IND vs SL 1st Test: Fans Slams Rohit Sharma-Rahul Dravid After Jadeja Miss Double Century - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: జడ్డూ డబుల్‌ సెంచరీ మిస్‌.. మళ్లీ విలన్‌గా ద్రవిడ్‌?!

Published Sat, Mar 5 2022 3:49 PM | Last Updated on Sat, Mar 5 2022 4:57 PM

Fans Slams Rohit Sharma-Rahul Dravid After Jadeja Miss Double Century - Sakshi

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా శ్రీలంకతో తొలి టెస్టులో సూపర్‌ ప్రదర్శనతో మెరిశాడు. 45 పరుగులతో రెండో రోజు క్రీజులోకి వచ్చిన జడేజా ఆఖరుదాకా నిలిచి టీమిండియా భారీ స్కోరు చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు. టెస్టు కెరీర్‌లో రెండో సెంచరీ సాధించిన జడేజా (228 బంతుల్లో 175 పరుగులు నాటౌట్‌, 17 ఫోర్లు, 3 సిక్సర్లు)తో నిలిచాడు. జడ్డూ దెబ్బకు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది. 175 పరుగులు నాటౌట్‌తో జడేజా ఆడుతున్న సమయంలో రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంపై విమర్శలు వస్తున్నాయి. 

మ్యాచ్‌లో జడేజా స్పీడ్‌ చూస్తే 25 పరుగులు చేయడం పెద్ద కష్టమేమి కాదు. కానీ జడేజాను డబుల్‌ సెంచరీ చేయనివ్వకుండా అర్థంతరంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడంపై అభిమానులు మండిపడుతున్నారు. టెస్టుల్లో డబుల్‌ సెంచరీ సాధించాలని ఏ క్రికెటర్‌ అయిన కలగంటాడు. రవీంద్ర జడేజాకు కూడా లంకతో మ్యాచ్‌లో ఆ అవకాశం వచ్చింది. కానీ జడేజా మెయిడెన్‌ డబుల్‌ సెంచరీకి 25 పరుగుల దూరంలో ఉ‍న్నప్పుడు రోహిత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అయితే ఆ ఆలోచన రోహిత్‌ది కాదని.. టీమిండియా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌దని కొందరు పేర్కొంటున్నారు. నిర్ణయం ఎవరిదైనా బలయ్యింది మాత్రం జడేజానే. జడేజా డబుల్‌ సెంచరీ కోసం ఆగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదు. కేవలం 25 పరుగుల వెనుక  ద్రవిడ్‌, రోహిత్‌ల స్ట్రాటజీ ఎంటో అంతుచిక్కలేదంటూ అభిమానులు వాపోయారు.

అప్పుడు సచిన్‌ను.. ఇప్పుడు జడేజాను..
ఇంతకముందు కూడా ద్రవిడ్‌ తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు సచిన్‌ను డబుల్‌ సెంచరీ చేయకుండా అడ్డుపడ్డాడు. 2004లో టీమిండియా  పాకిస్తాన్‌లో పర్యటించింది. ముల్తాన్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో సచిన్‌ టెండూల్కర్‌ 194 పరుగుల వద్ద ఉన్నప్పుడు అప్పటి కెప్టెన్‌ ద్రవిడ్‌ అనూహ్యంగా ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. అలా కేవలం ఆరు పరుగుల దూరంలో సచిన్‌ డబుల్‌ సెంచరీ చేయలేకపోయాడు. ద్రవిడ్‌ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. ద్రవిడ్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇదే మ్యాచ్‌లో మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్‌ ట్రిపుల్‌ సెంచరీ బాదిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా 52 పరుగుల ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది.

తాజాగా రవీంద్ర జడేజా డబుల్‌ సెంచరీ చేయకుండా మరోసారి రాహుల్‌ ద్రవిడ్‌ అడ్డుపడడంతో సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు. ప్రత్యక్షంగా రోహిత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసినప్పటికి.. దీని వెనుక ద్రవిడ్‌ ప్లాన్‌ ఉందంటూ విమర్శించారు. ఈసారి ద్రవిడ్‌కు తోడూ.. రోహిత్‌ శర్మను కూడా అభిమానులు ఏకిపారేస్తున్నారు. చాలా మంది జడేజాను.. సచిన్‌తో పోలుస్తూ.. అప్పుడు.. ఇప్పుడు ద్రవిడ్‌ విలన్‌లా తయరయ్యాడంటూ ట్వీట్స్‌ చేశారు. కావాలనే జడేజాను డబుల్‌ సెంచరీ చేయకుండా అడ్డుపడ్డాడంటూ పేర్కొన్నారు.

చదవండి: Shane Warne: వార్న్‌ మృతిపై థాయ్‌ పోలీసులు ఏమన్నారంటే..

IND vs SL: సీరియస్‌ రనౌట్‌ను కామెడీ చేశారు.. మనవాళ్లు ఊరుకుంటారా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement