న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకులందరిలో మోదీ అగ్రస్థానాన్ని సాధించారు. యూఎస్‌కు చెందిన గ్లోబల్ లీడర్ మార్నింగ్ కన్సల్ట్ అనే పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ తాజాగా రేటింగ్లను విడుదల చేసింది.
సదరు సర్వే ఈ ఏడాది జనవరి 13 నుంచి 19 వరకూ కలెక్ట్ చేసిన డేటా ప్రకారం భారత ప్రధాని 71 శాతం రేటింగ్‌తో అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకునిగా అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాత 66 శాతం రేటింగ్‌తో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మేన్యుయెల్ లోపెజ్ ఓబ్రడార్ రెండో స్థానంలోను, 60 రేటింగ్‌తో ఇటలీ దేశానికి చెందిన మారియో డ్రాఘీ మూడో స్థానం సంపాదించారు. ఇక ఈ లిస్ట్లో చివరి స్థానంలో జపాన్ ప్రధాని సుగా నిలిచారు. ఈ సంస్థ 13 మంది ప్రపంచంలోని నాయకుల జాబితాను తన వెబ్సైట్లో విడుదల చేసింది.
వీరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 43 శాతం రేటింగ్‌తో ఆరోస్థానంలో నిలిచారు. కెనడా అధ్యక్షుడు జస్టిస్ ట్రూడో కూడా 43 శాతం రేటింగ్ సాధించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 41 శాతం రేటింగ్‌ను సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇండియా, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యూనైటెడ్ కింగ్డమ్, యూనైటేడ్ స్టేట్స్లో ప్రభుత్వ నాయకులు, ప్రజల్లో వారి పట్ల ఉన్న ఆదరణపై సర్వే నిర్వహిస్తుంది.
మోదీ 2020లో కూడా 84 శాతం రేటింగ్‌తో అగ్రస్థానం పొందారు. అయితే, 2021లో మాత్రం ఆయన రేటింగ్ 63 శాతానికి పడిపోయింది. ఈ సంస్థ ప్రధానంగా ఎన్నికైన నాయకులు, అధికారులు, స్థానిక ఓటింగ్ సమస్యలపై ఆయాప్రాంతాలలోసర్వే నిర్వహిస్తుంది.
ప్రధానంగా స్థానికంగా ఉన్నవయోజనులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు దాదాపు 20,000 కంటె ఎక్కువ మందిని కలుస్తారు. సర్వేలో ప్రతి దేశంలో వయస్సు, లింగం, ప్రాంతాలలో సర్వే నిర్వహిస్తారు. దేశాన్ని బట్టి నమునాలు మారుతూ ఉంటాయి.
చదవండి: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?... క్లూ ఇచ్చిన ప్రియాంక!
Global Leader Approval: Among All Adults https://t.co/wRhUGstJrS
— Morning Consult (@MorningConsult) January 20, 2022
Modi: 71%
López Obrador: 66%
Draghi: 60%
Kishida: 48%
Scholz: 44%
Biden: 43%
Trudeau: 43%
Morrison: 41%
Sánchez: 40%
Moon: 38%
Bolsonaro: 37%
Macron: 34%
Johnson: 26%
*Updated 01/20/22 pic.twitter.com/nHaxp8Z0T5
Comments
Please login to add a commentAdd a comment