పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌లకు మరోసారి ఘోర అవమానం ఎదురైంది. ఇంగ్లండ్ ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో వరుసగా మూడోసారి ఈ పాక్ స్టార్ క్రికెటర్లు అమ్ముడుపోలేదు.
ది హండ్రెడ్ లీగ్ 2024 సీజన్ డ్రాఫ్ట్‌లో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. వీరితో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ ఆటగాడు జాసన్ రాయ్, ఆసీస్ యువ సంచలనం టిమ్ డేవిడ్‌లు సైతం అమ్ముడు పోలేదు.
అయితే ఈ డ్రాఫ్ట్‌లో బాబర్, రిజ్వాన్‌ను ఎవరూ పట్టించుకో పోయినప్పటికి.. తమ సహాచర ఆటగాళ్లు షాహీన్ అఫ్రిది, నసీం షా, ఇమాద్ వసీం మాత్రం అమ్ముడుపోయారు. షాహీన్ ఆఫ్రిదీని లక్ష పౌండ్ల(పాకిస్తాన్ కరెన్సీలో 3 కోట్ల 48 లక్షల రూపాయలు)కు వెల్ష్ ఫైర్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది.
గత సీజన్‌లో కూడా షాహీన్.. వెల్ష్ ఫైర్ ప్రాంచైజీకే ప్రాతినిథ్యం వహించాడు. ఇమాద్ వసీంను ట్రెంట్ రాకెట్స్, నసీం షాను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ దక్కించుకుంది. కాగా ఈ డ్రాప్ట్‌లో వెస్టిండీస్ ఆటగాళ్లకు బారీ డిమాండ్ నెలకొంది. నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, హెట్‌మైర్ వంటి విండీస్ ఆటగాళ్లు తొలి రౌండ్‌లోనే అమ్ముడుపోయారు.
పూరన్‌ను నార్తర్న్ సూపర్ఛార్జర్స్ సెలక్ట్ చేసుకోగా.. ఆండ్రీ రస్సెల్, షిమ్రాన్ హెట్మెయర్ లండన్ స్పిరిట్‌కు ఆడనున్నారు. వీరితో పాటు విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సదరన్ బ్రేవ్ జట్టుకు, రోవ్‌మాన్ పావెల్ ట్రెంట్ రాకెట్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించనున్నారు.
మరోవైపు మహిళల ది హండ్రెడ్ లీగ్ డ్రాప్ట్‌లో భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అయితే భారత స్టార్ క్రికెటర్లు స్మృతి మంధాన, రిచ్ ఘోష్‌లను మాత్రం ఈ డ్రాప్ట్‌లో ఎంపికయ్యారు. మంధానను సదరన్ బ్రేవ్ సొంతం చేసుకోగా.. రిచా ఘోష్‌ను బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఎంపిక చేసింది.
Comments
Please login to add a commentAdd a comment