వాషింగ్టన్: ప్రధాని మోదీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాధ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘రష్యాతో సంబంధాలపై మేం మా ఆందోళనను భారత్‌కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో చూడాలి.
ఉక్రెయిన్ సార్వభౌమాత్వాన్ని,ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించాల్సిందిగా రష్యాతో దగ్గరగా వ్యవహరించే ఏ దేశమైనా పుతిన్‌కు చెప్పాలి’అని మిల్లర్ పేర్కొన్నారు.
2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు దూరంగా ఉండాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. అయితే కొన్ని ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యాతో భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment