russia tour
-
ప్రధాని రష్యా టూర్.. స్పందించిన అమెరికా
వాషింగ్టన్: ప్రధాని మోదీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయమై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాధ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు. ‘రష్యాతో సంబంధాలపై మేం మా ఆందోళనను భారత్‌కు ఇప్పటికే స్పష్టం చేశాం. రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో చూడాలి. ఉక్రెయిన్ సార్వభౌమాత్వాన్ని,ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవించాల్సిందిగా రష్యాతో దగ్గరగా వ్యవహరించే ఏ దేశమైనా పుతిన్‌కు చెప్పాలి’అని మిల్లర్ పేర్కొన్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాకు దూరంగా ఉండాలని భారత్‌పై అమెరికా ఒత్తిడి చేస్తూనే ఉంది. అయితే కొన్ని ఆర్థిక అవసరాల దృష్ట్యా రష్యాతో భారత్ సత్సంబంధాలను కొనసాగిస్తోంది. -
India-Russia relations: మాస్కోలో మోదీ.. నేడు పుతిన్‌తో చర్చలు
మాస్కో/న్యూఢిల్లీ: భారత్, రష్యాల మైత్రీ బంధాన్ని నూతన సమున్నత శిఖరాలకు చేర్చడమే లక్ష్యంగా ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన ఆరంభమైంది. 22వ ఇండో–రష్యా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు మోదీ సోమవారం రష్యాకు విచ్చేశారు. మంగళవారం ఉదయం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మోదీ అల్పాహారం అనంతరం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. విస్తృతస్థాయి చర్చలు జరపనున్నారు. తర్వాత దౌత్య, అధికారిక బృందాలతో కలిసి వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య పటిష్ట మైత్రి, సహకార బంధంపై సమగ్ర, లోతైన చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ను రష్యా దురాక్రమించిన అంశం చర్చకొచ్చే అవకాశముంది. రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా భారతీయులను రిక్రూట్ చేసుకుని ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాలకు తరలించిన ఉదంతాలు చర్చకొచ్చే అవకాశముంది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మోదీ రష్యాకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మోదీకి పుతిన్ విందు...మాస్కో శివారులోని నోవో–ఒగార్యోవో అధికార నివాసంలో మోదీని పుతిన్ సాదరంగా ఆహా్వనించారు. ఆప్యాయంగా ఇరునేతలూ హత్తుకున్నారు. ఈ సందర్భంగా రాత్రి మోదీకి పుతిన్ ప్రత్యేక విందు ఇచ్చారు. మోదీ పాలనలో భారత్ సాధించిన అభివృద్ధిని పుతిన్ ఈ సందర్భంగా కొనియాడారు. అంతకుముందు‡మాస్కో విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి రష్యా మొదటి ఉపప్రధాని డెనిస్ మాన్ట్సురోవ్ సాదర స్వాగతం పలికారు. అక్కడే మోదీ రష్యా సైనికుల సైనికవందనం స్వీకరించారు. ది కార్ల్టన్ హోటల్ల్లో మోదీకి పెద్దసంఖ్యలో భారత సంతతి ప్రజలు స్వాగతం పలికారు. హిందీ పాటలకు భారతీయులు, రష్యా కళాకారులు నృత్యంచేస్తూ మోదీని ఆనందంలో ముంచెత్తారు. ‘ఇప్పుడే మాస్కో నేలపై అడుగుపెట్టా. మిత్రుడు పుతిన్‌తో భేటీకి ఎదురుచూస్తున్నా. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకోబోతున్నా. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరతల స్థాపనకు ఇరువురం మా వంతు కృషిచేస్తాం’’ అని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. -
యుద్ధ విమానాల ప్లాంట్‌ను సందర్శించిన కిమ్
సియోల్: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జొంగ్ ఉన్ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్స్క్ ఆన్ అముర్‌లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ ఎస్‌యూ–57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్ విడుదల చేసింది. ఒక ఎస్‌యూ–35 ఫైటర్ జెట్ ల్యాండ్ అయినప్పుడు కిమ్ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్ సుఖోయ్ ఎస్జే–100 ప్యాసింజర్ విమానాల ప్లాంట్‌ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఉన్నారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కిమ్ భేటీ అయ్యారు. -
రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ రష్యాకు పయన మయ్యారు. ఆయన తన సొంత బుల్లెట్ ప్రూఫ్ రైలులో ఆదివారం సాయంత్రం రాజధాని ప్యాంగాంగ్ వదిలివెళ్లారని దక్షిణ కొరియా వర్గాలు తెలిపాయి. మూడు రోజులపాటు జరిగే ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ సోమవారం వ్లాడివోస్టోక్ వెళ్లారని, అక్కడే ఆయనతో కిమ్ సమావేశమవ్వొచ్చని చెబుతున్నారు. కిమ్ తమ దేశానికి వస్తున్నారంటూ రష్యా కూడా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు త్వరలో కిమ్ రానున్నారని క్రెమ్లిన్ అధికార వెబ్సైట్ పేర్కొంది. పుతిన్, కిమ్‌లు త్వరలో కలుసుకుంటారని ఉత్తరకొరియా అధికార వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కూడా తెలిపింది. ‘రష్యా పర్యటనలో కామ్రెడ్ కిమ్ జొంగ్ ఉన్, కామ్రెడ్ పుతిన్‌తో చర్చలు జరుపుతారు’అని పేర్కొంది. అయితే, ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ ఉంటుందనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. కిమ్ విదేశీ పర్యటనలకు వినియోగించే ఆకుపచ్చ బోగీలతో కూడిన బుల్లెట్ ప్రూఫ్ రైలును రష్యా సరిహద్దుల్లోని ఉత్తరకొరియా రైల్వే స్టేషన్లో ఉండగా గుర్తించినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఉక్రెయిన్‌తో ఏడాదిన్నరగా కొనసాగుతున్న యుద్ధానికి అవసరమైన ఆయుధాల కొనుగోలుకు కిమ్‌తో పుతిన్ ఒప్పందం కుదుర్చుకునేందుకు అవకాశాలున్నాయన్నది పశ్చిమదేశాల అంచనా. కోవిడ్ మహమ్మారి ప్రబలిన దాదాపు నాలుగేళ్ల తర్వాత కిమ్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే. రైలులోనే ఎందుకు? గతంలో 2019లో మొదటిసారిగా వ్లాడివోస్టోక్‌లో పుతిన్‌తో సమావేశమైనప్పుడు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లతో సమావేశాలకు రైలులో వెళ్లినట్లుగానే ఈసారీ కిమ్ రష్యాకు రైలులోనే బయలుదేరారు. సొంత రైలులోనే విదేశీ పర్యటనలు చేసిన దివంగత పాలకుడు, తన తండ్రి పాటించిన సంప్రదాయాన్ని కిమ్ కూడా కొనసాగిస్తున్నారు. ఈ రైలుకు 20 బుల్లెట్ ప్రూఫ్ బోగీలుంటాయి. దీనివల్ల సాధారణ రైళ్ల కంటే ఇది ఎక్కువ బరువుంటుంది. సరాసరిన గంటకు 59 కిలోమీటర్లకు మించి వేగంతో ఇది ప్రయాణించలేదు. ఈ వేగంతో ప్యాంగ్యాంగ్ నుంచి వ్లాడివోస్టోక్‌కు వెళ్లడానికి ఒక రోజంతా పడుతుంది. -
అది స్నేహం, సహకారం, శాంతి యాత్ర: చైనా
బీజింగ్: రష్యాలో చైనా అధినేత షీ జిన్‌పింగ్ పర్యటన బుధవారం ముగిసింది. ఈ పర్యటనను స్నేహం, సహకారం, శాంతి యాత్రగా చైనా అభివర్ణించింది. ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ, ఆర్థిక సాయం అందిస్తుండడాన్ని డ్రాగన్ దేశం తప్పుపట్టింది. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతలను ఇంకా రెచ్చగొట్టడానికి అమెరికా కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో తాము తటస్థంగానే వ్యవహరిస్తామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో తమకు ఎలాంటి స్వార్థపూరిత ప్రయోజనాలు లేవన్నారు. ఈ యుద్ధాన్ని లాభం కోసం వాడుకోవాలన్న ఆలోచన ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. జిన్‌పింగ్ రష్యా పర్యటనపై ప్రపంచవ్యాప్తంగా పూర్తి సానుకూల స్పందన వ్యక్తమైందని వెన్బిన్ హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్–రష్యా దేశాల నడుమ శాంతి చర్చల కోసం తాము చొరవ చూపుతున్నామని వివరించారు. ఇదిలా ఉండగా, జిన్‌పింగ్ రష్యా పర్యటన వల్ల తక్షణ ఫలితమేమీ కనిపించలేదు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వెనక్కి తగ్గడం లేదు. శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానని జిన్‌పింగ్ చెప్పిన సంగతి తెలిసిందే. -
పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు.. రష్యాలో జిన్‌పింగ్
మాస్కో: చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు రష్యాలో ఘనస్వాగతం లభించింది. మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన సోమవారం రష్యా రాజధాని మాస్కోకు చేరుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. అవధులు లేని తమ స్నేహాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్‌పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఒత్తిడి! ప్రపంచంలో రెండు బలమైన దేశాల అధినేతలు జిన్‌పింగ్, పుతిన్ సోమవారం చర్చలు ప్రారంభించారు. ప్రధానంగా ఉక్రెయిన్–రష్యా యుద్ధం, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్, పుతిన్ మధ్య ముఖాముఖి చర్చల తర్వాత ఇరుదేశాల నడుమ ప్రతినిధుల స్థాయి చర్చలు ప్రారంభమవుతాయని రష్యా ప్రభుత్వ అధికారి యురీ ఉషాకోవ్ చెప్పారు. ఇద్దరు నాయకుల చర్చలు మంగళవారం కూడా కొనసాగుతాయని రష్యా మీడియా వెల్లడించింది. జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత రష్యాలో పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా, సైనికాధిపతిగా ఎన్నికైన తర్వాత జిన్‌పింగ్ తొలి విదేశీ పర్యటన కూడా ఇదే. ఉక్రెయిన్–రష్యా మధ్య శాంతి నెలకొనాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు జిన్‌పింగ్ చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి తెరదించడమే లక్ష్యంగా శాంతి చర్చల కోసం పుతిన్‌పై ఆయన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. బద్ధశత్రువులైన ఇరాన్, సౌదీ అరేబియా ఇటీవలే చేతులు కలిపాయి. దీని వెనుక చైనా దౌత్యం ఉంది. గత పదేళ్లుగా చైనా అధ్యక్షుడిగా పదవిలో కొనసాగుతూ ఇటీవలే మూడోసారి ఎన్నికైన జిన్‌పింగ్ రష్యాతో సన్నిహిత సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధం విషయంలో రష్యా వైఖరిని ప్రపంచంలో చాలా దేశాలు తప్పుపట్టినప్పటికీ జిన్‌పింగ్ మాత్రం పరోక్షంగా మద్దతు ప్రకటించారు. అమెరికా వ్యతిరేకతే చైనా, రష్యా దేశాలను ఒక్కటి చేస్తోంది. శాంతి ప్రణాళికతో వచ్చా: జిన్‌పింగ్ చైనా, రష్యా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయని, ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్నాయని జిన్‌పింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. థర్డ్ పార్టీని తాము లక్ష్యంగా చేసుకోవడం లేదన్నారు. రెండు పెద్ద దేశాల సంబంధాల విషయంలో ఒక కొత్త మోడల్‌ను అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇంటర్నేషనల్ లా పరిరక్షణ కోసం రష్యాతో కలిసి పని చేస్తూనే ఉంటామని జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి ప్రణాళికతో రష్యాకు వచ్చానన్నారు. ఉక్రెయిన్‌లో సంక్షోభాన్ని పరిష్కరించే విషయంలో చైనా చేసిన ప్రతిపాదనలను నిశితంగా పరిశీలిస్తున్నామని పుతిన్ తెలిపారు. దీనిపై జిన్‌పింగ్‌తో చర్చిస్తానని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ వ్యవహారాలు, సంక్షోభాల విషయంలో చైనా నిష్పాక్షిక, సమతూక వైఖరి అవలంబిస్తోందని పుతిన్ ప్రశంసించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జిన్‌పింగ్ మాట్లాడే అవకాశమున్నట్లు సమాచారం. తన శాంతి ప్రణాళికను జెలెన్స్కీతో ఆయన పంచుకోనున్నట్లు తెలుస్తోంది. -
7న రష్యాకు జై శంకర్
న్యూఢిల్లీ: విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ ఈ నెల 7, 8వ తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్తో మాస్కోలో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ గురువారం చెప్పారు. ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక వీరిద్దరు నాలుగుసార్లు సమావేశమయ్యారు. అమెరికా, పశ్చిమదేశాలు రష్యాపై అన్ని రకాలుగా తీవ్ర ఆంక్షలు విధించాయి. ఆయా దేశాల అభ్యంతరాలను సైతం లెక్క చేయకుండా భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను ఇటీవలి కాలంలో పెంచింది. -
‘డర్టీ బాంబ్’ ఆందోళనల వేళ రష్యాకు జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. అణ్యవాయుధాల వినియోగం ఆందోళనకు నెలకొన్న వేళ రష్యా పర్యటన చేపట్టనున్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. నవంబర్ 8న మాస్కో పర్యటనకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టూర్లో రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్తో సమావేశం కానున్నారు. జైశంకర్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వంటి అంశాలపై చర్చించనున్నట్లు రష్యా తెలిపింది. డర్టీ బాంబు వినియోగంపై రష్యా, ఉక్రెయిన్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో జైశంకర్ మాస్కో పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయ్‌గూతో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు. ఇదీ చదవండి: రష్యా ఆరోపణ.. భద్రతా మండలికి డర్టీ బాంబ్ పంచాయితీ! ఖేర్సన్ ఖాళీ!! -
Russia War: శాంతి చర్చల కోసం రంగంలోకి కీలక వ్యక్తి.. పుతిన్ రెస్పాన్స్..?
వాషింగ్టన్: ఉక్రెయిన్‌లో రష్యా భీకర దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్.. రష్యా, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటన ఖరారైంది. ఈ నెల 26న రష్యాలో, 28న ఉక్రెయిన్‌లో గుటెరస్ పర్యటించనున్నారు. ఈ పర్యటన విషయంపై రెండు దేశాలకు ఆయన లేఖలు రాశారు. కాగా, రెండు దేశాల మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఆయన వేర్వేరుగా సమావేశం కానున్నారు. అటు రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతోనూ ఆయన భేటీ కానున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలితమివ్వకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా రష్యా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌లో 1.2 కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉందన్నారు. డొనెట్స్క్, లుహాన్స్క్, మరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే చాలా మంది ఉక్రేనియన్లు బిక్కుబిక్కుమంటూ జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాలు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: రక్షణ విషయంలో రష్యాపై భారత్ ఆధారపడొద్దు -
భారత్‌లోనే ఏకే–47 తయారీ!
మాస్కో: భారత్‌లో ఏకే– 47 203 రైఫిల్స్ ఉత్పత్తికి సంబంధించి ఇండియా, రష్యాల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా రష్యా పర్యటనలో ఈ డీల్ కొలిక్కి వచ్చినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జేవీలో భాగంగా వీటిని ఉత్పత్తి చేస్తారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, కల్నోషికోవ్ కన్సెర్న్, రోసోబోరోనెక్స్‌పోర్ట్‌లు ఈ జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వాములు. జేవీలో ఆర్డినెన్స్‌ఫ్యాక్టరీ బోర్డుకు మెజార్టీ(50.5 శాతం)వాటా ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని కొర్వా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈ ఏకే– 47లను ఉత్పత్తి చేయనున్నారని మీడియా వర్గాలు వెల్లడించాయి. డీల్ విశేషాలు... ► ఏకే– 47 రైఫిల్స్‌లో 203 మోడల్ ఆధునికమైన వెర్షన్. ►ప్రస్తుతం ఆర్మీ వాడుతున్న ఇన్సాస్ 5.56 ్ఠ45 ఎంఎం అసాల్ట్ రైఫిల్ స్థానంలో ఈ ఏకే– 47 –203 7.62ణ39 ఎంఎం రైఫిల్స్‌ను ప్రవేశపెడతారు. ► భారత ఆర్మీకి దాదాపు 7.7 లక్షల ఏకే– 47 203లు అవసరం పడతాయని అంచనా. ► లక్ష రైఫిల్స్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటారు. మిగతావి దేశీయంగా తయారు చేసేలా ఒప్పందం కుదిరింది. ► ఒక్కోరైఫిల్ ఖరీదు దాదాపు 1100 యూఎస్ డాలర్లు ఉండవచ్చు. ► ప్రస్తుతం వాడుకలో ఉన్న ఇన్సాస్ రైఫిళ్లను 1996 నుంచి వినియోగిస్తున్నారు. ► ఇన్సాస్ రైఫిళ్లతో హిమాలయ మంచు ప్రాంతాల్లో జామ్ కావడం, పగుళ్లు రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. ► అందుకే ఆర్మీకి ఏకే– 47 203 మోడల్ రైఫిళ్లను అందించాలని నిర్ణయించారు. రష్యా రక్షణమంత్రితో రాజ్నా«థ్ చర్చలు రష్యా రక్షణ మంత్రి జనరల్ సెర్గీ షోయగుతో ఫలప్రదవంతమైన చర్చలు జరిగాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం వెల్లడించారు. రక్షణ, వ్యూహాత్మక సహకారం సహా పలు అంశాలను చర్చించినట్లు తెలిపారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల కోసం రాజ్‌నాథ్ మూడురోజుల రష్యా పర్యటనకు వెళ్లారు. వివిధ రకాల ఆయుధ వ్యవస్థలు, మందుగుండు, విడిభాగాలను భారత్‌కు సరఫరా చేసే అంశంపై రష్యాతో చర్చలు జరిపారు. ఎస్400 మిసైల్ డిఫెన్స్ వ్యవస్థను సకాలంలో భారత్‌కు అందించాలని రాజ్‌నాథ్ కోరినట్లు అధికారులు తెలిపారు. 2021 చివరకు ఈ మిసైల్ వ్యవస్థ తొలిబ్యాచ్ భారత్‌కు చేరవచ్చని అంచనా. శుక్రవారం రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పాల్గొంటారు. -
‘సోఫా వద్దు.. కుర్చీలోనే కూర్చుంటాను’
వ్లాడివోస్టోక్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా ప్రతినిధులతో జరిగిన ఓ ఫోటో సెషన్ కార్యక్రమంలో మోదీ ప్రవర్తించిన తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటో సెషన్ సందర్భంగా రష్యా అధికారులు మోదీ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేశారు. అయితే మోదీ దానిలో కూర్చోడానికి అంగీకరించలేదు. అందరితో పాటు తాను అని.. ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని తెలిపారు. మిగతా వారితో పాటు కుర్చీలోనే కూర్చుంటానన్నారు. దాంతో అధికారులు వెంటనే మోదీ కోసంకుర్చీని తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. PM @NarendraModi जी की सरलता का उदाहरण आज पुनः देखने को मिला, उन्होंने रूस में अपने लिए की गई विशेष व्यवस्था को हटवा कर अन्य लोगों के साथ सामान्य कुर्सी पर बैठने की इच्छा जाहिर की। pic.twitter.com/6Rn7eHid6N — Piyush Goyal (@PiyushGoyal) September 5, 2019 మోదీ ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోదీ సింప్లిసిటీని వర్ణించడానికి మాటలు లేవు.. తెలివితేటలు, వినయ విధేయతలతో పాటు ఒదిగి ఉండే వ్యక్తి మనకు ప్రధానిగా వచ్చాడు’.. ‘మోదీ సింప్లిసిటీ ఆయనను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టింది. దేశానికి ఉత్తమమైనది ఏదో ఆయనకు తెలుసు.. మంచి వారికి మంచివాడు.. దేశానికి హానీ చేయాలనుకునే వారి పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తాడు’ అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: మోదీ పిలుపునకు ‘అమెజాన్’ పలుకు) -
బంధానికి ఆంక్షలు అడ్డుకావు
వ్లాడివోస్టోక్: రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్–రష్యాల, వ్యూహాత్మకమైన ఇంధనం, రక్షణ రంగాలు, ఇరుదేశాల బంధంపై ఉండబోదని ప్రధాని మోదీ అన్నారు. ‘భారత్ కంపెనీలు రష్యాలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లోనూ, రష్యా సంస్థలు భారత్‌లోని ఇంధనం, రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై పెట్టుబడులు పెట్టాయన్నారు. వీటిపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు అడ్డంకిగా మారబోవు’ అని తెలిపారు. క్రిమియా కలిపేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీటి ప్రభావం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపైనా పడుతోంది. టాల్‌స్టాయ్– గాంధీజీ స్నేహమే స్ఫూర్తి ప్రముఖ రష్యా రచయిత, తత్వవేత్త లియో టాల్‌స్టాయ్, గాంధీజీల మైత్రి వారిద్దరిపైనా చెరగని ముద్ర వేసిందని ప్రధాని మోదీ అన్నారు. టాల్‌స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ’ పుస్తకం తన జీవితాన్ని మార్చివేసిందని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారని మోదీ తెలిపారు. వారి స్నేహం స్ఫూర్తిగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో రెండు దేశాలు పరస్పరం కీలక వాటాదారులు కావాలన్నారు. వ్లాడివోస్టోక్‌లో జరుగుతున్న 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం(ఈఈఎఫ్) ప్లీనరీలో ప్రధాని గురువారం మాట్లాడారు. ‘రష్యా తూర్పు ప్రాంతాన్ని పెట్టుబడులకు వేదికగా భావిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉంటాం’అని తెలిపారు. ‘రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధికి రూ.7వేల కోట్లను భారత్ రుణంగా అందజేయనుంది. మరో దేశానికి భారత్ ఇలా రుణం ఇవ్వడం ‘ఒక ప్రత్యేక సందర్భం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ విధానాన్ని ఆవిష్కరించారు. ఈఈఎఫ్ వేదికగా రూ.36 వేల కోట్ల విలువైన 50 ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమ్మిళిత ‘ఇండో–పసిఫిక్’ ప్రాంతం భారత్, రష్యాల మధ్య బలపడిన మైత్రితో ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని ‘ఆటంకాలు లేని, స్వేచ్ఛాయుత, సమ్మిళిత’ ప్రాంతంగా మార్చే నూతన శకం ప్రారంభమైందన్నారు. ‘ఈ విధానం నిబంధనలను, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంతో పాటు, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు. చైనా ఈ ప్రాంతంలో సైనిక బలం పెంచుకోవడం, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై తమదే పెత్తనమనడంపై మోదీ పైవిధంగా మాట్లాడారు. -
రష్యాలో ప్రధాని మోదీ పర్యటన
-
విదేశీ జోక్యానికి నో
వ్లాడివోస్టోక్: భారత్–రష్యాలు తమ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. రష్యాలతో వాణిజ్యం, భద్రత, నౌకాయానం, అంతరిక్ష రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తున్నామనీ, రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని ఎగదోయడం నిలిపివేయాలని హితవు పలికారు. కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ చేస్తున్న ఆందోళనను, వేర్పాటువాదులకు ఇస్తున్న మద్దతును మోదీ ఈ మేరకు పరోక్షంగా తప్పుపట్టారు. రెండ్రోజుల రష్యా పర్యటనలో భాగంగా బుధవారం మోదీ వ్లాడివోస్టోక్ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి రష్యా బలగాలు గౌరవవందనం సమర్పించాయి. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి ‘భారత్–రష్యా 20వ వార్షిక సదస్సు’లో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు రక్షణ, అంతరిక్షం, నౌకాయానం, ఇంధనం, సహజవాయువు, పెట్రోలియం, వాణిజ్యం సహా 15 రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. చెన్నై–వ్లాడివోస్టోక్ నౌకామార్గం.. ప్రధాని మోదీ–పుతిన్‌ల నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధి బృందాల భేటీ అనంతరం భారత్, రష్యాలు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ....‘తమిళనాడు రాజధాని చెన్నై నుంచి వ్లాడివోస్టోక్ వరకూ పూర్తిస్థాయి నౌకాయాన మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఎంవోయూ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం భారత్–రష్యాల మధ్య రూ.79,247 కోట్లు(11 బిలియన్ డాలర్లు)గా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2025 నాటికి రూ.2.16 లక్షల కోట్లకు చేర్చాలని మోదీ–పుతిన్ నిర్ణయం తీసుకున్నారు’ అని తెలిపింది. అంతకుముందు అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ఓ బోటులో 2 గంటల పాటు మోదీ విహరించారు. ఈ సందర్భంగా ఇరువురు వ్లాడివోస్టోక్‌లోని జెవెజ్‌డా నౌకానిర్మాణ కేంద్రాన్ని సందర్శించారు. భారత్ కీలక భాగస్వామి: పుతిన్ మోదీ పర్యటన నేపథ్యంలో పుతిన్ మాట్లాడుతూ.. భారత్ రష్యాకు అత్యంత కీలకమైన భాగస్వామని తెలిపారు. ‘ఇరుదేశాల మధ్య వాణిజ్యం 17 శాతం వృద్ధి చెంది 11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నాం. భారత్–యూరేసియన్ ఎకనమిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకునేందుకు కృషి చేస్తున్నాం’ అని అన్నారు. ‘గగన్‌యాన్’కు రష్యా సహకారం.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో పాల్గొనే వ్యోమగాములకు రష్యా శిక్షణ ఇవ్వనుందని మోదీ ప్రకటించారు. ఇందుకోసం ఇస్రో, రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ సన్నిహితంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు. అంతరిక్ష వాహకనౌకల ప్రయోగం, అభివృద్ధి, అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వాడుకునే విషయంలో కలసికట్టుగా పనిచేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయని పేర్కొన్నారు. వ్యోమగాములను ఎంపిక చేసే ప్రక్రియను ఇస్రో ఇప్పటికే ప్రారంభించిందనీ, ఈ ఏడాది నవంబర్ తర్వాత వీరికి రష్యాలో శిక్షణ ఇస్తారని చెప్పారు. గగన్‌యాన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపేందుకు కేంద్రం రూ.10,000 కోట్లను కేటాయించింది. -
‘ప్రత్యేక భాగస్వామ్యం’ మనది
సోచి: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరాయని, ఇది ఇరు దేశాలు సాధించిన భారీ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు నాటిన వ్యూహాత్మక భాగస్వామ్యమనే విత్తనాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పుతిన్‌తో చర్చలు విజయవంతంగా సాగాయని, భారత్–రష్యాల మధ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ తెలిపారు. రష్యాలోని నల్లసముద్ర తీరప్రాంత నగరమైన సోచిలో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మోదీ అనధికారికంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానిస్తూ.. మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. నాలుగు నుంచి ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపైనే ఎక్కువ సమయం చర్చించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, అఫ్గానిస్తాన్, సిరియాల్లో పరిస్థితి, ఉగ్రవాద ముప్పు, త్వరలో జరగనున్న ఎస్సీవో, బ్రిక్స్ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌ల మధ్య చర్చ జరిగింది. పుతిన్‌కు ప్రత్యేక స్థానం: మోదీ భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి రష్యాలో పర్యటించడాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కలుసుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు పుతిన్. నా రాజకీయ జీవితంలో పుతిన్, రష్యాలకు ప్రత్యేక స్థానం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, రష్యాలు ఎప్పటినుంచో మిత్రదేశాలు., ఆ రెండింటి మధ్య ఇంతవరకూ విభేదాలు లేని మైత్రి కొనసాగింది. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్ల స్నేహ సంబంధాల్లో ఈ అనధికారిక భేటీ ఒక కొత్త కోణం. దీనిని ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. భారత్, రష్యాల మధ్య సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా గత 18 ఏళ్లలో అనేక అంశాలపై పుతిన్‌తో చర్చించే అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ను అభినందించారు. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు చరిత్రాత్మక స్థాయికి చేరాయని మోదీ ప్రశంసిం చారు. సోచిలో బొకారెవ్ క్రీక్ నుంచి ఒలింపిక్ పార్కు వరకూ ఇరువురు బోటు షికారు చేశారు. ఇరు దేశాలకు ప్రయోజకరంగా..: రష్యా సోమవారం నాటి చర్చలు చాలా ఉత్సుకతతో, ఇరు దేశాలకు ఉపయోగకరంగా సాగాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను ఉద్దేశించి ఆ దేశ అధికారిక వార్తాపత్రిక టాస్ పేర్కొంది. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా–భారత్ మధ్య సైనిక సహకారంపై చర్చలు జరుగుతాయని పెస్కోవ్ చెప్పారు. రష్యా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ సోమవారం రాత్రి భారత్‌కు పయనమయ్యారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి పుతిన్ వీడ్కోలు పలికారు. -
అందుకే ఒక్క తూటా పేల్చలేదు: ప్రధాని మోదీ
సెయింట్ పీటర్స్బర్గ్: ఇరవై ఏళ్ల కింద ఉన్న ప్రపంచం ఇప్పుడు పూర్తి స్థాయిలో మారిపోయిందని, దేశాల మధ్య సంబంధాలు పెరిగాయని రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగిన అంతర్జాతీయ ఆర్థిక సదస్సు-2017లో మోదీ ప్రసంగిస్తూ.. చైనాతో భారత్ సంబంధాలు మెరుగయ్యాయని, 40 ఏళ్ల కిందటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందన్నారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఇరు దేశాల సరిహద్దుల్లో ఒక్క తూటా పేలకపోవడమే ఇందుకు నిదర్శనమని మోదీ చెప్పారు. మరోవైపు అకాశమే హద్దుగా భారత్‌లో అభివృద్ధి జరుగుతుందని, ప్రపంచం ఆసియా దేశాలపై దృష్టి సారిస్తోందని.. ముఖ్యంగా భారత్‌పై ఇతర దేశాల నమ్మకం రెట్టింపు అయిందన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు అభివృద్ధి చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోందని, అంతర్జాతీయ సంస్థలు కూడా భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వివరించారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా.. డిజిటల్ ఇండియా లాంటి కార్యక్రమాలతో వీటిని సులువుగా అధిగమిస్తామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ స్థిరత్వంతో పారదర్శక పాలన కొనసాగిస్తున్నామని, సరిహద్దు దేశాలతో మైత్రి బంధాన్ని బలపరచడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని చెప్పారు. నిన్న వ్యూహాత్మక చర్చలు జరిపిన మోదీ–పుతిన్ ఆ తర్వాత ఐదు ఒప్పందాలపై సంతకాలు చేసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కూడంకుళం అణువిద్యుదుత్పత్తి కేంద్రంలోని 5,6 యూనిట్ల నిర్మాణానికి రష్యా అంగీకరించింది. అణుశక్తి, రక్షణ, ఉగ్రవాదం, వాణిజ్యంతోపాటు పలు రంగాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. -
ఈ బంధం అనిర్వచనీయమైంది
-
రష్యా నమ్మకమైన నేస్తం!
-
ఈ బంధం అనిర్వచనీయమైంది
మాస్కో: రష్యాలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ గురువారం రాత్రి ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. రష్యా ఎక్స్పో సెంటర్లో 3000మంది ప్రవాసభారతీయులు పాల్గొన్న ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా’ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యన్లు భారత్‌పై చూపిస్తున్న మమకారానికి సగటు భారతీయ హృదయం ఉప్పొంగుతుందన్నారు. భారత్ రష్యాల బంధం అనిర్వచనీయమైందన్నారు. ముందుగా నమస్తే అంటూ ప్రవాస భారతీయులను సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రష్యా ప్రముఖ పాప్ సింగర్ సాటి కఝనోవా వేద మంత్రాలను ఉచ్ఛరించటం విశేషం. చూస్తూ చదవకుండా.. మంత్రాలను స్పష్టంగా ఉచ్ఛరింటం ఆనందం కలిగించిందని.. అది ఆమె చిత్తశుద్ధికి నిదర్శనమని ప్రశంసించారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మోదీ, మాజీ ప్రధాని వాజపేయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన రాసిన ‘మై గీత్ నయా గాతా హూ’ పాటపై రష్యా కళాకారులు ప్రదర్శన, గుజారాతీ నృత్యం గార్బాపై డాన్సులపై సంతోషం వ్యక్తం చేశారు. రష్యన్ల నుంచి గార్బా నేర్చుకుంటామన్నారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. * భారత్-రష్యా మధ్య బంధం చాలా పాతది. కానీ రష్యన్లు భారత సంస్కృతిని నేర్చుకోవటం గొప్పవిషయం. * రష్యాకు చెందిన ఓ మహిళ తను యోగాపై రాసిన పుస్తకాన్ని నాకు కానుకగా ఇచ్చారు. రష్యాలో 400 ఏళ్లనాటి భారతదేశ పద్ధతిలో కట్టిన ఇంటిని చూశాను ఆనందం వేసింది. * రష్యాపై సంస్కృత భాష ప్రభావం చాలా ఉంది. అష్ట్రాఖాన్ ప్రాంత గవర్నర్‌తో మాట్లాడాను. ఆయనకు వాటర్ మిలన్ కంటే.. తర్బూజ్ అంటేనే అర్థమైంది. మొదట్నుంచీ భారత్‌కు వెన్నంటి నిలిచిన దేశం రష్యా. * రష్యన్లు ఎక్కువగా పర్యాటకాన్ని ఇష్టపడతారు. అందుకే ఏడాదికి కనీసం ఐదు రష్యన్ల కుటుంబాలైనా భారత్‌లో పర్యటించాలని కోరుతున్నాను. * 21వ శతాబ్దం ఆసియా ఖండానిదే. అందులోనూ భారతదేశమే పరిస్థితులను ముందుండి నడిపిస్తుంది. * దేశంలో 35 ఏళ్ల లోపున్న వారు 80కోట్ల మంది ఉన్నారు. వారే ప్రస్తుతం భారతదేశపు శక్తి. మేం నవభారత నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం. రైల్వేల్లో 100 శాతం విదేశీ పెట్టుబడులకు దారులు తెరిచాం. * ఉగ్రవాదంతో ప్రపంచ మానవాళికి ముప్పుందని 30 ఏళ్లుగా చెబుతున్నాం. అప్పుడు ఎవరూ వినలేదు. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాద ప్రభావాన్ని అనుభవిస్తోంది. భారత్‌లో కొందరు ఎప్పుడూ సమస్యల గురించే ఆలోచిస్తున్నారు. మేం వాటికి పరిష్కారం సూచించాం. -
రష్యా నమ్మకమైన నేస్తం!
మాస్కో: మేకిన్ ఇండియాలో భాగంగా భారత్‌లో కమోవ్-226 యుద్ధ హెలికాప్టర్ల తయారీకి రష్యా పచ్చజెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశవ్యాప్తంగా 12 అణువిద్యుదుత్పత్తికి రియాక్టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చింది. ప్రధాని మోదీ రెండ్రోజుల రష్యా పర్యటన సందర్భంగా జరిగిన ఇండో-రష్యా శిఖరాగ్ర సదస్సులో ఇరుదేశాల మధ్య బంధం బలపడే దిశగా మొత్తం 16 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యం దృష్టిలో ఉంచుకుని రక్షణ, అణుశక్తితోపాటు ఆర్థిక రంగంలోనూ పరస్పరం సహకారం చేసుకోవాలని నిర్ణయించారు. మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన ఈ సదస్సులో మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు ఇరుదేశాలకు చెందిన పలువురు అధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించటంపై తమ పూర్తి మద్దతుంటుందని ఈ సందర్భంగా పుతిన్ తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉందని సంయుక్త మీడియా సమావేశంలో మోదీ పేర్కొన్నారు. రష్యాలో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీతలో భారత కంపెనీలకు అవకాశం ఇచ్చేందుకు కూడా పుతిన్ అంగీకరించారు. ప్రస్తుతం పది బిలియన్ డాలర్ల (రూ.66 వేల కోట్ల) ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతుండగా.. వచ్చే పదేళ్లలో దీన్ని 30 బిలియన్ డాలర్లకు (రూ.1.98 లక్షల కోట్లు) పెంచాలని నిర్ణయించారు. ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న రష్యా.. ఆర్థికంగా బలపడేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. భారత్‌తో రక్షణ, ఆర్థిక సహకారంపైనా చర్చలు జరిపారు. అటు భారత్ కూడా ‘యురేషియా’ ఆర్థిక జోన్ పరిధిలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం పట్టుబడుతోంది. గతవారం భారత రక్షణ శాఖ రష్యానుంచి రూ.40 వేల కోట్లతో ‘ఎస్-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ వ్యవస్థ’ను కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. కాగా, సమావేశం జరిగిన తీరుపై మోదీ, పుతిన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య అభివృద్ధితోపాటు అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థిక, మానవీయ విషయాల్లో మరింత బలమైన బంధాలకు సదస్సు దోహద పడుతుందని సంయుక్త ప్రకటనలో ఇరువురు నేతలు తెలిపారు. తమ భేటీ ఫలప్రదంగా జరిగిందని మోదీ ట్వీట్ చేశారు. మంచిరోజుల్లో, చెడ్డ రోజుల్లో రష్యా భారత్‌కు నమ్మకమైన నేస్తంగా ఉన్నదని మోదీ అన్నారు. రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందాలతో.. భారత తయారీ రంగం మరింత వేగం అందుకుంటుందన్నారు. అంతకుముందు క్రెమ్లిన్‌లోని అలెగ్జాండర్ గార్డెన్లో ఉన్న రెండో ప్రపంచయుద్ధ అమరవీరులకు పుష్పాంజలి అర్పించారు. తర్వాత రష్యా ప్రభుత్వం ఆధీనంలో నడిచే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్సీఎంసీ)ని ప్రధాని మోదీ గురువారం సందర్శించారు. అరగంటసేపు ఈ కేంద్రాన్ని సందర్శించి.. అక్కడి సిబ్బందితో వ్యవస్థ పనితీరును అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి మోదీతో ప్రత్యేకంగా భేటీ అయిన పుతిన్.. ఆయన ఇచ్చిన విందును స్వీకరించారు. మోదీతో భేటీ సందర్భంగా బెంగాల్‌కు చెందిన 18వ శతాబ్దం నాటి ఖడ్గం, మహాత్మాగాంధీ డైరీలోని ఓ పేజీ (చేతిరాత)ని పుతిన్ మోదీకి బహూకరించారు. భారత విదేశాంగ నీతి బాధ్యతాయుతమైనదన్న నితిన్.. ప్రపంచం ఎదుర్కుంటున్న చాలా సమస్యలను గుర్తించి వాటికి పరిష్కారం చూపించే స్థానంలో భారత్‌ను చూడాలనుకుంటున్నట్లు తెలిపారు. సిరియాలో జరిగిన రష్యా విమాన ప్రమాద మృతులకు మోదీ సంతాపం తెలిపారు. కాగా, రష్యా పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ భారత్‌కు బయల్దేరారు. శుక్రవారం ఉదయం చేరుకోనున్నారు. రష్యాతో కుదుర్చుకున్న 16 ఒప్పందాలు * పౌరుల విమాన ప్రయాణాల విషయం లో పరస్పరం నిబంధనల సరళీకరణ. * అధికారులు, దౌత్యవేత్తల పాస్‌పోర్టులున్న వారికి ఇరుదేశాల్లో పరస్పరం ప్రయాణించే సౌకర్యం. * హెలికాప్టర్ ఇంజనీరింగ్‌రంగంలో సహకారం. * 2015-17 మధ్య కస్టమ్స్ ఎగవేత నియంత్రణలో సహకారం. * భారత్‌లో 12 రష్యా తయారీ అణురియాక్టర్ల ఏర్పాటు (ఏపీతో సహా). * రైల్వే రంగంలో సాంకేతిక సహకారం. * భారత్‌లో సౌరశక్తి ప్లాంట్ల నిర్మాణంలో సహకారం. * రాంచీలోని హెచ్ఈసీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెవీ ఇంజనీరింగ్ అభివృద్ధికి ఒప్పందం. * హెచ్ఈసీ తయారీ సామర్థ్యాన్ని పెంచ టం, నూతనీకరించేందుకు ఒప్పందం * ప్రసార రంగంలో సహకారం. * సీ-డాక్, ఐఐఎస్సీ (బెంగళూరు), లోమొనోసోవ్ మాస్కో స్టేట్ వర్సిటీ మధ్య ఒప్పందం. * సీ-డాక్, ఓజేఎస్‌సీ, గ్లోనాస్ యూనియన్ మధ్య ఒప్పందం. * రష్యాలోని తూర్పు ప్రాంతంలో పెట్టుబడులకు సహకారం. * హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి (రష్యా భూభాగంపై) ఒప్పందం. * జేఎస్సీ వాంకోర్‌నెఫ్ట్‌లో సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టులో తొలివిడత పనులు పూర్తయినట్లు ధృవీకరణ. * హైడ్రోకార్బన్ల ఉత్పత్తి, అన్వేషణ, జియోలాజికల్ సర్వేలో సహకారానికి(భారత భూభాగంపై) ఒప్పందం. -
ఈ పొరపాటేమిటి నరేంద్ర మోదీజీ?
మాస్కో: రష్యా పర్యటనకు వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అక్కడ స్వాగత కార్యక్రమంలో తనకు తెలియకుండానే ఓ పొరపాటు చేశారు. రష్యా బ్యాండ్ భారత జాతీయ గీతమైన ‘జన గణ మన అధినాయక జయహే’ను ఆలపిస్తుండగా రెడ్ కార్పెట్‌పై ముందుకు నడిచారు. ఈ విషయాన్ని గ్రహించిన ఓ అధికారి వెంటనే మోదీ ముందుకువెళ్లి ఆయన్ని అంతకుముందున్న చోటుకు తీసుకెళ్లి నిలబెట్టారు. గీతాలాపన అనంతరం మోది మళ్లీ ముందుకు కదిలారు. మోదీని ఆహ్వానించేందుకు వచ్చిన రష్యా ప్రభుత్వ ప్రతినిధి, మోదీ రాగానే భారత జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా రష్యా అధికార బ్యాండ్‌ను ఉద్దేశించి చేయి ముందుకు సాచారు. ఆ సైగను పొరపాటుగా అర్థం చేసుకున్న మోదీ, తనను ముందుకు రమ్మని ఆహ్వానిస్తున్నారని భావించి భారత జాతీయ గీతాలాపన కొనసాగుతుండగానే ముందుకు నడిచారు. ఈ సంఘటనను ఎవరు ఎలా అర్థం చేసుకున్నప్పటికీ పార్టీకన్నా దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా ముద్రపడిన మోదీ ఇలా చేయడమేమిటని ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ‘జన గణ మన అధినాయక జయహే....జాతీయ గీతాన్ని దేశానికి ఆపాదించిందీ కాంగ్రెస్ పార్టీ, అలాంటప్పుడు బీజేపీ పార్టీకి చెందిన మోదీ దాన్ని గౌరవించాల్సిన అవసరం లేదు....మొన్న జాతీయ జెండాను అవమానించారు. నేడు జాతీయ గీతాన్ని అవమానించారు. విదేశీ పర్యటనల్లో ఎప్పుడూ కెమేరాలపైనే కాకుండా ఇలాంటి విషయాలపై కూడా దృష్టి పెట్టండీ మోదీ గారు....మోదీ పచార్లు చేస్తున్నప్పుడు జాతీయ గీతాలాపన ఆపవద్దా?....మోదీనే జాతీయ గీతం అవమానించిందీ, ఆయన నడిచేందుకు పాస్ ఇవ్వాలిగదా!.....ముంబై సినిమా థియేటర్లో జాతీయ గీతాలాపన సందర్భంగా లేచి నిలబడనందుకు ఓ జంటను బయటకు తరిమేసిన దేశభక్తులారా! ఇప్పుడేమంటారు?...’ లాంటి విమర్శలు ట్విట్టర్లో చెక్కర్లు కొడుతున్నాయి. విదేశీ పర్యటనల సందర్భంగా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఇలాంటి పొరపొట్లు చేయకపోలేదు. మోదీకి కూడా ఇది కొత్తేమి కాదు. మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు అమెరికా అధ్యక్షుడికి బహుమతిగా ఇచ్చేందుకు భారత జాతీయ జెండాపై ఆయన తన సంతకం చేశారు. సంతకం చేయడం కూడా జాతీయ జెండాను అవమానపర్చడమే. అంతెందుకు గత నెలలో మోదీ, జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేను కలసుకున్నప్పుడు వారి వెనకాల భారత జాతీయ జెండా తలకిందులుగా అమర్చి ఉంది. అప్పుడు కూడా విమర్శలు రాగా అది ప్రొటోకాల్ ఆఫీసర్ తప్పిదమని, చర్యలు తీసుకుంటామని పీఎంవో వర్గాలు తెలిపాయి. -
నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం!
- సుభాష్ చంద్రబోస్ ను భారత్ రప్పించేందుకు రష్యన్లతో చర్చలు - లాల్ బహదూర్ శాస్త్రి మనవడి తాజా వ్యాఖ్యలు న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రష్యాలో తలదాచుకున్నారా? ఆయనను భారత్‌కు తిరిగి రప్పించేందుకే లాల్ బహదూర్ శాస్త్రి విశ్వప్రయత్నం చేశారా? శాస్త్రీజీ తాష్కెంట్ (నాటి రష్యన్ యూనియన్‌లోని) పర్యటన వెనుక సిమ్లా ఒప్పందమే కాక మరో ఉద్దేశం కూడా ఉందా? ఇప్పటికే ఈ కోణంలో పలు విషయాలు వెలుగులోకి రాగా, బుధవారం లాల్ బహదూర్ శాస్త్రి మనవడు సిద్ధార్థ సింగ్ వెల్లడించిన అంశాలు మరింత సంచలనం కలిగించాయి. 'ఒక ముఖ్య వ్యక్తిని తిరిగి రప్పించేందుకు మా తాత (లాల్ బహదూర్ శాస్త్రి) సోవియెట్ యూనియన్‌కు చెందిన కీలక వ్యక్తులతో చర్చలు జరుపుతున్నారని మా నాన్న ద్వారా తెలిసింది' అని సిద్ధార్థ్ సింగ్ మీడియాకు చెప్పారు. ముఖ్యవ్యక్తి పేరేంటో చెప్పలేదు గానీ, దేశమంతా ఎంతగానో ఎదురుచూస్తున్న వ్యక్తి అని కూడా చెప్పడంతో.. అది నేతాజీయేనని తాము అర్థం చేసుకున్నామన్నారు. శాస్త్రీజీ.. నేతాజీని ఎంతగానో ఆరాధించేవారని, బోస్ అంతర్థానానికి సంబంధించిన రహస్య ఫైళ్లు వెల్లడించి ఆయన గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని సిద్ధార్థ అన్నారు. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై తమకు అనుమానాలున్నాయని, తాష్కెంట్లో చోటుచేసుకున్న సంఘటనల పూర్వాపరాలు వెల్లడించాలని శాస్త్రి కుటుంబసభ్యులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. నేతాజీని తిరిగి భారత్ రప్పిస్తున్న ప్రయత్నాలు చేయడం వల్లే తాష్కెంట్ లో శాస్త్రీజీపై విషప్రయోగం జరిగిందని కాంగ్రెస్ బద్ధవ్యతిరేకులు కొందరు వదంతులు సృష్టించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. -
మిఠాయిలతో మోదీకి స్వాగతం
ఉఫా: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం రష్యా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన ఘనస్వాగతం లభించింది. భారత ప్రధాని రాకను శుభసూచికంగా భావించిన రష్యా అధికార యంత్రాంగం ఏకంగా ఎయిర్ పోర్టులోనే మిఠాయి తినిపించిమరీ మోదీకి స్వాగతం పలికింది. ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో ఉన్న ఆయన.. బుధవారం ఉజ్బెకిస్థాన్ నుంచి రష్యాలోని ఉఫా పట్టణానికి చేరుకున్నారు. బ్రిక్స్ సదస్సు సహా షాంఘై సంహకార సంస్థ ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో ప్రధాని పాల్గోంటారు. బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, చైనా, సౌతాఫ్రికా దేశాల అధ్యక్షులు ఇప్పటికే ఉఫా పట్టణానికి చేరుకున్నారు. భారత్‌కు రష్యా చరిత్రాత్మక స్నేహితుడని, తాను పాల్గొనబోయే సమాశాలు తప్పక ఫలవంతం అవుతాయని రష్యా అధికారులతో ప్రధాని మోదీ అన్నారు. -
మిఠాయిలతో మోదీకి స్వాగతం
-
పాక్ ప్రధానిని కలవనున్న మోదీ
న్యూఢిల్లీ: ముంబై దాడుల సూత్రధారి జకీ-ఉర్ రహమాన్ విడుదలైన తర్వాత భారత్- పాక్‌ల ద్వైపాక్షిక సంబంధాల్లో ఏర్పడిన స్తబ్దత కొంతమేర సడలిపోనుంది. తన ఏడురోజుల మధ్య ఆసియా, రష్యా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలుసుకోనుండటం అందుకు ఊతమిచ్చేదిగా ఉంది. రష్యాలోని ఉఫా పట్టణంలో షాంఘై కో- ఆపరేషన్ ఆర్గనైజేషన్ జులై 10న ఓ సదస్సు నిర్వహిస్తోంది. దీనికి మోదీ, షరీఫ్‌లు హాజరుకానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలకు ఎలాంటి తావుండదని విదేశాంగ శాఖ అధికారులు పేర్కొన్నారు. చివరిసారిగా గతేడాది నవంబర్‌లో కాఠ్మాండు వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఇరువురు నేతలు కలుసుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంలో ప్రధాని మోదీ.. షరీఫ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే రంజాన్ మాసంలోనే ఈ ఇరువురూ భేటీ అవుతుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి (సోమవారం) నుంచి 13 వరకు ఉబ్జెకిస్థాన్, ఖజకిస్థాన్, రష్యా, తుర్క్మెనిస్థాన్, కర్గీజ్స్థాన్, తజకిస్థాన్ దేశాల్లో మోదీ పర్యటించనున్నారు. ఒకే సారి మధ్య ఆసియా దేశాల్లో పర్యటిస్తున్న తొలి భారతీయ ప్రధాని మోదీయే కావడం విశేషం.