ankle injury
-
మడమల నొప్పితో నడవలేకున్నారా.. అయితే ఇలా చేయండి!
చాలా మంది కాలి చీలమండల ప్రాంతంలో నొప్పితో బాధపడుతుంటారు. దీనివల్ల నడవటం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. ఈ నొప్పి రాకుండా వివిధ రకాల ఔషధాలు తీసుకుంటూ ఉంటారు. అయితే మందు ప్రభావం తగ్గిన వెంటనే, నేనున్నానంటూ మళ్లీ నొప్పి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితులలో కొన్ని ఇంటి నివారణ చిట్కాల సహాయంతో పాదాల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. మడమల నొప్పులు ఏ సీజన్లో అయినా రావచ్చు కానీ ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరమౌతుంది. ఈ నొప్పులకు కారణాలు అనేకం. వాటిలో బరువు పెరగడం, ఎక్కువసేపు నిలబడటం, ఎత్తు మడమల బూట్లు లేదా చెప్పులు ధరించడం, శరీరంలో కాల్షియం లోపించటం వంటివి ముఖ్య కారణాలు. అల్లం మడమ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆహారంలో అల్లాన్ని చేర్చుకోవటం మంచిది. దీనికిగాను ముందుగా రెండు కప్పుల నీళ్లలో అల్లం వేయాలి. తరువాత దానిని మరగనివ్వాలి. నీరు సగానికి తగ్గిన తర్వాత అందులో మూడు చుక్కల నిమ్మరసం, ఒక చెంచా తేనె వేసి సేవించడం వల్ల వల్ల చీలమండల నొప్పి నుంచి చాలా వరకు ఉపశమనం పొందవచ్చు. చేప ఆహారంలో చేపలను చేర్చుకోవడం ద్వారా నొప్పి, మడమల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు. ఇందులో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్లు ఉన్నాయి. ఇవి నొప్పి, వాపును తగ్గించడమే కాకుండా, ఎముకలను బలోపేతం చేస్తాయి. రాక్‌సాల్ట్ మడమ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి రాతి ఉప్పును ఉపయోగించవచ్చు. ముందుగా ఒక పాత్రలో నీటిని వేడి చేసి, దానిలో రెండు మూడు చెంచాల రాక్‌సాల్ట్ వేయండి. ఆ తర్వాత, ఈ నీటిలో పాదాలను 10–15 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల మడమ నొప్పి, వాపు ఉపశమిస్తాయి. ఐస్ క్యూబ్స్ మడమల నొప్పి సమస్య నుండి బయటపడటానికి నొప్పి ఉన్న ప్రాంతంలో రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు సార్లు ఐస్‌క్యూబ్‌లు ఉంచాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా ఒక గుడ్డలో ఉంచి నొప్పి ఉన్న ప్రదేశంలో సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. లవంగ నూనెతో మసాజ్ మడమ నొప్పి నుంచి ఉపశమనం కోసం నొప్పి ఉన్న ప్రాంతంలో లవంగ నూనెతో సున్నితంగా మర్ధన చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. కండరాలకు ఉపశమనం కలుగుతుంది. పాదాలలో ఏదైనా నొప్పి అనిపిస్తే లవంగ నూనెతో మసాజ్ చేయటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. పసుపు మడమ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి పసుపు సహాయపడుతుంది. ఇది వ్యాధి నిరోధక లక్షణాలను కలిగి ఉండి వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీనికిగాను పసుపునీళ్లలో కొద్దిగా తేనె కలుపుకుని తాగాలి. అలాగే పసుపు పాలు తీసుకోవచ్చు. దీనిని సేవించటం వల్ల నొప్పి, వాపు తగ్గుతాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ మడమల నొప్పి. వాపు వంటి సమస్యలు ఉంటే, ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా ఉపకరిస్తుంది. కాసిని వేడినీళ్లలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపాలి. ఈ నీటితో పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఇవి చదవండి: కుకింగ్ టు కామెడీ క్వీన్స్.. -
చీలమండ నొప్పి తగ్గాలంటే...
మడమ, దాని పరిసరాల్లో వచ్చే నొప్పిని చీలమండ నొప్పి (యాంకిల్ పెయిన్) అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనంగా మారడం మొదలుకొని దేహంలో పెరిగిన యూరిక్ యాసిడ్ చీలమండ కీళ్లలో స్ఫటికాలుగా మారి ఒరుసుకుపోవడం వరకు అనేక కారణాల వల్ల ఈ నొప్పి రావచ్చు. ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించడం మంచిది. అవి... పాదాలకు నప్పేలా పాదరక్షలు వేసుసుకోవడంతో పాటు అవి మెత్తగా ఉండటం మంచిది. హైహీల్స్ మంచిది కాదు. క్రేప్బ్యాండ్ చుట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది ఊబకాయం వల్ల దేహం బరువు చీలమండపై పడి నొప్పి పెరుగుతుంది. బరువు తగ్గించుకోవడం మేలు చేసే అంశం. వాపు ఉన్నప్పుడు... పడుకునే సమయంలో కాలి కింద తలగడ ఉంచి, చీలమండ మిగతా శరీర భాగం కంటే కాస్త పైకి ఉండేలా ఆ తలగడను అమర్చాలి. వాపు దగ్గర ఐస్ ప్యాక్ పెట్టాలి. ∙నడిచేటప్పుడు మడమ మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తల తర్వాతా నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. (చదవండి: ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..) -
Health: మడమల నొప్పి వేధిస్తోందా? వెనక్కి నడిచే అలవాటుంటే.. లంగ్స్‌కి!
Walking Backwards- Health Benefits: వెనక్కు నడవడం లెక్కకు తిరోగమన సూచనగా కనిపిస్తుందేమోగానీ... హెల్త్‌కు చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మనకలవాటైన నడక కంటే వెనక్కు నడిచే ప్రక్రియ మరింత సవాలుగా మారుతుంది. మెదడుకు మరింత ఎక్కువ పని పడుతుంది. బ్యాలెన్స్ చేయడం, నడిచేప్పుడు కాళ్లు సరిగ్గా పడటం, పక్కలకు సరిగా తిరగడం వంటి వాటి నియంత్రణ మరింత కష్టమవుతుంది. 40 శాతం శక్తి ఎక్కువగా దాంతో దేహానికీ, మెదడుకూ శ్రమ పెరిగి, శారీరక కదలికలు చురుకుగా మారడానికి, మెదడుకు మరింత పదును పెరగడానికి అవకాశముంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. మామూలు నడకతో పోలిస్తే వెనక్కు నడవడంలో 40 శాతం శక్తి ఎక్కువగా వినియోగమవుతుందని, దాంతో అంతే సమయంలో మరింత ఎక్కువ వ్యాయామం సమకూరుతుందనీ, లంగ్స్‌కు ఆక్సిజన్ కూడా పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆరోగ్య ప్రయోజనాలివే! వెనక్కి నడక వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ నివారితం కావడం, కాలి కండరాల బలం, సామర్థ్యం పెరగడం, కీళ్ల ఆరోగ్యం పెంపొందడం, ప్లాంటార్ ఫేసిౖయెటిస్తో వచ్చే మడమల నొప్పి తగ్గడం, దీర్ఘకాలిక నడుమునొప్పితో బాధపడేవారి నొప్పి నుంచి ఉపశమనంతో పాటు వేగంగా బరువు తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే వెనక్కు నడిచే ఆరోగ్య ప్రక్రియకోసం పరిసరాలతో బాగా పరిచయం ఉన్న గదిలోనే (ఇన్‌డోర్‌లో) అలవాటైన చోట నడుస్తూ, మధ్యన ఎలాంటి అంతరాయాలూ లేకుండా చూసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్‌కు చెందిన క్లినికల్ ఎక్సర్సైజ్ ఫిజియాలజీ అధ్యాపకుడు జాక్మెక్ నమారా. చదవండి: Menthi Podi: షుగర్ పేషెంట్లు రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి తాగితే.. Urinary Infections: ఎక్కువ సేపు మూత్రాన్ని ఆపుకొంటే జరిగే అనర్థాలివే! ముఖ్యంగా వర్కింగ్ వుమెన్‌లో ఈ సమస్యలు.. Black Circles Under Eyes: పచ్చిపాలు.. కొబ్బరి నూనె! ఇలా చేస్తే కళ్ల చుట్టూ ఉన్న నల్లని వలయాలు మాయం -
టీమిండియా ఆల్‌రౌండర్‌కు గాయం.. టోర్నీ నుంచి ఔట్!
టీమిండియా యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2022 నుంచి తప్పుకున్నాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్.. ప్రాక్టీస్ చేస్తుండగా అతడి చీలమండకి తీవ్ర గాయమైంది. ఈ క్రమంలో టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల మొత్తానికి అయ్యర్ దూరమయ్యాడు. కాగా ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మూడు మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రైల్వేస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అయ్యర్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో తొలుత 62 పరుగులతో ఆజేయంగా నిలిచిన వెంకటేశ్.. బౌలింగ్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక తన గాయానికి సంబంధించిన అప్డేట్ను సోషల్ మీడియా వేదికగా అయ్యర్ అందించాడు. "చీలమండ గాయం కారణంగా సయ్యద్ ముస్తాక్ ఆలీ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరం కానున్నాను. త్వరలో మళ్లీ మైదానంలోకి అడుగుపెడతానని ఆశిస్తున్నాను. నేను జట్టుకు దూరమైన్పటికీ.. మా బాయ్స్ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నాను" అని సోషల్ మీడియాలో అయ్యర్ పోస్ట్ చేశాడు. కాగా ఐపీఎల్-2021లో అద్భుతమైన ప్రదర్శన చేసిన అయ్యర్‌కు భారత జట్టులో చోటు దక్కింది. అయితే జట్టులో మాత్రం తన స్థానాన్ని అయ్యర్ సుస్థిరం చేసుకోలేకపోయాడు. ఇప్పటి వరకు టీమిండియా తరపున 9 టీ20లు, రెండు వన్డేల్లో అయ్యర్ ప్రాతినిథ్యం వహించాడు. View this post on Instagram A post shared by Venkatesh R Iyer (@venkatesh -
బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు
బెలూన్ వరల్డ్‌కప్ ఒక క్రీడాకారిణి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా మొదలైన ఆట ఆఖర్లో కాస్త ఉత్కంఠను రేపింది. విషయంలోకి వెళితే.. ట్విచ్కాన్ 2022 పేరిట అక్టోబర్ 8న సాన్ డీగోలో బెలూన్ వరల్డ్‌కప్ నిర్వహించారు. ఈ గేమ్‌లో చాలా మంది పాల్గొన్నారు. బెలూన్ గేమ్ అంటే ఏంటి? గాలిలోకి ఎగిరిన బెలూన్ కిందపడకుండా చేతితోనే కొడుతుండాలి. ఒక్కో రౌండ్ రెండు నిమిషాల పాటు ఆడాలి. ఈ క్రమంలో ఆటలో పాల్గొన్న క్రీడాకారుల్లో ఒకరినొకరు చేజ్ చేస్తూ ఎవరు ఎక్కువసేపు బెలూన్ను గాలిలోకి కొట్టగలిగితే వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇది క్లుప్తంగా బెలూన్ వరల్డ్‌కప్ గేమ్. కాగా బెలూన్ వరల్డ్‌కప్‌లో ట్విచ్ స్రీమర్ జుమ్మెర్స్ కూడా పాల్గొంది. జుమ్మెర్స్ ఇదివరకు చాలాసార్లు బెలూన్ గేమ్స్‌లో విజయాలు అందుకొని ఫెవరెట్‌గా మారిపోయింది. ఆమెకు అభిమాన దళం కూడా ఎక్కువే. ఇక మ్యాచ్‌లో జుమ్మెర్స్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ చాలావరకు బెలూన్ను గాల్లోనే ఉంచింది. అయితే మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ఆమె సోఫాలో నుంచి జారి కింద పడింది. తల భాగం గట్టిగా తగలడంతో పెద్ద గాయం అయిందని అంతా భావించారు. కానీ జుమ్మెర్స్ కుడి చీలమండకు మాత్రం తీవ్ర గాయమైంది. వెంటనే నిర్వహాకులు ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. మూడువారాలు రెస్ట్ తీసుకుంటే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ట్విచర్ జుమ్మెర్స్ కోరిక మేరకు తొలగించారు. ఇక జుమ్మెర్స్ గాయపడడంపై ఆమె అభిమానులు ట్విటర్ వేదికగా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. చదవండి: ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..' -
దీపక్ చహర్‌కు గాయం..!
టీమిండియా బౌలర్ దీపక్ చహర్ చీలమండ గాయంతో సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో బౌలింగ్ చేసిన దీపక్ చహర్‌కు కాలు బెణికింది. దీంతో తొలి వన్డేకు చహర్ దూరంగా ఉన్నాడు. అయితే గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికి టి20 ప్రపంచకప్ దృశ్యా మిగతా రెండు వన్డేల నుంచి దీపక్ చహర్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. ''కాలు బెణికినప్పటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని మా అభిప్రాయం. అందునా టి20 ప్రపంచకప్‌కు దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన బుమ్రా స్థానంలో షమీ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని ఆడించాలని చూస్తోంది. ఒకవేళ షమీ ఫిట్నెస్ నిరూపించుకుంటే చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గానే ఉంటాడు. అలా కాకుండా షమీ ఫిట్‌నెస్‌లో విఫలమైతే మాత్రం అప్పుడు దీపక్ చహర్ అవసరం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొనే చహర్‌కు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చినట్లు'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక దీపక్ చహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ కనబరిచే చహర్ మ్యాచ్‌కు దూరమవడంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా విజయానికి తొమ్మిది పరుగుల దూరంలో ఆగిపోయింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్లు రాణించినప్పటికి టాపార్డర్ విఫలం కావడంతో టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య రెండో వన్డే ఆదివారం(అక్టోబర్ 9న) రాంచీ వేదికగా జరగనుంది. చదవండి: ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ మహిళా అంపైర్‌తో దురుసు ప్రవర్తన.. అందుకే గొడవ -
BWF World Championship: భారత్‌కు భారీ షాక్.. పీవీ సింధు దూరం!
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2022కు భారత్‌కు భారీ షాక్ తగిలింది. ఒలింపిక్ మెడలిస్ట్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చీలమండ గాయం కారణంగా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. ఈ విషయాన్ని సింధూ తండ్రి పివి రమణ దృవీకరించారు. ఈ సందర్భంగా ఆయన స్పోర్ట్స్ స్టార్‌తో మాట్లాడుతూ.. "సింధూ కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో గాయపడింది. ఆమె తీవ్రమైన నొప్పితోనే స్వర్ణం పతకం సాధించింది. ఈ క్రమంలో సింధూ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌కు దూరం కానుంది. ఆమె గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది ఆక్టోబర్‌లో జరిగే పారిస్, డెన్మార్క్ ఓపెన్‌పై సింధు దృష్టంతా ఉంది" అని పేర్కొన్నాడు. కాగా బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఫైనల్లో గాయంతోనే ఆడినట్లు మ్యాచ్ అనంతరం సింధు కూడా వెల్లడించింది. ఇక బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ ఆగస్టు 21 నుంచి ఆగస్టు 28 వరకు జరగనుంది. కాగా ఇప్పటి వరకు ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో సింధు 5 పతకాలు సొంతం చేసుకుంది. 2019 బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. అదే విధంగా ఆమె ఖాతాలో రెండు సిల్వర్ మెడల్స్, రెండు కాంస్య పతకాలు కూడా ఉన్నాయి. చదవండి: CWG 2022- Narendra Modi: స్వర్ణ యుగం మొదలైంది.. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: ప్రధాని మోదీ -
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు.. ఏంటి ఉపయోగం!
ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ఆటగాడు ఎంట్రీ ఇవ్వనున్నాడు. లెఫ్మార్ట్ స్పిన్నర్ టైమల్ మిల్స్ చీలమండ గాయంతో బాధపడుతూ ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. కాగా అతని స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ను ముంబై ఇండియన్స్ రీప్లేస్ చేయనుంది. రూ. 20 లక్షల బేస్ప్రైజ్కే ముంబై జట్టులో అడుగుపెట్టనున్న ట్రిస్టన్ స్టబ్స్ 17 టి20ల్లో 506 పరుగులు సాధించాడు. కాగా స్టబ్స్ ఖాతాలో మూడు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఇక ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో దారుణ ప్రదర్శనతో ప్లే ఆఫ్ రేసు నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే నమోదు చేసిన ముంబై ఎనిమిది పరాజయాలు మూటగట్టుకుంది. కాగా కొన్నిరోజుల క్రితమే టీమిండియా సీనియర్ బౌలర్ ధావల్ కులకర్ణిని జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్ పర్లేదు అన్నట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్ బౌలింగ్ మాత్రం మరింత దారుణంగా తయారైంది. బుమ్రా సహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ నమోదు చేయలేకపోతున్నారు. చదవండి: IPL 2022: 'కోహ్లి బ్యాటింగ్ చూస్తే జాలేస్తోంది..' -
Ankle Pain Health Tips: యాంకిల్ పెయిన్ వేధిస్తోందా.. ఇంట్లోనే ‘రైస్ ట్రీట్మెంట్’!
పాదానికి దేహానికి మధ్య సంధాన కర్త యాంకిల్ (చీలమండ). కండరాలు ఒత్తిడికి గురవడం వల్ల, నడిచేటప్పుడు కాలు మడత పడడం వంటి చిన్న కారణాలకే యాంకిల్ పెయిన్ వస్తుంటుంది. ప్రమాదవశాత్తూ జారిపడినప్పుడు ఆ దుష్ప్రభావానికి మొదటగా గురయ్యేది యాంకిల్ మాత్రమే. అలాగే ఆర్థరైటిస్ వంటి అనారోగ్య పరిస్థితుల్లోనూ దేహంలోని తొలి బాధిత భాగం ఇదే. యాంకిల్ పెయిన్ వస్తే దైనందిన జీవనం దాదాపుగా స్తంభించిపోతుంది. ఈ నొప్పికి తక్షణం చికిత్స తీసుకోవాల్సిందే. అయితే యాంకిల్ పెయిన్‌కి దారి తీసిన కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. మొదటగా ఇంట్లో తీసుకోగలిగిన జాగ్రత్తలను చూద్దాం. అలాగే డాక్టర్‌ను సంప్రదించాల్సిన పరిస్థితులను తెలుసుకుందాం. ►యాంకిల్ పెయిన్ చికిత్సలో రైస్ మెథడ్ ప్రధానమైనది. రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ పదాల మొదటి ఇంగ్లిష్ అక్షరాలతో రూపొందించిన చికిత్స విధానం ఇది. ►పూర్తిగా విశ్రాంతినివ్వాలి. పాదం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు మోపకూడదు, బాత్రూమ్ వంటి స్వయంగా చేసుకోవాల్సిన పనులకు క్రచెస్ సహాయంతో నడవాలి. ►గాయం తగిలిన మూడురోజుల వరకు రోజుకు ఐదు సార్లు గాయం మీద ఐస్ పెట్టాలి. ►ఎలాస్టిక్ బ్యాండేజ్‌తో పాదాన్ని చీలమండను కలుపుతూ కట్టుకట్టాలి. అయితే ఈ కట్టును రక్తప్రసరణకు అంతరాయం కలిగేటంత గట్టిగా కట్టకూడదు. ►రెండు దిండ్ల సహాయంతో యాంకిల్‌ను గుండెకంటే ఎత్తులో ఉంచాలి. ►కండరాలు ఒత్తిడికి గురైన కారణంగా వచ్చిన నొప్పి అయితే తగ్గిపోతుంది. ► ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్, దీర్ఘకాల సయాటికా కారణంగా నరాలు దెబ్బతినడం, రక్తనాళాల్లో అడ్డంకులు, కీళ్లలో ఇన్ఫెక్షన్ కారణంగా వచ్చిన యాంకిల్ పెయిన్ అయితే వైద్యుల సూచనతో చికిత్స చేయించుకోవాలి. అనారోగ్య కారణాన్ని బట్టి మందులు మారుతుంటాయి. -
బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఐదో బంతి వేసిన తర్వాత బుమ్రా కుడికాలు బెణికింది. దీంతో నొప్పితో విలవిల్లాలాడిన ఈ స్పీడస్టర్ మైదానం వీడాడు. ఫిజియో సాయంతో పెవిలియన్ చేరిన బుమ్రా కాలు పరిశీలించిన ఫిజియో చీలమండకు గాయం అయినట్లు తెలుస్తుందని పేర్కొన్నాడు. దీంతో బుమ్రా కాసేపు డగౌట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత సహచర క్రికెటర్ సహాయంతో మైదానంలో అడుగుపెట్టినప్పటికి నడవడంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీంతో బౌలింగ్ చేయని బుమ్రా మళ్లీ పెవిలియన్‌కు వెళ్లి కూర్చున్నాడు,. అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఎక్స్‌రే తీసిన తర్వాతే బుమ్రా గాయంపై మరింత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అబ్జర్వేషన్లో ఉన్న బుమ్రా నొప్పితో బాధపడుతూ ఫిజియోతో మర్ధన చేయించుకోవడం కెమెరాలకు చిక్కింది. అయితే మళ్లీ బుమ్రా బౌలింగ్ వస్తాడా రాడా అనేది సందిగ్థంగా మారింది. అయితే ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు. ఒక పరుగు చేసిన ప్రొటీస్ కెప్టెన్ డీన్ ఎల్గర్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించి టీమిండియాకు బ్రేక్ అందించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. టెంబా బవుమా 31, క్వింటన్ డికాక్ 34 పరుగులతో ఆడుతున్నారు. Bumrah 😢 pic.twitter.com/rX2MaHUdzO — N (@Nitinx18) December 28, 2021 -
ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!
సిడ్నీ : బోర్డర్ గవాస్కర్ ట్రోపీ ఆరంభానికి ముందే ఆసీస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పటికే స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ దూరం కాగా.. త్యాగి బౌన్సర్ దెబ్బకు యువ ఓపెనర్ విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆసీస్ ఫాస్ట్ బౌలర్ సీన్ అబాట్ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలి చీలమండ గాయంతో అబాట్ బాధపడుతున్నట్లు సమాచారం. సిడ్నీ వేదికగా ఇండియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో రెండో రోజు ఆటలో భాగంగా మొదటి సెషన్లో బౌలింగ్‌కు వచ్చిన అబాట్ 7 ఓవర్లు వేశాడు. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే అబాట్‌కు కండరాలు పట్టేయడంతో బౌలింగ్ చేయలేదు. అయితే నొప్పి తీవ్రత ఎక్కువ కావడంతో ఫిజియో సూచన మేరకు పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇప్పుడైతే అబాట్ బౌలింగ్‌కు వచ్చే అవకాశాలు లేవని.. ఒకవేళ ఆసీస్ బ్యాటింగ్ సమయంలో అవసరం అనుకుంటేనే వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) ఒకవేళ అబాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ఆసీస్‌కు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. టెస్టు సిరీస్‌లో సీన్ అబాట్ ఆస్ట్రేలియాకు కీలక బౌలర్.. బౌన్సర్లు వేయడంలో దిట్ట అయిన అబాట్ ప్రత్యర్థి బ్యాట్స్మన్లను కట్టడి చేస్తాడు. భారత్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ అబాట్ మొదటి ఇన్నింగ్స్‌లో 12 ఓవర్లు వేసి మూడు వికెట్లు పడగొట్టాడు.ఇప్పటికే గాయంతో డేవిడ్ వార్నర్, త్యాగి బౌన్సర్‌తో విన్ పుకోవిస్కి మొదటి టెస్టుకు దూరమయ్యారు.. తాజగా అబాట్ కూడా గాయంతో బాధపడుతుండడం ఆసీస్‌కు ఇబ్బందిగా మారనుంది. అయితే శుక్రవారం ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రా ఆడిన స్ట్రెయిట్ డ్రైవ్ బౌలర్ కామెరాన్ గ్రీన్ ముఖంపై బలంగా తగిలిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్ట్రేలియా పేర్కొంది. గ్రీన్ గాయం నుంచి కోలుకున్నాడని.. అతను ఆసీస్ ఎతో మ్యాచ్‌లో కొనసాగనున్నాడని తెలిపింది. కాగా ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా రెండో రోజు టీమిండియా లంచ్ విరామం తర్వాత 70 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.(చదవండి : నెటిజన్ కామెంట్‌కు గబ్బర్ ధీటైన కౌంటర్) ఓపెనర్ పృథ్వీ షా మరోసారి విఫలం కాగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 61, శుబ్‌మన్ గిల్ 61 పరుగులతో ఆకట్టుకోగా.. కెప్టెన్ రహానే 38 పరుగులు చేశాడు. ప్రస్తుతం విహారి 63, రిషబ్ పంత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 108 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్‌కు ఆధిక్యం లభించింది. బుమ్రా హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 194 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా మొదటి ఇన్నింగ్స్ కలుపుకొని 334 పరుగుల ఆధిక్యంలో ఉంది. -
ఇషాంత్ అవుట్
క్రైస్ట్‌చర్చ్: కివీస్ పర్యటనలో ఆఖరి పోరుకు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. అతని కుడి చీలమండకు గాయం కావడంతో రెండో టెస్టుకు అతను అందుబాటులో లేకుండా పోయాడు. ఇతని స్థానంలో ఉమేశ్ యాదవ్ బరిలోకి దిగే అవకాశముంది. ఇషాంత్‌కు అయిన గాయం కొత్తదేం కాదు. జనవరిలో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పుడే అతను కివీస్ పర్యటనకు అనుమానమేనని వార్తలొచ్చాయి. అయితే చక్కటి ఫామ్‌లో ఉన్న ఇషాంత్‌ను... వేగంగా కోలుకున్నాడనే కారణంతో టెస్టు జట్టులోకి తీసుకున్నారు. టీమ్ మేనేజ్మెంట్ ఆశించినట్లుగానే తొలిటెస్టులో ఇషాంత్ (5/68) రాణించాడు. బ్యాటింగ్ వైఫల్యంతో భారత్ ఈ మ్యాచ్ ఓడింది. శుక్రవారం జట్టు సభ్యులు ప్రాక్టీసు చేస్తుండగా... అతను కూడా వచ్చాడు. కానీ అసౌకర్యంగా కనిపించడంతో నెట్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నాడు. దీంతో జట్టు మేనేజ్మెంట్ ముందు జాగ్రత్తగా అతని కుడి చీలమండకు స్కానింగ్ కూడా తీయించింది. రిపోర్టులు ప్రతికూలంగా వచ్చినట్లు సమాచారం. బౌలింగ్‌లో ఎదురుదెబ్బ తగిలినా... బ్యాటింగ్‌లో మాత్రం యువ ఓపెనర్ పృథ్వీ షా ఫిట్నెస్తో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. అతని ఎడమ పాదానికి అయిన వాపు మానిందని, రెండో టెస్టు ఆడతాడని భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. ఫామ్‌లోలేని వెటరన్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ జడేజాను తీసుకునేది ఖాయమైంది. జడేజా బ్యాటింగ్ చేయగల సమర్థుడు కావడంతో అతన్ని తీసుకోవాలని కోచ్‌తో పాటు కెప్టెన్ కోహ్లి నిర్ణయించినట్లు తెలిసింది. బ్యాటింగ్ పిచ్! క్రైస్ట్‌చర్చ్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలం. గత టెస్టులా కాకుండా ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశముంది. ఇది బ్యాట్స్‌మెన్‌కు ఊరటనిచ్చే అంశం. ప్రత్యేకించి భారత బ్యాట్స్‌మెన్ ఆఖరి పోరులో అదిరిపోయే ఆట ఆడేందుకు ఇది చక్కని వేదిక. -
ఇషాంత్ శర్మకు గాయం
న్యూజిలాండ్ పర్యటనకు ముందు భారత క్రికెట్ జట్టును కొంత ఆందోళనపరిచే వార్త ఇది. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ బరిలోకి దిగిన టీమిండియా ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. విదర్భ కెప్టెన్ ఫైజ్ ఫజల్‌కు బౌలింగ్ చేసిన ఇషాంత్ వెనక్కి తిరిగి గట్టిగా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేసే క్రమంలో పట్టు తప్పి పడిపోయాడు. నొప్పితో విలవిల్లాడుతున్న అతడు సహాయక సిబ్బంది వెంట రాగా మైదానం వీడాల్సి వచ్చింది. ‘ఇషాంత్ కాలు మడత పడిపోవడంతో గాయమైంది. వాపు చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గాయం తీవ్రంగానే కనిపిస్తుండటంతో ఇక మ్యాచ్‌లో కొనసాగించరాదని నిర్ణయించాం. అది ఫ్రాక్చర్ కాకూడదని కోరుకుంటున్నాం’ అని ఢిల్లీ జట్టు ప్రకటించింది. ఇషాంత్ త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నామని, అయితే నిబంధనల ప్రకారం అతను జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లి పునరావాస చికిత్స తీసుకోవాల్సిందేనని కూడా వెల్లడించింది. ఆ తర్వాత రిటర్న్ టు ప్లే (ఆర్టీపీ) సర్టిఫికెట్ సమర్పిస్తేనే భారత జట్టు కోసం సెలక్టర్లు పరిశీలిస్తారు. అయితే ఇషాంత్ ప్రస్తుతం భారత జట్టులో టెస్టు స్పెషలిస్ట్‌గానే కొనసాగుతున్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న నేపథ్యంలో ఇషాంత్ కోలుకునేందుకు తగినంత సమయం ఉంది. -
గాయాలను లెక్కచేయని హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ బిపాసా బసుకు పని మీద ఆసక్తి, చిత్తశుద్ధి చాలా ఎక్కువ. తాను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నిర్మాతకు, దర్శకుడికి, ఇతర నటీనటులకు ఇబ్బంది కలగకూడదని ఆమె భావిస్తుంటుంది. అందుకే.. చీలమండకు గాయం అయినా కూడా ఏమాత్రం తగ్గకుండా షూటింగ్ చేస్తానని ముందుకు వస్తోంది. 'ఎలోన్' అనే సూపర్ నేచురల్ సినిమాలో ఆమె ప్రస్తుతం నటిస్తోంది. దాంతోపాటు భూషణ్ పటేల్ దర్శకత్వంలో కరణ్ సింగ్ గ్రోవర్ హీరోగా వస్తున్న సినిమాలోనూ బిపాసా చేస్తోంది. ఈ రెండు సినిమాలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాలు వాచినా కూడా పట్టించుకోకుండా షూటింగులకు హాజరవుతోంది. కాలికి ఓ బ్యాండేజి కట్టుకుని నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. కాలు నొప్పి పెడుతున్న మాట వాస్తవమేనని, అయినా షూటింగుకు మాత్రం ఇబ్బంది అవకూడదని చెప్పింది. ఇంతకుముందు విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన 'క్రీచర్ 3డి' అనే సినిమాలో బిపాషా నటించింది.