హెచ్‌ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్‌ చురకలు | Where would Apple, Cisco, IBM be without talent from across the world, asks RBI Chief Urjit Patel | Sakshi
Sakshi News home page

హెచ్‌ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్‌ చురకలు

Published Tue, Apr 25 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM

హెచ్‌ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్‌ చురకలు

హెచ్‌ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్‌ చురకలు

అమెరికా కొత్త హెచ్‌1బీ పాలసీ నిబంధనలపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గవర్నర్‌ ఉర్జిత్ పటేల్‌ స్పందించారు.

న్యూఢిల్లీ: అమెరికా కొత్త హెచ్‌1 బీ పాలసీ నిబంధనలపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియా గవర్నర్‌  ఉర్జిత్ పటేల్‌ స్పందించారు. అమెరికా తదితర దేశాల రక్షణవాద  విధానాలను తీవ్రంగా  వ్యతిరేకించిన ఆయన  ట్రంప్‌ హెచ్‌  1 బీ వీసాల  కఠిన నిబంధనలతో తీసుకొచ్చిన కొత్త ఆర్డర్లపై చురకలంటించారు. పరస్పర సహకారం  లేకపోతే అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవని ఆయన ప్రశ్నించారు. 

కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ లో ఇండియన్ ఎకనామిక్ పాలసీస్‌పై రాజ్ సెంటర్ స్పాన్సర్ చేసిన ‘థర్డ్ కోటక్ ఫ్యామిలీ విశిష్ట ప్రసంగం’ లో సోమవారం పటేల్‌  పాల్గొన్నారు.  సందర్భంగా ప్రధాన ప్రపంచ ఆర్థికవ్యవస్థల రక్షణవాద ధోరణుల పెరుగుదలపై ప్రశ్నకు ప్రతిస్పందనగా పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఉత్పత్తులు,  ప్రతిభను అందించకపోతే, ఆపిల్, సిస్కో  ఐబిఎమ్ లాంటి భారీ అమెరికన్ సంస్థలు  ఎక్కడ ఉండేవని  ఉర్జిత్‌ ప్రశ్నించారు. అమెరికా సహా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కార్పోరేషన్ల  విలువ గ్లోబల్‌ సప్లయ్‌  చైన్ల కారణంగానే పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంపద సృష్టికర్తలు ఇలాంటి విధానాలను అబలంబిస్తే చివరికివారే ఈ ప్రభావానికి లోను కావాల్సి వస్తుందని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు.

కస్టమ్స్ డ్యూటీలు, సరిహద్దు పన్ను వంటి వాణిజ్య పరికరాలను ఉపయోగించడం  సమర్థవంతమైన మార్గం కాదన్నారు. వాస్తవానికి దీనికి వేరే మార్గం ఎంచుకువాల్సి ఉంటుందన్నారు.   ఈక్విటీ మరియు డిస్ట్రిబ్యూషన్స్‌  విధానాల్లో అనుసరిస్తున్న విధానాల కొన్నింటి ప్రభావం వారికి తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ఇది వృద్ధికి తీరని నష్టం  చేకూరుస్తుందని  హెచ్చరించారు.  ఇది దేశీయ విధానాంగా ఉండాలన్నారు.  దేశీయ విధాన సమస్యగా ఉండాలి. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని  ఉర్జిత్‌  తెలిపారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement