ఐటీ దిగ్గజం టీసీఎస్ సరికొత్త రికార్డు!
ముంబై: దేశ ఐటీ రంగంలోని అగ్రశ్రేణి సంస్థల్లో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా మహిళా ఉద్యోగుల నియామకంలో లక్ష సంఖ్యను దాటేసి అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా ముందుకు దూసుకుపోతుంది. తాజాగా లక్షకు పైగా మహిళా ఉద్యోగ నియమాకాలు చేపట్టిన టీసీఎస్ ప్రైవేటు సెక్టార్ లో అత్యధిక మహిళా ఉద్యోగాలిచ్చిన రెండో ఐటీ సంస్థగా కూడా రికార్డు నెలకొల్పింది. భారత్ లోనే మిక్కిలి ప్రాధాన్యత ఉన్న టీసీఎస్ మూడు లక్షల ఆరువేల ఉద్యోగాల్లో ప్రథమ భాగం మహిళలకే ప్రాముఖ్యత నిచ్చింది. కాగా, మహిళా ఉద్యోగుల నియామకంలో ఐబీఎమ్ ప్రథమ స్థానంలో ఉంది.
ఈ సంస్థలో మొత్తం 4.31లక్షల ఉద్యోగులుండగా, 1.3 లక్షల మంది మహిళా ఉద్యోగులు ఉండటం విశేషం. ఆ తరువాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, విప్రోలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ లో 54, 537 మహిళా ఉద్యోగులుండగా, విప్రోలు 45, 276 మంది మహిళలు ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నారు.