పట్నాలో ప్రతిపక్ష పార్టీ నాయకుల సమావేశం ఒక ఫొటో సెషన్‌కే పరిమితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. విపక్షాల మధ్య ఐక్యత అసాధ్యమని అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. జమ్మూలో ఒక ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా పట్నా సమావేశంతో ఒరిగేదేమీ లేదని బీజేపీ 300పైగా సీట్లతో భారీ విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రపంచ దేశాల నాయకులు ప్రశంసిస్తూ ఉంటే ప్రతిపక్షాలకు అసహనంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ జైల్లో పెట్టిన నాయకులు నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లు ఆమె మనవడు రాహుల్‌తో చేతులు కలపడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల సమావేశం ఒక స్వార్థ కూటమిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అభివర్ణించారు. విపక్షాల కూటమిని తోడేళ్లతో పోల్చారు. ‘‘తోడేళ్లు మూకుమ్మడిగా వేటాడతాయని అంటారు. పట్నాలో రాజకీయ మూక కలిశాయి. వారికి ఎర మన దేశ భవిష్యత్’’ అని స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment