ఆ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లదే హవా | Sakshi
Sakshi News home page

ఆ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లదే హవా

Published Thu, Feb 29 2024 6:33 PM

Australians Dominate Overseas Retention List In The Hundred - Sakshi

ఇంగ్లండ్‌ వేదికగా జరిగే ద హండ్రెడ్‌ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ల హవానే నడుస్తుంది. ప్రపంచంలో ఏ క్రికెట్‌ లీగ్‌ జరిగినా అందులో మెజార్టీ శాతం విదేశీ ప్లేయర్లు ఆస్ట్రేలియన్లే ఉంటారు. ఐపీఎల్‌ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్‌లో భారత స్టార్‌ క్రికెటర్ల కంటే ఆస్ట్రేలియన్లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇటీవల జరిగిన 2024 సీజన్‌ వేలమే ఇందుకు నిదర్శనం. ఈ వేలంలో కమిన్స్‌, స్టార్క్‌లను ఆయా ఫ్రాంచైజీలు భారత స్టార్‌ క్రికెటర్లకంటే ఎక్కువ ధర చెల్లించి సొంతం చేసుకున్నారు.  లీగ్‌ క్రికెట్‌లో ఆస్ట్రేలియన్ల హవా ఈ రేంజ్‌లో కొనసాగుతుంది. 

తాజాగా ద హండ్రెడ్‌ లీగ్‌లోనూ ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియన్ల కోసం ఎగబడ్డారు. 2024 సీజన్‌కు సంబంధించి విదేశీ ఆటగాళ్ల రిటెన్షన్‌ లిస్ట్‌ను ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించగా.. రిటైన్‌ చేసుకున్న 16 మంది విదేశీ ప్లేయర్స్‌లో (పురుషులు, మహిళలు) తొమ్మిది మంది ఆస్ట్రేలియన్లే ఉండటం విశేషం. 

పురుషుల విభాగంలో ఓవల్‌ ఇన్విన్సిబుల్‌ ఆడమ్‌ జంపా, స్పెన్సర్‌ జాన్సన్‌లను, లండన్‌ స్పిరిట్‌ నాథన్‌ ఇల్లిస్‌ను, నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ మాథ్యూ షార్ట్‌ను రీటైన్‌ చేసుకోగా.. మహిళల విభాగంలో బర్మింగ్హమ్‌ ఫీనిక్స్‌ ఎల్లిస్‌ పెర్రీని, లండన్‌ స్పిరిట్‌ గ్రేస్‌ హ్యారిస్‌, జార్జియా రెడ్‌మేన్‌లను, నార్త్రన్‌ సూపర్‌ ఛార్జర్స్‌ ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌, జార్జియా వేర్హమ్‌లను రీటైన్‌ చేసుకున్నాయి. 

ఓవరాల్‌గా 2024 సీజన్‌ కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి 137 మంది ప్లేయర్స్‌ను తిరిగి దక్కించుకున్నాయి. ఇంకా 75 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హండ్రెడ్‌ లీగ్‌ ఈ ఏడాది జులై 23 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్ట్‌ 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెగ్యులర్‌ క్రికెట్‌ టోర్నీలకు భిన్నంగా ఈ టోర్నీ 100 బంతుల ప్రాతిపదికన జరుగుతుంది. 

ఆయా ఫ్రాంచైజీలు రీటైన్‌ చేసుకున్న ప్లేయర్ల వివరాలు..

బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మహిళలు: సోఫీ డివైన్ (ఓవర్సీస్), ఎల్లీస్ పెర్రీ (ఓవర్సీస్), ఇస్సీ వాంగ్, ఎమిలీ అర్లాట్, హన్నా బేకర్, స్టెర్రే కాలిస్, చారిస్ పావెలీ

బర్మింగ్హమ్ ఫీనిక్స్ మెన్: క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, బెన్ డకెట్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), జామీ స్మిత్, విల్ స్మీడ్, టామ్ హెల్మ్, జాకబ్ బెథెల్

లండన్ స్పిరిట్ మహిళలు: హీథర్ నైట్, గ్రేస్ హారిస్ (ఓవర్సీస్), డేనియల్ గిబ్సన్, చార్లీ డీన్, సారా గ్లెన్, జార్జియా రెడ్‌మైన్ (ఓవర్సీస్), సోఫీ మున్రో, తారా నోరిస్

లండన్ స్పిరిట్ మెన్: జాక్ క్రాలే, నాథన్ ఎల్లిస్ (ఓవర్సీస్), డాన్ లారెన్స్, లియామ్ డాసన్, డాన్ వోరాల్, ఆలీ స్టోన్, ఆడమ్ రోసింగ్టన్, డేనియల్ బెల్-డ్రమ్మండ్, మాథ్యూ క్రిచ్లీ

మాంచెస్టర్ ఒరిజినల్స్ మహిళలు: సోఫీ ఎక్లెస్టోన్, లారా వోల్వార్డ్ట్ (ఓవర్సీస్), ఎమ్మా లాంబ్, మహికా గౌర్, ఫి మోరిస్, కాథరిన్ బ్రైస్, ఎల్లీ థ్రెల్‌కెల్డ్, లిబర్టీ హీప్

మాంచెస్టర్ ఒరిజినల్స్ పురుషులు: జోస్ బట్లర్, జామీ ఓవర్టన్, ఫిల్ సాల్ట్, పాల్ వాల్టర్, టామ్ హార్ట్లీ, ఉసామా మీర్ (ఓవర్సీస్), వేన్ మాడ్సెన్, జోష్ టంగ్, మాక్స్ హోల్డెన్, ఫ్రెడ్ క్లాసెన్, మిచ్ స్టాన్లీ

ఉత్తర సూపర్‌చార్జర్స్ మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఓవర్సీస్), జార్జియా వేర్‌హామ్ (ఓవర్సీస్), కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, ఆలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్, హోలీ ఆర్మిటేజ్, మేరీ కెల్లీ

ఉత్తర సూపర్‌చార్జర్స్ పురుషులు: బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, రీస్ టోప్లీ, మాథ్యూ షార్ట్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్సే, ఆడమ్ హోస్, మాథ్యూ పాట్స్, కల్లమ్ పార్కిన్సన్, ఒల్లీ రాబిన్సన్

ఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళలు: మారిజాన్ కాప్ (ఓవర్సీస్), ఆలిస్ క్యాప్సే, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, తాష్ ఫర్రాంట్, మేడీ విలియర్స్, పైజ్ స్కోల్‌ఫీల్డ్, సోఫియా స్మేల్, ర్యానా మెక్‌డొనాల్డ్

ఓవల్ ఇన్విన్సిబుల్స్ మెన్: సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, విల్ జాక్స్, ఆడమ్ జంపా (ఓవర్సీస్), జోర్డాన్ కాక్స్, గుస్ అట్కిన్సన్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, స్పెన్సర్ జాన్సన్ (ఓవర్సీస్), నాథన్ సౌటర్, తవాండా ముయే

సదరన్ బ్రేవ్ ఉమెన్: డాని వ్యాట్, క్లో ట్రయాన్ (ఓవర్సీస్), లారెన్ బెల్, మైయా బౌచియర్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, రియానా సౌత్‌బై, మేరీ టేలర్

సదరన్ బ్రేవ్ మెన్: జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, ల్యూస్ డు ప్లూయ్, రెహన్ అహ్మద్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), జార్జ్ గార్టన్, అలెక్స్ డేవిస్

Advertisement
 
Advertisement