మడమ, దాని పరిసరాల్లో వచ్చే నొప్పిని చీలమండ నొప్పి (యాంకిల్ పెయిన్) అంటారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనంగా మారడం మొదలుకొని దేహంలో పెరిగిన యూరిక్ యాసిడ్ చీలమండ కీళ్లలో స్ఫటికాలుగా మారి ఒరుసుకుపోవడం వరకు అనేక కారణాల వల్ల ఈ నొప్పి రావచ్చు.
ఇది తగ్గడానికి ఈ కింది సూచనలు పాటించడం మంచిది. అవి...
- పాదాలకు నప్పేలా పాదరక్షలు వేసుసుకోవడంతో పాటు అవి మెత్తగా ఉండటం మంచిది.
- హైహీల్స్ మంచిది కాదు.
- క్రేప్‌బ్యాండ్ చుట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది
- ఊబకాయం వల్ల దేహం బరువు చీలమండపై పడి నొప్పి పెరుగుతుంది. బరువు తగ్గించుకోవడం మేలు చేసే అంశం.
- వాపు ఉన్నప్పుడు... పడుకునే సమయంలో కాలి కింద తలగడ ఉంచి, చీలమండ మిగతా శరీర భాగం కంటే కాస్త పైకి ఉండేలా ఆ తలగడను అమర్చాలి. వాపు దగ్గర ఐస్ ప్యాక్ పెట్టాలి. ∙నడిచేటప్పుడు మడమ మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తల తర్వాతా నొప్పి తగ్గకపోతే డాక్టర్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.
(చదవండి: ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..)
Comments
Please login to add a commentAdd a comment