పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్‌కు ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీ ది హండ్రెడ్ డ్రాఫ్ట్‌లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.
దీంతో వీరిద్దరూ ది హండ్రెడ్ లీగ్ డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని ఆటగాళ్లగా మిగిలిపోయారు. టీ20ల్లో వరల్డ్ నెం2, నెం3 ఆటగాళ్లైనా బాబర్, రిజ్వాన్‌ను ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయకపోవడం నిజంగా వారికి ఇది ఘోర పరాభావం అనే చెప్పుకోవాలి.
వీరితో పాటు ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, ట్రెంట్ బౌల్ట్‌ను కూడా ఏ ప్రాంచైజీ కొనుగోలు చేయలేదు. కాగా ఈ డ్రాఫ్ట్‌లో ఎనిమిది జట్లకు 30 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. అయితే ఈ డ్రాఫ్ట్‌లో బాబర్, రిజ్వాన్‌కు ఘోర అవమానం జరిగినప్పటికీ.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌లు మాత్రం అమ్ముడుపోయారు.
షాహీన్ ఆఫ్రిదీని ఏకంగా లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది. హరీస్ రౌఫ్‌ను కూడా వెల్ష్ ఫైర్ ప్రాంచైజీనే కొనుగోలు చేసింది. ఇక సునీల్ నరైన్, వానిందు హసరంగ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, రషీద్ ఖాన్, నాథన్ ఎల్లీస్, షాదబ్ ఖాన్, ఆడమ్ మిల్నే, కోలిన్ మున్రో, కేన్ రిచర్డ్‌సన్, డానియల్ సామ్స్, జోష్ లిటిల్, వేన్ పార్నెల్ వంటి ఆటగాళ్లకు ది హండ్రెడ్ లీగ్-2023 డ్రాఫ్ట్‌లో చోటు దక్కింది. ఇక ది హండ్రెడ్ లీగ్-2023 ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IPL 2023: ఐపీఎల్‌కు దూరమైనా పంత్‌కు అరుదైన గౌరవం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment