టైమల్ మిల్స్, ట్రిస్టన్ స్టబ్స్(IPL Twitter)
ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ఆటగాడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. లెఫ్మార్ట్ స్పిన్నర్ టైమల్ మిల్స్ చీలమండ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. కాగా అతని స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను ముంబై ఇండియన్స్ రీప్లేస్ చేయనుంది. రూ. 20 లక్షల బేస్‌ప్రైజ్‌కే ముంబై జట్టులో అడుగుపెట్టనున్న ట్రిస్టన్ స్టబ్స్ 17 టి20ల్లో 506 పరుగులు సాధించాడు. కాగా స్టబ్స్ ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం.
ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో దారుణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే నమోదు చేసిన ముంబై ఎనిమిది పరాజయాలు మూటగట్టుకుంది. కాగా కొన్నిరోజుల క్రితమే టీమిండియా సీనియర్ బౌలర్ ధావల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్ పర్లేదు అన్నట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ బౌలింగ్ మాత్రం మరింత దారుణంగా తయారైంది. బుమ్రా సహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ నమోదు చేయలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment