‘రేప్’కు గురయ్యాం! | graeme Swann apologises for rape comment | Sakshi
Sakshi News home page

‘రేప్’కు గురయ్యాం!

Published Fri, Dec 20 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:46 AM

graeme Swann apologises for rape comment

సిడ్నీ: ఆట సంగతేమో కానీ వ్యాఖ్యలతో వివాదాలు సృష్టించడంలో ఆసీస్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమంటున్నారు ఇంగ్లండ్ ఆటగాళ్లు. ర్యాన్ హారిస్ ట్వీట్ తర్వాత ఇప్పుడు ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ తన ఫేస్‌బుక్ వ్యాఖ్యతో అడ్డంగా బుక్కయ్యాడు. యాషెస్‌లో తమ జట్టు ఘోర పరాజయాన్ని ‘జట్టు రేప్‌కు గురి కావడం’తో పోల్చాడు.
 
 తన సోదరుడు అలెక్‌తో ఫేస్‌బుక్‌లో సంభాషిస్తూ అతను ఈ వ్యాఖ్య చేశాడు. నార్తాంప్టన్‌లో నైట్ అవుట్ ఎంజాయ్ చేశామని అలెక్ చెప్పగా...పెర్త్‌లో రేప్‌కు గురి కావడంకంటే అక్కడే ఉంటే బాగుండేదేమో అని స్వాన్ స్పందించాడు. ఇంగ్లండ్ మీడియా అంతా దీనిని హైలైట్ చేస్తూ స్వాన్‌పై విరుచుకు పడింది. దాంతో అతను క్షమాపణ చెప్పాడు. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించండి. వివేకం లేకుండా నేను అతిగా స్పందించాను’ అని స్వాన్ అన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement