Australia cricketers
-
ఆ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లదే హవా
ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ల హవానే నడుస్తుంది. ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్ జరిగినా అందులో మెజార్టీ శాతం విదేశీ ప్లేయర్లు ఆస్ట్రేలియన్లే ఉంటారు. ఐపీఎల్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్లో భారత స్టార్ క్రికెటర్ల కంటే ఆస్ట్రేలియన్లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇటీవల జరిగిన 2024 సీజన్ వేలమే ఇందుకు నిదర్శనం. ఈ వేలంలో కమిన్స్, స్టార్క్‌లను ఆయా ఫ్రాంచైజీలు భారత స్టార్ క్రికెటర్లకంటే ఎక్కువ ధర చెల్లించి సొంతం చేసుకున్నారు. లీగ్ క్రికెట్లో ఆస్ట్రేలియన్ల హవా ఈ రేంజ్లో కొనసాగుతుంది. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లోనూ ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియన్ల కోసం ఎగబడ్డారు. 2024 సీజన్‌కు సంబంధించి విదేశీ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించగా.. రిటైన్ చేసుకున్న 16 మంది విదేశీ ప్లేయర్స్‌లో (పురుషులు, మహిళలు) తొమ్మిది మంది ఆస్ట్రేలియన్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఓవల్ ఇన్విన్సిబుల్ ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్‌లను, లండన్ స్పిరిట్ నాథన్ ఇల్లిస్ను, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ మాథ్యూ షార్ట్‌ను రీటైన్ చేసుకోగా.. మహిళల విభాగంలో బర్మింగ్హమ్ ఫీనిక్స్ ఎల్లిస్ పెర్రీని, లండన్ స్పిరిట్ గ్రేస్ హ్యారిస్, జార్జియా రెడ్మేన్లను, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వేర్హమ్లను రీటైన్ చేసుకున్నాయి. ఓవరాల్‌గా 2024 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి 137 మంది ప్లేయర్స్‌ను తిరిగి దక్కించుకున్నాయి. ఇంకా 75 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హండ్రెడ్ లీగ్ ఈ ఏడాది జులై 23 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెగ్యులర్ క్రికెట్ టోర్నీలకు భిన్నంగా ఈ టోర్నీ 100 బంతుల ప్రాతిపదికన జరుగుతుంది. ఆయా ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ప్లేయర్ల వివరాలు.. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మహిళలు: సోఫీ డివైన్ (ఓవర్సీస్), ఎల్లీస్ పెర్రీ (ఓవర్సీస్), ఇస్సీ వాంగ్, ఎమిలీ అర్లాట్, హన్నా బేకర్, స్టెర్రే కాలిస్, చారిస్ పావెలీ బర్మింగ్హమ్ ఫీనిక్స్ మెన్: క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, బెన్ డకెట్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), జామీ స్మిత్, విల్ స్మీడ్, టామ్ హెల్మ్, జాకబ్ బెథెల్ లండన్ స్పిరిట్ మహిళలు: హీథర్ నైట్, గ్రేస్ హారిస్ (ఓవర్సీస్), డేనియల్ గిబ్సన్, చార్లీ డీన్, సారా గ్లెన్, జార్జియా రెడ్మైన్ (ఓవర్సీస్), సోఫీ మున్రో, తారా నోరిస్ లండన్ స్పిరిట్ మెన్: జాక్ క్రాలే, నాథన్ ఎల్లిస్ (ఓవర్సీస్), డాన్ లారెన్స్, లియామ్ డాసన్, డాన్ వోరాల్, ఆలీ స్టోన్, ఆడమ్ రోసింగ్టన్, డేనియల్ బెల్-డ్రమ్మండ్, మాథ్యూ క్రిచ్లీ మాంచెస్టర్ ఒరిజినల్స్ మహిళలు: సోఫీ ఎక్లెస్టోన్, లారా వోల్వార్డ్ట్ (ఓవర్సీస్), ఎమ్మా లాంబ్, మహికా గౌర్, ఫి మోరిస్, కాథరిన్ బ్రైస్, ఎల్లీ థ్రెల్కెల్డ్, లిబర్టీ హీప్ మాంచెస్టర్ ఒరిజినల్స్ పురుషులు: జోస్ బట్లర్, జామీ ఓవర్టన్, ఫిల్ సాల్ట్, పాల్ వాల్టర్, టామ్ హార్ట్లీ, ఉసామా మీర్ (ఓవర్సీస్), వేన్ మాడ్సెన్, జోష్ టంగ్, మాక్స్ హోల్డెన్, ఫ్రెడ్ క్లాసెన్, మిచ్ స్టాన్లీ ఉత్తర సూపర్‌చార్జర్స్ మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఓవర్సీస్), జార్జియా వేర్హామ్ (ఓవర్సీస్), కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, హోలీ ఆర్మిటేజ్, మేరీ కెల్లీ ఉత్తర సూపర్‌చార్జర్స్ పురుషులు: బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, రీస్ టోప్లీ, మాథ్యూ షార్ట్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్సే, ఆడమ్ హోస్, మాథ్యూ పాట్స్, కల్లమ్ పార్కిన్సన్, ఒల్లీ రాబిన్సన్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళలు: మారిజాన్ కాప్ (ఓవర్సీస్), ఆలిస్ క్యాప్సే, లారెన్ విన్ఫీల్డ్-హిల్, తాష్ ఫర్రాంట్, మేడీ విలియర్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, సోఫియా స్మేల్, ర్యానా మెక్‌డొనాల్డ్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మెన్: సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, విల్ జాక్స్, ఆడమ్ జంపా (ఓవర్సీస్), జోర్డాన్ కాక్స్, గుస్ అట్కిన్సన్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, స్పెన్సర్ జాన్సన్ (ఓవర్సీస్), నాథన్ సౌటర్, తవాండా ముయే సదరన్ బ్రేవ్ ఉమెన్: డాని వ్యాట్, క్లో ట్రయాన్ (ఓవర్సీస్), లారెన్ బెల్, మైయా బౌచియర్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, రియానా సౌత్‌బై, మేరీ టేలర్ సదరన్ బ్రేవ్ మెన్: జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, ల్యూస్ డు ప్లూయ్, రెహన్ అహ్మద్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), జార్జ్ గార్టన్, అలెక్స్ డేవిస్ -
'తప్పుడు వార్తలు.. ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు'
ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసింది. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్ గెలవడంతో ఇంగ్లండ్ కథ ముగిసేనట్లేనని అంతా భావించారు. కానీ మూడో టెస్టులో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యాన్ని తగ్గించింది. ఆ తర్వాత నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో ఐదోటెస్టు ఇంగ్లండ్‌కు కీలకంగా మారింది. చివరి టెస్టు గెలిచి సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని భావించిన ఇంగ్లండ్ అందుకు తగ్గట్లుగానే బజ్‌బాల్ ఆటతీరుతో ఆసీస్‌ను కట్టడి చేసింది. కానీ 384 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ చేధించేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ కొత్త బంతి తీసుకోవడంతో ఆట ఐదోరోజు తొలి సెషన్లో కథ మొత్తం మారిపోయింది. ఆసీస్ తొందరగా వికెట్లు కోల్పోవడంతో 49 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. కాగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఆసీస్ ఆటగాళ్లు, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక దగ్గర చేరి డ్రెస్సింగ్‌రూమ్‌లోనే మందు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఖండించాడు. స్టోక్స్ మాట్లాడుతూ.. ''పార్జీ జరిగిన మాట నిజమే.. కానీ మీరు అనుకుంటున్నట్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఆసీస్ ఆటగాళ్లతో కలిసి మందు కొట్టలేదు. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత కరచాలనం అనంతరం ఆసీస్ ఆటగాళ్లు మా దగ్గరకు వచ్చారు. కానీ మా ప్రధాన ఆటగాళ్లు స్టువర్ట్ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్పై స్పెషల్ స్పీచ్‌లతో చిన్న పార్టీ చేసుకున్నాం. ఈ నేపథ్యంలో ఆసీస్ ఆటగాళ్లు ఒక గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. మేం బిజీగా ఉండడంతో మమ్మల్ని కలవకుండానే ఆసీస్ ఆటగాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిజానికి యాషెస్ సిరీస్ ముగిశాక ఆసీస్ ఆటగాళ్లతో కలిసి సంప్రదాయ సెలబ్రేషన్స్ చేసుకోవాలి. కానీ బ్రాడ్, మొయిన్ అలీ రిటైర్మెంట్, ఇతర కార్యక్రమాల వల్ల కలవడం కుదరలేదు. అయితే ఆసీస్ ఆటగాళ్లతో కలిసి నైట్‌క్లబ్‌కు వెళ్లి పార్టీ ఎంజాయ్ చేయాలని నిశ్చయించుకున్నాం. నెలరోజుల పాటు యాషెస్ ఆడాం. ఎన్ని గొడవలు జరిగినా అది మ్యాచ్‌ల వరకే పరిమితం. బయట ఆ విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించుకోం.. సరదాగా ఎంజాయ్ చేయడానికి చూస్తాం'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Ricky Ponting: 'బంతిని మార్చడం వల్లే ఆసీస్ ఓటమి.. విచారణ చేపట్టండి' ఉస్మాన్ ఖవాజా అరుదైన ఘనత! యాషెస్ చరిత్రలో 26 ఏళ్ల తర్వాత.. -
విశాఖ చేరుకున్న టీమిండియా, ఆసీస్ క్రికెటర్లు (ఫొటోలు)
-
ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథ
ఆస్ట్రేలియా క్రికెటర్లు మార్కస్ స్టోయినిస్, స్పిన్నర్ ఆడమ్ జంపాల పేరు చెప్పగానే ఒక విషయం గుర్తుకురాక మానదు. ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య 2019 బీబీఎల్(బిగ్‌బాష్ లీగ్)లో జరిగిన బ్రొమాన్స్ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత వీరిద్దరు గే(హోమోసెక్సువల్స్) రిలేషిన్‌షిప్‌లో ఉన్నట్లు కథనాలు కూడా వచ్చాయి. ఈ కథనాలపై అటు స్టోయినిస్ కానీ.. ఇటు జంపా కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీనిని బట్లే స్టోయినిస్, జంపాలు హోమోసెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. వీరిద్దరు లివింగ్ఇన్ రిలేషిన్‌షిప్‌లో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే అటు ఆస్ట్రేలియా క్రికెట్లో.. ఇటు బిగ్‌బాష్ లీగ్‌లో చాలా సందర్భాల్లో డ్రెస్సింగ్ రూమ్‌లో వీరిద్దరు బ్రొమాన్స్ చేసుకోవడం కెమెరాల కంట పడింది. తాజాగా ఫిబ్రవరి 14.. ప్రేమికుల రోజు దినోత్సవం పురస్కరించుకొని బీబీఎల్ ఫ్రాంచైజీ మెల్బోర్న్ స్టార్స్ ఒక ఫోటో షేర్ చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఆ ఫోటోలో స్టోయినిస్ చెంపపై ఆడమ్ జంపా ముద్దుపెట్టడం కనిపిస్తుంది. ఈ ఫోటోను ట్వీట్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ ''హ్యాపీ వాలెంటైన్స్ డే'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఏది ఏమైనా ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచానికి తెలియని ఆసీస్ క్రికెటర్ల ప్రేమకథను పరిచయం చేసినందుకు బీబీఎల్‌కు కృతజ్ఞతలు అంటూ కొందరు అభిమానుల ట్వీట్ చేశారు. ఇక బీబీఎల్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు కెప్టెన్‌గా ఉన్న ఆడమ్ జంపా.. ఈ సీజన్లో జట్టును విజేతగా నిలపడంలో విఫలమైనప్పటికి.. ఆటగాడిగా మాత్రం అదరగొట్టాడు. టోర్నీలో 14 మ్యాచ్‌లాడిన జంపా 16 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. మొదటిస్థానంలో లూక్‌వుడ్(14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు) ఉన్నాడు. ఇక స్టోయినిస్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌ల్లో రెండు అర్థసెంచరీలో సాయంతో కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. ఇక మెల్బోర్న్ స్టార్స్ బీబీఎల్ 2022-23లో వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో నిలిచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఆస్ట్రేలియా తరపున మార్కస్ స్టోయినిస్ 57 వన్డేల్లో 1296 పరుగులు, 51 టి20ల్లో 803 పరుగులు చేశాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు వచ్చే స్టోయినిస్ మెరుపు ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు. ఎన్నోసార్లు తన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లతో చాలాసార్లు విజయాలందించాడు. ఇక స్పిన్నర్ ఆడమ్ జంపా 76 వన్డేల్లో 127 వికెట్లు, 72 టి20ల్లో 82 వికెట్లు పడగొట్టాడు. happy valentine's day 🥰 pic.twitter.com/tv5dkKlxi3 — KFC Big Bash League (@BBL) February 13, 2023 Ohk, happy Valentines Day 🌝👍🏻 pic.twitter.com/XgGrTDNYvS — 𝐀𝐬𝐡𝐦𝐢𝐭𝐚 (@samaira__kohli) February 14, 2023 చదవండి: క్రికెటర్ మనసు దోచుకున్న మల్లికా సాగర్ -
కెప్టెన్సీ వద్దంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్స్ ..!
-
రూ.850 టికెట్ ను రూ.11వేలకు విక్రయిస్తుండగా పట్టివేత
-
ఫైనల్ పంచ్ ఎవరిదబ్బా ..?
-
హైదరాబాద్ చేరుకున్న భారత్ ,ఆస్ట్రేలియా జట్లు
-
IPL 2022: వార్నర్, కమిన్స్ కాస్త ఆలస్యంగా...
మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు వార్నర్, కమిన్స్, హేజల్‌వుడ్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీ తేదీలను అధికారికంగా ప్రకటించకపోయినా మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నా యి. అయితే ఆసీస్ ఆటగాళ్లు ఏప్రిల్ 6 తర్వాతే ఐపీఎల్లో ఆయా జట్లతో కలుస్తారు. నిజానికి ఈ ముగ్గురు ఆటగాళ్లు పాకిస్తాన్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు (మార్చి 25 వరకు) మాత్రమే ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏప్రిల్ 6 వరకు జరిగే వన్డే సిరీస్, ఏకైక టి20 నుంచి వీరికి విశ్రాంతినిచ్చారు.అయితే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిబంధనల ప్రకారం ఆసీస్ టీమ్ ఒక అంతర్జాతీయ సిరీస్‌లో ఆడుతున్న సమయంలో మరోవైపు కాంట్రాక్ట్ ఆటగాళ్లెవరూ ఐపీఎల్ ఆడటానికి వీల్లేదు. దాంతో వీరు టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశం వెళ్లిపోతారు. -
IPL 2022 : బ్యాడ్ న్యూస్.. వార్నర్ సహా పలువురు స్టార్ క్రికెటర్లు దూరం..?
బెంగళూరు వేదికగా ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ 2022 మెగా వేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో కోట్లు కొల్లగొట్టేందుకు దేశీయ, విదేశీ స్టార్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న ఓ వార్త అభిమానులను కలవరపెడుతుంది. డేవిడ్ వార్నర్, పాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, స్టొయినిస్ లాంటి ఆస్ట్రేలియన్ స్టార్లు ఐపీఎల్ తొలి దశలో జరిగే కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నారని సమాచారం. ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ఐపీఎల్ షెడ్యూల్‌పై పూర్తి క్లారిటీ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది ఐపీఎల్ భారత్ వేదికగానే నిర్వహిస్తామని బీసీసీఐ బాస్ గంగూలీ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే కోవిడ్ కారణంగా మ్యాచ్ వేదికల్లో, అలాగే మ్యాచ్ ప్రారంభ తేదీలో మార్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఒక వేళ లీగ్‌ను మార్చి 27 నుంచి ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తే.. కొన్ని ఆరంభ మ్యాచ్‌లకు ఆసీస్ స్టార్లు దూరం కావడం ఖాయం. ఎందుకంటే, ఏప్రిల్ 5 వరకు ఆస్ట్రేలియా పాకిస్ధాన్ పర్యటనలో ఉంటుంది. పాక్ పర్యటనలో మూడు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనున్న ఆసీస్.. ఈ సిరీస్ అనంతరం క్వారంటైన్ తదితర నిబంధనలు క్లియర్ చేసి భారత్‌కు చేరేందుకు కనీసం 10 రోజుల సమయం పడుతుంది. దీంతో లీగ్‌లో పాల్గొనే ఆసీస్ ఆటగాళ్లు కొన్ని ప్రారంభ మ్యాచ్‌లకు తప్పక దూరం కావాల్సి వస్తుంది. చదవండి: రాజకీయాల్లోకి ‘ది గ్రేట్ ఖలీ'.. ఏ పార్టీలో చేరాడో చూడండి..? -
అయ్యో స్మిత్.. నిన్ను చూస్తే గుండె తరుక్కుపోతోంది!
బాల్ ట్యాంపరింగ్ వివాదంలో జరిగిన తప్పును ఒప్పుకుంటూ స్టీవ్ స్మిత్ కంటతడి పెట్టాడు. ఈ తప్పిదానికి తనదే పూర్తి బాధ్యత అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఎగదన్నుకొని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ.. మాట్లాడానికి ప్రయత్నించాడు. మీడియా సమావేశంలో ఉద్విగ్నుడై.. మాటలు వెతుక్కుంటూ వెక్కీ వెక్కీ ఏడ్చాడు. బాల్ ట్యాంపరింగ్ తప్పిదం తనను ఎంతో బాధకు గురిచేసిందని కన్నీరు కార్చాడు. సిడ్నీలో స్టీవ్ స్మిత్ నిర్వహించిన మీడియా సమావేశం ఆయన అభిమానుల్నే కాదు తోటి క్రికెటర్లను కదిలించింది. అతను వ్యక్తం చేసిన బాధను చూసి.. అయ్యో స్మిత్ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న వారిలో మంచి బ్యాట్స్‌మెన్‌లో స్టీవ్ స్మిత్ ఒకరని, అతను తప్పకుండా తిరిగొచ్చి.. మళ్లీ క్రికెట్ అభిమానుల అభిమానాన్ని సంపాదించుకుంటాడని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. స్టీవ్ స్మిత్ ప్రెస్‌మీట్ తర్వాత.. గుండె పగిలిపోయిందంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ట్వీట్ చేశాడు. స్టీవ్ స్మిత్, బెన్‌క్రాఫ్ట్ మీడియా సమావేశాలను చూడలేకపోయానని, వారు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్‌లో మరింత ఉత్తమంగా తిరిగొస్తారని మరో ఆటగాడు మిట్చెల్ జాన్సన్ ట్వీట్ చేశాడు. ‘స్టీవ్ స్మిత్ బాధ నన్ను కదిలిస్తోంది. మళ్లీ క్రికెట్లోకి తిరిగొచ్చి తన సుప్రీం బ్యాటింగ్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానల్ని అలరిస్తాడని ఎదురుచూస్తున్నా.. షేన్ వార్న్ కూడా ఇలాగే ఏడాది నిషేధం ఎదుర్కొని.. తిరిగొచ్చి శ్రీలంకపై మూడు టెస్టుల్లో 26 వికెట్లు తీశాడు’ అని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశారు. -
భయపడి అబద్ధం చెప్పాను.. సారీ!
పెర్త్: బాల్ ట్యాంపరింగ్ వివాదంలో తొమ్మిది నెలలపాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా టెస్టు ఓపెనర్ కామెరాన్ బెన్‌క్రాఫ్ట్.. తాను తప్పు చేసినట్టు అంగీకరించాడు. బాల్ ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించిన మాట వాస్తవమేనని, కానీ భయపడి.. ఆ విషయంలో అబద్ధం చెప్పానని తెలిపాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతుందని అతను కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు. కెప్టౌన్లో దక్షిణాఫ్రికాతో మూడోటెస్టు సందర్భంగా సాండ్ పేపర్‌తో బాల్ ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించి.. బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తోపాటు బెన్క్రాఫ్ట్పైనా క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. బెన్క్రాఫ్ట్ను 9 నెలలపాటు దేశీయ, అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధంతరంగా స్వదేశం తిరిగొచ్చిన బెన్‌క్రాఫ్ట్ పెర్త్‌లో మీడియాతో మాట్లాడాడు. బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినందుకు దేశ ప్రజలకు, క్రికెట్ అభిమానులకు బెన్‌క్రాఫ్ట్ క్షమాపణలు చెప్పాడు. జరిగిన తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. క్రికెట్ అంటే తనకు ఎంతో ఇష్టమని, దేశం తరఫున, తన రాష్ట్రం తరఫున ఆడటం కన్నా గొప్ప గౌరవం తనకు మరోటి లేదని చెప్పాడు. గత ఐదురోజులుగా జరిగిన పరిణామాలు వివరిస్తూ.. బెన్‌క్రాఫ్ట్ కన్నీటిపర్యంతమయ్యాడు. తాను చేసిన తప్పు దేశ ప్రజలను, క్రికెట్ కమ్యూనిటీ తలదించుకునేలా చేసిందని, ఈ తప్పు తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని తెలిపాడు. -
నీ భర్త ద్రోహి.. ఆ క్రికెటర్ భార్యపై ఆగ్రహం!
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండైస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షమందికిపైగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం భర్తతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆమె.. అక్కడ తాము సందర్శించిన ప్రదేశాలకు సంబంధించిన అందమైన ఫొటోలను షేర్ చేసుకుంది. రోజుకు రెండు పోస్టులైనా ఆమెవి ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించేవి. తాను దిగిన ఫొటోలు, భర్తతో, పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు ఆమె షేర్ చేసుకునేది. దక్షిణాఫ్రికా అందాలను పర్యటనను ఆస్వాదిస్తూ.. ఆమె పెట్టే ఫొటోలకు అభిమానులు, ఫాలోవర్స్ నుంచి మంచి మద్దతు లభించేది. కానీ, బాల్ ట్యాంపరింగ్ వివాదం వెలుగుచూడటంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్ బెన్‌క్రాప్ట్ బాల్‌ను ట్యాంపరింగ్ చేసేందుకు ప్రయత్నించడం, ఇది సమిష్టి తప్పిదమని ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ ప్రకటించడంతో క్రికెట్ ప్రపంచంలో పెనుదుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంలో డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్సీ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ భార్య క్యాండైస్ పైనా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భర్తను అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘నీ భర్త ఒక ద్రోహి.. అతన్ని చూసి సిగ్గుపడుతున్నాం’ అని నెటిజన్ ఆమె ఫొటోపై కామెంట్ చేయగా.. ‘నీ భర్త నీ దేశాన్ని అప్రతిష్టపాలు చేశారు. ద్రోహి’ అంటూ మరో నెటిజన్ విరుచుకుపడ్డారు. ‘మీ నాన్న ద్రోహి అని నువ్వెప్పుడు తెలుసుకుంటావు’ అని ఇంకో నెటిజన్.. డేవిడ్ వార్నర్ పిల్లల ఫొటోపై విద్వేషం వెళ్లగక్కాడు. బాల్ ట్యాంపరింగ్ పరిణామం వెలుగుచూడటంతో క్యాండైస్ సోషల్ మీడియాకు దూరం జరిగినట్టు కనిపిస్తోంది. గతకొన్ని రోజులుగా ఆమె ఏమీ పోస్టు చేయడం లేదు. దక్షిణాఫ్రికా క్రికెటర్ పర్యటనలో భాగంగా అక్కడి పర్యాటక ప్రాంతాల్లో, బీచుల్లో విహరిస్తున్న ఫొటోలు డేవిడ్ వార్నర్‌తోపాటు ఆస్ట్రేలియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్టీవ్ స్మీత్, అతని ఫియాన్సీ డానీ విల్లిస్ ఇప్పటివరకు పోస్టు చేస్తూ వచ్చారు. బ్యాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత క్యాండైసే కాదు.. డానీ విల్లిస్ కూడా సోషల్ మీడియాలో ఏమీ పోస్టు చేయలేదు. బ్యాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఒక టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటున్న స్టీవ్ స్మిత్ సోమవారం ఆస్ట్రేలియాకు తిరుగుముఖం పట్టనున్నారు. డేవిడ్ వార్నర్ మాత్రం దక్షిణాఫ్రికాతో జరిగే నాలుగో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడు. -
కంగారులకు ‘పరుగుల చిరుత’ కోచింగ్
సిడ్నీ: ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య ఈ గురువారం నుంచి ప్రారంభమయ్యే ప్రతిష్టాత్మక యాషేస్ సిరీస్‌కు ఇరు జట్లు సంసిద్దమయ్యాయి. ఆసీస్ బ్యాట్స్‌మెన్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తేందుకు జమైకన్ చిరుత ఉసేన్ బోల్ట్ కంగారుల జట్టుకు శిక్షణనిస్తున్నాడు. పరుగు పందెంలో రారాజైన ఈ జమైకన్ 100, 200 మీటర్ల విభాగాల్లో 8 ఒలింపిక్స్ పతకాలు అందుకొని రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. గత లండన్ వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం కెరీర్‌కు వీడ్కోలు పలికిన బోల్ట్ రన్నింగ్ కోచ్‌గా కొత్త అవతారమెత్తాడు. ‘పరుగు అందుకునే సమయంలో క్రికెటర్లు నెమ్మదిగా ఉంటారని, అక్కడే అసలు సమస్య ఉందని బోల్ట్ చెప్పాడు. ఈ ఒక్క సమస్యను అధిగమిస్తే క్రికెటర్లు కూడా వేగంగా పరుగెత్తగలుగుతారని అతనన్నాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎలా పరుగెత్తాలన్నదానిపై తాను క్రికెటర్లలో అవగాహన పెంచుతున్నట్లు బోల్ట్ ది హెరాల్డ్ దినపత్రికకు తెలిపాడు. బోల్ట్ రన్నింగ్ టిప్స్ యాషేస్ సిరీస్‌కు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆసీస్ క్రికెటర్ హ్యాండ్స్కోంబ్ తెలిపాడు. వికెట్ల మధ్య వేగంగా ఎలా పరుగెత్తాలో, అదే వేగంతోఎలా వెనక్కి రావాలో శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నాడు. -
'సరైన సమయంలో అతడికి కెప్టెన్సీ'
సిడ్నీ : తన తర్వాత జట్టు బాధ్యతలు స్వీకరించిన స్టీవ్ స్మిత్ కెప్టెన్‌గా సక్సెస్ సాధిస్తాడని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్‌లో టాపార్డర్ స్థానాలలో స్మిత్ రావడం అతడి ఆటతీరును దెబ్బతీయదన్నాడు. కెప్టెన్‌గా నిరూపించుకోవడానికి అతడికిదే మంచి తరుణమని క్లార్క్ పేర్కొన్నాడు. బంగ్లాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో జట్టులో చాలా మంది కొత్తవాళ్లకు అవకావం లభించింది. యాషెస్ సిరీస్ ఓటమి అనంతరం బ్రాడ్ హడిన్, క్రిస్ రోజర్స్, ర్యాన్ హ్యారిస్, షేన్ వాట్సన్ టెస్టులకు వీడ్కోలు పలికారు. యాషెస్ సిరీస్‌లో భాగంగా స్టీవ్ స్మిత్ ఇంగ్లండ్ జట్టుపై లార్డ్స్ లో చేసిన 215 పరుగుల ఇన్నింగ్స్ అద్బుతమని ప్రశంసించాడు. బంగ్లా సిరీస్‌లో జట్టును మరింత ముందుకు నడిపిస్తాడని క్లార్క్ వ్యాఖ్యానించాడు. కెరీర్ లోనే స్మిత్ ఉన్నత దశలో ఉన్నప్పుడు అతని చేతికి పగ్గాలు రావడం సంతోషకర అంశమన్నాడు. యాషెస్ టెస్ట్ సిరీస్ జరుగుతుండగానే టెస్టులకు క్లార్క్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం విదితమే. -
ప్రధాని ఆతిథ్యంలో...
సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి టోనీ అబాట్ గురువారం భారత్, ఆస్ట్రేలియా క్రికెటర్లకు ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన రెండో అధికారిక నివాసమైన కిరిబిలిలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఇరు జట్ల ఆటగాళ్లతో అబాట్ ఫోటో సెషన్లో పాల్గొన్నారు. మంగళవారం నుంచి సిడ్నీలో భారత్, ఆసీస్ నాలుగో టెస్టు జరుగుతుంది. మరో వైపు ధోని కూడా ఈ విందుకు హాజరైనట్లు సమాచారం. అయితే గ్రూప్ ఫోటోకు మాత్రం అతను దూరంగా ఉన్నాడు. ఇరు జట్లతో ఫోటో సెషన్ జరిగే సమయంలో ధోని అటు వైపు రాకుండా లాబీలోనే నిలబడి చూస్తుండిపోయాడు. నేనూ స్లెడ్జింగ్ చేసేవాడిని.. బ్యాటింగ్.. బౌలింగ్ అంతగా రాకున్నా కేవలం స్లెడ్జింగ్ కారణంగానే తనకు జట్టులో చోటు దొరికిందని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ తన క్రికెట్ రోజులను గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశలో ఆయన ఆక్స్ఫర్డ్ మిడిల్ కామన్ రూమ్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. ‘నేను బ్యాటింగ్ చేయలేను.. బౌలింగూ రాదు. ఫీల్డింగ్ చేయడం అసలే రాదు. కానీ నేను బాగా స్లెడ్జింగ్ చేయగలను. ఈ కారణంగానే నాకు జట్టులో చోటు దక్కిందనుకుంటాను’ అని ప్రధాని అన్నారు. -
ప్రాక్టీస్‌లో అబాట్
సిడ్నీ: హ్యూస్ మరణానికి కారణమైన బంతిని విసిరిన పేసర్ సీన్ అబాట్ ఇప్పుడిప్పుడే ఆ విషాదంనుంచి కోలుకుంటున్నాడు. నేరుగా తన ప్రమేయం లేకపోయినా హ్యూస్ చనిపోవడంతో ఆ రోజునుంచి అబాట్ అపరాధ భావంతో కనిపించాడు. అయితే సహచర ఆస్ట్రేలియా క్రికెటర్లు, సన్నిహితులు అండగా నిలవడంతో కాస్త మామూలు స్థితికి వచ్చాడు. మంగళవారం తొలిసారి అతను మైదానంలోకి దిగాడు. 22 ఏళ్ల అబాట్ న్యూసౌత్‌వేల్స్ జట్టుతో కలిసి ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే అతను ఒంటరిగా ఉండకుండా సాధన సమయంలో జట్టు సభ్యులంతా అబాట్‌కు తోడుగా నిలిచారు. మరో వైపు అంత్యక్రియలకు అబాట్ రాక కోసం తామూ ఎదురు చూస్తున్నామని హ్యూస్ సన్నిహితులు వెల్లడించారు. ‘అతడిని గుండెలకు హత్తుకొని అంతా బాగుందని చెప్పాలని మేం భావిస్తున్నాం’ అని వారు అన్నారు. -
‘రేప్’కు గురయ్యాం!
సిడ్నీ: ఆట సంగతేమో కానీ వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించడంలో ఆసీస్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమంటున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. ర్యాన్ హారిస్ ట్వీట్ తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేస్బుక్ వ్యాఖ్యతో అడ్డంగా బుక్కయ్యాడు. యాషెస్‌లో తమ జట్టు ఘోర పరాజయాన్ని ‘జట్టు రేప్‌కు గురి కావడం’తో పోల్చాడు. తన సోదరుడు అలెక్‌తో ఫేస్బుక్లో సంభాషిస్తూ అతను ఈ వ్యాఖ్య చేశాడు. నార్తాంప్టన్‌లో నైట్ అవుట్ ఎంజాయ్ చేశామని అలెక్ చెప్పగా...పెర్త్‌లో రేప్‌కు గురి కావడంకంటే అక్కడే ఉంటే బాగుండేదేమో అని స్వాన్ స్పందించాడు. ఇంగ్లండ్ మీడియా అంతా దీనిని హైలైట్ చేస్తూ స్వాన్పై విరుచుకు పడింది. దాంతో అతను క్షమాపణ చెప్పాడు. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. వివేకం లేకుండా నేను అతిగా స్పందించాను’ అని స్వాన్ అన్నాడు.