
పాకిస్తాన్ ఆటగాళ్లు, మామ అల్లుళ్లు షాహిద్ అఫ్రిది, షాహీన్ అఫ్రిదిలు వేర్వేరు క్రికెట్ లీగ్‌ల్లో ఒకే రోజు (ఆగస్ట్ 2) బంతితో రాణించారు. మామ షాహిద్ అఫ్రిది గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో సత్తా చాటితే.. ఆల్లుడు షాహీన్ అఫ్రిది ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న హండ్రెడ్ లీగ్‌లో ఇరగదీశాడు.
మెన్స్ హండ్రెడ్ లీగ్‌లో భాగంగా మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ అఫ్రిది 10 బంతులు వేసి 2 వికెట్లు పడగొట్టగా.. గ్లోబల్ టీ20 లీగ్‌లో వాంకోవర్ నైట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది 4 ఓవర్లు వేసి కేవలం 16 మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇద్దరు అఫ్రిదిలు వికెట్లు పడగొట్టాక ఒకే తరహాలో చేసుకున్న సెలబ్రేషన్స్ ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. షాహిద్, షాహీన్‌లు వికెట్ పడగొట్టాక రెండు చేతులు పైకి లేపి అచ్చు గుద్దినట్లు సంబురాలు చేసుకున్నారు.
కాగా, మామ అల్లుళ్లు ఒకే రోజు ఒకే తరహాలో సెలబ్రేషన్స్ చేసుకున్నప్పటికీ.. ఒక్కరు మాత్రమే జట్టు విజయంలో భాగమయ్యారు. షాహీన్ జట్టు వెల్ష్‌ఫైర్.. మాంచెస్టర్ ఒరిజినల్స్‌పై 9 పరుగుల తేడాతో గెలుపొందగా.. షాహిద్ జట్టు టొరొంటో నేషనల్స్.. వాంకోవర్ నైట్స్ చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మాంచెస్టర్ ఒరిజినల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లతో రాణించిన షాహీన్.. ఆతర్వాత తాను వేసిన 5, 6, 7, 8, 10 బంతులకు బౌండరీలు సమర్పించుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment