‘సోఫా వద్దు.. కుర్చీలోనే కూర్చుంటాను’ | In Russia Modi Refuses Sofa And sit on Chair With Others | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న మోదీ వీడియో.. నెటిజన్ల ప్రశంసలు

Published Fri, Sep 6 2019 8:36 AM | Last Updated on Fri, Sep 6 2019 12:08 PM

In Russia Modi Refuses Sofa And sit on Chair With Others - Sakshi

వ్లాడివోస్టోక్‌: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా ప్రతినిధులతో జరిగిన ఓ ఫోటో సెషన్‌ కార్యక్రమంలో మోదీ ప్రవర్తించిన తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటో సెషన్‌ సందర్భంగా రష్యా అధికారులు మోదీ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేశారు. అయితే మోదీ దానిలో కూర్చోడానికి అంగీకరించలేదు. అందరితో పాటు తాను అని.. ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని తెలిపారు. మిగతా వారితో పాటు కుర్చీలోనే కూర్చుంటానన్నారు. దాంతో  అధికారులు వెంటనే మోదీ కోసంకుర్చీని తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది.

మోదీ ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోదీ సింప్లిసిటీని వర్ణించడానికి మాటలు లేవు.. తెలివితేటలు, వినయ విధేయతలతో పాటు ఒదిగి ఉండే వ్యక్తి మనకు ప్రధానిగా వచ్చాడు’.. ‘మోదీ సింప్లిసిటీ ఆయనను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టింది. దేశానికి ఉత్తమమైనది ఏదో ఆయనకు తెలుసు.. మంచి వారికి మంచివాడు.. దేశానికి హానీ చేయాలనుకునే వారి పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తాడు’ అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
(చదవండి: మోదీ పిలుపునకు ‘అమెజాన్‌’ పలుకు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement