
Conflict Between Jasprit Bumrah Vs Marco Jansen Viral: కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రొటిస్ బ్యాట్స్‌మన్ మార్కో జాన్సెన్‌ను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇందులో ఆసక్తికరమేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ముగిసిన రెండో టెస్టులో బమ్రా, మార్కో జాన్సెన్ మధ్య మాటలయుద్ధం జరిగింది. టీమిండియా బ్యాటింగ్ సమయంలో బుమ్రాకు జాన్సెన్ వరుస బౌన్సర్లు సంధించాడు. ఓపికతో ఉన్న బుమ్రాను తన మాటలతో మార్కో జాన్సెన్ మరింత కవ్వించాడు. దీంతో బుమ్రా కూడా ధీటుగా బదులిస్తూ జాన్సెన్ వద్దకు వచ్చాడు. ఇది చూసిన అంపైర్లు జోక్యం చేసుకొని వారిద్దరిని విడగొట్టడంతో గొడవ ముగిసింది. ఈ గొడవను మిగతావాళ్లు అక్కడే మరిచిపోయారు.. కానీ బుమ్రా మాత్రం మనసులోనే ఉంచుకున్నాడు.
చదవండి: Jasprit Bumrah: బుమ్రా అరుదైన ఘనత.. కపిల్, పఠాన్‌ల సరసన
తాజాగా మూడో టెస్టులో మార్కో జాన్సెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేయడం ద్వారా బుమ్రా తన పవరేంటో చూపించాడు. రెండో రోజు టీ విరామం అనంతరం బుమ్రా వేసిన ఓవర్‌లో జాన్సెన్‌ను బౌన్సర్లతో భయపెట్టాడు. ఇక ఒక సూపర్ డెలివరీకి జాన్సెన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. షార్ట్‌పిచ్ అయిన బంతి నేరుగా ఆఫ్‌స్టంప్‌ను ఎగురగొట్టడంతో మార్కో జాన్సెన్ కనీసం బుమ్రా వైపు కూడా చూడకుండాను వెనుదిరగడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు.. బుమ్రాతో గెలుకున్నాడు.. ఫలితం అనుభవించాడు.. అంటూ కామెంట్స్ చేశారు. కాగా రెండో రోజు ఆటలో భాగంగా బుమ్రాకు తోడు షమీ, ఉమేశ్ కూడా ఆకట్టుకోవడంతో మూడో టెస్టులో భారత్‌కు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఓవరాల్‌గా 70 పరుగుల ముందంజలో ఉంది.
చదవండి: SA vs IND: జస్‌ప్రీత్ బుమ్రా 142.3 స్పీడ్.. పాపం ప్రొటిస్ కెప్టెన్.. వీడియో వైరల్!
Bumrah v Jansen 🥵 pic.twitter.com/rRgSpJ7UTj
— J (@jaynildave) January 12, 2022