మాణంలో భాగంగాఓ రాబోయే నాలుగు సంవత్సరాలలో బిలియన్ డాలర్లను ఉద్యోగి శిక్షణ మరియు అభివృద్ధికో్సం పెట్టుబడిగా పెట్టనుందని ఐబీఎం ఛైర్మన్ తెలిపారు. డాటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా చాలా సంస్థలు తమ వ్యాపారాన్ని పునర్నిర్మించుకుంటున్నాయని ఆమె గుర్తుచేశారు. ఈ నియామకాలు వైట్ కాలర్ వెర్సస్ బ్లూ కాలర్ కాదనీ, పరిశ్రమలో భారీ డిమాండ్ ఉండి, ఖాళీగా ఉండిపోతున్న కొత్త కాలర్ ఉద్యోగాలని ఆమె చెప్పారు. మరోవైపు ట్రంప్ అమెరికా ఆర్థికవృద్ధికి, ఉద్యోగాల కల్పనకు ట్రంప్ ఏర్పాటు చేసిన బిజినెస్ లీడర్ల స్ట్రాటజిక్ అండ్ పాలసీ ఫోరంలో రోమెట్టి సభ్యురాలిగా ఉన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఐబీఎం లాంటి అమెరికా దిగ్గజాలు దేశంలో వేల ఉద్యోగాలు తొలగిస్తూ భారతదేశ ఉద్యోగులవైపు మొగ్గు చూపుతున్నాయన్న విమర్శలు చెలరేగాయి. దీంతో దశాబ్దంలో మొదటిసారి 2013 సంవత్సరం ప్రారంభంతో పోలిస్తే చివరిలో స్వల్పంగా ఉద్యోగులను నియమించుకున్నట్టు నివేదించింది. ఆ తరువాతి సంవత్సరం మొత్తం వర్క్ ఫోర్స్ లో 12 శాతం నియమించుకున్నట్టు తెలిపింది. అలాగే గత అయిదేళ్లలో లేని ప్రాధాన్యతను గత ఏడాది అమెరికా ఉద్యోగులకు ఇచ్చినట్టు ఐబీఎం వెల్లడించింది. వివిధ సంస్థల అధిపతులు ముఖ్యంగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్, మైక్రో సాప్ట్ సీఈవో సత్య నాదెళ్ల అక్షరం లారీ పేజ్ (గూగుల్) తెస్లా నుంచి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అధిపతులను బుధవారం జరగనున్న సమావేశానికి ఆహ్వానం అందింది. అటు చైనాలో రూపొందించే ఐ ఫోన్లను అమెరికాలో తయారు కావాలని ఆశిస్తున్నట్టు ట్రంప్ గత వారం ప్రకటించారు. ఇందుకు అమెరికాలో పెద్ద ఫ్యాక్టరీని నెలకొల్పాలని యోచిస్తున్నట్టు చెప్పారు. తద్వారా అమెరికాలో భారీ ఎత్తున ఉద్యోగాల కల్పనకు ఆలోచిస్తున్నట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
ఇక 'స్మార్ట్' గా రాష్ట్రపతి భవనం
న్యూఢిల్లీ : ప్రకృతి రమణీయతకు మారుపేరుగా, అందమైన ఉద్యానవనాలతో ప్రధాన ఆకర్షణగా ఉండే అద్భుతమైన రాష్ట్రపతి భవనం, ఐబీఎమ్ స్మార్ట్ సిటీ సొల్యూషన్ సహకారంతో స్మార్ట్ టౌన్ షిప్ గా రూపొందనుంది. స్మార్ట్ సిటీ సొల్యూషన్ లో భాగంగా ప్రెసిడెన్సియల్ ఎస్టేట్ లో డిజిటల్ ట్రాన్సపర్ మేషన్ ను చేపట్టనున్నట్టు ఐబీఎమ్ గురువారం ప్రకటించింది. 330 ఎకరాల విస్తీర్ణాన్ని, 5వేల పైగా రెసిడెంట్లను, అధ్యక్ష ఎస్టేట్ ను భవిష్యత్తులో స్మార్ట్ గా రూపుదిద్దడానికి ఐబీఎమ్ టెక్నాలజీ సహాయపడనుంది. నీళ్ల సరఫరా, భద్రతా, విద్యుత్ అవస్థాపన, ఘన వ్యర్థాల నిర్వహణను సవాళ్లగా తీసుకుంటూ టౌన్ షిప్ ను అభివృద్ధి చేస్తామని ఐబీఎమ్ పేర్కొంది. ఇప్పటికే ఐబీఎమ్ ఇంటిలిజెన్స్ ఆపరేషన్ సెంటర్(ఐఓఎస్) సిటిజన్స్ మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టింది. వెబ్, మొబైల్ ద్వారా సమస్యలను తెలియజేసేలా దీన్ని రూపొందించింది. డిజిటల్ యుగంలో రాష్ట్రపతి భవన్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఓ ఈవెంట్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత స్మార్ట్ సిటీ విజన్ కు రాష్ట్రపతి భవనం సారుప్యంగా మారుస్తామని, ఈ స్మార్ట్ టౌన్ షిప్ గ్రేట్ జర్నీలో తాము భాగస్వామ్యమైనందుకు చాలా గర్వంగా భావిస్తున్నామని భారత ఐబీఎమ్ ఎండీ వనిత నారాయణన్ అన్నారు. -
ఆ భవనానికీ స్మార్ట్ టౌన్ హోదా!
న్యూఢిల్లీ: టర్కీ తర్వాత ఒక దేశ ప్రథమ పౌరుడు నివసించే అతి పెద్ద నివాసంగా పేరొందిన రాష్ట్రపతి భవన్ త్వరలో స్మార్ట్ టౌన్‌షిప్‌గా మారనుంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (ఐబీఎమ్)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురువారం ఈ మేరకు భవన్లో చేపట్టబోయే ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ సెంటర్ (ఐఓసీ), 'మానిటర్' పేరుతో తయారుచేసిన ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ప్రారంభించారు. ఈ అప్లికేషన్‌ను ఉపయోగించి నీటి నిర్వహణ, విద్యుత్, చెత్త డిస్పోజింగ్, తోటల నిర్వహణలను పర్యవేక్షించనున్నారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో స్మార్ట్ పట్టణాలను ఎలా నిర్మిస్తారో రాష్ట్రపతి భవన్లో కూడా అదే మోడల్‌ను అనుసరిస్తారు. ఏదైనా రాష్ట్రంలోని ఐదు గ్రామాలను ఎంపిక చేసి వాటిని పూర్తిగా అభివృద్ధి చేసి ఆ మోడల్ ను రాష్ట్రపతి భవన్ కు అన్వయిస్తారు. నిపుణుల బృందాలు, రాష్ట్రాల పరిపాలన భవనాలు, జిల్లా పరిపాలనా కేంద్రాలతో దీన్ని అనుసంధానిస్తారు. -
కంప్యూటరే లాయరు
♦ కొత్త పరిజ్ఞానాన్ని రూపొందించిన ఐబీఎమ్ ♦ న్యాయ సమస్యలకు చిటికెలో పరిష్కారాలు చూపుతున్న రాస్ ♦ విడుదలవగానే ఉద్యోగమిచ్చిన న్యూయార్క్ న్యాయ సంస్థ బేకర్ అండ్ హాస్టెట్లర్ వాషింగ్టన్: ఏళ్ల తరబడి పరిష్కారం లేకుండా ఉన్న కోర్టు కేసులను, చట్టం పుస్తకాలతో కుస్తీలు పట్టే న్యాయవాదులను చూస్తూనే ఉంటాం. ఇకపై ఇలాంటి సమస్యలకు ఊరట కలిగించేలా కంప్యూటర్ లాయర్లు అందుబాటులోకి రానున్నాయి. కేసు గురించి చెప్పగానే.. దీన్ని వాదించేందుకు కావాల్సిన సలహాలు, సూచనలను నిమిషాల్లో ఇవి అందించనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ ఐబీఎమ్ ‘రాస్’ అనే ప్రపంచంలోనే తొలి ‘కృత్రిమ మేధో న్యాయవాది’ని రూపొందించింది. వాట్సన్ కాగ్నిటివ్ కంప్యూటింగ్ టెక్నాలజీతో ‘రాస్’ను రూపొందించారు. దీని కౌశలాన్ని చూసి మహామహులైన న్యాయ కోవిదులు ఆశ్చర్యపోతున్నారు. రాస్ ఏమేం చేస్తుంది? అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన కంప్యూటర్ టెక్నాలజీయే ‘రాస్’. ఏదైనా కేసును దీనికి అర్థమయ్యేలా సులభమైన భాషలో చెప్పినా అర్థం చేసుకుంటుంది. దీన్ని తనకున్న పూర్తి సమాచారంతో కేసును విశ్లేషించుకుని.. పూర్తి వివరణాత్మకంగా పరిష్కారం సూచిస్తుంది. దీంతోపాటు గతంలో జరిగిన ఇలాంటి కేసులేంటి? ఎక్కడెక్కడ, ఏవిధంగా దీనిపై వాదనలు జరిగాయి? ఎలాంటి ఆధారాలను పొందుపరిచారు? ఏ విధమైన తీర్పులు వెలువరించారో మనకు అర్థమయ్యేలా చెబుతుంది. ఈ రాస్తో మాట్లాడుతున్నంత సేపు సదరు కేసు గురించి మన న్యాయవాద మిత్రుడితో మాట్లాడినట్లుగానే ఉంటుందని దీన్ని రూపొందించిన ఐబీఎమ్ సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. ఎప్పటికప్పుడు చట్టాల్లో వస్తున్న మార్పులు, తాజా కోర్టు తీర్పులను తెలిపి.. దీనికి అనుగుణంగా న్యాయవాదులు వ్యవహరించాల్సిన తీరుపైనా స్పష్టతనిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇది దివాళా కేసులకు మాత్రమే సలహాలిస్తుంది. ఆశ్చర్యపోతున్న న్యాయకోవిదులు అసలు ‘రాస్’ గురించి ఐబీఎమ్ చెప్పటం సరే ఇదేలా పనిచేస్తుందని పలువురు న్యాయకోవిదులు పరీక్షించారు. వివిధ కేసులను రాస్తో ప్రస్తావించి.. పరిష్కారం కోరారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీరి దగ్గరున్న సమాచారంతోపాటు అదనపు సమాచారాన్ని, మారిన చట్టంలో సవరణలను చెప్పి వారందరినీ రాస్ ఆశ్చర్యపరిచింది. రాస్కు ఉద్యోగం 2011లోనే రాస్‌ను రూపొందించినా.. తర్వాత పది నెలలపాటు దీనికి దివాళా చట్టం (బ్యాంక్ప్ట్స్రీ లా)ను నేర్పించారు. 2014లో పరీక్షించినపుడు దీని కౌశలాన్ని గమనించిన న్యూయార్క్ లా ఫర్మ్ ‘బేకర్ అండ్ హాస్టెట్లర్’ రాస్కు ఉద్యోగమిచ్చింది. ‘రాస్ వంటి తెలివైన కృత్రిమ న్యాయవాది సంస్థలో చేరటం మాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో మా క్లయింట్లకు మరింత విస్తృతమైన సేవలను అందిస్తాం’ అని సంస్థ తెలిపింది. మరింత పరిశోధన: ఐబీఎం రాస్కు ప్రస్తుతానికి దివాళా చట్టంపై పూర్తి అవగాహన ఉంది. దీని ఆధారంగా భవిష్యత్తులో ఇతర విభాగాల్లోనూ దీనికి శిక్షణ ఇచ్చేందుకు పరిశోధనలు చేస్తున్నామని ఐబీఎమ్ వెల్లడించింది. వినియోగిస్తున్న కొద్దీ దీని కౌశలం పెరుగుతుందని, విశ్లేషణ సామర్థ్యం పెరుగుతుందని తెలిపింది. -
మరింత చతికిలపడ్డ ఐబీఎమ్
ఓ వైపు భారత ఐటీ దిగ్గజాలన్నీ నాలుగో త్రైమాసికంలో అంచనాలకు మించిన లాభాల్లో దూసుకెళ్లగా.. ప్రపంచంలోనే అతి పెద్ద టెక్నాలజీ సర్వీస్ కంపెనీగా పేరున్న ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ కార్పొరేషన్ (ఐబీఎమ్) మాత్రం మొదటి త్రైమాసికంలో చెత్త ఆదాయాలను ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 4.6 శాతం రాబడులు పడిపోయి, 18.68 బిలియన్ డాలర్లుగా ఆదాయాన్ని నమోదుచేసింది. అయితే మార్కెట్ విశ్లేషకుల అంచనా (18.29 బిలియన్ డాలర్ల) కంటే ఎక్కువగానే ఆదాయాన్ని చూపించింది. 14 ఏళ్లలోనే ఈ త్రైమాసికం అతి చెత్త క్వార్టర్ అని ఐబీఎమ్ ప్రకటించింది. ఐబీఎమ్ వరుసగా 16 త్రైమాసికాల్లో నష్టాలనే చవిచూసింది. సంప్రదాయ వ్యాపారాల క్షీణత వల్ల నేలచూపులు చూస్తున్న ఐబీఎమ్ రాబడులను మెరుగుపరుచుకోడానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ గినీ రోమిటి నేతృత్వంలో క్లౌడ్ బేస్డ్ సర్వీసులను, సెక్యూరిటీ సాప్ట్ వేర్ లను, డేటా ఎనలిటిక్స్ వ్యాపారాలను చేపట్టింది. అయితే క్లౌడ్, మొబైల్ కంప్యూటింగ్ వంటి కొత్త వ్యాపారాలు కూడా సంప్రదాయ హార్డ్ వేర్ క్షీణతను నిరోధించలేకపోవడంతో ఐబీఎమ్ త్రైమాసిక ఫలితాలు నష్టాలను చవిచూశాయి. ఐబీఎమ్ చేపట్టిన కొత్త వ్యాపారాలు 14శాతం పెరిగినా, హార్డ్ వేర్, సేవా విభాగాలు 21.8 శాతం, 4.3 శాతం పడిపోవడంతో ఐబీఎమ్ ఈ చెత్త ఆదాయాన్ని ప్రకటించింది. -
ఐబీఎం చేతికి ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్
డీల్ విలువ 2.6 బిలియన్ డాలర్లు న్యూయార్క్: టెక్ దిగ్గజం ఐబీఎం తాజాగా ట్రూవెన్ హెల్త్ అనలిటిక్స్‌ను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 2.6 బిలియన్ డాలర్లు. ఐబీఎంలో భాగమైన వాట్సన్ హెల్త్ విభాగం ద్వారా ఈ కొనుగోలు జరిగింది. వైద్య రంగ సంస్థలకు క్లౌడ్ కంప్యూటింగ్, డేటా మేనేజ్మెంట్ సేవలందించే విభాగంలో ఐబీఎం తన స్థానం పటిష్టం చేసుకునేందుకు ఇది ఉపయోగపడనుంది. ట్రూవెన్ ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 8,500 పైచిలుకు సంస్థలకు అనలిటిక్స్ సర్వీసులు అంది స్తోంది. వాట్సన్ హెల్త్ ఇటీవలే హెల్త్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఫెటైల్, ఎక్స్ప్లోరిస్ హెల్త్‌కేర్ డేటాబేస్లను గతేడాది కొనుగోలు చేసింది. ప్రస్తుతం ట్రూవెన్ను దక్కించుకోవడంతో హెల్త్‌కేర్ సర్వీసుల సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా వాట్సన్ హెల్త్ 4 బిలియన్ డాలర్ల పైగా వెచ్చించినట్లవుతుంది. దాదాపు వైద్య పరిశోధనకు సంబంధించిన క్లౌడ్ ఆధారిత సర్వీసుల్లో విస్తరించే దిశగా ఐబీఎం 2015 ఏప్రిల్‌లో వాట్సన్ హెల్త్‌ను ప్రారంభించింది. -
ఇది భారత్ శతాబ్ది: ఐబీఎం చైర్మన్ రొమెటీ
న్యూఢిల్లీ : పటిష్టమైన స్థూల దేశీయోత్పత్తి, కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ, విస్తృతంగా వస్తున్న స్టార్టప్‌లు.. ఇవన్నీ చూస్తుంటే 21వ శతాబ్దం భారత్‌దే అనిపిస్తోందని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎం చైర్మన్ వర్జీనియా రొమెటీ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాతో పాటు బిగ్ డేటా, అనలిటిక్స్ మొదలైనవి భారత ఆర్థిక వ్యవస్థ, కంపెనీల రూపురేఖలు మార్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. ‘ఈ 21వ శతాబ్దం.. భారత శతాబ్దం. ఏదో ఆషామాషీగా కాకుండా.. వాస్తవ పరిస్థితులను బట్టే రేపటి గురించి నేను ఆశావహంగా మాట్లాడుతున్నాను’ అని ఐబీఎం థింక్‌ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రొమెటీ పేర్కొన్నారు. -
విశాఖకు ఐబీఎం సీఎస్ఆర్ సేవలు..
సాక్షి, విశాఖపట్నం: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 16 నగరాలను ఎంపిక చేసుకుని ఆయా నగరాల్లో వివిధ అంశాల్లో చేయూతనివ్వాలని నిర్ణయించినట్టు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎం సీఎస్ఆర్ (ఇండియా) హెడ్ మమతాశర్మ అన్నారు. బుధవారం ఆమె విశాఖ కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ భారత్‌లో విశాఖతో సహా సూరత్, అలహాబాద్‌లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయనున్నందున. ఈ మూడు నగరాల్లో సీఎస్ఆర్ కింద సహకారం అందించాలని నిర్ణయించామన్నారు. సూరత్‌లో నూరు శాతం సౌరసేవలు, అలహాబాద్‌లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, విశాఖలో డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో సీఎస్ఆర్ నిధులను వెచ్చించి అవసరమైన సాంకేతిక, నైపుణ్యతను ఐబీఎం అందజేస్తుందన్నారు. విశాఖలో తుపాన్లు ఎదుర్కొనే ప్రణాళికలను ఆగస్టు లేదా సెప్టెంబర్ నాటికి రూపొందించి అందిస్తామన్నారు. ఇందుకోసం విపత్తులను అధ్యయనం చేయడంలో అనుభవం గల అంతర్జాతీయ స్థాయినిపుణులను విశాఖకు రప్పించి ఇక్కడి పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి జిల్లా యంత్రాంగాన్ని అందిస్తా మన్నారు. ఇందుకయ్యే ఖర్చునంతటినీ తమ సంస్థ భరిస్తుందన్నారు. ఈ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా జిల్లా యంత్రాంగంతో పాటు విశాఖ నగరంలోని పలు వర్గాల వారితో చర్చించి నివేదిక తయారుచేస్తామన్నారు. -
తుపాను నుంచి రక్షణకు సాఫ్ట్వేర్
- ముందుకు వచ్చిన ఐబీఎం బృందం - సీఎస్ఆర్ నిధులతో అధునాతన విధానం రూపకల్పన - జిల్లా అధికారులతో సమావేశమైన సంస్థ సభ్యులు సాక్షి, విశాఖపట్నం: తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనడంలో సహకారమందించేందుకు సాఫ్ట్వేర్ దిగ్గజం ఐబీఎం ముందుకొచ్చింది. విపత్తుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రణాళికను, అవసరమైన సాప్ట్‌వేర్‌ను కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఈ సంస్థ రూపొందించి ఇవ్వనుంది. హుద్‌హుద్ అనంతరం జిల్లా కలెక్టర్ యువరాజ్ తుఫాన్లు ఎదుర్కొనేందుకు సమాచార వ్యవస్థల రూపకల్పనలో సహకరించాల్సిందిగా ఐబీఎంకు లేఖ రాశారు. దీనికి స్పందించిన ఈ సంస్థ సహకరించేందుకు ముందుకొచ్చింది. సీఎస్ఆర్ వ్యవహారాల విభాగం అధిపతి మమతా శర్మ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్రతినిధి బృందం బుధవారం విశాఖ నగరాన్ని సందర్శించింది. జిల్లా అధికారులతో దీనిపై చర్చలు జరిపింది. అదనపు జాయింట్ కలె క్టర్ డి.వెంకటరెడ్డి నేతృత్వంలోని ఆ జిల్లా నగర అధికారుల బృందంతో హుద్‌హుద్ అనుభవాలు, వాటిని ఎదుర్కొన్న తీరు గురించి తెలుసుకుంది. జీవీఎంసీ ప్రజారోగ్యశాఖ ఇంజినీరింగ్, విద్యుత్ మత్స్యశాఖ, వ్యవసాయ, ఉద్యానవన శాఖాధికారులు తమ శాఖ ద్వారా తుఫాన్ సందర్భంగా చేపట్టిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా ఐబీఎం సీఎస్ఆర్ హెడ్ మమతా శర్మ మాట్లాడుతూ భవిష్యత్‌లో హుద్‌హుద్ లాంటి ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు విపత్తుల్లో సైతం పనిచేసేందుకు విలువైన అధునాతన సాప్ట్‌వేర్‌ను రూపొందిస్తామని చెప్పారు. అవసరమైన శాస్త్ర, సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తామన్నారు. సమీక్షలో జీవీఎంసీ తరపున అదనపు కమిషనర్ మోహనరావు, జీవీఎస్ మూర్తి, ప్రజారోగ్య విభాగం ఎస్ఈ శరత్‌బాబు, జిల్లా అగ్నిమాపకశాఖాధికారి జే.మోహనరావు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, జలవనరుల శాఖ ఎస్ఈ ఆర్.నాగేశ్వరరావు,బీఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ రవీంద్రకుమార్ పాల్గొన్నారు. -
భారత్‌లో మరో
ఐబీఎం డాటా సెంటర్! పనాజీ: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఐబీఎం త్వరలోనే భారత్‌లో మరో డాటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఐబీఎం డాటా సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం... ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన రంగాలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డాటా వినియోగానికి, పలు ఇతర సేవలకు వస్తున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమే. ఐబీఎం గతంలో ముంబైలో తొలి డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ కిడ్నాప్.. విడుదల
హైదరాబాద్ : పోలీసులమని చెప్పి దుండగులు ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసి.. తీవ్రంగా కొట్టి ఎల్బీనగర్లో వదిలేశారు. రాయదుర్గం పోలీసుల కథనం ప్రకారం... హైదర్షాకోట్లో నివాసం ఉండే సంతోష్‌కుమార్ యూఎస్ఏలో ఉంటూ 8 నెలల క్రితం నగరానికి వచ్చాడు. రహేజా మైండ్ స్పేస్‌లోని ఐబీఎంలో టీం లీడర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం 6.30కి సంతోష్‌కుమార్ ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తుండగా... మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద ఇద్దరు దుండగులు... పోలీసులమని చెప్పి అతడి కారును అడ్డగించి, తాళం చెవి తీసుకున్నారు. సంతోష్‌ను డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దించి, నీతో మాట్లాడాలి వెనుక సీట్లో కూర్చో అని చెప్పారు. అదే సమయంలో వెనుక కారులో వస్తున్న ఐబీఎం ఉద్యోగి ప్రసాద్ వారి వద్దకు వెళ్లి సంతోష్ కారును ఎందుకు ఆపారని ప్రశ్నించగా తాము పోలీసులమని చెప్పారు. దీంతో ప్రసాద్.. సంతోష్ కారును వెంబడించి... గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వరకు వెళ్లాడు. ఆ తర్వాత సంతోష్ ప్రయాణిస్తున్న కారు కనిపించక పోవడంతో ప్రసాద్ ఆందోళన చెంది... అతడి సెల్‌కి ఫోన్ చేశాడు. సంతోష్ ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో అతను నేరుగా రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన స్నేహితుడిని ఎవరో పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లారని ఫిర్యారు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబరాబాద్‌లోని అన్ని పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. పోలీసులమని చెప్పిన ఇద్దరు వ్యక్తులు సంతోష్‌ను చితకబాది ఎల్బీనగర్లో వదిలేశారు. రాత్రి 11.00 గంటల సమయంలో సంతోష్ ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తాము టాస్క్‌పోర్స్ పోలీసులమని చెప్పిన దొంగలు... అదృశ్యమైన మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆచూకీ చెప్పాలని వారు సంతోష్‌పై తీవ్ర ఒత్తిడి చేసి దాడి చేసినట్టు తెలుస్తోంది. -
ఐబీఎంలో 5వేల మందికి ఉద్వాసన!
బెంగళూరు : మరో సాప్ట్వేర్ సంస్థ.. పెద్ద ఎత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ సాప్ట్వేర్ సంస్థ ఐబీఎం కంపెనీ త్వరలో ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఐబీఎం వడివడిగా అడుగులు వేస్తుంది. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న దాదాపు 5 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీ తన ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఐబీఎం సంస్థ కొత్త సాంకేతికను అందిపుచ్చుకునే నేపథ్యంలో.. పెరిగే మార్జిన్ ఒత్తిళ్లను, పెరుగుతున్న ఆదాయం, క్లౌడ్ కంప్యూటింగ్ ను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. దాంతో భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా ఐబీఎం ఈ చర్యలను తీసుకున్నట్లు తెలిసింది. ఐబీఎంలో సుమారు 398,455 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఐబీఎం సంస్థలో పనిచేస్తున్న.. ఔట్సోర్సింగ్, కన్సల్టింగ్ సర్వీసులతో సహా అన్ని విభాగాల్లోను ఈ తొలగింపులు ఉండవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ఐబీఎంకు చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్పొరేషన్ ప్రతినిధి ఈ ఉద్యోగుల తొలగింపుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. అలాగే ఈ ఏడాదిలో ఎంత మందిని తొలగించనున్నారనే వివరాలను కూడా వెల్లడించలేదు. అయితే కంపెనీ తన ఖర్చులను తగ్గించి ఉత్పత్తులను పెంచేందుకు ప్రణాళిక చేస్తోందన్నారు. కాగా, ఐబీఎం కంపెనీకి మూడో వంతు ఆదాయం విదేశాల నుండే ఎక్కువగా వస్తోంది. ప్రత్యేకించి ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్న భారత్, చైనాల్లో ఐబీఎం విస్తృతంగా తన కార్యకలాపాలను సాగిస్తోంది. అదలా ఉంచితే... ఇటీవల న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఐబీఎం షేర్ విలువ 0.42 శాతం క్షీణించి 97.95 డాలర్లకు పడిపోయింది. -
ఐబీఎం కొత్త మెయిల్ సర్వీస్
న్యూఢిల్లీ: ఐబీఎం సంస్థ వ్యాపార సంస్థల కోసం వెర్స్ పేరుతో కొత్త ఈ మెయిల్ సర్వీస్‌ను ఆవిష్కరించింది. ఫైల్స్ షేరింగ్, ఎనలిటిక్స్, సోషల్ మీడియాలను సమ్మిళితం చేస్తూ సంస్థల ఉత్పాదకతను మెరుగుపరచడానికి తోడ్పడే నిమిత్తం ఈ కొత్త యాప్‌ను అందిస్తున్నామని ఐబీఎం పేర్కొంది. ఈ ఆప్‌తో కంపెనీ ఉద్యోగులు ఈ మెయిల్స్, కేలండర్స్, ఫైల్ షేరింగ్, ఇన్స్టంట్ మెసేజింగ్, సోషల్ అప్డేట్స్, వీడియో చాట్స్.... ఇవన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై యాక్సెస్ చేసుకోవచ్చని వివరించింది. ఈ మెయిల్స్‌లో కావలసిన కంటెంట్ ఉన్న మెయిల్స్‌ను సరిగ్గా సెర్చ్ చేసే ఫేసెటెడ్ సెర్చ్ ప్రత్యేకత ఈ వెర్స్ ఈమెయిల్ సర్వీస్‌కు ఉందని పేర్కొంది. ప్రస్తుతం బీటా వెర్షన్‌ను అందిస్తున్నామని, వచ్చే ఏడాది మార్చికల్లా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, గూగుల్ ఇన్‌బాక్స్ ఈ మెయిల్ సర్వీసులకు ఇది గట్టిపోటీనివ్వగలదని నిపుణులంటున్నారు. రోజుకు 10,800 కోట్ల ఈ మెయిల్స్‌ను ఉద్యోగులు పంపుతున్నారని, దీంతో ఉద్యోగులు గంటకు 36 సార్లు తమ ఈ మెయిల్స్‌ను చెక్ చేస్తున్నారని అంచనా. అయితే వీటిల్లో 14 శాతం ఈ మెయిల్స్ మాత్రమే ముఖ్యమైనవి కావడం విశేషం. -
ఐటీ దిగ్గజం టీసీఎస్ సరికొత్త రికార్డు!
ముంబై: దేశ ఐటీ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల నియామకంలో లక్ష సంఖ్యను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా లక్షకు పైగా మహిళా ఉద్యోగ నియమాకాలు చేపట్టిన టీసీఎస్ ప్రైవేటు సెక్టార్ లో అత్యధిక మహిళా ఉద్యోగాలిచ్చిన రెండో ఐటీ సంస్థగా కూడా రికార్డు నెలకొల్పింది. భారత్ లోనే మిక్కిలి ప్రాధాన్యత ఉన్న టీసీఎస్ మూడు లక్షల ఆరువేల ఉద్యోగాల్లో ప్రథమ భాగం మహిళలకే ప్రాముఖ్యత నిచ్చింది. కాగా, మహిళా ఉద్యోగుల నియామకంలో ఐబీఎమ్ ప్రథమ స్థానంలో ఉంది. ఈ సంస్థలో మొత్తం 4.31లక్షల ఉద్యోగులుండగా, 1.3 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉండటం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, విప్రోలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ లో 54, 537 మహిళా ఉద్యోగులుండగా, విప్రోలు 45, 276 మంది మహిళలు ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు. -
లెనోవో చేతికి ఐబీఎం సర్వర్ వ్యాపారం
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఐబీఎంకు చెందిన దిగువస్థాయి సర్వర్ బిజినెస్‌ను (ఎక్స్86) పీసీ తయారీ దిగ్గజం లెనోవో కొనుగోలు చేయనుంది. ఈ విషయమై ఉభయుల మధ్యా వెనక్కి తగ్గటానికి వీల్లేని ఒప్పందం కుదిరింది. డీల్ విలువ 230 కోట్ల డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) కాగా, టెక్నాలజీ విభాగంలో ఒక చైనీస్ కంపెనీ చేపట్టిన అతిపెద్ద కొనుగోలు ఇదే. దీనిలో భాగంగా ఐబీఎంకు 200 కోట్ల డాలర్లను నగదు రూపంలో లెనోవో చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి వాటాలను కేటాయిస్తుంది. దీన్ని రెండు కంపెనీలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఒప్పందం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఐబీఎంకు సర్వర్ విభాగంలో ఉన్న 7,500 మంది ఉద్యోగులు లెనోవోకు బదిలీ అవుతారు. 2005లో ఐబీఎంకు చెందిన పీసీ బిజినెస్‌ను సైతం లెనోవో సొంతం చేసుకోవటం తెలిసిందే. కొనుగోలులో భాగంగా థింక్‌ప్యాడ్ పీసీ విభాగాన్ని సైతం దక్కించుకుంది. -
నంబర్ వన్ బ్రాండ్.. యాపిల్
న్యూయార్క్: ప్రపంచ అత్యంత విలువైన బ్రాండ్‌గా యాపిల్ అవతరించింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన అత్యంత విలువైన అంతర్జాతీయ బ్రాండ్ల జాబితాలో 10,430 కోట్ల డాలర్ల (గత ఏడాదితో పోల్చితే 20 శాతం వృద్ధి)విలువతో యాపిల్‌కు అగ్రస్థానం దక్కింది. యాపిల్ మొదటి స్థానంలో నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. యాపిల్ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, కోక-కోలా, ఐబీఎం, గూగుల్‌లు నిలిచాయి. ఒక్క భారతీయ కంపెనీకి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఈ ఫోర్బ్స్ జాబితా వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు.., ఏ ఇతర బ్రాండ్ల విలువ కన్నా యాపిల్ బ్రాండ్ విలువ రెట్టింపుగా ఉండడం విశేషం. గత మూడేళ్లుగా మైక్రోసాఫ్ట్ బ్రాండ్ విలువలో (5,670 కోట్ల డాలర్లు)పెద్దగా మార్పు లేదు. పర్సనల్ కంప్యూటర్ బ్రాండ్ నుంచి మొబైల్ బ్రాండ్‌గా మారడానికి చాలా కష్టాలు పడుతోంది. అయినప్పటికీ, గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ మార్జిన్లు 34% సాధించి అత్యంత లాభదాయక అంతర్జాతీయ బ్రాండ్లలలో ఒకటిగా నిలిచింది. 5,490 కోట్ల డాలర్ల విలువతో కోక-కోలా మూడో స్థానంలోనూ, 5,070 కోట్ల డాలర్లతో ఐబీఎం నాలుగో స్థానంలోనూ, 4,730 కోట్ల డాలర్లతో గూగుల్ ఐదో స్థానంలోనూ ఉన్నాయి. ఇక మొదటి పది స్థానాల్లో మెక్‌డొనాల్డ్స్(బ్రాండ్ విలువ 3,940 కోట్ల డాలర్లు), జనరల్ ఎలక్ట్రిక్(3,420 కోట్ల డాలర్లు), ఇంటెల్(3,090 కోట్ల డాలర్లు), శామ్సంగ్(2,950 కోట్ల డాలర్లు), లూయిస్ వ్యూటన్(2,840 కోట్ల డాలర్లు)చోటు సాధించాయి. గత ఏడాది 610 కోట్ల డాలర్లుగా ఉన్న బ్లాక్‌బెర్రీ బ్రాండ్ విలువ ఈ ఏడాది 220 కోట్ల డాలర్లకు పడిపోవడంతో టాప్ 100 జాబితా నుంచి బ్లాక్‌బెర్రీని తొలగించారు. మూడేళ్ల క్రితం 2,730 కోట్ల డాలర్ల బ్రాండ్ విలువతో 9వ స్థానంలో ఉన్న నోకియా కంపెనీ ఈ ఏడాది 700 కోట్ల డాలర్ల విలువతో 71వ స్థానానికి పడిపోయింది. ఈ టాప్ 100 బ్రాండ్లలో సగం అమెరికావే ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ(9 కంపెనీలు), ఫ్రాన్స్(8), జపాన్(7) ఉన్నాయి.