The Hundred League
-
Hundred League: అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసిన దీప్తి శర్మ
మహిళల హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో లండన్ స్పిరిట్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అదిరిపోయే ప్రదర్శనలతో ఇరగదీసింది. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన దీప్తి.. తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టింది. నిన్నటి మ్యాచ్‌లో లండన్ గెలవాలంటే చివరి మూడు బంతులకు నాలుగు పరుగులు అవసరం కాగా.. దీప్తి సిక్సర్ బాది మ్యాచ్‌ను ముగించింది. ఫైనల్లో దీప్తి చేసింది 16 పరుగులే అయినా జట్టు విజయానికి అవెంతో దోహదపడ్డాయి.హండ్రెడ్ లీగ్ ప్రారంభ మ్యాచ్ నుంచి దీప్తి ఇలాంటి ప్రదర్శనలతో ఆకట్టుకుంది. ఈ సీజన్లో బ్యాట్‌తో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆమె.. 212 సగటున, 132.50 స్ట్రయిక్‌రేట్‌తో 212 పరుగులు చేసింది. ఇందులో దీప్తి వ్యక్తిగత అత్యధిక స్కోర్ 46 నాటౌట్ కాగా.. 18 బౌండరీలు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ సీజన్లో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన దీప్తి.. 6.85 ఎకానమీతో ఎనిమిది వికెట్లు తీసింది. వెల్ష్ ఫైర్‌తో నిన్న జరిగిన ఫైనల్లో దీప్తి ఎల్విస్ వికెట్ పడగొట్టింది. -
ట్రెంట్ రాకెట్స్‌కు బిగ్ షాక్.. హండ్రెడ్ లీగ్ నుంచి రషీద్ ఖాన్ ఔట్
హండ్రెడ్ లీగ్ నుంచి ట్రెంట్ రాకెట్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ ఔటయ్యాడు. గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. రషీద్ స్థానాన్ని ఆసీస్ ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ భర్తీ చేయనున్నాడు.ప్రస్తుతం హండ్రెడ్ లీగ్‌లో ట్రెంట్ రాకెట్స్ ఐదో స్థానంలో కొనసాగుతుంది. గ్రూప్ దశలో ఈ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా రాకెట్స్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే.ప్రస్తుతానికి ఓవల్ ఇన్విన్సిబుల్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా.. వెల్ష్ ఫైర్, లండన్ స్పిరిట్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్, సథరన్ బ్రేవ్, బర్మింగ్హమ్ ఫీనిక్స్, ట్రెంట్ రాకెట్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాయి.కాగా, ఇటీవల సథరన్ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు సమర్పించుకుని ట్రెంట్ రాకెట్స్ ఓటమికి పరోక్ష కారకుడైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పోలార్డ్ రషీద్ ఖాన్ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. -
రాణించిన డేవిడ్ విల్లే.. వెల్ష్ ఫైర్‌కు తొలి విజయం
హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్‌లో వెల్ష్ ఫైర్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (జులై 25) జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్.. నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. సికందర్ రజా (13), జేమీ ఓవర్టన్ (23), స్కాట్ కర్రీ (26 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. డేవిడ్ విల్లే (20-12-14-3), జాషువ లిటిల్ (20-10-21-2) ఒరిజినల్స్ పతనాన్ని శాశించారు. డేవిడ్ పేన్, జేక్ బాల్, మేసన్ క్రేన్ తలో వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్ ఫైర్.. 57 బంతుల్లో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. టమ్ కొహ్లెర్ కాడ్మోర్ 18, జానీ బెయిర్‌స్టో 18, జో క్లార్క్ 33, టామ్ ఏబెల్ 11 పరుగులు చేశారు. ఒరిజినల్స్ బౌలర్లలో స్కాట్ కర్రీ, పాల్ వాల్టర్ తలో వికెట్ పడగొట్టారు.మరోవైపు మహిళల హండ్రెడ్ లీగ్‌లోనూ వెల్ష్ ఫైర్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్ననే జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్.. వొల్వార్డ్ట్ (37), ఎక్లెస్టోన్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. సోఫీ డంక్లీ (69 నాటౌట్) సత్తా చాటడంతో వెల్ష్ ఫైర్ మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. -
సత్తా చాటిన క్రెయిగ్ ఓవర్టన్, జేమ్స్ విన్స్
పురుషుల ద హండ్రెడ్ లీగ్‌లో నిన్న (జులై 24) సథరన్ బ్రేవ్, లండన్ స్పిరిట్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. క్రెయిగ్ ఓవర్టన్ (20-8-16-3), టైమాల్ మిల్స్ (20-7-37-2), క్రిస్ జోర్డన్ (15-5-26-2), జేమ్స్ కోల్స్ (5-3-2-1) దెబ్బకు నిర్ణీత 100 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. లండన్ స్పిరిట్ ఇన్నింగ్స్‌లో డేనియల్ లారెన్స్ (30 బంతుల్లో 38; 3 ఫోర్లు), లియామ్ డాసన్ (19 బంతుల్లో 45 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. మిగతావారంతా విఫలమయ్యారు. స్టార్ ఆటగాళ్లు హెట్‌మైర్ (5), ఆండ్రీ రసెల్ (13) దారుణంగా నిరాశపరిచారు.అనంతరం 139 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ బ్రేవ్.. జేమ్స్ విన్స్ (35 బంతుల్లో 56; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డేనియల్ హ్యూస్ (30 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), ల్యూస్ డు ప్లూయ్ (19 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్) సత్తా చాటడంతో 89 బంతుల్లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లండన్ స్పిరిట్ బౌలర్లలో నాథన్ ఇల్లిస్, బొపారా, డేనియల్ లారెన్స్ తలో వికెట్ పడగొట్టారు.ఇదే ఫ్రాంచైజీ మహిళా జట్ల మధ్య నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో లండన్ స్పిరిట్.. సథరన్ బ్రేవ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సథరన్ బ్రేవ్.. నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేయగా..లండన్ స్పిరిట్ మరో మూడు బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హీథర్ నైట్ (65 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి లండన్ స్పిరిట్‌ను గెలిపించింది. అంతకుముందు సథరన్ బ్రేవ్ ఇన్నింగ్స్‌లో డేనియల్ వ్యాట్ (59) అర్ద సెంచరీతో రాణించింది. -
నేటి నుంచి (జులై 23) ద హండ్రెడ్ లీగ్ ప్రారంభం
ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ద హండ్రెడ్ లీగ్' నేటి నుంచి ప్రారంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్, బర్మింగ్హమ్ ఫీనిక్స్ తలపడనున్నాయి. లీగ్‌లో మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడనున్నాయి. ఆగస్ట్ 18న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. రౌండ్ రాబిన్ లీగ్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగనున్నాయి. గత ఎడిషన్ ఫైనల్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. లీగ్ తొలి ఎడిషన్‌లో (2021) సథరన్ బ్రేవ్స్, రెండో ఎడిషన్‌లో ట్రెంట్ రాకెట్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాయి. ఈ లీగ్ 100 బంతుల ఫార్మాట్లో నడుస్తుంది. ఓవర్‌కు ఐదు బంతులు ఉంటాయి. ప్రతి బౌలర్ రెండు ఓవర్లు వేయవచ్చు.జట్ల వివరాలు..లండన్ స్పిరిట్: జాక్ క్రాలే, షిమ్రోన్ హెట్‌మైర్, డేనియల్ లారెన్స్, డేనియల్ బెల్ డ్రమ్మండ్, రవి బొపారా, జేమ్స నీషమ్,మాథ్యూ క్రిచ్లీ, ఆండ్రీ రసెల్, లియామ్ డాసన్, మైకేల్ కైల్ పెప్పర్, ఆడమ్ రొస్సింగ్టన్, ఓలీ పోప్, డేనియల్ వార్రల్, నాథన్ ఇల్లిస్, రిచర్డ్ గ్లీసన్, ఓలీ స్టోన్, ఎండీ టేలర్, ర్యాన్ హిగ్గిన్స్నార్త్రన్సూపర్ ఛార్జర్స్: ఆడమ్ హోస్, హ్యారీ బ్రూక్, గ్రహమ్ క్లార్క్, మిచెల్ సాంట్నార్, బెన్ స్టోక్స్ టామ్ లవెస్, మాథ్యూ షార్ట్, జేసన్ రాయ్, జోర్డన్ క్లార్క్, నికోలస్ పూరన్, పాట్రిక్ బ్రౌన్, ఓలీ రాబిన్సన్, కల్లమ్ పార్కిన్సన్, బ్రైడన్ కార్స్, ఆదిల్ రషీద్, మాథ్యూ పాట్స్, డిల్లన్ పెన్నింగ్టన్, రీస్ టాప్లే, బెన్ డ్వార్షుయిస్బర్మింగ్హమ్ ఫీనిక్స్: బెన్ డకెట్, మొయిన్ అలీ, రిషి పటేల్, లియామ్ లివింగ్‌స్టోన్, సీన్ అబాట్, క్రిస్ వోక్స్, బెన్నీ హోవెల్, డాన్ మౌస్లీ, జేకబ్ బేతెల్, లూయిస్ కింబర్, జేమీ స్మిత్, అనెరిన్ డొనాల్డ్, టమ్ హెల్మ్, ఆడమ్ మిల్నే, జేమ్స్ ఫుల్లర్, టిమ్ సౌథీవెల్ష్ ఫైర్: గ్లెన్ ఫిలిప్స్, టామ్ ఏబెల్, బెన్ గ్రీన్, జో క్లార్క్, జానీ బెయిర్‌స్టో, లూక్ వెల్స్, డేవిడ్ విల్లే, టామ్ కొహ్లెర్ కాడ్మోర్, స్టెఫెన్ ఎస్కినాజీ, క్రిస్ వోక్స్, హరీస్ రౌఫ్, డేవిడ్ పేన్, మేసన్ క్రేన్, వాన్ డర్ మెర్వ్, మ్యాట్ హెన్రీ, జేక్ బాల్సథరన్ బ్రేవ్: డేనియల్ హ్యూస్, జేమ్స్ విన్స్, లారీ ఈవాన్స్, కీరన్ పోలార్డ్, రెహాన్ అహ్మద్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్, డు ప్లూయ్, జో వెథర్లీ, అలెక్స్ డేవిస్, జేమ్స్ కోల్స్, జోఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్, టైమాల్ మిల్స్, అకీల్ హొసేన్, డానీ బ్రిగ్స్, జార్జ్ గార్టన్ఓవల్ ఇన్విన్సిబుల్స్: రవాండ ముయేయే, టామ్ లామ్మన్బీ, విల్ జాక్స్, సామ్ కర్రన్, టామ్ కర్రన్, హ్యరీసన్ వార్డ్, డేవిడ్ మలాన్, జోర్డన్ కాక్స్,సామ్ బిల్లంగ్స్, డొనొవన్ ఫెరియెరా, సకీబ్ మహమూద్, మర్చంట్ డి లాంజ్, ఆడమ్ జంపా, మొహమ్మద్ ఆమిర్, నాథన్ సౌటర్, మార్క్ వాట్ట్రెంట్ రాకెట్స్: రోవ్‌మన్ పావెల్, జో రూట్, సామ్ హెయిన్, రషీద్ ఖాన్, లూయిస్ గ్రెగరీ, ఆడమ్ లిథ్, అలెక్స్ హేల్స్, ఇమాద్ వసీం, జోర్డన్ థాంప్సన్, టామ్ అల్సోప్, టామ్ బాంటన్,ఓలీ రాబిన్సన్, జాన్ టర్నర్, రిలే మెరిడిత్, లూక్ వుడ్, సామ్ కుక్, కల్విన్ హ్యారీసన్మాంచెస్టర్ ఒరిజినల్స్: థామన్ అస్పిన్‌వాల్, మ్యాక్స్ హోల్డన్, సికందర్ రజా, స్కాట్ కర్రీ, పాల్ వాల్టర్, జేమీ ఓవర్టన్, వేన్ మ్యాడ్సన్, మాథ్యూ హర్స్ట్, జోస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్, సోనీ బేకర్, ఉసామా మిర్, మిచెల్ స్టాన్లీ, టామ్ హార్ట్లీ, జోష్ హల్, ఫజల్ హక్ ఫారూకీ -
బాబర్ ఆజం, డేవిడ్ వార్నర్‌కు ఘోర అవమానం..
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌లకు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఈ పాక్ స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోలేదు. ది హండ్రెడ్ లీగ్ 2024 సీజన్ డ్రాఫ్ట్‌లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్, ఆసీస్ యువ సంచలనం టిమ్ డేవిడ్‌లు సైతం అమ్ముడు పోలేదు. అయితే ఈ డ్రాఫ్ట్‌లో బాబర్, రిజ్వాన్‌ను ఎవరూ పట్టించుకో పోయినప్పటికి.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, ఇమాద్ వసీం మాత్రం అమ్ముడుపోయారు. షాహీన్ ఆఫ్రిదీని లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. గత సీజన్లో కూడా షాహీన్.. వెల్ష్ ఫైర్ ప్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్, నసీం షాను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. కాగా ఈ డ్రాప్ట్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లకు బారీ డిమాండ్ నెలకొంది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్లోనే అమ్ముడుపోయారు. పూరన్‌ను నార్తర్న్ సూపర్ఛార్జర్స్ సెలక్ట్ చేసుకోగా.. ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్మెయర్ లండన్ స్పిరిట్‌కు ఆడనున్నారు. వీరితో పాటు విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సదరన్ బ్రేవ్ జట్టుకు, రోవ్మాన్ పావెల్ ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించనున్నారు. మరోవైపు మహిళల ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచ్ ఘోష్‌లను మాత్రం ఈ డ్రాప్ట్‌లో ఎంపికయ్యారు. మంధానను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకోగా.. రిచా ఘోష్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసింది. -
ఆ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్లదే హవా
ఇంగ్లండ్ వేదికగా జరిగే ద హండ్రెడ్ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా క్రికెటర్ల హవానే నడుస్తుంది. ప్రపంచంలో ఏ క్రికెట్ లీగ్ జరిగినా అందులో మెజార్టీ శాతం విదేశీ ప్లేయర్లు ఆస్ట్రేలియన్లే ఉంటారు. ఐపీఎల్ సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. ఇంకా చెప్పాలంటే ఐపీఎల్లో భారత స్టార్ క్రికెటర్ల కంటే ఆస్ట్రేలియన్లకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఇటీవల జరిగిన 2024 సీజన్ వేలమే ఇందుకు నిదర్శనం. ఈ వేలంలో కమిన్స్, స్టార్క్‌లను ఆయా ఫ్రాంచైజీలు భారత స్టార్ క్రికెటర్లకంటే ఎక్కువ ధర చెల్లించి సొంతం చేసుకున్నారు. లీగ్ క్రికెట్లో ఆస్ట్రేలియన్ల హవా ఈ రేంజ్లో కొనసాగుతుంది. తాజాగా ద హండ్రెడ్ లీగ్‌లోనూ ఫ్రాంచైజీలు ఆస్ట్రేలియన్ల కోసం ఎగబడ్డారు. 2024 సీజన్‌కు సంబంధించి విదేశీ ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను ఇవాళ (ఫిబ్రవరి 29) ప్రకటించగా.. రిటైన్ చేసుకున్న 16 మంది విదేశీ ప్లేయర్స్‌లో (పురుషులు, మహిళలు) తొమ్మిది మంది ఆస్ట్రేలియన్లే ఉండటం విశేషం. పురుషుల విభాగంలో ఓవల్ ఇన్విన్సిబుల్ ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్‌లను, లండన్ స్పిరిట్ నాథన్ ఇల్లిస్ను, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ మాథ్యూ షార్ట్‌ను రీటైన్ చేసుకోగా.. మహిళల విభాగంలో బర్మింగ్హమ్ ఫీనిక్స్ ఎల్లిస్ పెర్రీని, లండన్ స్పిరిట్ గ్రేస్ హ్యారిస్, జార్జియా రెడ్మేన్లను, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వేర్హమ్లను రీటైన్ చేసుకున్నాయి. ఓవరాల్‌గా 2024 సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు కలిపి 137 మంది ప్లేయర్స్‌ను తిరిగి దక్కించుకున్నాయి. ఇంకా 75 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హండ్రెడ్ లీగ్ ఈ ఏడాది జులై 23 నుంచి ప్రారంభమవుతుంది. ఆగస్ట్ 18న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. రెగ్యులర్ క్రికెట్ టోర్నీలకు భిన్నంగా ఈ టోర్నీ 100 బంతుల ప్రాతిపదికన జరుగుతుంది. ఆయా ఫ్రాంచైజీలు రీటైన్ చేసుకున్న ప్లేయర్ల వివరాలు.. బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ మహిళలు: సోఫీ డివైన్ (ఓవర్సీస్), ఎల్లీస్ పెర్రీ (ఓవర్సీస్), ఇస్సీ వాంగ్, ఎమిలీ అర్లాట్, హన్నా బేకర్, స్టెర్రే కాలిస్, చారిస్ పావెలీ బర్మింగ్హమ్ ఫీనిక్స్ మెన్: క్రిస్ వోక్స్, లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, బెన్ డకెట్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే (ఓవర్సీస్), జామీ స్మిత్, విల్ స్మీడ్, టామ్ హెల్మ్, జాకబ్ బెథెల్ లండన్ స్పిరిట్ మహిళలు: హీథర్ నైట్, గ్రేస్ హారిస్ (ఓవర్సీస్), డేనియల్ గిబ్సన్, చార్లీ డీన్, సారా గ్లెన్, జార్జియా రెడ్మైన్ (ఓవర్సీస్), సోఫీ మున్రో, తారా నోరిస్ లండన్ స్పిరిట్ మెన్: జాక్ క్రాలే, నాథన్ ఎల్లిస్ (ఓవర్సీస్), డాన్ లారెన్స్, లియామ్ డాసన్, డాన్ వోరాల్, ఆలీ స్టోన్, ఆడమ్ రోసింగ్టన్, డేనియల్ బెల్-డ్రమ్మండ్, మాథ్యూ క్రిచ్లీ మాంచెస్టర్ ఒరిజినల్స్ మహిళలు: సోఫీ ఎక్లెస్టోన్, లారా వోల్వార్డ్ట్ (ఓవర్సీస్), ఎమ్మా లాంబ్, మహికా గౌర్, ఫి మోరిస్, కాథరిన్ బ్రైస్, ఎల్లీ థ్రెల్కెల్డ్, లిబర్టీ హీప్ మాంచెస్టర్ ఒరిజినల్స్ పురుషులు: జోస్ బట్లర్, జామీ ఓవర్టన్, ఫిల్ సాల్ట్, పాల్ వాల్టర్, టామ్ హార్ట్లీ, ఉసామా మీర్ (ఓవర్సీస్), వేన్ మాడ్సెన్, జోష్ టంగ్, మాక్స్ హోల్డెన్, ఫ్రెడ్ క్లాసెన్, మిచ్ స్టాన్లీ ఉత్తర సూపర్‌చార్జర్స్ మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఓవర్సీస్), జార్జియా వేర్హామ్ (ఓవర్సీస్), కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, హోలీ ఆర్మిటేజ్, మేరీ కెల్లీ ఉత్తర సూపర్‌చార్జర్స్ పురుషులు: బెన్ స్టోక్స్, ఆదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, రీస్ టోప్లీ, మాథ్యూ షార్ట్ (ఓవర్సీస్), బ్రైడన్ కార్సే, ఆడమ్ హోస్, మాథ్యూ పాట్స్, కల్లమ్ పార్కిన్సన్, ఒల్లీ రాబిన్సన్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మహిళలు: మారిజాన్ కాప్ (ఓవర్సీస్), ఆలిస్ క్యాప్సే, లారెన్ విన్ఫీల్డ్-హిల్, తాష్ ఫర్రాంట్, మేడీ విలియర్స్, పైజ్ స్కోల్ఫీల్డ్, సోఫియా స్మేల్, ర్యానా మెక్‌డొనాల్డ్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ మెన్: సామ్ కుర్రాన్, టామ్ కుర్రాన్, విల్ జాక్స్, ఆడమ్ జంపా (ఓవర్సీస్), జోర్డాన్ కాక్స్, గుస్ అట్కిన్సన్, సామ్ బిల్లింగ్స్, సాకిబ్ మహమూద్, స్పెన్సర్ జాన్సన్ (ఓవర్సీస్), నాథన్ సౌటర్, తవాండా ముయే సదరన్ బ్రేవ్ ఉమెన్: డాని వ్యాట్, క్లో ట్రయాన్ (ఓవర్సీస్), లారెన్ బెల్, మైయా బౌచియర్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, రియానా సౌత్‌బై, మేరీ టేలర్ సదరన్ బ్రేవ్ మెన్: జోఫ్రా ఆర్చర్, జేమ్స్ విన్స్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, ల్యూస్ డు ప్లూయ్, రెహన్ అహ్మద్, క్రెయిగ్ ఓవర్టన్, ఫిన్ అలెన్ (ఓవర్సీస్), జార్జ్ గార్టన్, అలెక్స్ డేవిస్ -
చితక్కొట్టిన కర్రన్.. హండ్రెడ్ లీగ్ 2023 విజేతగా ఓవల్ ఇన్విన్సిబుల్స్
హండ్రెడ్ లీగ్ 2023 ఎడిషన్ విజయవంతంగా పూర్తయ్యింది. పురుషుల విభాగంలో ఓవల్ ఇన్విన్సిబుల్స్, మహిళల విభాగంలో సథరన్ బ్రేవ్ ఛాంపియన్స్‌గా అవతరించాయి. నిన్న (ఆగస్ట్ 27) జరిగిన పురుషుల ఫైనల్స్‌లో ఇన్విన్సిబుల్స్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌ను, మహిళల ఫైనల్స్‌లో సథరన్ బ్రేవ్.. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌ను ఓడించి, టైటిల్స్ చేజిక్కించుకున్నాయి. హండ్రెడ్ లీగ్‌లో ఇరు జట్లకు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. Your 2023 champions! 👏 ✨ Oval Invincibles and Southern Brave! ✨#TheHundred pic.twitter.com/O2OPFMrJTi — The Hundred (@thehundred) August 27, 2023 Unbreakable. 🔒#TheHundred pic.twitter.com/DntFw2MthW — The Hundred (@thehundred) August 27, 2023 ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన టామ్ కర్రన్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన ఫైనల్స్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ 14 పరుగుల తేడాతో గెలుపొంది, హండ్రెడ్ లీగ్ పురుషుల విభాగపు విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఓవల్.. జిమ్మీ నీషమ్ (33 బంతుల్లో 57 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్), టామ్ కర్రన్ (34 బంతుల్లో 67 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 161 పరుగుల భారీ స్కోర్ చేసింది. మాంచెస్టర్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 2, జాషువ లిటిల్, పాల్ వాల్టర్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు. What a special night! @TC59 🔥 pic.twitter.com/r0QU8HMsKO — Sam Curran (@CurranSM) August 28, 2023 బంతిలోనూ రాణించిన కర్రన్.. చేతులెత్తేసిన మాంచెస్టర్ 162 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మాంచెస్టర్ ఆటగాళ్లు ఆది నుంచే తడబడుతూ వచ్చి ఓటమిని కొనితెచ్చుకున్నారు. ఓవల్ బౌలర్లు విల్ జాక్స్ (2/11), టామ్ కర్రన్ (1/25), డానీ బ్రిగ్స్ (1/2), నాథన్ సౌటర్ (1/24), సామ్ కర్రన్ (1/31) మాంచెస్టర్ ఆటగాళ్లను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. ఫలితంగా మాంచెస్టర్ నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్లు కోల్పోయి 147 పరుగులకే పరిమితమైంది. మాంచెస్టర్ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్ మాడ్సన్ (37), జేమీ ఓవర్టన్ (28 నాటౌట్), ఫిలిప్ సాల్ట్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. A fairytale finish ✨#TheHundred pic.twitter.com/1XhfiWsevw — The Hundred (@thehundred) August 27, 2023 ఛాంపియన్‌గా సథరన్ బ్రేవ్.. హండ్రెడ్ లీగ్ మహిళల విభాగపు ఛాంపియన్‌గా సథరన్ బ్రేవ్ అవతరించింది. ఫైనల్లో బ్రేవ్.. నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్‌ను 34 పరుగుల తేడాతో చిత్తు చేసి, రెండు ప్రయత్నాల తర్వాత తొలి హండ్రెడ్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రేవ్.. డేనియల్ వ్యాట్ (59), ఫ్రేయా కెంప్ (31), ఆడమ్స్ (27) రాణించడంతో నిర్ణీత బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ బౌలర్లలో కేట్ క్రాస్ 3 వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ బల్లింజర్, లూసీ హిగమ్ తలో వికెట్ దక్కించుకున్నారు. The moment Southern Brave women won #TheHundred! 🏆 pic.twitter.com/Nzn3madPTY — The Hundred (@thehundred) August 27, 2023 చెలరేగిన లారెన్ బెల్, మూర్.. 140 పరుగుల టార్గెట్‌ను డిఫెండ్ చేసుకునే క్రమంలో బ్రేవ్ బౌలర్లు చెలరేగిపోయారు. లారెన్ బెల్ (3/21), కేలియా మూర్ (3/15), ట్రయాన్ (2/28), అన్య ష్రబ్సోల్ (1/18) అద్భుతంగా బౌలింగ్ చేసి, సూపర్ ఛార్జర్స్‌ను 105 పరుగులకు కుప్పకూల్చారు. బ్రేవ్ బౌలర్లు విజృంభించడంతో సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్ మరో 6 బంతులు మిగిలుండగానే ముగిసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో జెమీమా రోడ్రిగెస్ (24) టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
దంచుడే దంచుడు.. బౌలర్లను ఉతికారేసిన బట్లర్! 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో
ది హండ్రెడ్ లీగ్-2023 ఫైనల్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు అడుగుపెట్టింది. శనివారం లండన్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో సదరన్ బ్రేవ్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన బట్లర్ బృందం.. ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సదరన్ బ్రేవ్ నిర్ణీత 100 బంతుల్లో వికెట్ నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సదరన్ బ్రేవ్ బ్యాటర్లలో ఫిన్ అలెన్(69), కాన్వే(51 నాటౌట్), విన్స్(56 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. మాంచెస్టర్ బౌలర్లలో వాల్టర్ ఒక్కడే వికెట్ సాధించాడు. బట్లర్ ఊచకోత.. ఇక 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్‌కు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం నెలకోల్పారు. తొలి వికెట్‌గా సాల్ట్(47) ఔటైనప్పటికీ బట్లర్ మాత్రం తన జోరును తగ్గించలేదు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 82 పరుగులు చేసి.. మాంచెస్టర్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా మాంచెస్టర్ టార్గెట్‌ను మరో నాలుగు బంతులు మిగిలూండగానే ఛేదించింది. ఆఖరిలో హోల్డన్(31), ఈవెన్స్(22) కూడా మెరుపులు మెరిపించారు. ఇక ఆదివారం ఓవల్ ఇన్విన్సిబుల్స్తో జరగనున్న ఫైనల్లో మాంచెస్టర్ ఒరిజినల్స్ తలపడనుంది. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ 50 for England's white ball captain, Jos Buttler 🙌 pic.twitter.com/vG9l9x18Hs — Sky Sports Cricket (@SkyCricket) August 26, 2023 -
రాణించిన బట్లర్.. రెచ్చిపోయిన కాన్వే
హండ్రెడ్ లీగ్ 2023లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో నిన్న (ఆగస్ట్ 24) జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఫలితంగా ఈ జట్టు ఫైనల్‌కు చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ జోస్ బట్లర్ (42 బంతుల్లో 45; 5 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్‌లో బట్లర్ మినహాయించి ఎవరూ పెద్దగా రాణించలేదు. మాడ్సన్ (22), సాల్ట్ (17), పాల్ వాల్టర్ (12), ఓవర్టన్ (0) రెండంకెల స్కోర్లు చేయగా.. లారీ ఈవాన్స్ (2), టామ్ హార్ట్లీ (2), హ్యారీసన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమతమయ్యారు. బ్రేవ్ బౌలర్లలో తైమాల్ మిల్స్ 3 వికెట్లు పడగొట్టగా.. రెహాన్ అహ్మద్ 2, క్రిస్ జోర్డన్, అకెర్‌మ్యాన్ తలో వికెట్ దక్కించుకున్నారు. A knock which put the Southern Brave into #TheHundred Eliminator 🙌 How good was this man today? pic.twitter.com/1hxlAuxdok — The Hundred (@thehundred) August 23, 2023 రెచ్చిపోయిన కాన్వే.. 131 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ డెవాన్ కాన్వే (40 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) రెచ్చిపోవడంతో బ్రేవ్ మరో 5 బంతులు మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ జేమ్స్ విన్స్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్), ఆకెర్మ్యాన్ (21 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు), ఫిన్ అలెన్ (4 బంతుల్లో 14; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించగా.. డు ప్లూయ్ (2), వెథర్లీ (0) విఫలమయ్యారు. ఒరిజినల్స్ బౌలర్లలో జమాన్ ఖాన్ 2, జోష్ టంగ్, ఆస్టన్ టర్నర్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, హండ్రెడ్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఇదివరకే ఫైనల్‌కు చేరుకుంది. మరో బెర్త్ కోసం మాంచెస్టర్ ఒరిజినల్స్, సథరన్ బ్రేవ్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది. మిగతా జట్లన్నీ ఎలిమినేట్ అయ్యాయి. -
క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్.. వీడియో వైరల్!
ది హండ్రడ్ లీగ్‌లో ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ నార్తెర్న్ సూపర్ చార్జర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో భాగంగా మంగళవారం వెల్ష్ ఫైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. బౌండరీ లైన్ దగ్గర బ్రూక్ విన్యాసాలకు అందరూ ఫిదా అయిపోయారు. ఏం జరిగిందంటే..? వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో బ్రిడన్ కేర్స్ వేసిన 84వ బంతిని జానీ బెయిర్ స్టో మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఉన్న హ్యారీ బ్రూక్ జంప్ చేస్తూ ఒంటి కాలితో బంతిని అందుకున్నాడు. కానీ బ్యాలన్స్ కోల్పోయిన అతడు వెంటనే చాకచక్యంగా బంతిని గాల్లోకి లేపి మళ్లీ బౌండర్ రోప్ లోపలకి వచ్చి బంతిని అందుకున్నాడు. అయితే మళ్లీ బ్యాలెన్స్ కోల్పోవడంతో బంతిని మైదానంలో విసిరేశాడు. ఈ క్రమంలో అప్పటికే బౌండరీ లైన్ వద్దకు చేరుకున్న మరో ఫీల్డర్ హోస్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన జానీ బెయిర్ స్టో(44) బిత్తరపోయాడు. ప్రస్తతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇదే మ్యాచ్‌లో బ్రూక్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. బ్రూక్ కేవలం 41 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డులెక్కాడు. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. చదవండి: APL 2023: అదరగొట్టిన ప్రణీత్.. 8 వికెట్ల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం What a catch by Harry Brook! pic.twitter.com/QQUYZEnBOD — Mufaddal Vohra (@mufaddal_vohra) August 23, 2023 -
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు
ఇంగ్లండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL), పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL), ద హండ్రెడ్ లీగ్ (THL)ల్లో సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. బ్రూక్‌కు ముందు ఈ మూడు లీగ్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాడే లేడు. హండ్రెడ్ లీగ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన బ్రూక్ నిన్న (ఆగస్ట్ 22) వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో (42 బంతులు 105; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) కదంతొక్కాడు. ఈ సెంచరీ హండ్రెడ్ లీగ్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ (41) కావడం విశేషం. దీనికి ముందు బ్రూక్ 2023 ఐపీఎల్ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై శతకం (55 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) బాదాడు. ఈ సెంచరీతో బ్రూక్ సన్‌రైజర్స్ యంగెస్ట్ సెంచూరియన్గానూ రికార్డుల్లోకెక్కాడు. 2023 ఐపీఎల్‌కు ముందు సన్‌రైజర్స్ బ్రూక్‌ను 13.25 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. పై పేర్కొన్న మూడు లీగ్‌ల్లో (ఐపీఎల్, పీఎస్ఎల్, హండ్రెడ్) బ్రూక్ తన తొలి సెంచరీని పీఎస్ఎల్లో సాధించాడు. 2022 పీఎస్ఎల్లో బ్రూక్, లాహోర్ ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ.. ఇస్లామాబాద్ యునైటెడ్‌పై శతక్కొట్టాడు (49 బంతుల్లో 102 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు). ఓవరాల్‌గా బ్రూక్ కెరీర్ చూసుకుంటే, 2022 జనవరిలో విండీస్‌తో జరిగిన టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 12 టెస్ట్‌ల్లో 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలతో 1181 పరుగులు.. 3 వన్డేల్లో ఫిఫ్టి సాయంతో 86 పరుగులు, 20 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 372 పరుగులు చేశాడు. బ్రూక్ ఐపీఎల్లో సన్‌రైజర్స్ తరఫున 11 మ్యాచ్‌ల్లో సెంచరీ సాయంతో 190 పరుగులు చేశాడు. -
హ్యారీ బ్రూక్ ఊచకోత.. ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు
హండ్రెడ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాడు, ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ఈ ఫీట్ సాధించాడు. వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 22) జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. హండ్రెడ్ లీగ్ హిస్టరీలోనే ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. బ్రూక్ తన ఇన్నింగ్స్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 105 పరుగులు చేశాడు. కేవలం ముగ్గురు మాత్రమే.. హండ్రెడ్ లీగ్‌లో చరిత్రలో (పురుషుల ఎడిషన్‌లో) ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే సెంచరీ మార్కును అందుకోగా.. బ్రూక్‌దే ఫాస్టెప్ట్ సెంచరీగా రికార్డైంది. 2022 సీజన్లో విల్ జాక్స్ (47 బంతుల్లో) (48 బంతుల్లో 108 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్సర్లు), విల్ స్మీడ్ (49 బంతుల్లో) (50 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీలు చేయగా, బ్రూకే అతి తక్కువ బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. హండ్రెడ్ లీగ్‌లో అత్యధిక స్కోర్.. హండ్రెడ్ లీగ్‌లో బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసినప్పటికీ, ఈ లీగ్‌లో అత్యధిక స్కోర్ (ఏకైక సెంచరీ) రికార్డు మాత్రం మహిళా క్రికెటర్ పేరిట నమోదై ఉంది. ప్రస్తుత సీజన్లో వెల్ష్ ఫైర్ ప్లేయర్ ట్యామీ బేమౌంట్ ట్రెంట్ రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. ఓవరాల్‌గా హండ్రెడ్ లీగ్‌లో ఇదే అత్యుత్తమ స్కోర్‌గా రికార్డైంది. Every. Ball. Counts. Harry Brook has done it 💥#TheHundred pic.twitter.com/iCC6FbKVkG — The Hundred (@thehundred) August 22, 2023 బ్రూక్ సెంచరీ వృధా.. వెల్ష్ ఫైర్‌పై బ్రూక్ ఫాస్టెస్ట్ సెంచరీతో విరుచుకుపడినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను ప్రాతినిథ్యం వహించిన నార్త్రన్ సూపర్ ఛార్జర్స్.. వెల్ష్ ఫైర్ చేతిలో ఓటమిపాలై లీగ్ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ ఛార్జర్స్.. బ్రూక్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో బ్రూక్ (మూడంకెల స్కోర్), ఆడమ్ హోస్ (15) మినహా మిగతావారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లీ 2, మ్యాట్ హెన్రీ, డేవిడ్ పెయిన్, వాన్ డర్ మెర్వ్, వెల్స్ తలో వికెట్ పడగొట్టారు. What a knock! 💥 Stephen Eskinazi scored the third-fastest fifty of the men's competition. 👏#TheHundred pic.twitter.com/pJqc1hXspG — The Hundred (@thehundred) August 23, 2023 విధ్వంసం సృష్టించిన వెల్ష్ ఫైర్ ప్లేయర్లు.. 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెల్ష్ ఫైర్ ప్లేయర్లు విధ్వంసం సృష్టించారు. స్టెఫెన్ ఎస్కినాజీ (28 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (39 బంతుల్లో 44; ఫోర్, 3 సిక్సర్లు), జో క్లార్క్ (22 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి, తమ జట్టును 90 బంతుల్లోనే (2 వికెట్లు కోల్పోయి) విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా వెల్ష్ ఫైర్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రూక్ విధ్వంసకర శతకం బూడిదలో పోసిన పన్నీరైంది. -
శివాలెత్తిన సామ్ బిల్లింగ్స్.. హండ్రెడ్ లీగ్ ఫైనల్లో ఓవల్ ఇన్విన్సిబుల్స్
హండ్రెడ్ లీగ్ 2023 ఎడిషన్ తుది అంకానికి చేరుకుంది. ఓ ఫైనల్ బెర్త్ ఖరారైంది. నిన్న (ఆగస్ట్ 21) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్‌పై విజయం సాధించడంతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ తుది పోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మరో 3 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నప్పటికీ పాయింట్ల ఆధారంగా (8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింటుల) ఇన్విన్సిబుల్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. బర్మింగ్హమ్ ఫీనిక్స్, నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఇదివరకే లీగ్ నుంచి ఎలిమినేట్ కాగా, మరో ఫైనల్ బెర్త్ కోసం మాంచెస్టర్స్ ఒరిజినల్స్, ట్రెంట్ రాకెట్స్, సథరన్ బ్రేవ్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్.. కొలిన్ మున్రో (25 బంతుల్లో 36; ఫోర్, 3 సిక్సర్లు), గ్రెగరీ (24 బంతుల్లో 35; 4 ఫోర్లు), డేనియల్ సామ్స్ (9 బంతుల్లో 19నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓవల్ బౌలర్లలో టామ్ కర్రన్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. స్పెన్సర్ జాన్సన్, అట్కిన్సన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు. శివాలెత్తిన సామ్ బిల్లింగ్స్.. 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓవల్ టీమ్.. మరో 8 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓవల్ కెప్టెన్ సామ్ బిల్లింగ్స్ (40 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. అతనికి జేసన్ రాయ్ (19), విల్ జాక్స్ (31), టామ్ కర్రన్ (18 నాటౌట్) సహకరించారు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, లూక్ వుడ్, సామ్ కుక్, మాథ్యూ కార్టర్ తలో వికెట్ పడగొట్టారు. -
రసవత్తర పోరు.. ఆఖర్లో హైడ్రామా.. ఎట్టకేలకు గెలిపించిన సామ్ కర్రన్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్‌తో నిన్న (ఆగస్ట్ 15) జరిగిన రసవత్తర పోరులో ఓవల్ ఇన్విన్సిబుల్స్ స్వల్ప తేడాతో గటెక్కింది. ఇన్విన్సిబుల్స్ నిర్ధేశించిన లక్ష్యానికి లండన్ స్పిరిట్ 3 పరుగుల దూరంలో నిలిచిపోయి, ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (18 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్), విల్ జాక్స్ (42 బంతుల్లో 68; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 46 నాటౌట్; ఫోర్, 4 సిక్సర్లు), సామ్ కర్రన్ (17 బంతుల్లో 35; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. లండన్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్, డారిల్ మిచెల్ తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లండన్ టీమ్.. ఆఖరి బంతి వరకు పోరాడి స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. సామ్ కర్రన్ వేసిన 98వ బంతిని క్రిచ్లీ సిక్సర్ బాది లండన్ గెలుపుపై ఆశలు చిగురింపజేయగా.. ఆఖరి బంతికి డాట్ బాల్ వేసి సామ్ కర్రన్ లండన్ విజయావకాశాలపై నీళ్లు చల్లాడు. ఈ మధ్యలో పెద్ద డ్రామా జరిగింది. లండన్ 2 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన దశలో వైట్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో బౌండరీకి వెళ్లాల్సిన బంతిని అడ్డుకుని 2 పరుగులు సేవ్ చేయగా, ఆఖరి బంతిని కర్రన్ నో బాల్ వేసి మళ్లీ లండన్ శిబిరంలో ఆశలు రేకెత్తించాడు. ఈ బంతికి క్రిచ్లీ రెండు పరుగు రాబట్టడంతో పాటు నో బాల్ ఫలితంగా లండన్‌కు అదనంగా మరో పరుగు, ఫ్రీ హిట్ లభించాయి. దీంతో ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సామ్ కర్రన్ ఆఖరి బంతిని అద్భుతమై యార్కర్‌గా సంధించడంతో లండన్ గెలుపు ఆశలు ఆవిరయ్యాయి. ఫలింతగా ఇన్విన్సిబుల్స్ రసవత్తర పోరులో విజయం సాధించింది. లండన్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ రొస్సింగ్టన్ (61) టాప్ స్కోరర్‌గా నిలువగా.. ఆఖర్లో మాథ్యూ క్రిచ్లీ (13 బంతుల్లో 32 నాటౌట్) ఇన్విన్సిబుల్స్ ఆటగాళ్లకు చమటలు పట్టించాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో విల్ జాక్స్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ చాపెల్, సామ్ కర్రన్, నాథన్ సౌటర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
హండ్రెడ్ లీగ్‌లో చారిత్రక శతకం.. ఇంగ్లండ్ ఓపెనర్ ఖాతాలో రికార్డు
హండ్రెడ్ లీగ్‌లో చారిత్రక శతకం నమోదైంది. ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ ట్యామీ బేమౌంట్ లీగ్ హిస్టరీలోనే (పురుషులు, మహిళలు) అత్యధిక స్కోర్ (118) నమోదు చేసింది. ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట 14) జరిగిన మ్యాచ్‌లో వెల్ష్‌ఫైర్ ఓపెనర్ బేమౌంట్ 61 బంతుల్లో 20 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసింది. హండ్రెడ్ లీగ్ పురుషులు, మహిళల విభాగాల్లో ఇదే అత్యధిక స్కోర్ కాగా.. ఈ లీగ్ మహిళల విభాగంలో ఇదే మొట్టమొదటి సెంచరీ కావడం విశేషం. బేమౌంట్.. ఓవల్ ఇన్విన్సిబుల్ ఆటగాడు, ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ అత్యధిక స్కోర్ (108) రికార్డును బద్దలుకొట్టి లీగ్ రికార్డ్స్‌లో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకుంది. రాకెట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్.. బేమౌంట్ శతక్కొట్టడంతో నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 181 పరుగుల భారీ స్కోర్ చేసింది. మహిళల హండ్రెడ్ లీగ్‌లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్ కావడం మరో విశేషం. వెల్ష్ ఫైర్ ఇన్నింగ్స్‌లో బేమౌంట్ రికార్డు సెంచరీతో కదం తొక్కగా.. డంక్లీ (24), సారా బ్రైస్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాకెట్స్ బౌలర్లలో క్రీస్టీ గార్డన్ 2, అలానా కింగ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. ఫ్రేయా డేవిస్ (2/19), అలెక్స్ హార్ట్లీ (1/28), షబ్నిమ్ ఇస్మాయిల్ (1/23), సోఫియా డంక్లీ (1/16) రాణించడంతో 100 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా వెల్ష్ ఫైర్ 41 పరుగుల తేడాతో గెలపొంది, పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. రాకెట్స్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ స్మిత్ (48) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లిజెల్ లీ (26), హర్మాన్‌ప్రీత్ కౌర్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
చెలరేగిన కొలిన్ మున్రో.. చేతులెత్తేసిన మలాన్, హేల్స్, రూట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్ ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో ట్రెంట్ రాకెట్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాకెట్స్.. కొలిన్ మున్రో మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 100 బంతుల్లో 6 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. మున్రో మినహా రాకెట్స్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. రాకెట్స్ టీమ్‌లో డేవిడ్ మలాన్ (10), అలెక్స్ హేల్స్ (4), జో రూట్ (14), డేనియల్ సామ్స్ (17) లాంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నా ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. వెల్ష్ ఫైర్ బౌలర్లలో డేవిడ్ విల్లే, జేక్ బాల్, వాన్ డర్ మెర్వ్ తలో 2 వికెట్లు పడగొట్టారు. రాణించిన జో క్లార్క్.. 153 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెల్ష్‌ఫైర్.. 6 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. జో క్లార్క్ (54), కెప్టెన్ టామ్ ఎబెల్ (32) వెల్ష్ఫైర్ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వెల్ష్ ఫైర్ స్టార్ ఆటగాళ్లు జానీ బెయిర్‌స్టో (9 బంతుల్లో 3), గ్లెన్ ఫిలప్స్ (12) విఫలమయ్యారు. స్టెఫెన్ ఎస్కినాజీ (25) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. రాకెట్స్ బౌలర్లలో డేనియల్ సామ్స్ 2, జాన్ టర్నర్, ఐష్ సోధి తలో వికెట్ పడగొట్టారు. -
ఇంగ్లండ్ బౌలర్ విధ్వంసం.. 30 బంతుల్లోనే..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా నార్త్రన్ సూపర్ ఛార్జర్స్‌తో నిన్న (ఆగస్ట్ 13) జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్, ఒరిజినల్స్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ (30 బంతుల్లో 83; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) ఆడి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. Manchester Originals have won the derby 👊 Which player impressed you the most?#TheHundred pic.twitter.com/RLudfitjnD — The Hundred (@thehundred) August 13, 2023 అతనికి లారీ ఈవాన్స్ (18 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఒరిజినల్స్ 90 బంతుల్లో (వర్షం అంతరాయం కారణంగా 90 బంతుల మ్యాచ్‌గా అంపైర్లు నిర్ణయించారు) 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఒరిజినల్స్ ఇన్నింగ్స్‌లో ఓవర్టన్, ఈవాన్స్తో పాటు పాల్ వాల్టర్ (22; 4 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్ చేయగా.. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు రీస్ టాప్లే 3, బ్రైడన్ కార్స్, పార్కిన్సన్, ఆదిల్ రషీద్ తలో వికెట్ పడగొట్టారు. The highest men's total for a Manchester Original player 🙌#TheHundred pic.twitter.com/RpRsNNOt7j — The Hundred (@thehundred) August 13, 2023 అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 90 బంతుల్లో 9 వికెట్ల నష్టానికి 141 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఒరిజినల్స్ బౌలర్లు ఉసామా మిర్ (4/19), జాషువ లిటిల్ (2/33) సూపర్ ఛార్జర్స్‌ను దారుణంగా దెబ్బకొట్టారు. వీరికి జోష్ టంగ్ (1/25), టామ్ హార్ట్లీ (1/9), పాల్ వాల్డర్ (1/26) తోడవ్వడంతో సూపర్ఛార్జర్స్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. సూపర్ ఛార్జర్స్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ (37), సైఫ్ జైబ్ (21), హ్యారీ బ్రూక్ (20) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. Well, that was incredible... 👀#TheHundred pic.twitter.com/KBXmSj7nls — The Hundred (@thehundred) August 13, 2023 -
రఫ్ఫాడించిన జో రూట్.. అయినా..!
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ 2 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. జో రూట్ చివరి వరకు ప్రయత్నించినప్పటికీ రాకెట్స్‌ను గెలిపించలేకపోయాడు. చెలరేగిన లారెన్స్.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్.. కెప్టెన్ డేనియల్ లారెన్స్ (49 బంతుల్లో 93; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. లారెన్స్‌తో పాటు జాక్ క్రాలే (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, సిక్స్), డారిల్ మిచెల్ (17 బంతుల్లో 21 నాటౌట్; ఫోర్), రవి బొపారా (13 బంతుల్లో 25 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) రాణించారు. రాకెట్స్ బౌలర్లలో సామ్ కుక్, ఐష్ సోధి తలో 2 వికెట్లు పడగొట్టారు. రూట్ పోరాటం వృధా.. 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. విధ్వంసకర వీరులు రాకెట్స్ ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (15), డేవిడ్ మలాన్ (1) స్వల్ప స్కోర్లకే ఔట్ కాగా.. రూట్ (35 బంతుల్లో 72 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు).. టామ్ కొహ్లెర్ (23 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), కొలిన్ మున్రో (15 బంతుల్లో 24; 3 ఫోర్లు), డేనియల్ సామ్స్ (11 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సాయంతో రాకెట్స్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. లండన్ బౌలర్లలో డేనియల్ వారెల్, లియామ్ డాసన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ ఎల్లిస్ ఓ వికెట్ తీశాడు. -
నిప్పులు చెరిగిన టైమాల్ మిల్స్.. "హ్యాట్రిక్" వికెట్లు.. నలుగురు డకౌట్లు
పురుషుల హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్‌ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్.. టైమాల్ మిల్స్ (20-9-12-4), జార్జ్ గార్టన్ (15-9-8-3), క్రెయిగ్ ఓవర్టన్ (20-13-19-2), ఫిషర్ (20-10-24-1) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 87 పరుగులకు ఆలౌటైంది. టైమాల్ మిల్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో ప్టీవీ ఎస్కినాజీ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గ్లెన్ ఫిలిప్స్ (12), డేవిడ్ విల్లే (16), బెన్ గ్రీన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, వికెట్ కీపర్ జో క్లార్క్, హరీస్ రౌఫ్, డేవిడ్ పేన్ డకౌట్లయ్యారు. As it stands! 👇#TheHundred pic.twitter.com/cQMVSxwo0M — The Hundred (@thehundred) August 12, 2023 రాణించిన కాన్వే.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. కేవలం 59 బంతుల్లో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ బ్యాటర్లు ఫిన్ అలెన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 31 పరుగులు చేసి పేన్ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. డెవాన్ కాన్వే (25 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ డు ప్లూయ్ (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) అజేయంగా నిలిచారు. What a final 5️⃣ balls from Tymal Mills! 😮#TheHundred pic.twitter.com/E4g6HNaD2n — The Hundred (@thehundred) August 12, 2023 -
సన్‌రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే!
ది హాండ్రడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టు తమ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగంగా నార్త్రన్ సూపర్ఛార్జర్స్తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఓవల్ ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కాక్స్, క్లాసెన్ మెరుపులు.. ఇన్విన్సిబుల్స్ బ్యాటర్లలో యువ ఆటగాడు జోర్డాన్ కాక్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కాక్స్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాక్స్‌తో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రిస్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 22 బంతుల్లోనే 6 సిక్స్‌లు సాయంతో 46 పరుగులు చేశాడు. నార్త్రన్ సూపర్ఛార్జర్స్ బౌలర్లలో పార్నెల్ రెండు వికెట్లు, అదిల్ రషీద్, టోప్లీ తలా వికెట్ సాధించారు. పోరాడి ఓడిన సూపర్ఛార్జర్స్ 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ టామ్ బాంటన్(43 బంతుల్లో 81 పరుగులు, 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) సంచలన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో గుస్ అట్కిన్సన్ మూడు వికెట్లు, సామ్ కుర్రాన్ రెండు, జాన్సన్, సునీల్ నరైన్ తలా వికెట్ సాధించారు. చదవండి: మరో విజయంపై టీమిండియా గురి.. నేడే నాలుగో టీ20 -
చెలరేగిన డేవిడ్ వీస్.. తుస్సుమన్న విధ్వంసకర వీరులు
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా ట్రెంట్ రాకెట్స్‌తో నిన్న (ఆగస్ట్ 9) జరిగిన మ్యాచ్‌లో నార్త్ర్న్ సూపర్ ఛార్జర్స్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ చెలరేగిపోయాడు. 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన అర్ధశతకం సాధించాడు. అతనికి బ్రైడన్ కార్స్ (29 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), సైఫ్ జైబ్ (21 బంతుల్లో 21; ఫోర్), ఆడమ్ హోస్ (17 బంతుల్లో 18; 3 ఫోర్లు) జత కలవడంతో సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. Luke Wood's first 10 balls were something else! 🚀#TheHundred pic.twitter.com/SZWNvcn26V — The Hundred (@thehundred) August 10, 2023 నిప్పులు చెరిగిన లూక్ వుడ్.. సూపర్ ఛార్జర్స్ హిట్టర్లు టామ్ బాంటన్ (0), మాథ్యూ షార్ట్ (8), హ్యారీ బ్రూక్ (0).. రాకెట్స్ పేసర్ లూక్ వుడ్ ధాటికి వణికిపోయారు. తొలి 6 బంతుల్లోనే వీరు ముగ్గురు పెవిలియన్‌కు చేరారు. వుడ్ ఈ ముగ్గురిని క్లీన్ బౌల్డ్ చేశాడు. వుడ్ 20 బంతుల్లో 23 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొడితే.. జో రూట్ 20 బంతుల్లో 24 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. David Wiese 🤝 powerful hitting Insane crowd catch incoming... #TheHundred pic.twitter.com/Gn2MWUNyNW — The Hundred (@thehundred) August 9, 2023 తుస్సుమన్న విధ్వంసకర వీరులు.. అనంతరం 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాకెట్స్.. నిర్ణీత బంతుల్లో 139 పరుగులు చేసి 3 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. విధ్వంసకర వీరులైన రాకెట్స్ బ్యాటర్లు అలెక్స్ హేల్స్ (29), డేవిడ్ మలాన్ (6), కొలిన్ మున్రో (15), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (15), జో రూట్ (4), సామ్ హెయిన్ (20), డేనియల్ సామ్స్ (27).. సూపర్ ఛార్జర్స్ బౌలర్లు వేన్ పార్నెల్ (3/21), రీస్ టాప్లే (2/20), కల్లమ్ పార్కిన్సన్ (2/29) ధాటికి తేలిపోయారు. ప్రపంచ క్రికెట్లో విధ్వంసకర వీరులుగా పేరున్న రాకెట్స్ బ్యాటర్లు.. సూపర్ ఛార్జర్స్ నిర్ధేశించిన సాధారణ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలయ్యారు. 🚨JOE ROOT STRIKES FOR THE TRENT ROCKETS 🚨#TheHundred pic.twitter.com/JVcWq6nSeZ — The Hundred (@thehundred) August 9, 2023 -
ఆసీస్ యువ పేసర్ సంచలనం.. 20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు! వీడియో
Oval Invincibles won by 94 runs- Jason Roy- Heinrich Klaasen: ఆస్ట్రేలియా యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ది హండ్రెడ్ లీగ్‌లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ హండ్రెడ్ లీగ్‌లో జాన్సన్ ఓవల్ ఇన్విసిబుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20 డెలివరీల్లో 19 డాట్ బాల్స్ వేసి సంచలనం సృష్టించాడు. మాంచెస్టర్ బ్యాటర్ జోస్ బట్లర్.. జాన్సన్ వేసిన షార్ట్ బంతిని డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా ఆడి అతడి బౌలింగ్‌లో ఆ ఒక్క సింగిల్‌కు కారణమయ్యాడు. వేసిన పదకొండో బంతికి ఉసామా మిర్‌ను అవుట్ చేసితొలి వికెట్ తీసిన జాన్సన్.. ఆ తర్వాత టామ్ హార్ట్లీ, జాషువా లిటిల్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఓవల్ ఇన్విసిబుల్ బౌలర్లు గస్ అట్కిన్సన్ రెండు, నాథన్ సోవటెర్ రెండేసి వికెట్లు తీయగా.. స్పెన్సర్ జాన్సర్తో పాటు సునిల్ నరైన్ మూడు వికెట్లు పడగొట్టాడు. సొంతమైదానంలో ఓవల్ బౌలర్ల విజృంభణతో పర్యాటక మాంచెస్టర్ జట్టు 89 బంతులాడి 92 పరుగులకే కుప్పకూలింది. దీంతో.. జేసన్ రాయ్(59), హెన్రిచ్ క్లాసెన్(60) అర్ధ శతకాలతో మెరవడంతో 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసిన ఓవల్ జట్టు భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో మాంచెస్టర్‌పై 94 పరుగుల తేడాతో నెగ్గింది. చదవండి: శ్రేయస్ అయ్యర్ దూరం.. తిలక్ వర్మకు అవకాశం.. అలా అయితే..! Spencer Johnson's 3️⃣ wickets 🔥#TheHundred pic.twitter.com/kyQwS35BOC — The Hundred (@thehundred) August 9, 2023 -
మాథ్యూ షార్ట్ విధ్వంసం.. హ్యారీ బ్రూక్ ఊచకోత
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా సథరన్ బ్రేవ్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగుతున్న మ్యాచ్‌లో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ ఆటగాళ్లు మాథ్యూ షార్ట్, హ్యారీ బ్రూక్ శివాలెత్తిపోయారు. ఓపెనర్‌గా వచ్చిన షార్ట్ (36 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 73 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. హ్యారీ బ్రూక్ (27 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. Stop what you're doing and watch THIS 🤯#TheHundred pic.twitter.com/3S56KdtbyQ — The Hundred (@thehundred) August 6, 2023 వీరిద్దరికి టామ్ బాంటన్ (34 బంతుల్లో 44; 4 ఫోర్లు, సిక్స్) కూడా తోడవ్వడంతో నార్త్రన్ సూపర్ ఛార్జర్స్ నిర్ణీత 100 బంతుల్లో 3 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. బ్రేవ్స్ బౌలర్లలో రెహాన్ అహ్మద్, తైమాల్ మిల్స్ తలో వికెట్ పడగొట్టి కాస్త పొదుపుగా బౌలింగ్ చేయగా, మిగతా బౌలర్లంతా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. హండ్రెడ్ లీగ్ చరిత్రలో ఈ మ్యాచ్‌లో సూపర్ ఛార్జర్స్ చేసిన స్కోరే (201) అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. 2021 ఎడిషన్‌లో ఇదే సూపర్ ఛార్జర్స్ చేసిన 200 స్కోర్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు టాప్ స్కోర్‌గా ఉండింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సథరన్ బ్రేవ్స్.. 48 బంతుల తర్వాత 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. డెవాన్ కాన్వే (15), ఫిన్ అలెన్ (10) ఔట్ కాగా.. జేమ్స్ విన్స్ (32), డు ప్ల్యూయ్ (2) క్రీజ్‌లో ఉన్నారు. -
ఉతికి ఆరేసిన బట్లర్.. మెరిసిన సాల్ట్
హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా లండన్ స్పిరిట్‌తో ఇవాళ (ఆగస్ట్ 5) జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ చెలరేగి ఆడాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు పూనకం వచ్చినట్లు ఊగిపోయిన బట్లర్.. ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది, రవి బొపారా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 🌶 @josbuttler is in the mood! 😮💨#TheHundred pic.twitter.com/9IRiMKqCmA — The Hundred (@thehundred) August 5, 2023 మరో ఎండ్‌లో ఫిలిప్ సాల్ట్ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఒరిజినల్స్ 80 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలుకావడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపి వేశారు. ఒరిజినల్స్ ఇన్నింగ్స్‌లో బట్లర్, సాల్ట్‌తో పాటు మ్యాక్స్ హోల్డన్ (24; 3 ఫోర్లు) రాణించగా.. లారీ ఈవాన్స్ (1), పాల్ వాల్టర్ (2) నిరాశపరిచారు. ఆస్టన్ టర్నర్ (16), జేమీ ఓవర్టన్ (2) క్రీజ్‌లో ఉన్నారు. Things that should come with a content warning: ⚠️ @josbuttler striking the ball like this to reach his 50 ⚠️#TheHundred pic.twitter.com/uLXbdkVdZz — The Hundred (@thehundred) August 5, 2023 లండన్ బౌలర్లలో రవి బొపారా 2 వికెట్లు పడగొట్టగా.. డేనియల్ వార్రెల్, లియామ్ డాసన్, మాథ్యూ క్రిచ్లీ తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, హండ్రెడ్ లీగ్ ప్రస్తుత ఎడిషన్‌లో బట్లర్‌కు ఇది తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. బట్లర్ ఫామ్‌లోని రావడంతో అతని అభిమానులు సంబురపడిపోతున్నారు. బట్లర్ ఇలాగే భారీ షాట్లు ఆడుతూ తమను అలరించాలని కోరుకుంటున్నారు. ఈ మ్యాచ్‌లో బట్లర్ ఆడిన భారీ షాట్లకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి. Jos Buttler smashed his first fifty of the Hundred season 🔥#Hundred pic.twitter.com/HMcyWQI0Ot — CricTracker (@Cricketracker) August 5, 2023