IND vs SL 1st Test: Rahul Dravid Not Happy With the No-Ball Bowled by Bumrah - Sakshi
Sakshi News home page

IND vs SL: బుమ్రాకు ఇది మూడోసారి.. ద్రవిడ్‌ అసహనం

Published Sat, Mar 5 2022 6:10 PM | Last Updated on Sat, Mar 5 2022 6:58 PM

Coach Dravid Angry 3rd umpire Gives No-ball After Bumrah Takes wicket - Sakshi

టీమిండియా, శ్రీలంక మధ్య తొలి టెస్టులో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక ఇన్నింగ్స్‌ సమయంలో 32వ ఓవర్‌ను బుమ్రా వేశాడు. అప్పటికే బుమ్రా బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. కాగా ఆ ఓవర్‌ మూడో బంతి స్లో కటర్‌ అయి నిస్సాంకను తాకుతూ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. క్లీన్‌బౌల్డ్‌ చేశానని బుమ్రా ఎగిరి గెంతేశాడు. మిగతా టీమిండియా ఆటగాళ్లు కూడా సంబరాల్లో మునిగిపోయారు. నిస్సాంక కూడా తాను ఔట్‌ అని పెవిలియన్‌ బాట పట్టాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ ఎదురైంది.

అంపైర్‌ నో బాల్‌ అంటూ సిగ్నల్‌ ఇచ్చాడు. అంతే సంతోషంలో మునిగిపోయిన ఆటగాళ్ల మొహాలు మాడిపోయాయి. డ్రెస్సింగ్‌ రూం నుంచి ద్రవిడ్‌ కూడా ఏంటి బుమ్రా అన్నట్లుగా కోపంతో లుక్‌ ఇచ్చాడు. రోహిత్‌ శర్మ కూడా ఏం చేయలేక .. వాట్‌ బుమ్రా అంటూ అరిచాడు. బుమ్రా మాత్రం ఈ విషయంలో ఏం చేయగలడు.. అది అతని తప్పు కాదు. అయితే బుమ్రా ఒక ఆటగాడిని నో బాల్‌ వేసి క్లీన్‌బౌల్డ్‌ చేయడం టెస్టుల్లో ఇది మూడోసారి. ఇంతకముందు ఆస్ట్రేలియాకు చెందిన మార్ష్‌, ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌ ఓలి రాబినసన్‌లు కూడా ఇదే తరహాలో బమ్రా నుంచి తప్పించుకున్నారు. తాజాగా నిస్సాంకా మూడో ఆటగాడిగా నిలిచాడు. దీంతో బుమ్రాకు నో బాల్స్‌ బెడద ఎక్కువైందంటూ అభిమానులు కామెంట్‌ చేశారు.

ఇక రెండో రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యం చూపించింది.  మొదట బ్యాటింగ్‌లో రవీంద్ర జడేజా సూపర్‌ సెంచరీ(175 నాటౌట్‌) మెరవడంతో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 578 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంకను టీమిండియా బౌలర్లు ఒక ఆట ఆడుకున్నారు. కేవలం 45 నిమిషాల వ్యవధిలోనే లంక టీమిండియా బౌలర్ల దాటికి నాలుగు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో మరో 466 పరుగులు వెనుకబడి ఉంది. 

చదవండి: Ravindra Jadeja: జడ్డూ డబుల్‌ సెంచరీ మిస్‌.. మళ్లీ విలన్‌గా ద్రవిడ్‌?!

IND vs SL: సీరియస్‌ రనౌట్‌ను కామెడీ చేశారు.. మనవాళ్లు ఊరుకుంటారా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement