ప్రధాని ఆతిథ్యంలో... | Players meet Prime Minister Tony Abbott at Kirribilli House before SCG Test | Sakshi
Sakshi News home page

ప్రధాని ఆతిథ్యంలో...

Published Fri, Jan 2 2015 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

ప్రధాని ఆతిథ్యంలో...

ప్రధాని ఆతిథ్యంలో...

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ గురువారం భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రెండో అధికారిక నివాసమైన కిరిబిలిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఇరు జట్ల ఆటగాళ్లతో అబాట్ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.

మంగళవారం నుంచి సిడ్నీలో భారత్, ఆసీస్ నాలుగో టెస్టు జరుగుతుంది. మరో వైపు ధోని కూడా ఈ విందుకు హాజరైనట్లు సమాచారం. అయితే గ్రూప్ ఫోటోకు మాత్రం అతను దూరంగా ఉన్నాడు. ఇరు జట్లతో ఫోటో సెషన్ జరిగే సమయంలో ధోని అటు వైపు రాకుండా లాబీలోనే నిలబడి చూస్తుండిపోయాడు.
 
నేనూ స్లెడ్జింగ్ చేసేవాడిని..
బ్యాటింగ్.. బౌలింగ్ అంతగా రాకున్నా కేవలం స్లెడ్జింగ్ కారణంగానే తనకు జట్టులో చోటు దొరికిందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశలో ఆయన ఆక్స్‌ఫర్డ్ మిడిల్ కామన్ రూమ్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. ‘నేను బ్యాటింగ్ చేయలేను.. బౌలింగూ రాదు. ఫీల్డింగ్ చేయడం అసలే రాదు. కానీ నేను బాగా స్లెడ్జింగ్ చేయగలను. ఈ కారణంగానే నాకు జట్టులో చోటు దక్కిందనుకుంటాను’ అని ప్రధాని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
Advertisement