cisco
-
భారత్‌లో సిస్కో తొలి ప్లాంట్
చెన్నై: డిజిటల్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీలో ఉన్న యూఎస్ దిగ్గజం సిస్కో తాజాగా భారత్‌లో తొలి ప్లాంటును ప్రారంభించింది. చెన్నైలోని ఈ కేంద్రంలో రూటింగ్, స్విచింగ్ ఉత్పత్తులను తయారు చేస్తారు. ఈ ఫెసిలిటీ ద్వారా తమిళనాడులో 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు అభిస్తాయని కంపెనీ ప్రకటించింది.ఎగుమతులతో కలుపుకుని ఏటా 1.3 బిలియన్ డాలర్ల ఆదాయ నమోదుకు అవకాశం ఉందని వెల్లడించింది. చెన్నైలో తయారీ కేంద్రాన్ని నిర్మించడానికి, విస్తరణకు ఫ్లెక్స్‌తో సిస్కో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది ప్రారంభంలో సిస్కో నెట్వర్క్ కన్వర్జెన్స్ సిస్టమ్–540 సిరీస్ రూటర్ల తయారీపై దృష్టి పెడుతుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతరాదిత్య సింధియా చేతుల మీదుగా ప్లాంటు ప్రారంభం అయింది. -
ఏకంగా 5,600 మందిని తీసేసిన ఆ టెక్ కంపెనీ..!
-
'ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు ఇంటికి'
ప్రపంచంలోనే అగ్రగామి నెట్వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ సిస్కో, ఈ ఏడాది మరోసారి ఉద్యోగుల తొలగింపులను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే వేలాదిమంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది.2024 ఫిబ్రవరిలో సుమారు 4000 మందిని సిస్కో ఇంటికి పంపింది. అయితే సిస్కో తన నాల్గవ త్రైమాసిక ఫలితాలతో వెల్లడించే సమయంలోనే ఎంతమంది ఉద్యోగులను తొలగించనున్నట్లు, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆగష్టు 14న వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.డిమాండ్, సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా కంపెనీ కొన్ని కఠినమైన సవాళ్ళను ఎదుర్కుంటోంది. ఈ తరుణంలో కంపెనీ మళ్ళీ ఓ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ సారి ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తుంది, ఏ విభాగం నుంచి తొలగిస్తుంది అనే మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.ఇదీ చదవండి: ఇలాగే కొనసాగితే బంగారం కొనడం కష్టమే! మళ్ళీ పెరిగిన ధరలుఇదిలా ఉండగా.. సిస్కో కంపెనీ ఏఐ రంగంలో కూడా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సంస్థ 2025 నాటికి మరింత వృద్ధి చెందటానికి ప్రతిష్టాత్మకమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఈ వ్యూహంలో వారి ప్రధాన ఉత్పత్తులలో AI-ఆధారిత పరిష్కారాలను అందించడం, 1 బిలియన్ పెట్టుబడుల ద్వారా AI స్టార్టప్‌లను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. -
అన్నంత పని చేసిన టెక్ దిగ్గజం - కష్టాల్లో టెకీలు..
సిస్కో సిస్టమ్స్ సంస్థ తమ ఉద్యోగులను తొలగించనున్నట్లు రెండు రోజులకు ముందే ప్రకటించింది. ఉన్న ఉద్యోగుల్లో 5 శాతం మందిని ఇంటికి పంపనున్నట్లు చెప్పినట్లుగానే.. కంపెనీ గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 4000 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది. 2023లో కంపెనీలోని మొత్తం పనిచేసే ఉద్యోగుల సంఖ్య 85000. ఇందులో ఈ ఏడాది ఏకంగా 4000 మందిని ఇంటికి పంపేసింది. ఉద్యోగుల తొలగింపులపైన కూడా కంపెనీ 800 మిలియన్ డాలర్ల ఖర్చును భరించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని ఉద్యోగుల తొలగింపు చెల్లింపులు, ఇతర సంబంధిత ఖర్చులకు నిధులుగా సమకూర్చుతుంది. ఇదీ చదవండి: టీసీఎస్ బాటలో హెచ్‌సీఎల్ - అయోమయంలో ఐటీ ఉద్యోగులు.. సిస్కో కంపెనీ ఇతర కంపెనీల మాదిరిగానే అనేక ఆర్ధిక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది. రెండవ త్రైమాసికంలో ఆదాయం 52.5 బిలియన్ డాలర్ల నుంచి 51.5 బిలియన్ల డాలర్లకు తగ్గింది. దీంతో కంపెనీ షేర్స్ కూడా 5 శాతానికిపైగా పడిపోయాయి. రానున్న రోజుల్లో కంపెనీ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగానే.. తాజాగా ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం - వేలాది ఉద్యోగులు ఇంటికి..
భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దిగ్గజ కంపెనీలు 2024లో కూడా తమ ఉద్యోగులను తొలగిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే 'సిస్కో' కంపెనీ ఇప్పుడు వేలాదిమందిని ఇంటికి పంపే యోచనలో ఉంది. లేఆఫ్‌ల వల్ల ప్రభావితం అయ్యే మొత్తం ఉద్యోగుల సంఖ్యపై కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. కంపెనీ వ్యాపారాన్ని పునర్నిర్మించుకోవడంలో భాగంగానే.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సేల్స్ ఫోర్స్, స్నాప్ చాట్ వంటి సంస్థలు ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా వందలాది మందిని ఇప్పటికే ఇంటికి పంపింది. ఈ జాబితాలోకి ఇప్పుడు సిస్కో చేరింది. 2023లో కంపెనీలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య 84900. ఇందులో ఈ ఏడాది ఎంతమందిని తీసేయాలని విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి 14న కంపెనీ తన ఫలితాలను వెల్లడించనుంది, ఆ సమయంలో ఎంతమందిని కంపెనీ నుంచి ఇంటికి పంపిందనే విషయం తెలుస్తుంది. ఇదీ చదవండి: 'సుందర్ పిచాయ్' రోజూ చూసే వెబ్సైట్ ఇదే.. ప్రస్తుతం కంపెనీలోని ఉద్యోగులలో కనీసం 5 శాతం మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని అంచనా. గతంలో నోకియా, ఎరిక్సన్ వంటి టెలికామ్ దిగ్గజాలు కూడా నష్టాల్లో ఉన్నప్పుడు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఇటీవల స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ కూడా తన మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. -
సెలవులు ఎలా గడుపుతారు? సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు
సెలవులంటే ప్రతిఒక్కరికీ ఉత్సాహమే. ఒకప్పుడు ఎక్కడైనా బయటకు వెళ్లి సెలవులను ఆస్వాదించేవారు. అయితే సెలవులను గడిపే తీరు ప్రస్తుత ఆధునిక టెక్నాలజీ యుగంలో మారిపోయింది. రానున్న క్రిస్మస్ సెలవుల సీజన్‌ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. న్యూఢిల్లీ: వినియోగదారులు గతంలో కంటే ఈ సెలవుల సీజన్లో ఎక్కువ అప్లికేషన్లు, డిజిటల్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని సిస్కో నివేదిక వెల్లడించింది. భారతీయుల్లో 85 శాతం మంది ప్రధానంగా బ్యాంకింగ్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ యాప్‌ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఉపయోగించుకుంటారని తెలిపింది. క్రిస్మస్, సెలవుల కాలంలో అప్లికేషన్లు, డిజిటల్ సేవల వినియోగాన్ని తెలుసుకోవడానికి యూఎస్, యూకే, యూఏఈ, జర్మనీ, భారత్ సహా వివిధ దేశాల్లో చేపట్టిన ఈ సర్వేలో 12,000 మంది పాలుపంచుకున్నారు. Cisco Survey: సిస్కో యాప్ డైనమిక్స్ సీజనల్ షాపింగ్ పల్స్ సర్వే ప్రకారం.. అప్లికేషన్లు, డిజిటల్ సేవలు ఇప్పుడు ఆనందదాయక సెలవులు/క్రిస్మస్లో ముఖ్యమైనవి అని 88 శాతం మంది అంగీకరిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్‌లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు. 72 శాతం మంది అలెక్సా, స్మార్ట్ హోమ్ వంటి ఇంటర్నెట్తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని, 60 శాతం మంది గేమింగ్ యాప్‌లను ఉపయోగించాలని భావిస్తున్నారు. 84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా, వీడియో కాల్స్ సాధనాలను ఎంచుకున్నారు. చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్ యాప్‌లను, అదే నిష్పత్తిలో చివరి నిమిషంలో చెల్లింపులు, బదిలీలకై బ్యాంకింగ్, బీమా యాప్‌లను వాడతారు. 78 శాతం మంది వార్తలు, సమాచార–ఆధారిత యాప్‌లను, 88 శాతం మంది టేక్ అవే కోసం ఫుడ్ డెలివరీ సేవలను వినియోగిస్తారు’ అని సర్వేలో తేలింది. -
వృద్ధి అవకాశాల్లో భారత్ నెంబర్ వన్
న్యూఢిల్లీ: అమెరికా నెట్వర్క్ పరికరాల తయారీ సంస్థ– సిస్కో భారత్‌లో తన భారీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించింది. రూటర్లు, స్విచ్‌ల వంటి ఉత్పత్తుల తయారీకి సంబంధించిన భారత ప్రణాళికలను చైర్మన్, సీఈఓ చక్ రాబిన్స్ ప్రకటించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలపై దేశం అద్భుతమైన పురోగతిని సాధించిందని పేర్కొంటూ, వచ్చే దశాబ్దపు వృద్ధి అవకాశాలకు సంబంధించి భారత్ మొదటి అవకాశంగా ఉందని అన్నా రు. తయారీ రంగానికి కేంద్రంగా భారత్ రూపుదిద్దుకుంటోందని ఆయన అన్నారు. బహుళ పథకా లు ఇందుకు దోహదపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ తయారీ కార్యకలాపాలు సిస్కో కాంట్రాక్ట్ తయారీదారుల ద్వారా ప్రారంభమవుతాయని తెలిపారు. బిలియన్ డాలర్ల ఎగుమతులు సమీపకాలంలో జరుగుతాయని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ తదితర సీనియర్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో ఆయన భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు... ► ప్రపంచ స్థూల ఆర్థిక అనిశ్చితులు, అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం భౌగోళిక రాజకీయ భయాల నేపథ్యంలో టెక్ డిజిటలైజేషన్ వ్యూహాత్మక విలువ మందగించాలి. కానీ అలా జరక్కపోవడం హర్షణీయం. పైగా ఇది పురోగతి బాటన నడుస్తోంది. టెక్నాలజీకి సంబంధి ప్రతి దేశం సాధిస్తున్న విజయానికి ఇది సంకేతం. ► డిజిటలైజేషన్, 5జీ రోల్అవుట్, నైపుణ్య సామర్థ్యాలు, స్టార్టప్ వ్యవస్థ దీనిని బలపరిచే మౌలిక వ్యవస్థ భారత్‌కు కలిసివస్తున్న అంశాలు. ► భారత్ డిజిటలైజేషన్లో భారీగా పురోగమించింది. మహమ్మారి సమయంలో అలాగే తీవ్ర సవా ళ్ల సమయాల్లో డిజిటలైజేషన్లో దేశం పటిష్ట పురోగతిని సాధించింది. పురోగతి విషయంలో భారత్ ఆశయం చాలా స్పష్టంగా ఉంది. ఇది హర్షణీయ పరిణామం. ప్రధానమంత్రి, పలువురు మంత్రులు, పారిశ్రామికవేత్తలు అనేక అంశాల గురించి మాట్లాడారు. తయారీ నుంచి నైపుణ్యత, సిస్కో కార్యకలాపాలు, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, 5జీ, సుస్థిర అభివృద్ధి వరకూ అన్ని అంశాలపై ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. భారతదేశంలో తయారీ పురోగతి విషయంలో సహకారం ఇచ్చే విషయంలో మా నిబ ద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించాను. ► ఒక్క డిజిటలైజేషన్‌లోనే కాదు. భౌతికంగా మౌలిక సదుపాయాల కల్పనలోనూ భారత్ దూసుకుపోతోంది. ► మేడిన్ ఇండియా సిస్కో ప్రొడక్టులు ఈ ప్రాంతానికి, యూరప్‌కు ఎగుమతి అవుతాయి. దేశంలో క్రమంగా మా వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తాం. ముఖ్యంగా 5జీ పై మాకు ఎక్కువ ఆసక్తి ఉంది. ప్రతి చోటకూ కనెక్టివిటీ హైస్పీడ్‌కు దోహపపడే అంశం ఇది. ► ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో చోటుచేసుకుంటున్న ఉద్యోగాల కోత ఫలితాలు, పర్యవసానాలు మున్ముందు ఎలా మారతాయన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేం. విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో సిస్కో సీఈఓ చక్ రాబిన్స్ భేటీ -
సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా?
జైపూర్: ఒకవైపు సైబర్ దాడులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ దాడుల నుంచి రక్షించుకునే సామర్థ్యాలు దేశంలో చాలా కంపెనీలకు లేవన్న విషయాన్ని సైబర్ సెక్యూరిటీపై సిస్కో నిర్వహించిన సర్వేలో తెలిసింది. అధునాతన సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యాలు కేవలం 24 శాతం కంపెనీలకే ఉన్నట్టు సిస్కో ప్రకటించింది. ఇదీ చదవండి: స్టార్‌బక్స్ సీఈవోగా నరసింహన్.. బాధ్యతలు చేపట్టిన ప్రవాస భారతీయుడు వచ్చే మూడేళ్లలో భారత్‌లో ఐదు లక్షల మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులకు శిక్షణ ఇవ్వాలన్నది తన లక్ష్యంగా పేర్కొంది. వచ్చే 12–24 నెలల్లో తమ వ్యాపారాలకు విఘాతం కలిగించే సైబర్ దాడులు జరగొచ్చని భావిస్తున్నట్టు సిస్కో సర్వేలో 90 శాతం మంది చెప్పారు. అంతర్జాతీయంగా సైబర్ సెక్యూరిటీ సన్నద్ధత సగటున కేవలం 15 శాతంగానే ఉందని, ఈ విధంగా చూస్తే భారత్ మెరుగ్గా ఉన్నట్టు సిస్కో తెలిపింది. భారత్‌లోని 38 శాతం కంపెనీలు ఆరంభ, ఏర్పాటు స్థాయిలో ఉన్నవేనని పేర్కొంది. స్వతంత్ర థర్డ్ పార్టీతో సిస్కో ఈ సర్వే చేయించింది. 27 మార్కెట్ల నుంచి 6,700 మంది సైబర్ సెక్యూరిటీ నిపుణులు సర్వేలో పాల్గొన్నారు. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ఎలాంటి సొల్యూషన్లను కంపెనీలు ఏర్పాటు చేశాయి, అమలు ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! చిన్న కంపెనీలకు ముప్పు అధికం.. ఇందులో ఆరంభ, స్టార్టప్, పురోగతి, పూర్తి స్థాయి కంపెనీలు అని సిస్కో సర్వే వర్గీకరించింది. ఆరంభ దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను ఏర్పాటు చేసే దశలో ఉన్నాయి. వీటికి 10 కంటే తక్కువే స్కోర్ లభించింది. ఏర్పాటు దశలోని కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లను అమలు చేసే దశలో ఉన్నాయి. వీటికి స్కోర్ 11–44 మధ్య ఉంది. సైబర్ భద్రతా సన్నద్ధత విషయంలో ఇవి సగటు కంటే తక్కువ పనితీరు చూపిన్నట్టు సర్వే నివేదిక తెలిపింది. పురోగతి దశలోని కంపెనీలు సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా సగటు కంటే ఎక్కువ పనితీరు చూపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయికి చేరిన కంపెనీలు సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్లలో చాలా ముందంజలో ఉండడమే కాకుండా, రిస్క్‌లను ఎదుర్కొనే సామర్థ్యాలతో ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో తాము సైబర్ దాడిని ఎదుర్కొన్నామని, వీటి కారణంగా తమకు రూ.4–5 కోట్ల స్థాయిలో నష్టం ఎదురైనట్టు 53 శాతం మంది సర్వేలో చెప్పారు. ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.. ‘‘సైబర్ సెక్యూరిటీకి వ్యాపార సంస్థలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే అవి తమ డిజిటైజేషన్ ప్రయాణాన్ని కొనసాగించగలవు. హైబ్రిడ్ పని విధానం ప్రముఖంగా మారడం, సేవలు అప్లికేషన్ ఆధారితం కావడంతో.. సైబర్ భద్రతా సన్నద్ధత పరంగా ఉన్న అంతరాలను తగ్గించుకోవడం కంపెనీలకు కీలకం’’ అని సిస్కో ఇండియా సెక్యూరిటీ బిజినెస్ గ్రూప్ డైరెక్టర్ సమీర్ మిశ్రా తెలిపారు. ఇదీ చదవండి: గేమింగ్ హబ్‌గా భారత్.. భారీ ఆదాయం, ఉపాధి కల్పన -
ఉద్యోగులను పీకేసిన మరో దిగ్గజ కంపెనీ.. 4 వేల మందికి భారీ షాక్!
టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సంస్థ నుంచి సుమారు 4వేల మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. అన్నీ కంపెనీల తరహాలో సిస్కో సైతం ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుంది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఫైర్ చేస్తున్నాం’ అని వెల్లడించింది. రీబ్యాలెన్సింగ్‌లో భాగంగా కొన్ని వ్యాపారాల దిద్దుబాటు క్రమంలో సిస్కో 4000 మంది ఉద్యోగులను సాగనంపే ప్రక్రియను ప్రారంభించిందనే వార్తలు టెకీల్లో కలకలం రేపింది. మరోవైపు తొలగించిన ఉద్యోగులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక, సిస్కో తొలగించనున్న ఉద్యోగులు తమకు వేరే కంపెనీల్లో జాబ్‌ల కోసం రిఫర్ చేయాలని వారు ఆయా వేదికలపై అభ్యర్ధించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా సిస్కో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ!
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆందోళనతో స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. మాంద్యం వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కంటే.. వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి అందుకు అనుగుణంగా సన్నంద్ధం అవ్వడం మంచిదని భావిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనున్నట్లు తెలుస్తోంది. మెటా, నెటఫ్లిక్స్,స్నాప్ చాట్, అమెజాన్ బాటలో సిస్కో ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో 83 వేలమంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారిలో 4,100 మంది సిబ్బందిపై వేటు వేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారం సిస్కో తన మొదటి త్రైమాసిక ఫలితాల్ని విడుదల చేసింది. 13.6 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జించినట్లు చెప్పిన సిస్కో.. ఈ ఏడాది ఆదాయం 6 శాతం పెరిగినట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సిస్కో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్కాట్ హెర్రెన్ ఉద్యోగులపై వేటు పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్)గా అభివర్ణించారు. ఖర్చు తగ్గించుకోవడం కోసమే చూస్తున్నాం. ఉద్యోగుల తొలగింపు మాత్రం అనుకోవద్దు’ అని అన్నారు. కాగా, ఆర్ధిక మాంద్యం నుంచి గట్టెక్కేలా మెటా, ట్విటర్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్, స్ట్రైప్‌లు ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వగా.. ఆ సంస్థల జాబితాలో సిస్కో చేరింది. చదవండి👉 ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
ఇండియా వెబెక్స్పై సిస్కో మరిన్ని పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో క్లయింట్లకు మెరుగైన సేవలు అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో తెలిపింది. ఇందులో భాగంగా ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం పనిచేసే ఇండియా వెబెక్స్ విభాగం మౌలిక సదుపాయాలపై ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. డేటా ప్రైవసీ, భద్రతకు సహాయపడే సిస్కో సెక్యూర్ ఉత్పత్తులు, సొల్యూషన్స్ దన్నుతో డేటా సెంటర్ కూడా వీటిలో ఉంటుందని పేర్కొంది. వీడియో సమావేశాలు, కాలింగ్, మెసేజింగ్ మొదలైన క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్‌ను వెబెక్స్ అందిస్తుంది. దేశవ్యాప్తంగా వెబెక్స్ సర్వీసులను మరింతగా విస్తరించేందుకు అవసరమైన లైసెన్సులను కూడా పొందినట్లు సిస్కో తెలిపింది. భారత్‌లో వెబెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేసుకోవడం వల్ల సిస్కోకు వ్యయాలు తగ్గడంతో పాటు సాంకేతిక సామర్థ్యాలను పెంచుకునేందుకు, దేశీ పరిస్థితులకు అనుగుణమైన ధరలకే కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది. -
హైబ్రిడ్ ఎంతో హాయి..
కరోనా సంక్షోభం తర్వాత తెర మీదకు వచ్చిన హైబ్రిడ్ వర్క్ విధానం ఎంతో బాగుందంటున్నారు ఉద్యోగులు. కరోనా భయాలు క్రమంగా తగ్గు ముఖం పట్టడంతో కొన్ని సంస్థలు ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని కోరుతుండగా మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోంను కంటిన్యూ చేస్తున్నాయి. అయితే ఈ రెండింటి కలయికగా ఉద్యోగులు తమకు నచ్చినట్టు ఆఫీసు, ఇంట్లో పని చేసుకునే వెసులుబాటు హైబ్రిడ్ విధానంలో ఉంది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం లేదా ఆఫీసు ఉంచి పని ఈ రెండింటిలో ఏ పని సౌకర్యంగా ఉందో తెలుసుకునేందుకు గ్లోబల్ స్టడీ సంస్థ సిస్కో ఇటీవల సర్వే చేపట్టింది. ఇందులో నూటికి 61 శాతం మంది హైబ్రిడ్ వర్క్ విధానం బాగుందంటూ సమాధానం ఇచ్చారు. హైబ్రిడ్ మోడ్‌లో పనితీరు, ప్రొడక్టివిటీ కూడా మెరుగైందని చెబుతున్నారు. దీంతో పాటు మానసికంగాను చాలా ఉత్తేజవంతంగా ఉంటున్నామని వెల్లడించారు. చదవండి: ఉద్యోగుల షాక్, ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు! -
వారికోసం సరికొత్త ప్లాన్లను ప్రకటించిన ఎయిర్టెల్..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ పలు దిగ్గజ ఐటీ కంపెనీలతో జత కట్టనుంది. గూగుల్ క్లౌడ్, సిస్కో కంపెనీల భాగస్వామ్యంతో ‘ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్’ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపార సంస్థల కోసం, ప్రారంభ దశలో ఉన్న టెక్ స్టార్టప్ కంపెనీల డిజిటల్ కనెక్టివిటీ అవసరాల కోసం ఏకీకృత ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలు రూ. 999 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా అనేక రకాల యాడ్ ఆన్ సేవలను కూడా పొందవచ్చును. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అందిపుచ్చుకోవడానికి ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్లు ‘వన్ ప్లాన్, వన్ బిల్’తో ఏకీకృత పరిష్కారాలను చూపిస్తోందని వెల్లడించారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ సేవలు... ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు, టెక్ స్టార్టప్ కంపెనీలకు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాలింగ్‌తో పాటు 1జీబీపీఎస్ వరకు అధిక వేగంతో ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇవ్వనుంది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా గూగుల్ వర్క్‌స్పేస్ లైసెన్స్‌ను, డీఎన్ఎస్ సెక్యూరిటీ బై సిస్కో, ఫ్రీ ప్యారలల్ రింగింగ్ సర్వీసులను ఎయిర్టెల్ అందిస్తోంది. హానికరమైన, అవాంఛిత డొమైన్లు, వైరస్లు, సైబర్‌దాడుల నుంచి ఆయా వ్యాపార సంస్థలకు భద్రతను సిస్కో, కాస్పర్‌స్కై అందించనున్నాయి. ఎయిర్ తన కస్టమర్ల భద్రత కోసం కొద్ది రోజుల క్రితమే కాస్పర్స్కైతో చేతులను కలిపింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ హెచ్డీ నాణ్యతతో అపరిమిత, సురక్షితమైన కాన్ఫరెన్సింగ్ వీడియో కాలింగ్ కోసం ఉచితంగా ఎయిర్టెల్ బ్లూజీన్స్ లైసెన్స్‌ను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. -
2023 నాటికి 90 కోట్ల ఇంటర్నెట్ యూజర్లు: సిస్కో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2023 నాటికి ఇంటర్నెట్ వినియోగదార్ల సంఖ్య 90.7 కోట్లకు చేరుతుందని, జనాభాలో ఈ సంఖ్య 64 శాతమని సిస్కో తన వార్షిక ఇంటర్నెట్ నివేదికలో వెల్లడించింది. 2018లో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 39.8 కోట్లుగా ఉందని తెలిపింది. ఈ సంఖ్య జనాభాలో 29 శాతమని వివరించింది. ‘2018లో 76.3 కోట్ల మొబైల్ యూజర్లు ఉంటే, 2023 నాటికి 96.6 కోట్లకు చేరతారు. నెట్వర్క్డ్ డివైసెస్ 150 కోట్ల నుంచి 210 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్టెడ్ డివైసెస్ 110 కోట్ల నుంచి 140 కోట్లకు ఎగుస్తాయి. వైర్డ్/వైఫై కనెక్టెడ్ డివైసెస్ 36 కోట్ల నుంచి 69.7 కోట్లను తాకనున్నాయి. నెట్వర్క్డ్ డివైసెస్‌లో స్మార్ట్ఫోన్ల వాటా 42 శాతం నుంచి 38 శాతంగా ఉండనుంది. 2023 నాటికి నెట్వర్క్డ్ డివైసెస్‌లో 66% స్మార్ట్ఫోన్లు, 34% వైఫై/వైర్డ్ కనెక్టెడ్ డివైసెస్ ఉంటాయి. 5జీ కనెక్షన్లు 6.72 కోట్లకు చేరతాయి. మొబైల్ కనెక్షన్లలో 4జీ వాటా 53.1%కి ఎగుస్తుంది. 2018లో ఇది 37.9%గా ఉంది. 2018లో 2,070 కోట్ల మొబైల్ యాప్స్ డౌన్లోడ్ అయితే, 2023 నాటికి ఈ సంఖ్య 4,620 కోట్లకు చేరుతుంది. మొబైల్ కనెక్షన్ సగటు స్పీడ్ 4.6 ఎంబీపీఎస్ నుంచి 16.3 ఎంబీపీఎస్‌కు చేరనుంది’ అని తన నివేదికలో వివరించింది. -
82 కోట్లకు చేరనున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు
సాక్షి, ముంబై : దేశంలో స్మార్ట్‌ఫోన్ వాడకందారుల సంఖ్య రానున్న ఐదేళ్లలో రెట్టింపై 82.9 కోట్లకు పెరగనుంది. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య ఏకంగా 60 శాతం పెరుగుతుందని సాంకేతిక దిగ్గజ కంపెనీ సిస్కోకు చెందిన విజువల్ నెట్వర్కింగ్ ఇండెక్స్ (విఎన్‌ఐ) నివేదిక పేర్కొంది. 2017లో స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య 40.4 కోట్లు కాగా, జనాభాలో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య 27 శాతంగా ఉందని తెలిపింది. 2017లో ఇంటర్నెట్ నెట్‌వర్క్‌లు రోజుకు 108 పెటాబైట్స్ డేటా వాడుతుండగా, ఇది 2022 నాటికి రోజుకు 646 పెటాబైట్స్‌కు చేరుతుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2022 నాటికి ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో వీడియో వీక్షణమే 77 శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది. ఇక 2017లో 51,500గా ఉన్న వైఫై హాట్‌స్పాట్స్ 2022 నాటికి 60 లక్షలకు చేరతాయని తెలిపింది. అప్పటికి భారత్‌లో స్మార్ట్‌ఫోన్ డేటా వినియోగం ఐదు రెట్లు పెరుగుతుందని తెలిపింది. సర్వీస్ ప్రొవైడర్లు తమ సేవలను మెరుగుపరుచుకునేందుకు ఇది దోహదపడుతుందని సిస్కో సర్వీస్ ప్రొవైడర్ బిజినెస్ ప్రెసిడెంట్ సంజయ్ కౌల్ పేర్కొన్నారు. -
ఇండియన్ టెకీ దంపతుల దుర్మరణం
కాలిఫోర్నియా : అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన టెకీ దంపతులు కాలిఫోర్నియాలోని యోస్‌మిటే నేషనల్ పార్కులోని లోయలో పడి మృతిచెందారు. వివరాలు..దక్షిణ భారత్‌కు చెందిన విష్ణు విశ్వనాథ్(29), మీనాక్షి మూర్తి(30) దంపతులు న్యూయార్క్‌లోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ ట్రిప్పులకు వెళ్లడమంటే సరదా ఉన్న ఈ జంట గురువారం కాలిఫోర్నియాలోని జాతీయ పార్కుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న 800 అడుగుల లోయలో పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పార్క్ అధికారులు వీరి జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం.. వీరి మృతదేహాలను కనుగొన్నారు. వీరిని సిస్కో కంపెనీలో పనిచేస్తున్న ఇండియన్ టెకీలుగా గుర్తించామని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదన్నారు. కాగా వీరి మృతిపట్ల కేరళకు చెందిన చెంగునూర్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం సంతాపం వ్యక్తం చేసింది. తమ పూర్వ విద్యార్థులైన విష్ణు, మీనాక్షి మరణించడం తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. వీరిద్దరు 2006-10 బ్యాచ్‌కు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన విద్యార్థులు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేసింది. 2014లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, వారికి సంబంధించిన ప్రతీ అప్డేట్ని.. ‘హాలీడేస్ అండ్ హ్యాపిలీఎవర్‌ఆఫ్టర్స్’ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తమతో ఙ్ఞాపకాలు పంచుకునే వారని సన్నిహితులు విషాదంలో మునిగిపోయారు. -
మిస్టరీ మాల్వేర్ : వీవీఐపీల ఐఫోన్లే టార్గెట్
హైదరాబాద్ : ఇటీవల మాల్వేర్ వైరస్లు ఏ విధంగా వ్యాప్తి చెందుతున్నాయో చూస్తున్నాం. వ్యక్తిగత డేటాలను చోరి చేస్తూ.. మాల్వేర్లు విజృంభిస్తున్నాయి. తాజాగా భారత్‌లో 13 ఐఫోన్లపై అనుమానిత అప్లికేషన్ దాడి చేసిందట. డేటాను, సమాచారాన్ని ఆ అప్లికేషన్ దొంగలించేసింది. 13 ఐఫోన్లే కదా..! లక్షల ఫోన్ల మాదిరి చెప్పారేంటి అనుకుంటున్నారా? కానీ చోరికి గురైనా ఆ ఐఫోన్లు వీవీఐపీలవి అంట. వీవీఐపీ స్మార్ట్ఫోన్లను టార్గెట్ చేసి, ఓ మిస్టరీ మాల్వేర్ అటాక్ చేసినట్టు సిస్కో టాలోస్ కమర్షియల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ మాల్వేర్ రీసెర్చర్లు, అనాలిస్టులు బహిర్గతం చేశారు. అయితే ఈ వీవీఐపీలు ఎవరన్నది ఇంకా గుర్తించాల్సి ఉంది. భారత్‌లో ఉండే ఈ దాడి జరిపిన అటాకర్, రష్యాలో ఉన్నట్టు నమ్మిస్తున్నట్టు సిస్కో నిపుణులు చెప్పారు. రష్యన్ పేర్లు, ఈమెయిల్ డొమైన్లను ఇతను వాడుకున్నట్టు పేర్కొన్నారు. దాడికి రెండు వ్యక్తిగత డివైజ్‌లను వాడిన అటాకర్, భారత్‌లో వొడాఫోన్ నెట్‌వర్క్‌తో రిజిస్టర్ అయి ఉన్న ఫోన్ నెంబర్‌ను వాడినట్టు చెప్పారు. ఓపెన్ సోర్స్ మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఎండీఎం)ను ఫోన్లలోకి చొప్పించి, ఆ 13 డివైజ్‌లలోకి అటాకర్ ఎన్రోల్ అయినట్టు టాలోస్ ఇంటెలిజెన్స్ నిపుణులు తమ బ్లాగ్‌లో రివీల్చేశారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్‌లోకి ఫీచర్లను యాడ్ చేయడం కోసం పలు టెక్నికల్స్‌ను వాడటం, టార్గెట్ చేసిన డివైజ్‌లలోకి ఎండీఎం చెందిన టెలిగ్రామ్‌ను చొప్పించడం ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు సిస్కో మాల్వేర్ రీసెర్చర్ ఆడ్రూ విలియమ్స్, మాల్వేర్ అనాలిస్ట్ పౌల్ చెప్పారు. మాల్వేర్, టార్గెట్ చేసిన ఐఫోన్ డివైజ్‌ల వాట్సాప్, టెలిగ్రామ్ చాట్లను సేకరించడం, ఎస్ఎంఎస్లను, యూజర్ల ఫోటోలను, కాంటాక్ట్‌లను, లొకేషన్, సీరియల్ నెంబర్, ఫోన్ నెంబర్ లాంటి సమాచారాన్ని దొంగలించడం చేసిందని పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని బ్లాక్మెయిల్ లేదా అవినీతికి ఉపయోగిస్తున్నట్టు లైనక్స్/యునిక్స్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఆన్లైన్ కమ్యూనిటీ నిక్స్క్రాఫ్ట్ చెప్పినట్టు టాలోస్ రీసెర్చ్ కోట్ చేసింది. దీని బారిన పడిన ఐఓఎస్ డివైజ్ యూజర్లకు కనీసం దీని గురించే అర్థం కాదని చెప్పింది. మూడేళ్లుగా సాగుతున్న ఈ ఆపరేషన్‌ను కనీసం గుర్తించలేకపోయామని చెప్పారు. ‘ఐఫోన్ ప్రమాదబారిన పడటం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్ మాల్వేర్ ప్రభావితం బారిన పడటం తక్కువగా నమోదవుతుంటుంది. దీనిలో యూజర్ల తప్పిదం కూడా ఉంటుంది. అటాకర్లు సోషల్ ఇంజనీరింగ్ వాడుకుని ఐఫోన్లలోకి చొప్పించి ఉంటారు’ అని తెలంగాణ సీఐడీ సూపరిటెండెంట్ ఆఫ్ పోలీసు యూ రామ్మోహన్ చెప్పారు. -
రాష్ట్ర డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామ్యం
► ఇందుకు సిస్కో ఆసక్తి చూపిందన్న మంత్రి కేటీఆర్ ► మిషన్ భగీరథ, టీ–హబ్‌పై అవగాహన ఉందన్న సిస్కో చైర్మన్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కారు చేపట్టిన డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో ఆసక్తి చూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. శుక్రవారం అమెరికా సిలికాన్ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. సంస్ధ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ విషయంలో సిస్కో ప్రణాళికలను మంత్రికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, టీ–హబ్ వంటి కార్యక్ర మాలపై తనకు అవగాహన ఉందన్నారు. డిజిటలైజేషన్‌తో ప్రజల జీవితాల్లో మార్పులు... ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటం ద్వారా డిజిటల్ తెలంగాణ సాధ్యమని జాన్ చాంబర్స్ తెలిపారు. డిజిటైజేషన్‌తో ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయని, అర్థిక వ్యవస్ధ బలోపేతం అవుతుందని ఆయన మంత్రికి వివరించారు. వీడియో ఇంటరాక్టివ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ–హెల్త్, ఈ–ఎడ్యుకేషన్ రంగాల్లో అనేక ప్రయోజనాలుంటా యన్నారు. ఈ మేరకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుతో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్వర్క్ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. ఇందుకుగానూ తెలంగాణ ప్రభు త్వంతో చర్చించాలని సిస్కో ఇండియా బృందాన్ని చాంబర్స్ ఆదేశిం చారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. తెలంగాణ డిజిటలైజేషన్ రంగంలో చేపట్టిన పలు అంశాలను సిస్కో చైర్మన్‌కు వివరించారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాల గురించి తెలిపారు. డిజిటల్ మౌలిక వసతుల రంగంలో ఫైబర్ గ్రిడ్ ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. మంత్రితో పాటు ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్ ఉన్నారు. -
సిస్కో చైర్మన్‌తో కేటీఆర్ చర్చలు
హైదరాబాద్: తెలంగాణ సర్కారు చేపట్టిన డిజిటల్ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేందుకు సిస్కో ఆసక్తి చూపిందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు. శుక్రవారం సిలికాన్ వ్యాలీలోని సిస్కో కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌కు అపూర్వ స్వాగతం లభించింది. సంస్ధ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. డిజిటల్ ఇండియా, డిజిటల్ తెలంగాణ విషయంలో సిస్కో ప్రణాళికలను మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, టీ హబ్ వంటి కార్యక్రమాలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. తెలంగాణ రాష్ర్టం పైన సిస్కో చైర్మన్ ప్రసంశలు కురిపించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించటం ద్వారా డిజిటల్ తెలంగాణ సాధ్యమని తెలిపారు. డిజిటైలైజేషన్ తో ప్రజల జీవితాల్లో మార్పులు సంభవిస్తాయని, అర్ధిక వ్యవస్ధ బలోపేతం అవుతుందని వివరించారు. ఈ మేరకు తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఏర్పాటుతో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే టెక్నాలజీ డెమాన్ స్ర్టేషన్ నెట్ వర్క్ ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని సిస్కో ఇండియా టీంను జాన్ చాంబర్స్ ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన టీ హబ్ లోని స్టార్టప్స్, హైదరాబాద్ పారిశ్రామిక వేత్తలతో మాట్లాడేందుకు సంసిద్ధత తెలిపారు. సిస్కో కంపెనీ తయారీ యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు.ద మంత్రి వెంట ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ ఉన్నారు. -
'6,600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నాం'
శాన్ఫ్రాన్సిస్కో: గ్లోబల్ నెట్వర్కింగ్ దిగ్గజం సిస్కో 6,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. గతంలో 5,500 మందిని తొలగించాలని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకుని మరో 1100 మంది ఉద్యోగులను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. 2016 ఆగష్టులో తీసుకున్న రీ స్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా కీ ప్రయారిటీ ఏరియాల్లో పెట్టుబడుల కోసమే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వివరించింది. 2018 తొలి క్వార్టర్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొంది. సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఓ వైపు ఉద్యోగులకు పింక స్లిప్‌లు ఇస్తుండగా తాజాగా ఆ జాబితాలోకి సిస్కో కూడా వచ్చి చేరింది. -
హెచ్ 1బీ వీసాల కొత్త ఆర్డర్లపై ఉర్జిత్ చురకలు
న్యూఢిల్లీ: అమెరికా కొత్త హెచ్1 బీ పాలసీ నిబంధనలపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ స్పందించారు. అమెరికా తదితర దేశాల రక్షణవాద విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన ట్రంప్ హెచ్ 1 బీ వీసాల కఠిన నిబంధనలతో తీసుకొచ్చిన కొత్త ఆర్డర్లపై చురకలంటించారు. పరస్పర సహకారం లేకపోతే అమెరికా దిగ్గజ కంపెనీలు ఎక్కడ ఉండేవని ఆయన ప్రశ్నించారు. కొలంబియా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ లో ఇండియన్ ఎకనామిక్ పాలసీస్‌పై రాజ్ సెంటర్ స్పాన్సర్ చేసిన ‘థర్డ్ కోటక్ ఫ్యామిలీ విశిష్ట ప్రసంగం’ లో సోమవారం పటేల్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రధాన ప్రపంచ ఆర్థికవ్యవస్థల రక్షణవాద ధోరణుల పెరుగుదలపై ప్రశ్నకు ప్రతిస్పందనగా పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఉత్పత్తులు, ప్రతిభను అందించకపోతే, ఆపిల్, సిస్కో ఐబిఎమ్ లాంటి భారీ అమెరికన్ సంస్థలు ఎక్కడ ఉండేవని ఉర్జిత్ ప్రశ్నించారు. అమెరికా సహా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కార్పోరేషన్ల విలువ గ్లోబల్ సప్లయ్ చైన్ల కారణంగానే పెరిగిందని పేర్కొన్నారు. పెద్ద సంపద సృష్టికర్తలు ఇలాంటి విధానాలను అబలంబిస్తే చివరికివారే ఈ ప్రభావానికి లోను కావాల్సి వస్తుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. కస్టమ్స్ డ్యూటీలు, సరిహద్దు పన్ను వంటి వాణిజ్య పరికరాలను ఉపయోగించడం సమర్థవంతమైన మార్గం కాదన్నారు. వాస్తవానికి దీనికి వేరే మార్గం ఎంచుకువాల్సి ఉంటుందన్నారు. ఈక్విటీ మరియు డిస్ట్రిబ్యూషన్స్ విధానాల్లో అనుసరిస్తున్న విధానాల కొన్నింటి ప్రభావం వారికి తెలియడం లేదని అభిప్రాయపడ్డారు. ఇది వృద్ధికి తీరని నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. ఇది దేశీయ విధానాంగా ఉండాలన్నారు. దేశీయ విధాన సమస్యగా ఉండాలి. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఉర్జిత్ తెలిపారు. -
సిస్కో చేతికి ‘దేశీ’ స్టార్టప్ సంస్థ
3.7 బిలియన్ డాలర్లకు యాప్‌డైనమిక్స్ కొనుగోలు న్యూఢిల్లీ: ప్రవాస భారతీయ వ్యాపారవేత్త జ్యోతి బన్సల్ నెలకొల్పిన ‘యాప్‌డైనమిక్స్’ స్టార్టప్ సంస్థను దిగ్గజ కంపెనీ సిస్కో కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 3.7 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. కంపెనీలు తమ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌ను మెరుగ్గా నిర్వహించుకునేందుకు, వ్యాపార పనితీరునును మెరుగుపర్చుకునేందుకు అవసరమైన సేవలను యాప్‌డైనమిక్స్ అందిస్తోంది. ఢిల్లీలోని ఇండియిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన బన్సల్.. 2008లో యాప్‌డైనమిక్స్‌ను ప్రారంభించారు. 2015 సెప్టెంబర్‌లో సీఈవో హోదా నుంచి బన్సల్ తప్పుకున్న తర్వాత డేవిడ్ వాధ్వానీ ఆ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం బన్సల్ కంపెనీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. యాప్‌డైనమిక్స్ సంస్థ అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి డీల్ పూర్తి కావొచ్చని అంచనా. -
కంపెనీ పెట్టి.. 25వేల కోట్లకు అమ్మేశాడు!
అతడు ఢిల్లీ ఐఐటీలో చదివాడు. తర్వాత అమెరికాలో యాప్ డైనమిక్స్ అనే సాఫ్ఘ్వేర్ కంపెనీ పెట్టాడు. దాని పనితీరు బాగుందని సిస్కో కంపెనీ దానిమీద కన్నేసింది. మంచి డీల్ ఆఫర్ చేసింది. ఇంకేముంది, బ్రహ్మాండంగా తన కంపెనీని అమ్మేశాడా యువకుడు. అతడిపేరు జ్యోతి బన్సల్. యాప్ డైనమిక్స్ వ్యవస్థాకుడు, చైర్మన్. అతడి కంపెనీని కొనేందుకు సిస్కో సిస్టమ్స్ ఆఫర్ చేసిన ధర.. అక్షరాలా రూ. 25 వేల కోట్లు!! ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద మొత్తంలో డీల్ జరిగిన దాఖలాలు లేవు. ఇన్నాళ్లూ కేవలం టెక్నాలజీ డెవలప్మెంట్కు మాత్రమే పరిమితమవుతూ వచ్చిన సిస్కో లాంటి కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వైపు కూడా విస్తరిస్తున్నాయి. ఇంతకుముందు సరిగ్గా వారం క్రితం హ్యూలెట్ పాకార్డ్ (హెచ్‌పీ) కంపెనీ కూడా సింప్లివిటీ అనే మరో సాఫ్ట్వేర్ కంపెనీని రూ. 4418 కోట్లకు కొనుగోలు చేసింది. విదేశాల్లో ఉన్న డబ్బును తెప్పించుకునేలా అమెరికన్ కంపెనీలను ప్రోత్సహించాలన్న ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగానే ఈ కంపెనీలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సిస్కో లాంటి పెద్దస్థాయి టెక్నాలజీ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. తమ కంపెనీ దీర్ఘకాలిక వ్యూహాల కోసం ఈ టేకోవర్ బాగా ఉపయోగపడుతుందని సిస్కో కార్పొరేట్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ రాబ్ సాల్వాంగో చెప్పారు. యాప్ డైనమిక్స్ సంస్థ అప్లికేషన్లను మేనేజ్ చేయడంతో పాటు వాటిని విశ్లేషిస్తుంది. దానికి 2వేల మందికి పైగా కస్టమర్లున్నారు. నాస్డాక్, నైక్, ఇప్పటివరకు సిస్కో కూడా ఈ కంపెనీ కస్టమర్లే. వాస్తవానికి ఎప్పటినుంచో యాప్ డైనమిక్స్ సంస్థ ఐపీఓకు వెళ్లాలని చూస్తోంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే సిస్కో రంగంలోకి దిగింది. దాంతో ఒక్కసారిగా కంపెనీ ప్రాధాన్యాలు మారిపోయాయి. వాస్తవానికి యాప్ డైనమిక్స్ సంస్థకు 2015 నవంబర్ నెలలో వాల్యుయేషన్ చేయిస్తే, దాని విలువ సుమారు 12915 కోట్ల రూపాయలని తేలింది. కానీ, దాదాపు దానికి రెట్టింపు ధరను సిస్కో ఆఫర్ చేయడంతో ఇక కాదనలేకపోయారు. -
డీమానిటైజేషన్ చిన్న కుదుపు మాత్రమే
• భారత్ నిలకడగా 7 శాతం పైగా వృద్ధి సాధించగలదు • సిస్కో చైర్మన్ జాన్ చాంబర్స్ జైపూర్: వేగంగా ఎదుగుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద నోట్ల రద్దు ఒక చిన్న కుదుపులాంటిది మాత్రమేనని సిస్కో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జాన్ ఛాంబర్స్ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో నిలకడగా 7 శాతం పైగా వృద్ధి రేటు సాధించేసత్తా భారత్‌కి ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా మిత్రదేశాల్లో అగ్రస్థానంలో ఉండగలదని చాంబర్స్ చెప్పారు. యూఎస్ఐబీసీ చైర్మన్ కూడా అయిన చాంబర్స్.. 8వ వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమంలోపాల్గొనేందుకు అమెరికా వ్యాపార దిగ్గజాల బృందంతో భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో డీమోనిటైజేషన్ వంటి ఆకస్మిక పరిణామం భారత్‌లో వ్యాపారాల నిర్వహణపై విదేశీ సంస్థల అభిప్రాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందా అన్న ప్రశ్నపైస్పందిస్తూ.. ఆర్థిక ప్రపంచంలో నోట్ల రద్దు అంశాన్ని తప్పు బట్టే వారు చాలా తక్కువే ఉంటారని చాంబర్స్ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములయ్యేందుకు ఇది పునాది వేయగలదని ఆయన చెప్పారు. సాధారణంగా కొత్తఆవిష్కరణలు తెరపైకి వచ్చినప్పుడు కచ్చితంగా కుదుపులు ఉంటాయన్నారు. అయితే, భారత్ సరైన వ్యూహం, దార్శనికతతో సరైన దిశలో వేగంగా పయనిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అసూయ చెందేలా వృద్ధి..: దేశీ ఎకానమీపై డిజిటల్ ప్రభావం గురించి మాట్లాడుతూ.. ఇంటర్నెట్ వల్ల అత్యంత వేగంగా 3–5 రెట్లు అధికంగా సానుకూల ఆర్థిక ప్రభావాలు ఉండగలవని చాంబర్స్ చెప్పారు. ‘ఈ మార్పుల ఊతంతో ఇప్పట్నుంచి ఏడాదివ్యవధిలో ప్రపంచం అసూయ చెందేలా భారత జీడీపీ మరింత పటిష్టంగా మారుతుంది. జీడీపీ వృద్ధి ఏడు శాతం స్థాయిలో నిలకడగా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. 8..9..10 శాతం కూడా సాధించే అవకాశాలు లేకపోలేదు’ అని చాంబర్స్పేర్కొన్నారు. గతంలో మందకొడిగా మిగతా దేశాలను అనుసరిస్తుందంటూ పేరొందిన భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా నూతన ఆవిష్కరణలకు తెరతీస్తున్న దేశంగా పేరు తెచ్చుకుంటోందని చెప్పారు. -
5,500 ఉద్యోగాలకు సిస్కో కోత
♦ భారత్‌పైనా ప్రభావం! ♦ దేశంలో సంస్థకు 11వేల మంది ఉద్యోగులు న్యూయార్క్: అమెరికాకు చెందిన నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో భారీగా ఉద్యోగులను తొలగించే పనికి శ్రీకారం చుట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 5,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ సంఖ్య సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 7 శాతానికి సమానం. ఈ ప్రభావం భారత్‌లోని సంస్థ ఉద్యోగులపైనా ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే సిస్కోకు భారత్‌కు రెండో అతిపెద్ద కేంద్రంగా ఉంది. ఇక్కడ సంస్థకు 11,000 మంది ఉద్యోగులున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 73వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఎంత మందిని తొలగించనున్నదీ సిస్కో వెల్లడించలేదు. కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కారణంగా 5,500 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని, 2017 మొదటి త్రైమాసికం నుంచి తొలగింపు ప్రక్రియ చేపడతామని సిస్కో ఎగ్జిక్యూటివ్వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో కెల్లీక్రామర్ తెలిపారు. నెట్వర్క్ స్విచెస్, రూటర్ల విక్రయాలు నిదానించడంతో సిస్కో డేటా అనలిటిక్స్ సాఫ్ట్వేర్, డేటా సెంటర్లకు క్లౌడ్ ఆధారిత టూల్స్ అందించే నూతన వ్యాపార విభాగాలపై దృష్టి కేంద్రీకరించింది. సిస్కోకు భారత్ కీలకం... 2016 జూన్ త్రైమాసికంలో సిస్కో ఆదాయాలు 2 శాతం తగ్గి 12.6 బిలియన్ డాలర్లకు పడిపోగా... లాభం మాత్రం 21 శాతం పెరిగి 2.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ముఖ్యంగా ఇతర వర్ధమాన దేశాల నుంచి ఆదాయాలు 6 శాతం తగ్గిన పరిస్థితుల్లోనూ భారత్ నుంచి కంపెనీ ఆదాయాలు 20 శాతం వృద్ధి చెందడం విశేషం.