India vs South Africa 1st Test: Jasprit Bumrah Suffers Painful Ankle Injury in Centurion Test - Sakshi
Sakshi News home page

IND Vs SA 1st Test: బుమ్రాకు గాయం.. టీమిండియా ఆందోళన

Published Tue, Dec 28 2021 6:26 PM | Last Updated on Tue, Dec 28 2021 7:10 PM

IND Vs SA: Video Jasprit Bumrah Suffers Painful Right Ankle Injury - Sakshi

టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 11వ ఓవర్‌ ఐదో బంతి వేసిన తర్వాత బుమ్రా కుడికాలు బెణికింది. దీంతో నొప్పితో విలవిల్లాలాడిన ఈ స్పీడస్టర్‌ మైదానం వీడాడు. ఫిజియో సాయంతో పెవిలియన్‌ చేరిన బుమ్రా కాలు పరిశీలించిన ఫిజియో చీలమండకు గాయం అయినట్లు తెలుస్తుందని పేర్కొన్నాడు. దీంతో బుమ్రా కాసేపు డగౌట్‌లో కూర్చున్నాడు.

ఆ తర్వాత సహచర క్రికెటర్‌ సహాయంతో మైదానంలో అడుగుపెట్టినప్పటికి నడవడంలో ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీంతో బౌలింగ్‌ చేయని బుమ్రా మళ్లీ పెవిలియన్‌కు వెళ్లి కూర్చున్నాడు,. అతని స్థానంలో శ్రేయాస్‌ అయ్యర్‌ సబ్‌స్టిట్యూట్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఎక్స్‌రే తీసిన తర్వాతే బుమ్రా గాయంపై మరింత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్న బుమ్రా నొప్పితో బాధపడుతూ ఫిజియోతో మర్ధన చేయించుకోవడం కెమెరాలకు చిక్కింది. అయితే మళ్లీ బుమ్రా బౌలింగ్‌ వస్తాడా రాడా అనేది సందిగ్థంగా మారింది.

అయితే ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే బుమ్రా షాక్‌ ఇచ్చాడు. ఒక పరుగు చేసిన ప్రొటీస్‌ కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించి టీమిండియాకు బ్రేక్‌ అందించాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో తడబడుతుంది. 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. టెంబా బవుమా 31, క్వింటన్‌ డికాక్‌ 34 పరుగులతో ఆడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement