Tymal Mills
-
నిప్పులు చెరిగిన టైమాల్ మిల్స్.. "హ్యాట్రిక్" వికెట్లు.. నలుగురు డకౌట్లు
పురుషుల హండ్రెడ్ లీగ్-2023లో భాగంగా వెల్ష్‌ఫైర్‌తో నిన్న (ఆగస్ట్ 12) జరిగిన మ్యాచ్‌లో సథరన్ బ్రేవ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెల్ష్‌ఫైర్.. టైమాల్ మిల్స్ (20-9-12-4), జార్జ్ గార్టన్ (15-9-8-3), క్రెయిగ్ ఓవర్టన్ (20-13-19-2), ఫిషర్ (20-10-24-1) ధాటికి నిర్ణీత 100 బంతుల్లో 87 పరుగులకు ఆలౌటైంది. టైమాల్ మిల్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. వెల్ష్‌ఫైర్ ఇన్నింగ్స్‌లో ప్టీవీ ఎస్కినాజీ (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. గ్లెన్ ఫిలిప్స్ (12), డేవిడ్ విల్లే (16), బెన్ గ్రీన్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, వికెట్ కీపర్ జో క్లార్క్, హరీస్ రౌఫ్, డేవిడ్ పేన్ డకౌట్లయ్యారు. As it stands! 👇#TheHundred pic.twitter.com/cQMVSxwo0M — The Hundred (@thehundred) August 12, 2023 రాణించిన కాన్వే.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రేవ్.. కేవలం 59 బంతుల్లో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. బ్రేవ్ బ్యాటర్లు ఫిన్ అలెన్ 22 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్ సాయంతో 31 పరుగులు చేసి పేన్ బౌలింగ్‌లో విల్లేకు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. డెవాన్ కాన్వే (25 బంతుల్లో 35 నాటౌట్; 5 ఫోర్లు), కెప్టెన్ డు ప్లూయ్ (12 బంతుల్లో 17 నాటౌట్; ఫోర్, సిక్స్) అజేయంగా నిలిచారు. What a final 5️⃣ balls from Tymal Mills! 😮#TheHundred pic.twitter.com/E4g6HNaD2n — The Hundred (@thehundred) August 12, 2023 -
క్రికెట్ చరిత్రలో ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్.. వీడియో వైరల్
క్రికెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ బెస్ట్ క్యాచ్ నమోదైంది. ససెక్స్ క్రికెటర్ బ్రాడ్ కర్రీ స్టన్నింగ్ ఫీట్ చేసి ఔరా అనిపించాడు. టి20 బ్లాస్ట్ క్రికెట్లో ఇది చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. లీగ్‌లో భాగంగా హంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హంప్‌షైర్ విజయానికి 11 బంతుల్లో 23 పరుగులు చేయాల్సి ఉంది. అప్పటికే క్రీజులో ఆల్‌రౌండర్ బెన్నీ హావెల్ 14 బంతుల్లోనే 25 పరుగులతో దాటిగా ఆడుతున్నాడు. 19వ ఓవర్ టైమల్ మిల్స్ వేశాడు. ఓవర్ రెండో బంతిని మిల్స్ ఫ్లాట్ డెలివరీ వేయగా.. క్రీజులో ఉన్న హావెల్ స్వీప్ షాట్ ఆడాడు. గాల్లోకి లేచిన బంతి నేరుగా స్టాండ్స్‌లో పడుతుందని.. ఇక లక్ష్యం 10 బంతుల్లో 17 పరుగులే అని అంతా భావించారు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ జరిగింది. బౌండరీ లైన్ వద్ద ఉన్న బ్రాడ్ కర్రీ పరిగెత్తుకుంటూ వచ్చి శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ గాల్లోకి అమాంతం లేచి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుత విన్యాసాన్ని మైదానంలోని ఆటగాళ్లు సహా ప్రేక్షకులు నోరెళ్లబెట్టి చూశారు. కర్రీ అందుకున్న క్యాచ్ క్రికెట్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాచ్‌గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. క్యాచ్‌తోనే కాదు బౌలింగ్‌తోనూ మెరిసిన బ్రాడ్ కర్రీ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కర్నీ స్టన్నింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. STOP WHAT YOU ARE DOING BRAD CURRIE HAS JUST TAKEN THE BEST CATCH OF ALL TIME 🤯#Blast23 pic.twitter.com/9tQTYmWxWI — Vitality Blast (@VitalityBlast) June 16, 2023 చదవండి: లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్ -
BBL 2022: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. వైదొలిగిన స్టార్ క్రికెటర్
Tymal Mills- Big Bash League: ‘‘భారమైన 11 రోజుల తర్వాత క్రిస్మస్ కోసం ఇలా ఇంటికి! ఆస్ట్రేలియా వెళ్లేందుకు మేము ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో మా చిన్నారి కూతురికి పక్షవాతం వచ్చింది. తన శరీరంలోని ఎడమభాగం పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్లింది. తను కోలుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళనపడ్డాం. అయితే, మా చిన్నారి దేవత.. కఠిన పరిస్థితులను అనతికాలంలోనే అధిగమించి అందరిని ఆశ్చర్యపరిచింది. తనను తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. కానీ, డిశ్చార్జ్ కావడానికి ముందు తను ఎంత వేదన అనుభవించిందో మాకు తెలుసు. ఇప్పుడైతే మేము సంతోషంగానే ఉన్నాం. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ ఇంగ్లండ్ క్రికెటర్ టైమల్ మిల్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యం బారిన పడిన తమ కూతురు కోలుకుందనే శుభవార్తను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. కాగా బిగ్‌బాష్ లీగ్ ఆడేందుకు టైమల్ మిల్స్ ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన సమయంలో అతడి రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్ వచ్చింది. ఈ విచారకర ఘటన నేపథ్యంలో మిల్స్ తను కుటుంబంతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ ఫాస్ట్‌బౌలర్ బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగాడు. కాగా 30 ఏళ్ల మిల్స్ ఈ సీజన్లో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. అయితే, దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్ పైన్ ఈ డిఫెండింగ్ చాంపియన్ తరఫున ఆడనున్నాడు. ఇక మిల్స్ సహా ఫిల్ సాల్ట్, లౌరీ ఎవాన్స్ తదితరులు వివిధ కారణాల దృష్ట్యా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పెర్త్ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడింది. చదవండి: Ind Vs Ban: పట్టుదల, శ్రమ.. అవునా?.. మంచిది! మరి కుల్దీప్ సంగతేంటి?! నెటిజన్ల ఫైర్ BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
T20 World Cup 2022: ఇంగ్లండ్ జట్టులోకి ముంబై ఇండియన్స్ బౌలర్
టీ20 వరల్డ్‌కప్-2022 ప్రారంభానికి ముందు అన్ని జట్లను గాయాల సమస్య వేధిస్తుంది. ఇండియా, శ్రీలంక, ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా.. ఇలా దాదాపు ప్రతి జట్టులో ఎవరో ఒకరు గాయాల బారిన పడుతూనే ఉన్నారు. దీంతో ఆయా జట్లు గాయపడిన వారిని రీప్లేస్ చేసే పనిలో బిజీగా ఉన్నాయి. తాజాగా ఇంగ్లండ్ జట్టు.. గాయపడి జట్టుకు దూరమైన తమ ప్రధాన పేసర్ రీస్ టాప్లే స్థానాన్ని భర్తీ చేసింది. టాప్లేకు రీప్లేస్‌మెంట్‌గా ముంబై ఇండియన్స్ బౌలర్ టైమాల్ మిల్స్ జట్టులోకి తీసుకొచ్చింది. మిల్స్‌కు ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం (బీబీఎల్) ఉన్నందున అతన్ని తొలి ప్రాధాన్యత కింద ఎంపిక చేసింది. టైమల్ మిల్స్.. ప్రపంచకప్ కోసం ఈసీబీ (ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు) ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్నాడు. కాగా, పాకిస్తాన్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు నెట్ ప్రాక్టీస్ చేసే సమయంలో టాప్లే గాయపడిన విషయం తెలిసిందే. స్కానింగ్‌లో టాప్లే కాలి మడమ చిట్లినట్లు తేలడంతో అతను జట్టుకు దూరమయ్యాడు. టాప్లే గాయం చాలా తీవ్రమైందని, శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, అతనికి ఆరు వారాల విశ్రాంతి అవసరమని ఈసీబీ తెలిపింది. వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌ను స్వదేశంలో 2-0 తేడాతో (3 మ్యాచ్‌ల టీ20 సిరీస్) మట్టికరిపించి జోరుమీదున్న ఇంగ్లండ్.. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. -
ముంబై ఇండియన్స్ జట్టులోకి యువ ఆటగాడు.. ఎవరీ ట్రిస్టన్ స్టబ్స్..?
ముంబై ఇండియన్స్ పేసర్ టైమల్ మిల్స్ గాయం కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్లో మిగితా మ్యాచ్‌లకు మిల్స్ స్థానంలో సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్ స్టబ్స్‌ను భర్తీ చేయనుంది. ఈ సీజన్ కోసం రూ. 20 లక్షల మొత్తానికి స్టబ్స్‌తో ముంబై ఇండియన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలోనే ముంబై జట్టులో స్టబ్స్ చేరనున్నాడు. ఇక దేశీవాళీ క్రికెట్లో అదరగొడతున్న ట్రిస్టన్ స్టబ్స్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ ట్రిస్టన్ స్టబ్స్ ట్రిస్టన్ స్టబ్స్ దక్షిణాఫ్రికాకు చెందిన యువ ఆటగాడు. 21 ఏళ్ల స్టబ్స్ ఇంకా ప్రోటీస్ తరపున అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్రం చేయలేదు. 2020లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిస్టన్ స్టబ్స్ అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన స్టబ్స్ 456 పరుగులు సాధించాడు. అదే విధంగా 11 లిస్ట్-ఎ, 17 టీ20లు ఆడిన స్టబ్స్.. వరుసగా 275, 506 పరుగులు సాధించాడు. ఇటీవల ముగిసినసౌతాఫ్రికా డొమాస్టిక్ టీ20 లీగ్‌లో స్టబ్స్ అదరగొట్టాడు. వారియర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన స్టబ్స్ సీఎస్ఎ-2022లో 293 పరుగులు సాధించాడు. స్టబ్స్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటన కోసం దక్షిణాఫ్రికా-ఎ జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. చదవండి: IPL 2022: ఎస్ఆర్హెచ్పై వార్నర్ అర్థశతకం.. ప్రపంచ రికార్డు బద్దలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు.. ఏంటి ఉపయోగం!
ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ఆటగాడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. లెఫ్మార్ట్ స్పిన్నర్ టైమల్ మిల్స్ చీలమండ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. కాగా అతని స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను ముంబై ఇండియన్స్ రీప్లేస్ చేయనుంది. రూ. 20 లక్షల బేస్ప్రైజ్కే ముంబై జట్టులో అడుగుపెట్టనున్న ట్రిస్టన్ స్టబ్స్ 17 టి20ల్లో 506 పరుగులు సాధించాడు. కాగా స్టబ్స్ ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే నమోదు చేసిన ముంబై ఎనిమిది పరాజయాలు మూటగట్టుకుంది. కాగా కొన్నిరోజుల క్రితమే టీమిండియా సీనియర్ బౌలర్ ధావల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్ పర్లేదు అన్నట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ బౌలింగ్ మాత్రం మరింత దారుణంగా తయారైంది. బుమ్రా సహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ నమోదు చేయలేకపోతున్నారు. చదవండి: IPL 2022: 'కోహ్లి బ్యాటింగ్ చూస్తే జాలేస్తోంది..' -
"బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం రావడం నా అదృష్టం"
ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ పేసర్ టైమల్ మిల్స్‌ను రూ. 1.5 కోట్లకు ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ స్ధానంలో మిల్స్‌ను ముంబై కొనుగోలు చేసింది. అయితే మరో పేసర్ ఆర్చర్ అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రాతో పేస్ బౌలింగ్‌ను పంచు కోనున్నాడు. ఇది ఇలా ఉంటే.. బుమ్రాపై మిల్స్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బౌలింగ్ చేసే అవకాశం రావడం తన ఆదృష్టమని మిల్స్ తెలిపాడు. "టీ 20 ప్రపంచకప్ సమయంలో బుమ్రాతో కొద్దిసేపు గడిపే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడు అతనితో కలిసి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇక చాలా కాలం తరువాత ఐపీఎల్లో ఆడబోతున్నాను. నాకు మళ్లీ ఆడే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది" అని ముంబై ఇండియన్స్ పోస్ట్ చేసిన వీడియోలో మిల్స్ పేర్కొన్నాడు. ఇక టీ20 స్పెషలిస్ట్‌గా పేరొందిన మిల్స్.. 12 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. మిల్స్ 2017లో ఆర్సీబీ తరుపున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. ఇక ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ముంబై జట్టు మాత్రమే హోం గ్రౌండ్లలో మ్యాచ్‌లు ఆడనుంది. వాంఖడే వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనుంది. చదవండి: Ind VS Sl 2nd Test: ఛ.. నాకే ఎందుకిలా జరుగుతోంది? కోహ్లి వీడియో వైరల్ -
T20 World Cup 2021: సెమీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్..
Tymal Mills Ruled Out Of T20 World Cup 2021: టీ20 ప్రపంచకప్-2021 కీలక దశకు ముందు ఇంగ్లండ్ జట్టుకు అతి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ తైమాల్ మిల్స్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సోమవారం(నవంబర్ 1) శ్రీలంకతో మ్యాచ్‌లో 1.3 ఓవర్లు వేసిన మిల్స్.. తొడ కండరాలు పట్టేయడంతో మ్యాచ్ మధ్యలోనే వైదొలిగాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రమైందిగా తేలడంతో అతను టోర్నీ నుంచి వైదొలుగుతాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధవారం ప్రకటించింది. దీంతో ఈసీబీ అతని స్థానాన్ని రీస్ టాప్లేతో భర్తీ చేసింది. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఆడిన 4 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగిన మిల్స్.. 15.42 సగటుతో నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుత మెగా టోర్నీలో మోర్గాన్ సేన సూపర్ ఫామ్‌లో కొనసాగుతుంది. ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ భారీ విజయాలు సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. టోర్నీలో ఇంగ్లండ్ మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇంగ్లీష్ జట్టు నవంబర్ 6న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: పసికూనపై మార్టిన్ గప్తిల్ ప్రతాపం.. పలు రికార్డులు సొంతం -
T20 World Cup: ‘మా జట్టులో సగం మంది అక్కడే.. ఏ జట్టునైనా ఓడించగలం’
Tymal Mills Comments On T20 World Cup: ఈనెల 17 నుంచి ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్‌నకు తమ జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోందని ఇంగ్లండ్ బౌలర్ టైమల్ మిల్స్ అన్నాడు. ఇప్పటికే టీ20 వరల్డ్‌కప్‌లోని సగం మంది సభ్యులు ఐపీఎల్ ఆడుతున్నారని, ఈ అనుభవం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నాడు. కాగా కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్-2021 సెప్టెంబరు 19 నుంచి తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. భారత్‌లో పరిస్థితులు అనుకూలించని కారణంగా యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఇక ఐపీఎల్ ముగిసిన.. రెండు రోజుల వ్యవధిలోనే... ఐసీసీ మెగా ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ సంబరానికి తెరలేవనుంది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగనుంది. ఈ నేపథ్యంలో టైమల్ మిల్స్ మాట్లాడుతూ... ‘‘టీ20 వరల్డ్‌కప్‌నకు ముందు మా జట్టులోని సగం మంది ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడతుండటం మాకు ప్రయోజనకరంగా మారింది. యూఏఈ పిచ్‌లపై ఆడటం వల్ల మంచి ప్రాక్టీసు లభిస్తుంది. అక్కడి పరిస్థితులను అంచనా వేసేందుకు అవగాహన వస్తుంది. మేమంతా పూర్తి స్థాయిలో ఐసీసీ టోర్నీకి సిద్ధమవుతున్నాం. ఏ జట్టునైనా ఓడించగలమనే విశ్వాసం ఉంది. మా జట్టు చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎలాంటి పరిస్థితులకైనా తమను తాము మలచుకుని.. మెరుగ్గా రాణించగల ఆటగాళ్లు మా జట్టులో ఉన్నారు’’ అని ధీమా వ్యక్తం చేశాడు. కాగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమల్ మిల్స్ సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సదరన్ బ్రేవ్ తరఫున అద్బుతంగా రాణించి ఫామ్‌లోకి వచ్చిన అతడికి ఈసీబీ వరల్డ్‌కప్ జట్టులో చోటిచ్చింది. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్(కేకేఆర్), మొయిన్ అలీ(సీఎస్కే), సామ్ కరన్(సీఎస్కే), ఆదిల్ రషీద్(పంజాబ్ కింగ్స్), జేసన్ రాయ్(సన్‌రైజర్స్ హైదరాబాద్) తదితరులు ఐపీఎల్-2021 రెండో అంచెలో వివిధ జట్ల తరఫున ఆడుతున్నారు. ఇక టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా... దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్టోబరు 23న వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: T20 World Cup: ఆ రెండు జట్లతోనే మాకు గట్టి పోటీ: జోస్ బట్లర్ -
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు.. ఆ ఇద్దరికి మొండిచెయ్యి
లండన్: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. జట్టులో స్థానం ఆశించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా టెస్ట్ కెప్టెన్ జో రూట్లకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఎలాగైనా పొట్టి ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావించాడు. ఇక మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్.. క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుని ఇటీవలే జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ సెలెక్షన్ కమిటీ వీరిద్దరిని పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమల్ మిల్స్, ఆల్‌రౌండర్ కోటాలో క్రిస్ వోక్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం.. -
ఐపీఎల్ వేలంలో ప్చ్... స్పందించిన ప్లేయర్
సాక్షి, స్పోర్ట్స్ : గతేడాది భారీ ధర పలికి.. ఈ ఐపీఎల్ సీజన్లో కనీసం ఏ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయకుండా ఆ క్రికెటర్‌కు షాకిచ్చాయి. గతేడాది ఐపీఎల్లో 12 కోట్లు ధర పలికి, ప్రస్తుత వేలంలో అనామకుడిగా మిగిలిన ఆ క్రికెటర్ మరెవరో కాదు తైమల్ మిల్స్. ఐపీఎల్ 11 సీజన్లో తాను ఆడకపోవడంపై మిల్స్ స్పందించాడు. ఏ ఆటగాడికైనా ఇలాంటి ఘటన ఎదురుకావడం కష్టంగానే ఉంటుంది. కానీ ఎవరో మనల్ని ఎంపిక చేయలేదనో, నమ్మలేదనో భయాల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. తమను కొనుగోలు చేస్తారా లేదా అన్న భయం ఉంటే మాత్రం ఆ ఆటగాళ్లు వేలానికి దూరంగా ఉండటమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. 'గతేడాది భారీ ధరకు నన్ను తీసుకున్నందుకు చాలా సంతోష పడ్డాను. ఈ సీజన్లో తీసుకోలేదని ఏ జట్టుపై నాకు కోపం లేదు. ఏది జరిగినా మన మంచికే అని భావించాలి. ఈ ఏడాది వేలంలో నన్ను ఏ జట్టు ఎంపిక చేయనుందున పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. పెషావర్ జల్మీతో జరిగిన సెమీ ఫైనల్లో దురదృష్టవశాత్తూ మా కరాచీ కింగ్స్ ఓడిపోయింది. కానీ పాక్‌లో సెక్యూరిటీ చాలా బాగుంది. ఆసియాలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా క్రికెట్ ప్రేమికులతో స్టేడియాలు నిండిపోతాయని' మిల్స్ వివరించాడు. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ ధరలకు మిల్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని, ప్రస్తుతం దేశవాలీ లీగ్స్, జాతీయ జట్టుకు ఆడుతూ ఆటను మెరుగు పరుచుకోవడంపైనే దృష్టిసారించినట్లు మిల్స్ తెలిపాడు. తనను ఎంతగానో ఆధరించిన ససెక్స్ జట్టుకు మళ్లీ ఆడతానని పేర్కొన్నాడు. గతేడాది విఫలమైన సందర్భంలో భారీ ధరకు తీసుకున్నారని, కానీ ఈ ఏడాది అద్భుతంగా రాణించినా ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదన్నాడు. 'మా దేశ ప్రస్తుత ట్వంటీ20 స్పెషలిస్టు ఇక ధనిక క్రికెటర్ అయిపోయాడు. ఐపీఎల్లో మిల్స్ కు రూ.12 కోట్లు ధర పలకడం టెస్టు క్రికెట్ కు కచ్చితంగా చెంపపెట్టే. టెస్టు క్రికెట్ ఎంత అథమ స్థాయిలో ఉందో ఐపీఎల్ వేలాన్ని బట్టి అర్ధమవుతోందని' గతేడాది ఐపీఎల్ 10వ సీజన్ వేలం అనంతరం స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
మిల్స్ ధరపై పీటర్సన్ సంచలన వ్యాఖ్యలు!
లండన్: గత కొంతకాలంగా విదేశీ ట్వంటీ 20 లీగ్‌లతో బిజీగా గడిపిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంట్లోనే కుటుంబంతో గడుపుతున్న పీటర్సన్ టెస్టు క్రికెట్ కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రధానంగా ఇంగ్లండ్ బౌలర్ తైమాల్ మిల్స్ ఐపీఎల్ ధరను ఉద్దేశిస్తూ పీటర్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వేలంలో తైమాల్ మిల్స్ కు అత్యధిక ధర పలకడం టెస్టు క్రికెట్ కు ఒక చెంపపెట్టుగా అభివర్ణించాడు. ప్రత్యేకంగా ట్వంటీ 20 లీగ్‌ల పట్ల అభిమానాన్ని చాటుకున్న పీటర్సన్.. టెస్టు క్రికెట్ ను బతికించే బాధ్యత ఐసీసీపైనే ఉందని పేర్కొన్నాడు. ' ఐపీఎల్లో మిల్స్ కు రూ.12 కోట్లు ధర పలకడం టెస్టు క్రికెట్ కు కచ్చితంగా చెంపపెట్టే. మా దేశ ప్రస్తుత ఒక ట్వంటీ 20 స్పెషలిస్టు ఇక ధనిక క్రికెటర్ అయిపోయాడు. ఇక్కడ టెస్టు క్రికెట్ ఎంత అథమ స్థాయిలో ఉందో ఐపీఎల్ వేలాన్ని బట్టి అర్ధమవుతోంది. టెస్టు క్రికెట్ ను బతికించడానికి ఐసీసీ తొందరపడాలి. లేకపోతే టెస్టు క్రికెట్ మనకు దూరం కాక తప్పుదు. నేను చేసిన వ్యాఖ్యలు ఏ ఒక్కర్నో కించపరిచేవి కావు. ఇక్కడ మిల్స్ ను నేను విమర్శించలేదు. అతను ట్వంటీ 20ల్లో మంచి బౌలర్. ఇంగ్లండ్ తరపున అతనెప్పుడో అరంగేట్రం చేయాల్సి ఉంది' అని పీటర్సన్ పేర్కొన్నాడు. -
అలాంటి బౌలర్లను చాలా మందిని చూశా!
కాన్పూర్: భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్, వన్డే సిరీస్‌లలో ఓటమిపాలైన ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా టీ20లలో నైనా టీమిండియాకు చెక్ పెట్టాలని ఇంగ్లండ్ జట్టు ఎడమచేతి వాటం స్పిన్నర్ తైమల్ మిల్స్‌ను రంగంలోకి దించుతుంది. దీనిపై స్పందించిన విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. తన కెరీర్లో ఎంతో మంది 90 మైళ్ల వేగంతో బంతులు సంధించిన బౌలర్లను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఇప్పుడే అదేవిధంగా మరో బౌలర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఇంగ్లండ్‌కు సంకేతాలు పంపాడు కోహ్లీ. తైమల్ మిల్స్ గురించి ఎలా సిద్ధమయ్యారని మీడియా అడిగిన ప్రశ్నకు కోహ్లీ ఈ విధంగా స్పందించాడు. మిల్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు (గురువారం) కాన్పూర్‌లో తొలి టీ20 మ్యాచ్ ఆడిన తర్వాత మాత్రమే అతడిపై కామెంట్లు చేస్తాను. మా జట్టులో నాణ్యమైన ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్టులు ఉన్నారు.. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడిపై ఆశలు పెట్టుకున్న ఇంగ్లండ్ అతడికి టీ20 గేమ్ లోకి తెచ్చి ఉండొచ్చునని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.