
పురుషుల హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్‌ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్.. టైమాల్ మిల్స్ (20-9-12-4), జార్జ్ గార్టన్ (15-9-8-3), క్రెయిగ్ ఓవర్టన్ (20-13-19-2), ఫిషర్ (20-10-24-1) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 87 పరుగులకు ఆలౌటైంది. టైమాల్ మిల్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో ప్టీవీ ఎస్కినాజీ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గ్లెన్ ఫిలిప్స్ (12), డేవిడ్ విల్లే (16), బెన్ గ్రీన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, వికెట్ కీపర్ జో క్లార్క్, హరీస్ రౌఫ్, డేవిడ్ పేన్ డకౌట్లయ్యారు.
As it stands! 👇#TheHundred pic.twitter.com/cQMVSxwo0M
— The Hundred (@thehundred) August 12, 2023
రాణించిన కాన్వే..
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. కేవలం 59 బంతుల్లో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ బ్యాటర్లు ఫిన్ అలెన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 31 పరుగులు చేసి పేన్ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. డెవాన్ కాన్వే (25 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ డు ప్లూయ్ (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) అజేయంగా నిలిచారు.
What a final 5️⃣ balls from Tymal Mills! 😮#TheHundred pic.twitter.com/E4g6HNaD2n
— The Hundred (@thehundred) August 12, 2023