Marco Jansen
-
తలకు గాయం.. అప్డేట్ ఇచ్చిన తిలక్ వర్మ! ఆ విషయంలో క్రెడిట్ వాళ్లకే
సౌతాఫ్రికాతో మూడో టీ20లో గెలుపు కోసం టీమిండియా ఆఖరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారీ స్కోరు సాధించినా.. చివరి ఓవర్ వరకు ఆతిథ్య జట్టు గట్టిపోటీనిచ్చింది. దీంతో భారత బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా సెంచరీ హీరో తిలక్ వర్మ గాయపడ్డాడు.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆఖరి ఓవర్ వేశాడు. అప్పటికే జోరు మీదున్న ప్రొటిస్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో రెండో బంతికి కవర్స్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అయితే, ఆ బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మ.. క్యాచ్ అందుకునే క్రమంలో కిందపడ్డాడు.తిలక్ తల నేలకు బలంగా తాకినట్లుఫలితంగా క్యాచ్ మిస్ కావడమే గాక.. తిలక్ తల నేలకు బలంగా తాకినట్లు రీప్లేలో కనిపించింది. దీంతో భారత శిబిరంలో కలకలం రేగింది. వెంటనే ఫిజియో వచ్చి తిలక్‌ను పరిస్థితిని పర్యవేక్షించాడు. మరోవైపు... ఈ సిక్సర్‌తో జాన్సెన్ యాభై పరుగుల మార్కును పూర్తి చేసుకుని.. టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ(16 బంతుల్లో) నమోదు చేసిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గా నిలిచాడు.ఇదిలా ఉంటే.. తిలక్ వర్మ గాయంపై అభిమానుల్లోనూ ఆందోళన నెలకొంది. అతడు తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందేహాల నడుమ.. పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో తిలక్ వర్మ తన గాయంపై అప్డేట్ అందించాడు.నేను బాగానే ఉన్నాను‘‘నేను బాగానే ఉన్నాను. క్యాచ్ అందుకునేటపుడు వెలుతురు కళ్లలో పడి.. బంతిని పట్టుకోవడం సాధ్యం కాలేదు. ఏదేమైనా మేము గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. అదే విధంగా.. తాను విధ్వంసకర శతకం బాదడంలో క్రెడిట్ మొత్తం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఇవ్వాలని తిలక్ అన్నాడు.107 పరుగులుఈ మ్యాచ్‌లో మూడో నంబర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు సూర్యకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా సెంచూరియన్ వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ 56 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో ఏకంగా 107 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి భారత్ 219 పరుగులు స్కోరు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఇక లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 208 పరుగుల వద్ద నిలిచి.. పదకొండు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో తిలక్.. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హెన్రిచ్ క్లాసెన్(41)క్యాచ్ అందుకుని మ్యాచ్‌ను మలుపు తిప్పడంలో దోహదపడ్డాడు.చదవండి: Mohammed Shami: రీ ఎంట్రీలో చెలరేగిన మహ్మద్ షమీ.. -
టీమిండియాపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. వేలంలో అతడికి రూ. 10 కోట్ల ధర!
టీమిండియాతో మూడో టీ20లో సౌతాఫ్రికా అంత తేలికగా తలవంచలేదు. సూర్యకుమార్ సేన విధించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి వరకు పోరాడగలిగింది. ఇందుకు ప్రధాన కారణం ప్రొటిస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్.కేవలం 16 బంతుల్లోనేస్పెషలిస్టు బ్యాటర్లంతా దాదాపుగా చేతులెత్తేసిన వేళ.. జాన్సెన్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ పరుగుల వరద పారించాడు. ఒకానొక దశలో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడా అనేంతలా అద్భుత బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.తొలి సౌతాఫ్రికా ప్లేయర్గాఈ క్రమంలో సౌతాఫ్రికా తరఫున అత్యంత వేగంగా అంతర్జాతీయ హాఫ్ సెంచరీ సాధించిన రెండో బ్యాటర్‌గా మార్కో జాన్సెన్ రికార్డు సాధించాడు. అంతేకాదు.. టీమిండియాపై టీ20లలో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి సౌతాఫ్రికా ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించాడు.ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 17 బంతులు ఎదుర్కొన్న జాన్సెన్ నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 317కు పైగా స్ట్రైక్‌రేటుతో 54 పరుగులు సాధించాడు. భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గనుక జాన్సెన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకోకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఎట్టకేలకు జాన్సెన్ అవుట్ కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల వద్ద నిలిచిన సౌతాఫ్రికా టీమిండియా చేతిలో ఓటమిపాలైంది.ఇదిలా ఉంటే.. మూడో టీ20లో జాన్సెన్ ఒక వికెట్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ రూపంలో కీలక వికెట్ తీసి సత్తా చాటాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ(107) సెంచరీతో చెలరేగగా.. మార్కో జాన్సెన్ సైతం తన ప్రతిభను చాటుకున్నాడు.రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా?ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ మార్కో జాన్సెన్ను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశాడు. ‘‘మార్కో జాన్సెన్.. రూ. 10 కోట్ల ప్లేయర్ కాదంటారా? నేనైతే అవుననే అంటాను’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2025 మెగా వేలం నేపథ్యంలో జాన్సెన్ గురించి ఫ్రాంఛైజీలకు గుర్తు చేస్తూ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024లో మార్కో జాన్సెన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే, ఈ సీజన్లో స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ నేపథ్యంలో వేలానికి ముందు సన్‌రైజర్స్ అతడిని విడిచిపెట్టింది.సౌతాఫ్రికా వర్సెస్ టీమిండియా స్కోర్లువేదిక: సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్టాస్: సౌతాఫ్రికా.. తొలుత బౌలింగ్టీమిండియా స్కోరు- 219/6 (20)సౌతాఫ్రికా స్కోరు- 208/7 (20)ఫలితం: పదకొండు పరుగుల తేడాతో టీమిండియా విజయం.. 2-1తో భారత్ పైచేయిప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: తిలక్ వర్మ(56 బంతుల్లోనే 107 నాటౌట్).చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత -
టీమిండియాతో టీ20 సిరీస్.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్ పేసర్లు రీ ఎంట్రీ
త్వరలో టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (అక్టోబర్ 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఎయిడెన్ మార్క్రమ్ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మార్కో జన్సెన్, గెరాల్డ్ కొయెట్జీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్ కోసం లుంగి ఎంగిడిని పరిగణలోకి తీసుకోలేదు. ఎంగిడిని త్వరలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం రిజర్వ్‌గా ఉంచారు. సౌతాఫ్రికా యూఏఈలో ఆడిన వైట్‌బాల్ సిరీస్‌లకు దూరంగా ఉన్న హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, కేశవ్ మహారాజ్ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆల్‌రౌండర్ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్క్యాప్డ్ ఆల్‌రౌండర్ అండీల్ సైమ్‌లేన్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లో నకాబా పీటర్ మరో స్పిన్ ఆప్షన్‌గా ఉన్నాడు. జాతీయ కాంట్రాక్ట్ దక్కని తబ్రేజ్ షంషిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న ఎయిడెన్ మార్క్రమ్, కేశవ్ మహారాజ్, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్ నవంబర్ 4న మిగతా జట్టు సభ్యులతో కలుస్తారు.టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్, ర్యాన్ రికెల్టన్, అండీల్ సైమ్‌లేన్, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, సంజూ శాంసన్, జితేశ్ శర్మ, రవి బిష్ణోయ్, విజయ్‌కుమార్ వైశాఖ్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, యశ్ దయాల్, ఆవేశ్ ఖాన్షెడ్యూల్..తొలి టీ20- నవంబర్ 8- డర్బన్రెండో టీ20- నవంబర్ 10- గ్వెబెర్హామూడో టీ20- నవంబర్ 13- సెంచూరియన్నాలుగో టీ20- నవంబర్ 15- జొహనెస్బర్గ్చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..? -
స్టీవ్ స్మిత్ మెరుపు ఇన్నింగ్స్.. మేజర్ లీగ్ క్రికెట్ విజేత వాషింగ్టన్ ఫ్రీడం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్ టైటిల్‌ను వాషింగ్టన్ ఫ్రీడం కైవసం చేసుకుంది. ఇవాళ (జులై 29) జరిగిన ఫైనల్లో ఆ జట్టు శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్.. స్టీవ్ స్మిత్ (52 బంతుల్లో 88; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగుల భారీ స్కోర్ చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు) ఆఖర్లో చెలరేగి ఆడాడు. సీజన్ ఆధ్యాంతం భీకర ఫామ్‌లో ఉండిన ట్రవిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులకే ఔటయ్యాడు. ఆండ్రియస్ గౌస్ (14 బంతుల్లో 21; 3 ఫోర్లు, సిక్స్), ముక్తార్ అహ్మద్ (9 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించారు. యూనికార్న్స్ బౌలర్లలో కమిన్స్ 2, హసన్ ఖాన్, హరీస్ రౌఫ్, డ్రైస్డేల్ తలో వికెట్ పడగొట్టారు.నిప్పులు చెరిగిన జన్సెన్.. రచిన్ మాయాజాలం208 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూనికార్న్స్ మార్కో జన్సెన్ (4-1-28-3), రచిన్ రవీంద్ర (4-0-23-3), ఆండ్రూ టై (2-0-12-2), సౌరభ్ నేత్రావల్కర్ (4-0-33-1), మ్యాక్స్‌వెల్ (2-0-14-1) ధాటికి 16 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. యూనికార్న్స్ ఇన్నింగ్స్‌లో పదో నంబర్ ఆటగాడు కార్మీ రౌక్స్ చేసిన 20 పరుగులే అత్యధికం. జన్సెన్, రచిన్ అద్భుతంగా బౌలింగ్ చేసి యూనికార్న్స్ పతనాన్ని శాశించారు. ఈ ఎడిషన్ ఆధ్యాంతం అద్భుత విజయాలు సాధించిన వాషింగ్టన్ ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆశించిన ప్రదర్శన కనబర్చి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ ఎడిషన్‌లో వాషింగ్టన్ టీమ్‌ను స్టీవ్ స్మిత్ విజయవంతంగా ముందుండి నడిపించాడు. వాషింగ్టన్ టీమ్‌కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. -
WI vs SA: విండీస్‌తో సిరీస్.. సంచలన ఆటగాడి ఎంట్రీ
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం సన్నద్ధం కానుంది. విండీస్ పర్యటనలో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సిద్ధమైంది.తొలిసారి జాతీయ జట్టులోఈ క్రమంలో 16 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ సౌతాఫ్రికా సోమవారం ప్రకటించింది. దేశవాళీ క్రికెట్లో దుమ్ములేపిన 25 ఏళ్ల మాథ్యూ బ్రీట్జ్కేకు తొలిసారిగా జాతీయ జట్టులో చోటిచ్చారు సెలక్టర్లు.అదే విధంగా.. వికెట్ కీపర్ ర్యాన్ రికెల్టన్ కూడా ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. కాగా తెంబా బవుమా కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడనున్న ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ దూరం కానున్నాడు.నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న ఈ పేసర్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతినిచ్చింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కొన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘గత కొంత కాలంగా పరిమిత ఓవర్ల క్రికెట్‌తో బిజీగా ఉన్న మేము.. తిరిగి టెస్టు క్రికెట్‌తో బిజీ కానున్నాము.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో మెరుగైన స్థితిలో నిలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అందుకే కరేబియన్ జట్టుతో పోరుకు పటిష్ట జట్టును ఎంపిక చేశాం.డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టిదేశవాళీ క్రికెట్లో అదరగొట్టిన మాథ్యూకు ఈసారి చోటిచ్చాం. మార్కో జాన్సెన్కు విశ్రాంతి అవసరమని భావించాం’’ అని తెలిపాడు. సౌతాఫ్రికా డొమెస్టిక్ క్రికెట్ గత సీజన్లో మాథ్యూ బ్రీట్జ్కే 322 పరుగులు సాధించాడు. ఇండియా-ఏ జట్టుతో అనధికారిక సిరీస్‌లోనూ ఆడాడు.కాగా ఆగష్టు 7 నుంచి వెస్టిండీస్- సౌతాఫ్రికా మధ్య టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. కరేబియన్ దీవుల్లోని ట్రినిడాడ్, టొబాగో ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.ఇక ఇదే వెస్టిండీస్ గడ్డపై ఇటీవల సౌతాఫ్రికాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా చేతిలో ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు:తెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హామ్, మాథ్యూ బ్రీట్జ్కే, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, టోనీ డి జోర్జీ, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, డేన్ పాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్, కైల్ వెరెన్నే. -
T20 World Cup 2024: దారుణంగా ఢీకొట్టుకున్నారు.. జన్సెన్కు తీవ్ర గాయం..!
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా వెస్టిండీస్‌తో ఇవాళ (జూన్ 24) జరుగుతున్న కీలక సమరంలో ఓ ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. మార్క్రమ్ బౌలింగ్ కైల్ మేయర్స్ కొట్టిన సిక్సర్‌ను క్యాచ్‌గా మలిచే క్రమంలో మార్కో జన్సెన్, కగిసో రబాడ తీవ్రంగా గాయపడ్డారు. బౌండరీ లైన్ వద్ద రబాడ, జన్సెన్ ఒకరినొకరు దారుణంగా ఢీకొట్టుకున్నారు. ఈ ఘటనలో జన్సెన్ తీవ్రంగా గాయపడగా.. రబాడ స్వల్ప గాయంతో బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.Kagiso Rabada and Marco Jansen collide on the boundary line 🤯Hope there are no serious injuries 🤞📸: Disney+Hotstar pic.twitter.com/S1PYlR4Ddw— CricTracker (@Cricketracker) June 24, 2024ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేయగలిగింది. తబ్రేజ్ షంషి తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించి విండీస్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. షంషి 4 ఓవర్లలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. షంషికి జతగా సఫారీ బౌలర్లంతా రాణించారు. జన్సెన్, మార్క్రమ్, కేశవ్ మహారాజ్, రబాడ తలో వికెట్ పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc)విండీస్ ఇన్నింగ్స్‌లో రోస్టన్ ఛేజ్ (52) అర్దసెంచరీతో రాణించగా.. కైల్ మేయర్స్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. వీరిద్దరు మినహా విండీస్ బ్యాటర్లంతా చేతులెత్తేశారు. హోప్ 0, పూరన్ 1, రోవ్‌మన్ పావెల్ 1, రూథర్‌ఫోర్డ్ 0, రసెల్ 15, అకీల్ హొసేన్ 6 పరుగులు చేశారు. అల్జరీ జోసఫ్ (11 నాటౌట్), మోటీ (4) నాటౌట్‌గా నిలిచారు. 10 పరుగులు ఎక్సట్రాల రూపంలో వచ్చాయి. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డు తగిలాడు. ఆ జట్టు స్కోర్ 15/2 (2 ఓవర్లలో) వద్ద ఉండగా.. వర్షం మొదలైంది. దీంతో అక్కడే మ్యాచ్‌ను ఆపేశారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవాలంటే మరో 18 ఓవర్లలో 121 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు సెమీస్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మెరుగైన రన్‌రేట్ కలిగిన జట్టు (విండీస్, సౌతాఫ్రికా) సెమీస్‌కు చేరుకుంటుంది. -
దంచికొట్టిన మలన్.. చెలరేగిన పేసర్లు.. ఫైనల్‌కు సన్‌రైజర్స్
SA20, 2024 Qualifier 1 - Sunrisers Eastern Cape won by 51 runs: సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జైత్రయాత్ర కొనసాగుతోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఈ డిఫెండింగ్ చాంపియన్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-1లో డర్బన్ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి.. ఈ సీజన్లో తుదిపోరుకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. దంచికొట్టిన మలన్ సొంతమైదానం న్యూలాండ్స్‌లో మంగళవారం డర్బన్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ మలన్(45 బంతుల్లో 63 రన్స్) దంచికొట్టగా.. కెప్టెన్ ఐడెన్ మార్కరమ్(23 బంతుల్లో 30) కూడా రాణించాడు. చెలరేగిన ఒట్నీల్, జాన్సెన్ వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు స్కోరు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన డర్బన్ సూపర్ జెయింట్స్‌కు సన్‌రైజర్స్ పేసర్లు ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెస్ చుక్కలు చూపించారు. 51 పరుగుల తేడాతో రైజర్స్ గెలుపు ఇద్దరూ తలా నాలుగేసి వికెట్లు పడగొట్టి డర్బన్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. వీరికి తోడు స్పిన్నర్ లియామ్ డాసన్ రెండు కీలక వికెట్లు తీసి 106 పరుగులకే డర్బన్ జట్టును ఆలౌట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. రైజర్స్ విధించిన టార్గెట్‌ను పూర్తిచేయలేక 19.3 ఓవర్లకే డర్బన్ ఇలా చేతులెత్తేయడంతో 51 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. అద్భుత బౌలింగ్‌తో డర్బన్ బ్యాటర్లలో క్వింటన్ డికాక్(20), వియాన్ మల్దర్(38), హెన్రిచ్ క్లాసెన్(23) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఇక సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఒట్నీల్ బార్ట్‌మన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. డర్బన్‌కు మరో అవకాశం ఇదిలా ఉంటే.. డర్బన్ సూపర్ జెయింట్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంది. పర్ల్ రాయల్స్, జోబర్గ్ సూపర్ కింగ్స్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో డర్బన్ ఫైనల్లో చోటు కోసం తలపడాల్సి ఉంటుంది. చదవండి: జింబాబ్వే పర్యటనకు టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల సిరీస్.. షెడ్యూల్ ఇదే 𝑭𝒊𝒓𝒔𝒕 𝒊𝒏𝒏𝒊𝒏𝒈𝒔 𝒂𝒄𝒕𝒊𝒐𝒏 🔥#Betway #SA20 #Playoffs #SECvDSG #WelcomeToIncredible pic.twitter.com/LG99C0gG5r — Betway SA20 (@SA20_League) February 6, 2024 -
సన్‌రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 31 బంతుల్లో
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఢిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ లీగ్‌లో భాగంగా శుక్రవారం పార్ల్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో లైడ్ డాసన్, మార్కో జనెసన్, స్వాన్‌పోయెల్ తలా రెండు వికెట్లు సాధించారు. పార్ల్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్(64) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జానెసన్ విధ్వంసం.. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 71 పరుగులు చేశాడు. అతడితో పాటు టామ్ ఎబెల్ 46 పరుగులతో రాణించాడు. కాగా సన్‌రైజర్స్ ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. చదవండి: IND vs ENG: డబుల్ సెంచరీతో విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యశస్వీ జైశ్వాల్ -
చెలరేగిన ప్రొటిస్ పేసర్లు.. రోహిత్ సేన ఘోర పరాజయం.. ఈసారీ లేనట్లే
సౌతాఫ్రికాలో టీమిండియాకు మరోసారి పరాభవం ఎదురైంది. ఇంత వరకు సఫారీ గడ్డపై ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవని భారత జట్టు ఈసారి కూడా అవకాశాన్ని చేజార్చుకుంది. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఓడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. సొంతగడ్డపై టీమిండియాపై మరోసారి ఆధిపత్యం చాటుకున్న సౌతాఫ్రికా మూడో రోజే ఆటను ముగించి సత్తా చాటింది. ప్రొటిస్ సెంచరీ హీరో డీన్ ఎల్గర్(185) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మంగళవారం మొదలైన బాక్సింగ్ డే టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య సౌతాఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై ప్రొటిస్ పేసర్ల విజృంభణతో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. స్టార్ బ్యాటర్లు, అనుభవజ్ఞులు అయిన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ(5), విరాట్ కోహ్లి(38) విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, ఆరో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన కేఎల్ రాహుల్ అసాధారణ పోరాటం కనబరిచాడు. అర్ధ శతకంతో రాణించి తొలి రోజు ఆటను ముగించాడు. అయితే రెండో రోజు ఆట సందర్భంగా సెంచరీ పూర్తి చేసుకున్న రాహుల్ నండ్రీ బర్గర్ బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ చరమాంకానికి చేరుకుంది. 67.4 ఓవర్లలో కేవలం 245 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు ఓపెనర్ డీన్ ఎల్గర్ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతడికి తోడుగా అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హామ్ అర్ధ శతకం (56)తో రాణించాడు. ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి 66 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసిన సౌతాఫ్రికా.. 11 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. ఇక మూడో రోజు ఆటలో భాగంగా 408 పరుగులకు ఆలౌట్ అయి ఆధిక్యాన్ని 163 పరుగులకు పెంచుకుంది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాను ప్రొటిస్ పేసర్లు దెబ్బకొట్టారు. కగిసో రబడ రోహిత్ శర్మను డకౌట్ చేసి శుభారంభం అందించగా.. నండ్రీ బర్గర్ యశస్వి జైస్వాల్(5)ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్(26)ను పెవిలియన్‌కు పంపిన మార్కో జాన్సెన్.. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్(6)ను కూడా అవుట్ చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఆచితూచి నిలకడగా ఆడాడు. అయితే, కేఎల్ రాహుల్(4) అవుటైన తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనం వేగం పుంజుకుంది. రాహుల్‌ను అవుట్ చేసిన మరుసటి బంతికే బర్గర్.. అశ్విన్‌ను డకౌట్ చేశాడు. ఆ తర్వాత రబడ శార్దూల్ ఠాకూర్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకోగా.. కోహ్లితో సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. సిరాజ్ 4 పరుగులకే పెవిలియన్ చేరగా.. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. అయితే, 34.1వ ఓవర్ వద్ద మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కోహ్లి రబడకు క్యాచ్ అవ్వడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లు తీయగా.. రబడకు రెండు, మార్కో జాన్సెన్కు మూడు వికెట్లు దక్కాయి. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్, రబడ పాలు పంచుకున్నారు. .@imVkohli brings up his 5️⃣0️⃣ He came out in the middle with all guns blazing countering the fiery 🇿🇦 bowling attack 🔥 Will the 👑 go on & convert it into a big one? Tune in to #SAvIND 1st Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/edhPpCavOi — Star Sports (@StarSportsIndia) December 28, 2023 -
Ind Vs SA: టీమిండియా ఆలౌట్.. సౌతాఫ్రికా ఘన విజయం
South Africa Vs India 1st Test Day 3 Updates: సౌతాఫ్రికా ఘన విజయం 34.1: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లి(76) రూపంలో టీమిండియా పదో వికెట్ కోల్పోయింది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 34.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన భారత్.. 131 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌతాఫ్రికా ఏకంగా ఇన్నింగ్స్ మీద 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న రోహిత్ సేన కల ఇప్పటికి కలగానే మిగిలిపోయింది. ప్రొటిస్ పేసర్లలో నండ్రీ బర్గర్ నాలుగు వికెట్లతో చెలరేగి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. రబడ రెండు వికెట్లు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా రనౌట్‌లో ఎల్గర్, రబడ భాగమయ్యారు. అంతకు ముందు సౌతాఫ్రికా 408 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. డీన్ ఎల్గర్ సెంచరీ(185)తో రాణించగా.. బెడింగ్హామ్(56), మార్కో జాన్సెన్(84- నాటౌట్) అర్ధ శతకాలతో మెరిశారు. తొమ్మిదో వికెట్ కోల్పోయిన టీమిండియా 31.5: సిరాజ్ రూపంలో టీమిండియా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ప్రసిద్ కృష్ణ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 121/9 (31.5). కోహ్లి 67 పరుగులతో ఆడుతున్నాడు. 31.3: ఫోర్ బాదిన సిరాజ్ బుమ్రా రనౌట్.. ఎనిమిదో వికెట్ డౌన్ 30.2: రబడ బౌలింగ్‌లో కోహ్లి పరుగుకు యత్నించగా.. సమన్వయ లోపం కారణంగా బుమ్రా రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 117/8 (30.5) ఏడో వికెట్ కోల్పోయిన భారత్ 28.3: రబడ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగిన శార్దూల్ ఠాకూర్(2). జస్ప్రీత్ బుమ్రా క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 105/7 (28.3) నెమ్మదిగా ఆరంభించి.. దూకుడు పెంచిన కోహ్లి కఠినమైన సెంచూరియన్ పిచ్‌పై నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లి.. తర్వాత దూకుడు పెంచాడు. వరుసగా వికెట్లు పడుతున్న తరుణంలో ఆచితూచి ఆడిన ఈ రన్‌మెషీన్.. వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తూ 50 పరుగుల మార్కు అందుకున్నాడు. 61 బంతుల్లో హాఫ్ సెంచరీ(53) పూర్తి చేసుకున్నాడు. వచ్చీ రాగానే అశ్విన్‌ను పెవిలియన్‌కు పంపిన బర్గర్ 25.6: నండ్రే బర్గర్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. తొలుత రాహుల్‌ను అవుట్ చేసిన ఈ యంగ్ పేసర్.. అతడి స్థానంలో వచ్చిన అశూను కూడా పెవిలియన్‌కు పంపాడు. బెడింగ్హామ్కు క్యాచ్ ఇచ్చి అశ్విన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. స్కోరు: 96-6(26). శార్దూల్ ఠాకూర్ క్రీజులోకి వచ్చాడు. ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా 25.5: కేఎల్ రాహుల్(4) రూపంలో టీమిండియా ఐదో వికెట్ కోల్పోయింది. నండ్రే బర్గర్ బౌలింగ్‌లో మార్క్రమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 96/5 (25.5). అర్ధ శతకానికి చేరువైన కోహ్లి 20.6: కోయెట్జీ బౌలింగ్‌లో ఫోర్ బాదిన కోహ్లి. అర్ధ శతకానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న రన్‌మెషీన్. 19 ఓవర్లలో భారత్ స్కోరు: 78-4 కోహ్లి 34, రాహుల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. నాలుగో వికెట్ కోల్పోయి టీమిండియా 17.5: శ్రేయస్ అయ్యర్ రూపంలో టీమిండియా నాలుగో వికెట్ కోల్పోయింది. మార్కో జాన్సెన్ అద్భుత బంతితో అయ్యర్(6)ను బౌల్డ్ చేశాడు. గత ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 72/4 (17.5). మూడో సెషన్ మొదలు 17 ఓవర్లలో టీమిండియా స్కోరు: 65-3 ఈసారి అయ్యర్ క్యాచ్ వదిలేశారు 15.5: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్‌ను థర్డ్ స్లిప్‌లో బౌలింగ్ చేస్తున్న కీగన్ పీటర్సన్ వదిలేశాడు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 16 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. సౌతాఫ్రికా కంటే 101 పరుగులు వెనుబడి ఉంది. కోహ్లి 18, అయ్యర్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా 13.6: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో గిల్(26) బౌల్డ్. స్కోరు: 52-3(14). కోహ్లి 14, శ్రేయస్ అయ్యర్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 12 ఓవర్లలో టీమిండియా స్కోరు: 39/2 గిల్- కోహ్లి మధ్య 26 పరుగుల భాగస్వామ్యం. కోహ్లి 8, గిల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.5: జాన్సెన్ బౌలింగ్‌లో ముల్దర్ క్యాచ్ డ్రాప్ చేయడంతో కోహ్లికి లైఫ్ లభించింది. ►11.1: మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ బాది ఖాతా తెరిచిన కోహ్లి 8 ఓవర్లలో టీమిండియా స్కోరు: 19/2 ఇంకా ఖాతా తెరవని కోహ్లి.. 13 పరుగులతో క్రీజులో ఉన్న గిల్ రెండో వికెట్ కోల్పోయిన భారత్ 5.3: నండ్రే బర్గర్ బౌలింగ్‌లో యశస్వి జైశ్వాల్(5) అవుట్. టీమిండియా స్కోరు: 13/2 (5.3). విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా 2.5: రబడ బౌలింగ్‌లో రోహిత్ శర్మ అవుట్. 8 బంతులు ఎదుర్కొని సున్నా స్కోరుకు పెవిలియన్ చేరిన టీమిండియా కెప్టెన్. క్రీజులోకి వచ్చిన వన్‌డౌన్‌బ్యాటర్ శుబ్‌మన్ గిల్. ఆధిక్యం ఎంతంటే టీమిండియాతో తొలి టెస్టులో సౌతాఫ్రికా 408 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 163 పరుగుల ఆధిక్యం సాధించింది. తొమ్మిదో వికెట్ డౌన్.. బవుమా ఆబ్సెంట్ హర్ట్ 108.4: బుమ్రా బౌలింగ్‌లో నండ్రే బర్గర్ బౌల్డ్(0). దీంతో సౌతాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. మొదటి రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కెప్టెన్ తెంబా బవుమా గాయపడ్డ విషయం తెలిసిందే. దీంతో అతడు బ్యాటింగ్‌కు అందుబాటులో లేకపోవడంతో.. 408 పరుగుల వద్ద సౌతాఫ్రికా ఆలౌట్ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. 107 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 407/8. 162 పరుగుల ఆధిక్యం 400 వందల పరుగుల మార్కు అందుకున్న సౌతాఫ్రికా 102.5: బుమ్రా బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా స్కోరు 400 దాటేసింది. ఎనిమిదో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 100.5: లంచ్ బ్రేక్ తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెట్టిన టీమిండియాకు తొలి ఓవర్లోనే వికెట్ లభించింది. బుమ్రా బౌలింగ్‌లో కగిసో రబడ(1) బౌల్డ్ అయ్యాడు. అతడి రూపంలో సౌతాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. నండ్రీ బర్గర్ క్రీజులోకి వచ్చాడు. 101.5 ఓవర్లలో సౌతాఫ్రికా స్కోరు 396/8. టీమిండియా కంటే 151 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ బ్రేక్ టీమిండియాతో తొలి టెస్టులో మూడో రోజు ఆటలో భాగంగా భోజన విరామ సమయానికి సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. 100 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. భారత్ కంటే 147 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక గురువారం నాటి ఆటలో లంచ్ బ్రేక్ వరకు ఎల్గర్ రూపంలో శార్దూల్ ఠాకూర్, గెరాల్డ్ కోయెట్జీ రూపంలో అశ్విన్ ఈ మ్యాచ్‌లో తమ తొలి వికెట్ తీసుకున్నారు. ఏడో వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా 99.1: అశ్విన్ బౌలింగ్‌లో సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన గెరాల్డ్ కోయెట్జీ(19). అతడి రూపంలో సౌతాఫ్రికా ఏడో వికెట్ కోల్పోయింది. ఎట్టకేలకు ఎల్గర్ అవుట్ 94.5: శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగిన సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్. దీంతో సౌతాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది. అద్భుత సెంచరీతో చెలరేగి సౌతాఫ్రికాను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న ఎల్గర్ ఇన్నింగ్స్‌కు తెరపడటంతో టీమిండియాకు కాస్త ఊరట లభించింది. కాగా డీన్ ఎల్గర్ 185 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. గెరాల్డ్ కోయెట్జీ క్రీజులోకి వచ్చాడు. మార్కో జాన్సెన్ 60 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 96 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 366/6. 94.3: టెస్టుల్లో మార్కో జాన్సెన్ అత్యధిక స్కోరు 100 పరుగులకు పైగా ఆధిక్యంలో సౌతాఫ్రికా 89.5: వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్న ఎల్గర్, జాన్సెన్. ఓవర్ ముగిసేసరికి ఎల్గర్ 179, జాన్సెన్ 55 పరుగులతో క్రీజులో ఉన్నారు. 89.2: అశ్విన్ బౌలింగ్‌లో మార్కో జాన్సెన్ ఫోర్ బాదడంతో సౌతాఫ్రికా 103 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. జాన్సెన్ హాఫ్ సెంచరీ 87.6: సిరాజ్ బౌలింగ్‌లో ఫోర్ బాది అర్ధ శతకం పూర్తి చేసుకున్న మార్కో జాన్సెన్ 78 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా గత పది ఓవర్లలో 45 పరుగులు సాధించింది సౌతాఫ్రికా. ఎల్గర్- జాన్సెన్ 74 పరుగుల మెరుగైన భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు. 84వ ఓవర్ పూర్తయ్యేసరికి ఆతిథ్య జట్టు 78 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక రెండో రోజు భారత బౌలర్లలో పేసర్లు సిరాజ్, బుమ్రాకు రెండు వికెట్లు దక్కగా.. ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. స్కోరు: 323/5 (84) 300 పరుగుల మార్కును అందుకున్న సౌతాఫ్రికా 79వ ఓవర్: తొలి టెస్టులో టీమిండియాపై సౌతాఫ్రికా ఆధిక్యాన్ని పెంచుకుంటూ పోతోంది. 256/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను మొదలుపెట్టిన ప్రొటిస్ జట్టు 79వ ఓవర్ ఆఖరి బంతికి మూడు వందల పరుగుల మార్కును అందుకుంది. సెంచరీ వీరుడు, ఓపెనింగ్ బ్యాటర్ డీన్ ఎల్గర్ గురువారం ఆరంభం నుంచి నిలకడగా ఆడుతూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మరో ఎండ్‌లో మార్కో జాన్సెన్ కూడా చక్కటి సహకారం అందిస్తూ 26 పరుగులు పూర్తి చేసుకున్నాడు. రెండో రోజు హైలైట్స్: ►బాక్సింగ్ డే టెస్టులో శతక్కొట్టిన రాహుల్. ►ఓవర్‌నైట్ స్కోరు 208/8తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా 245 పరుగులకు టీమిండియా ఆలౌట్. ►సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అజేయ సెంచరీ -140 (211 బంతుల్లో). ►అరంగేట్ర బ్యాటర్ బెడింగ్హాం అర్ధ శతకం. ►రెండో రోజు ఆట ముగిసే సరికి సౌతాఫ్రికా స్కోరు: 256-5(66 ఓవర్లలో). ►ఎల్గర్‌తో కలిసి 3 పరుగులతో క్రీజులో ఉన్న మార్కో జాన్సెన్. ►సౌతాఫ్రికాకు 11 పరుగుల స్వల్ప ఆధిక్యం. బాక్సింగ్ డే టెస్టు: సౌతాఫ్రికా వర్సెస్ భారత్ తుదిజట్లు: టీమిండియా రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సౌతాఫ్రికా డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రమ్, టోనీ డి జోర్జీ, తెంబా బవుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్హామ్, కైల్ వెరైన్(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, నండ్రే బర్గర్. -
Ind vs SA: అతడి నుంచి ఎక్కువగా ఆశించొద్దు: మాజీ ఓపెనర్
IND vs SA Test Series 2023: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్‌పై అంచనాలు పెంచుకోవద్దని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. సఫారీ పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం అత్యంత సవాలుతో కూడుకున్నదని.. గత ప్రదర్శన ఆధారంగా యశస్విపై ఆశలు పెట్టుకోవద్దని పేర్కొన్నాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా యశస్వి జైశ్వాల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. విండీస్‌తో తొలి మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ 21 ఏళ్ల లెఫ్టాండర్.. సెంచరీతో చెలరేగాడు. అరంగేట్రంలోనే సెంచరీ కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్‌గా బరిలోకి దిగి 171 పరుగులు సాధించి అనేక రికార్డులు సృష్టించాడు. విండీస్‌పై టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక రెండో టెస్టులోనూ అర్ధ శతకం(57)తో ఆకట్టుకున్న యశస్వి.. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ సందర్బంగా మొత్తంగా 266 పరుగులతో సత్తా చాటాడు. రెగ్యులర్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ వన్‌డౌన్‌లో ఆడటంతో ఓపెనర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లోనూ అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇదిలా ఉంటే.. యశస్వి టీమిండియాతో పాటు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో అంత ఈజీ కాదు.. ఎందుకంటే ప్రొటిస్‌తో టీ20 సిరీస్ అనంతరం డిసెంబరు 26 నుంచి మొదలుకానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా అతడు బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వెస్టిండీస్.. సౌతాఫ్రికా పరిస్థితులు పూర్తి భిన్నమైనవి. సఫారీ పిచ్‌లపై భారత బ్యాటర్లకు కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. నిజానికి వెస్టిండీస్ పిచ్‌లు కాస్త ఉప ఖండపు పిచ్‌లను పోలి ఉంటాయి. ప్రొటిస్ పేసర్లను ఎదుర్కోవడం కష్టం కానీ సఫారీ గడ్డపై పేస్ దళం అటాకింగ్‌ను తట్టుకోవడం కష్టం. ముఖ్యంగా మార్కో జాన్సెన్, కగిసో రబడ, లుంగి ఎంగిడి, నండ్రే బర్గర్ వేసే బంతులను ఎదుర్కోవడం అత్యంత కష్టం. యశస్వి ఫ్రంట్ ఫుట్, బ్యాక్ ఫుట్ షాట్లు అద్భుతంగా ఆడతాడనడంలో సందేహం లేదు. అయితే, సౌతాఫ్రికాలో అతడికి అంత ఈజీ కాదు. మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం వస్తుంది. అతడు ఇంకా యువకుడు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రికెటర్. అతడిపై భారీగా అంచనాలు పెట్టుకోవద్దు. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లోనూ సెంచరీ, డబుల్ సెంచరీ బాదాలని కోరుకోకూడదు’’ అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. చదవండి: Ind W vs Aus W: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. సరికొత్త చరిత్ర -
‘జాన్సెన్‌తో ప్రమాదం పొంచి ఉంది’
(గౌతమ్ గంభీర్) : ఐపీఎల్లో కేకేఆర్ తరఫున ఆడిన సమయంలో షమీ తలపై జుట్టు ఎక్కువగా ఉండేది. సీనియర్లు సరదాగా గడిపే సమయంలోనూ అతను నిశ్శబ్దంగా ఉంటూ తన పనేంటో తాను చేసుకుపోయేవాడు. ఎక్కడో అమ్రోహాలాంటి చిన్న పట్టణంనుంచి కెరీర్ కోసం షమీ బయటకు వచ్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్ ప్లేయర్ స్టోక్స్‌కు అతను వేసిన స్పెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చక్కటి గుడ్ లెంగ్త్ బంతులతో అతను కట్టిపడేయగా, స్టోక్స్ చిన్న క్లబ్ క్రికెటర్లా కనిపించాడు. పది బంతులు ఆడినా అతను పరుగు తీయలేకపోయాడు. షమీ తర్వాతి మ్యాచ్‌లో అదే జోరును కొనసాగించాడు. ఇప్పుడు తన సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్‌కు అతను తిరిగొస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో హోరాహోరీ పోరు ఖాయం. బౌన్స్ ఉండే ఇక్కడి పిచ్ పేస్ బౌలర్లకు అనుకూలిస్తుంది. భవిష్యత్తులో గొప్ప ఆల్‌రౌండర్ కాగల సామర్థ్యం మార్కో జాన్సెన్కు ఉంది. తన బౌలింగ్‌తో అతను కోహ్లి, రోహిత్‌లను కూడా ఇబ్బంది పెట్టగలడు. రబడ, ఎన్గిడిలాంటి బౌలర్లతో పాటు అద్భుత ఫీల్డింగ్ దక్షిణాఫ్రికా సొంతం. జట్టు బ్యాటింగ్‌ను డి కాక్ ముందుండి నడిపిస్తున్నాడు. నా లక్నో జట్టు సహచరుడైన డి కాక్ ప్రతిభ గురించి ఏనాడూ సందేహం లేదు. -
రిజ్వాన్, దక్షిణాఫ్రికా బౌలర్ మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా పాకిస్తాన్ కీలక మ్యాచ్‌లో చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పవర్‌ప్లే లోపే ఓపెనర్లు షఫీక్, ఇమామ్ ఉల్-హాక్ వికెట్లను పాక్ కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్, ప్రోటీస్ స్పీడ్ స్టార్ మార్కో జానెసన్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే? ఇమామ్ ఉల్-హాక్ ఔటైన తర్వాత మహ్మద్ రిజ్వాన్ క్రీజులోకి వచ్చాడు. అయితే జానెసన్ బౌలింగ్‌లో తన ఎదుర్కొన్న మొదటి బంతికే ఔటయ్యే ప్రమాదం నుంచి రిజ్వాన్ తప్పించుకున్నాడు. రిటర్న్ క్యాచ్‌ను అందుకోవడంలో జానెసన్ విఫలమయ్యాడు. ఆ తర్వాతి బంతిని రిజ్వాన్ బౌండరీగా మలిచాడు. ఈ క్రమంలో జానెసన్ రిజ్వాన్ వద్దకు వెళ్లి ఏదో అన్నాడు. అందుకు బదులుగా రిజ్వాన్ నీ పని చూసుకో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో బాబర్ ఆజం, ఫీల్డ్ అంపైర్ జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో 27 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్ 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. Heated conversation between Marco Jansen and Mohammed Rizwan...!!#SAvsPAK #PAKvSA #kykyurdu #พรหมลิขิตep4 #ธี่หยด #crymua #bbcqt #ENGvsSL #Maine pic.twitter.com/JzJguEp0eq — Oxygen X (@imOxYo18) October 27, 2023 -
SA VS PAK: ఇరగదీస్తున్న జన్సెన్.. సౌతాఫ్రికా కల నెరవేరుస్తాడా..?
ప్రస్తుత ప్రపంచకప్‌లో నామమాత్రపు అంచనాలతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు.. అంచనాలకు మించి రాణిస్తూ (నెదర్లాండ్స్ చేతిలో పరాజయం మినహా) భారీ విజయాలతో దూసుకుపోతుంది. ప్రస్తుత ఎడిషన్‌లో ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో భారత్ తర్వాత రెండో స్థానంలో కొనసాగుతుంది. పాయింట్ల ప్రకారం చూస్తే.. సౌతాఫ్రికా కంటే ఒటమి ఎరుగని భారత్ మెరుగ్గా కనిపిస్తున్నప్పటికీ, రన్‌రేట్ విషయంలో సౌతాఫ్రికా ఏ జట్టుకు అందనంత ఎత్తులో ఉంది. ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించడంతో 2.370 రన్‌రేట్ కలిగి ఉంది. ప్రస్తుతానికి ఏ జట్టుకు ఈ స్థాయి రన్‌రేట్ లేదు. ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా ఇంతటి భారీ విజయాలు సాధించడంలో డికాక్, క్లాసెన్, మార్క్రమ్, డస్సెన్ కనిపించే హీరోలయితే (సెంచరీలు సాధించి).. కనిపించని హీరో మరొకరు ఉన్నారు. అతడే మార్కో జన్సెన్. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి తన పని తాను చేసుకుపోతున్న జన్సెన్.. ఇప్పటివరకు ఆడిన ప్రతి మ్యాచ్‌లో వికెట్లు కూడా తీసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు (పాక్‌తో మ్యాచ్ కలుపుకుని) ఆడిన జన్సెన్ 61.50 సగటున 123 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు పడగొట్టి అసలుసిసలు పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా మారాడు. సౌతాఫ్రికా కల నెరవేరుస్తాడా..? ప్రస్తుత ప్రపంచకప్‌లో సౌతాఫ్రికా ఉన్నట్లుండి హాట్ ఫేవరెట్ జట్టుగా మారిపోయింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ లాంటి అగ్రశ్రేణి జట్లు చిన్న జట్ల చేతుల్లో పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో సఫారీలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. భారత్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు ఈ జట్టు వరల్డ్‌కప్ రేసులోకి దూసుకువచ్చింది. నెదర్లాండ్స్ చేతిలో పరాభవానికి కుంగిపోకుండా, ఆ జట్టు కనబరుస్తున్న పోరాటపటిమ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పరిస్థితుల్లో జన్సెన్ లాంటి పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ సౌతాఫ్రికాకు అదనపు బలంలా మారాడు. అతడు ప్రతి మ్యాచ్‌లో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణిస్తూ మ్యాచ్ విన్నర్లా తయారయ్యాడు. తదుపరి మ్యాచ్‌ల్లో జన్సెన్తో పాటు మిగతా ఆటగాళ్లు కూడా ఇదే తరహాలో రాణిస్తే, చాలా ఏళ్లుగా వరల్డ్‌కప్ గెలవాలన్న సౌతాఫ్రికా కల ఈసారి నెరవేరే అవకాశం ఉంది. -
జన్సెన్ ఆల్‌రౌండ్ షో.. ఆసీస్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా.. సిరీస్ కైవసం
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 3-2 తేడాతో కైవసం చేసుకుంది. జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 17) జరిగిన ఐదో వన్డేలో సౌతాఫ్రికా 122 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మార్కో జన్సెన్ ఆల్‌రౌండ్ షోతో (23 బంతుల్లో 47; 4 ఫోర్లు, 3 సిక్సర్లు, 8-1-39-5) ఇరగదీసి తన జట్టును విజయపథాన నడిపించాడు. జన్సెన్కు కేశవ్ మహారాజ్ (9.1-2-33-4) సహకరించడంతో ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (87 బంతుల్లో 93; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (65 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ చివర్లో మార్కో జన్సెన్, ఫెలుక్వాయో (19 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో సౌతాఫ్రికా 300 స్కోర్‌ను దాటింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా (3/71), సీన్ అబాట్ (2/54), గ్రీన్ (1/59), నాథన్ ఇల్లిస్ (1/49), టిమ్ డేవిడ్ (1/20) వికెట్లు పడగొట్టారు. అనంతరం 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. జన్సెన్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో (1/44) ధాటికి 34.1 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (71) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లబూషేన్ (44) పర్వాలేదనిపించాడు. వీరు మినహాయించి అంతా విఫలమయ్యారు. వార్నర్ 10, ఇంగ్లిస్ 0, అలెక్స్ క్యారీ 2, గ్రీన్ 18, టిమ్ డేవిడ్ 1, సీన్ అబాట్ 23, మైఖేల్ నెసర్ 0, జంపా 5 పరుగులు చేసి నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో ఆసీస్ తొలి రెండు వన్డేలు గెలువగా.. ఆతర్వాత సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలు సాధించి, సిరీస్ కైవసం చేసుకుంది. దీనికి ముందు జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. -
ఫీల్డర్ దెబ్బ.. యాంకర్‌కు ఊహించని అనుభవం
ఈ ఏడాది ప్రారంభమైన సౌతాఫ్రికా టి20 లీగ్ తొలి ఎడిషన్ విజయవంతంగా సాగుతుంది. లీగ్‌లో భాగంగా బుధవారం ముంబై కేప్‌టౌన్, సన్‌రైజర్స్ ఈస్ట్రన్ మధ్య మ్యాచ్ జరిగింది. హోరాహోరిగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ ఈస్ట్రర్న్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విషయం పక్కనబెడితే మ్యాచ్ మధ్యలో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ ఈస్ట్రన్ ఇన్నింగ్స్ సందర్భంగా మార్కో జాన్సెన్ క్రీజులో ఉన్నాడు. ముంబై బౌలర్ సామ్ కర్రన్ వేసిన 13వ ఓవర్ లో చివరి బంతిని జాన్సెన్ డీప్ మిడ్ వికెట్ కార్నర్ మీదుగా షాట్ ఆడాడు. ఆ బాల్ ఇద్దరు ఫీల్డర్ల మధ్య నుంచి బౌండరీకి వెళ్లింది. ఈ క్రమంలో ఒక ఫీల్డర్ బంతిని ఆపే ప్రయత్నంలో డైవ్ చేశాడు. అయితే ఆ ఫీల్డర్ సరాసరి అక్కడే ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్‌ను ఢీ కొన్నాడు. దీంతో యాంకర్ పట్టుతప్పి కిందపడిపోయింది. కాగా అనుకోని ఘటనలో యాంకర్‌కు పెద్దగా గాయాలు కాలేదు. ఆ తర్వాత పైకి లేచిన యాంకర్ తనకు ఏమీ కాలేదని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై కేప్ టౌన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. జట్టులో గ్రాంట్ రోలోఫ్సెన్ 56 పరుగులతో రాణించాడు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు 15 ఓవర్లలో 101 పరుగులకే 6 వికెట్లు కొల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో మార్కో జాన్సెన్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు . కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 66 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. "This is coming straight for us.." 🫣@ZAbbasOfficial, you good? 🤣@CapeTownCityFC your manager somehow avoided the contact! pic.twitter.com/32YPcfLCMf — SuperSport 🏆 (@SuperSportTV) January 18, 2023 చదవండి: మణికొండలో సందడి చేసిన విరాట్ కోహ్లి.. సెంచరీలు వద్దు.. డబుల్ సెంచరీలే ముద్దు -
రషీద్ ఖాన్‌కు చుక్కలు చూపించిన సన్‌రైజర్స్ బ్యాటర్.. ఒకే ఓవర్లో 28 పరుగులు!
ఆఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయడంలో విఫలమవుతున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ పడగొట్టి ఏకంగా 53 పరుగులిచ్చాడు. ముఖ్యంగా రషీద్‌కు సన్‌రైజర్స్ బ్యాటర్ మార్కో జాన్సెన్ చుక్కలు చూపించాడు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసిన రషీద్ బౌలింగ్‌లో జాన్సెన్ ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. ఆ ఓవర్లో జాన్సెన్ 4 సిక్స్‌లు, ఒక్క ఫోర్ బాదాడు. ఈ ఓవర్‌తోనే మ్యాచ్ సన్‌రైజర్స్ వైపు మలుపు తిరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను సౌతాఫ్రికా టీ20 ట్విటర్లో ఫోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఏంఐ కేప్‌టౌన్‌పై సన్‌రైజర్స్ ఈస్టర్న్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ విజయంలో జాన్సెన్ కీలక పాత్ర పోషించాడు. 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జాన్సెన్ కేవలం 27 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 66 పరుగులు సాధించాడు. Some clean hitting by Marco Jansen as he smashes 2⃣8⃣ runs off the Rashid over 🚀#Betway #SA20 #MICTvSEC | @Betway_India pic.twitter.com/504jSzfqXf — Betway SA20 (@SA20_League) January 18, 2023 చదవండి: Mohammed Siraj: కుటుంబ సభ్యుల నడుమ మ్యాచ్.. నిప్పులు చెరిగిన లోకల్ బాయ్.. భావోద్వేగ ట్వీట్ -
Bavuma-Marco Jansen: 'వీడేంట్రా బాబు ఇంత పొడుగున్నాడు'
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులోనూ ఓటమిపాలైన సౌతాఫ్రికా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కోల్పోయింది. ఇక మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ప్రొటీస్ భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోగా.. సౌతాఫ్రికా మాత్రం నాలుగో స్థానానికి పడిపోయి అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. ఈ సంగతి పక్కనబెడితే.. సోషల్ మీడియలో ఒక ఫోటో ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలిచింది. ఇది కేవలం సరదా కోసం మాత్రమే రాసుకొచ్చాం. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ బవూమా, మార్కో జాన్సెన్లు క్రీజులో ఉన్నారు. సాధారణంగా బవుమా చాలా పొట్టిగా ఉంటాడు. ఇక మార్కో జాన్సెన్ చాలా పొడగరి.. దాదాపు ఆరున్నర అడుగులు ఉంటాడు. యాదృశ్చికమో ఏమో తెలియదు కానీ బవుమా.. మార్కో జాన్సెన్ వైపు అదో రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. అదెలా ఉందంటే.. ''వీడేంటి ఇంత పొడుగున్నాడు అనేలా''.. ఫోటో చూడగానే మీకు కూడా అలాగే కనిపిస్తుంది. అందుకే ఈ ఫోటో ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. మాములుగానే తమకంటే హైట్ ఎక్కువుంటేనే తెగ బాధపడిపోయే పొట్టోళ్లు.. తమకు సాధ్యం కాని ఎత్తులో ఉన్న వ్యక్తులను చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. పాపం బవుమా పరిస్థితి కూడా అదే. అందుకే అతని వైపు చూస్తూ బవుమా కచ్చితంగా అదే అనుకొని ఉంటాడు. ఇక వాస్తవానికి వస్తే.. బవుమా రివ్యూ కోసం వెయిట్ చేస్తున్నాడు. నిజానికి మార్కో జాన్సెన్‌తో రివ్యూ విషయమై మాట్లాడుతున్నాడు. ఆ సమయంలోనే ఒక ఫోటోగ్రాఫర్ ఇలా క్లిక్‌మనిపించాడు. ఒక్క ఫోటోతో మనం ఇంకో విధంగా ఊహించుకునేలా చేసిన ఫోటోగ్రాఫర్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు -
ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియా పేసర్
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ అయ్యాడు. బుధవారం ఐసీసీ మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డుకు నామినేట్ అయిన ఆటగాళ్ల పేర్లను రిలీజ్ చేసింది. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్, అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్, న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్‌లు నామినేట్ అయ్యారు. అర్ష్‌దీప్ సింగ్: టీమిండియాకు ఈ ఏడాది టి20ల్లో లభించిన ఆణిముత్యం అర్ష్‌దీప్ సింగ్. ముఖ్యంగా టి20 ప్రపంచకప్‌లో జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీరుస్తూ అర్ష్‌దీప్ అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్‌గా ఈ మెగాటోర్నీలో పది వికెట్లు తీసిన అర్ష్‌దీప్ ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టి20 క్రికెట్లో అడుగుపెట్టాడు. మొత్తంగా 21 మ్యాచ్‌లాడి 18.12 సగటుతో 33 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్స్‌లో యార్కర్ల స్పెషలిస్ట్‌గా ముద్రపడిన అర్ష్‌దీప్ ఎటువంటి గొడవలు, బెరుకు లేకుండా బౌలింగ్ వేసి వికెట్లు పడగొట్టాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో మెల్బోర్న్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అర్ష్‌దీప్ బౌలింగ్ హైలైట్‌గా నిలిచింది. ఆరంభంలో తొలి బంతికే బాబర్ ఆజంను గోల్డెన్ డకౌట్ చేసిన అర్ష్‌దీప్ తన మరుసటి ఓవర్లో మహ్మద్ రిజ్వాన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత డెత్ ఓవర్లలో బౌలింగ్‌కు వచ్చిన అర్ష్‌దీప్ ఈసారి ఆసిఫ్ అలీని ఔట్ చేసి ఓవరాల్‌గా 32 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్: సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సెన్ ఈ ఏడాది టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా, బంగ్లాదేశ్‌లతో జరిగిన వన్డేల్లో మ్యాచ్‌ల్లో పలు వికెట్లు తీసిన జాన్సెన్కు ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్ మరిచిపోలేనిది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 158 పరుగులకే కుప్పకూలడంలో జాన్సెన్ది కీలకపాత్ర. ఆ మ్యాచ్‌లో 35 పరుగులకే ఐదు వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. ఇబ్రహీం జర్దన్: ఈ ఏడాది అఫ్గానిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జర్దన్కు మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోనుంది. ఎందుకంటే జర్దన్ ఈ ఏడాది వన్డేల్లో 71.83 సగటుతో 431 పరుగులు.. అలాగే 36.70 సగటుతో టి20ల్లో 367 పరుగులు చేశాడు. ఇక పల్లకెలే వేదికగా లంకతో మ్యాచ్‌లో 162 పరుగుల ఇన్నింగ్స్ అతని కెరీర్లో మరిచిపోలేనిది. ఆ ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ తరపున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలోనే మహ్మద్ షెహజాద్ 131 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఫిన్ అలెన్: టి20 మెగాటోర్నీ ఆరంభానికి ముందు స్కాట్లాండ్తో జరిగిన టి20 సిరీస్‌లో భాగంగా 56 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకొని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లో 24 బంతుల్లోనే 42 పరుగులు చేసి ఢిపెండింగ్ చాంపియన్ ఆసీస్ ఓటమికి కారణమయ్యాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌లో భాగంగా ఐర్లాండ్ టూర్లో హాప్ సెంచరీతో మెరిసిన అలెన్ ఆ తర్వాత ఇండియా, వెస్టిండీస్‌లతో మ్యాచ్‌ల్లోనూ హాఫ్ సెంచరీలతో మెరిశాడు. ఇక మహిళల విభాగంలో ఈ అవార్డుకు టీమిండియా నుంచి ఇద్దరు మహిళా క్రికెటర్లు నామినేట్ కావడం విశేషం. పేసర్ రేణుకా సింగ్‌తో పాటు వికెట్ కీపర్ యస్తిక బాటియా ఈ అవార్డు రేసులో ఉన్నారు. వీరిద్దరితో పాటు ఆస్ట్రేలియా క్రికెటర్ డార్సీ బ్రౌన్, ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అలిస్ కాప్సీ కూడా పోటీలో ఉన్నారు. ఐసీసీ 2022 అవార్డ్స్‌ను మొత్తంగా 13 కేటగిరీల్లో ఇవ్వనున్నారు. ఇందులో ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన ఆటగాడికి ప్రతిష్టాత్మక సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందజేయనున్నారు. అలాగే ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన క్రికెటర్‌కు రేచల్ హేయో ఫ్లింట్ అవార్డు ఇవ్వనున్నారు. The future looks bright 🙌 Our nominees for the ICC Men’s Emerging Cricketer of the Year were phenomenal in 2022. Find out more about them 👉 https://t.co/eHhghBmGo3#ICCAwards pic.twitter.com/rY5AAyBSK1 — ICC (@ICC) December 28, 2022 The four nominees for the ICC Women’s Emerging Cricketer in 2022 produced some amazing performances 🔥 More on their achievements 👉 https://t.co/04vQypUyAt #ICCAwards pic.twitter.com/eWir1w81Rk — ICC (@ICC) December 28, 2022 చదవండి: మాట నిలబెట్టుకున్న కేన్ మామ.. 722 రోజుల నిరీక్షణకు తెర -
Aus Vs SA: 69 పరుగులకే 5 వికెట్లు! పట్టుదలగా నిలబడ్డ ఆ ఇద్దరు.. తొలిసారి
Australia vs South Africa, 2nd Test: వరుసగా రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికాతో ‘బాక్సింగ్ డే’ టెస్టులో ఆస్ట్రేలియా బరిలోకి దిగింది. బ్రిస్బేన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు రోజుల్లోనే గెలిచింది. కాగా తొలి టెస్టులో ఆడిన జట్టునే ‘బాక్సింగ్ డే’ టెస్టులో కొనసాగిస్తున్నామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా తరఫున 100వ టెస్టు ఆడనున్న 14వ క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికాకు శుభారంభం లభించలేదు. కెప్టెన్ డీన్ ఎల్గర్ 26 పరుగుల వద్ద రనౌట్ కాగా.. మరో ఓపెనర్ సారెల్ ఎర్వీ 18 పరుగులకే పెవిలియన్ చేరాడు. థీనిస్ డి బ్రూయిన్(12), తెంబా బవుమా(1), ఖయా జోండో( 5)పూర్తిగా నిరాశపరిచారు. అర్ధ శతకాలతో ఆ ఇద్దరు.. కెరీర్లో తొలిసారి ఈ క్రమంలో 69 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సౌతాఫ్రికాను ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను కైల్ వెరెయ్నే, మార్కో జాన్సెన్ తమ భుజాన వేసుకున్నారు. జాన్సెన్ అర్ధ శతకతంతో మెరిశాడు. 118 బంతుల్లో 50 పరుగుల మార్కును అందుకున్నాడు. కాగా టెస్టుల్లో జాన్సెన్కు ఇదే తొలి హాఫ్ సెంచరీ. మరోవైపు.. లియోన్ బౌలింగ్‌లో లాంగ్ ఆన్ దిశగా షాట్ పరుగు పూర్తి చేసుకున్న వెయిర్నే సైతం హాఫ్ సెంచరీ(80 బంతుల్లో) సాధించాడు. ఈ సిరీస్‌లో, టెస్టుల్లో అతడికి ఇది రెండో టెస్టు అర్ధ శతకం కావడం విశేషం. ఇక వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 పాయింట్ల పట్టికలో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఈ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే సగర్వంగా ఫైనల్లో అడుగుపెడుతుంది. అదే విధంగా రెండో స్థానం కోసం టీమిండియాతో పోటీ పడుతున్న దక్షిణాఫ్రికా గనుక మెరుగ్గా ఆడితే.. రోహిత్ సేనకు కష్టాలు తప్పవు. తుది జట్లు ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషాగ్నే, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, స్కాట్ బోలాండ్ దక్షిణాఫ్రికా డీన్ ఎల్గర్(కెప్టెన్), సారెల్ ఎర్వీ, థీనిస్ డి బ్రూయిన్, టెంబా బావుమా, ఖయా జోండో, కైల్ వెరెయ్నే(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, అన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి. చదవండి: Ind VS Ban 2nd Test: ‘సై అంటే సై’ అనేలా ఆట.. టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్.. భారత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా! విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ -
నిప్పులు చెరిగిన పేసర్లు.. తొలి రోజే 15 వికెట్లు
ఆస్ట్రేలియా- సౌతాఫ్రికా జట్ల మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఇరు జట్ల పేస్ బౌలర్లు నిప్పులు చెరిగారు. ఫలితంగా ఆట తొలి రోజే ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఆస్ట్రేలియా పర్యాటక సౌతాఫ్రికాను 152 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం సఫారీ బౌలర్లు సైతం రెచ్చిపోయి 145 పరుగులకే సగం ఆసీస్ వికెట్లను పడగొట్టారు. ఆసీస్ మిడిలార్డర్ బ్యాటర్ ట్రవిస్ హెడ్ (77 బంతుల్లో 78 నాటౌట్; 13 ఫోర్లు, సిక్స్) ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ తొలి బంతికే కగిసో రబాడ.. డేవిడ్ వార్నర్‌ను పెవిలియన్‌కు పంపగా, ఉస్మాన్ ఖ్వాజా (11), స్టీవ్ స్మిత్ (36)లను నోర్జే.. మార్నస్ లబూషేన్ (11)ను జన్సెన్ ఔట్ చేశారు. స్కాట్ బోలాండ్ (1)ను రబాడ ఔట్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసింది. అంతకుముందు మిచెల్ స్టార్క్ (3/41), పాట్ కమిన్స్ (2/35), బోలాండ్ (2/28), నాథన్ లయోన్ (3/14) ధాటికి సౌతాఫ్రికా 152 పరుగులకే చాపచుట్టేసింది. సఫారీ ఇన్నింగ్స్‌లో వికెట్‌కీపర్ వెర్రిన్ (64) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. వెర్రిన్తో పాటు సరెల్ ఎర్వీ (10), టెంబా బవుమా (38), రబాడ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కెప్టెన్ డీన్ ఎల్గర్ (3), వాన్ డెర్ డస్సెన్ (5), జోండో (0), జన్సెన్ (2), మహారాజ్ (2), నోర్జే (0), ఎంగిడి (3) దారుణంగా విఫలమయ్యారు. కాగా, ఈ ఆస్ట్రేలియా పర్యటనలో సౌతాఫ్రికా 3 టెస్ట్‌లు, 3 వన్డేలు ఆడనుంది. -
మరింత పటిష్టంగా సౌతాఫ్రికా పేస్ అటాక్.. జట్టులోకి సన్‌రైజర్స్ బౌలర్
టీ20 వరల్డ్‌కప్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బలమైన జట్టుతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. సన్‌రైజర్స్ పేసర్ చేరికతో మరింత పటిష్టంగా మారింది. ముందుగా ప్రకటించిన జట్టులోని సభ్యుడు, స్టార్ ఆల్‌రౌండర్ డ్వేన్ ప్రిటోరియస్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరం కావడంతో అతని స్థానంలో మరో ఆల్‌రౌండర్ మార్కో జన్సెన్ జట్టులోకి వచ్చాడు. వరల్డ్‌కప్ జట్టులో రిజర్వ్ ఆటగాడిగా ఉన్న జన్సెన్ స్థానాన్ని లిజాడ్ విలియమ్స్ భర్తీ చేయనున్నాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ సూపర్ 12 దశలో భారత్‌తో పాటు గ్రూప్-2లో పోటీపడుతున్న దక్షిణాఫ్రికా అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే ప్రత్యర్ధి ఎవరనేది గ్రూప్ దశలో ఫలితాలపై ఆధారపడి ఉంది. అనంతరం సఫారీ టీమ్ అక్టోబర్ 27న బంగ్లాదేశ్‌తో, 30న టీమిండియాతో, నవంబర్ 3న పాకిస్తాన్‌తో, నవంబర్ 6న గ్రూప్-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లకు ముందు దక్షిణాఫ్రికా రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్ 17న న్యూజిలాండ్‌తో, అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. సౌతాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, హెచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రీజా హెండ్రిక్స్, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడా, లుంగి ఎంగిడి, రిలీ రోసౌ, మార్కో జన్సెన్, వేన్ పార్నెల్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ రిజర్వ్ ప్లేయర్స్: లిజాడ్ విలియమ్స్, జోర్న్ ఫోర్టూన్, ఆండిల్ ఫెలుక్వాయో -
'మైండ్ దొబ్బిందా.. ఆ బౌలింగ్ ఏంటి?'.. మురళీధరన్ ఆగ్రహం
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ చెత్త బౌలింగ్‌పై ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆఖరి ఓవర్లో విజయానికి 22 పరుగులు అవసరమైన దశలో మార్కో జాన్సెన్ బౌలింగ్‌కు వచ్చాడు. అయితే ఆఖరి రెండు బంతులను రషీద్ ఖాన్ భారీ సిక్సర్లు సంధించాడు. ఇది జీర్ణించుకోలేని కోచ్ మురళీధరన్.. ''కీలక దశలో ఫుల్ లెంగ్త్ బంతులను వేయడం ఏంటని.. మైండ్ దొబ్బిందా.. అసలేం బౌలింగ్ చేస్తున్నాడు'' అంటూ బూతుపురాణం అందుకున్నాడు. మార్కో జాన్సెన్పై కోపంతో మురళీధరన్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం ట్రెండింగ్‌గా మారింది. వాస్తవానికి మార్కో జాన్సేన్ చివరి ఓవర్ బానే బౌలింగ్ చేశాడు. తన ప్లాన్ ప్రకారం.. ప్రతి బంతిలో వైవిధ్యత చూపించాడు. ఎగ్జిక్యూషన్ లోపం కొంత.. అలాగే రషీద్ ఖాన్ ఎటాకింగ్ కొంత అతని ప్లాన్‌ను పూర్తిగా చెడగొట్టాయి. తొలిబంతికి స్లో కట్టర్ వేశాడు.. కానీ దాన్ని తెవాతీయా సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాత కూడా జాన్సెన్ తన బౌలింగ్‌లో వైవిధ్యత చూపించాడు. వరుసగా వైడ్ యార్కర్, బౌన్సర్, స్ట్రెయిట్ యార్కర్, లో ఫుల్ టాస్ లాంటి వైవిధ్య భరిత బంతులు వేశాడు. అయితే రషీద్ ఖాన్ రూపంలో అతనికి పెద్ద సమస్య వచ్చి పడింది. గ్రహచారం బాగాలేకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే లక్ష్య చేధన సమయంలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా మార్కో జాన్సెన్ చెత్త రికార్డును అందుకున్నాడు. చదవండి: Marco Jansen: ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ చెత్త రికార్డు beauty of IPL pic.twitter.com/Nswvs2domu — best girl | IPL era (@awkdipti) April 27, 2022 Murali getting Angry during the 20 th over pic.twitter.com/jvcjVh4Kpp — Kaveen Wijerathna (@CricCrazyKaveen) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఐపీఎల్ చరిత్రలో ఎస్ఆర్హెచ్ బౌలర్ చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బౌలర్ మార్కో జాన్సెన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో మార్కో జాన్సెన్ 4 ఓవర్లు వేసి 63 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. లక్ష్య చేధన సమయంలో ప్రత్యర్థి జట్టుకు ఒక బౌలర్ తన కోటా ఓవర్లలో అత్యధిక పరుగులు ఇచ్చుకోవడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు లుంగి ఎన్గిడి ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2019లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో 4 ఓవర్లలో 62 పరుగులిచ్చి చెత్త రికార్డును నమోదు చేశాడు. తాజాగా ఆ రికార్డును ఒక పరుగు(4 ఓవర్లలో 63 పరుగులు) ఎక్కువ ఇవ్వడం ద్వారామార్కో జాన్సెన్ బద్దలు కొట్టాడు. కాగా మార్కో జాన్సెన్ బౌలింగ్‌పై ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Umran Malik 5 Wickets: ఐదో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఉమ్రాన్ మాలిక్ కొత్త చరిత్ర -
ప్రొటిస్ పేసర్ల దెబ్బ.. న్యూజిలాండ్ తడబాటు
క్రైస్ట్‌చర్చ్: దక్షిణాఫ్రికా పేస్ బౌలర్లు కగిసో రబడ (3/37), మార్కో జాన్సెన్ (2/48) ధాటికి రెండో టెస్టులో న్యూజిలాండ్ తడబడింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా స్కోరుకు కివీస్ 207 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం గ్రాండ్‌హోమ్ (54 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిచెల్ (29 బ్యాటింగ్; 4 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 238/3తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా133 ఓవర్లలో 364 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నర్ నాలుగు, హెన్రీ మూడు వికెట్లు తీశారు.