
భారత్‌లో మరో
ఐబీఎం డాటా సెంటర్!
పనాజీ: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఐబీఎం త్వరలోనే భారత్‌లో మరో డాటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఐబీఎం డాటా సెంటర్ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం... ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు సంబంధించిన రంగాలతోపాటు పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డాటా వినియోగానికి, పలు ఇతర సేవలకు వస్తున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడమే. ఐబీఎం గతంలో ముంబైలో తొలి డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది.