
ఈ ఏడాది సిస్కో 170 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులు
అమెరికా టెక్నాలజీ దిగ్గజం సిస్కో ఈ ఏడాది భారత్‌లో 174 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది.
న్యూఢిల్లీ : అమెరికా టెక్నాలజీ దిగ్గజం సిస్కో ఈ ఏడాది భారత్‌లో 174 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతోంది. తయారీ రంగంపై దృష్టి సారిస్తున్నామని సిస్కో సిస్టమ్స్ చైర్మన్, సీఈఓ జాన్ టి. చాంబర్స్ చెప్పారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశామని, డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద తాము నిర్వహించబోయే పాత్రను ఆయనకు వివరించామని తెలిపారు.
ప్రతీ ఏడాది భారత్‌లో 170 కోట్ల డాలర్లు పెడుతున్నామని వివరించారు. ఈ ఏడాది అదనంగా 6 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నామని పేర్కొన్నారు. వీటిల్లో విద్యార్ధుల శిక్షణ కోసం 2 కోట్ల డాలర్లు, శిక్షణ కేంద్రాల విస్తరణకు 4 కోట్ల డాలర్లు వినియోగిస్తామని తెలిపారు.