photo session
-
పాత పార్లమెంట్ భవనం ముందు ఫోటో సెషన్
-
'ప్రతిపక్షాల భేటీ ఓ ఫొటో సెషన్..' కేంద్ర మంత్రి వ్యంగ్యాస్త్రాలు..
ఢిల్లీ: ప్రతిపక్షాల భేటీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు సందించారు. ఈ సమావేశం కేవలం ఒక ఫొటో సెషన్ మాత్రమేనని అన్నారు. చాయ్ పార్టీ జరుపుకోవడానికి ప్రతిపక్ష నాయకులు ఒక చోట కూడారని చెప్పారు. ఈ సమావేశంతో ప్రతిపక్ష నాయకులు చేయగలిగేది ఏం ఉండదని జోస్యం చెప్పారు. గడ్డం కత్తిరించి, పెళ్లి చేసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్.. రాహుల్ గాంధీకి సమావేశంలో సలహా ఇవ్వడాన్ని ఆయన గుర్తు చేశారు. VIDEO | "This was actually a photo session. The first photo session was conducted by (Telangana CM) KCR in Bihar with Nitish Kumar a few months ago," says Union Minister Giriraj Singh on Patna opposition meeting.#OppositionMeeting pic.twitter.com/CPunJ1a50m — Press Trust of India (@PTI_News) June 24, 2023 'ఇది కేవలం ఓ ఫొటో సెషన్ మాత్రమే. నితీష్ కుమార్‌తో కొన్ని నెలల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇది జరిగింది. చిన్న చిన్న గుంపులు కలిసి ప్రధాని పదవిపై కలలు కంటున్నాయి. వీటితో ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు.' అని గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. అయితే.. ఇందులో ఎలాంటి ఏకాభిప్రాయానికి నాయకులు రాలేదు. మరో సమావేశాన్ని సిమ్లాలో వచ్చే నెలలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: 'భారత్‌లో చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారు'.. అసోం సీఎం వ్యాఖ్యలపై రాజకీయ రగడ.. -
వచ్చే ఎన్నికల్లో 300 సీట్లు మావే
పట్నాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశం ఒక ఫొటో సెషన్‌కే పరిమితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. విపక్షాల మధ్య ఐక్యత అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. జమ్మూలో ఒక ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా పట్నా సమావేశంతో ఒరిగేదేమీ లేదని బీజేపీ 300పైగా సీట్లతో భారీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నాయకులు ప్రశంసిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు అసహనంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ జైల్లో పెట్టిన నాయకులు నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఆమె మనవడు రాహుల్‌తో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల సమావేశం ఒక స్వార్థ కూటమిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభివర్ణించారు. విపక్షాల కూటమిని తోడేళ్లతో పోల్చారు. ‘‘తోడేళ్లు మూకుమ్మడిగా వేటాడతాయని అంటారు. పట్నాలో రాజకీయ మూక కలిశాయి. వారికి ఎర మన దేశ భవిష్యత్’’ అని స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. -
ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్
న్యూఢిల్లీ: పదవీ కాలం ముగిసిన 72 మంది సభ్యులకు రాజ్యసభ గురువారం ఆత్మీయ వీడ్కోలు పలికింది. రిటైర్ అవుతున్న సభ్యులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఫొటో సెషన్లో పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఫొటో సెషన్లో ఉన్నారు. ఈ సభ ఎంతో ఇచ్చింది: మోదీ పదవీ విరమణ చేసిన సభ్యులు మాట్లాడేందుకు వీలుగా రాజ్యసభలో ఈరోజు జీరో అవర్, ప్రశ్నోత్తరాలను వెంకయ్య నాయుడు రద్దు చేశారు. రిటైర్ అయిన సభ్యులు మళ్లీ ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మన రాజ్యసభ సభ్యులకు అపార అనుభవం ఉంది. కొన్నిసార్లు అకడమిక్ నాలెడ్జ్ కంటే అనుభవానికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఈ పార్లమెంట్లో చాలా కాలం గడిపాం. మనం ఇచ్చిన దాని కంటే ఎంతో ఎక్కువ ఈ సభ మనకు ఇచ్చింది. ఇక్కడ గడించిన అనుభవాన్ని దేశంలోని నాలుగు దిశలకు తీసుకెళ్లాల’ని మోదీ అన్నారు. ఆంటోనీ, స్వామి, గుప్తా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే ఆంటోనీ, ఆనంద్ శర్మ.. బీజేపీ నేతలు సుబ్రమణ్యస్వామి, స్వపన్ దాస్‌గుప్తాలతో సహా మొత్తం 72 మంది సభ్యుల పదవీ కాలం ముగిసింది. నిర్మలా సీతారామన్ జూన్‌లో రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేయనుండగా.. పియూష్ గోయల్, మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ నాయకులు పి చిదంబరం, కపిల్ సిబల్.. శివసేన నేత సంజయ్ రౌత్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రఫుల్ పటేల్ కూడా జూలైలో పదవీ విరమణ చేయనున్నారు. (క్లిక్: అఖిలేష్‌కు బీజేపీ చెక్.. రాజ్యసభకు శివపాల్?) ఎంపీలకు వెంకయ్య విందు వెంకయ్య నాయుడు తన నివాసంలో రాజ్యసభ సభ్యులందరికీ ఈ రాత్రి విందు ఇవ్వనున్నట్లు అధికారిక వర్గాలు ‘పీటీఐ’కి వెల్లడించాయి. పదవీ విరమణ చేస్తున్న 72 మంది సభ్యులకు, ఇంతకు ముందు పదవీ విరమణ చేసిన మరో 19 మందికి జ్ఞాపికలను వెంకయ్య నాయుడు అందజేస్తారు. ఈ విందులో ఆరుగురు ఎంపీలు తమ సాంస్కృతిక ప్రతిభను ప్రదర్శిస్తారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. (క్లిక్: థ్యాంక్యూ మోదీ జీ: కేటీఆర్ సెటైర్లు) -
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్.. పలువురికి గాయాలు
Police Lathicharge on Allu Arjun Fans at N Convention Hyderabad: మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం రద్దైందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఫ్యాన్ మీట్ అంటూ నిర్వాహకులు పాసులు సైతం జారీ చేశారు. దీంతో పెద్దె ఎత్తున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న అభిమానులు ఫోటోసెషన్ క్యాన్సిల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసులు ఉన్నా అనూహ్యంగా ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ ఆందోళన చేస్తున్నారు. -
‘సోఫా వద్దు.. కుర్చీలోనే కూర్చుంటాను’
వ్లాడివోస్టోక్: ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రష్యాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రష్యా ప్రతినిధులతో జరిగిన ఓ ఫోటో సెషన్ కార్యక్రమంలో మోదీ ప్రవర్తించిన తీరుపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటో సెషన్ సందర్భంగా రష్యా అధికారులు మోదీ కోసం ప్రత్యేకంగా సోఫా ఏర్పాటు చేశారు. అయితే మోదీ దానిలో కూర్చోడానికి అంగీకరించలేదు. అందరితో పాటు తాను అని.. ప్రత్యేక మర్యాదలు అవసరం లేదని తెలిపారు. మిగతా వారితో పాటు కుర్చీలోనే కూర్చుంటానన్నారు. దాంతో అధికారులు వెంటనే మోదీ కోసంకుర్చీని తీసుకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తన ట్విటర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. PM @NarendraModi जी की सरलता का उदाहरण आज पुनः देखने को मिला, उन्होंने रूस में अपने लिए की गई विशेष व्यवस्था को हटवा कर अन्य लोगों के साथ सामान्य कुर्सी पर बैठने की इच्छा जाहिर की। pic.twitter.com/6Rn7eHid6N — Piyush Goyal (@PiyushGoyal) September 5, 2019 మోదీ ప్రవర్తనపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మోదీ సింప్లిసిటీని వర్ణించడానికి మాటలు లేవు.. తెలివితేటలు, వినయ విధేయతలతో పాటు ఒదిగి ఉండే వ్యక్తి మనకు ప్రధానిగా వచ్చాడు’.. ‘మోదీ సింప్లిసిటీ ఆయనను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టింది. దేశానికి ఉత్తమమైనది ఏదో ఆయనకు తెలుసు.. మంచి వారికి మంచివాడు.. దేశానికి హానీ చేయాలనుకునే వారి పట్ల ఆయన కఠినంగా వ్యవహరిస్తాడు’ అంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: మోదీ పిలుపునకు ‘అమెజాన్’ పలుకు) -
ఇక లాభం లేదు రంగంలోకి దిగాల్సిందే..
తమిళసినిమా: ఇక లాభం లేదు. రంగంలోకి దిగాలంతే అంటోంది నటి లావణ్యా త్రిపాఠి. అందాల రాక్షసిగా టాలీవుడ్లో, బ్రహ్మన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఉత్తరప్రదేశ్ బ్యూటీ లావణ్య. కోలీవుడ్‌లో బ్రహ్మన్ చిత్రం తన గీతను మార్చలేకపోయినా టాలీవుడ్లో అందాలరాక్షసి మంచి పేరునే తెచ్చి పెట్టింది. ఆ తరువాత కూడా మంచి అవకాశాలనే అందుకుంది. భలెభలె మగాడివోయ్ చిత్రం వరకూ మంచి రైజ్‌లో ఉన్న లావణ్యకు ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. విజయాలు ముఖం చాటేశాయి. వరుసగా అపజయాలు వెక్కిరించాయి. ఇంకేముంది అవకాశాలు దూరమయ్యాయి. తెలుగు తమిళం భాషల్లో అవకాశాలు లేక అల్లాడుతున్న లావణ్యత్రిపాఠి పక్కింటి అమ్మాయి ఇమేజ్ అంటూ మడి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు అని నిర్ణయించుకుందట. తనను తాను మోడరేట్ చేసుకుంది. అనుకున్నదే తడవుగా గ్లామర్‌గా తయారై ఫొటో సెషన్ చేసుకుని సోషల్ మీడియాకు విడుదల చేసింది. అయితే ఆ ఫొటోలు బాగున్నాయంటూ కామెంట్స్ చేశారే గానీ అవకాశాలు మాత్రం శూన్యం. ఇంకా మౌనంగా ఉంటే తెరమరుగైపోవడం ఖాయం అని భావించిన ఈ అమ్మడు పక్కింటి ఇమేజ్ను అటకెక్కించానని చెప్పేసింది. దీని గురించి లావణ్య పేర్కొంటూ అందరూ తనను పక్కింటి అమ్మాయి ఇమేజ్‌కే పరిమితం చేస్తున్నారని, ఇకపై ఆ ఇమేజ్ను కొనసాగించదలచుకోలేదని చెప్పేసింది. కొత్త కథా పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. గ్లామరస్ పాత్రల్లోనూ నటించడానికి రెడీ అని, తనకు సంతృప్తిని కలిగించే ఎలాంటి పాత్రలైనా నటించడానికి సిద్ధం అని తెలిపింది. ఇకపై అందాల లావణ్యను చూస్తారని అంటోంది. -
మీరు రావొద్దు నేనే వస్తా
తమిళసినిమా: సామాజిక సేవలందించడంలో ముందుండే వారిలో నటుడు లారెన్స్ ఒకరని చెప్పవచ్చు. పలువురు అనాథలకు ఆశ్రయం ఇచ్చి వారి సంక్షేమం కోసం పాటు పడుతున్న ఈయన, పలువురు చిన్నారులకు శస్త చికిత్స చేయించి మరు జన్మనిస్తున్నారు. లారెన్స్‌కు అభిమానులు అధికమనే చెప్పాలి. వారిలో చాలా మంది లారెన్స్‌ను కలిసి ఆయనతో ఫొటోలు దిగాలని కోరుకుంటారు. అలా కడలూరుకు చెందిన ఆర్.శేఖర్ అనే యువకుడు ఇటీవల లారెన్స్‌ను కలిసి ఆయనతో ఫొటో దిగాలని చెన్నైకి వస్తూ మార్గమధ్యలో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన లారెన్స్‌ను ఎంతగానో కలచివేసిందట.ఆ అభిమాని అంతక్రియలకు హాజరైన లారెన్స్ శేఖర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సంఘటనతో లారెన్స్ ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారట. దీని గురించి ఆయన తెలుపుతూ ఇకపై తన అభిమానులెవ్వరూ ఫొటోల కోసం అంటూ తన వద్దకు రావద్దని, సమయం దొరికినప్పుడల్లా తానే మీ వద్దకు వచ్చి ఫొటోల కార్యక్రమంలో పాల్గొంటానని వెల్లడించారు. కాగా ఈ నేపథ్యంలో ఈ నెల 7నన లారెన్స్ సేలం వెళ్లి అక్కడ అభిమానులను కలిసి వారితో ఫొటోలు దిగనున్నట్లు వెల్లడించారు. -
ఆ కోరిక నాకూ ఉంది..!
సాక్షి,చెన్నై: లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో మన హీరోయిన్లు నేర్పరులే. అవకాశాలు తగ్గాయేమిటన్న ప్రశ్నకు తాను ఇతర భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగానే ఉన్నానని చెప్పుకుంటారు. అలాంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ఉంది. ఈ ఉత్తరాది బ్యూటీ కెరీర్లో అప్ అండ్ డౌన్స్ చాలానే ఉన్నాయి. మొదట్లో మాతృభాషలో క్యోమ్ హో గయా చిత్రంతో చిన్న పాత్రలో నటించినా ఆ చిత్రం ఆమెకు ఏ మాత్రం గుర్తింపు తెచ్చిపెట్టలేదు. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు భారతీరాజా బొమ్మలాటం చిత్రం ద్వారా పరిచయం చేసినా ఆ చిత్రమూ నిరాశనే మిగిల్చింది. తెలుగులో లక్ష్మీకల్యాణం విజయాన్ని అందించినా, ఆ తరువాత స్టార్ ఇమేజ్ కోసం చాలా కాలం పడిగాపులు పడాల్సి వచ్చింది. మగధీరతోనే కాజల్ అగర్వాల్‌కు సరైన సక్సెస్ వచ్చింది.అదే విధంగా కోలీవుడ్‌లో తుపాకీ చిత్రం వరకూ విజయం కోసం తపిస్తూనే ఉంది. ఇక హిందీలో నాలుగైదు చిత్రాలే చేసినా అక్కడ సరైన ఇమేజ్ను ఇప్పటికీ పొందలేకపోయింది. మొత్తం మీద మూడు భాషల్లో నటిస్తున్న కాజల్‌ను హిందీలో ఎక్కువగా నటించకపోవడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు చాలా నైస్గానే కవర్ చేస్తూ బదులిచ్చింది. ఇంతకీ తను చెప్పిందేమిటంటే హిందీలో ఎక్కువ చిత్రాల్లో నటించాలన్న కోరిక తనకూ ఉందని, అయితే తెలుగు, తమిళ భాషల్లో అవకాశాలు లభించడంతో బాలీవుడ్లో ఫోకస్ పెట్టలేని పరిస్థితి అని చెప్పింది. అయినా మూడు భాషల్లో ఏకకాలంలో నటించడం కష్టమేనని చెప్పుకొచ్చింది. నిజానికి కాజల్‌కు హిందీలో అవకాశాలేమీ లేవు. ప్రస్తుతం కోలీవుడ్‌లోనూ ప్యారిస్ ప్యారిస్ అనే ఒకే ఒక్క చిత్రం చేతిలో ఉంది. ఇక తెలుగులో రెండు చిత్రాలు ఉన్నాయి. అవకాశాలు తగ్గుముఖం పడుతున్న విషయం గ్రహించే అమ్మడు ఇటీవల ఒక ఫొటో సెషన్ ఏర్పాటు చేసి వివిధ భంగిమల్లో ఫొటోలు తీయించుకుంది. అందులో అధిక గ్లామరస్ ఫొటోలే ఉండడం విశేషం. వాటిలో అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలిప్పుడు సోషల్ మీడియాల్లో హాల్చల్ చేస్తున్నాయి. ఆ ఫొటోలు చూసిన అభిమానులు కాజల్‌ను రకరకాల ప్రశ్నలతో ఏకేస్తున్నారు. కొందరు మాత్రం బాగున్నాయంటూ కాజల్ అందాలను ఆస్వాదిస్తున్నారు. -
ఫొటో సెషన్‌ను వాయిదా వేసిన రజినీ
తమిళ సినిమా (చెన్నై): అభిమానులతో కలిసి ఫొటోలు దిగడం కోసం ఏర్పాటు చేసిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రకటించారు. ఏప్రిల్ 12 నుంచి 16 వరకు దాదాపు 2,000 మంది అభిమానుల తో సమావేశమై, ప్రతి ఒక్కరితో ఓ ఫొటో తీయించుకుని ఫ్యాన్స్‌కు కానుకగా ఇవ్వాలని రజినీ అనుకున్నారు. రెండు వేల ఫొటోలు దిగడం కష్టమనుకుని 8 మందితో కూడిన బృందాలుగా ఫొటోలు తీసుకుందామని ప్రతిపాదించగా అందుకు అభిమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరితో ఒక్కో ఫొటో దిగితేనే బాగుంటుందని వారు కోరారు. రజనీ రాజకీయ అరంగ్రేటంపై ఊహాగానాల నేపథ్యంలో అభిమానులతో భేటీని రద్దు చేసుకున్నారు. -
ప్రధాని ఆతిథ్యంలో...
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ గురువారం భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రెండో అధికారిక నివాసమైన కిరిబిలిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఇరు జట్ల ఆటగాళ్లతో అబాట్ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. మంగళవారం నుంచి సిడ్నీలో భారత్, ఆసీస్ నాలుగో టెస్టు జరుగుతుంది. మరో వైపు ధోని కూడా ఈ విందుకు హాజరైనట్లు సమాచారం. అయితే గ్రూప్ ఫోటోకు మాత్రం అతను దూరంగా ఉన్నాడు. ఇరు జట్లతో ఫోటో సెషన్ జరిగే సమయంలో ధోని అటు వైపు రాకుండా లాబీలోనే నిలబడి చూస్తుండిపోయాడు. నేనూ స్లెడ్జింగ్ చేసేవాడిని.. బ్యాటింగ్.. బౌలింగ్ అంతగా రాకున్నా కేవలం స్లెడ్జింగ్ కారణంగానే తనకు జట్టులో చోటు దొరికిందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశలో ఆయన ఆక్స్ఫర్డ్ మిడిల్ కామన్ రూమ్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. ‘నేను బ్యాటింగ్ చేయలేను.. బౌలింగూ రాదు. ఫీల్డింగ్ చేయడం అసలే రాదు. కానీ నేను బాగా స్లెడ్జింగ్ చేయగలను. ఈ కారణంగానే నాకు జట్టులో చోటు దక్కిందనుకుంటాను’ అని ప్రధాని అన్నారు.